మనదేశంలో తయారయ్యే ఫాస్ట్‌ఫుడ్‌లలో అత్యధికంగా అమ్ముడయ్యే ఆహారం నూడుల్స్. దేశంలో ఏ మూల చూసినా నూడుల్స్ దుకాణాలు కనిపిస్తాయి. అయితే ఇటీవలికాలంలో తైవాన్‌లో నూడుల్స్‌తో రూపొందించిన ఒక డిష్ ఎంతో ఆదరణ పొందుతోంది.
ప్రపంచంలో రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు అక్కడి ఆహారాలలో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. ఆహార ప్రియులు అన్ని రకాల ఆహారాలను ఆస్వాదించేందుకు ఉవ్విళ్లూరుతుంటారు.
అటు మాంసాహారులు, ఇటు శాకాహారులు తమకు అనువైన వంటకాల కోసం వెదుకుతుంటారు. కొన్ని దేశాల్లో పురుగులు, కీటకాలు, కప్పలు ఆహారంలో భాగంగా మారిపోయాయి. కొన్ని ఆహారాలు ఎంత వింతగా ఉంటాయంటే వాటి గురించి వినగానే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి విచిత్రమైన ఒక డిష్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చిరు కప్పలతో నోరూరించే నూడుల్స్..
తైవాన్‌లో ఇటీవలికాలంలో కప్పల నూడుల్స్ ఎంతో ఆదరణ పొందుతోంది. ఆహార ప్రియులు ఈ నూడుల్స్‌ను తెగ ఎంజాయ్ చేస్తూ లాగించేస్తున్నారు. నోరూరించే వేడివేడి నూడుల్స్‌పై చిరు కప్పలను ఉంచి, సర్వ్ చేయడం ఈ డిష్ ప్రత్యేకత.
కప్పలను ఉడికించి, మసాలా దట్టించి..
ఆడిటీ సెంట్రల్ న్యూస్ అందించిన ఒక రిపోర్టు ప్రకారం తైవాన్‌లోని యున్‌లిన్‌లో యువాన్ రమెన్ అనే రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్‌లో కప్పల నూడుల్స్‌ను ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఈ డిష్ ప్రత్యేకత ఏమిటంటే గార్నిషింగ్‌లో కప్పలను వినియోగిస్తారు. ఇందుకోసం కప్పలను ముందుగా బాగా ఉడికించి, వాటికి మసాలా దట్టించి, నూనెలో దోరగా వేయిస్తారు.
ఈ డిష్ పేరు ఏమిటంటే..
నూడుల్స్‌పై అప్పటికే మసాలా దట్టించి సిద్ధం చేసిన కప్పలను గార్నిషింగ్ చేస్తారు. కప్పల పైచర్మాన్ని తీయకుండానే ఇందుకోసం వినియోగిస్తారు. సోషల్ మీడియా యూజర్స్ ఈ డిష్‌కు ‘ఫ్రాగ్, ఫ్రాగ్, ఫ్రాగ్ రమెన్’ అనే పేరు పెట్టారు.
ధర ఎంతంటే..
మీడియాకు అందిన సమాచారం ప్రకారం రమెన్ రెస్టారెంట్‌లో ఈ డిష్‌ను కేవలం మంగళవారం, బుధవారం రాత్రి డిన్నర్ సమయాలలో మాత్రమే వడ్డిస్తారు. ఈ విచిత్రమైన డిష్ ఖరీదు 8 అమెరికన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ. 650. రెస్టారెంట్‌కు వెళ్లిన ఎవరైనా ఈ డిష్‌కు ఫొటో తీసుకోవాలనుకంటే 3.2 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ డిష్‌ను అక్కడి ఆహార ప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు.
ఇది కూడా చదవండి: చైనాలో మరో అద్భుతం: బిల్డింగ్ మధ్య నుంచి దూసుకుపోయే రైలు..
Comments
Please login to add a commentAdd a comment