నల్లగొండ జిల్లా యాదాద్రిలోని ఓ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది.
యాదాద్రి: నల్లగొండ జిల్లా యాదాద్రిలోని ఓ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. మెదక్ జిల్లా సంగారెడ్డి పట్టణానికి చెందిన శ్రీమాన్, శ్రీవాణి అనే వారు ఆదివారం స్థానిక ప్రైవేట్ లాడ్జిలో బస చేశారు. సోమవారం ఉదయం వారిద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉండగా నిర్వాహకులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని ఇద్దరినీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారు ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు తేలింది. చికిత్స అనంతరం శ్రీమాన్ ఆరోగ్య పరిస్థితి మెరుగు కాగా, శ్రీవాణి పరిస్థితి విషమించటంతో ఇద్దరినీ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.