srivani
-
భక్తిపారవశ్యంలో బుల్లితెర సెలబ్రిటీలు (ఫోటోలు)
-
టీటీడీ కొత్త చైర్మన్ తొలి నిర్ణయం.. శ్రీవాణి ట్రస్ట్ రద్దు
-
అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో తెలుగు వీణ సందడి
పరాంకుశం వీణాశ్రీవాణి... ఆమె పేరులోనే సరిగమల శ్రుతి వినిపిస్తోంది. అమలాపురంలో ఓ చిన్న అగ్రహారం అమ్మాయి శ్రుతి చేసిన వీణ ఇప్పుడు అంబానీ ఇంటి వేడుకలో సరిగమలతో అలరించింది. ఆ ఆనంద క్షణాలను ఆమె సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు. ‘‘మాది అమలాపురం జిల్లా ఇందుపల్లి అగ్రహారం. బండారులంకలోని పిచ్చుక సీతామహాలక్ష్మి గారి దగ్గర సంగీతం నేర్చు కున్నాను. ఈ రోజు ఇన్ని ప్రశంస లందుకుంటున్నానంటే ఆమె నేర్పిన సంగీత జ్ఞానమే కారణం. అంబానీ కుటుంబంలో పెళ్లి వేడుకకు వీణావాదన చేయడానికి ఆహ్వానం రావడంతో ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నా పేరు వాళ్లకు తెలిసే అవకాశమే లేదు. నేను సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం వల్లనే నా కళను వారు గుర్తించడానికి కారణం అనుకుంటున్నాను. నీతా అంబానీ గారు చె΄్పారు అంటూ వాళ్ల మేనేజరో ఎవరో కాంటాక్ట్ చేశారు. ఏ దుస్తులు ధరించాలనే విషయం నుంచి వేడుకలో ఏ ΄ాటలు కావాలో కూడా ఆమే ఎంపిక చేశారు. నేనిచ్చిన జాబితా నుంచి ఆమె ఎంపిక చేసిన పది ΄ాటలను వీణ మీద వినిపించాను. నా చెలి రోజావే, ఉరికే చిలకా... వంటి పలు భాషల్లోకి అనువాదమై ఉన్న ΄ాటలనే ఎంచుకున్నాను. ఇదంతా పదిహేను రోజులపాటు నడిచింది. రెండు కళ్లు చాలవు!ఆడిటోరియానికి వెళ్లే దారిలో ఒక వరుస అత్తరులు, ఇత్తడి బిందెలతో గుజరాత్ సంప్రదాయ నమూనా అలంకరణ ఉంది. ఆ తర్వాత ధొలారి ధని థీమ్, ఫారెస్ట్ థీమ్, కలంకారీ థీమ్ ఓ వరుస ఉన్నాయి. శంకర్ మహదేవన్, శ్రేయాఘోషాల్, శివమణి వంటి సంగీతకారులు, గాయకుల ప్రోగ్రామ్‌లను టీవీ లైవ్ లో చూశాను. వందమంది రాజమౌళిలు, వంద మంది సంజయ్ లీలా భన్సాలీలు కలిసి సెట్టింగు వేయించారా అనిపించింది. చూడడానికి రెండు కళ్లు చాలవు. తలను 360 డిగ్రీల్లో తిప్పి చూడాల్సిందే. బారాత్ తర్వాత పెళ్లికి ముందు హై టీ టైమ్‌లో రాత్రి ఏడు నుంచి ఏడు ముప్పావు వరకు నా కచేరీ సాగింది. రాధిక మర్చంట్ కుటుంబం, అంబానీ కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి. వాళ్లు కదలకుండా కూర్చుని, ఓ పాటను మళ్లీ అడిగి మరీ చక్కగా ఆస్వాదించడం, కళల పట్ల వారికున్న గౌరవం నాకు సంతృప్తినిచ్చింది. నాలుగు వేల అడుగులు పన్నెండవ తేదీ ఉదయం ముంబయికి వెళ్లాం. హోటల్లో రిఫ్రెష్ అయిన తర్వాత నేరుగా జియో కన్వెన్షన్ సెంటర్‌కెళ్లాం. ఆ సెంటర్ ఎంట్రన్స్ నుంచి నా ప్రదర్శన ఉన్న ఆడిటోరియంలో వేదిక వద్దకు చేరడానికి నాలుగు వేల అడుగులు పడ్డాయి. ఫోన్లో చెక్ చేసుకున్నాను కూడా. నిర్వహకులు వెంట ఉండి తీసుకెళ్లకపోతే నా వేదిక ఏదో తెలుసుకోవడంతోనే రోజు పూర్తయ్యేదేమో. నీతా అంబానీ స్వయంగా కళాకారిణి కావడంతో ఈ వేడుకలో కళాప్రదర్శనకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారనుకున్నాను. భోజనాల దగ్గర కూడా ఆర్టిస్టుల కోసమే ఒక పెద్ద హాలును కేటాయించారు. వేల రకాల వంటలు వడ్డించారని విన్నాను. కానీ నేను సలాడ్లు, కాఫీ మాత్రమే తీసుకున్నాను. పెళ్లి వేడుకలో నీతా అంబానీ ఎంత శ్రద్ధగా ప్రతి చిన్న విషయాన్నీ పట్టించుకున్నారంటే డెకరేషన్లో ఉన్న పూలను కూడా పరిశీలించి థీమ్‌కి అనుగుణంగా మార్పించారు. కొన్ని రోజులపాటు ఆమె మధ్యాహ్నం మూడు నుంచి తెల్లవారి ఆరుగంటల వరకు పని చేశారట. అయినా సరే ఆమె ముఖంలో అలసట కనిపించలేదు. గొప్ప ఆర్గనైజర్ ఆమె. వీణావాణి ఇచ్చిన వరం జనసందోహంలో నేను ఎక్కువ సేపు ఇమడలేను. నా కచేరీ పూర్తి కాగానే నన్ను బయటకు తీసుకెళ్లమని నిర్వహకులను అడిగాను. గేటు వరకు తీసుకొచ్చి వెహికల్ ఎక్కించేశారు. పదమూడవ తేదీ ఉదయం ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్‌కి వచ్చేసి హమ్మయ్య అనుకున్నాను. నాకిప్పుడు తలుచుకున్నా సరే అంతా కలలా అనిపిస్తోంది. ఆంధ్రుల ఆడపడుచుని, తెలంగాణ కోడలిని. నాకు తెలిసినంత వరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ వేడుకలో కళను ప్రదర్శించిన ఏకైక వ్యక్తిని నేనే... అనుకున్నప్పుడు గర్వంగా అనిపిస్తోంది. సరస్వతీ మాత వీణతోపాటు నాకిచ్చిన వరం ఈ అవకాశం అనుకుంటున్నాను’’ అని రెండు చేతులూ జోడించారు వీణాశ్రీవాణి తన వీణను మురిపెంగా చూసుకుంటూ.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
Veena Srivani Latest Photos: వాగ్దేవి వరపుత్రిక శ్రీవాణి శ్రావ్యంగా మీటితే..! (ఫొటోలు)
-
మన డార్లింగ్ కోసం అంటూ.. 'ప్రభాస్'కు గిఫ్ట్ పంపిన వేణుస్వామి సతీమణి
వీణ శ్రీవాణి.. ఈ పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్.. వీణపై స్వరాలు పలికిస్తూ ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆమె టాలెంట్‌కు లక్షల్లో అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినిమా పాటలతో పాటు భక్తి గీతాలను తన వీణతో వాయించటం శ్రీవాణి ప్రత్యేకత. ఎప్పుడూ వీణతో పాటు కనిపించే ఆమె అసలు పేరు సత్యవాణి. పెళ్లయ్యాక శ్రీవాణిగా మారింది. అభిమానులు మాత్రం వీణ శ్రీవాణిగా మార్చేశారు. తాజాగా ప్రభాస్ కోసం శ్రీవాణి ఒక కానుక పంపి డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. తాజాగా వీణ శ్రీవాణి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో వారు పండించిన సీతాఫలాలు చూపిస్తూ.. అవన్నీ మన డార్లింగ్ ప్రభాస్‌కు పంపుతున్నట్లు చెప్పారు. తాము పండించే సీతాఫలాలు ప్రతి సంవత్సరం కోంతమందికి పంపుతామని చెప్పుకొచ్చిన ఆమె ఈ క్రమంలో ఓ స్పెషల్ వ్యక్తికి ఆ ఫలాలను పంపిస్తే ఆయన దగ్గర నుంచి ప్రభాస్ వద్దకు చేరాయని ఇలా చెప్పుకొచ్చారు. 'ప్రభాస్ గారికి నేను పంపిన సీతాఫలాలు బాగా నచ్చడంతో ఇంకొన్ని సీతాఫలాలు కావాలని కోరారు. పాన్ ఇండియా రేంజ్ స్టార్ అయిన ప్రభాస్ అడిగితే పంపించకుండా ఎవరైనా ఉండగలరా..? అందుకే ఈ బాస్కెట్లో ఉన్న సీతాఫలాలన్నీ ప్రభాస్ గారి కోసం పంపిస్తున్నా. ఈ ఫలాలతో పాటు నా గుర్తుగా ఆయన కోసం హ్యాండ్ మేడ్ బ్యాగ్‌ను కూడా పంపిస్తున్నాను. ఈ ఏడాదికి ఇదే చివరి పంట. మళ్లీ వచ్చే సీజన్లో ప్రభాస్ కోసం మరోసారి సీతాఫలాలు పంపుతాను.' అని తెలిపారు. వీణ శ్రీవాణిగా ఆమె ఎంత పాపులరో తన భర్త ప్రముఖ జ్యోతిష్యులు అయిన వేణుస్వామి కూడా అంతే పాపులర్. వాస్తవంగా వేణుస్వామి కంటే ముందే వీణ శ్రీవాణికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. టాలీవుడ్ హీరోల పాటలను తన వీణతో ప్రత్యేకంగా హమ్ చేస్తూ వినిపించేది. అలా అందరి హీరోల అభిమానులు ఆమెను అభినందిస్తారు. పలువురి సెలబ్రిటీల జ్యోతిష్యాలు చెబుతూ వేణుస్వామి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో చాలామంది ప్రముఖలకు సంబంధించిన జ్యోతిష్య వివరాలను సోషల్ మీడియా వేదికగా ఆయన చెప్పారు. వాటిలో ఎక్కువ శాతం ఆయన చెప్పిన విధంగానే జరగడంతో వేణుస్వామిపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. ఒక్కోసారి భారీగా ట్రోల్స్ కూడా ఎదురు కావడం జరిగింది. అయినా వాటిని ఆయన ఏ మాత్రం లెక్కచేయరు. ఈ క్రమంలోనే ఒకసారి ప్రభాస్ గురించి మాట్లాడుతూ డార్లింగ్ సినిమాలకు కొంత కాలం పాటు పెద్దగా కలెక్షన్స్ రావని చెప్పడంతో.. వేణుస్వామిపై ప్రభాస్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆయన సతీమణి డార్లింగ్ ప్రభాస్ కోసం సీతాఫలాలు పంపడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Veena Srivani (satyavani Parankusham ) (@veenasrivani_official) -
సన్ రైజర్స్ రికార్డ్ బ్రేక్ : వీణ శ్రీవాణి మాస్ బీట్ సాంగ్ వైరల్!
ఐపీఎల్ పోరులో మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేసి తన రికార్డ్‌ను (287/3)తానే బ్రేక్ చేసింది. చిన్నస్వామి స్టేడియంలో హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల మోత మోగించారు. ముఖ్యంగా బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించిన హెడ్ విధ్వంసమే సృష్టించాడు. దీంతో పవర్ ప్లేలో కేవలం 7.1 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ 100 పరుగులు దాటడం విశేషం. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ సందర్భాన్ని వీణ శ్రీవాణి కూడా సెలబ్రేట్ చేసుకుంది. సోషల్ మీడియాలో ఎ పుడూచురుగ్గా ఉంటూ తన అభిమానులను అలరించే శ్రీవాణి సన్‌రైజర్స్ విజయాన్ని స్పెషల్‌గా ఎంజాయ్ చేసింది. ఐపీఎల్ 2024 కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ రిలీజ్ చేసిన సాంగ్‌ను తన వీణతో అదరగొట్టేసింది శ్రీవాణి. తన వీణా వాయిద్యాన్ని కేవలం క్లాసిక్ మ్యూజిక్కు పరిమితం కాకుండా, మాస్ సాంగ్స్‌ను కూడా వాయిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్న శ్రీవాణి తాజాగా మాస్‌బీట్ ‘‘మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో’ తో ఇరగదీసింది. ఇది ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తోంది. View this post on Instagram A post shared by Veena Srivani (satyavani Parankusham ) (@veenasrivani_official) -
రీల్స్‌తో వేణు, శ్రీవాణి ‘మ్యూజిక్’ మామూలుగా లేదుగా!
ఆమె పేరుకు తగ్గట్టుగానే సంగీత సరస్వతి. అతను ఆమెకు దొరికిన తిరపతి లడ్డు. ఇపుడు వీరిద్దరూ సెలబ్రిటీ కపుల్‌గా సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇంతకీ వారెవ్వరో ఇప్పటికే అర్థమైపోయిందికదా. అవును వారే. సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు, సూచనలు ఇచ్చే వేణుస్వామి, యాంకర్‌గా మొదలై వీణా నైపుణ్యంతో పాపులరైన ‘వీణా శ్రీవాణి’. సోషల్ మీడియాలో ఎప్పటికపుడు అనేక పోస్ట్‌లు పెడుతూ లక్షలాది ఫాలోయర్లను సొంతం చేసుకుంది శ్రీవాణి. అనేక రకాల పాటలకు ఆమె వాయించే వీణ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా ఇంట్రస్టింగ్ పోస్ట్‌లు, తన కచేరీలు, వీణ వీడియోలతో అభిమానులతో ఎపుడూ టచ్‌లో ఉంటుంది. తాజాగా వీరిద్దరు కశ్మీర్‌కు సమ్మర్ వెకేషన్‌కు చెక్కేశారు. దీనికి సంబంధించి రీల్స్‌ను కూడా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ ‘కింగ్ కాంగ్’ సినిమాలోఒక సీన్‌ను రీల్ చేశారు. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు మంచులో చిల్ అవుతూ కనిపించారు. అలాగే భారతదేశపు మినీ స్విట్జర్లాండ్ శ్రీనగర్‌లో పెహల్గాం వద్ద అందమైన లోయ సమీపంలో రోజా సినిమాలోని పాటకు వరుసగా ఇద్దరూ రీల్ చేసిన వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అంతేనా ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘మిర్చి’ సినిమాలోని ‘ఎలాంటి అమ్మాయి కావాలేంటి’ అనే డైలాగులతో భర్త వేణుస్వామితో రీల్ చేయడం ఇంట్రస్టింగ్‌గా మారింది. ఆ తరువాత టాలీవుడ్ ‘మన్మధుడు’ నాగార్జున సినిమాలోని నాగ్, బ్రహ్మీ ఫన్నీ సీన్ ను రీ క్రీయేట్ చేయడం విశేషంగా నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Veena Srivani (satyavani Parankusham ) (@veenasrivani_official) -
రోజా చేతుల మీదుగా ‘మీ కడుపునిండా’ రెస్టారెంట్ ప్రారంభం (ఫొటోలు)
-
తెలుగులో ఆ స్టార్ హీరోతో సినిమా ఛాన్స్ వస్తే చేస్తా: ఆర్కే రోజా
బుల్లితెర నటి శ్రీవాణి ఎన్నో సీరియల్స్లలో నటించిన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో ఆమె నటించిన సీరియల్స్ చాలా పాపులర్ అయ్యాయి. కానీ ఆమె సీరియల్స్‌కు కొంత బ్రేక్ ఇచ్చినా తన అభిమానుల కోసం యూట్యూబ్ ఛానల్‌తో టచ్‌లో ఉంటుంది. ఆమె ఇప్పుడు నటన నుంచి తన భర్త నటుడు విక్రమాదిత్యతో కొత్త అడుగులు వేస్తుంది. ‘మీ కడుపునిండా, తెలుగువారి రుచులు’ అనే హోటల్‌ను విక్రమాదిత్య, సందీప్ మిరియాలతో కలిసి మణికొండలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి శ్రీమతి రోజా గారు ఆ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. అనంతరం ఈ వ్యాపార రంగంలో శ్రీవాణి రాణించాలని రోజా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మీడియాతో ముచ్చటించిన రోజా గారు తనకు నచ్చిన నాన్ వెజ్ వంటకాలు గురించి సరదాగా రొయ్యల ఇగురు చేపల పులుసు,సంగటి ఇవన్నీ తనకు ఇష్టం అని చెప్పడమే కాకుండా తాను వంట కూడా బాగా చేస్తానని తెలిపారు. ‘మీ కడుపునిండా, తెలుగువారి రుచులు’ అనే హోటల్లో వెజ్, నాన్ వెజ్ వంటకాలు అన్నీ కూడా ఆంధ్రా స్టైల్ల్లో అందుబాటులో ఉంటాయని, అచ్చమైన తెలుగు వంటకాల రుచి చూడాలంటే ఇక్కడొకసారి ఎంట్రీ ఇవ్వల్సిందేనని రోజా చెప్పారు. సినిమాల విషయానికి వస్తే... సుమారు పదేళ్లకు పైగానే రోజా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో ఆమె కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె సినిమాలతో పాటు పలు రియాల్టీ షోలకు దూరంగా ఉన్నారు. కానీ టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని రోజా తెలిపారు. కానీ తల్లి పాత్ర మాత్రం చేయనని, వదినా లేదా అక్క పాత్రలలో ఏదైనా పర్వాలేదు సంతోషంగా చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు. కాంతారా సినిమా చాలా బాగుందని చెబుతూనే బేబీ సినిమా ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉందని ఆర్కే రోజా చెప్పారు. -
నన్ను పెంచి పోషిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు
-
యూట్యూబ్ లో మా సంపాదన ఎంతంటే..?
-
ఆమె గొంతు పూర్తిగా పడిపోయింది: నటి శ్రీవాణి భర్త
నటి శ్రీవాణి.. బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు. సినిమాలు, సీరియల్స్ ద్వారా అలరించే ఆమె తన యూట్యూబ్ ఛానల్లోనూ వీడియోలు చేస్తూ అభిమానులకు వినోదాన్ని పంచుతోంది. తాజాగా ఆమె యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఇందులో శ్రీవాణి భర్త మాట్లాడుతూ.. గలగలా మాట్లాడే శ్రీవాణి వారం రోజుల నుంచి మాట్లాడలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. కొంచెం గట్టిగా మాట్లాడినా.. ఆమె గొంతు ఎప్పటికీ పోతుందని తెలిపాడు. 'గత కొన్ని వీడియోల్లో శ్రీవాణి గొంతు సరిగా రాకపోతే జలుబు వల్లేమో అనుకున్నాం. కానీ వారం రోజుల నుంచి ఆమె గొంతు పూర్తిగా పోయింది. అసలేమీ మాట్లాడటానికి రావట్లేదు. డాక్టర్ దగ్గరకు వెళ్తే.. నెల రోజుల వరకు ఆమె అస్సలు మాట్లాడకూడదని చెప్పాడు. కొన్ని మందులిచ్చాడు. నెల తర్వాత ఆమె మళ్లీ నార్మల్ అవుతుందన్న నమ్మకం ఉంది' అని చెప్పుకొచ్చాడు శ్రీవాణి భర్త. చదవండి: ఈ వారం అలరించనున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే.. -
కిషన్ రెడ్డి సభ.. కార్పొరేటర్‌కు షాకిచ్చిన జీహెచ్ఎంసీ
సాక్షి, హైదరాబాద్: రామాంతాపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణికి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని రూ.80వేల జరిమానా విధించింది. శనివారం హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్రకు ఆమె ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో జీహెచ్ఎంసీ భారీ జరిమానా విధించింది. -
శ్రీవాణి.. చేనేత రారాణి
అంబర్‌పేట: సంప్రదాయ చేనేత వస్త్రాలతో ఫ్యాషన్ రంగంలో తనదైన ప్రత్యేకత చాటుకుంటున్నారు నగరంలోని నల్లకుంటకు చెందిన శ్రీవాణి. చేనేత కార్మికులు నేసిన వస్త్రాలతో ఆధునిక ఫ్యాషన్ రంగంలో వస్తున్న వస్త్రాలకు దీటుగా విభిన్నమైన డిజైన్లను రూపొందిస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసిన శ్రీవాణి ఆ తర్వాత కొంతకాలం ఉద్యోగం చేశారు. వివాహానంతరం ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి ఐదేళ్లుగా ఫ్యాషన్ రంగంలో రాణిస్తున్నారు. నెలలో 2 నుంచి 3 వరకు వివిధ ఎగ్జిబిషన్లలో పాల్గొని చేనేత గొప్పదనాన్ని చాటుతున్నారు. పలు డిజైన్ వస్త్రాల ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. చేనేత వస్త్రాలతో ఫ్యాషన్ డిజైనింగ్ రూపొందించడం ఖరీదైనప్పటికీ వాటితోనే డిజైనర్‌గా రాణిస్తున్నారామె. తనతో పాటు మరో నలుగురికి ఉపాధి పొందుతూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీవాణి. ఎన్నో రాష్ట్రస్థాయి వేదికలపై ఫ్యాషన్ డిజైన్లను ప్రదర్శించిన ఆమె.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. మహిళలు తమదైన ప్రత్యేకతను చాటుకోవాలని ఆకాంక్షించారు. డెంట్‌గా శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్లుగా బెనర్జీ, ఎస్వీ కృష్ణారెడ్డి, జనరల్ సెక్రెటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రెటరీలుగా బ్రహ్మాజీ, నాగినీడు, కోశాధికారిగా రాజీవ్ కనకాల, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా తనీష్, ఉత్తేజ్, అనితాచౌదరి, బాలాజీ, పృథ్విరాజ్, భూపాల్‌రాజు, సి.వెంకటగోవిందరావు, డి.రాజారవీంద్ర, డి.రవిప్రకాశ్, ఏడిద శ్రీరామ్, జయలక్ష్మి, వేణు మాధవ్, కొండేటి సురేష్, పి.సాయికుమార్, రాజ్‌తరుణ్, సమీర్, తనికెళ్ల భరణి తదితరులు పోటీపడుతున్నారు. -
దాతల కరుణే ఆమెకు ఊపిరి
సాక్షి కడప : అనుకున్న లక్ష్యం కోసం.. అనుక్షణం పోరాటం చేస్తోంది.. ఇంటి కష్టాలు ఉద్యోగంతోనే దూరమవుతాయని భావించింది.. మూడేళ్లుగా పట్టుదలతో శ్రమిస్తోంది. ఇదే సమయంలో ఆమెను విధి వక్రించింది. అనుకోని జ్వరం కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పటికే ఎస్ఐ పరీక్షలో దేహదారుడ్య, ఇతర ప్రాథమిక పరీక్షలను నెగ్గిన ఆ యువతి.. ఈనెల 24వ తేదిన జరిగే మెయిన్ పరీక్షకు హాజరు కావాల్సిన పరిస్థితిలో తీవ్ర అనారోగ్యంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ప్రాణం కోసం పోరాడుతోంది. పులివెందులలోని నరసారెడ్డి పెట్రోలు బంకు సమీపంలో నివసిస్తున్న విద్యావతమ్మకు నలుగురు పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు కాగా, ఒకరు బాబు. తండ్రి మృతి చెందడంతో అనీన్ తల్లే చూసుకుంటోంది. పులివెందుల సమీపంలోని పాఠశాలలో పాఠాలూ చెబుతూ పిల్లలను చదివించుకుంటోంది. నాల్గవ సంతానమైన శ్రీవాణిని జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెట్టాలని బాగా చదివించింది. నంద్యాలలోని కోచింగ్ సెంటర్‌కు పంపింది. కోచింగ్ తీసుకుంటూ ఉద్యోగ వేటలో ఉన్న శ్రీవాణి?కి ఈనెల మొదటి వారంలో జ్వరం వచ్చింది. పులివెందులలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించాక కడపకు తరలించారు. కోలుకోలేదు. ప్రస్తుతం వేలూరులోని అపోలో ఆస్పత్రిలో శ్రీవాణి అపస్మారక స్థితిలో ఉంది. మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తీసుకు వెళ్లాలని వైద్యులు సూచించారు. యువతి ఊపిరితిత్తుల్లో కూడా ఇన్ఫెక్షన్ చేరింది. రూ. 10–15 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే రూ 3–4 లక్షలు ఖర్చు పెట్టారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో పాపను బతికించుకునేందుకు కుటుంబ సభ్యులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దయార్థ హృదయులు దయతలిస్తేనే... శ్రీవాణికి జీవితాన్ని ప్రసాదించాలని దయార్థ హృదయులను, మానవతా వాదులును కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. అంతో ఇంతో అయితే తాము పెట్టుకునే వారమని...బయట కూడా అప్పులు తెచ్చామని....స్థాయికి మించి లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతోనే తప్పని పరిస్థితుల్లో శ్రీవాణికి జీవితాన్ని ఇవ్వాలని కోరుతున్నామన్నారు. స్వచ్చంద సంస్థలు, మానవతా వాదులు, దాతలు ఆర్థికంగా చేయూతనందిస్తే శ్రీవాణికి పునర్జన్మ ప్రసాదించిన వారవుతారని తల్లి కన్నీరుమున్నీరవుతూ చెప్పింది. శ్రీవాణిని ఆదుకోవాలనుకుంటే ఎం.శ్రీ సాయిరాం, అకౌంట్ నెం. 36988129978, ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఎస్బీఐఎన్ 0000849, ఎస్బీఐకి ఆర్థికసాయాన్ని పంపించాలన్నారు. వివరాలకు శ్రీ సాయిరాంను 7416303974 నెంబరులో సంప్రదించాలని కోరారు. -
వాణిగా వచ్చి.. వీణగా మారి..!
అతి చిన్న వీణ మీద సంగీతం పలికించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు శ్రీవాణి. వీణను అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో పలు భారతీయ భాషలలోని పాటలతో పాటు పాశ్చాత్య సంగీతాన్ని సైతం వీణ మీద ఒలికిస్తున్నారు. తాజాగా శ్రీవాణి.. ‘బ్రీత్లెస్’ (శంకర్‌మహదేవన్) సాంగ్‌కు తన వేళ్లతో పునఃప్రతిష్ఠ చెయ్యడం సంచలనం అయింది. ఆమెపై ప్రశంసలు కురిపిస్తోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వీణ చిట్టిబాబుగారి శిష్యురాలు పిచిక సీతామహాలక్ష్మి గారి దగ్గర.. చిన్నతనంలోనే శ్రీవాణి వీణకు అంకురార్పణ జరిగింది. శ్రీవాణి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా నందంపూడి. ‘‘మా అమ్మగారికి సంగీతం మీద ఉన్న శ్రద్ధ, అభిలాష కారణంగా నాకు వీణ నేర్పించారు. నా అసలు పేరు సత్య వాణి. సరస్వతీ కటాక్షంతో వీణ నేర్చుకున్నాక నా పేరు శ్రీవాణిగా మార్చుకున్నాన’’ని చెప్పారు శ్రీవాణి. వీణలో డిప్లొమా పూర్తి చేశారు శ్రీవాణి. ఆ తరవాత హైదరాబాద్ అబ్బాయి వేణుతో ఆమె వివాహం జరిగింది. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే శ్రీవాణి ఆర్ఆర్బీ పరీక్ష రాశారు. రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. రెండు సంవత్సరాలు శిక్షణ పొందాక, ఉద్యోగం మానేసి, సంగీతం మీదే దృష్టి సారించారు. పదహారేళ్ల పాటు టీవీలో యాంకరింగ్ చేసి మానేశారు. అందుకు కారణాలు, అనంతర పరిణామాలు శ్రీవాణి మాటల్లోనే విందాం. ఎప్పుడు ఆపేస్తానా అని చూశారు! ‘ఈ పని నువ్వు చేయలేవు’ అంటే, పట్టుదలతో సాధించడం నా లక్షణం. 2014లో రెండు మూడు సంఘటనలు నా జీవితంలో నేను నిర్ణయాలు తీసుకునేలా చేశాయి. ఒక గెట్‌టుగెదర్‌లో అందరూ రకరకాల యాక్టివిటీస్ చేశాక, నేను వీణ వాయిస్తుంటే, అందరూ ‘ఎప్పుడు ఆపేస్తానా’ అన్నట్లు చూశారు. అది నా మనసుకి బాధ కలిగించింది. ఒకసారి ఒక చోట వీణ కచేరీ చేసి, చేతితో వీణ పట్టుకుని ఇంటికి వస్తుంటే, డిగ్రీ చదువుతున్న ఒక అబ్బాయి ‘ఇది గిటారేనా’ అని అడిగాడు. తెలుగునాట వీణ కనుమరుగైపోతుందేమో అనిపించింది. అమెరికాలో ఉండే మా మేనల్లుడు... లెర్నింగ్ స్టేజ్‌లో ఉన్న ఒక అమ్మాయి వాయించిన పాటను నాకు పంపి, ‘నువ్వు కూడా ఇలా వాయించాలి’ అన్నాడు. నాకు కోపం వచ్చింది. ఈ మూడు సంఘటనలు నాకు నిద్ర లేకుండా చేశాయి. ఎలాగైనా ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలను పెంచాయి. కొత్త జీవితం ప్రారంభం మొట్టమొదటగా దళపతి చిత్రంలోని ‘సింగారాల... ’ పాటను వీణ మీద వాయించి, అప్లోడ్ చేసిన రెండు రోజులకే లక్షలలో వ్యూస్ వచ్చేశాయి. ఆ ఉత్సాహంతో చంద్రముఖి చిత్రంలోని ‘వారాయ్.. ’, ‘కత్తుల బల్లెము చేతబట్టి..’ అనే పెద్దపులి జానపద పాట వాయించి అప్లోడ్ చేశాను. పెద్దపులి పాట బాగా సెన్సేషన్ అయ్యింది. లక్షలలో వ్యూస్ వస్తుండటంతో తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిషు, మలయాళం.. అన్ని భాషలలోని పాపులర్ పాటలను అభిమానుల కోరిక మీద వాయించడం ప్రారంభించాను. ప్రపంచ రికార్డు కినాకు అనే వీణ తయారీదారుడు చిన్న వీణ చేసి ఇచ్చి, దాని మీద వాయించమని కోరారు. సాధన ప్రారంభించాను. వీణను శృతి చేసేటప్పుడు చేతి వేళ్లు బొబ్బలెక్కాయి. పావు గంట వాయించేటప్పటికి ముక్కోటి దేవతలు కనిపించారు. మహాగణపతిం, తందనానా (సెమీ క్లాసికల్), మాయదారి మైసమ్మ (మాస్)... వంటివి వాయించి ప్రపంచ రికార్డు సాధించాను. ఇటీవలే శంకర్ మహదేవన్ గాత్రంలో ప్రసిద్ధి చెందిన ‘బ్రెత్లెస్’ను వీణ మీద పలికించి ప్రశంసలు అందుకున్నాను. నేనేమీ విద్వాంసురాలిని కాను, చాలా చిన్న కళాకారిణిని, వీణ అంతరించిపోకూడదనే లక్ష్యంతోనే ఈ కొత్త పొంతలోనే ముందుకు వెళ్తున్నాను. పెద్ద విద్వాంసుల ముందు నేను అణుమాత్రురాలిని మాత్రమే’’ అని అన్నారు శ్రీవాణి. అంతా మంచే జరిగింది జీ బంగ్లా వారు చూపిన ఆదరణ నేటికీ మరచిపోలేను. నేను రెండోసారి ‘జీ’కి వెళ్లినప్పుడు ఆనందంగా అనిపించింది. సుకుమార్ గారి కోరిక మేరకు ‘రంగస్థలం’ చిత్రంలోని పాట వాయించాను. రామ్‌చరణ్ నా పాటలు షేర్ చేస్తున్నారు. అమెరికన్ వెబ్ సైట్ల వాళ్లు, నేను వాయించిన టైటానిక్ మ్యూజిక్‌ని విని నన్ను ‘క్వీన్ ఆఫ్ ద ఈస్ట్’ అన్నారు. నా స్థాయికి నా పేరు ఖండాంతరాలు దాటడం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. కొన్ని కొన్ని సినిమాలకు పనిచేశాను. మణిశర్మ, ఆర్పి పట్నాయక్‌లకు ఆర్సెస్ట్రాలో వాయించాను. ప్రపంచ ప్రఖ్యాత ఘట వాద్య కళాకారుడు విక్కువినాయక్రామ్ చేతుల మీదుగా వీణ లెజెండ్ పురస్కారం అందుకున్నాను. ఈ మాత్రమైనా సాధించానంటే మా వారు వేణు అందిస్తున్న సహకారమే. మాకు ఒక పాప. పుష్కరిణి. – శ్రీవాణి, వీణ కళాకారిణి, హైదరాబాద్ – సంభాషణ: వైజయంతి పురాణపండ -
ప్రేక్షకుడి హాస్యం
నూతన నటీనటులతో కె.వి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రేక్షకుడు’. రేఖ సాయిలీల ప్రొడక్షన్స్ పతాకంపై పిల్లా రాజా నిర్మిస్తున్న ఈ సినిమా లోగోను న్యాయవాది ఎస్.వరలక్ష్మి విడుదల చేశారు. ఈ సందర్భంగా కె.వి.రెడ్డి, పిల్లా రాజా మాట్లాడుతూ– ‘‘పశ్చిమ గోదావరి జిల్లాలో చలమయ్యగారి మిఠాయికొట్టు చాలా ఫేమస్. అందులోని స్వీట్స్‌లాగే ఈ చిత్రం మధురంగా ఉంటుంది. వైవిధ్యమైన కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. ఆద్యంతం చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది. కథానుగుణంగానే టైటిల్ పెట్టాం. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. అంతర్వేది, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. మున్నాకాశీ చక్కని బాణీలు అందిస్తున్నారు. ప్రేక్షకుల్ని మా సినిమా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. నటీనటులు ప్రభాకర్, శ్రీవాణి, మున్నాకాశీ పాల్గొన్నారు. -
పెచ్చుమీరుతున్న లైంగిక వేధింపులు
సాక్షి, విశాఖపట్నం: సమాజంలో మహిళలపై రోజురోజుకు లైంగిక వేధింపులు పెచ్చుమీరుతున్నాయని ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో ప్రతి మూడు నిమిషాలకు ఒకరు అత్యాచారానికి గురవుతూ ఉన్నారని, ప్రతి 10 నిమిషాలకు 498 కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. విశాఖలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాలు చేసే వారు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, ఐటీ రంగంలో పనిచేసే వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉందన్నారు. మగవారి కంటే దీటుగా ఆడవారు అన్ని రంగాల్లో రాణిస్తునారని, అయితే ఈ లైంగికదాడుల వల్ల ఉద్యోగాలు చేసేందుకు వెనుకడుగు వేసే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేసే చోట ఎక్కువగా ఈ లైంగిక దాడులు జరుగుతుండడం దారుణమని, మహిళలపై దాడులను అరికట్టేందుకు పదిమందికి తక్కువ కాకుండా మహిళలు పనిచేసే ప్రతి చోట అంతర్గత ఫిర్యాదుల కమటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. యాజమాన్యం ప్రతిపాదించిన ఓ సీనియర్ ఉద్యోగిని నేతృత్వంలో ఉండే ఈ కమిటీలో ఉద్యోగుల నుంచి ఇద్దరు, సామాజిక సేవలో అనుభవం ఉన్న ఇద్దర్ని సభ్యులుగా నియమించవచ్చన్నారు. ఈ కమిటీలు ఏర్పాటు చేయకపోతే ఆయా కంపెనీలు, సంస్థలకు రూ.50 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా లీగల్ సర్వీసెస్ సి.ఉమాదేవి, డొమెస్టిక్ వైలెన్స్ కౌన్సిలర్స్ జ్యోతిలత, వన్ స్టాప్ సెంటర్ ఎడ్మినిస్ట్రేటర్ పద్మావతి, జిల్లా చైల్డ్ ప్రొటక్షన్ అధికారి సత్యనారాయణ పాల్గొన్నారు. -
‘అమాయక’ పేరు తెస్తుంది
వర్ధమాన నటి శ్రీవాణి సీతమ్మధార :అమాయక చిత్రం గుర్తింపు తెస్తుందని వర్ధమాన సినీనటి శ్రీవాణిరెడ్డి చెప్పారు. పెందుర్తి కష్ణరాయపురంలో అమ్మమ్మను చూడటానికి వచ్చిన ఆమె శనివారం సాయంత్రం సీతమ్మధారలో ఉంటున్న మరో వర్ధమాన నటుడు, స్నేహితుడ్ని పరామర్శించేందుకు వచ్చిన ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. 2013లో చెన్నైలో జరిగిన ‘మిస్ సౌత్’ పోటీలో విన్నర్‌గా నిలిచినట్టు చెప్పారు. 2014లో ‘లాటరీ’ చిత్రంలో నటించానన్నారు. కళామందిర్, జోయలుక్కాస్ వంటి సంస్థలకు మోడల్‌గా పనిచేశానన్నారు. అంతేకాకుండా చాలా షార్ట్‌ఫిల్మ్‌లో నటించానని, మంచి గుర్తింపు వచ్చిందన్నారు. మిస్ ఇండియా అవ్వాలనే కోరుకుంటున్నానని, అందుకు తగినవిధంగా శిక్షణ పొందుతున్నానన్నారు. -
ఆ ఘటనతో నాకెలాంటి సంబంధం లేదు
-
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
యాదాద్రి: నల్లగొండ జిల్లా యాదాద్రిలోని ఓ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. మెదక్ జిల్లా సంగారెడ్డి పట్టణానికి చెందిన శ్రీమాన్, శ్రీవాణి అనే వారు ఆదివారం స్థానిక ప్రైవేట్ లాడ్జిలో బస చేశారు. సోమవారం ఉదయం వారిద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉండగా నిర్వాహకులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని ఇద్దరినీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారు ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు తేలింది. చికిత్స అనంతరం శ్రీమాన్ ఆరోగ్య పరిస్థితి మెరుగు కాగా, శ్రీవాణి పరిస్థితి విషమించటంతో ఇద్దరినీ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అసలు సిసలు ప్రేయసీ!
టీవీ టైమ్ కుటుంబ కలహాలు, బాంధవ్యాల మధ్య విభేదాలు, ప్రేమ కోసం పోరాటాలు, పగలు ప్రతీకారాలు... ఏ సీరియల్ అయినా ఉండేవి ఇవే. కానీ వాటిని ఎంత డిఫరెంట్‌గా చూపించాం, ఎంత కొత్తగా అల్లుకున్నాం అన్నదాని మీదే సక్సెస్ ఆధారపడివుంటుంది. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని తీసినట్టుగా ఉంటుంది ‘ఇది ఒక ప్రేమకథ’ సీరియల్. ఎన్ని ప్రేమకథలు చూడలేదు? అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం, అంతస్తుల భేదాల వల్ల వారి ప్రేమలో అవరోధాలు ఏర్పడటం, ఆ తర్వాత రకరకాల సమస్యలు... చాలా సీరియళ్లు ఇలా నడిచాయి. అయితే ‘ఇది ఒక ప్రేమకథ’లో మాత్రం పాత్రల చిత్రణ బాగుంది. హీరో సాఫ్ట్ నేచర్, హీరో తల్లిగా జ్యోతి అద్భుతమైన అభినయం, చక్కని సంభాషణలు కలగలసిన ధారావాహిక అది. ఉత్కంఠను రేకెత్తించే కథనం కూడా బలాన్ని చేకూరుస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా హీరోయిన్ శ్రీవాణి తన పాత్రకి చక్కగా సరిపోయింది. పాత్రకు తగ్గట్టుగా ఇమిడిపోయింది. స్ట్రాంగ్‌గా కనిపిస్తూనే సున్నితత్వాన్ని కూడా ప్రదర్శిస్తూ మార్కులు కొట్టేస్తోంది. అసలు ప్రేయసి అంటే ఇలానే ఉండాలి అనిపించేలా చేస్తోంది. అందుకే ఆ సీరియల్ సక్సెస్‌లో శ్రీవాణి భాగం కాస్త ఎక్కువే! -
పరీక్ష రాసి వచ్చి.. పెళ్లి పీటలపైకి..
ఆదిలాబాద్ జిల్లా దహెగాం మండలం కుంచవెల్లికి చెందిన ఓ యువతి శుక్రవారం ఇంటర్ పరీక్ష రాసి వచ్చి.. పెళ్లి పీటలపై కూర్చుంది. గ్రామానికి చెందిన ఆదె తారాబాయి-బాపుల కుమార్తె శ్రీవాణికి మండల కేంద్రానికే చెందిన ననుబాయి-లింగయ్య దంపతుల కుమారుడు గోపాల్‌తో వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ముహూర్తం శుక్రవారం ఉదయం 8.40కి ఖరారు చేశారు. శ్రీవాణి ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, పెళ్లి ముహూర్తం రోజే పరీక్ష వచ్చింది. ఏడాది పాటు కష్టపడి చదివిన శ్రీవాణి ఉదయం పరీక్ష రాసి వచ్చాకే పెళ్లి కూతురిగా పీటపైకి ఎక్కి వివాహం చేసుకుంది. - దహెగాం -
'ప్రాణమున్నంతవరకూ వైఎస్ జగన్‌తోనే'
►పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవం ►కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు ►జిల్లాలోని ఎమ్మెల్యేలెవరూ పార్టీ మారరు ► స్వార్థం, వ్యక్తిగత ప్రయోజనం కోసమే కొందరు పార్టీ మారారు ► పార్టీ వీడినవారు పదవులకు రాజీనామా చేసి గెలివాలి ► ఫిరాంయిపుల చట్టంలో మార్పులు చేయాలి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బొబ్బిలి: గత ఎన్నికల్లో వైఎస్ బొమ్మతో విజయం సాధించామని, ప్రాణమున్నంతవరకూ తాము వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే కలసి నడుస్తామని పార్టీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, రాజన్నదొర, శ్రీవాణి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ నాయకులు ధర్మాన కృష్ణదాస్, బేబినాయిన తదితరులతో కలసి వారు మంగళవారం ఉదయం బొబ్బిలి కోటలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో టీడీపీ పూర్తిగా ఉనికి కోల్పోవడంతో... సీఎం చంద్రబాబు ఏపీలో వైఎస్సార్సీపీ విషయంలో అలా చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. వైఎస్ జగన్ నాయకత్వంలో తామంతా పనిచేస్తామని స్పష్టం చేశారు. వివరణ తీసుకుని కూడా ఎలక్ట్రానిక్ మీడియా అసత్య ప్రచారం చేసిందని, మరోసారి అసత్య ప్రచారం చేస్తే... చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమన్నారు. టీడీపీకి చెందిన వారు తిరిగి తమ గూటికి చేరుకున్నారే తప్ప కొత్తవారెవరరూ వైఎస్సార్సీపీని వీడలేదన్నారు. పార్టీలు మారినప్పడు రాజీనామా చేసి నైతిక విలువలు కాపాడుకోవాలని, ప్రస్తుతం పార్టీ ఫిరాయించినవారు అలా చేయకపోవడం దురదృష్టకరమన్నారు. పార్టీ ఫిరాయింపు చట్టంలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపుదారులపై చర్యలకు కాలపరిమతి లేకపోబట్టే చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. -
మూడేళ్ల చిన్నారి సజీవ దహనం
నంద్యాలటౌన్ నంద్యాల పట్టణం అరుంధతీనగర్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించి చిన్నారి శ్రీవాణి సజీవ దహనమైంది. ఐదు గుడిసెలు దగ్ధమై బాధితులు రోడ్డున పడ్డారు. ఓ గుడిసెలో నివాసం ఉన్న గద్వాల బ్రహ్మయ్య.. మున్సిపాలిటీలోని నాల్గో పారిశుద్ధ్యం డివిజన్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య జ్యోతి, 8ఏళ్ల కుమారుడు సాయి, ఆరేళ్ల కుమార్తె సాయిలక్ష్మి, మూడేళ్ల కుమార్తె శ్రీవాణి, ఏడాదిన్నర వయస్సు ఉన్న కుమారుడు సుబ్బరాయుడు ఉన్నారు. శ్రీవాణి మండ్రాల్ చావిడి వద్ద ఉన్న ప్రైవేటు స్కూల్లో నర్సరీ చదువుతోంది. గురువారం రాత్రి 9గంటలకు భోజనం పూర్తయ్యాక, గుడిసెలో వీరంతా నిద్రపోయారు. అర్థరాత్రిదాటాక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి గుడిసెకు నిప్పంటుకుంది. మంటలు పక్కన ఉన్న నాలుగు గుడిసెలకుకూడా వ్యాపించాయి. బ్రహ్మయ్య మేల్కొనే సరికి మంటలు, దట్టమైన పొగ వ్యాపించి ఉంది. భార్య జ్యోతిని, కుమారులు సాయి, సుబ్బరాయుడు, శ్రీలక్ష్మిలను ఒకరివెంట మరొకరిని బయటకు పంపి రక్షించాడు. శ్రీవాణి కూడా వీరితో పాటు బయటకు వచ్చిందని అనుకున్నారు. చీకటిలో, దట్టమైన పొగలో, మంటల్లో ప్రాణాలను రక్షించుకోవడానికి శ్రీవాణి.. బీరువా చాటున వెళ్లి ప్రాణాలను రక్షించుకోవడానికి యత్నించింది. మంటలు వ్యాపించడంతో ఆ బాలిక మృత్యు ఒడికి చేరింది. అగ్ని ప్రమాదం ఘటనా స్థలంలో గందరగోళం నెలకొనడంతో బాలిక ఆర్థనాదాలు ఎవరికీ వినిపించలేదు. మంటలు ఆర్పాక బ్రహ్మయ్య వెళ్లి చూసేసరికి, కాలిపోయిన కుమార్తె శ్రీవాణి కనిపించింది. దీంతో ఆయన కుప్పకూలిపోయాడు. రోడ్డున పడ్డ ఐదు కుటుంబాలు.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గద్వాల బ్రహ్మయ్యతో పాటు గద్వాల చిన్నమ్మ, వీరయ్య, బాలు, పెద్దమాతంగి రమణమ్మల గుడిసెలు కూడా కాలి బూడిదయ్యాయి. ఇంట్లోని తిండి గింజలు, దుస్తులు, వంట సామాగ్రి దగ్ధమయ్యాయి. దీంతో ఈ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సోదరి ఇంట్లో శుభ కార్యం కోసం బ్రహ్మయ్య బీరువాలో దాచిన రూ.లక్ష నోట్ల కట్టలు కాలిపోయాయి. అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను ఆర్పేశారు. శ్రీవాణి మృతదేహానికి వన్‌టౌన్ పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. సీఐ ప్రతాపరెడ్డి కేసు నమోదు చేశారు. -
‘అడవిదొంగల’పై వేటు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అటవీకలప గడప దాటింది.. ప్రభుత్వ క్వార్టర్ ప్రైవేటు పరమైంది.. అటవీ భూమిల్లో అనధికార రోడ్డు వెలసింది. ఈ తతంగానికి సూత్రధారులెవరో కాదు.. సాక్షాత్తూ వన సంరక్షకులే. కంటికి రెప్పలా కాపాడాల్సిన వన సంపదను ప్రైవేటు వ్యక్తుల పరం చేసిన వైనాన్ని ఆలస్యంగా గుర్తించిన అటవీశాఖ.. ముగ్గురు అధికారులపై వేటు వేసింది. హైదరాబాద్ సౌత్ రేంజ్‌లోని ఇబ్రహీంపట్నం సెక్షన్ పరిధిలోని పలు బ్లాకుల్లో అక్రమంగా కలపను విక్రయించడంతోపాటు వన సంరక్షణలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగిన తర్వాత తొలగించారు. ఇబ్రహీంపట్నంలోని అటవీ అధికారి క్వార్టర్‌ను ప్రైవేటు వ్యక్తులకు కిరాయికి ఇచ్చారు. అంతేకాక అటవీ భూమిలో కేబు ల్ లైన్లు వేసే క్రమంలో అవినీతికి పాల్పడ్డారు. ఈ అంశంపై అందిన ఫిర్యాదు ఆధారంగా ఉన్నతాధికారులతో విచారణ చేయించిన అటవీ శాఖ.. వారి నివేదిక ఆధారంగా వేటువేసింది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం సెక్షన్ ఆఫీసర్ శ్రీవాణి, బీట్ఆఫీసర్ మొయినొద్దీన్‌లను సస్పెండ్ చేస్తూ జిల్లా అటవీ అధికారి నాగభూషణం ఉత్తర్వులు జారీ చేశారు. రేంజ్ పరిధిలో ఇంతటి అక్రమాలు జరుగుతున్నా పసిగట్టకుండా విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఏకంగా హైదరాబాద్ రేంజ్ ఆఫీసర్ రామరాజును అటవీశాఖ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు సస్సెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రామరాజు స్థానంలో హైదరాబాద్ నార్త్ రేంజ్ ఆఫీసర్ విజయ్‌కుమార్‌కు అదనపు బాధ్యత లు అప్పగించారు. ఇబ్రహీం పట్నం సెక్షన్ ఆఫీసర్‌గా సాహెబ్‌నగర్ సెక్షన్ ఆఫీసర్ మోహన్‌రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు.