lovers
-
చంపాల్సింది కులాన్ని... ప్రేమికుల్ని కాదు!
భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు నిండాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ... ‘మనం రేపటి నుండి రాజకీయంగా ఓటు ద్వారా మనిషికి ఒకే విలువను సాధించుకున్నాం. కానీ సామాజికంగా సమానతను సాధించుకోవాల్సి ఉంది’ అన్నారు. కులమత అంతరాలు ఆర్థిక అసమానతలు, దోపిడీ పీడనలు లేని సమాజాన్ని కలగన్న ఆనాటి మహనీయుల కలలు ఇంకా నెరవేరనే లేదు. భారతదేశ చాతుర్వర్ణ కుల వ్యవస్థ భారత సమాజాన్ని నిలువునా చీల్చిందనీ, కుల నిర్మూలన జరగకుండా, అంధ విశ్వాసాలు తొలగి పోకుండా సమాజం పురోగమించదనీ, ఆ లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగ స్ఫూర్తితో సమాజాన్ని పాలకులు ముందుకు నడపాలి. అయితే వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కులాల దొంతరలలోని కులాలను స్థిరీకరిస్తూ, అంతరాలను పెంచి పోషిస్తున్నారు. కులం కట్టుబాట్లను అనుసరించి... తమ ఇష్టానిష్టాలకు భిన్నంగా ఆ యా కులాల్లోనే వివా హాలు చేసుకోవడం ఒకరకంగా దోపిడీకి గురికావడం లాంటిదే. రెండు వందల ఏళ్ల నాడే సావిత్రీబాయి ఫూలే, జ్యోతిరావు ఫూలేలు ఈ కుల కట్టుబాట్లను తుదమట్టిస్తూ, కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్స హించారు. ప్రేమించి పెళ్లి చేసుకోవా లనుకునే జంటలకు కాని, కులమత అడ్డుకోటలను కూల్చాలనుకునే ప్రేమి కులకు కాని, కుల కట్టుబాట్లు, సంప్రదాయాలు, పెళ్లి తంతులు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద పెళ్లిళ్లు చేసుకొనేవారు అనేకమంది విడిపోతున్నారు. ఇవాళ కుటుంబంలో అమ్మాయి పుట్టిందంటే భయపడే పరిస్థితి ఎందుకుంది? ఆమె పెరిగి, పెద్దదై పెళ్లి చేసుకునేదాకా తల్లితండ్రులు భయాందోళనలకు గురికావలసి రావడానికి కారణం ఏమిటి? సమాజంలో పాతుకుపోయిన మనువాదమే కదా. ‘న స్త్రీ స్వాతంత్య్ర మర్హసి’ (ఏ స్త్రీ కూడా స్వేచ్ఛకు అర్హురాలు కాదు) అనే భావం నరనరాల్లో జీర్ఙించుకున్న సమాజం కదా మనది. స్త్రీని ఒక వస్తువుగా, ఆస్తిగా, కుటుంబ పరువును కాపాడవలసిన జీవిగా పురుషాధిక్య సమాజం చూడటం వల్లే... ఆమె కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే పరువు హత్యలకు పాల్పడుతున్నారు.రాజ్యాంగం మనిషికి స్వేచ్ఛగా బ్రతికే హక్కుని ప్రసాదించింది. ఇష్టమైనవారిని కులమతాల ప్రసక్తి లేకుండా వివాహమాడే స్వేచ్ఛను కల్పించింది. వరకట్నం చట్ట వ్యతిరేకమని తెలిసినా పట్టించుకుంటున్నది ఎంతమంది? కట్నాలు లేకుండా, కులపట్టింపులు లేకుండా తమకి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకుంటే వారి మీద కత్తులు నూరటం దుర్మార్గం. ఇవాళ్టి సామాజిక సందర్భంలో పిల్లలు ఒకరిని ఒకరు కలుసు కోవడం, తెలుసుకోవడం, భావి జీవితం గురించి కలలు కనటం అనేది చాలా సహజాతి సహజమైన పరిణామం. ఇందుకు తల్లిదండ్రులు, సమాజం ప్రోత్సహించాల్సిందిపోయి... వాళ్ళు ఏదో సమాజానికి కీడు చేస్తున్నట్టు నియంత్రించడం తగదు. కులం అనే ఒక కాగితపు పులిని చూసి మనిషి తన కన్న బిడ్డల్ని చంపుకొనే క్రూర జంతువుగా మారడం దారుణం. కుల పెద్దలుగా చలామణీ అయ్యేవారు, నాయకులు కులాంతర వివాహం చేసుకున్న జంటల్ని వెంటాడి వేధిస్తు న్నారు. సినిమాల్లో ప్రేమల్ని, ప్రేమికుల కష్టాల్ని చూసి కన్నీళ్లు కార్చే పెద్దలు, తమ కడుపున పుట్టిన బిడ్డలు తమకి ఇష్టం వచ్చిన అబ్బాయినో, అమ్మాయినో కోరుకుంటే... పరువు పోయిందని హత్యలకు తెగపడటం చూస్తూనే ఉన్నాం. సూర్యాపేటలో బంటినీ, మిర్యాలగూడలో ప్రణయ్ లాంటి ప్రేమికులనూ చంపడం ఇందుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి వాళ్ల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించవలసి ఉంది. ప్రేమ వివాహాలు, కులాంతర పెళ్లిళ్లు చేసుకునే పిల్లలకు చట్టం, సమాజం మద్దతుగా నిలవాలి.తమ ఇష్టాలకు అనుగుణంగా పెళ్లిళ్లు చేసుకునే పిల్లలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించడం ద్వారా నిజమైన ప్రేమికుల్ని కాపాడుకోవాల్సి ఉంది. అలాగే వాళ్లకు నచ్చకపోతే విడిపోయి స్వేచ్ఛగా బ్రతికే అవకాశాలను కూడా సమాజం ఇవ్వాలి. కులాంతర వివాహం... మానసిక, శారీరక వైకల్యం లేని క్రియాశీల భవిష్యత్ తరానికి బాటలు వేస్తుంది. కులాంతర వివాహాలు చేసుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సాహ కాలు పెంచాలి. ఈ జంటలపై దాడులు చేసేవారిని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వెంటనే విచారణ చేసి శిక్షించాలి. – ప్రభాకర్ కస్తూరిసమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ‘ 94409 70454 -
ప్రేమికుల రోజే ప్రియుడి బలవన్మరణం
సంతోష్ నగర్: ప్రేమికుల రోజునే ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇన్స్పెక్టర్ కె.సత్యనారాయణ కథనం ప్రకారం... సంతోష్ నగర్ కళంధర్నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్ (21) చాంద్రాయణగుట్ట జీఎం కాలనీకి చెందిన మహ్మద్ ఆబిద్ అలీ కూతురు రబియా ఫాతిమాలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇది రబియా తండ్రి అబిద్ అలీకి తెలియడంతో ఆయన ఈ నెల 14న చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో తన కూతురును ఇమ్రాన్ వేధిస్తున్నాడని రబియాతో ఫిర్యాదు చేయించాడు. దీంతో పోలీసులు ఇమ్రాన్‌ను స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ పరిణామంతో మనస్తాపానికి గురైన ఇమ్రాన్ ఇంటికి వచ్చి.. తన మృతికి రబియా తండ్రి కారణమని సూసైడ్ నోట్ రాసి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
Anti Valentine week : నేటి నుంచి భగ్న ప్రేమికులు చేసే పనిదే..
‘అందమైన ప్రేమరాణి చేయి తగిలితే సత్తురేకు కూడ స్వర్ణమేలే’ అని పాడుకుంటూ ప్రేమికులు నిన్నటివరకూ వాలంటైన్స్ వీక్‌ను ఎంతో అద్భుతంగా చేసుకున్నారు. అయితే దీనికి భిన్నంగా భగ్నప్రేమికులు వాలంటైన్స్ వీక్‌లో ఆక్రోశానికి,ఆవేదనకు గురయ్యుంటారు. అందుకే వారంతా నేటి నుంచి (ఫిబ్రవరి15)నుంచి వారం రోజుల పాటు యాంటీ-వాలెంటైన్ వీక్‌ను ఉత్సహంగా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. మరి.. ఈ వారం రోజుల్లో వారు ప్రేమను ద్వేషిస్తూ ఏమేంపనులు చేస్తారంటే..యాంటీ-వాలెంటైన్ వీక్ ఫిబ్రవరి 15 నుండి మొదలవుతుంది. ఫిబ్రవరి 21 వరకు భగ్నప్రేమికులు ఒక్కోరోజును ఒక్కోథీమ్తో జరుపుకుంటారు. ఇలా చేయడం వెనుక ఒక ప్రత్యేక ఉద్దేశ్యం ఉంది. వాలెంటైన్స్ వీక్‌లో ప్రేమను పొందలేని వారు, మనసు విరిగిపోయిన వారు ఈ యాంటీ-వాలెంటైన్స్ వీక్‌ను జరుపుకుని తమలోని దుఃఖాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారు. స్లాప్ డే, కిక్ డే, పెర్ఫ్యూమ్ డే, ఫ్లర్ట్ డే, కన్ఫెషన్ డే, మిస్సింగ్ డే, బ్రేకప్ డే మొదలైన థీమ్‌లతో ఒక్కోరోజును ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారు.స్లాప్ డే యాంటీ-వాలెంటైన్ వీక్‌లో ఫిబ్రవరి 15న స్లాప్ డే జరుపుకుంటారు. మాజీ ప్రియుడు లేదా ప్రియురాలిని మరచిపోయేందుకు స్లాప్ డే జరుపుకుంటారు. ప్రేమలో మోసపోయినవారు తమ ఒత్తిడిని, దుఃఖాన్ని మరచిపోయేందుకు స్లాప్ డే చేసుకుంటారు. చేదు జ్ఞాపకాలు, చేదు అనుభవాల నుంచి బయటపడేందుకు స్టాప్డే సహకరిస్తుందని భగ్నప్రేమికులు చెబుతుంటారు.కిక్ డే యాంటీ-వాలెంటైన్ వీక్‌లో రెండవ రోజు కిక్ డే. దీనిని ఫిబ్రవరి 16న కిక్ డే జరుపుకుంటారు. మాజీ జీవిత భాగస్వామితో వచ్చిన చేదు జ్ఞాపకాలను జీవితం నుండి తరిమికొట్టే మార్గంగా కిక్డేను జరుపుకుంటారు.పెర్ఫ్యూమ్ డే పెర్ఫ్యూమ్ డే ఫిబ్రవరి 17న వస్తుంది. ఈ రోజున భాగస్వామి మిగిల్చిన పాత జ్ఞాపకాలను మరిపోయి, కొత్తగా మలుచుకునేందుకు ఇష్టమైన పెర్ఫ్యూమ్ను అప్లై చేసుకుంటారు.ఫ్లర్ట్ డేయాంటీ-వాలెంటైన్ వీక్‌లోని నాల్గవ రోజున ఫ్లర్ట్ డే జరుపుకుంటారు. ఈ రోజున తెగిపోయిన బంధాలను పక్కనపెట్టి, కొత్త స్నేహాలను ప్రారంభిస్తారు. ఫ్లర్ట్ డేను ఎవరికీ హాని చేయని విధంగా జరుపుకోవాలని పలువురు సూచిస్తుంటారు.కన్ఫెషన్ డే దీనిని ఫిబ్రవరి 19న జరుపుకుంటారు. ఈ రోజున భగ్నప్రేమికులు గతాన్ని మరచిపోయి స్నేహితుడు, లేదా స్నేహితురాలికి క్షమాపణలు చెబుతారు. భవిష్యత్తులో అలాంటి తప్పు పునరావృతం చేయనని హామీనిస్తారు.మిస్టింగ్ డే ఇది ఫిబ్రవరి 20న వస్తుంది. ఎవరినైనా మిస్ అవుతుంటే ఆ విషయాన్ని ఆరోజున వారికి హృదయపూర్వకంగా తెలియజేస్తారు. మిస్ అవుతున్న ప్రియుడు లేదా ప్రియురాలికి ఫోన్ చేసి, మనసులోని భారాన్నంతా దించుకునే ప్రయత్నం చేస్తారు.బ్రేకప్ డేఫిబ్రవరి 21న బ్రేకప్ డే జరుపుకుంటారు. ఎవరితోనైనా సంబంధం ఇక కొనసాగించలేనని అనిపిస్తే వారికి ఆరోజున బ్రేకప్ చెబుతారు. సంతోషంగా లేని సంబంధం కొనసాగించకూడదనే ఉద్దేశంతో బ్రేకప్ డేను జరుపుకుంటారు. బ్రేకప్ డే తరువాత విడిపోయిన ప్రేమికులు సానుకూలంటా ఉంటూ, ముందుకు సాగాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh: మహారికార్డు.. ఐదు కోట్లు దాటిన పవిత్ర స్నానాలు -
Valentines Day 2025: చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన ప్రేమకథలు..!
ఫిబ్రవరి అనగానే ఠక్కున ప్రేమికుల రోజు గుర్తొచ్చేస్తుంది. అదీగాక ఆ నెలంతా కూడా హగ్ డే, కిస్ డే వంటివి వచ్చి.. చివరికి ప్రేమికుల రోజుతో ముగుస్తుంది. రొమాంటిక్ భావనను కలుగజేసే ఆ నెలలో ఉండే సందడి అంత ఇంత కాదు. ప్రేమికులు, వివిధ ప్రేమలు సినిమాలు, టీవీల పుణ్యమా అని వాటి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నాం. కానీ వేల ఏళ్ల చరిత్ర కాలంలోనే హృదయాల్ని కదిలించే అందమైన ప్రేమ కథలు ఉన్నాయి. అవి వింటుంటేనే మనసు అదొలా అయిపోతుంటుంది. మరీ ఈ వాలెంటైన్స్‌డే సందర్భంగా చరిత్ర ముడిపడి ఉండి, అజరామరంగా నిలిచిపోయిన అందమైన లవ్ స్టోరీలను గురించి తెలుసుకుందామా..!మార్క్ ఆంటోనీ- క్లియోపాత్రా:చరిత్రకారులను బాగా ఆకర్షించిన ప్రేమ కథల్లో ఒకటి మార్క్ ఆంటోనీ- క్లియోపాత్రా కథ. జూలియస్ సీజర్ మరణం తరువాత, రోమన్ సామ్రాజ్యాన్ని ముగ్గురు వ్యక్తులు పరిపాలించారు. వారే మార్క్ ఆంటోనీ, ఆక్టేవియస్ సీజర్, లెపిడస్. మార్క్ ఆంటోనీ తూర్పు మధ్యధరాను శాసిస్తూ ఈజిప్టులో నివసిస్తున్నాడు. అతను ఈజిప్ట్ రాణి క్లియోపాత్రాతో కూడా ప్రేమలో పడ్డాడు. ఆంటోని తన భార్య ఫుల్వియా మరణం, తన తోటి పాలకుడు ఆక్టేవియస్ సీజర్‌పై పాంపే తిరుగుబాటు తదితరాల వల్ల ఆంటోనీ రోమ్కు వెళ్లవలసి వస్తుంది. అతను తన స్నేహితుడు ఎనోబార్బస్తో కలిసి ప్రయాణిస్తాడు. అయితే ఆంటోనీకి తన స్నేహితుడు ఆక్టేవియస్ సీజర్‌కి కొన్ని కారణాల వల్ల మనస్పర్థలు వస్తాయి. దీంతో వీటిని రూపుమాపుకునేలా సీజర్ సోదరి ఆక్టేవియస్ని రాజకీయ వివాహం చేసుకుంటాడు. ఈ వివాహంతో లెపిడస్‌తో సహా పాలకులు తిరుగుబాటుదారుడైన పాంపేతో శాంతి ఒప్పందం ఏర్పరుచుకుంటాడు ఆంటోని. అయితే ఆంటోని మాటతప్పి మళ్లీ క్లియోపాత్ర వద్దకు వెళ్లిపోతాడు. దీంతో విసిగిపోయిన ఆక్టేవియస్ సీజర్ తాము ఏర్పరచుకున్న ఒప్పందాన్ని రద్దుచేసుకుని మార్క్ ఆంటోని, క్లియోపాత్రలపై యుద్ధం చేసేందుకు దిగుతాడు. అయితే ఈ యుద్ధంలో ఆంటోని ఓటమిని చవి చూడాల్సి వస్తుంది. ఓపక్క తన ప్రాణ స్నేహితుడు ఎనోబార్బస్ సైతం ఈ కష్టకాలంలో వదిలి దూరంగా వెళ్లిపోతాడు. మరోవైపు క్లియోపాత్రకు ఆంటోని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకుని దూరం జరిగే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే క్లియో పాత్ర సైనికులు ఆంటోనికి సహకరించకుండా పారిపోవడం జరుగుతుంది. దీంతో ఆంటోనికి క్లియోపాత్ర తనను మోసం చేసిందన్న కోపం ఎక్కువవ్వుతుంటుంది. కానీ క్లియోపాత్ర అతడి ప్రేమను పరీక్షించే నిమిత్తం తన సహచర చెలికెత్తలతో తాను మరణించినట్లుగా వార్త పంపిస్తుంది. ఈ వార్త విని ఆంటోని కుంగిపోయి తన కత్తితో పొడుచుకుని చనిపోతాడు. వెంటనే అతడిని క్లియోపాత్ర పరిచారికలు అతడిని ఆమె వద్దకు తీసుకురావడం జరుగుతుంది. అక్కడ ఆంటోని ఆమె చేతిలోని ప్రాణాలు వదిలేస్తాడు. మరోవైపు ఆక్టేవియస్ సీజర్ దండయాత్ర చేసుకుంటూ రోమ్ వైపుకి వచ్చేస్తుంటాడు. దీంతో ఆమె ఒక విషపాముతో కరిపించుకుని మరీ ప్రాణాలు వదిలేస్తుంది. ఇక్కడ ఇరువురు ఎంతో గాఢంగా ప్రేమించుకునన్నారు చిన్న మనస్పర్థ ఒకరినొకరు దూరం చేసుకునేందుకు కారణమైంది. అయితే వారికి ప్రాణాలు కోల్పోయిన టైంలో తమది నిజమైన ప్రేమ అని గుర్తించడం బాధకరం.ముంతాజ్ మహల్- షాజహాన్: !అర్జుమంద్ బాను బేగంగా జన్మించిన ముంతాజ్ మహల్ యువరాజు ఖుర్రామ్(షాజహాన్ ) హృదయాన్ని దోచుకుంది. ఆమె కేవలం ఖుర్రామ్కి రాణి మాత్రమే కాదు నమ్మకమైన సలహాదారు, సహచరురాలు. అయితే ముంతాజ్ విషాదకరంగా 1631లో తన పద్నాలుగో బిడ్డకు జన్మినిస్తున్నప్పుడు ప్రాణాలు వదిలేస్తుంది. దీంతో షాజహాన్ ఏళ్ల తరబడి తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. అలా ఆమె జ్ఞాపకార్థం కట్టించిన స్మారక చిహ్నమే తాజ్ మహల్. ఏడు వింతల్లో ఒకటిగా నిలవడమే గాక యునెస్కో గుర్తింపును కూడా పొందింది. ఏటా లక్షలాదిమంది ఈ మహల్‌ని చూసేందుకు రావడమే గాక శాశ్వత ప్రేమకు చిహ్నంగా కీర్తిస్తారు. రోమియో - జూలియట్:ఈ ప్రేమ కథ వెరోనా నగరంలో జరిగింది. ఇరువురి కుటుంబాల నేపథ్యం వేరు. దీంతో వీరిద్దరిని కలవనిచ్చేవారు కాదు బంధువులు. అయినప్పటికి వాళ్ల కళ్లుగప్పి కలుసుకుంటూనే ఉండేవారు. తమ ప్రేమను ఎలాగైన నిజం చేసుకోవాలని ఇరువురు ఆరాటపడ్డారు. అయితే రోమియో అనుకోకుండా జూలియట్ బంధువు టైబాల్ట్‌ను క్షణికావేశంలో చంపడం జరుగుతుంది. ఈ నేరం కారణంగా రోమియోను వెరోనా నగరం నుంచి బహిష్కరిస్తారు. దీంతో ఇరువురూ ఒకరినొకరు చూసుకోలేనంత అగాథం ఏర్పడుతుంది. అయితే రోమియోకి జూలియట్ చనిపోయినట్లు నమ్మించేలా ఆమె అచేతనంగా పడి ఉన్నట్లు చూపిస్తారు ఆమె బంధువులు. దీంతో జూలియట్ లేకుండా జీవించలేనంటూ ప్రాణం తీసుకుంటాడు. ఇంతలో మెల్కొన్న జూలియంట్ రోమియో చనిపోవడం దుఃఖంతో గట్టిగా విలపిస్తుంది. అలా ఏడుస్తూనే ప్రాణాలు వదిలేస్తుంది. అప్పడు గానీ వారి స్వచ్ఛమైన ప్రేమను గుర్తించరు అక్కడి ప్రజలు.షిరిన్- ఫర్హాద్: ఇది పర్షియన్ ప్రేమ కథ. అందమైన ఆర్మేనియన్ యువరాణి షిరిన్. ఆమె అందం ససానియన్ రాజు ఖోస్రో II దృష్టిని కూడా ఆకర్షించింది. అయితే ఫర్హాద్ శిల్పి, రాతికట్టడాలను నిర్మించడంలో నేర్పరి. ఇరువురి మధ్య హోదాల పరంగా చాలా వ్యత్యాసం ఉంది. అయినా వాటన్నింటిని పక్కన పెట్టి ఒకరినొకరు విడిచి ఉండలేనంత గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే వీరిని ఎలాగైన విడదీయాలన్న ఉద్దేశ్యంతో యువరాజు ఖోస్రో ఫర్హాద్కి కష్టమైన పనులన్నీ అప్పగించేవాడు. అన్నింటిని అలవోకగా చేసేయడంతో చివరికి షిరిన్ చనిపోయినట్లు అబద్ధం చెబుతాడు. ఆ వార్త వినడంతోనే కుప్పకూలిపోతాడు ఫర్హాద్. ఆవేదనతో తమ ప్రేమను ఏ పర్వతంపై చెక్కాడా అక్కడకే వెళ్లి ఆత్మహత్య చేసుకుంటాడు. ఫర్హాద్ మరణవార్త విని అతడున్న చోటుకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది షిరిన్. ఆమె కూడా అక్కడ నుంచే దూకి చనిపోతుంది.లైలా-మజ్నున్: పర్షియన్, అరబిక్ సాహిత్యంలో భావితరాల కోసం భద్రపరచబడిన గొప్ప ప్రేమ కథ లైలా-మజ్నులది. మజ్నుగా పిలిచే ఖైస్ కవి. అతడు సంపన్న కుటుంబానికి చెందిన లైలాతో ప్రేమలో పడతాడు. లైలా అందం, తెలివిలో ఆమెకు సాటిలేరెవ్వరూ. అయితే మజ్ను ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అందువల్ల లైలాకు అతడు తగిన జోడి కాదని ఇరువురి కుటుంబాలు వారి ప్రేమను నిరాకరిస్తాయి. అయినా కూడా వాటిని లెక్కచేయకుండా తమ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో చూపించాలాని భావిస్తారిద్దరు. విధి మరోలా వారిప్రేమను పరీక్షించింది. ఇక్కడ లైలా తండ్రి మరో సంపన్న వ్యక్తితో పెళ్లి చేసి పంపేస్తాడు. లైలా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న విరహంతో పిచ్చి వాడైపోతాడు మజ్ను. అక్కడ లైలా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. రాజభోగాల మధ్య ఉన్నా.. ముళ్లమీద కూర్చున్నట్లుగానే ఉంటుంది ఆమెకు. మనసు ఎల్లపుడూ కైస్ చుట్టూనే తిరుగుతుంటుంది. కొన్నేళ్లకు భర్తతో కలిసి ఆమె ఇరాక్ వెళ్లిపోతుంది. కొద్దిరోజులకే అక్కడ అనారోగ్యం బారినపడి లైలా కన్నుమూస్తుంది. లైలా మరణవార్త తెలుసుకున్న కైస్ మిత్రులు విషయం అతడికి చెప్పాలని ఎంతో ప్రయత్నిస్తారు. కానీ, కైస్ జాడ దొరకదు. కొద్దిరోజుల తర్వాత ఓ చోట కైస్ ఆచూకీని కనుగొంటారు. వాళ్లు అక్కడికి వెళ్లి చూడగా.. కైస్, లైలా సమాధి దగ్గర ప్రాణం లేకుండా పడి ఉంటాడు. లైలా కోసం పిచ్చివాడిలా తిరగటం వల్లే కైస్కు మజ్ను అనే పేరు వచ్చిందని అంటారు చరిత్రకారులు. ఎందుకంటే "మజ్ను లైల" అంటే లైలా కోసం పిచ్చివాడిలా తిరిగిన వాడు అని అర్థం వస్తుంది. వారిప్రేమ విషాదంగా ముగిసినా..ఇప్పటికీ ప్రేమికులు వారిని తలుచుకుంటూనే ఉంటారు. అలాగే "ప్రేమ" అనగానే ఆ ఇరువురే గుర్తు వచ్చేలా చిరస్మరణీయంగా నిలిచిపోయారు.(చదవండి: ప్రేమకు ప్రతిరూపమైన అమ్మను ప్రేమిద్దామిలా..!) -
#HappyProposeDay : హ్యాపీ ప్రపోజ్ డే మై లవ్! (ఫొటోలు)
-
Valentine's Day: మూడు ఇన్టు ఏడు..గుండెల్లో ఏముందో..!
ఫిబ్రవరి మాసం మొదలు కాగానే ‘‘గుండెల్లొ ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది...కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే’’ అంటూ ప్రేమగీతాలైపోతారు ప్రేమికులు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ దాకా ప్రేమే ప్రపంచంగా మారిపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి మాసం ప్రేమికుల మాసంగా మారిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదురోజ్ డేతో ప్రారంభమై , ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం వరకు లవ్‌బర్డ్స్ సందడి మామూలుగా ఉండదు. ప్రేమికుల వారంలో ఒక్కోరోజు ఒక్కో పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు. రోజ్ డే (ఫిబ్రవరి 7), ప్రపోజ్ డే (ఫిబ్రవరి 8), చాక్లెట్ డే (ఫిబ్రవరి 9), టెడ్డీ డే (ఫిబ్రవరి 10), ప్రామిస్ డే (ఫిబ్రవరి 11), హగ్ డే (ఫిబ్రవరి 12),, కిస్ డే (ఫిబ్రవరి 13), చివరిగా ఫిబ్రవరి14న వాలెంటైన్స్ డేతో సంబరాలు అంబరానికి చేరతాయి.అయితే అసలు ప్రేమ అంటే ఏంటి? ఎలా పుడుతుంది? ఎపుడైనా ఆలోచించారా? రాబర్ట్ స్టెర్న్‌బర్గ్ ట్రయాంగిల్ థియరీ గురించి తెలుసా. త్రిభుజాకార సిద్ధాంతం (Triangular Theory) ప్రేమలోని మూడు భాగాలను ప్రతిపాదిస్తుంది. సాన్నిహిత్యం, వ్యామోహం, నిబద్ధతల కలయికలతో ఏడు రకాల ప్రేమలు పుడతాయని ఇదిచెబుతోంది. మనస్తత్వవేత్త రాబర్ట్ స్టెర్న్‌బర్గ్ ప్రకారం ప్రేమలు ఏడు రకాలులైకింగ్, ఇన్ఫాట్యుయేషన్, ఎంప్టీ లవ్, రొమాంటిక్ లవ్, కంపానియట్ లవ్, ఫటస్ లవ్, కంజుమేటివ్ లవ్ 1999లో లెమియక్స్ , హేల్ అనే అండర్ గ్రాడ్యుయేట పరిశోధకులు తన అధ్యయనంతో స్టెర్న్‌బర్గ్ త్రిభుజాకార ప్రేమ సిద్ధాంతానికి మద్దతు ఇచ్చారు. మరుసటి సంవత్సరం, 2000లో వీరే ఇలాంటి మరో అధ్యయనాన్ని నిర్వహించారు, ఈసారి వివాహితులతో నిర్వహించిన స్టడీలో ఈ మూడు అంశాలు వారి మధ్య బంధాన్ని బలపర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ట్రాయింగిల్ థీయరీ పైనే 2009లో పరిశోధకుడు డెవెరిచ్ స్టెర్న్‌బర్గ్ సిద్ధాంతం ప్రకారం కౌమారదశలో ఉన్నవారు సంపూర్ణ ప్రేమలో ఉండగలరా లేదా అని తెలుసుకోవడానికి ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ మూడు అంటే సాన్నిహిత్యం, వ్యామోహం, నిబద్ధతలలో లోపాల కారణంగా కౌమారదశలో ఉన్నవారు పూర్తిగా ప్రేమలో ఉండలేరని తేల్చారు. న్యూరోసైన్స్ ప్రకారం మనుషుల్లో ప్రేమ భావన పెంపొందడంలో మెదడులోని రివార్డ్ సిస్టం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ లవ్ అనే ఫీలింగ్ కలిగినప్పుడు మెదడులో ఏం జరుగుతుందనే దానిపై హార్వర్డ్ మెడికల్ కళాశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. మెదడులో విడుదలయ్యే కొన్ని రసాయనాల ఫలితమే ప్రేమ అని తేల్చి చెప్పారు. అలాగే న్యూయార్క్‌లోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెడికల్ కాలేజ్‌కి చెందిన బినాక అస్విడో రొమాంటిక్ లవ్‌పై పరిశోధనలో భాగంగా ప్రేమ మెదడులో ఎక్కడ ఉంటుందో తెలుసు కోవడానికి ప్రయత్నించారు. ఫలితంగా మెదడులోని వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా (వీటీఏ), న్యూక్లియస్ అకమ్బన్స్, వెంట్రల్ పల్లిడియం, రఫే న్యూక్లియస్ ప్రాంతాలు ఉత్తేజితమయ్యాయని ఎఫ్.మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ ద్వారా తెలుసుకున్నారట.ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్ మరో ఆసక్తికరమైన విషయంమెదడులోని వివిధ భాగాల స్పందనను బట్టి ఈ ప్రేమ ఆరు రకాలుగా ఉంటుంది మరో అధ్యయనంలో తేలింది. ప్రేమకు సంబంధించిన ఐదు భాషలపై చాలా పరిశోధనలు జరిగాయి. కానీ ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ప్రేమలో ఆరు రకాలు ఉన్నాయని, ప్రతి ఒక్కటి మెదడులోని వేర్వేరు భాగాలనుయాక్టివేట్ చేస్తుందని గుర్తించారు. మానవ అనుభవం అంటే లైంగిక ఆరాధన నుండి తల్లిదండ్రుల లేదా పెంపుడు జంతువుల ప్రేమ లేదా ప్రకృతి ప్రేమ వరకు అనేక రకాల సందర్భాలను వివరించడానికి “ప్రేమ” అనే పదాన్ని ఉపయోగిస్తారు.రొమాంటిక్ ప్రేమపేరెంటల్ ప్రేమస్నేహితుడిపై ప్రేమఅపరిచితుడి పట్ల ప్రేమపెంపుడు జంతువు పట్ల ప్రేమప్రకృతి పట్ల ప్రేమలవ్వో..గివ్వో.. ఐ వానా ఫాలో.. ఫాలోప్రేమకు ఎవరెన్ని నిర్వచనాలు చెప్పినా. అది వైయుక్తికం. ఎవరికి వారు అనుభవించి తీరాల్సిన మధురభావన. ప్రేమ అనంతమైనది. ప్రేమ మనిషికి,మనసుకు ఉల్లాసానిస్తుంది. లవ్వో గివ్వో.... రివ్వు రివ్వున సాగిపోవాలి.... ఒకరి హృదిలో ఇంకొకరు గువ్వలా ఒదిగిపోవాలి. ఎన్ని కష్టాలైనా, పరీక్షలైనా తట్టుకొని నిలబడాలి. ‘‘నాకు.. నువ్వు..నీకు నేనూ..’’ ఇదే తారక మంత్రం. నిస్వార్థంతో నిబద్ధతతో విశ్వాసంగా నిలబడితే అది పరిపూర్ణమైన ప్రేమ. -
చింటూని వదలొద్దు! నేను లిఖిత చచ్చిపోతున్నాం
ఘట్కేసర్: ప్రేమ విషయం ఇంట్లో చెబుతానని ఓ వ్యక్తి వేధించడంతో ప్రేమ జంట బలైంది. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పీఎస్ పరిధిలో సోమవారం జరిగింది. ఇన్స్పెక్టర్ పరశురాం, బంధువులు తెలిపిన వివరాలు.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామానికి చెందిన పర్వతం అంజయ్య కుమారుడు పర్వతం శ్రీరామ్ (25) బతుకుదెరువు నిమిత్తం 15 ఏళ్ల క్రితం బీబీనగర్ మండలం జమీలాపేటకు వెళ్లి స్థిరపడ్డారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నారపల్లి సమీపంలో సైకిల్ దుకాణం నడుపుతున్నాడు. చౌదరిగూడకు చెందిన ఇంటర్ చదివే ఓ మైనర్ బాలికను శ్రీరామ్ ప్రేమించాడు. బ్లాక్మెయిల్ చేసిన దగ్గరి బంధువు... శ్రీరామ్‌తో ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెబుతానని బాలిక దగ్గరి బంధువు, అన్న వరుసైన చింటు (22) బ్లాక్మెయిల్ చేసి వీరివద్ద రూ. 1,35,000 తీసుకున్నాడు. ఇంకా డబ్బు ఇవ్వాలని కాలేజ్ దగ్గరికి వెళ్లి బాలికను వేధించడమే కాకుండా, బంగారు ఉంగరం ఇవ్వాలని కోరాడు. చింటు వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని, చివరికి ప్రియుడికి విషయం తెలిపింది. అదే విధంగా కులాంతర వివాహానికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని, ప్రేమ ఓడిపోవద్దని వారం కిందటే వారిద్దరు మరణించాలని నిర్ణయించుకున్నారు. సోమవారం ఉదయం షాపింగ్ వెళ్లాలని శ్రీరామ్ తన స్నేహితుడి దగ్గర ఎర్టిగా కారును తీసుకున్నాడు. సోమవారం సాయంత్రం ప్రేమ వ్యవహారం, బ్లాక్మెయిల్ విషయాన్ని వివరిస్తూ బాలిక తండ్రికి ‘అంకుల్’ అని సంబోధిస్తూ సూసైడ్ నోట్ రాసి, తన అన్న కుమారుడికి వాట్సాప్ ద్వారా పంపించాడు. అనంతరం ఎర్టిగా వాహనంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ ఘనాపూర్ సమీపంలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద కారులోనే నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంటలకు తాళలేక శ్రీరామ్ కారు డోరు తెరుచుకొని సర్వీస్ రోడ్డు ఫుట్‌పాత్‌పై పడి మృతిచెందాడు. బాలిక కారు ముందు సీటులో కూర్చొని గుర్తు పట్టలేని మాంసం ముద్దలా కాలి ఆహుతి అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ ఇంజన్ సాయంతో మంటలు ఆర్పారు. మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి ఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆమెకు ఇద్దరు.. మొదటి ప్రియుడిని అడ్డు తొలగించుకునేందుకు..
గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు సమీపంలో ప్రేమజంటపై జరిగిన దాడి ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. యవకుడిపై దాడి వెనుక యువతి ఉన్నట్లు సమాచారం. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన అరవింద్ డిస్టెన్స్ డిగ్రీ చదువుతున్నాడు. అరవింద్ ఇంటర్ చదివే సమయంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు మందలించడంతో విరమించుకున్నారు. ప్రస్తుతం అమ్మాయి ఓ కళాశాలలో బీటెక్ చదువుతోంది. అదే కళాశాలలో మరో అబ్బాయితో ప్రేమలో పడింది. ఒకరికి తెలియకుండా మరొకరితో మాట్లాడుతూ ఇద్దరితోనూ ప్రేమాయణం నడుపుతోంది. ఇటీవల మొదటి ప్రియుడి విషయం తెలుసుకున్న రెండవ ప్రియుడు.. యువతిని నిలదీయడంతో తప్పును కప్పి పుచ్చుకునేందుకు తాను ప్రేమించడం లేదని, అతడే వేధిస్తున్నాడని చెప్పింది. ఈక్రమంలో రెండో ప్రియుడితో కలసి మొదటి ప్రియుడు అరవింద్‌పై దాడికి కుట్ర పన్నారు. రెండు రోజులు ముందుగానే గాజులదిన్నె ప్రాజెక్టు వద్దకు వచ్చి రెక్కీ నిర్వహించుకుని వెళ్లింది. మంగళవారం అరవింద్‌ను గాజులదిన్నె ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లింది. ఇదే విషయాన్ని ఫోన్లో మెసేజ్ ద్వారా ఎప్పటికప్పుడు రెండవ ప్రియుడికి సమాచారం ఇచ్చింది. అతడు తన స్నేహితులతో కలిసి వేటకొడవళ్లతో అక్కడికి చేరుకుని అరవింద్‌పై దాడి చేశారు. యువతి అక్కడి నుంచి పారిపోయింది. అరవింద్ కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా విచారణలో యువతిదే పక్కా ప్లాన్ అని తెలిసి పోలీసులు అవాక్కయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సీఐ గంగాధర్ మాట్లాడుతూ ప్రేమజంటపై దాడి ఘటనను విచారిస్తున్నామని, గురువారం వివరాలు మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు.‘నా భార్యను అంతలా చూస్తున్నారు.. చంపేస్తా’ -
వింటర్ చిల్స్..
వింటర్ అంటేనే వెచ్చని పార్టీల సీజన్. చల్లని వాతావరణంలో పుట్టే లేజీనెస్‌ను వేడి వేడి క్రేజీ పార్టీస్ ద్వారా తరిమికొట్టడం సిటీ పార్టీ లవర్స్‌కి అలవాటు. అందుకే డిసెంబర్ నెల వచ్చెరా అంటే పార్టీలకు వేళాయెరా అన్నట్టు ఉంటుంది. క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకూ వరుసగా హోరెత్తే వేడుకల్లో అటు పండుగలు ఇటు న్యూ ఇయర్ లాంటి సంబరాలు కలగలసి ఎక్కడలేని సందడినీ మోసుకొస్తాయి. ఇప్పటికే చలితో పాటు పారీ్టల సందడి కూడా సిటీని కమ్ముకుంది. ఈ నేపథ్యంలో నగరంలో క్రేజీగా మారిన కొన్ని పార్టీస్టైల్స్ గురించి.. నలుగురమూ కలిశామా.. తిన్నామా.. తాగామా.. తెల్లారిందా.. అన్నట్టు కాకుండా తాము నిర్వహించే పార్టీలకు ఆసక్తికరమైన థీమ్ జతచేయడం అనే అలవాటు నగరంలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. తమ వేడుకని కొన్ని రోజుల పాటు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మార్చాలని పార్టీ లవర్స్ ఆలోచిస్తున్నారు. అందుకు అనుగుణంగా వెరైటీ థీమ్స్ అన్వేíÙస్తున్నారు. దీంతో వెరైటీ పార్టీస్ పుట్టుకొస్తున్నాయి వాటిలో కొన్ని.. ట్విన్నింగ్.. స్టన్నింగ్.. తల్లీ కూతుళ్లు కావచ్చు, తండ్రీ కొడుకులు కావచ్చు.. భార్యాభర్తలు కూడా కావచ్చు.. కలిసి పుట్టకపోయినా కవలలం కాకపోయినా మేం ఇద్దరం కాదు ఒక్కరమే.. అనే భావన వచ్చేలా అనుబంధాన్ని ఆవిష్కరించే అవకాశాన్ని అందిస్తుందీ ట్విన్నింగ్ పార్టీ. ఇటీవల నగరంలో పలు చోట్ల దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్టీకి వచ్చే అతిథులు జంటగా వస్తారు. ఒకే రంగు దుస్తులు ధరించడం దగ్గర నుంచి వారిద్దరి మధ్య అనుబంధాన్ని వీలున్నన్ని మార్గాల్లో వ్యక్తీకరించడమే ఈ పార్టీల్లో థీమ్. ఫ్యూజన్.. ఫన్.. భారతీయతను, పాశ్యాత్య రీతులను కలగలిపేదే ఫ్యూజన్ పార్టీ. వీటినే ఇండో వెస్ట్రన్ పారీ్టస్ అని కూడా పిలుస్తున్నారు. ఈ పార్టీలో వేడుక జరిగే ప్రదేశం అలంకరణ నుంచీ వస్త్రధారణ వరకూ ఫ్యూజన్ శైలి ప్రతిఫలిస్తుంది. ఉదాహరణకు లాంతర్లు, దీపాలు వంటి సంప్రదాయ వెలుగుల సరసనే ఎల్ఈడీ లైట్స్ అలంకరించడం.. అదే విధంగా అతిథులు లెహంగా, స్కర్ట్స్‌కు క్రాప్ టాప్స్‌ను జత చేయడం లేదా కుర్తా షర్ట్స్‌కు జీన్స్ కలపడం.. ఇలా ఉంటుంది. వంటకాల నుంచి కాక్టైల్స్ వరకూ విందు వినోదాలన్నీ భారతీయ, పాశ్చాత్య మేళవింపుతోనే ఉంటాయి. రాయల్టీ.. పార్టీ.. ఇండియన్ రాయల్టీ థీమ్‌తో నిర్వహించే పార్టీలో అంతా రిచ్ లుక్ ఉట్టిపడుతుంది. సిల్‌్క, వెల్వెట్, గోల్డ్, రెడ్ రాయల్ బ్లూ.. కలర్ ఫ్యాబ్రిక్‌తో పార్టీ ప్రదేశం అంతా అలంకరణతో మెరిసిపోతుంటుంది. వింటేజ్ క్యాండిల్బ్రాస్, రాయల్ థ్రోన్స్, గ్రాండ్ షాండ్లియర్స్.. వగైరాలతో రిచ్ టచ్ ఇస్తాయి. అతిథులు ఖరీదైన దేశంలో పేరొందిన ప్రాంతాల దుస్తులు, షేర్వానీ.. వగైరాలు ధరిస్తారు. వెండి ప్లేట్లలో విందు వడ్డిస్తుంటే.. అందుకు తగిన నేపథ్యంలో లైవ్ గజల్స్ తరహా సంగీతాలు వినిపిస్తుంటాయి. బాలీవుడ్.. స్టైల్.. నగరం టాలీవుడ్‌కి కేరాఫ్ అయినప్పటికీ.. పారీ్టస్ ఇచ్చిపుచ్చుకోడంలో బాలీవుడ్ స్టైల్ పారీ్ట.. అంటూ ఒకటి ఉంది తప్ప టాలీవుడ్ థీమ్ ఇంకా తెరకెక్కలేదు. ఈ పారీ్టలో బాలీవుడ్ పోస్టర్స్, ఫెయిరీ లైట్స్, క్లాసిక్ బాలీవుడ్ లైవ్ మ్యూజిక్.. ఏర్పాటు చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన డ్యాన్స్ ఫ్లోర్‌పై బాలీవుడ్ హిట్స్‌కి అతిథులు తమ అభిమాన చిత్రంలోని స్టెప్స్ జత చేస్తారు. ఈ పార్టీలోనే బెస్ట్ డ్యాన్సర్, మోస్ట్ గ్లామరస్ అవుట్ ఫిట్.. తదితర సరదా అవార్డ్స్ కూడా ఉంటాయి. పూల్.. పారీ్టస్.. నగరంలోని స్టార్ హోటల్స్‌లో మాత్రమే కాదు కొందరి సొంత భవనాల్లోనూ కొందరికి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. కేవలం స్విమ్మింగ్‌కు మాత్రమే కాదు పారీ్టలకు కూడా పూల్ కేరాఫ్‌గా మారింది. పూల్ దగ్గర నిర్వహించే పారీ్టస్ కోసం పూల్ ఆవరణం మొత్తం ఆక్వా థీమ్‌తో డెకరేట్ చేస్తున్నారు. ఈవెంట్ మొత్తం పూల్ దగ్గరే జరుగుతుంది. వాటర్ గేమ్స్, ఆక్వా డ్యాన్స్ తదితర సరదా ఆటలూ పూల్ రీడింగ్స్ వంటి ఆసక్తికరమైన సెషన్లూ ఉంటాయి. పూల్ పారీ్టలో భాగంగా పగలూ రాత్రీ లైట్ల ధగధగల మధ్య నీళ్లలో జలకాలాటలు ఉర్రూతలూగిస్తాయి. పాట్ లాక్.. ఫుడ్ క్లిక్.. చాలా కాలంగా వాడుకలో ఉన్న సంబరాల శైలి ఇది. అయినప్పటికీ దీనికి ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఇంట్లోనే నిర్వహించుకోవడం, ఎన్నో రకాల ఇంటి వంటలు ఆస్వాదించే వీలుండడం ఈ పాట్లాక్ని బాగా క్లిక్ చేసింది. పాట్లాక్ కోసం ఒక వ్యక్తి హోస్ట్‌గా ఉంటే ఆ వ్యక్తి ఇంటికి అందరూ తమకు బాగా నచి్చన, వచి్చన వంటకాన్ని తయారు చేసి తీసుకెళతారు. అలా పెద్ద సంఖ్యలో పోగైన ఆహారపదార్థాలను రుచి చూస్తూ గేమ్స్, అంత్యాక్షరి వంటివాటితో సందడిగా గడిపేస్తారు. ఆరోగ్యకరం.. ఆర్గానిక్.. ఆహారంలో, ఆహార్యంలో ఇప్పటికే సహజత్వంవైపు సిటిజనులు భారీగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పోకడ పారీ్టస్కి కూడా అంటుకుంది. ఎకో ఫ్రెండ్లీ లేదా ఆర్గానిక్ పార్టీలు షురూ అయ్యాయి. నగరంలో చాలా మందికి శివార్లలో పార్మ్ హౌజ్‌లు ఉన్న నేపథ్యంలో ఒక్కోసారి ఒక్కో ఫార్మ్ హౌజ్‌లో పార్టీ ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ కాసేపు ఆటపాటలతో పాటు సహజ పద్ధతిలో తయారైన వంటకాలను ఆస్వాదించి పచ్చని ప్రకృతిలో సేదతీరి తిరిగి వస్తున్నారు. డెస్టినేషన్..ప్యాషన్.. ఉన్న ఊర్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎలా ఉన్నా.. ఊరు దాటి వెళ్లాం అంటే తెలియని ఫ్రీడమ్ ఫీలింగ్ వచ్చేసి ఆటోమెటిగ్గా సందడి మొదలైపోతుంది. డెస్టినేషన్ పారీ్టలు నగరంలో క్లిక్ అవడానకి కారణం అదే. ప్రస్తుతం బ్యాచిలర్ పారీ్టలు ఎక్కువగా డెస్టినేషన్ ఈవెంట్స్‌గా మారాయని నగరానికి చెందిన ఉత్సవ్ ఈవెంట్స్ నిర్వాహకులు రాజ్‌కిషోర్ అంటున్నారు. సిటీకి దగ్గరలో ఉన్న అనంతగిరి మొదలుకుని కాస్త దూరంలో ఉన్న లోనావాలా, దండేలి, మతేరన్ తదితర హిల్ స్టేషన్స్ వరకూ డెస్టినేషన్ పారీ్టస్ జరుగుతున్నాయి.ట్రెడిషనల్‌గా.. ట్రెండీగా.. సంక్రాంతి టైమ్‌లో ట్రెడిషనల్ పారీ్టస్ ఎక్కువగా జరుగుతుంటాయి. వేడుక అంతా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ముగ్గులు, జానపద గీతాలు పాడడం, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. వీటికి తమ టీనేజ్ పిల్లల్ని తీసుకు రావడానికి పార్టీ ప్రియులు ఇష్టపడుతున్నారని పార్టీ ఆర్గనైజర్ విశాల చెప్పారు. దీని వల్ల వారికి మన సంప్రదాయాలపై మక్కువ, అవగాహన ఏర్పడుతుందనే ఆలోచనే దీనికి కారణమన్నారు. -
బ్రేకప్ చెప్పిన ప్రియురాలు..వేరే వ్యక్తితో..
సేలం: తిరుపూర్‌లో సహజీవనాన్ని బ్రేకప్ చేయడంతో ఆవేశపడి నడి రోడ్డుపై ప్రేయసిని కత్తితో పొడిచిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని స్నేహితుడి కోసం గాలిస్తున్నారు. వివరాలు.. తిరుపూర్ కుమార్ నగర్‌లోని కొత్త బస్టాండ్‌కు వెళ్లే 60 అడుగుల రోడ్డులో సోమవారం సాయంత్రం ఇద్దరు యువతులు సెల్ఫోన్లో మాట్లాడుతూ స్కూటర్‌పై రోడ్డు పక్కన నిలిచి ఉన్నారు. అప్పుడు ఆ మార్గంలో హెల్మెట్ ధరించిన ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చారు. బైక్‌పై వెనుక కూర్చుని ఉన్న ఒక యువకుడు అకస్మాత్తుగా బైక్ దిగి రోడ్డు పక్కన నిలిచి ఉన్న వారిలో ఒక యువతిని కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడిచి, అక్కడి నుంచి వచ్చిన బైక్‌లోనే పరారయ్యాడు. సమాచారం అందుకుని హుటాహుటిన అక్కడికి చేరుకున్న వెస్ట్ పోలీసులు ఆ యువతిని తిరుపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో.. తిరుపూర్ కల్లంకాడు ప్రాంతానికి చెందిన శరణ్య (29) అని తెలిసింది. ఆమెకు బంధువు ఒకరితో ఏడేళ్ల క్రితం వివాహమై, ఒక బిడ్డ కూడా ఉన్నట్టు సమాచారం. భర్త మృతి చెందిన తర్వాత ఆమె అవినాశిలో ప్రింటింగ్ పని చేస్తున్న కార్మికుడు రమేష్ (33)తో సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం శరణ్య 60 అడుగుల రోడ్డులో ఉన్న ఒక సంస్థలో సూపర్వైజర్గా పని చేస్తోంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ స్థితిలో గత 11 నెలలుగా శరణ్య, రమేష్‌తో బ్రేకప్ చేసి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రమేష్‌కు తెలియకుండా శరణ్య వేరే చోటుకు నివాసం మార్చి పిల్లలతో ఉంటూ వస్తోంది. ఈ స్థితిలో సోమవారం రమేష్ తీవ్ర ఆవేశంతో తన స్నేహితుడు భూపతితో కలిసి అక్కడికి వచ్చి శరణ్యను కత్తితో పొడిచి, పరారైనట్లు తెలిసింది. దీంతో పోలీసులు రమేష్‌ను అరెస్టు చేసి, పారిపోయిన భూపతి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
లవర్స్‌కు అనుమతి లేదు !
ఎక్కడైనా పార్క్‌ల వద్ద సైకిళ్లు, వాహనాలు తీసుకురావొద్దని, చెత్తాచెదారం పడేయొద్దనే సూచనలతో బోర్డులు చూస్తుంటాం. కానీ ఖమ్మంలోని మున్సిపల్ కార్పొరేషన్ పక్కన ఉన్న ఫ్రీడమ్ పార్క్ వద్ద ఏర్పాటుచేసిన బోర్డును మాత్రం ప్రతిఒక్కరు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ బోర్డుపై సైకిళ్లు పార్క్ లోపలికి తీసుకురావొద్దని, సాయంత్రం 4 గంటల తర్వాత క్రికెట్ ఆడొద్దనేవి రెండు సూచనలు ఉన్నాయి. ఇక మూడోది మాత్రం ‘లవర్స్‌కు అనుమతి లేదు’ అని రాశారు. పార్క్‌కు చిన్నాపెద్ద వాకింగ్ కోసం వస్తుండగా గంటల తరబడి తిష్ట వేస్తున్న కొన్ని జంటలు ప్రవర్తిస్తున్న తీరుతో ఇబ్బందులు వస్తుండడంతోనే ఇలా బోర్డు ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. – ఖమ్మంమయూరిసెంటర్ -
భవనంపై నుంచి దూకి ప్రేమికుల ఆత్మహత్య
సాక్షి,విశాఖపట్నం:గాజువాక అక్కిరెడ్డిపాలెంలో ప్రేమికుల ఆత్మహత్య కలకలం రేపింది. మంగళవారం(డిసెంబర్3) తెల్లవారుజామున వెంకటేశ్వర కాలనీలోని అపార్ట్మెంట్ మూడవ అంతస్తు పైనుంచి దూకి యువ జంట ఆత్మహత్య చేసుకుంది.మృతులను పిల్లి దుర్గారావు,సాయి సుష్మితలుగా గుర్తించారు. ఇద్దరూ అమలాపురానికి చెందినవారేనని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ఏం కష్టం వచ్చింది తల్లీ.. -
ప్రేమజంట ఆత్మహత్య
యశవంతపుర: పెద్దల పంతాలకు యువతీ యువకుడు బలయ్యారు. ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన బాగలకోట జిల్లా రవకవి బనహట్టి తాలూకా నందగాంవ్ గ్రామంలో జరిగింది. సచిన్ దళవాయి (22), ప్రియా మడివాళర (19) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని తీర్మానం చేసుకున్నారు. అయితే వారి పెళ్లికి సచిన్ కుటుంబసభ్యులు ఒప్పుకోక పోవటంతో కలిసి జీవించలేమని తీవ్ర వ్యథకు గురయ్యారు. ఇద్దరూ కలిసి చనిపోవడమే మేలనుకున్నారు. గ్రామ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. మహాలింగపుర పోలీసులు ఘటన స్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
కిల్లర్ లవర్
శివమొగ్గ: ప్రేమించినందుకు పెళ్లి చేసుకోమని పట్టుబట్టిన యువతిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశాడో ప్రియుడు. ఆపై మృతదేహం కూడా ఎవరికీ దొరక్కొద్దని పూడ్చిపెట్టిన ఘటన ఉదంతం కర్ణాటక శివమొగ్గ జిల్లాలో వెలుగు చూసింది. సాగర తాలూకా తాళగుప్పకు చెందిన సృజన్ (29) అనే యువకుడు తీర్థహళ్లిలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆ కంపెనీలో చిక్కమంగళూరు జిల్లా కొప్పకు చెందిన సౌమ్య (27) అనే యువతి తల్లి రుణం తీసుకుంది. సౌమ్య బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. రుణ కంతులు వసూలు కోసం సృజన్ వారి ఇంటికి వెళ్లేవాడు, ఈ క్రమంలో సౌమ్యతో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. గత మూడేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఏమైందో ఏమో కాని ఇటీవల సృజన్ ఉద్యోగం మానేసి స్వగ్రామానికి చేరుకున్నాడు. ప్రేమ చాలు, ఇక పెళ్లి చేసుకోవాలని సృజన్‌ను సౌమ్య ఒత్తిడి చేయసాగింది.కాలితో గొంతు నులిమి..ఈ నెల 2న సౌమ్య కొప్ప నుంచి బయలుదేరి సాగరకు వచ్చింది. సృజన్ ఆ యువతిని బైక్‌పై ఎక్కించుకుని కొన్ని చోట్లకు షికారు తిప్పి చివరకు రిప్పన్‌పేట సమీపంలోని హెద్దారిపురకు తీసుకొచ్చి ఊరికి వెళ్లిపో అని చెప్పాడు. అయితే దీనికి యువతి అంగీకరించలేదు. తనను పెళ్లి చేసుకునేవరకూ ఇక్కడి నుంచి వెళ్లనని పట్టుబట్టింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశం పట్టలేక సృజన్ ఆమెను కొట్టడంతో కిందపడిపోయింది, తరువాత మెడపై కాలుతో తొక్కి ఊపిరాడకుండా చేసి చంపాడు. మృతదేహాన్ని అటవీప్రాంతంలో ఉంచి ఇంటికి తిరిగి వచ్చాడు, మళ్లీ కారు తీసుకెళ్లి యువతి మృతదేహాన్ని ఆనందపుర రైల్వే ట్రాక్ సమీపంలోకి తీసుకొచ్చి జలజీవన్ పథకం పనుల కోసం తీసిన కాలువలో పూడ్చిపెట్టి జారుకున్నాడు.మిస్సింగ్ కేసు..మరోవైపు యువతి తల్లిదండ్రులు తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో అనుమానంతో 3వ తేదీన కొప్ప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అప్పటినుంచి విచారణ చేపట్టారు. యువతి మొబైల్ ఫోన్ కాల్స్ డేటాను సేకరించి సృజన్‌ను కలిసినట్లు గుర్తించి అతన్ని పట్టుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో సృజన్ కథ మొత్తం చెప్పాడు. దీంతో కొప్ప పోలీసులు కేసును సాగరలోని రిప్పన్‌పేట పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. గురువారం తీర్థహళ్లి డీఎస్పీ, నిందితుడు, వైద్యులు కలిసి యువతిని పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని తవ్వి మృతదేహాన్ని వెలికితీయించారు. పోస్టుమార్టం నిర్వహించి సౌమ్య మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రేమ కోసం తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు విలపించారు. -
పెండ్లి కోసం పరుగులు పెట్టిన ప్రేమికులు
-
ప్రేమికుడు సజీవ దహనం
దొడ్డబళ్లాపురం: యువతిని ప్రేమించిన పాపానికి యువకుడు సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన శివమొగ్గ తాలూకా తొగర్సి గ్రామంలో చోటుచేసుకుంది. తొగర్సి సమీపంలోని అటవీ ప్రాంతంలో వీరేశ్ (27)హత్యకు గురయ్యాడు. హానగల్ పోలీసులు యువతి ఇద్దరు సోదరులను, తండ్రి, చిన్నాన్న, ముగ్గురు కార్మికులను అరెస్టు చేసారు. వివరాలు.. శిమొగ్గకు చెందిన వీరేశ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శివమొగ్గలో చదువుతున్న దూరపు బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ షికార్లకు వెళ్లేవారు.యువతి ఫోటోలు వైరల్..అయితే వీరి వివాహానికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో వీరేశ్ యువతితో సన్నిహితంగా ఉండగా తీసుకున్న ఫోటోలను యువతి బంధువుకు పంపించాడు. తీవ్ర ఆగ్రహానికి లోనైన యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ఏడుమంది కలిసి పెళ్లిపై మాట్లాడాలని అక్కి ఆలూరుకు పిలిపించుకున్నారు. అక్కడ ఒక షెడ్లో వీరేశ్‌ను కత్తులు, రాడ్లతో బాది హత్య చేసారు. వీరేశ్ తీసుకువచ్చిన ఇన్నోవా కారులోనే శవాన్ని తీసికెళ్లి తొగర్సి సమీపంలోని అటవీ ప్రాంతంలో కారుతోపాటు కాల్చివేసారు. మార్చ్ 16న తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. అప్పటినుంచి మృతుని ఆనవాలు దొరక్క కేసు మిస్టరీగా ఉండింది. దర్యాప్తు చేసిన పోలీసులు మొదట శవాన్ని గుర్తించి తరువాత ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేసారు. -
ప్రియురాలి ఎదుటే ఆత్మహత్య
తుమకూరు: ప్రేమ జంట గొడవ పడింది, అంతలోనే ప్రియురాలి కళ్ల ఎదుటే ప్రియుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ దుర్ఘటనలో కుణిగల్ పట్టణంలోని ఆశ్రయ కాలనీ నివాసి రంగనాథ్ (21) అనే యువకుడు ప్రాణాలు వదిలాడు. వివరాలు.. రంగనాథ్ కొన్ని నెలలుగా పట్టణానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. ఇద్దరు చారిత్రక శ్రీ బెట్ట రంగనాథ స్వామి క్షేత్రానికి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు, అక్కడ యువతితో ఏదో విషయమై గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన రంగనాథ్ ఆమె ఎదుటే చెట్టుకు ఉరి వేసుకున్నాడు. యువతి తన స్నేహితులకు మొబైల్లో సమాచారం అందించింది. వెంటనే స్నేహితులు వచ్చి రంగనాథ్‌ను కిందకి దించి కుణిగల్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మృతుని తండ్రి– పురసభ ఉద్యోగి పుట్టస్వామి ఆస్పత్రికి వెళ్లి మృతదేహంపై పడి విలపించారు. కుమారుని చావుపై అనుమానం ఉందంటూ, ఇది ఆత్మహత్య కాదని కుణిగల్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
Anti Valentine Week 2024 : చెంప పగలగొట్టు...బ్రేకప్ చెప్పేయ్..!
ఫిబ్రవరి అంటే ప్రేమికుల నెలమాత్రమే కాదు. మరొకటి కూడా ఉంది. ఫిబ్రవరి 14 వరకు వారంరోజుల పాటు వాలెంటైన్స్ వీక్ సందడి ఉంటుంది. అంతా ప్రేమికులకు, ఓకే చెప్పడానికి అయితే.. తిరస్కరించడానికీ, భగ్న ప్రేమికులకీ ఉండాలిగా అన్నట్టు యాంటీ వాలెంటైన్స్ వీక్ సందడి కూడా షురూ అవుతుంది. ఆ వివరాలేంటో చూద్దాం రండి! రోజ్ డే, ప్రపోజల్ డే, లవ్ డే, కిస్ డే, హగ్ డే, టెడ్డీ డే అంటూ ప్రేమ పక్షులు సందడి చేస్తే ..ఫిబ్రవరి 15నుంచి యాంటీ వాలెంటైన్స్ వీక్ భగ్నప్రేమికులకు, ప్రేమను తిరస్కరించే కిక్కు అన్నట్టు..ఫిబ్రవరి 15న చెంపదెబ్బతో మొదలై, ఫిబ్రవరి 21న బ్రేకప్‌తో తృప్తి పడతారు వాలెంటైన్స్ వీక్ అంతా. యాంటీ వాలెంటైన్ వీక్ ఫిబ్రవరి 15, స్లాప్ డే: గుండె పగిలిన వారందరూ తమ బాధలన్నింటికీ కారణమైన తమ మాజీలను చెంపదెబ్బ కొట్టడానికి ఈ రోజు అనుమతిస్తుంది. ఒక విధంగా ఇది ఇబ్బంది పెట్టే చెడు ఆలోచనలు, జ్ఞాపకాలను దూరం చేసే రోజు. ఫిబ్రవరి 16,కిక్ డే: ప్రేమలో మోసం చేసిన వారి జ్ఞాపకాలన్నింటినీ వదిలించుకోవడం, జీవితంలో నింపిన విషాదాన్ని, కోపాన్ని వదిలేయడం. అంతేకాదు వాళ్లిచ్చిన గిఫ్ట్స్‌లు, ఇతర గుర్తులను పూర్తిగా వదిలివేయడం. ఫిబ్రవరి 17, పెర్ఫ్యూమ్ డే: పదే పదే వెంటాడుతున్న చేదు జ్ఞాపకాలను మర్చిపోయి, మంచి పరిమళంతో కొత్త ఆహ్లాదాన్ని నింపుకోవడం ఫిబ్రవరి 18, ఫ్లర్ట్ డే: ఈ రోజున కొత్త వ్యక్తిని కలుసుకుని వారితో సరదాగా గడపడం ఫిబ్రవరి 19, కన్ఫెషన్ డే: తప్పులను ఒప్పుకోవడం, ఎదుటివారిని క్షమించమని అడగడం ఫిబ్రవరి 20, మిస్సింగ్ డే : ఎవరైనా తమ వాలెంటైన్‌ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటే వాళ్లకి మెమొరీస్‌ని గుర్తు చేయడం ఫిబ్రవరి 21, బ్రేకప్ డే:ఇది కీలకమైందీ.. చివరి రోజు కూడా అవతలి వారి ప్రేమ నిజమైంది కాదనిపిస్తే..నిస్సందేహంగా వదిలివేయడం హ్యాపీగా ఉండటం. ప్రేమ అందమైందే ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం చాలా చాలా అందంగా కనిపిస్తుంది. కానీ తేడా వస్తే విడిపోతే భరించడం కష్టమే. నాకే ఎందుకు ఇలా అనిపిస్తుంది.. కానీ జీవితం అక్కడితో ఆగిపోకూడదు. మనలాంటివాళ్లని దక్కించుకోలేని దురదృష్టవంతులు అనుకొని వదిలేయాలి. నిజానికి గమనిస్తే.. నిస్వార్థంగా మనల్ని మనంగా ప్రేమించే వాళ్లు చాలామంది ఉంటారు. దాన్ని మనం గుర్తించగలగాలి అంతే. -
సన్నీలియోన్ రెస్టారెంట్లో ప్రేమికులకు ప్రత్యేక ఏర్పాట్లు!
బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. సన్నీలియోన్ ఇటీవలే ఓ రెస్టారెంట్ యజమానిగా మారారు. ఆమె ఈ మధ్యనే యూపీలోని నోయిడాలో తన మొదటి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. సన్నీ రెస్టారెంట్ పేరు చికా లోకా. ఇది నోయిడాలోని గుల్షన్ మాల్లో ఉంది. ‘చికా లోకా’ ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రేమ జంటలకు చక్కని అలంకారంతో కూడిన టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రైవేట్ టేబుళ్లను కూడా బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. లైవ్ బ్యాండ్ సంగీతంతో క్యాండిల్ డిన్నర్ చేయవచ్చని వివరించింది. రెస్టారెంట్‌కు వచ్చే ప్రేమ జంటల కోసం టెర్రస్‌ను అందంగా అలంకరించినట్లు మేనేజర్ భూపేష్ సింగ్ తెలిపారు. ఇక్కడ సమయాన్ని గడపడం ద్వారా ఈ వాలెంటైన్‌ను ప్రత్యేకంగా చేసుకోవచ్చన్నారు. గ్రౌండ్ ఫ్లోర్, టెర్రస్ ఏరియాలలో ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. డ్యాన్స్, క్యాండిల్ డిన్నర్, లైవ్ బ్యాండ్ మ్యూజిక్ విత్ డీజే మొదలైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
వాలెంటైన్స్ డే వేళ... కొన్ని సరదా సంగతులు!
ఫిబ్రవరి 14... వాలెంటైన్స్ డే.. అంటే ప్రేమికుల రోజు. ఆ రోజున ప్రేమికులంతా ఆనంద డోలికల్లో మునిగితేలుతుంటారు. ప్రేమ ఊసులు చెప్పుకుంటారు. అయితే వాలెంటైన్స్ డేకు సంబంధించిన కొన్ని ఆసక్తికర సంగతులు చాలామందికి తెలియవు. వాటిపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం. మొదటి వాలెంటైన్ డే వేడుక 15వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో జరిగింది. మొదటి అధికారిక వాలెంటైన్స్ డే పారిస్‌లో జరిగిందని చెబుతారు. ఫిబ్రవరినాటి మధ్యస్థ రోజుల్లో పక్షుల సంభోగంలో పాల్గొంటాయట. అందుకే ఇది శృంగారాన్ని జరుపుకోవడానికి తగిన సమయమని అంటుంటారు. వాలెంటైన్స్ డే నాడు ప్రతి సంవత్సరం 145 మిలియన్ గ్రీటింగ్ కార్డ్‌లను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. యునైటెడ్ స్టేట్స్లో అత్యధిక వాలెంటైన్స్ గ్రీటింగ్ కార్డులు పంచుకుంటారట. పెంపుడు జంతువుల యజమానులలో 25 శాతం మంది వాలెంటైన్స్ డే సందర్భంగా తమ పెంపుడు జంతువులకు వాలెంటైన్స్ డే బహుమతులు ఇస్తారు. అంటే వాలెంటైన్స్ డే.. కేవలం మనుషులకే కాదు కుక్కలు, పిల్లులు,పక్షులు, ఇతర పెంపుడు జంతువులకు సంబంధించినది కూడా. హృదయాకార మిఠాయిలను 1800లో తయారుచేశారట. బోస్టన్ ఫార్మసిస్ట్ ఆలివర్ చేజ్ వీటిని తయారుచేసే ప్రక్రియను సులభతరం చేయడానికి ఒక యంత్రాన్ని కనుగొన్నాడు. ప్రతి సంవత్సరం ఎనిమిది బిలియన్ల హృదయ సంభాషణలు రూపొందిస్తారట. వివిధ రకాల క్యాండీలపై క్లాసిక్ రొమాంటిక్ పదబంధాలలో ‘బి మైన్’, ‘క్యూటీ పై’ ‘ఐ యామ్ యువర్స్’ అనే అక్షరాలను ముద్రిస్తారు. వాలెంటైన్స్ డే నాడుప్రేమికులు 58 మిలియన్ పౌండ్ల విలువైన చాక్లెట్లు, మిఠాయిలను కొనుగోలు చేస్తారట. వాలెంటైన్స్ డే మిఠాయి అమ్మకాలలో గుండె ఆకారంలో ఉండే చాక్లెట్ బాక్స్‌లు దాదాపు 10శాతం ఉంటాయి. 1850లో క్యాడ్బరీ కంపెనీ చాక్లెట్లతో కూడిన బాక్స్ రూపొందించింది. దశాబ్ధకాలం తరువాత మొదటి గుండె ఆకారపు చాక్లెట్ బాక్స్‌ను తయారయ్యింది. మొదటి వాలెంటైన్స్ డే గ్రీటింగ్ కార్డు జైలు నుండి పంపించారు. డ్యూక్ ఆఫ్ ఓర్లీన్స్ 15వ శతాబ్దం ప్రారంభంలో ఖైదీగా మారినప్పుడు మొదటి వాలెంటైన్ లేఖ రాశాడు. దానిలో ఒక కవిత రాసి, తన రెండవ భార్యకు పంపాడు. అయితే అతను జైలులో ఉన్నందున ఆ కవితకు ఆమె నుంచి వచ్చిన స్పందనను అతను చూడలేదు. అత్యధికంగా టీచర్లు వాలెంటైన్డే గ్రీటింగులను అందుకుంటారు. వాలెంటైన్స్ డే కోసం 250 మిలియన్ల గులాబీలను పండిస్తారు! రోమన్ ప్రేమ దేవత వీనస్‌కు ఇష్టమైనవి ఎరుపు రంగు గులాబీలు. ఇవి శృంగారాన్ని, ప్రేమను సూచిస్తాయి. -
‘కిస్ డే’ ఎలా పుట్టిందో.. ప్రాధాన్యత ఏంటో తెలుసా?
వాలెంటైన్ వీక్‌లో ప్రేమికుల రోజుకు ముందుగా వచ్చే రోజును ‘కిస్ డే’ అని అంటారు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రేమికులు పరస్పరం ముద్దులు ఇచ్చిపుచ్చుకోవాలనుకుంటారు. వాలెంటైన్ వీక్‌లో ఫిబ్రవరి 13న ‘కిస్ డే’గా సెలబ్రేట్ చేస్తారు. ప్రేమించిన వారికి ముద్దు పెట్టి తమ ప్రేమను వారి ఎదుట వ్యక్తం చేస్తారు. ఇంతకీ ఈ వాలెంటైన్ వీక్‌లోకి ‘కిస్ డే’ ఎలా వచ్చింది? దీని ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమికుల వారోత్సవంలో ఈ వారమంతా కలిసి సమయాన్ని వెచ్చించేందుకు ప్రేమికులంతా ప్లాన్ చేసుకుంటారు. తమకు ఇష్టమైర రీతిలో గడిపేందుకు ఈ వారాన్ని ప్రత్యేకంగా కేటాయిస్తారు. అయితే వాలంటైన్ వీక్‌లో వచ్చే ‘కిస్ డే’ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందినప్పటికీ, దీని చరిత్రకు సంబంధించిన వివరాలు చాలామందికి తెలియదు. నిజానికి ‘కిస్ డే’ అనేది ప్రేమ జంటల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. జంటల మధ్యనున్న రిలేషన్‌ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. చాలామంది ప్రేమికులు ప్రేమలో తమ కొత్త ప్రయాణానికి ముద్దుతో శ్రీకారం చుడతారు. ‘కిస్ డే’.. వాలెంటైన్స్ డేని మరింత రొమాంటిక్‌గా మారుస్తుంది. ప్రేమికులు తమలోని ప్రేమ, ఆప్యాయతలను వ్యక్తపరచడానికి ఇదొక అర్థవంతమైన మార్గమని చెబుతుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఉండే ముద్దులో పరస్పర ఆప్యాయత తొణికిసలాడుతుంది. ఈ కిస్ డే అనేది 19వ శతాబ్ధం నాటి విక్టోరియన్ శకంలో అత్యంత ప్రజాదరణ పొందిందని చెబుతుంటారు. ఆ సమయంలో బహిరంగంగా ముద్దు పెట్టుకోవడాన్ని తప్పుగా చూసేవారట. అందుకే కిస్డేని సీక్రెట్‌గా చేసుకునేవారని చెబుతారు. ప్రపంచంలోని వివిధ దేశాలలో కిస్ డేను జరుపుకుంటారు. తమ సన్నిహితులపై తమకు ఉండే అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు ఈ రోజును సద్వినియోగం చేసుకుంటారు. కొన్ని దేశాల్లో ప్రేమికులు అక్కడ నిర్వహించే రొమాంటిక్ ఈవెంట్లలో పాల్గొని ముద్దులు పెట్టుకుంటారు. ఇళ్లలోనూ దీనిని ఘనంగా సెలబ్రేట్ చేసుకునేవారు ఉన్నారు. ముద్దు అనేది ప్రేమ, అభిరుచితో పాటు ఓదార్పు, ఆనందంతో సహా పలు భావాలను వ్యక్త పరుస్తుంది. నిజానికి ముద్దు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య సాన్నిహిత్యాన్ని మరింతగా పెంచుతుంది. వారి సంబంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. మాట కన్నా ముద్దుతో ప్రేమను సంపూర్ణంగా వ్యక్తం చేయవచ్చని చాలామంది చెబుతుంటారు. కిస్ డే సందర్భంగా ప్రేమికులు తమ ప్రైవేట్ క్షణాలను ఆనందంగా గడుపుతారు. చాక్లెట్లు, పూలు లేదా ప్రేమ లేఖలు ఇచ్చి, ఈ డేని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కిస్ డే అనేది పాశ్చాత్య పోకడలు కలిగిన రోజు కావడంతో భారత్‌లో దీనికి అంత ప్రాధాన్యత లేదు. అందుకే ప్రేమికులు ఈ రోజును ప్రైవేట్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. -
valentines day: అందంగా మెరిసిపోవాలనుకుంటున్నారా?
ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ప్రేమికుల సందడి మొదలవుతుంది. ఎక్కడ చూసినా ‘వాలంటైన్స్ డే ’ఫీవరే. వాలెంటైన్ వీక్ అంటూ ప్రేమికులు వారం రోజులపాటు సంబరాలు చేసుకుంటారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవంతో ఈ సంబరాలు పీక్ అన్నట్టు. మరీ మీ ఫేస్ అందంగా, ఫుల్ వాలెంటైన్ గ్లోతో అచ్చమైన చందమామలా మెరిసిపోవాలిగా? అందుకే... ఈ చిట్కాలు మీ కోసమే...! ♦అరకప్పు కీరాదోస గుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి మిక్స్ చేయండి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. కీరాదోస పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది. ఇది ముడతలు, సన్నని గీతలు వంటి సమస్యలు దూరం అవుతాయి. ♦ ఒక పాత్రలో బార్లీ గింజల పొడిని తీసుకుని అందులో కొద్దికొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. దీన్ని 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తుంటే.. మచ్చలు, మృత కణాలు తొలగిపోయి ముఖ చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. ♦ పాలల్లో కొద్దిగా ఓట్స్ వేసి ఉడికించాలి. ఉడికిన తర్వాత ఇందులో కాస్త పెరుగు, తేనె వేసి బాగా కల΄ాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట అప్లై చేసుకుని బాగా ఆరనివ్వాలి. తర్వాత మైల్డ్ క్లెన్సర్ ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మంపై ఉండే బ్లాక్‌హెడ్స్ సులభంగా తొలగిపోతాయి. ♦ రెండు టీస్పూన్ల వేప పొడి, ఒక స్పూన్ నిమ్మరసం తీసుకోండి. వీటిని మెత్తగా చేసి ముఖం, మెడ భాగాలల్లో రాయాలి. పావు గంట తర్వాత చల్లటి నీటితో వలయాకారంలో ముఖాన్ని రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం కాంతిమంతంగా మెరుస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చర్య సౌందర్యానికి సమతుల్య ఆహారం తీసుకోవడం ఎప్పుడూ ముఖ్యమైనది. చివరి నిమిషంలో మొటిమలు రాకుండా ఉండటానికి చక్కెర ,పాల ఆహారాలకు దూరంగా ఉండండి. ఒక కప్పు వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగితే మచింది. ఇలాచే స్తే టాక్సిన్స్ అన్నీ పోయి చర్మానికి మెరుపు వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. బ్రోకలీ బచ్చలికూర, క్యారెట్లు, అవకాడోలు, అరటిపండ్లు, యాపిల్స్, పుచ్చకాయలులాంటి వాటిని డైట్లో చేర్చుకోండి. తగినంత నీరు త్రాగడం మీ చర్మాన్ని లోపలినుంచి ఆరోగ్యంగా ఉంచుతుందనే మర్చిపోకూడదు. -
కౌగిలింత ఎందుకు? పసివాళ్లను హగ్ చేసుకుంటే ఏమొస్తుంది?
ప్రేమికులకు వాలెంటైన్ వీక్‌లోని ప్రతి రోజు చాలా ప్రత్యేకమైనదే. ఫిబ్రవరి 12ను వాలెంటైన్ వీక్‌లో ‘హగ్ డే’గా జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమికులు మాత్రమే కాదు.. ఆప్యాయతను అందుకునేవారంతా తమకు ఇష్టమైనవారిని కౌగిలించుకోవాలని, తమ మనసులోని భావాలను వారితో పంచుకోవాలని చెబుతుంటారు. ఇంతకీ కౌగిలింతతో వచ్చే లాభాలేమితో ఇప్పడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఒక వైపు పని భారం, మరోవైపు కుటుంబ బాధ్యతలు, దీనికితోడు ఎన్నో సమస్యలు.. వీటన్నింటి మధ్య మనిషి ఒత్తిడితో సతమతమవుతున్నాడు. అలాంటి సమయంలో కౌగిలింత (హగ్) అనేది ఒక అద్భుత వరమని, అది ప్రశాంతతకు దోహదపడుతుందని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడి మాయం కావలించుకోవడమనేది ఒక మంచి ఫీలింగ్‌ని కలిగిస్తుంది. మనం బాధలో ఉన్నప్పుడు సన్నిహితులను కావలించుకుంటే మనసుకు ఓదార్పు లభిస్తుంది. అంతేకాదు ఆరోగ్యం మెరుగు పడుతుంది. అందుకే మీరు పార్ట్నర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు మీ ఆప్యాయమైన కౌగిలింత అందించి, వారి ఒత్తిడిని దూరం చేయడంతోపాటు మీలోని ఒత్తిడిని కూడా తొలగించుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. బరువు తగ్గడంలోనూ.. బరువు పెరగడానికి గల కారణాల్లో ఒత్తిడి కూడా ఒకటి. టెన్షన్, పని ఒత్తిడి రోజూ అందరికీ ఉంటుంది. ఇటువంటి సమయాల్లో కొందరు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి ఆత్మీయుల కౌగిలింత వారిలోని ఒత్తిడిని మటుమాయం చేస్తుంది. తద్వారా వచ్చే రిలాక్సేషన్ బరువు తగ్గడానికీ దోహదపడుతుంది. 10 సెకన్ల కౌగిలింత అనేక సమస్యలకు ఉపశమనంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటుకు వైద్యం మనకు ఆప్యాయతను అందించేవారిని 20 సెకన్ల పాటు హగ్ చేసుకుంటే మనలోని ఒత్తిడి తగ్గి, రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుందట. అందుకే బీపీ కంట్రోల్లో ఉండాలనుకుంటే ఆత్మీయులను కౌగిలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పసివాళ్లను హగ్ చేసుకుంటే.. అప్పుడే పుట్టిన బిడ్డను తల్లి తన దగ్గరికి తీసుకుని హత్తుకుంటుంది. దీంతో ఆ తల్లి అప్పటి వరకూ పడిన నొప్పులన్నింటినీ మరచిపోతుంది. అలాగే తల్లి కౌగిలింత పిల్లలకు సురక్షితంగా ఉన్నామనే భరోసానిస్తుంది. అది వారు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహద పడుతుంది. ఇదేవిధంగా పసివాళ్లను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటే ఎవరికైనా సరే మనసుకు స్వాంతన లభిస్తుందని మానసిక వైద్య నిపుణులు చెబుతుంటారు. -
మీరు ప్రేమిస్తున్న వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే..!
‘మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తుంది లేదా ప్రేమిస్తున్నాడు అనేది క్షణాల్లో తెలుసుకోవాలనుకుంటున్నారా? దీనికి ఒక మార్గం ఉంది. అదే ఆరెంజ్ పీల్ థియరీ’ అంటూ ఇంటర్నెట్లో మొదలైన సందడి వైరల్ కావడానికి ఎంతో టైమ్ పట్టలేదు. లవ్ లిట్మస్ టెస్ట్‌గా భావించే ‘ఆరెంజ్–పీల్–థియరీ’ సోషల్ మీడియా వైరల్ ట్రెండ్‌గా మారింది. ఈ ట్రెండ్‌లో భాగంగా ఎన్నో మీమ్స్ వస్తున్నాయి. తాజాగా కమేడియన్ అంచల్ అగర్వాల్ ‘ఆరెంజ్ పీల్ థియరీ’పై తన తల్లితో కలిసి చేసిన వీడియో వైరల్ అయింది. 7 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ఇంతకీ ఏమిటి ఆరెంజ్ పీల్ థియరీ? సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఆరెంజ్‌ను లవర్‌కు చూపిస్తూ....‘నా కోసం ఈ ఆరెంజ్ తొక్క తీయగలవా?’ అని అడగాలి.లవర్ వెంటనే ‘ఓకే’ అంటే మనది నిజమైన ప్రేమ! ఇది సిల్లీ టెస్ట్‌గా అనిపిస్తున్నప్పటికీ ఇంటర్నెట్ లోకవాసులలో చాలామంది దీన్ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నారు. ఈ వైరల్ ట్రెండ్ పుణ్యమా అని ఆరేంజ్ ఫలాలు తెగ అమ్ముడవుతున్నాయట! View this post on Instagram A post shared by Aanchal Agrawal (@awwwnchal) (చదవండి: షాకింగ్ ఘటన అసలు కంటి భాగమే ఏర్పడకుండా పుట్టిన చిన్నారి) -
‘ప్రామిస్ డే’ అంటే ఏమిటి? వాలంటైన్ వీక్‌లో దీని ప్రాధాన్యత ఏమిటి?
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న ‘ప్రామిస్ డే’గా జరుపుకుంటారు. ఇది ప్రేమికుల వారంలో ఒక ప్రత్యేకమైన రోజు. ప్రతి సంబంధానికి ఈ రోజు ప్రత్యేకమైనదే అయినప్పటికీ, ప్రేమికులకు ‘ప్రామిస్ డే’ ఎంతో ప్రాధాన్యత కలిగినది. ‘ప్రామిస్ డే’నాడు ప్రేమికులు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు. బలహీనపడ్డ బంధాలకు తిరిగి ప్రాణం పోయవచ్చు. అయితే మీరు మీ భాగస్వామికి ఎలాంటి ప్రామిస్ చేయలి? ఈ విషయంలో ఎంత నిజాయితీగా వ్యవహరించాలి? అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన అనుబంధాల విషయంలో మీ ఇష్టాలు, అయిష్టాలను అవతలి వ్యక్తిపై ఎట్టిపరిస్థితుల్లోనూ రుద్దకూడదు. అలా కాదని మీకు నచ్చినట్లు వ్యవహరిస్తే క్రమంగా సంబంధం బలహీనపడుతుందని గుర్తించండి. మీరు నిజాయితీగా భాగస్వామిని ప్రేమిస్తే వారు ఎలా ఉన్నారో అలానే అంగీకరించండి. ఈ ప్రామిస్ డే నాడు హృదయ పూర్వకంగా భాగస్వామికి ఇటువంటి వాగ్దానం చేయండి. నాకోసం నువ్వు మారాలని ఏనాడూ కోరనని వాగ్దానం చేయండి. గతంలో ఏమి జరిగినా, వాటిని హృదయపూర్వకంగా అంగీకరించండి. మధురంగా మాట్లాడటం, బహుమతులు ఇవ్వడం ద్వారా ప్రేమికులు పరస్పరం ప్రపోజ్ చేసుకుంటారు. ప్రతి కష్టమైన మలుపులో తోడుగా ఉంటానని చెప్పుకుంటారు. ఈ హామీని ప్రతీ ఒక్కరూ నిలబెట్టుకోలేరు. అయితే దీనిని నిలబెట్టుకోవడంలోనే అసలైన ప్రామిస్‌కు అర్థం ఉంటుంది. అబద్ధం చెప్పే అలవాటు ఉంటే ఎలాంటి సంబంధమైనా కొద్దికాలానికే తెగిపోతుంది. అబద్ధాలు వినడానికి ఎవరూ ఇష్టపడరు. అయితే వాటిని చాలామంది అలవోకగా మాట్లాడేస్తుంటారు. ప్రామిస్ డే నాడు మీ భాగస్వామితో జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనని వాగ్దానం చేయండి. -
సైకో గ్యాంగ్.. లవర్స్, వివాహేతర సంబంధ జంటే టార్గెట్
నల్లగొండ క్రైం: ప్రేమజంటలు సన్నిహితంగా ఉన్న సమయంలో ఓ సైకో గ్యాంగ్ సెల్ఫోన్లో రహస్యంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీడియోలు చూపించి వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకుంటున్నారు. అంతేకాకుండా మహిళలు, యువతులపై లైంగికదాడికి పాల్పడుతున్నారు. నల్లగొండ పట్టణంలోని నార్కట్‌పల్లి – అద్దంకి ప్రధాన రహదారి పానగల్ బైపాస్ సమీపంలోని నంద్యాల నరసింహారెడ్డి కాలనీ వద్ద ఈ గ్యాంగ్ వ్యవహారం బయటపడింది. వీరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. నల్లగొండ పట్టణంలోని రాంనగర్‌కు చెందిన ఆరుగురు యువకులు ఒక గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. నల్లగొండ పట్ట ణానికి చెందిన కొందరు ప్రేమ జంటలు, వివాహేతర సంబంధం ఉన్న వారు చెట్లపొదల మధ్య సన్ని హితంగా ఉండడాన్ని పసిగట్టి సెల్ఫోన్లో రహస్యంగా వీడియో తీసి ఆయా జంటలను బ్లాక్ మెయిల్ చేసి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకుంటున్నారు. ఎవరికై నా చెప్తే మీ ఇంట్లో వాళ్లకు ఈ వీడియోలు పంపుతామని, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇస్తేనే వీడియోలను డిలీట్ చేస్తామని వారికి ఫోన్ కాల్స్ చేస్తున్నారు. దీంతో పరువు పోతుందని, వివాహేతర సంబంధం బయట పడుతుందనే ఉద్దేశంతో ఈ విషయాలను బాధితులు ఎవరికీ చెప్పడం లేదు. గత మూడేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెలుగులోకి ఇలా.. ఓ యువకుడు తన ప్రియురాలిని తీసుకొని నంధ్యాల నరసింహారెడ్డి కాలనీ సమీపంలోని నిర్మానుశ్య ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. వారు సన్నిహితంగా ఉన్న సమయంలో గ్యాంగ్‌లోని యువకులు యువతిని బలవంతంగా కొట్టి లైంగిక దాడికి పాల్పడి వీడియో తీశారు. వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు లాక్కున్నారు. అదే సమయంలో వివాహేతర సంబంధం కలిగిన మరో జంట పై ఇదే తరహాలో దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి పోలీసుల దృష్టికి తీసుకురావడంతో ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో విచారిస్తున్నట్లు తెలిసింది. దోపిడీ చేసిన నగదు, బంగారు ఆభరణాలు రికవరీ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే.. అనేక మంది మహిళలు బాధితులుగా ఉన్నట్లు ఫోన్ కాల్‌డేటా ఆధారంగా తెలుస్తోంది. ఈ విషయంపై నల్లగొండ టూటౌన్ ఎస్సై నాగరాజును వివరణ కోరగా.. ఆ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసుల బృందం గాలిస్తున్నట్లు తెలిపారు. -
అయ్యో పాపం అబ్మాయి!
‘ప్రేమా మజాకా!’ అని మరోసారి అనిపించే సంఘటన ఇది. పంజాబ్‌కు చెందిన ఆంగ్రేజ్ సింగ్, పరమ్‌జిత్ కౌర్ ప్రేమికులు. కౌర్ ‘బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’ నిర్వహించే మల్టీ–పర్పస్ హెల్త్ వర్కర్స్ ఎగ్జామ్స్‌కు ప్రిపేరవుతుంది. అయితే తన ప్రియురాలు కష్టపడడాన్ని ఆంగ్రేజ్ సింగ్ తట్టుకోలేకపోయాడు. ‘నీ బదులు నేను ఎగ్జామ్ రాస్తాను. ఆ కష్టమేదో నేను పడతాను’ అంటూ రంగంలోకి దిగాడు. ఎగ్జామ్స్ ప్రిపరేషన్‌కు కష్టపడ్డాడో లేదో తెలియదుగానీ మీసాలు, గెడ్డాలు గీయించి, పెదాలకు లిపిస్టిక్ పూసి, సల్వర్ కమిజ్ వేసుకొని అచ్చం అమ్మాయిలాగే కనబడడానికి చాలానే కష్టపడ్డాడు. అయితే బయోమెట్రిక్ దగ్గర ఫింగర్‌ప్రింట్స్ ఫెయిల్ కావడంతో ఆంగ్రేజ్ సింగ్ పట్టుబడ్డాడు. దీంతో సోషల్ మీడియాలో ఆంగ్రేజ్సింగ్పై మీమ్సే మీమ్స్. అయ్యో పాపం అబ్మాయి! -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
మదనపల్లె : కులాంతర వివాహం చేసుకున్న ప్రేమికులు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ ఆదివారం తాలూకా పోలీసులను ఆశ్రయించారు. మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ తుమ్మల తాండాకు చెందిన శంకరనాయక్ కుమారుడు గణేష్‌నాయక్(22) తిరుపతిలో ఎంబీఏ చదువుతున్నాడు. శ్రీకాళహస్తికి చెందిన సుధాకర్‌గౌడ్ కుమార్తె గీతావాణి తిరుపతిలో ఎంసీఏ చదువుతోంది. ఈ క్రమంలో ఇద్దరూ రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే గీతావాణి తల్లిదండ్రులకు ప్రేమవివాహం ఇష్టం లేదు. దీంతో గీతావాణి రెండురోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి, ఆదివారం మదనపల్లెలోని ప్రియుడు గణేష్‌నాయక్ ఇంటికి వచ్చేసింది. ఇద్దరూ కలిసి పట్టణంలోని అయోధ్యనగర్ రామాలయంలో కులాంతర వివాహం చేసుకున్నారు. గీతారాణి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉంటుందని భయపడి తాలూకా పోలీసులను ఆశ్రయించి రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. ప్రేమికులిద్దరూ మేజర్లు కావడంతో రక్షణ కల్పించనున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఈ మెషిన్ తో ఒకే సారి ఆరు కప్పుల ఐస్‌క్రీమ్ తయారీ..
క్లైమేట్‌తో సంబంధం లేకుండా ఇష్టపడే రుచుల్లో ఐస్‌క్రీమ్ ఎవర్గ్రీన్! అలాంటి ఐస్‌క్రీమ్ లవర్స్‌కి ఈ మెషిన్ తెగ నచ్చుతుంది. ఎందుకంటే ఇది చాలా తక్కువ సమయంలో.. ఎక్కువ మోతాదులో ఫేవరెట్ ఫ్లేవర్ ఐస్‌క్రీమ్‌ని అందిస్తుంది. ఇది ఒక్కసారికి సుమారు ఆరు కప్పుల ఐస్‌క్రీమ్‌ని తయారు చేయగలదు. దీనిలోని సుపీరియర్ ఫంక్షన్స్ యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తాయి. ఇందులో రొటేటెడ్ లేడల్ (గరిటె) ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది. ఒకే కనెక్షన్‌తో రెండు గరిటెలుగా విడిపోయి.. లోపలున్న పదార్థాలను కలపడానికి సహకరిస్తుంది. ఇక దీని లోపల ఐస్‌క్రీమ్ స్పష్టంగా కనిపించడానికి ట్రాన్స్పరెంట్ మూత ఉంటుంది. ఈ మేకర్ని క్లీన్ చేసుకోవడం.. వినియోగించుకోవడం చాలా ఈజీ. (చదవండి: పురాతన ఆలయం కోతులకు ఆవాసం! ) -
భలే ముద్దుగున్నాయ్ చూడుర్రి.. పెట్ ఫ్యాన్స్‌కి పండగే!
-
ప్రపంచాన్ని తాకిన ‘వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్’ ఘుమఘుమలు
‘‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’’ ‘బొమ్మరిల్లు’ హాసిని చెప్పిన ఈ డైలాగ్.. కప్పు కాఫీ తాగుతూ, నాలుగు మాటలు మాట్లాడుకోవడంలోని మజాని తెలియజేస్తుంది. చాలామందికి పొద్దున్నే సూర్యుని కన్నా ముందుగా కాఫీ కనిపిస్తుంది. దానిని ఆస్వాదించిన తరువాతనే వారి దినచర్య మొదలవుతుంది. ఏది ఏమైనా కాఫీ సేవనం మనలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ఇటీవల బెంగళూరులో జరిగిన 5వ వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ (డబ్ల్యుసీసీ) ఘుమఘుమలు ప్రపంచాన్నంతటినీ తాకాయి. 2023 సెప్టెంబర్ 25 నుండి 28 వరకు బెంగళూరులోని ప్రసిద్ధ బెంగళూరు ప్యాలెస్‌లో వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ జరిగింది. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం, కాఫీ పరిశ్రమల సహకారంతో అంతర్జాతీయ కాఫీ సంస్థ (ఐసీఓ)ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ సదస్సును ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పలు సమావేశాలు, స్కిల్ బిల్డింగ్ వర్క్‌షాప్‌లు, స్టార్టప్ సమ్మిట్లు నిర్వహించారు. అలాగే పలు రకాల పోటీలు నిర్వహించి, విజేతలకు బహమతులు, అవార్డులు అందజేశారు. ప్రపంచ కాఫీ సమ్మేళనంలో 2400 మంది ప్రతినిధులు, 128 మంది స్పీకర్లు, 208 మంది ఎగ్జిబిటర్లు, 10 వేల మంది సందర్శకులు పాల్గొన్నారు. ప్రస్తుతం 60 దేశాల్లో కాఫీని పండిస్తుండగా, యూరప్, అమెరికా, జపాన్ తదితర దేశాలు ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద కాఫీ వినియోగదారుగా అమెరికా అగ్రస్థానంలో ఉండగా, భారీ కాఫీ ఉత్పత్తిదారుగా బ్రెజిల్ నిలిచింది. కాఫీని అధికంగా ఉత్పత్తి చేసే ఆరు దేశాల సరసన భారత్ కూడా చేరింది. ఇదికూడా చదవండి: క్షిపణి దాడుల మధ్య వార్ జోన్‌కు బైడెన్ ఎలా చేరారు? -
ఇద్దరు భర్తలను వదిలేసి, మూడో భర్తను చంపేసి, నాలుగో పెళ్లికి సిద్ధమై..
బీహార్‌లోని పట్నాలో గల ఫుల్వారీ షరీఫ్‌లో యూపీకి చెందిన యువకుని మృతి కేసును పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అత్తామామలు, భార్య కలిసి ఆ యువకుని గొంతు నొక్కి హత్యచేశారు. మృతుని భార్య అస్మెరీ ఖాతూన్ ఉరఫ్ మంజూ దేవికి గతంలోనే రెండుసార్లు పెళ్లిళ్లు జరిగాయి. మృతుడు సుభాష్ ప్రజాపతి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం తన వదిన ప్రస్తుతం మరొకరితో సంబంధం కలిగివుందని, అతనిని నాలుగో వివాహం చేసుకోవాలని భావిస్తున్నదని తెలిపారు. మృతుడు సుభాష్‌కు భార్య తీరు నచ్చకపోవడంతో ఆమెను నిలదీశాడు. దీంతో ఆమె సుభాష్‌ను హత్య చేసిందని మృతుని బంధువులు తెలిపారు. సుభాష్ రెండేళ్ల క్రితం అస్మెరీ ఖాతూన్‌ను వివాహం చేసుకున్నాడు. కాగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు మద్యానికి బానిస. భార్యతో తరచూ ఏదోఒక విషయమై గొడవ పడుతుండేవాడు. ఈ కారణంగానే హత్య జరిగింది. అస్మెరీకి గతంలోనే రెండు వివాహాలు జరిగాయి. ఆమె వారిని వదిలివేశాక మూడవసారి సుభాష్‌ను వివాహం చేసుకుంది. అస్మెరీకి అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుభాష్ సోదరుడు బ్రజేష్ మాట్లాడుతూ తన సోదరుని భార్య అస్మెరీ ఖాతూన్ ప్రస్తుతం మరో యువకునితో సంబంధం ఏర్పరుచుకున్నదని, ఈ సంగతి తెలిసిన తన సోదరుడు ఆమెను నిలదీశాడని తెలిపారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపధ్యంలో అస్మెరీ తన తల్లిదండ్రులతో కలసి సుభాష్‌ను గొంతునొక్కి చంపేశారని ఆరోపించాడు. ఈ ఉదంతం గురించి ఫుల్వారీ పోలీసు ఉన్నతాధికారి సఫిర్ ఆలం మాట్లాడుతూ సుభాష్ హత్య గురించి తమకు సమాచారం అందగానే తాము సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: ఆ ఒక్క జవాను.. పాక్ ఆశలను పటాపంచలు చేశాడు! -
లవర్స్ ఇంట్లో ఉండంగా..పేరెంట్స్ వచ్చారు..చివరకు ఏమి జరిగిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
-
ప్రేమకు రోగాలు అడ్డుకావని నిరూపించారు
తమిళనాడు: ప్రేమకు రోగాలు అడ్డుకావని వినీత –నిత్యానంద జంట నిరూపించారని ఎస్ఆర్ఎంసీ హృద్రోగ వైద్య నిపుణుడు తనికాచలం అన్నారు. తన ప్రియుడికి గుండె సమస్య ఉందని తెలిసినప్పటికీ ఏడేళ్లపాటు నిరీక్షించిన ప్రియురాలు వినీత కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. కడలూరు జిల్లా పలూరు గ్రామానికి చెందిన వినీత నిత్యానందను ప్రేమించింది. అతనికి హృద్రోగ సమస్య ఉందని తెలిసింది. అయినా ఆమె అధైర్యపడలేదు. ఓ వ్యక్తి దానం చేసిన గుండెను 2015లో నిత్యానందకు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించింది. ఏడేళ్ల తర్వాత పెద్దలను ఒప్పించి అతన్ని పెళ్లి చేసుకుంది. ప్రసుతం ఆ దంపతులు ఒక బిడ్డకు జన్మనిచ్చారు. గుండె ఆపరేషన్ తర్వాత అతను మామూలుగా సంసార జీవితాన్ని సాగించవచ్చని నిరూపించారని తనికాచలం తెలిపారు. హార్ట్ సర్జరీ స్పెషలిస్ట్ టి.పెరియస్వామితో కూడిన హృద్రోగ వైద్య బృందం నిత్యానంద, వినీత దంపతులను అభినందించారు. -
ప్రియుడు మరో యువతితో తిరుగుతున్నాడని...
మైసూరు: ప్రియుడు మోసం చేయడంతో యువతి ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంది. ఈ దుర్ఘటన మైసూరు జిల్లాలోని కేఆర్ నగర తాలూకాలోని గౌడెనహళ్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. నిసర్గ (20) అనే అమ్మాయి కేఆర్ నగరలో డిగ్రీ కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతోంది. ఈమె , సుమారు 4 సంవత్సరాల నుంచి ఇదే కాలేజీకి చెందిన సుహాస్ రెడ్డి అనే యువకుడు ప్రేమలో ఉన్నారు. సినిమాలకు, షికార్లకు తిరిగారు. మరో యువతితో తిరుగుతున్నాడని కొన్నిరోజులుగా ప్రియుడు పట్టించుకోక పోవడంతో పాటు మరో యువతితో కలిసి తిరగడం చూసిన నిసర్గ మోసపోయానని కుమిలిపోయింది. సుహాస్ రెడ్డి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు తమ ప్రేమ విషయం చెబితే వారు మందలించి పంపించారు. శనివారం ఇంట్లో డెత్‌నోట్ రాసిపెట్టి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తన మరణానికి సుహాస్ రెడ్డి, అతని తండ్రి గోపాలకృష్ణ కారణమని, వారికి కఠిన శిక్ష పడాలని లేఖలో రాసింది. కేఆర్ నగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలాండ్ మహిళకు తాళి కట్టనున్న జార్ఖండ్ యువకుడు!
పాకిస్తాన్‌కు చెందిన సీమా, యూపీకి చెందిన సచిన్ ప్రేమ కథ, అనంతర పరిణామాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా పోలాండ్ మహిళ బార్బరా, జార్ఖండ్ యువకుడు షాబాద్‌ల ప్రేమ కథ ఎంతో ఆసక్తి కలిగిస్తోంది. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోనున్నారు. ప్రియురాలు బార్బరా యూరోపియన్ దేశమైన పోలాండ్‌కు చెందినది. ప్రియుడు జార్ఖండ్‌లోని కటకంసాండీ బ్లాక్ పరిధిలోని బరతువా గ్రామానికి చెందినవాడు. వీరికి సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో 2021లో పరిచయం అయ్యింది. అది ప్రేమగా మారింది. అంతే.. ఆమె పోలాండ్ విడిచిపెట్టి తన ఆరేళ్ల కుమార్తె అనన్యతో పాటు బరతువా గ్రామానికి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె ప్రియుని ఇంటిలోనే ఉంటోంది. త్వరలో వీర్దిదరూ వివాహం చేసుకోనున్నారు. గ్రామంలో వీరి వివాహానికి సంబంధించిన సన్నాహాలు జోరందుకున్నాయి. బార్బరా కుమార్తె ఇప్పటి నుంచే షాబాద్‌ను డాడీ అని పిలుస్తోంది. తనకు భారత్ ఎంతో నచ్చిందని, తాను ఇక్కడికి రాగానే తనను స్థానికులు ఒక సెలబ్రిటీగా చూస్తున్నారని బార్బరాతెలిపింది. ఇది కూడా చదవండి: 36 ఏళ్లుగా అతనినే తండ్రి అనుకుంది.. తల్లి అసలు రహస్యం చెప్పగానే.. -
ఇచ్చట బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అద్దెకు లభించును!
టోక్యో: దేశంలో అత్యధికంగా ఉన్న ఒంటరి యువతీయువకులకు జపాన్ దేశం ఒక బంపర్ ఆఫర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒంటరిగా ఉన్న యువతీ యువకులు అద్దె చెల్లించి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ని సొంతం చేసుకోవచ్చు. పెళ్లికాని యువతీయువకుల ఆవేదనని అర్ధం చేసుకుంది జపాన్ ప్రభుత్వం. జీవితంలో ఎవ్వరి తోడులేక మొడుబారిన ఒంటరి వ్యక్తుల బ్రతుకుల్లో కొత్త ఆశలను చిగురించేలా చేసింది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా యువతీ యువకులు గంటల ప్రతిపాదికన సహచరులను ఎంపిక చేసుకునే బృహత్తర కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. దీంతో జపాన్ దేశంలో బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ లేనివారు ఎవరైనా అద్దెకు వారిని పొందవచ్చు. గంటకు రూ.3000 చెల్లించి బాయ్ ఫ్రెండ్ లేనివారు ప్రియుడిని గర్ల్ ఫ్రెండ్ లేని వారు ప్రియురాలిని సొంతం చేసుకోవచ్చు. ఎంచుకునే అభ్యర్థిని బట్టి అదనంగా మరో 1200 చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు సదరు ఆన్లైన్ పోర్టల్ నిర్వాహకులు. షిహో అనే ఒక ఆన్లైన్ గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుతూ ఈ సర్వీసును వినియోగించుకునే వారిలో అత్యధికులు వారి జీవితంలో ఎటువంటి తోడు లేనివారు, పెళ్లి కానీవారే. ఈ సేవలు వినియోగించుకునే వారు ఆన్లైన్ పార్ట్ నర్ కు ఎటువంటి ఖరీదైన కానుకలు ఇవ్వడానికి లేదు, డైరెక్టుగా మాట్లాడే అవకాశమూ లేదు. ఆన్లైన్ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ కావాలనుకునేవారు వీటితోపాటు అనేక నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సర్వీసు ఏదో బాగుంది కదూ. కేవలం బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కాదు, జపాన్ దేశంలో కుటుంబ సభ్యులు కావాలన్నా కూడా అద్దెకు దొరుకుతారట. ఇది కూడా చదవండి: సంప్రదాయం పేరిట సముద్రంలో దారుణం.. -
ప్రేమికులపై పోలీస్‌స్టేషన్‌లోనే దాడి.. ఎస్పీ కార్యాలయానికి పరుగులు
సాక్షి, గద్వాల: పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసు కున్న ఓ జంటపై యువతి కుటుంబీకులు పోలీస్ స్టేషన్లోనే దాడికి పాల్పడ్డ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. గద్వాలకు చెందిన ప్రశాంత్, మండలంలోని పూడూరుకు చెందిన శిరీష ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి ఇళ్లలో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ఇద్దరికీ వివాహం చేద్దామని యువతి తల్లిదండ్రులతో మాట్లాడగా.. ఇద్దరి కులాలు వేరు కావడంతో అభ్యంతరం చెప్పారు. దాంతో మేజర్లయిన ప్రేమికులు ఈ నెల 8న ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. 9న కర్నూలు జిల్లా పాలబుగ్గ సమీపంలోని ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇంటికి వచ్చేందుకు, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ గద్వాల రూరల్ పోలీస్‌స్టేషన్‌కు మంగళవారం చేరుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫర్నిచర్ ధ్వంసం పోలీసులు ఇరువురి కుటుంబసభ్యులను స్టేషన్‌కు పిలిపించి నచ్చజెప్పారు. అయితే యువతి కుటుంబసభ్యులు బలవంతంగా ఆమెను లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట జరగ్గా.. ఆమె కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లోని ఫర్నిచర్ ధ్వంసం చేసి యువకుడి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. పోలీసు సిబ్బంది అడ్డుకోగా.. వెంటనే రక్షణ కోసం సమీపంలోని ఎస్పీ కార్యాలయానికి రోడ్డు వెంట ఆ ప్రేమజంట పరుగులు తీసింది. ఎస్పీ సృజన వద్దకు వెళ్లి జరిగిన విషయం వివరించారు. వెంటనే ఎస్పీ ఆ ఇద్దరూ మేజర్లు కావడంతో వారికి రక్షణ కల్పించే బాధ్యత పోలీస్‌శాఖపై ఉందన్నారు. భవిష్యత్‌లో వారిపై దాడి చేయడం, అవమానపర్చడం, విడదీసే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఇరువురి కుటుంబ సభ్యులను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించారు. ఘటనపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. -
ఆలయంలో ప్రేమికులు చేసిన పనిని సమర్థించిన నటి
కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో ఒక యువతి తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. దానిని వారి యూట్యూబ్‌లో పెట్టారు. ఆ వీడియో వైరల్ కావడంతో.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆలయ సిబ్బంది పోలీసులను కోరారు. దీంతో ఉత్తరాఖండ్ పోలీసులు కూడా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అదే సమయంలో, ఈ జంటకు సినిమా కారిడార్ నుంచి మద్దతు లభించింది. బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఈ జంటకు తన మద్దతును అందించింది. (ఇదీ చదవండి: మహేష్ డాటర్ సితారకు ఇంత ఫేమ్ రావడానికి కారణం ఎవరో తెలుసా?) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ జంట ఫోటోతో పాటు ఇలా తెలిపారు. భక్తుడికి పవిత్రమైన ప్రదేశం దేవాలయం కాబట్టి వారి ప్రేమకు దేవుడి ఆశీర్వాదం కోరుకున్నారని రవీనా తెలిపింది. అంతేకాకుండా ప్రేమకు దేవుడు ఎప్పుడు వ్యతిరేకంగా మారాడో చెప్పాలని ప్రశ్నించింది. బహుశా అందరి మాదిరి పాశ్చాత్య మార్గంలో గులాబీలు, కొవ్వొత్తులు, చాక్లెట్, రింగులు ఇచ్చి తమ ప్రేమను తెలపడమే మంచిదని భావిస్తున్నారా? అని పేర్కొంది. నిజంగా ఇది బాధాకరం. తమ ప్రేమ సఫలం కావడానికి దేవుడి ఆశీస్సులు కావాలని కోరుకున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో చెప్పాలని రవీనా కోరింది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్-కె' నుంచి బిగ్ అనౌన్స్మెంట్..!) ఇటీవల కేదార్నాథ్ ఆలయం సమీపంలో తన ప్రియుడితో కలిసి కనిపించిన మహిళా యూట్యూబర్ ఈ వీడియోను చిత్రీకరించింది. ఆమె మోకాళ్లపై నిల్చోని తన ప్రియుడికి ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేసింది. ఈ వీడియో కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, కొందరు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పరమ శివుడి ముందే పరాచకాలా అంటూ పలువురు ఈ జంటపై మండిపడుతున్నారు. ఇక నుంచి ఆలయ ప్రాంగణంలో మొబైల్ బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో, బద్రీ-కేదార్నాథ్ ఆలయ కమిటీ కూడా ఈ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మరీ పోలీసుల ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది. -
నోరూరించే నూడుల్స్‌పై చిరు కప్పలు.. లొట్టలేసుకుంటూ తింటున్న జనం!
మనదేశంలో తయారయ్యే ఫాస్ట్‌ఫుడ్‌లలో అత్యధికంగా అమ్ముడయ్యే ఆహారం నూడుల్స్. దేశంలో ఏ మూల చూసినా నూడుల్స్ దుకాణాలు కనిపిస్తాయి. అయితే ఇటీవలికాలంలో తైవాన్‌లో నూడుల్స్‌తో రూపొందించిన ఒక డిష్ ఎంతో ఆదరణ పొందుతోంది. ప్రపంచంలో రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు అక్కడి ఆహారాలలో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. ఆహార ప్రియులు అన్ని రకాల ఆహారాలను ఆస్వాదించేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. అటు మాంసాహారులు, ఇటు శాకాహారులు తమకు అనువైన వంటకాల కోసం వెదుకుతుంటారు. కొన్ని దేశాల్లో పురుగులు, కీటకాలు, కప్పలు ఆహారంలో భాగంగా మారిపోయాయి. కొన్ని ఆహారాలు ఎంత వింతగా ఉంటాయంటే వాటి గురించి వినగానే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి విచిత్రమైన ఒక డిష్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిరు కప్పలతో నోరూరించే నూడుల్స్.. తైవాన్‌లో ఇటీవలికాలంలో కప్పల నూడుల్స్ ఎంతో ఆదరణ పొందుతోంది. ఆహార ప్రియులు ఈ నూడుల్స్‌ను తెగ ఎంజాయ్ చేస్తూ లాగించేస్తున్నారు. నోరూరించే వేడివేడి నూడుల్స్‌పై చిరు కప్పలను ఉంచి, సర్వ్ చేయడం ఈ డిష్ ప్రత్యేకత. కప్పలను ఉడికించి, మసాలా దట్టించి.. ఆడిటీ సెంట్రల్ న్యూస్ అందించిన ఒక రిపోర్టు ప్రకారం తైవాన్‌లోని యున్‌లిన్‌లో యువాన్ రమెన్ అనే రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్లో కప్పల నూడుల్స్‌ను ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఈ డిష్ ప్రత్యేకత ఏమిటంటే గార్నిషింగ్‌లో కప్పలను వినియోగిస్తారు. ఇందుకోసం కప్పలను ముందుగా బాగా ఉడికించి, వాటికి మసాలా దట్టించి, నూనెలో దోరగా వేయిస్తారు. ఈ డిష్ పేరు ఏమిటంటే.. నూడుల్స్‌పై అప్పటికే మసాలా దట్టించి సిద్ధం చేసిన కప్పలను గార్నిషింగ్ చేస్తారు. కప్పల పైచర్మాన్ని తీయకుండానే ఇందుకోసం వినియోగిస్తారు. సోషల్ మీడియా యూజర్స్ ఈ డిష్‌కు ‘ఫ్రాగ్, ఫ్రాగ్, ఫ్రాగ్ రమెన్’ అనే పేరు పెట్టారు. ధర ఎంతంటే.. మీడియాకు అందిన సమాచారం ప్రకారం రమెన్ రెస్టారెంట్లో ఈ డిష్‌ను కేవలం మంగళవారం, బుధవారం రాత్రి డిన్నర్ సమయాలలో మాత్రమే వడ్డిస్తారు. ఈ విచిత్రమైన డిష్ ఖరీదు 8 అమెరికన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ. 650. రెస్టారెంట్‌కు వెళ్లిన ఎవరైనా ఈ డిష్‌కు ఫొటో తీసుకోవాలనుకంటే 3.2 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ డిష్‌ను అక్కడి ఆహార ప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు. ఇది కూడా చదవండి: చైనాలో మరో అద్భుతం: బిల్డింగ్ మధ్య నుంచి దూసుకుపోయే రైలు.. -
రోడ్డుపై లవర్స్ రొమాంటిక్ వీడియో.. కేసుపై పోలీసుల తంట..!
రోడ్డుపై లవర్స్ రొమాంటిక్ వీడియో రెండు పోలీసు స్టేషన్ల మధ్య గొడవ తెచ్చిపెట్టింది. ఆ ఘటన తమ పరిధిలోది కాదంటే తమది కాదంటూ కొట్టిపారేస్తున్నారు పోలీసు అధికారులు. ఇంతకూ ఆ వీడియోలో ఏముంది? ఎందుకు అది వివాదాస్పదమైందంటే..? వీడియోలో బ్రిడ్జ్‌పై ఓ జంట బైక్‌పై వెళుతోంది. అబ్బాయి బైక్ నడుపుతుండగా.. అతనికి ముందుభాగంలో వ్యతిరేక దిశలో హత్తుకుని కూర్చుంది అమ్మాయి. తేదీ వివరాలు లేని ఈ వీడియో నిరాలనగర్ ఫ్లై ఓవర్‌పై జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపించట్లేదు. ముఖాల ఆధారంగా నిందితులను గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈ ఘటన తమ పరిధిలోది కాదని అలీగంజ్, గోమతీ నగర్ పోలీసు స్టేషన్ అధికారులు విభేదించుకుంటున్నారు. గోమతీ నగర్‌కు సమీపంలో ఘటన జరిగినట్లు తెలుస్తోందని అలీగంజ్ స్టేషన్ అధికారి నగేష్ కుమార్ ఉపాధ్యాయ అన్నారు. వీడియోలో కనిపించిన బ్రిడ్జ్ గోమతీ నగర్‌కు సమీపంలోనిది కాదని, అక్కడ వీడియోలు రికార్డ్ చేసే అవకాశమే లేదని స్థానిక స్టేషన్ అధికారి కొట్టిపారేస్తున్నారు. కాగా ఇలాంటి వీడియోనే కొన్ని రోజుల క్రితం హజ్రత్ గంజ్ ప్రాంతంలో జరిగింది. నిందితులను కూడా గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు. -
హోటల్ గదిలో ప్రియురాలిని దారుణంగా హతమార్చిన ప్రియుడు.. తరువాత ఏం చేశాడంటే...
ఉత్తరప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఒక ప్రేమికుడు పెళ్లయిన తన ప్రియురాలిని దారుణంగా హతమార్చడమే కాకుండా క్షణికావేశంలో మరో పని కూడా చేశాడు. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లోగల ఒక హోటల్లో ఒక యువకుడు తన ప్రియురాలిని హతమార్చడమే కాకుండా తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ యువకుడు తాను ఆత్మహత్య చేసుకునే ముందు ఆ ప్రియురాలి భర్తకు వీడియో కాల్ చేసి, ఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేశాడు. ఈ సమాచారం అందుకోగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ రెండు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యువకుడు తన ప్రియురాలిని తీసుకుని ఆదివారం ఉదయం కదరాబాద్‌లోని ఒక హోటల్‌కు చేరుకున్నాడు. వారిద్దరూ ఒక రూమ్ బుక్ చేసుకున్నారు. ఆ తరువాత జరిగిన ఉదంతం గురించి ఆ యువతి భర్త మాట్లాడుతూ.. తన భార్య మధు(22)ను హోటల్ గదిలో ఆమె ప్రియుడు హిమాంశు(20) హత్య చేశాడని తెలిపారు. ఈ సందర్భంగా హోటల్ సిబ్బంది మాట్లాడుతూ తాము ఆ గదిలోకి చూసి హడలిపోయామన్నారు. గదిలో బెడ్ మీద మధు మృతదేహం పడివుండగా, హిమాంశు ఫ్యానుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడన్నారు. వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు ఈ సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా మృతురాలి భర్త పోలీసులతో మాట్లాడుతూ హిమాంశు తన భార్య మధును హత్య చేశాడని తెలిపారు. ఈ సమాచారం తెలియగానే మృతుల కుటుంబీకులు, బంధువులు హోటల్‌కు చేరుకున్నారు. కాగా మధుకు కొన్నేళ్ల క్రితం హిమాంశు ఉంటున్న గ్రామంలోని మరో యువకునితో వివాహం జరిగింది. తరువాత మధు, హిమాంశు మధ్య సంబంధం ఏర్పడింది. అయితే కొంతకాలం తరువాత మధు భర్త మృతి చెందాడు. అయితే మధు కుటుంబీకులు వెంటనే ఆమెకు మరో యువకునితో వివాహం జరిపించారు. ఆ తరువాత కూడా మధు, హింమాశు మధ్య సంబంధం కొనసాగింది. ఇప్పుడు వారిద్దరి మృతదేహాలు హోటల్లో లభ్యమయ్యాయి. -
ప్రియురాలినే ఎరగా వేసి.. ప్రతీకార హత్య!
క్రైమ్: ఆ ఇద్దరికీ పాత గొడవలు ఉన్నాయి. అది మనసు పెట్టుకుని ఎలాగైనా చంపాలని ప్లాన్ చేశాడు శిబిల్. అందుకు తన ప్రియురాలినే ఎరగా ఉపయోగించాడు. హనీట్రాప్ ద్వారా ప్రత్యర్థిని రప్పించి.. అత్యంత కిరాతకంగా హతమార్చాడు. కేరళలో సంచలనం సృష్టించిన రంజిపాలెం మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. శుక్రవారం అట్టప్పడి వద్ద అనుమానాస్పద రీతిలో పడి ఉన్న రెండు ట్రాలీ బ్యాగ్‌లు పోలీసుల దృష్టికి వచ్చాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా.. మనిషి శరీరం ముక్కలు కనిపించాయి. దీంతో ఆ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదే సమయంలో.. త్రిస్సూర్ చెరుతుర్తి వద్ద ఓ హోండా సిటీ కారును వదిలేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ కారుకు.. అటవీ ప్రాంతంలో దొరికిన ట్రాలీ బ్యాగులకు ఏదైనా కనెక్షన్ ఉందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. చివరకు.. ఆ కేసు ప్రతీకార హత్యగా తేలుస్తూ చిక్కుముడిని విప్పారు. మల్లప్పురం తిరూర్‌కు చెందిన సిద్ధిఖ్(58) ఐదేళ్ల కిందట గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చాడు. రంజిపాలెంలో ఓ హోటల్ నడుపుతూ స్థిరపడ్డాడు. అందులో శిబిల్(22) మేనేజర్‌గా పని చేసేవాడు. అయితే తన హోటల్ పేరుతో శిబిల్ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడనే విషయం సిద్ధిఖ్ దృష్టికి వచ్చింది. దీంతో.. అతన్ని ఉద్యోగంలోంచి తీసేశాడు సిద్ధిఖ్. ఈ పరిణామంతో శిబిల్ కోపంతో రగిలిపోయాడు. మరో స్నేహితుడితో కలిసి సిద్ధిఖ్ అంతుచూడాలని అనుకున్నాడు. అందుకు తన ప్రియురాలు ఫర్హానా(18)ను సాయం చేయమని కోరాడు. ఫర్హానా సిద్ధిఖ్‌తో ఫోన్ ద్వారా పరిచయం పెంచుకుంది. చివరకు.. శారీరక సుఖం అందిస్తానని, ఎర్హనిపాలెంలోని ఓ హోటల్‌కు రావాలంటూ కబురు పంపింది. మే 18వ తేదీన హోటల్ వద్దకు సిద్ధిఖ్ చేరుకున్నాడు. గదిలోకి వెళ్లిన అతన్ని.. శిబిల్, ఫర్హానా కలిసి హతమార్చారు. చంపేశాక ఆ బాడీని ముక్కలు ముక్కలు చేసి.. రెండు ట్రాలీ బ్యాగుల్లో కుక్కేసింది ఆ ప్రేమ జంట. ఆపై మరో స్నేహితుడి సాయంతో ఆ ట్రాలీ బ్యాగులను సిద్ధిఖ్ కారులోనే తీసుకెళ్లి అట్టప్పడి వద్ద పడేసి వెళ్లిపోయారు. తండ్రి కనిపించకుండా పోవడంతో.. విదేశాల నుంచి తిరిగొచ్చాడు కొడుకు. నాలుగు రోజుల తర్వాత అంటే మే 22వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు ఫైల్ చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. రెండు రోజులకే సిద్ధిఖీ అకౌంట్ నుంచి ఏటీఎం కార్డు ద్వారా భారీగా నగదు విత్‌డ్రా అయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈలోపు ట్రాలీ బ్యాగులో మృతదేహం బయటపడడం.. అది సిద్ధిఖీదేనని పోలీసులు నిర్ధారించుకోవడం జరిగిపోయాయి. డబ్బు విత్‌డ్రా అయిన ప్రాంతం గురించి పోలీసులు ఎంక్వైయిరీ చేయగా.. చెన్నై నుంచి ఆ డబ్బు విత్ డ్రా అయినట్లు తేలింది. దీంతో చెన్నై పోలీసుల సాయం కోరగా.. వాళ్లు శిబిల్, ఫర్హానాను అదుపులోకి తీసుకుని కేరళ పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు అషిఖ్‌ను సైతం కస్టడీలోకి తీసుకున్నారు. -
'ది కేరళ స్టోరీ' సినిమా చూసొచ్చి.. బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టిన మహిళ
ది కేరళ స్టోరీ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఎట్టకేలకు ఏదోలా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఏదో ఒక నెపంతో సినిమా బ్యాన్ చేయడం, థియేటర్ల ప్రదర్శించకుండా నిషేధించడం వంటి కష్టాలు చుట్టుముట్టాయి. అయినప్పటికీ ఆ సినిమా ఐ డేంట్ కేర్ అంటూ మంచి కలెక్షన్లు రాబడుతూ ప్రభంజన సృష్టించింది. ఐతే తాజాగా ఈ సినిమా ఓ ప్రేమ జంట నడుమ చిచ్చు పెట్టి..పోలీసు కేసులు పెట్టుకునేంత వరకు వెళ్లింది. ఏం జరిగిందంటే..పోలీసులు తెలిపన కథనం ప్రకారం..మధ్యప్రదేశ్ ఇండోర్‌లో 23 ఏళ్ల వ్యక్తిని పోలీసులు ఓ మహిళ ఫిర్యాదుపై అరెస్టు చేశారు. వారిద్దరు ఇటీవలే ది కేరళ స్టోరీ చూశారు. ఏమైదో ఏమో ఆ సినమా చూసొచ్చాక ఒక్కసారిగా ఆమెలో చైతన్యం కట్టుతెంచుకుంది. తనను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, అత్యాచారం చేశాడంటూ బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టింది. ప్రస్తుతం అతనితో కలిసి జీవిస్తున్నట్లు పేర్కొంది సదరు మహిళ. తనను మతం మారాలని మానసికంగా ఏడిపిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేశారు. ఇటీవలే తాము ది కేరళ స్టోరీ సినిమా చూశామని, ఆ తర్వాత తమ మధ్య వాగ్వాదం తలెత్తిందని పోలీసులకు తెలిపింది. తదనంతరం తనపై దాడి చేసి పరారయ్యాడని వాపోయింది సదరు మహిళ. ఈ మేరుకు ఆమె 19న పోలీసులను ఆశ్రయించి బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టినట్లు తెలిపారు పోలీసులు. కాగా, నిందితుడు 12వ తరగతి చదువుకున్న నిరుద్యోగి కాగా, బాధిత మహిళ ఉన్నత విద్యావంతురాలు, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. నాలుగేళ్లక్రితం కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు ఆ వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు పోలీసు అధికారి దినేష్ వర్మ పేర్కొన్నారు. తాము ఆరోపణలను క్షణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. (చదవండి: రూ.2 వేల నోట్లు వెనక్కి.. ఏ పత్రాలు అవసరం లేదు.. కేంద్రం తెలివి తక్కువ పని.. చిదంబరం సెటైర్లు) -
పెళ్లయి విడాకులు.. కలిసి బతకలేమని.. కడకు ఊపిరి తీసుకుని..
హైదరాబాద్: కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో ఓ యువతి, యువకుడి ఆత్మహత్య విషాదాన్ని నింపింది. ఇద్దరి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్‌లో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. సీఐ కిషన్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలోని గొల్లవానితిప్ప గ్రామానికి చెందిన ఆకుల శ్యామ్ (24), పోతుల జ్యోతి (22) సమీప బంధువులు. మూడేళ్ల క్రితం జ్యోతికి వివాహమైంది. కొద్ది రోజులకే భర్త నుంచి ఆమె విడిపోయింది. ఈ క్రమంలో గత నెల జ్యోతి నగరానికి వచ్చి కూకట్‌పల్లిలోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. జ్యోతికి శ్యామ్‌తో అప్పటికే స్నేహం, ప్రేమ నేపథ్యంలో అతను కూడా ఇటీవల నగరానికి వచ్చాడు. కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలోని 7వ ఫేజ్ ఎల్ఐజీ గృహంలో ఉంటున్నాడు. స్నేహితుడి ఇంటి తాళాలు తీసుకుని.. శ్యామ్ స్నేహితుడు వంశీకి ఈ నెల 20న వివాహ నిశి్చతార్థం ఉండటంతో 9న ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లాడు. శుక్రవారం వంశీ ఇంట్లో లేకపోవటంతో శ్యామ్ అతనికి ఫోన్ చేసి ఇంటి తాళాలు తీసుకున్నాడు. అనంతరం హాస్టల్లో ఉంటున్న జ్యోతిని ఇదే ఇంటికి పిలిపించుకున్నాడు. ఇద్దరి నడుమ గత ప్రేమానుబంధాలతో పాటు ఇరు కుటుంబ పెద్దల వ్యతిరేకత నేపథ్యంలో కలిసి బతకలేమనుకున్నారు. దీంతో శ్యామ్ ఉరి వేసుకొని, జ్యోతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో.. మాదాపూర్‌లో ఉంటున్న జ్యోతి సోదరుడు ఆమెకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవటంతో హాస్టల్‌కు వచ్చి చూశాడు. హాస్టల్లో జ్యోతి లేకపోవటంతో కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని స్నేహితుడైన వంశీ ఇంటికి వెళ్లి చూడగా తలుపులు లోపల నుంచి గడియ పెట్టి ఉంది. ఇంట్లోంచి దుర్వాసన రావటంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపు గడియ పగుల గొట్టి లోనికి వెళ్లి చూడగా గదిలో శ్యామ్ ఉరివేసుకొని, జ్యోతి పురుగుల మందు తాగి విగతజీవులుగా కనిపించారు. ఇరువురి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
అంతా బిల్డప్.. అందుకే బ్రేకప్!: తొలి ఏడాదిలోనే 70 శాతం జంటలు కటీఫ్
ఏడాది తర్వాత దాపరికాలు బహిర్గతమవుతాయి. వారి అలవాట్లు బయటపడతాయి. ప్రేమికులు వాస్తవ ప్రపంచంలోకి వస్తారు. తమ పాత అలవాట్లు వెల్లడవుతాయి. దాంతో వారు ఇంతకు ముందు సహించిన విషయాలతో విభేదించడం ప్రారంభిస్తారు. ప్రేమలో ఉన్నప్పుడు వ్యక్తి ఎంత నిజాయితీగా ఉన్నారో తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఒకటీ రెండు పుట్టిన రోజుల తర్వాత తన పట్ల ఉదారంగా లేరని గ్రహించి ప్రేమికులు బ్రేకప్‌లు చెప్పుకొంటున్నారు.. – డేవిడ్ మెక్క్యాండ్లెస్, సామాజిక శాస్త్రవేత్త సాక్షి, అమరావతి: రోజ్– జాక్ ప్రేమించుకున్నారు. ఒకరికోసం ఒకరు అన్నట్టుగా ఉండేవారు. కాలేజీలో, బయట ఆ జంట గురించే చర్చ. ప్రేమికులంటే అలా ఉండాలని అందరూ చెప్పుకొనేవారు. ఏడాది గడిచింది. అదే జాక్– రోజ్.. జాక్ ఎదురుపడితే రోజ్ మొహం తిప్పుకొంటోంది. అతడూ తక్కువేం కాదు. ఆమెను చూడగానే గుడ్లురిమి చూస్తున్నాడు. ఒకరి కోసం ఒకరుగా ఉన్న జంట.. ఇప్పుడు ఉప్పు–నిప్పులా మారిపోయింది. ఎందుకిలా జరిగిందని అడిగితే ‘నిజం తెలిసింది’ అన్నది ఇద్దరి సమాధానం. యూఎస్, యూరప్ దేశాల్లోని ప్రేమ జంటల్లో 75 శాతం మొదటి సంవత్సరంలోనే విడిపోతున్నాయి. 20–25 శాతం మంది మాత్రం తమ ప్రేమను నాలుగైదేళ్ల పాటు కాపాడుకుంటున్నారు. పదేళ్ల పాటు కలిసున్న జంటలు చాలా అరుదు అని సామాజిక, మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎంతో గాఢంగా ప్రేమించుకున్నవారు ఒకటి లేదా రెండేళ్లలోనే ఎందుకు విడిపోతున్నారు? కారణాలేంటి? అన్న అంశాలపై స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సోషియాలజిస్ట్ మైఖేల్ రోసెన్ఫెల్డ్, మానసిక చికిత్స నిపుణుడు డాక్టర్ బార్టన్ గ్లాడ్స్మిత్లు వేర్వేరుగా సుదీర్ఘకాలం అధ్యయనం చేశారు. వీరు 2009 నుంచి 2022 వరకు దాదాపు 3000 జంటలపై చేసిన పరిశోధనల్లో విడిపోయేందుకు కీలకంగా మారిన అంశాలను గుర్తించారు. మొదట్లో భాగస్వామి కోరుకున్నట్టుగా.. ప్రేమలో పడినప్పుడు తమ వ్యక్తిత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎవరూ చూపరు. తన భాగస్వామి ఏం చూడాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే చూపిస్తారు. ఒక విధంగా ఇది ‘నటన’తో కూడి ఉంటుందని మైఖేల్ పేర్కొన్నారు. ‘ప్రేమ భావాలు మెదడులోని క్లిష్టమైన ఆలోచనలను నియంత్రిస్తాయి కాబట్టి.. మనం ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉన్నప్పుడు వారి ప్రవర్తన లేదా వ్యక్తిత్వాన్ని లోతుగా అంచనా వేయాల్సిన అవసరం లేదన్నట్టుగా ప్రేమికుల మెదడు నిర్ణయిస్తుంది. అందువల్ల తొలినాళ్లల్లో ప్రేమికుల వ్యక్తిత్వం వాస్తవానికి భిన్నంగా ఉంటుందంటున్నారు. ఏడాది గడిచాక దాచిపెట్టిన వ్యక్తిత్వం బయటపడుతుంది.. ఆ సమయంలోనే విడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రేమికుల రోజు, వసంతకాలం, ఏప్రిల్ ఫూల్స్ డే, వేసవి సెలవులు, క్రిస్మస్, క్రిస్మస్ రోజుకు రెండు వారాల ముందు, సోమవారాల్లో బ్రేకప్‌లు తరచుగా జరుగుతున్నాయని మరో సామాజిక శాస్త్రవేత్త డేవిడ్ మెక్క్యాండ్లెస్ తేల్చారు. 5 నుంచి 10 శాతం జంటలే పెళ్లివరకూ.. ప్రేమపై భారతీయ యువతీ యువకుల అభిప్రాయాలు తెలు సుకునేందుకు సోషల్ నెట్వర్క్ యాప్ ‘బంబుల్’ సర్వే చేపట్టింది. దీనిప్రకారం వయసు, విద్య, సామాజిక నేపథ్యం, సాంస్కృతిక వ్యత్యాసాలు, ఆరి్థక స్థిరత్వం వంటి అంశాలకు యువత అధిక ప్రాధాన్యం ఇచ్చిందని వెల్లడించింది. వీటిని దాటుకుని ముందుకు సాగడం తమవల్ల కాదని 35 శాతం మంది యువకులు గర్ల్‌ఫ్రెండ్ అనే మాటకు దూరంగా ఉన్నారు. దాదాపు 50–55 శాతం మంది ‘జస్ట్ ఫ్రెండ్స్’గానే ఉన్నామని వెల్లడించారు. ప్రేమించుకున్న జంటల్లో కేవలం 5 నుంచి 10 శాతం మాత్ర మే పెళ్లి వరకూ వెళుతున్నట్టు వెల్లడైంది. దాచాలన్నా దాగవులే.. ప్రేమించిన తొలినాళ్లల్లో తమలో ఉన్న చెడు ప్రవర్తనలు దాచిపెట్టి ఎదుటి వారు కోరుకున్నట్టు ఉన్న వ్యక్తులు.. ఏడాది లోపే బయటపడిపోతున్నారట. పాత ప్రవర్తనలు ధూమపానం, మద్యపానం, పొగాకు నమలడం వంటివి ఎదుటి వారికి ఇబ్బందిగా మారడం.. వాటిని మానుకోమని చెప్పడంతో మొదలయ్యే ఘర్షణ బ్రేకప్‌కు దారితీస్తుందని గుర్తించారు. ముఖ్యంగా చెడు ప్రవర్తనతో పాటు, మోసం, అధిక కోపం, ఎదుటివారికి అవసరంలో అండగా ఉండకపోవడం, చెడు సావాసాలు, భాగస్వామి పట్ల నిర్లక్ష్యం, అబద్ధాలు చెప్పడం, కష్టంలో ఉన్నప్పుడు, బయటకు వెళ్లినప్పుడు వదిలేసి పోవడం, ఏదైనా విషయాన్ని సరిగా చెప్పకపోవడం వంటివి జంటల మధ్య బీటలుగా మారుతున్నాయని తేల్చారు. వీటిలో ఏ ఒక్క లక్షణం ఉన్నా జంటల మధ్య మంట తప్పదని స్పష్టం చేశారు. -
మెట్రోలో లవర్స్ పాడుపని.. ట్రెండింగ్‌లో వీడియోలు
సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు బరితెగిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పిచ్చి చేష్టలతో రెచ్చిపోతున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందన్న సోయి లేకుండా హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. బస్సు, మెట్రో, విమానం, రైల్లో ఆకతాయిల ఆగడాలు ఈమధ్య ఎక్కువై పోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో అసాంఘిక కార్యక్రమాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. పాపులర్ కావాలని చేస్తున్నారా? లేక పొరపాటుగా అలా జరిగిపోతోందా? తెలియదుగానీ మెట్రో పరువైతే బజారున పడే పరిస్థితి దాపురించింది. ఈ క్రమంలో ట్విటర్లో #DelhiMetro హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. గతంలో కొందరు ప్రేమికులు మెట్రోలో పబ్లిక్ ముందే ముద్దులు పెట్టుకుంటూ ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలిసిందే. మరో వ్యక్తి మెట్రో రైలు కోచ్‌లో బనియన్, టవల్‌తో దర్శనమిచ్చాడు. ఇది మరవకముందే మరో జంట సిగ్గు విడిచి లిప్ కిస్ ఇచ్చుకున్నారు. నిన్న కాక మొన్న ఓ యువతి బికినీ ధరించి మెట్రోలో ప్రయాణించింది. ఈ వీడియోలన్నీ నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టాయి. అయితే వరుస సంఘటనలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు ట్విటర్లో షేర్ చేస్తూ ఫిర్యాదు చేస్తున్నారు. పబ్లిక్ ప్లేసెస్‌లో ఇలాంటి పనులేంటని ప్రశ్నిస్తూ.. వీటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. #DelhiMetro హాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో గళమెత్తుతున్నారు. कल से सिर्फ Delhi Metro में ही travel करूंगा !!!!!! pic.twitter.com/l228ZEao1q — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) April 3, 2023 View this post on Instagram A post shared by 🇮🇳मोहित गौहर 🇮🇳 (@mohitgauhar) Another video of Delhi Metro. If this is an example of WOMEN EMPOWERMENT, then alas our young generation GIRLS can be victim of such EMPOWERMENT 🤦♂️ And this is exactly what SHAMELESS FEMINISTS want. I would call it CULTURAL GEN*CIDE.#delhimetro @OfficialDMRC pic.twitter.com/BrmjBQ3u32 — Barkha Trehan 🇮🇳 / बरखा त्रेहन (@barkhatrehan16) March 31, 2023 -
కొండమీద నుంచి దూకిన ప్రేమజంట
దొడ్డబళ్లాపురం: రామనగర తాలూకాలోని రామదేవరకొండ మీద ఆత్మహత్యాయత్నం చేసిన ప్రేమికులను పోలీసులు రక్షించారు. బెంగళూరు ఆర్ఎన్ శెట్టి కళాశాలలో ప్రథమ బీఈ విద్యార్థి చేతన్ (19), ఇదే కళాశాలలో ప్రథమ బీకాం చదువుతున్న విద్యార్థిని (19) శనివారం ఉదయం 11 గంటల సమయంలో కొండమీద నుంచి కిందకి దూకారు. అయితే అక్కడే చెట్లు, పొదల మధ్య చిక్కుకుని గాయాలపాలయ్యారు. కాపాడాలని కేకలు వేస్తుండగా కొందరు గమనించి రామనగర రూరల్ పోలీసులకు కాల్చేశారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని 3 గంటలపాటు శ్రమించి ప్రేమికులను కిందకు తీసుకువచ్చారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని వారు కొండ మీద నుంచి దూకారు. గాయపడ్డ ఇద్దరినీ రాజరాజేశ్వరి ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
కొండపైనుంచి దూకిన ప్రేమ జంట.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదని..
ముంబై: ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే. ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. కలిసి జీవిద్దామనుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. అయితే వారు మాత్రం వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రేమ జంట.. కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. జీవితంలో కలిసి జీవించలేకపోతున్నామని చావులో ఒక్కటైంది. మహారాష్ట్ర ముంబైలోని కందివాలి ఈస్ట్ జనుపాద ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు ఆకాశ్ ఝాటె కాగా.. అతడు ప్రేమించిన అమ్మాయి 16 ఏళ్ల విద్యార్థిని. ఆకాశ్ హౌస్ కీపర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రోజు నేను వెళ్లిపోతున్నా.. ఎప్పటికీ తిరిగిరాను అని తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టాడు. అదే రోజు అతని ప్రేయసి కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత కొన్నిగంటలకే సమతా నగర్ ప్రాంతంలోని ఓ కొండపై నుంచి దూకి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు అక్కడకు వెళ్లి చూడగా.. ఈ ప్రేమ జంటే విగతజీవులుగా కన్పించారు. దీంతో పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: సుమేధా శర్మ హత్య.. విషమంగా ప్రియుడి పరిస్థితి?.. బజరంగ్ దళ్ నిరసనలు -
హవ్వా! రోడ్డు మీద ఇదేం పని.. హద్దులు మీరిన ప్రేమ జంట
సమాజంలో నివసిస్తున్నప్పుడు కొన్ని నియమాలు నిబంధనలు, కట్టుబాట్లు ఉంటాయి. వాటిని అనుసరిస్తూ ప్రజలు జీవితం సాగించాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఇవేమి తమకు పట్టవంటూ విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ నలుగురిలో నవ్వులు పాలవతుంటారు. తాజాగా ఓ ప్రేమికులు బైక్‌పై ప్రయాణిస్తూ రోడ్డు మీద హద్దులు మీరి ప్రవర్తించిన వింత ఘటన రాజస్థాన్‌లో జైపూర్‌లో చోటచేసుకుంది. ఆ వీడియోలో.. హోలీ జరుపుకున్న అనంతరం ఓ జంట బైక్‌పై రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కింది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చొన్న లవర్.. ప్రేమికుడిని హగ్ చేసుకోని కూర్చుని రోడ్డుపై ప్రయాణిస్తూ ఉంది. దీనంతటిని వెనుక కారులో ఉన్న ఓ వ్యక్తి రికార్డు చేస్తున్నాడు. ఇదంతా తెలిసినా ఆ జంట ఏ మాత్రం భయపడకుండా వారి పనిలో వారు ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ జంట ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు. వాహనదారుడి నిర్లక్ష్యం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు ట్రాఫిక్ పోలీసులు మార్చి 7న మోటారు వాహనాల చట్టం 1988, రాజస్థాన్ మోటారు వాహనాల చట్టం 1990 ప్రకారం మోటారుబైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ జంటకు రూ. 5,000 జరిమానా కూడా విధించారు పోలీసులు. -
పురుగుల మందు తాగి.. చెట్టుకు ఉరేసుకుని..
చందంపేట: తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరన్న భయంతో ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆపై చెట్టుకు ఉరేసుకున్న ఘటన నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలిలా.. దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామానికి చెందిన అందుగుల భిక్షమయ్య, మార్తమ్మ దంపతుల కుమారుడు రాకేశ్(20) డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేసి కూలి పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. కొండమల్లేపల్లి మండలం దోనియాల గ్రామానికి చెందిన వరికుప్పల కృష్ణయ్య, జయమ్మ దంపతుల కుమార్తె దేవి(16) దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇంటర్ చదువుతోంది. దేవి గతేడాది చింతపల్లి మండల పరిధిలోని మోడల్ స్కూల్లో పదోతరగతి చదువుతున్న సమయంలో రాకేశ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇటీవల ఇరువురూ తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో రాకేశ్ కుటుంబసభ్యులు సానుకూలంగా ఉండగా దేవి తరఫు బంధువులు నిరాకరించారు. ఈ క్రమంలో దేవి ఆదివారం రాకేశ్‌కు ఫోన్ చేసి తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, నేను వేరొకరిని పెళ్లి చేసుకుని బతకలేనని, వచ్చి తీసుకెళ్లాల్సిందిగా కోరింది. దీంతో రాకేశ్ అదే రోజు ఆమెను ఇంటి నుంచి తీసుకొచ్చి బైక్‌పై నేరెడుగొమ్ము మండలం కాచరాజుపల్లి గ్రామ శివారులోని ఉచ్చలబుడ్డి వద్దకు చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆపై చెట్టుకు తాడుతో ఉరి వేసు కున్నారు. కాచరాజుపల్లి గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో తమ చావుకు ఎవరూ కారణం కాదని, తల్లిదండ్రులు క్షమించాలని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మెదక్: నార్సింగిలో అదృశ్యమైన ప్రేమజంట ఆత్మహత్య
-
Hyderabad: సంస్థల హెచ్చరికలు.. కానరాని ప్రేమ పక్షులు
సాక్షి, హైదరాబాద్: వలెంటైన్స్ డే.. ప్రేమ పక్షులకు ఇదో ప్రత్యేకమైన రోజు. ఎంతో ఆహ్లాదకరంగా జంటలు.. జంటలుగా వలెంటైన్స్ డేను జరుపుకొంటారు. పార్కులకు వెళ్లి ప్రేమ కబుర్లతో గడుపుతుంటారు. కానీ.. మంగళవారం నాటి వలెంటైన్స్ డే.. వెలవెలాబోయింది. పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే ఈ రోజున ప్రేమికులెవరూ బహిరంగంగా సంచరించవద్దని, పార్కుల్లో, ఇతర ప్రాంతాల్లో జంటలుగా కనిపించవద్దని.. ఒకవేళ కనిపిస్తే ‘పెళ్లి’ చేస్తామని కొన్ని సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో నగరంలోని పార్కుల్లో, లవ్ హైదరాబాద్ ఎదుట ప్రేమజంటల హడావుడి కనిపించలేదు. చదవండి: Makkah Masjid: ఎనిమిదేళ్లకు ‘గంట’ కొట్టింది! -
ప్రేమికుల దినోత్సవం రోజున మెదక్ జిల్లాలో విషాదం
-
Valentine's Day 2023:వామ్మో..చాట్‌జీపీటీని అలా కూడా వాడేస్తున్నారట!
సాక్షి: ముంబై: వాలెంటైన్స్ డే సందర్భంగా ఏఐ సంచలనం చాట్‌జీపీటీ క్రేజ్‌ను లవ్‌బర్డ్స్ కూడా బాగానే క్యాష్ చేసుకుంటున్నారు.లవర్స్ ఇంప్రెస్ చేసేందుకు చాట్‌జీపీటీ సాయం తీసుకుంటున్నారట అబ్బాయిలు. ప్రేమలేఖలు రాయడానికి భారతీయ పురుషులు, టీనేజర్లు చాట్ జీపీటీ సహాయం తీసుకుంటున్నారని తాజాగా ఒక సర్వే వెల్లడించింది. అంతేకాదు 73 శాతం మంది డేటింగ్ యాప్‌లలో తమ ప్రొఫైళ్లను మార్చుకునేందుకు ఏఐ టూల్‌ని వాడుకోవాలని చూస్తున్నారట. (ఇది కూడా చదవండి: Valentines Day2023: జియో బంపర్ ఆఫర్స్) తమ స్వీటీలను ఎలాగైనా ఆకర్షించాలనే ఉద్దేశంతో 60 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులు ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమ లేఖలు రాయడానికి చాట్‌జీపీటీ సహాయం తీసుకోవాలని భావించారని సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ తేల్చింది 'మోడరన్ లవ్' పేరుతో జరిపిన అధ్యయనంలో 78 శాతం మంది భారతీయ వయోజనులు చాట్‌జీపీటీలో రాసిన ప్రేమ లేఖల పట్ల మక్కువ చూపుతున్నారని, అసలు దానినిఏఐ లెటర్‌గా గుర్తించలేకపోతున్నారని మెకాఫీ స్టడీ తేల్చింది. అంతేకాదు ప్రేమలేఖలు రాయడానికి చాట్‌జీపీటీని వాడుకున్న ఎనిమిది దేశాలలో భారతీయులే ఎక్కువమంది ఉన్నారని కూడా తెలిపింది. తమ ప్రేమను వ్యక్తం చేయడానికి మాటలు రాని , ప్రేమలేఖలు రాయలేని లేదా దానికి పదాలు దొరకని వారు ఈ ఓపెన్ ఏఐని ఆశ్రయిస్తున్నారట. వాలెంటైన్స్ డేసందర్భంగా నిర్వహించిన ‘మోడరన్ లవ్’ పరిశోధనలో 9 దేశాల నుండి 5000 మందికి పైగా వ్యక్తులను సర్వే చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 27 శాతం మంది వ్యక్తులు చాట్‌జీపీటీ లేఖను పంపడం వల్ల తమకు మరింత ఆత్మవిశ్వాసం ఉందని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 49 శాతం మంది చాట్‌జీపీటీ రాసిన ప్రేమ లేఖలు అందుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా గగుల్కు షాకిస్తూ ఇటీవలి కాలంలో చాట్‌జీపీటీ దూసుకు పోతోంది. దీంతో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కూడా చాట్ జీపీటీకి పోటీగా ఏఐటూల్ బార్డ్‌ను తీసుకిచ్చింది. అయితే, ఒక తప్పిదం కారణంగా బార్డ్ భవిష్యత్తులో చాట్‌జీపీటీతో ఎలా పోటీ పడుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. అప్రమత్తత చాలా అవసరం ప్రపంచవ్యాప్తంగా, నలుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది (26 శాతం) ఏఐ ద్వారా నోట్‌ను రాయాలని ప్లాన్ చేస్తున్నారనీ, ఆన్లైన్ డేటింగ్ ప్రపంచంలోఇది రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటిదని మకాఫీ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ప్రేమికులు టార్గెట్ చేసే ప్రమాదం ఉందని, మనుషులు, ఏఐ మధ్య తేడాను గుర్తించగలరో లేదో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని నివేదికలో పేర్కొంది. అలాగేపార్ట్నర్తో మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా డబ్బులు, వ్యక్తిగత వివరాలపై అనుమానాస్పదంగా అడిగినప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని బమెకాఫీ స్టీవ్ గ్రోబ్‌మాన్ సూచించారు. -
వలెంటైన్స్ డే అలర్ట్.. అడ్డుకుంటామంటున్న సంస్థలు
వలెంటైన్స్ డే బహిష్కరణ పిలుపులు... ప్రేమికులకు కౌన్సెలింగ్ ఇస్తామంటున్న కొన్ని సంస్థలు... ఈ పరిణామాల నేపథ్యంలో ఘర్షణలకు తావు లేకుండా హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. మంగళవారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పార్క్‌లు, యూనివర్సిటీలు, పబ్స్, హోటళ్లు, మాల్స్, నెక్లెస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయనున్నారు. నగరంలో అయిదు జోన్లలో చేయాల్సిన ఏర్పాట్లపై సన్నాహాలు ప్రారంభించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క ప్రైవేటు బౌన్సర్లకూ మంచి గిరాకీ ఏర్పడింది. నగరంలోని పబ్స్, మాల్స్, రెస్టారెంట్స్ యాజమాన్యాలు దినసరి వేతనంపై వీరిని నియమించుకుంటున్నాయి. హెచ్చరికలు చేసిన వారిపై నిఘా ఉంచడం, అవసరమైతే ముందస్తు అరెస్టు చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో అయిదు జోన్లలో పశ్చిమ మండలం అతి కీలకమైంది. అనేక పబ్స్, రెస్టారెంట్స్‌తో పాటు మాల్స్, పార్కులు ఇతర కీలక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. దీంతో దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు నిబంధనలు, సమయాలను అతిక్రమించకుండా చర్యలు తీసుకుంటున్నారు. బౌన్సర్లకు గిరాకీ.. బౌన్సర్... ఈ పేరు పబ్స్, బార్స్లకు తరచు వెళ్లే వారికి సుపరిచితమే. మితిమీరి ప్రవర్తించే వారిని, హద్దు మీరి మద్యం సేవించి గొడవలు చేసే వారిని కట్టడి చేయడానికి శాశ్వత ప్రాతిపదికన యాజమాన్యాలు వీరిని నియమించుకుంటాయి. కండలు తిరిగిన శరీరం, కళ్లల్లో చురుకుతనం, చిరునవ్వు కూడా కనిపించని ముఖం, నల్లటి యూనిఫాంలతో వీరు దర్శనమిస్తుంటారు. అయితే.. వలంటైన్ డే నేపథ్యంలో అనేక రెస్టారెంట్లు, మాల్స్ యాజమాన్యాలు సైతం వీరిని నియమించుకుంటున్నాయి. ఎవరికి వారు స్వీయ రక్షణ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా పబ్స్, మాల్స్ తదితర సంస్థల యాజమాన్యాలకు పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులతో పాటు బౌన్సర్లనూ ఏర్పాటు చేసుకుంటున్నారు. శాశ్వత ప్రాతిపదికన బౌన్లర్లు కలిగిన సంస్థలు సైతం మంగళవారం ఒక్క రోజుకూ అదనంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ బౌన్సర్లను అందించడానికి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలతో పాటు జిమ్స్ సైతం ముందుకు వస్తున్నాయి. ఒక్కొక్కరికి రోజుకు రూ.2 వేల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తంలో 60 శాతం బౌన్సర్‌కు, 40 శాతం ఆయా సంస్థలు/జిమ్‌లకు చెందుతాయి. చదవండి: ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే.. -
వాలెంటైన్స్ డే స్పెషల్ గిఫ్ట్స్
-
ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే..
కులము.. గిలము.. బలము చూసి.. వయసు.. వరస.. సొగసూ చూసి.. పుట్టుకొస్తాదా ప్రేమ..? మనసుకు మనసుకు వంతెనేసి.. తనువూ.. తనువూ మెలికలేసే తీరేరా ప్రేమ.. కవి చెప్పినట్లుగానే... ఆకాశమంతా.. ఆనందమై.. తెల్లారుతోంది ప్రేమికుల కోసమే.. ఆలోచనంతా ఆరాటమై.. అన్వేస్తోంది ఈరోజు కోసమేనంటున్నారు వైజాగ్ ప్రేమికులు సాక్షి, విశాఖపట్నం : నగరమంతా వాలంటైన్ ఫీవర్‌తో గులాబీలా విరుచుకుంది. జంట హృదయాలు వలపు సంబరాలు చేసుకుంటుంటే.. ఆ గుండెకు హత్తుకునేలా బహుమతులిచ్చిపుచ్చుకునే సందడితో వ్యాపారులు కూడా వాలెంటైన్ సంబరాలు చేసుకుంటున్నారు. లవ్ వైజాగ్‌లో... లవ్ యూ డార్లింగ్.. ప్రేమకు ప్రాంతం లేదు.. కులం లేదు.. మతం లేదు.. భాష లేదు, భావం లేదు. ప్రేమ అందరి హృదయాల్ని కొల్లగొట్టేసింది. విశాఖ యువతరం కూడా ప్రేమ వానలో తడిసి ముద్దయిపోతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఫిబ్రవరి 14 కోసం ఎదురుచూస్తూ తమకు నచ్చిన వారికి ముచ్చటైన బహుమతులు కొని ఇంప్రెస్ చెయ్యాలని రాత్రంతా అన్వేస్తోందినే ఉన్నారు. పార్కులు, బీచ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు.. ఇలా అన్ని చోట్లా జంట గువ్వలు గుసగుసలాడుకుంటూనే ఉంటాయి. తొలినాళ్లలో ప్రేమంటే మాటల ద్వారా వ్యక్తపరిచేది. ఆ తర్వాత ప్రేమలేఖలు.. ఆపై రోజా పూలు.. ఆ తర్వాత గ్రీటింగ్ కార్డులు.. ఇలా.. తరం మారుతున్న కొద్దీ లవ్ రిచ్‌గా మారిపోయింది. అదేమని అడిగితే.. హలో గురూ.. ప్రేమ కోసమే కదా అని జోష్‌తో చెబుతున్నారు ఈ తరం యూత్. మరి ఈ రోజున లవ్ వైజాగ్.. లవర్స్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా..? అక్షరాలా రూ.20 కోట్ల రూపాయలు. తన కోసం ఎదురు చూసే ప్రేమ గుండెకు ఇచ్చే బహుమతిలోనే కొండంత ప్రేమ కనిపించాలని లవర్స్ ఉవ్విళ్లూరుతుంటారు. అందుకే.. విశాఖ యువత గిఫ్ట్ కోసం బోలెడు ఖర్చు చేస్తున్నారు. ► గతేడాది ప్రేమికుల రోజున నగరంలో రూ.15 కోట్ల వరకూ బహుమతులు కొన్నారని అంచనా. ► ఈ ఏడాది సుమారు రూ.20 కోట్ల వరకూ అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వాలంటైన్ వీక్ పేరుతో దాదాపు రూ.10 కోట్ల అమ్మకాలు జరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ► ప్రేమికుల రోజున మన నగరంలో రూ.2 కోట్ల రూపాయల గులాబీ పూలు అమ్ముడవుతాయని పూల వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా రెడ్, పింక్ గులాబీలే ఎక్కువగా అమ్ముడవుతాయంట. ► వ్యాపారులు గిఫ్ట్‌లకు 20 నుంచి 50 శాతం వరకూ డిస్కౌంట్ ఆఫర్లిచ్చి ఆకర్షిస్తున్నారు. ► రెస్టారెంట్స్, హోటల్స్ వాలెంటైన్స్ కోసం స్పెషల్ టేబుల్స్ రిజర్వ్ చేశాయి. బీచ్‌రోడ్డులోని కొన్ని హోటల్స్.. ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. ► దాదాపు అన్ని జ్యుయలరీ షాపులు.. వాలెంటైన్ స్పెషల్ జ్యుయలరీ స్పెషల్ డిస్కౌంట్‌తో అందిస్తున్నాయి. ► ఫిబ్రవరి 14 కోసం మలీ్టప్లెక్స్లలో అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు అమ్మకాలు జరగ్గా అందులో కపుల్ టికెట్స్ దాదాపు 50 శాతం ఉండటం విశేషం. ► భీమిలి సమీపంలోని ఓ హోటల్లో 50 టేబుల్స్ లవ్ స్పాట్లుగా అడ్వాన్స్ బుకింగ్ పెట్టినట్లు ప్రకటించిన 24 గంటల్లోనే అన్నీ బుక్ అయ్యాయంట. సోషల్ మీడియాలో లవ్ వాన విశ్వజనీయమైన ప్రేమ.. సోషల్ మీడియానూ లవ్ వానలో ముంచెత్తేలా చేస్తోంది. వారం రోజుల క్రితం మొదలైన ప్రేమికుల వారోత్సవాలప్పుడు ప్రారంభమైన లవ్ పోస్ట్‌లు.. చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. హార్ట్‌బీట్ సింబల్స్, కవితలు, గ్రీటింగ్ కార్డులు, ప్రేమ చిహా్నలు, గిఫ్ట్‌లు.. ఇలా ఎన్నో రకాలైన సింబల్స్, స్టిక్కర్లు, ఫొటోలు, కొటేషన్లతో ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, టెలిగ్రామ్, మెసెంజర్.. ఇలా.. అన్నీ బిజీ బిజీగా మారిపోయాయి. పెళ్లికి కాస్త ఆలోచిస్తున్నాం నిండా లవ్‌లో మునిగిన వారికి కూడా ఈ ప్రేమ నిర్వచనం సంగతి ఓ పట్టాన అంతుచిక్కదు. అందుకే ప్రేమకు అర్థం వెతికేందుకు నగరంలో దాదాపు 100 మంది యువతీ యువకులతో మాట్లాడగా.. చాలా మంది యువత కొత్త కొత్త అర్థాలు చెప్పారు. ఈ సమాధానాల్లోనే.. చాలా మంది వీర ప్రేమికులు, భగ్న ప్రేమికులు, టైంపాస్ బఠానీలు, వన్‌సైడ్ లవర్స్ కనిపించారు.ఆ సమాధానాల సంగతేంటో మీరు చదవండి... ♦ప్రేమంటే రెండు జీవితాలు, రెండు హృదయాలు, రెండు కుటుంబాలు : 35 మంది ♦పెళ్లి చేసుకోడానికి వేసే మొదటి అడుగు : 15 మంది. ♦కాలేజీలో ఒంటరి జీవితానికి తుంటరి తోడు : 10 మంది ♦జీవితం బోర్ కొట్టకుండా టైంపాస్ చేసుకునేది : 25 మంది ♦ప్రేమంటే సెక్స్ : 4 ♦వన్‌సైడ్ లవర్ని, నాకు అంతు చిక్కడంలేదు: 11 మంది -
valentine's day2023 రొటీన్‌గా టెడ్డీ, రోజ్ కాదు,వెరైటీగా ఇవి ఇస్తే..ఆ థ్రిల్లే వేరు!
సాక్షి,ముంబై: వాలెంటైన్స్ డే వస్తోందంటే చాలు ప్రేమికుల సందడి మొదలవుతుంది. దీనికి తగ్గట్టుగానే పలు ఆన్లైన్, ఆఫ్‌లైన్ సంస్థలు సిద్ధమవుతాయి. ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా వెరైటీ గిఫ్ట్‌లు, ఆఫర్లతో ఆకట్టుకుంటాయి. స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లు ఇతర ట్రెండీ బహుమతులపై తగ్గింపు ధరతో ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటాయి. మరోవైపు వాలెంటైన్స్ డే చరిత్ర, అర్థం, పరమార్థం, ఈ ఒక్క రోజు ప్రేమ ఉంటే చాలా ఇలాంటి విషయాలతో సంబంధం లేకుండా...రోజుకో డే చొప్పున వారం రోజులు పాటు గిఫ్ట్‌లు, చాక్లెట్లు, టెడ్డీ బేర్స్ , గులాబీలతో పండుగ చేసుకుంటారు. ముఖ్యంగా తన స్వీటీకి సంతోషం పెట్టేందుకు వాలెంటైన్ తెగ ఆరాటపడతారు. తన కలలరాణికి, లేదా తన రాకుమారుడికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలా అనేది ఒక సవాలే. ఏ గిఫ్ట్ అయితే తమ డార్లింగ్ ఫిదా అయి పోతుందా అని ఇంటర్నెట్లో, ఆన్లైన్ సైట్లలో తెగ సెర్చ్ చేస్తారు. ఈ నేపథ్యంలో గులాబీలు, టెడ్డీ బేర్లు, చాక్లెట్ల కంటే ఎక్కువ కిక్ ఇచ్చే, మరపురాని మధుర జ్ఞాపకంగా మిగిల్చే. గిఫ్ట్స్ ఏంటో కొన్ని చూద్దాం. ప్రేమికుల మధ్య ప్రధానంగా ఉండాల్సింది అండర్ స్టాండింగ్. ఎలాంటి అరమరికలు, దాపరికాలు లేకుండా.. మనసు విప్పి మాట్లాడుకోవడాన్ని మంచిన స్వీట్ మెమొరీ. అంతకుమించిన గొప్ప అనుభూతి ఏముంటుంది. రోజూ వాట్సాప్‌లో చాటింగ్, కాల్స్లోమాట్లాడుకుంటూనే ఉంటాంగా అనుకోకుండా....స్పెషల్‌గా మాట్లాడుకోండి. ముఖ్యంగా అమ్మాయిలు సర్ప్రైజ్లకి ఎక్కువ థ్రిల్ అవుతారట. సో.. వాలెంటైన్స్ డే, ఆమె కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయండి! మన మనసుకు నచ్చిన నేస్తంతో ఒక రోజు గడపడం, మాట్లాడటం, జోకులు వేసుకోవడం,ఇష్టమైన సినిమా చూడటం, షిట్స్ క్రీక్ (లేదా ఇతర కంఫర్ట్ షోలు) చూడటం, లాంగ్ డ్రైవ్, ఇష్టమైన ఫుడ్, డిన్నర్ డేట్ ఇవన్నీ సంతోషానిచ్చేవే. వీటన్నింటికి మంచి ఒక బిగ్ హగ్, లవ్లీ కిస్ .. ఆ కళ్లలో వెలిగే స్పార్క్.. ఇవన్నీ.. ఫర్ పఫర్ ఎవర్ గుర్తుండిపోయే స్వీట్ నథింగ్స్.. ఇది స్వయంగా లవ్ బర్డ్స్ చెబుతున్న మాట. మీ ప్రియురాలికి లేదా ప్రియుడికి బుక్స్ చదవడం హాబీ అయితే,అందులోనూ మంచి రచయిత అయితే.. ఒక మంచి పుస్తకాన్న బహమతిగా ఇవ్వండి. వారికి టెడ్డీ బేర్, ఫ్లవర్ బొకే కంటే కూడా పుస్తకం ఇస్తే వచ్చే ఆనందానికి అవధులు ఉంవడట. అదీ సర్ ప్రైజింగ్‌గా ప్రియ నేస్తం ఇంటికి డెలివరీ చేస్తే ఇంకా మంచిది. మధురమైన చాక్లెట్పాటు, మసాజ్ సెషన్ గిఫ్ట్ ఇవ్వడం లేటెస్ట్ ట్రెండ్, చాక్లెట్లు మన శరీరంలో సంతోషకరమైన డోపమైన్, ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్ సెరోటోనిన్ హార్మోన్లను విడుదల చేస్తే, మసాజ్ మనస్సును రిలాక్స్ అయ్యేలా చేసిన కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అందుకే అర్బన్ కంపెనీ లేదా ఇంట్లో సెలూన్ సర్వీస్‌ను అందించే ఇతర సంస్థల ద్వారా మంచి మసాజ్ సెషన్‌ను బుక్ చేస్తున్నారట. సాధారణంగా ఇచ్చే గిఫ్ట్స్ కేక్ గులాబీలు హ్యాండ్ బ్యాగ్, స్లింగ్ బ్యాగ్ స్పెషల్‌గా డిజైన్ చేససిన కాఫీ కప్స్ స్వీట్లు చాక్లెట్లు టెడ్డీ బేర్స్ హార్ట్ షేప్ కుషన్లు సీసాలో ప్రేమ లేఖలు షాపింగ్ కూపన్లు ఫస్ట్ డేటింగ్ డేట్‌ను గుర్తు చేసేలా ఒక గిఫ్ట్ మాంచి రొమాంటిక్ సాంగ్స్, మ్యూజిక్‌తో స్లైడ్‌షో డేట్ నైట్ ఐడియా కార్డ్‌లు రొమాంటిక్ షోపీస్ గిఫ్ట్ బాక్స్‌లు/గిఫ్ట్ హాంపర్లు క్యూట్ అండ్ రొమాంటిక్ ల్యాంప్స్ బంగారు, డైమండ్ నగలు స్మార్ట్ ఫోన్లు, వాచెస్, ఇతర గాడ్జెస్ట్స్ -
Valentines Day 2023: ప్రేమికుల రోజు ఇచ్చే గిఫ్ట్‌లు ఇవే..!
కరీంనగర్: ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు.. ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తం చేసే సందర్భం. ప్రేమలో ఉన్నవారు ఆరోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తమ మనసులో మాట చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. మదిలో ప్రేమ సందేశాలను ఇచ్చిపుచ్చుకునేందుకు మార్కెట్లో ఎన్నో వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. కేక్‌లు ప్రత్యేక డిజైన్లలో ఆకట్టుకుంటున్నాయి. ఆయా దుకాణాలు యువతీ యువకులతో కళకళలాడుతున్నాయి. వారు మెచ్చిన, నచ్చిన ఫొటోలు ఫ్రేమ్‌లో బంధించి ఇవ్వడంతోపాటు లవర్స్ స్పెషల్ కీచైన్లు, టుడే అండ్ టుమారో, జస్ట్ ఫర్ యూ అనే హార్ట్ పిల్లోస్‌పై ఆసక్తి చూపుతున్నారు. అలాగే ప్రేమికుల కోసం ఎన్నో రకాల విదేశీ చాక్లెట్లు నోరూరిస్తున్నాయి. గతంలో కంటే ఈసారి వెరైటీ గిఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. ముఖ్యంగా చైనా క్రిస్టల్‌తో తయారైన ఉత్పత్తులు యువతను ఆకర్షిస్తున్నాయి. ఇష్టమైన వారి ప్రేమను పొందేందుకు కానుకలు మంచి సాధనాలుగా పని చేస్తాయని నమ్మేవాళ్లు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఏటా ఒక బహుమతి ఇస్తా మాది ప్రేమ వివాహం. ఏటా ప్రేమికుల దినోత్సవం రోజు తప్పనిసరిగా మా వారికి ఏదో ఒక బహుమతి ఇస్తా. ఈసారి అది ప్రత్యేకంగా ఉండాలని షాపింగ్ చేస్తున్నా. ప్రేమ జీవితంలో భాగం కావాలి. – తాటి అమల పవన్, సవరన్ స్ట్రీట్ అందుబాటులో లవ్ గిఫ్ట్స్.. ఈసారి మా స్టోర్‌లో రూ.100 నుంచి రూ.2 వేల విలువైన లవ్ గిఫ్ట్స్ అందుబాటులో ఉంచాం. ప్రేమికులు రేటు ఆలోచించకుండా అందమైన బహుమతులు కొనుగోలు చేస్తున్నారు. – ఈశ్వర్, గణేశ్ జనరల్ స్టోర్, శాస్త్రీరోడ్ ప్రేమను ఇచ్చిపుచ్చుకోవాలి బహుమతుల కన్నా ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటే అది జీవితాంతం చెదిరిపోకుండా ఉంటుంది. నాకు కాబో యే శ్రీవారి కోసం ఈ సంవత్సరం ప్రత్యేక బహుమతి కొనుగోలు చేసి, పంపిస్తున్నాను. – ఉపాధ్యాయుల రుత్విక, సాఫ్ట్వేర్ ఉద్యోగిని, మంకమ్మతోట లవ్ సింబల్స్ ఉన్నవే ఎక్కువ.. లవ్ సింబల్స్ ఉన్న వస్తువులు, బొమ్మల విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో మంచి కొటేషన్లతో గ్రీటింగ్ కార్డులు వచ్చేవి. ఇప్పుడు రావడం లేదు. ఇంటర్నెట్ నుంచి తీసుకొని, ఇచ్చుకుంటున్నారు. – ఉప్పుగల్ల మురళీకష్ణ, వాణిశ్రీ బుక్స్, స్టేషనరీ, 7హిల్స్ చదవండి: ఏకకాలంలో ఒక్కటైన 220 జంటలు -
మధురిమలు పంచుకోండి.. మధురంగా..
ఒక గులాబీ.. ఒక చాక్లెట్.. ఒక గ్రీటింగ్ కార్డ్.. ఒక కేక్.. ఒక గిఫ్ట్.. ప్రేమికుల రోజును ఇలాంటి వాటితో ఆరంభించండి.. మీకు ప్రియమైన వారిపై మీకున్న ప్రేమను తెలియజేయండి. రోజూ చూపే ప్రేమను ఇది ఎన్నో రెట్లు ఎక్కువగా చేస్తుంది. ఈ అనుభూతి మరింత మధురానుభూతులను మీ జీవితంలో నింపుతుంది. నచ్చిన ఆట.. కలిసి ఆడండి. ఉదాహరణకు చెస్, క్యారమ్స్ వగైరా.. ఏదైనా.. ఆ ఆట ఇద్దరి మధ్య బంధాన్ని మరింత పెంచుతుంది. సాక్షి, పశ్చిమగోదావరి డెస్క్: ప్రేమ అనేది ఓ మధుర భావన. ఇది మనసులను కలుపుతుంది.. మనుషులను దగ్గర చేస్తుంది. ప్రేమతో జీవించడం.. జీవితంలోని మాధుర్యాన్ని మన దరి చేరుస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారైనా.. పెళ్లి తర్వాత ప్రేమించుకుంటున్నవారైనా.. అంతిమంగా తమ భాగస్వామిపై చూపే ప్రేమే వారి జీవిత గమనాన్ని మధురంగా మారుస్తుంది. మరి ఇలాంటి జంటలు ఈ ఏడాది ప్రేమికుల రోజును ఎలా జరుపుకోవాలనే దానిపై ఆలోచిస్తుంటే.. వారికి నెటిజన్లు అనేక సూచనలు అందిస్తున్నారు. వాటిలో కొన్ని ఖర్చుతో కూడుకున్నవి కాగా.. మరికొన్ని తక్కువ వ్యయంతో ప్లాన్ చేసుకోదగినవి. అసలు ఖర్చే అవసరం లేనివి కూడా ఇందులో ఉన్నాయి. వాటిలో తమకు ఉత్తమంగా అనుకున్నవి.. సాధ్యమయ్యేవి ప్లాన్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటే.. ఆ మాధుర్యాన్ని ఎప్పటికీ మరిచిపోలేరని కూడా చెబుతున్నారు. ఇవి నెట్టింట చాలా ఎక్కువమందిని ఆకట్టుకుంటుండటం విశేషం. అవేంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా.. అయితే.. ఇవి మీకోసమే.. ► మీకు ఇష్టమైన పాటలను కలిసి ఎంచుకోండి. మీ సంబంధాన్ని గుర్తుచేసే, మీ భాగస్వామికి ఎక్కువగా ఇష్టమైన పాటలకు అందులో ప్రాధాన్యత ఇవ్వండి. వాటిని మీ ప్లే లిస్ట్‌లో ఉంచేందుకు సమయం కేటాయించండి. ► ఇద్దరూ కలిసి ఒకరోజు గడపడంలో ఉత్తమమైన మార్గాల్లో మరొకటి.. స్వచ్ఛంద సేవ. ఇతరులకు స్వయంగా సేవ చేయడం మీరు ఒకరికొకరు మరింత కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ► మీ సొంత ప్రాంతంలో పర్యాటకులుగా మారండి. మీ పట్టణంలో ఏదైనా ప్రసిద్ధమైన ప్రాంతాన్ని లేదా మీరు ఎప్పుడూ చూడని మ్యూజియాన్ని సందర్శించండి. ఫొటోగ్రాఫర్లుగా మారి నచ్చిన విధంగా ఫొటోలు తీయండి. ► మీ ఇద్దరి తీపి గుర్తులను కలిపి ఒక విలువైన పుస్తకంగా రూపొందించండి. లవ్ లెటర్లు, దుస్తులు, చేతి రుమాళ్లు, బహుమతులు, ఫొటోలు, పాత సినిమా టికెట్లు, గుర్తుగా దాచుకున్నవాటిని సేకరించి దీనిని తయారుచేయండి. ► డ్రైవ్ కోసం వెళ్లండి.. కారు లేదా బైక్ ఫుల్ ట్యాంకు చేయించండి. ఇది కొంత ఖర్చుతో కూడుకున్నది కావచ్చు. అయినా ఇది మీరు వెళ్లే కొత్త ప్రాంతంలో సరికొత్త అనుభూతులను కలిసి ఆస్వాదించేందుకు ఉపకరిస్తుంది. ► ఇద్దరూ కలిసి మీ ప్రేమకు సింబాలిక్‌గా ఉండేలా గోడకు తగిలించే లేదా వేలాడదీసే ఒక ఆహ్లాదకరమైన కళాత్మక వస్తువును రూపొందించండి. దానిని మీరు నిత్యం సంచరించే ప్రాంతంలో ఏర్పాటు చేయండి. ► ఒకరికొకరు ప్రేమలేఖలు రాసుకోండి. ఇంతకుముందే రాసిన అనుభూతులు ఉన్నప్పటికీ.. ఇప్పుడు కొత్తగా ప్రయత్నించండి. మీ భాగస్వామి మీకు ఎందుకు ప్రత్యేకమైన వారో అందులో పొందుపరచండి. మీ భాగస్వామిలోని ఏ లక్షణాలను మీరు ఎక్కువగా ఆరాధిస్తారో, వారు మిమ్మల్ని ఎలా భావిస్తారో, మీరు వారితో ఎందుకు ప్రేమలో పడ్డారో ఆ లేఖలో తెలియజేయండి. ► ఇద్దరికీ ఇష్టమైన రొమాంటిక్ సినిమాలు చూడండి. పాప్‌కార్న్ వంటి స్టఫ్ కూడా అందుబాటులో పెట్టుకోండి. ► ఇద్దరూ కలిసి ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అది వంటకం కావచ్చు.. డ్యాన్స్ కావచ్చు.. మరేదైనా కావచ్చు. ► కలిసి యోగా లేదా వ్యాయామం సాధన చేయండి. ఆ సమయాన్ని ఆస్వాదించండి. ► ట్రెజర్ హంట్ (నిధి వేట) లాంటి ఆసక్తికరమైన ఆట ఎంచుకోండి. మీ భాగస్వామికి ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రేమికుల రోజు బహుమతిని దాచి ఉంచండి. దానిని కనుగొనడానికి ఆధారాలు రూపొందించి దానిని కనిపెట్టాలని సూచించండి. ► ప్రేమకు సూచిక అయిన హార్ట్ సింబల్లో ఆహారాన్ని కలిసి తయారు చేయండి. చపాతీ, పిజ్జా, ఆమ్లెట్, కేక్.. ఇలా మీ ఊహ మేరకు ప్రయత్నించండి. లేదంటే హార్ట్ సింబల్ ఆకారంలో కేక్‌కి ఆర్డర్ ఇవ్వండి. ► ఇద్దరూ కలిసి షాపింగ్‌కు వెళ్లండి. ఒకరి కోసం ఇంకొకరు ఇష్టమైన వస్తువును కొనడానికి ప్రయత్నించండి. ► ఇద్దరూ కలిసి పెయింట్ చేయండి. మీరు పెయింటర్లు కాకపోవచ్చు.. అయినా ఇద్దరూ కలిసి ఒక సొంత కళాఖండం రూపొందించడానికి ప్రయత్నించండి. అది తప్పనిసరిగా సరికొత్త అనుభూతులను పంచుతుంది. ► ఇద్దరూ కలిసి అందమైన పూలతోటను సందర్శించడానికి ప్రయత్నించండి. కనీసం మీకు సమీపంలోని నర్సరీకి వెళ్లి ప్రేమికుల రోజుకు గుర్తుగా ఒక మొక్క కొనుగోలు చేయండి. అద్భుతమైన ఫొటోలూ తీసుకోండి. ► రాత్రి భోజనం కలిసి వండండి. ఒక సూపర్ బిజీ రెస్టారెంట్లో తినడానికి బయటకు వెళ్లడం కంటే ప్రత్యేకంగా ఇంట్లో వండిన భోజనం చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. మీలో ఒకరికి చెఫ్‌కి సమానమైన నైపుణ్యాలు లేకపోయినా, మీరు ఇద్దరూ ఆనందించే చిరస్మరణీయమైన విందును చేయవచ్చు. ► ఒక గులాబీ.. ఒక చాక్లెట్.. ఒక గ్రీటింగ్ కార్డ్.. ఒక కేక్.. ఒక గిఫ్ట్.. ప్రేమికుల రోజును ఇలాంటి వాటితో ఆరంభించండి.. మీకు ప్రియమైన వారిపై మీకున్న ప్రేమను తెలియజేయండి. రోజూ చూపే ప్రేమను ఇది ఎన్నో రెట్లు ఎక్కువగా చేస్తుంది. ఈ అనుభూతి మరింత మధురానుభూతులను మీ జీవితంలో నింపుతుంది. ► నచ్చిన ఆట.. కలిసి ఆడండి. ఉదాహరణకు చెస్, క్యారమ్స్ వగైరా.. ఏదైనా.. ఆ ఆట ఇద్దరి మధ్య బంధాన్ని మరింత పెంచుతుంది. -
భర్తల కొంప ముంచిన ‘పీఎంఏవై’ రుణాలు.. లవర్లతో భార్యలు పరార్!
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం డబ్బులు తీసుకున్న నలుగురు వివాహితలు.. తమ భర్తలను వదిలేసి ప్రియుళ్లతో పరారయ్యారు. భార్యలు చేసిన ఊహించని ఘనకార్యం తెలుసుకొని ఆశ్చర్యపోవడం భర్తల వంతైంది. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం.. దీని ద్వారా దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు రుణాలు మంజూరు చేస్తుంది. ఈ పథకం కింద వివిధ వర్గాల వారికి మూడు నుంచి 18 లక్షల వరకు రుణాలు అందిస్తుంది. అయితే పీఎంఏవై కింద ఇచ్చే రుణాలను కేంద్రం మహిళల పేరు మీదనే అందిస్తుంది. అంటే ఇంటి యజమాని తప్పనిసరిగా మహిళనే అయి ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దరఖాస్తు చేసుకున్న 40 మందికి రుణాలు మంజూరయ్యాయి. అందులో మొదటి విడతగా ఒక్కో లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో రూ.50,000 చొప్పున నగదును జమచేశారు. అయితే ఈ పథకం కింద రుణాలు పొందిన వారిలో నలుగురు మహిళలు తమ అకౌంట్లకు చేరిన 50 వేల రుపాయలతో కనిపించకుండా పోయారు. భర్తలు వారి కోసం ఆరా తీయగా షాకింగ్ విషయం తెలిసింది. వారి భార్యలు తాము ప్రేమించిన వ్యక్తులతో పరారైనట్లు తెలింది. ఇలా పారిపోయిన వాళ్లలో జిల్లాలోని బెల్హారా, బంకీ, జైద్పూర్, సిద్ధౌర్ నగర పంచాయతీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. కాగా భార్యలు పారిపోవడం భర్తల పాలిట శాపంగా మారింది. ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ వింత ఉదంతం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో రుణాలు తీసుకొని ఇంటి నిర్మాణం చేపట్టకపోతే ఇచ్చిన డబ్బులను రికవరీ చేస్తామని జిల్లా అధికారులు బాధిత భర్తలను హెచ్చరించారు. నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులు నోటీసులు పంపారు. దీంతో కంగుతిన్న భర్తలకు ఏమి చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. చివరికి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో తమ భార్యలు ప్రేమించిన వారితో వెళ్లిపోయారని.. వారి బ్యాంక్ ఖాతాలలోకి పీఎంఏవై రెండో విడత రుణాలను జమచేయవద్దని అధికారులకు మొరపెట్టుకున్నారు. మరోవైపు పారపోయిన లబ్ధిదారుల నుంచి సొమ్మును ఎలా రికవరీ చేయాలో తెలియక జిల్లా అధికారులు తలపట్టుకుంటున్నారు. చదవండి: పార్లమెంట్లో మోదీ ప్రసంగం.. రాహుల్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్.. -
పెద్దలకు తెలియజేయడమే శాపమైందో ఏమో! ఆ ప్రేమ జంట..
సాక్షి, గంగావతి రూరల్: ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన శనివారం కొప్పళ జిల్లా కుక్కనూరు తాలూకా బలిగేరి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రకాష్ (20) కుక్కనూరు ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన సుమ సుమ (17) కుక్కనూరులో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజూ గ్రామం నుంచి ఆటో, బస్సుల్లో కుక్కనూరుకు వెళ్లివచ్చే క్రమంలో వీరి మధ్య స్నేహం ఏర్పడి ప్రేమకు దారితీసింది. వీరిద్దరివి వేర్వేరు కులాలు. తమ ప్రేమను కుటుంబ పెద్దలకు తెలియజేయగా చదువుకునే వయస్సులో ప్రేమ ఏంటని మందలించారు. వీరి ప్రేమ వ్యవహారంపై గ్రామస్తులు కూడా తప్పు బట్టారు. ఈక్రమంలో ఏం జరిగిందో ఏమో కాని శనివారం సుమ ఇంట్లో ప్రేమికులిద్దరూ రక్తపుమడుగులో విగతజీవులుగా కనిపించారు. కుక్కనూరు పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. గొంతుల వద్ద గాట్లు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాలను కుక్కనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించి కేసు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: కొత్త బట్టలు కొని వస్తుండగా ఘోరం) -
నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ప్రేమ జంటపై దాడి
-
విశాఖలో పట్టపగలే రెచ్చిపోయిన రొమాంటిక్ జంట.. రెండు గంటల్లోనే!
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ టౌన్షిప్ రహదారిలో ఓ జంట పట్టపగలు రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్చిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువకుడు మరో యువతిని బైక్ ట్యాంక్‌పై కూర్చొపెట్టుకుని రయ్రయ్ అంటూ దూసుకుపోయారు. ఈ దృశ్యాలను పక్కనే కారులో వెళ్తున్న వ్యక్తులు వీడియో తీశారు. దీంతో పట్టపగలు బరితెగించిన ఈ యువజంట వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో గాజువాక సమీప ప్రాంతాలకు చెందిన బైక్ నడిపిన అజయ్ కుమార్, యువతిని సంఘటన జరిగిన రెండు గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు స్టీల్ ప్లాంట్ సీఐ వి శ్రీనివాస్‌రావు తెలిపారు. యువకుడి బైక్ సీజ్ చేశామని, న్యూసెన్స్, ర్యాష్ డ్రైవింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. చదవండి: Video: ‘తప్పతాగి వేధింపులు.. నడిరోడ్డుపై చెప్పుతో దంచికొట్టింది’ -
ప్రియుడి స్థానంలో డిగ్రీ పరీక్షకు ప్రేయసి.. ప్రభుత్వ ఉద్యోగం ఫసక్!
గాంధీనగర్: ఒకరికకి బదులు ఒకరు పరీక్షలు రాసిన సంఘటనలు చాలానే వెలుగు చూశాయి. కవల పిల్లల్లో అలాంటివి ఎక్కువ జరుగుతాయి. అయితే, ఓ అబ్బాయి స్థానంలో అమ్మాయి పరీక్షలు రాసే ప్రయత్నం చేసింది. చివరకు తన డిగ్రీ కోల్పోవడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం కోల్పోయే ప్రమాదంలో పడింది. ఈ సంఘటన గుజరాత్లో వెలుగు చూసింది. ఆమెను విచారించగా అసలు విషయం తెలిసి కళాశాల అధికారులతో పాటు తల్లిదండ్రులు అవాక్కయ్యారు. తన బాయ్‌ఫ్రెండ్ ఉత్తరాఖండ్‌కు వెకేషన్‌కు వెళ్లగా అతడి స్థానంలో పరీక్షలు రాసేందుకు హాజరైంది. థర్డ్ ఇయర్ బీకామ్ పరీక్షల్లో తన ప్రియుడి స్థానంలో డమ్మీ క్యాండిడేట్‌గా కూర్చుంది 24 ఏళ్ల యువతి. అయితే, పరీక్ష రాసే క్రమంలో పట్టుబడింది. ఇదీ జరిగింది.. అక్టోబర్‌లో జరిగిన బీకామ్ థర్డ్ఇయర్ పరీక్షల్లో ఒకరోజు అబ్బాయి స్థానంలో అమ్మాయి కూర్చింది. హాల్‌టికెట్‌లోనూ అమ్మాయి ఫోటో, పేరు ఉన్నాయి. ఎవరూ గుర్తించలేదు. కానీ, అదే హాల్లో పరీక్ష రాస్తున్న మరో విద్యార్థి అనుమానించాడు. ఆ స్థానంలో ప్రతిరోజు అబ్బాయి ఉంటాడని, ఆ రోజు అమ్మాయి ఉండటంపై ఇన్విజిలేటర్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆ యువతిని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ ఫెయిర్ అసెస్మెంట్ కన్సల్టేటివ్ కమిటీ ముందు హాజరుపరిచారు. ఆ కమిటీ విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడించింది నిందితురాలు. ‘ఆ యువతి, యువకుడికి స్కూల్ నుంచే పరిచయం ఉన్నట్లు తెలిసింది. అయితే, పరీక్షలకు హాజరయ్యే విషయం వారి తల్లిదండ్రులకు తెలియదు.’ అని కమిటీ పేర్కొంది. విచారణ సందర్భంగా.. కంప్యూటర్లో హాల్‌టికెట్‌ను మర్చి పరీక్ష హాల్లోకి ప్రవేశించినట్లు ఒప్పుకుంది నిందితురాలు. ఇన్విజిలేటర్ రోజు మారతారు. విద్యార్థులతో పెద్దగా వారికి పరిచయం ఉండకపోవడంతో విద్యార్థులను గుర్తించలేరు. ఇదే ఆ యువతికి అనుకూలంగా మారింది. అసలు పరీక్షకు హాజరుకావాల్సిన అబ్బాయిని పిలిపించిన కమిటీ విచారించింది. తాను పరీక్ష రోజున ఉత్తరాఖండ్‌కు వెళ్లినట్లు తెలిపాడు. థర్డ్ఇయర్ బీకామ్ రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో ఈ ప్లాన్ చేసినట్లు తెలిసింది. మరోవైపు.. ఎఫ్ఏసీటీ కమిటీ సిఫార్సుల మేరకు ఆ యువతి బీకామ్ డిగ్రీని, యువకుడి తొలి, రెండో ఏడాది పరీక్షలను సైతం రద్దు చేసినట్లు ఎఫ్ఏసీటీ సభ్యురాలు ఒకరు తెలిపారు. . దీంతో ఆ యువతి ప్రభుత్వ ఉద్యోగం కూడా పోగొట్టుకునే ప్రమాదం తెచ్చుకుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘మా తల తీసేయమన్నా బాగుండేది’.. వర్శిటీల్లో నిషేధంపై అఫ్గాన్ మహిళల ఆవేదన -
ఏడాది నుంచి ప్రేమ, సినిమాకు వెళ్లి వస్తుండగా ప్రేమజంట దుర్మరణం
సాక్షి, చెన్నై: సినిమాకు వెళ్లి ఓ ప్రేమజంట ద్విచక్రవాహనంలో తిరిగి వస్తుండగా లారీ రూపంలో తిరిగిరానిలోకాలకు తీసుకెళ్లింది. తూత్తుకుడి జిల్లాకు చెందిన బాబిలోన (23) సాఫ్ట్వేర్ ఇంజినీర్. చెన్నై జాఫర్‌ఖాన్ పేటలో ఉంటూ గిండిలోని ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తుంది. ఈమె బంధువు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రశాంత్ (33) చెన్నై జాఫర్‌ఖాన్ పేటలోనే ఉంటూ కుంన్రత్తూరులో ఉన్న ప్రైవేటు సంస్థలో డిజైనింగ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసి ఇరువైపు పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించి నిశ్చితార్థం చేశారు. ఈక్రమంలో అన్నానగర్ లోని ఓ థియేటర్లో సినిమా చూడడానికి బాబిలోన, ప్రశాంత్ ఇద్దరు బైక్‌పై వెళ్లారు. సినిమా చూసుకుని తిరిగి అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో తిరిగి బయలుదేరారు. అరుంబాక్కం మెట్రో రైల్వేస్టేషన్ వద్ద వెళుతుండగా వెనుక నుంచి ఇనుపలోడుతో వస్తున్న లారీ బైకును ఢీకొంది. ఈ ఘటనలో బైకు నుంచి కిందపడిన బాబిలోన, ప్రశాంత్‌లపై లారీ దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. లారీ డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించగా స్థానికులు అతన్ని పట్టుకుని తర్వాత అన్నానగర్ పోలీసులకు అప్పగించారు. మృతదేహాలను కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జూనియర్ ఆర్టిస్ట్‌ల ప్రేమాయణం.. నాలుగేళ్లు ఒకరితో.. నాలుగు నెలలు మరొకరితో..
సాక్షి, బంజారాహిల్స్: తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో యువతీ, యువకులను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే... శ్రీకాకుళం జిల్లాకు చెందిన తిరుమల్‌రెడ్డి సూర్యనారాయణ(30) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తూ యూసుఫ్‌గూడ సమీపంలోని శ్రీకృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నాడు. నాలుగేళ్ల క్రితం తనతో పాటు జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్న నాగవర్ధినితో ఏర్పడ్డ పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేసేదాకా కొనసాగింది. అదే భవనంలో ఈ ఇద్దరూ కలిసి రెండో అంతస్తులో నాలుగేళ్లుగా నివాసం ఉంటున్నారు. నాలుగు నెలల క్రితం ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. చదవండి: ('నాన్నా అమ్మను రోజూ ఎందుకు కొడతావు.. మాతో ఎందుకు సంతోషంగా ఉండవు') ఎవరికి వారు వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకొని ఈ మేరకు సూర్యనారాయణ అదే భవనంలో ఆమె నుంచి విడిపోయి నాల్గో అంతస్తులో కిరాయికి ఉంటున్నాడు. ఈ లోపు నాగవర్ధిని రాజమండ్రికి చెందిన మరో జూనియర్ ఆర్టిస్ట్ శ్రీనివాస్‌రెడ్డితో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి గత నాలుగు నెలలుగా ఒకే గదిలో ఉంటున్నారు. ఈ విషయంపై సూర్యనారాయణ ఇటీవల ఆమెను నిలదీశాడు. శ్రీనివాస్‌రెడ్డితో సహజీవనం మానుకోవాలని తనతో పాటే ఉండాలని గొడవకు దిగేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి సూర్యనారాయణను ఆమె గదిలోకి వెళ్లగా శ్రీనివాస్‌రెడ్డి, నాగవర్ధిని ఇద్దరూ కనిపించడంతో వారితో గొడవపడ్డాడు. మాటా మాటా పెరగడంతో వారిద్దరూ కలిసి సూర్యనారాయణను అదే అంతస్తు పైనుంచి కిందికి తోసేశారు. పక్కటెముకలు విరిగిపోయి ఓ ఎముక ఊపిరితిత్తుల్లో గుచ్చుకోవడంతో అతడి పరిస్థితి విషమించింది. బాధితుడిని పంజగుట్టలోని మురుగన్ ఆస్పత్రిలో బాధితుడిని చేర్నించగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. నిందితులు శ్రీనివాస్‌రెడ్డి, నాగవర్ధినిలను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అప్పటికే నాగవర్ధినికి వివాహం జరిగినట్లు తేలింది. వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడితో పెళ్లి.. ఆ ఫోటోలను భర్తకు పంపి) -
ప్రేమిస్తే చంపేస్తారు!
యశవంతపుర: ప్రేమిస్తే కుటుంబ పరువు ప్రతిష్టల పేరుతో కన్నబిడ్డలనే ప్రాణాలు తీసే ఉదంతాలు రాష్ట్రంలో విస్తరిస్తున్నాయి. తాజాగా ప్రేమ జంట హత్యకు గురైన సంఘటన బాగలకోట జిల్లాలో జరిగింది. జిల్లాలోని బేవినమట్టి గ్రామంలో బాలికను, ఆమె ప్రియున్ని బాలిక కుటుంబ సభ్యులే హతమార్చారు. వివరాలు.. గ్రామంలో నివసించే బాలిక, విశ్వనాథ నెలగి (22) అనే యువకుడు ప్రేమలో పడ్డారు. ఇది బాలిక కుటుంబానికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అతన్ని ప్రేమించవద్దని బాలికకు పలుమార్లు నచ్చజెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఆమె తండ్రి పరసప్ప, సోదరుడు రవి హుల్లణ్ణవర(19), బావ హనుమంత మల్నాడద (22), మరో బంధువు బీరప్ప దళవాయి(18)లు కలిసి ఆ జంటను హత్య చేయాలని పథకం వేశారు. పెళ్లి చేస్తామని నమ్మించి దారుణం తమ కుట్ర ప్రకారం ప్రేమ జంటకు పెళ్లి చేస్తామని నమ్మించారు. అక్టోబరు 1వ తేదీన గదగ జిల్లా నరగుందలో ఉన్న విశ్వనాథ నెలగిని, బేవినమట్టిలో ఉన్న బాలికను నిందితులు కారులో తీసుకెళ్లారు. వాహనంలోనే బాలిక గొంతుకు చున్నీతో బిగించి, యువకున్ని తీవ్రంగా కొట్టి బండరాయితో బాది ప్రాణాలు తీశారు. అనంతరం శవాల నుంచి వ్రస్తాలను తొలగించి ఆలమట్టి రోడ్డులోని వంతెనపై నుంచి కృష్ణానదిలో పడేసి ఊరికి వెళ్లిపోయారు. విచారణలో వెలుగులోకి కొడుకు కనిపించకపోవడంతో యువకుని తండ్రి ఈ నెల 3న నరగుంద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు 11వ తేదీన కూతురు మిస్సయిందని ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఈ నెల 15 బాగల్‌కోట గ్రామీణ పోలీసులు అనుమానం వచ్చి రవి హుల్లణ్ణవరను అదుపులోకి తీసుకొని విచారించారు. తమ కుటుంబ పరువు పోతుందని భావించి హత్య చేశామని ఒప్పుకున్నాడు. దీంతో మిగతా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. కృష్ణానదిలో పడవేసిన ఇద్దరి మృతదేహాలు ఇప్పటికీ దొరకలేదు. (చదవండి: చీకటి గదిలో బంధించి, బలవంతంగా పెళ్లి) -
ప్రేమజంటపై దాడి కేసులో పురోగతి
అనంతపురం శ్రీకంఠంసర్కిల్/ఆత్మకూరు: ప్రేమజంటపై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆత్మకూరు మండలం పంపనూరు సిటీ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ప్రేమికులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప సీరియస్‌గా పరిగణించారు. దీనిని సవాలుగా తీసుకుని ఛేదించాలని దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులును ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పంపనూరు సమీపంలోని వడ్డుపల్లి మిట్ట వద్ద ప్రేమికులపై దాడి చేసిన ముఠా ఆనవాళ్లను 24 గంటల్లోపే పసిగట్టారు. ప్రాథమికంగా సేకరించిన ఆధారాల మేరకు అనంతపురం నగరానికి చెందిన అల్లరి మూకలే దాడులకు కారణంగా గుర్తించారు. అనంతరం వారు అపహరించిన సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఈ క్రమంలోనే నగరంలోని రాజీవ్ కాలనీ, హెచ్చెల్సీ కాలనీకి చెందిన ఇద్దరితో పాటు కంబదూరుకు చెందిన ఓ యువకుడిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఏకాంతం మాటున ప్రమాదం ప్రేమ జంటలకు పంపనూరు సమీపంలోని సిటీ పార్క్ కేంద్రంగా మారింది. ఏకాంతం కోసం సిటీ పార్క్‌లోని పొదలను ఆశ్రయిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నెల 23న సిటీ పార్క్ సందర్శనకు వచ్చిన ఓ ప్రేమజంటపై గుర్తు తెలియని యువకులు దాడిచేసి మూడు సెల్ఫోన్లు, రెండు తులాల బంగారు నగలు అపహరించుకెళ్లిన విషయం విదితమే. ఇది మొదటి సారి ఏమీ కాదు! గతంలో ఎన్నో సార్లు ప్రేమజంటలను టార్గెట్ చేసి నగదు, విలువైన వస్తువులు అపహరించుకెళ్లారు. సిటీ పార్క్‌లో విహరిస్తూ ఎక్కువగా కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు జంటగా సిటీ పార్క్‌కు వస్తున్నారు. వీరిలో కొందరు మైనర్లు ఉండడం గమనార్హం. కాలేజీకి డుమ్మా కొట్టి పుస్తకాల బ్యాగు పక్కన పడేసి సిటీ పార్క్‌లో చక్కర్లు కొడుతూ ఏకాంతం కోసం గుట్టల్లోని పొదల మాటుకు వెళుతున్నారు. ఇదే అవకాశంగా కొందరు యువకులు వారిని బెదిరించి లూటీ చేస్తున్నారు. చైతన్యం రావాలి ప్రేమజంటపై దాడి చేసిన వారిని పట్టుకు తీరుతాం. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక దృష్టి సారించాం. సిటీ పార్క్ ప్రాంతంలో పోలీసుల పహారా పెంచుతున్నాం. కాకపోతే ప్రజల్లో చైతన్యం రావాలి. ఘటన జరిగిన వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి విషయాన్ని పోలీసులకు చేరవేయాలి. ఇది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. – ఆర్ల శ్రీనివాసులు, దిశ డీఎస్పీ యువత జాగ్రత్తగా ఉండాలి పంపనూరు సిటీ పార్కుకు ఎక్కువగా యువత వస్తుంటారు. కనుచూపు మేర అటవీ ప్రాంతం ఉండడంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. యూనిఫాంతో జంటగా వచ్చే విద్యార్థులను, మైనర్లను అటవీ ప్రాంతంలోకి అనుమతించకుండా చర్యలు తీసుకుంటాం. – ఎస్ఐ శ్రీనివాసులు, ఆత్మకూరు (చదవండి: శాస్త్రీయ పద్ధతులతో సమగర దర్యాప్తు) -
పరువు హత్యకు మరో ప్రేమ జంట బలి
బస్తీ(ఉత్తరప్రదేశ్): పరువు హత్యకు మరో ప్రేమ జంట బలైంది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని పదారియా చేట్‌సింగ్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. వేరే మతం వ్యక్తిని ఇష్టపడిందని అమ్మాయి కుటుంబ సభ్యులే ఈ జంటను హతమార్చారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజిబుల్లా వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసే 18 ఏళ్ల దళిత టీనేజర్ అంకిత్.. ముజిబుల్లా కూతురు అమీనాను ప్రేమించాడు. ప్రేమ వ్యవహారం ఇష్టంలేని అమీనా తండ్రి ముజిబుల్లా కూతురిని వారించాడు. ఎంతకీ వినకపోవడంతో అంకిత్‌ను, అమీనాను హతమార్చారు. రుధౌలీ ప్రాంతంలోని చెరకు తోటలో అమీనాను పాతిపెట్టారు. అంకిత్ మృతదేహాన్ని గుర్తించిన పరాస్నాథ్ చౌదరి పోలీసులకు సమాచారమిచ్చారు. చదవండి: కాళ్ల పారాణి ఆరకముందే.. వరుడు దుర్మరణం, వధువుకు తీవ్ర గాయాలు -
పెద్దలు కాదు.. విధి ఆ ప్రేమజంటను విడదీసింది
ఒకేచోట పని చేసే ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో చెబితే పెద్దలు కాదన్నారు. వీళ్లు ఎదురించారు. ఇంట్లోంచి వెళ్లిపోయి కలిసి బతకాలనుకున్నారు. కానీ, విధి ఈ లవ్‌స్టోరీని విచిత్రమైన మలుపు తిప్పింది. విషాదాంతమైన ముగింపు ఇచ్చింది. హనుమాన్ జంక్షన్ రూరల్ (గన్నవరం): బాపులపాడు మండలం వీరవల్లి వద్ద బైక్‌పై వెళ్తున్న ప్రేమజంట రోడ్డు ప్రమాదానికి గురైంది. 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, యువతి తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైంది. పోలీసుల కథనం మేరకు.. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చెరువూరుకు చెందిన సారపు పోతురాజు, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మెర్సీ కొంతకాలంగా ఓ స్పిన్నింగ్ మిల్లులో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. తమ ప్రేమ విషయాన్ని ఇద్దరూ తమ పెద్దలకు చెప్పగా వారు అంగీకరించలేదు. ఈ నెల 19వ తేదీన మెర్సీకి వేరే యువకుడితో వివాహం చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో 18వ తేదీనే మెర్సీ, పోతురాజు తమ ఇళ్ల నుంచి పరారయ్యారు. దీంతో.. మెర్సీ అదృశ్యమైందని ఆమె తల్లిదండ్రులు తెనాలి టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మెర్సీ, పోతురాజుతో కలిసి అతని స్వగ్రామమైన రంపచోడవరం మండలం చెరువూరులో ఉన్నట్లుగా గుర్తించారు. విచారణ నిమిత్తం తెనాలి టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిందిగా ప్రేమికులకు పోలీసులు సూచించారు. దీంతో పోతురాజు, మెర్సీ బైక్‌పై తెనాలి బయలుదేరారు. వీరవల్లి సమీపంలో జాతీయ రహదారి ప్లై ఓవర్ బ్రిడ్జి మీదకు రాగానే పోతురాజు సెల్‌ఫోన్ మోగింది. అతను బైక్ నడుపుతూనే ఫోన్ మాట్లాడేందుకు ప్రయత్నించాడు. బైక్ అదుపుతప్పి వంతెన సైడ్ వాల్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రేమికులు ఇద్దరూ ఎగిరి ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై నుంచి కింద ఉన్న సర్వీసు రోడ్డుపై పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో పోతురాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మెర్సీ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న వీరవల్లి ఏఎస్ఐ వై.ఆంజనేయులు, హైవే రోడ్ సేఫ్టీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మెర్సీని హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నోట్: వాహనాలు నడిపేటప్పుడు ఫోన్ కాల్ మాట్లాడడం మంచిది కాదు. నిర్లక్ష్యంగా చేసే ఈ పని.. జీవితాలను తలకిందులు చేసే అవకాశం ఉంది. -
విషాదంగా ముగిసిన లవ్‌స్టోరీ.. వాట్సాప్ చాటింగ్ చేసుకుని..
పాలకుర్తి(జనగామ జిల్లా): తమ ప్రేమకు పెద్దలు అడ్డు చెబుతారని భావించిన ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామశివారు భీక్యా నాయక్ గ్రామ పంచాయతీలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. భీక్యా నాయక్ గ్రామ పంచాయతీకి చెందిన బాలిక (16), అదే తండాకు చెందిన గుగులోతు పాపా, టీక్యా దంపతుల కుమారుడు రాజు(22) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. రాజు కారు డ్రైవర్‌గా పని చేస్తుండగా, దీపిక ఇంటర్ చదువుతోంది. చదవండి: ఏమైందో ఏమో.. అన్నయ్య విదేశాలకు వెళ్లిపోవడంతో.. వీరి ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఆందోళనకు గురయ్యారు. తమ పెళ్లి జరగదని భావించిన ఇరువురూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం రాత్రి తండా శివారులోని పల్లె ప్రకృతి వనంలో ముందుగానే సిద్ధం చేసుకున్న పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతంలో తండాలోని ఓ అమ్మాయిని ప్రేమించి ఆమె ఆత్మహత్యకు రాజు కారకుడయ్యాడని తండావాసులు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి రాజు, ఆ బాలిక వాట్సాప్ మెసేజ్‌లు చేసుకున్నారని, ఉద్దేశపూర్వకంగానే బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తమ కూతురికి రాజు బలవంతంగా పురుగుమందు తాగించాడని, తమకు న్యాయం చేయాలని కోరుతూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహాలను పోస్టుమార్టానికి తీసుకెళ్లకుండా తండా వాసులు అడ్డుతగిలారు. పోలీసులు వారికి సర్దిచెప్పి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. -
భార్య గర్భవతి.. మరో అమ్మాయితో టచ్‌లో భర్త.. చివరకు..
సాక్షి, నిజామాబాద్: కొన్ని సంబంధాలు పచ్చిన కాపురంలో చిచ్చు పెడతాయి. దీంతో, వారి కుటుంబాలు వీధిన పడటం, ఫ్యామిలీ సభ్యులు సమాజంలో తలెత్తుకోకుండా చేయడం వంటివి జరుగుతాయి. తాజాగా నిజామాబాద్‌లో ఓ వివాహితుడు.. మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, వారిద్దరూ కలిసి పురుగుల మందు సేవించి జంటగా ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. బోధన్‌లోని భవానిపేటకు చెందిన రాజుకు ఇప్పటికే వివాహమైంది. రాజు భార్య ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి. కాగా, రాజు.. అదే గ్రామానికి చెందిన మైనర్(17)తో కొంత కాలంగా స్నేహంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే అనూహ్యంగా వారిద్దరూ గడ్డివాము వద్ద పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ క్రమంలో అపస్మారక స్థితిలో ఉన్న వీరిద్దరిని అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా, వారిద్దరూ ఇంకా స్పృహాలోని రాకపోవడంతో ఏం జరిగిందనే విషయం పూర్తిగా తెలియడం లేదు. ఇక, వారి పేరెంట్స్ కూడా ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించడంతో అసలు విషయం బయటకు రాలేదు. మరోవైపు.. రాజు వివాహితుడు కావడం ఇలా అమ్మాయితో ఆత్మహత్యాయత్నం చేయడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: నైట్ డ్యూటీ.. నమ్మించి నర్సుపై వైద్యుడి లైంగికదాడి -
సైకో లవర్స్.. ఐదుగురు మహిళలను దారుణంగా హత్య చేసి..!
బెంగళూరు: ఐదుగురు మహిళలను దారుణంగా హత్య చేసి వారి మృతదేహాలను ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేశారు ఇద్దరు లవర్స్. మరో ఐదుగురిని హతమార్చేందుకు ప్రణాళిక చేస్తుండగా పడ్డుబడ్డారు. ఈ సంఘటన కర్ణాటకలోని మండ్యాలో వెలుగు చూసింది. ఈ కేసులో 35 ఏళ్ల వ్యక్తితో పాటు అతడి ప్రేయసిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య చేసినట్లు అంగీకరించిన నిందితుడు.. తన ప్రియురాలిని మహిళలు బలవంతంగా వ్యభిచారంలోకి దింపారని ఆరోపించాడు. అందుకే హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. నిందితుడు రామనగర జిల్లాలోని కుదుర్‌కు చెందిన సిద్ధలింగప్పగా గుర్తించారు పోలీసులు. బెంగళూరులోని అతడి ఇంటి నుంచి అరెస్ట్ చేశారు. ఆ సమయంలో మరో మహిళను హతమార్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. బెంగళూరులోని పీన్యాలో ఫాబ్రికేషన్ విభాగంలో పని చేస్తున్నాడని చెప్పారు. అతడి ప్రేయసిని చంద్రకళగా గుర్తించారు. ఈ హత్యలు చేసేందుకు నిందితుడికి సహకరించిన కారణంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐదుగురు మహిళల హత్యలు కొద్ది నెలల క్రితం జరిగాయి. అయితే.. మరో ఐదుగురు మహిళలను హత్య చేసేందుకు ఈ జంట ప్రణాళికలు రచిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. జూన్ 8న మండ్యాలో కుల్లిపోయిన ఓ శవం దొరికింది. ఆ తర్వాత అదే స్థితిలో మరో మృతదేహం లభించింది. ఆ రెండు ప్రాంతాల మధ్య 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే.. ఈ రెండు మృతదేహాలు సగభాగం మాత్రమే లభించాయి. దీంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 9 టీంలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మిస్సింగ్ కేసులను పరిశీలించారు. కర్ణాటకతో పాటు పక్క రాష్ట్రాల్లోనూ మొత్తం 1,116 మిస్సింగ్ కేసులను పరిశీలించారు. చివరకు బెంగళూరులో నిందితుడు సిద్ధలింగప్పను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు.. కొన్నేళ్ల క్రితం వరకు సెక్స్ వర్కర్‌గా చేసిన చంద్రకళతో సంబంధం ఏర్పడిందని సిద్ధలింగప్ప పోలీసులకు తెలిపాడు. తాను ఏ విధంగా ఈ వృత్తిలోకి వచ్చిందో లింగప్పకి చెప్పింది చంద్రకళ. ఆమెను బలవంతంగా పడుపు వృత్తిలోకి దించిన వారిని చంపాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు లింగప్ప. మే నెలలో బెంగళూరులో తొలి హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేశాడు. మే 30, జూన్ 3న మైసూర్లో మరో ఇద్దరు మహిళలను చంద్రకళ సాయంతో హతమార్చాడు. మిగిలిన వారిని సైతం వారే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదీ చదవండి: కట్నం కోసం భర్త వికృత రూపం.. డ్రగ్స్ మత్తులో ఫ్రెండ్స్‌తో కలిసి.... -
కలిసి బతకలేమని.. చావులోనైనా ఒక్కటవ్వాలని..
బెళుగుప్ప(అనంతపురం జిల్లా): దశాబ్దాలు వేగంగా మారుతున్నాయి.. సాంకేతిక వ్యవస్థ సరికొత్త పుంతలు తొక్కుతోంది. మనిషికి చావే లేకుండా చేసేందుకు ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే కుల జాడ్యం మాత్రం మనుషుల మధ్య చిచ్చుపెడుతూనే ఉంది. తాజాగా కుల పట్టింపులకు ఓ ప్రేమ జంట బలైంది. తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకోకపోవడంతో నిండు నూరేళ్లు కలసి బతకాల్సిన ఆ యువతీ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. చదవండి: మిస్ సౌత్ ఇండియాగా వైజాగ్ అమ్మాయి రాయదుర్గం పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన శ్రీకన్య (20) స్థానిక నర్సరీలో పనిచేసేది. రాయదుర్గం మండలం కెంచానపల్లికి చెందిన బోయ ధనుంజయ (23) పట్టణంలోని ఓ సెల్‌ఫోన్ రిపేరీ షాపులో పనిచేసేవాడు. ఏడాదిన్నర క్రితం వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. తమ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబీకులకు తెలిపారు. అయితే కులాలు వేరు కావడంతో ఇరువైపుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దీంతో మనస్తాపం చెందిన శ్రీకన్య, ధనుంజయ కలిసి బతకలేమని భావించారు. చావులోనైనా ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. బుధవారం రాత్రి వీరిద్దరూ బెళుగుప్ప మండలం నరసాపురం సమీపంలోని ఓ తోట వద్దకు చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న విషద్రావకం తాగారు. ఆ తర్వాత తమ స్నేహితులకు ఫోన్ చేసి తాము చనిపోతున్నామని తెలిపారు. దీంతో వారు బెళుగుప్ప పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే వారున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ వెంటనే 108 వాహనం రావటంతో అందులో వారిని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీకన్య గురువారం తెల్లవారుజామున, రాత్రి ధనుంజయ మృతి చెందారు. ఈ ఘటనపై యువతి తండ్రి తిప్పేస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బెళుగుప్ప ఎస్ఐ రుషేంద్రబాబు తెలిపారు. -
ప్రేమ జంటను విడదీసిన విధిరాత
తూర్పు గోదావరి (పిఠాపురం): డిగ్రీ పూర్తి చేసుకున్న యువకుడు, ఇంటర్ చదివిన యువతి ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరిస్తారో లేదో అన్న అనుమానంతో తామే పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలని బయలుదేరారు. కానీ రోడ్డు ప్రమాద రూపంలో విధి వారిని విడదీసింది. పిఠాపురం సమీపంలో రాపర్తి సెంటర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రేమ జంట తీవ్ర గాయాల పాలవ్వగా ప్రియుడు మృతి చెందాడు. ప్రియురాలు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. పిఠాపురం పట్టణ ఎస్సై శంఖరరావు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ జగన్నాథపురానికి చెందిన పాలెపు గణేష్ అదే ప్రాంతానికి చెందిన దీప్తి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. గురువారం రాత్రి తాము అన్నవరం వెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా రు. మోటారుసైకిల్‌పై గురువారం అర్ధరాత్రి బయలు దేరారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో పిఠాపురం రాపర్తి సెంటర్‌కు వచ్చే సరికి 216 జాతీయ రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను వీరి వాహనం బలంగా ఢీకొంది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పెట్రోలింగ్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి 108లో తరలించారు. గణేష్ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. దీప్తి చికిత్స పొందుతోంది. కాగా తమ కుమారుడిని ఎవరో వ్యక్తులు చంపేశారని మృతుడి తల్లి లక్ష్మి పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
మెట్రో రైలులో లవర్స్ రచ్చ!.. అవాక్కైన ప్రయాణికులు
వారిద్దరూ లవర్స్ అనుకుంటా.. సరదాగా మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా సీరియస్ అయిన ఆమె.. యువకుడిని పొట్టుపొట్టు కొట్టింది. ఇంతలో నన్నే కొడతావా అంటూ యువకుడు సైతం చెంపపై ఒక్కటిచ్చాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ యువతి, యువకుడు.. ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. ఇంతలో వారి మధ్య టీ షర్ట్ ధరపై వాగ్వాదం మొదలైంది. ఆమె తాను వేసుకున్న టీ షర్ట్‌ను వేయి రూపాయలకు కొనుగోలు చేశానని చెప్పింది. ఈ క్రమంలో యువకుడు.. ఆ టీ షర్ట్ రూ. 150కే దొరుకుతుందని ఫన్నీగా అన్నాడు. దీంతో, ఆమె కోపంతో ఊగిపోయి.. యువకుడి చెంప చెల్లుమనిపించింది. ఈ క్రమంలోనే "మమ్మీ కో బోలుంగీ మెయిన్" (నేను తల్లికి చెబుతాను) అని చెబుతుంది. దీనికి వెంటనే.. సదరు యువకుడు.."తేరే జైసా లడ్కా కిస్కికో నా మైలే" (నీలాంటి వ్యక్తి ఎవరికీ ఉండకూడదు) అంటూ బదులిచ్చాడు. దీంతో, మరింత రెచ్చిపోయిన యువతి.. వరుసగా ఆమె చెంపదెబ్బలు కొడుతుండటంతో యువకుడు కూడా ఆమె చెంప చెల్లుమనిపించాడు. అనంతరం ఒకరిపై ఒకరు అరుచుకుంటూ స్టేషన్ రాగానే రైలు దిగి వెళ్లిపోయారు. అనంతరం వారి చేష్టలకు షాకైన ప్రయాణికులు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. Delhi metro entertainment 😂😂pic.twitter.com/LLdIDHB54N— kartik (@Kartik_sharmaji) July 12, 2022 ఇది కూడా చదవండి: ‘సార్.. ప్లీజ్ మమ్మల్ని విడిచి వెళ్లొద్దు’.. టీచర్ అంటే ఇలా ఉండాలా? -
అర్ధరాత్రి పార్టీలో ఫైటింగ్.. లవర్స్ హల్చల్
ప్రేమ జంటలు ఒకరినొకరు చితకబాదుకున్నారు. తమ పార్టనర్స్ మోసం చేశారని ఆరోపిస్తూ పొట్టు పొట్టు తన్నుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. న్యూయార్క్‌లోని ఓ క్రూయిజ్ షిప్‌లోని ఐదో అంతస్తులో అర్ధర్రాతి ఫుల్ జోష్‌లో పార్టీ జరుగుతోంది. ఆ పార్టీలో దాదాపు 60-70 మంది ప్రయాణికులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు ప్రేమికులు.. తమ పార్టనర్స్ తమను మోసం చేశారని ఆరోపిస్తూ కేకలు వేశారు. దీంతో, వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా దాడులకు దారి తీసింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రేమికులు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. బట్టలు చింపుకుంటూ.. జుట్టు పట్టుకుని పొట్టుపొట్టు కొట్టుకున్నారు. ఒకరిపై మరోకరు పడిపోయి పిడిగుద్దులు కురిపించుకుంటున్నారు. దాదాపు గంట పాటు ఇలా కొట్టకున్నారు. దీంతో, షిప్ సిబ్బంది నోరెళ్లబెట్టారు. చేసేదేమీ లేక చూస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదేం ఫైట్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. last nights festivities on my carnival cruise 🥳🛳 pic.twitter.com/uehhfmCfaC — naim (@nyeem0) June 28, 2022 -
ప్రేమికులను కత్తితో బెదిరించి.. కొండపైకి తీసుకెళ్లి వివస్త్రలను చేసి..
జయపురం(భువనేశ్వర్): ప్రేమికులను భయపెట్టి డబ్బులు డిమాండ్ చేసిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జయపురం సబ్ డివిజనల్ పోలీసు అధికారి అరూప్ అభిషేక్ బెహర శనివారం తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. జయపురం పారాబెడకు కొంతదూరంలో ఇద్దరు ప్రేమికులు శుక్రవారం మాట్లాడుతూ ఉండగా వారి వద్దకు ఇద్దరు యువకులు వెళ్లి భయపెట్టారు. తమ వద్దనున్న కత్తిని చూపించి ప్రేమికులను సమీప కొండపైకి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న మరో ముగ్గురు దుండగులతో కలిసి ప్రేమికులను నగ్నంగా చేసి ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని హెచ్చరించి, రూ.50 వేలు డిమాండ్ చేశారు. అయితే తమ వద్ద డబ్బులు లేకపోవడంతో రూ.7 వేల నగదును ప్రేమికులు దుండగులకు ఇచ్చారని వెల్లడించారు. శనివారం మరో రూ.13 వేలు ఇచ్చేందుకు అంగీకరించి, మిగతా రూ.30 వేలు నెల రోజుల్లో ఇస్తామని ప్రేమికులు దుండగులకు చెప్పినట్లు తెలిపారు. అనంతరం బందువుల సాయంతో వీరు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేసి 5 దుండగులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అరెస్టైనవారిలో జయపురం కౌదంబ వీధి టుకున జాని, రోహిత్ గరడ, దీపక్ సావుడ్, కపిల పొరిచ, ఒక మైనర్ బాలుడు ఉన్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, రూ.7 వేల నగదు, కత్తి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.