World Thinking Day: ‘మన ప్రపంచం.. మన భవిష్యత్‌’ థీమ్‌తో.. | World Thinking day-2025 is Being Celebrated with the Theme | Sakshi
Sakshi News home page

World Thinking Day: ‘మన ప్రపంచం.. మన భవిష్యత్‌’ థీమ్‌తో..

Published Sat, Feb 22 2025 9:32 AM | Last Updated on Sat, Feb 22 2025 9:33 AM

World Thinking day-2025 is Being Celebrated with the Theme

‘ఏ దేశంలోని ప్రజలు సదాలోచనలతో మెలుగుతారో, ఆ దేశ భవిష్యత్‌ బంగారుమయం అవుతుంది’ అని అంటారు. దీనికి ప్రతీకగా ‘వరల్డ్‌ థింకింగ్‌ డే’(World Thinking Day) అంటే ప్రపంచ ఆలోచనా దినోత్సవాన్ని ‍ప్రతీయేటా ఫిబ్రవరి 22న నిర్వహిస్తుంటారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సదాలోచనల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అలాగే ప్రపంచ సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించేందుకు ప్రేరణ కల్పిస్తుంది.

ఈ రోజు స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌(Scout and Guides)కు ప్రత్యేకమైనదిగా భావిస్తారు. దేశానికి యువశక్తే వెన్నెముకలాంటిదని అంటారు. 1926లో తొలిసారిగా ‘వరల్డ్‌ థింకింగ్‌ డే’ను నిర్వహించారు. నాటి నుంచి ప్రపంచ ఆలోచనా దినోత్సవం రోజున యువతకు గల అధికారాలు, వారి బాధ్యతలపై నిపుణులు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటారు. స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ అంతర్జాతీయ సదస్సు నిర్వహణపై ఈరోజునే ప్రస్తావనకు వచ్చింది. ‘వరల్డ్‌ థింకింగ్‌ డే’ తొలిసారిగా లండన్‌లో ప్రారంభమయ్యింది. స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ విభాగం ప్రపంచ సోదరభావాన్ని, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుకే ఈ రోజు స్కౌట్‌ అండ్‌ గైడ్స్ సభ్యులు ప్రపంచంలో ఐక్యతకు గల ప్రాధాన్యత, పాజిటివ్‌ థింకింగ్‌ గురించి చెబుతుంటారు.

2025 ‘వరల్డ్‌ థింకింగ్‌ డే’ విషయానికొస్తే ఈరోజును ‘మన ప్రపంచం- మన భవిష్యత్‌’(‘Our World - Our Future’) థీమ్‌తో నిర్వహిస్తున్నారు. దీని ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతలో పలు అంశాల్లో చైతన్యం తీసుకురావడం. అలాగే ప్రపంచాన్ని మరింత అభివృద్ధిదాయకంగా తీర్చిదిద్దడంలో ఐక్యతకు గల అవసరాన్ని చాటిచెప్పడం. వివిధ అంశాలపై యువతరానికి అవగాహన కల్పించడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం.  ప్రపంచంలోని వివిధ సమస్యలపై ఆలోచించేందుకు, యువత తమ పాత్రను చక్కగా పోషించడానికి ఈరోజు ప్రేరణ కల్పిస్తుంది. ప్రపంచ ఆలోచనా దినోత్సవం నాడు పలుచోట్ల సదాలోచనలపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సమాజంలో సానుకూల మార్పులు తీసుకువచ్చేందుకు మేథావులు చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రపంచాన్ని మరింత మెరుగైనదిగా మార్చేందుకు ఉపకరించే పర్యావరణం, విద్య, లింగ సమానత్వం లాంటి సామాజిక అంశాలపై చర్చించేందుకు ‘వరల్డ్‌ థింకింగ్‌ డే’ వేదికకానుంది.

ఇది కూడా చదవండి: Mahakumb‍: నేడు, రేపు జనప్రవాహం.. పర్యవేక్షణలో సీఎం యోగి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement