ప్రేమను అంగీకరించలేదు.. కలిసి బతకలేమని అర్థమైంది.. అందుకే.. | Lovers End Their Life Parents Reject Marriage Proposal Ap | Sakshi
Sakshi News home page

ప్రేమను అంగీకరించలేదు.. కలిసి బతకలేమని అర్థమైంది.. అందుకే..

Published Sun, Nov 21 2021 1:40 PM | Last Updated on Sun, Nov 21 2021 2:14 PM

Lovers End Their Life Parents Reject Marriage Proposal Ap - Sakshi

సాక్షి,కృష్ణాజిల్లా: తాము బతికుంటే వారి ప్రేమ బతకదని తెలసి ఆత్మహత్యకు పాల్పడింది ఓ ప్రేమజంట. ఈ విషాద ఘటన ముసునూరు మండలం లోపూడి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడు చెందిన ఓ ప్రేమజంట తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని పురుగులు మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారికి సమీపంలోని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు.

కాగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి 2 గంటల సమయంలో వారిద్దరూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతులు ముసునూరు మండలం లోపూడికి చెందిన లీలాకుమారి, పశ్చిమగోదావరి జిల్లా ఎర్రవారిగూడెంకి చెందిన అనిల్ కుమార్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: వివాహేతర సంబంధం: నమ్మించి లాడ్జికి తీసుకువెళ్లి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement