Scouts and Guides
-
World Thinking Day: ‘మన ప్రపంచం.. మన భవిష్యత్’ థీమ్‌తో..
‘ఏ దేశంలోని ప్రజలు సదాలోచనలతో మెలుగుతారో, ఆ దేశ భవిష్యత్ బంగారుమయం అవుతుంది’ అని అంటారు. దీనికి ప్రతీకగా ‘వరల్డ్ థింకింగ్ డే’(World Thinking Day) అంటే ప్రపంచ ఆలోచనా దినోత్సవాన్ని ప్రతీయేటా ఫిబ్రవరి 22న నిర్వహిస్తుంటారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సదాలోచనల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అలాగే ప్రపంచ సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించేందుకు ప్రేరణ కల్పిస్తుంది.ఈ రోజు స్కౌట్ అండ్ గైడ్స్(Scout and Guides)కు ప్రత్యేకమైనదిగా భావిస్తారు. దేశానికి యువశక్తే వెన్నెముకలాంటిదని అంటారు. 1926లో తొలిసారిగా ‘వరల్డ్ థింకింగ్ డే’ను నిర్వహించారు. నాటి నుంచి ప్రపంచ ఆలోచనా దినోత్సవం రోజున యువతకు గల అధికారాలు, వారి బాధ్యతలపై నిపుణులు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటారు. స్కౌట్ అండ్ గైడ్స్ అంతర్జాతీయ సదస్సు నిర్వహణపై ఈరోజునే ప్రస్తావనకు వచ్చింది. ‘వరల్డ్ థింకింగ్ డే’ తొలిసారిగా లండన్‌లో ప్రారంభమయ్యింది. స్కౌట్ అండ్ గైడ్స్ విభాగం ప్రపంచ సోదరభావాన్ని, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుకే ఈ రోజు స్కౌట్ అండ్ గైడ్స్ సభ్యులు ప్రపంచంలో ఐక్యతకు గల ప్రాధాన్యత, పాజిటివ్ థింకింగ్ గురించి చెబుతుంటారు.2025 ‘వరల్డ్ థింకింగ్ డే’ విషయానికొస్తే ఈరోజును ‘మన ప్రపంచం- మన భవిష్యత్’(‘Our World - Our Future’) థీమ్‌తో నిర్వహిస్తున్నారు. దీని ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతలో పలు అంశాల్లో చైతన్యం తీసుకురావడం. అలాగే ప్రపంచాన్ని మరింత అభివృద్ధిదాయకంగా తీర్చిదిద్దడంలో ఐక్యతకు గల అవసరాన్ని చాటిచెప్పడం. వివిధ అంశాలపై యువతరానికి అవగాహన కల్పించడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ప్రపంచంలోని వివిధ సమస్యలపై ఆలోచించేందుకు, యువత తమ పాత్రను చక్కగా పోషించడానికి ఈరోజు ప్రేరణ కల్పిస్తుంది. ప్రపంచ ఆలోచనా దినోత్సవం నాడు పలుచోట్ల సదాలోచనలపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సమాజంలో సానుకూల మార్పులు తీసుకువచ్చేందుకు మేథావులు చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రపంచాన్ని మరింత మెరుగైనదిగా మార్చేందుకు ఉపకరించే పర్యావరణం, విద్య, లింగ సమానత్వం లాంటి సామాజిక అంశాలపై చర్చించేందుకు ‘వరల్డ్ థింకింగ్ డే’ వేదికకానుంది.ఇది కూడా చదవండి: Mahakumb: నేడు, రేపు జనప్రవాహం.. పర్యవేక్షణలో సీఎం యోగి -
హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నకిలీ సంస్థ
సాక్షి, అమరావతి: హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ అసోసియేషన్‌కు, పాఠశాల విద్యాశాఖకు ఎటువంటి సంబంధం లేదని ఆ శాఖ కమిషనర్ సురేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పేరుతో కొందరు వ్యక్తులు రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రచారం చేస్తున్నారని, నిరుద్యోగ యువత వారిని నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ తరహా మోసపూరిత కార్యకలాపాలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. రాష్ట్రంలో కొన్ని అనధికార సంస్థలు స్కౌట్స్ అండ్ గైడ్స్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం గుర్తించిన ఒకే ఒక్క సంస్థ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని, ఈ సంస్థ న్యూఢిల్లీలోని నేషనల్ అసోసియేషన్‌కు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉందని తెలిపారు. అసోసియేషన్ ఆఫ్ గర్ల్ గైడ్స్ అండ్ గర్ల్ స్కౌట్స్ కూడా రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ అసోసియేషన్ అనేది నకిలీ సంస్థ అని, రాష్ట్రంలో కార్యకలాపాలు కొనసాగించేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ ఇతర కార్యాలయాలు ఆ సంస్థకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టంచేశారు. -
రోల్‌మోడల్‌గా ఎదగాలి
కవాడిగూడ: స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ కమిటీ దేశంలోనే రోల్‌మోడల్‌గా ఎదగాలని రాష్ట్ర గవర్నర్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర ప్యాట్రన్ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. దీనికిగానూ గైడ్స్‌కు తనవంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. గురువారం దోమలగూడ గగన్ మహల్‌లోని ‘భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్’తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫౌండేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన గవర్నర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, గురువులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. తాను కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థినేనని గుర్తుచేశా రు. సమాజానికి ఏ విధంగా సహాయం చేయాలి, ఇతరుల పట్ల ఎలా ఉండాలో ఇక్కడే నేర్చుకున్నానని తెలిపారు. తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు గైడ్స్ శిక్షణ తీసుకున్నానని చెప్పారు. అనంతరం తెలంగాణ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర గవర్నర్ స్కౌట్స్ డ్రెస్‌లో రావడం సంతోషంగా ఉందన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయని, ప్రస్తుతం ఇక్కడ 590 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. గత రెండేళ్లుగా చేపడుతోన్న కార్యక్రమాలపై ఆమె నివేదిక సమర్పించారు. అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాల ప్రాంగణంలో గవర్నర్‌తో కలిసి ఆమె మొక్కలను నాటారు. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా 8 మంది విద్యార్థులకు రాజ్యపురస్కారాలను అందించారు. కాగా, పీయర్స్ కన్స్ట్రక్షన్స్ ఎండీ అస్లాం బిన్ మహ్మద్ రూ.10 లక్షల విరాళం చెక్‌ను గవర్నర్‌కు అందజేశారు. కవిత కూడా రూ.5 లక్షలు అందించా రు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, కోశాధికారి రాజగోపాల్, జాయింట్ సెక్రటరీ మంచాల వరలక్ష్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
గోవిందా.. వసూళ్ల దందా!
టీటీడీ స్కౌట్స్ అండ్ గైడ్స్ అక్రమాలకు అంతేలేకుండా పోతోంది. అర్హత లేనివారిని అందలం ఎక్కిస్తున్నారు. శిక్షణ ఇచ్చినట్లు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. దొడ్డిదారిలో తిరుమల శ్రీవారి సేవకులుగా నియమిస్తున్నారు. అడ్డదారుల్లో వసూళ్ల దందా సాగిస్తున్నారు. ఇందులో కొందరు రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ సీఎం బంధువులు పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ విషయాలపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చినట్లు తెలుస్తోంది. అయినా సంబం ధిత టీటీడీ, విద్యాశాఖ అధికారులు ఇంతవరకు నోరుమెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాక్షి, తిరుపతి : చిన్నారుల ఉజ్వల భవిష్య త్తు, ఉన్నత విలువలు పెంపొందించేందుకు తోడ్పడే స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థను జిల్లాలో రెండు విభాగాలుగా ఏర్పాటు చేశారు. తిరుమలలో సేవల నిమిత్తం 1968లో టీటీడీ జిల్లా స్కౌట్స్ సంఘం ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా ఒక నిబంధన ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో స్కౌట్స్ అధికారుల తీరు మరోలా ఉంది. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొనాలంటే ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. తిరుపతి అర్బన్ పరిధిలోని 33 మండలాలకు చెందిన వారు మాత్రమే టీటీడీ స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు అర్హులు. నిర్వాహకులు ఈ నిబంధనను తుంగలో తొక్కేశారు. ఇతర జిల్లాకు చెందిన వారిని మాత్రమే తీసుకుంటున్నారు. పైగా వారికి ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే సేవలను వినియోగించుకుంటున్నారు. స్కౌట్ మాస్టర్స్‌ను వినియోగించాల్సి ఉన్నప్పటికీ వారికి ఇష్టమొచ్చిన వారిని రిక్రూట్ చేసుకుని పరోక్షంగా లబ్ధి పొందుతున్నారు. ఆధార్‌లో అడ్రస్ గల్లంతు స్కౌట్స్ అండ్ గైడ్స్ నిర్వాహకులు కొందరు అర్హత లేకున్నా డబ్బులు తీసుకుని ఆధార్‌లో అడ్రస్‌లను మార్చేస్తున్నారు. ఎలాంటి అర్హత లేకున్నా శిక్షణ ఇచ్చినట్లుగా సర్టిఫికెట్స్ జారీ చేస్తున్నారు. తర్వాత వారిని స్కౌట్ సేవకు పంపిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. పైగా రిటైర్డ్ ఉద్యోగుల కనుసన్నల్లో స్కౌట్స్ సేవలు నడుస్తున్నాయి. ఎలాంటి శిక్షణ లేని, అనర్హులు టీటీడీ స్కౌట్స్‌లో తిష్ట వేసి ఉన్నా రు. నిర్వాహకులు కొందరు ఆధార్ కార్డుల్లో అడ్రస్‌లు మార్పు చేసి మరీ శ్రీవారి స్కౌట్స్ సేవలకు నియమిస్తున్నారు. రాష్ట్రంలోని 12 జిల్లాల నుంచి ఎలాంటి శిక్షణ లేకుండా స్కౌట్ సేవలకు అర్హత లేని వారిని నియమించి లబ్ధిపొందుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్కౌట్స్ స్టేట్ చీఫ్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర సెక్రటరీ రామ్మెహన్‌రావు లాలూచీతో టీటీడీ స్కౌట్స్ ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నట్లు సమాచారం. శిక్షణ లేకున్నా..వారంలో సర్టిఫికెట్స్ జారీ పైసలిస్తే... స్కౌట్స్ సర్టిఫికెట్స్ ఇచ్చేస్తున్నారు. లైఫ్ టైం సర్టిఫికెట్స్‌కు రూ.2,500, సాధారణ సర్టిఫికెట్‌కు రూ.1200 చొప్పున వసూళ్లు చేస్తున్నారు. ఇలా వందలాది మంది నుంచి డబ్బులు వసూళ్లు చేసుకుని సేవకులుగా నియమిస్తున్నారు. వారం రోజులు తిరుమలలో స్కౌట్స్ శ్రీవారి సేవ అంటూ...ప్రచారం సాగిస్తున్నారు. జిల్లాలో ఏజెంట్ల ద్వారా యువతీయువకులను తిరుమలకు తరలిస్తున్నారు. వారికి ఎలాంటి శిక్షణ ఉండదు.. అప్పటికప్పుడు శిక్షణ సర్టిఫికెట్స్ ఇచ్చిపంపిస్తున్నారు. ఆ సర్టిఫికెట్స్‌లో పాత తేదీల్లో శిక్షణ పొందినట్లు సర్టిఫికెట్స్ జారీ చేయడం చకచకా జరిగిపోతోంది. శ్రీవారు అంటే భక్తి ఉన్న వారు.. కాస్త ఆర్థికంగా బలంగా ఉన్నవారు.. వారం రోజుల పాటు తిరుమలలో ఉన్న తమకు చాలు అనుకునే వాళ్లు.. సేవ ముసుగులో ప్రతి వారం తిరుపతి టీటీడీ స్కౌట్స్ జిల్లా కార్యాలయానికి చేరుకోవడం దొంగ సర్టిఫికెట్స్ చూపించడం, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో రిజిస్టర్ చేసుకుని తిరుమలకు చేరుకోవడం ఇట్టే జరిగిపోతోంది. దొడ్డిదారిలో శ్రీవారి దర్శన భాగ్యం తిరుమలలో శ్రీవారిని 40–70 అడుగులు దూరం నుంచి క్షణకాల దర్శనం కోసం ఎదురుచూసే భక్తులు లక్షల మంది ఉన్నారు. స్కౌట్ సేవల పేరుతో కొందరు దొడ్డి దారిలో వీ.ఐ.పీ బ్రేక్ దర్శనం సమయంలో, ఆర్జిత సేవల్లో శ్రీవారి సన్నిధిలో విధులు నిర్వహించడం కోసం పోటీపడుతున్నారు. 4 గంటలు పాటు స్వామి సన్నిధిలో డ్యూటీ కోసం.. స్కౌట్ సేవకు ఎగబడుతున్నారు. ఆనందనిలయం సన్నిధిలో డ్యూటీ కోసం ఇక్కడ పోటీ పడి సేవకు సిద్ధమవుతున్నారు. టీటీడీలో పనిచేసే వారికీ దక్కని స్వామి సేవ స్కౌట్ ముసుగులో ఇక్కడ తిష్టవేస్తున్నారు. స్కౌట్స్ సేవల్లో పాల్గొన్న వారికి టీటీడీ భోజన వసతితో పాటు బస్ పాస్‌లు.. సేవ ముగిశాక తిరుగు ప్రయాణంలో ఒక్కొక్కరికీ మూడు లడ్డూలు అందిస్తుంది. నిద్దరోతున్న టీటీడీ విద్యాశాఖ తిరుమలలో సేవ కోసం వచ్చిన వారిలో ఎక్కువ మంది ఎలాంటి శిక్షణ లేని వాళ్లని తెలిసినా.. టీటీడీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదు. వారికి కావాల్సిందల్లా శ్రీవారి సేవకులు. అందు కోసం నిబంధనలకు నీళ్లొదిలేస్తున్నారు. టీటీడీ స్కౌట్స్ రిటైర్డ్ ఉద్యోగులు తిష్టవేసి మరీ ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర కమిషనర్ రెండు నెలలు క్రితం నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీచేశారు. కానీ వాటికి వక్రభాష్యం చెబుతూ సరికొత్త దారుల్లో స్కౌట్స్ అధికారులు తూట్లు పొడుస్తున్నారు. ఎన్నికలు నిర్వహించరే..! చిత్తూరు జిల్లా స్కౌట్స్ ఎన్నికలు నిర్వహిస్తోంది. టీటీడీ పరిధిలో స్కౌట్స్ మాస్టర్స్‌తో ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా అన్నీ తానై వ్యవహరించే రిటైర్డ్ ఉద్యోగులు అడ్డుపడుతున్నారు. ఎన్నికలు నిర్వహించమని రాష్ట్ర చీఫ్ కమిషనర్ సంధ్యారాణి ఆదేశాలు జారీ చేసినా మాజీ అధికారులు పెడచెవిన పెడుతున్నారు. టీటీడీ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో జరుగుతున్న తీరుపైన రాష్ట్ర కమిషనర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలిసింది. టీటీడీ విజిలెన్స్ అధికారుల నుంచి నివేదిక కూడా తెప్పించినట్లు సమాచారం. సర్టిఫికెట్స్‌కు వేలకు వేలు బేరం ఆడిన ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. ఇంత జరుగుతున్నా.. టీటీడీ ఉన్నతాధికారులు, విద్యాశాఖాధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. స్థానిక స్కౌట్ మాస్టర్లు, ఆర్గనైజర్లు న్యాయ పోరాటం సాగిస్తూనే ఉన్నారు. -
గవర్నర్‌తో ఎంపీ కవిత భేటీ
హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్‌తో నిజామాబాద్ ఎంపీ కవిత భేటీ అయ్యారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మొదటి కౌన్సిల్ సమవేశానికి గవర్నర్‌ను ఆమే ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ నియామకాల్లో.. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మాదిరి స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు లబ్ధి కలిగేలా చూడాలని.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో స్కౌట్‌ను తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా ఏపీ, తెలంగాణ యూనిట్స్‌గా విభజన అయ్యాయని తెలిపారు. గత ఏడాదిలో తెలంగాణ స్కౌట్స్ సాధించిన విజయాలను గవర్నర్‌కు తెలియజేశామన్నారు. -
29 నుంచి కర్ణాటకలో స్కౌట్స్, గైడ్స్ జాతీయ సమ్మేళనం
గుంటూరు ఎడ్యుకేషన్ : కర్ణాటకలోని మైసూరులో ఈనెల 29 నుంచి జనవరి 4వ తేదీ వరకూ జరిగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ మహా సమ్మేళనంలో జిల్లా నుంచి 40 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులు రెడ్డి ఓప్రకటనలో తెలిపారు. మహా సమ్మేళనంలో దేశంలోని 29 రాష్ట్రాలతో పాటు అనేక దేశాల నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, ఆహార అలవాట్లు తెలుసుకునేందుకు మహా సమ్మేళనం ద్వారా అవకాశముంటుందన్నారు. మహా సమ్మేళనంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని తెలిపారు. జిల్లాకు చెందిన 40 మంది విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్ తరఫున రాష్ట్రంలోనే పెద్ధ కంటింజెంట్‌గా పాల్గొంటున్నారని వివరించారు. -
యాసిడ్ నీటిలో పడి కరిగిపోయాడు
-
యాసిడ్ నీటిలో పడి కరిగిపోయాడు
అగ్నిపర్వతాలకు చేరువలో ప్రవహిస్తున్న నీటిలో పడి ఓ యువకుడు కరిగిపోయిన దారుణ సంఘటన అమెరికాలోని వ్యోమింగ్ లో గల ఎల్లోస్టోన్ జాతీయ ఉద్యానవనంలో చోటు చేసుకుంది. వాస్తవానికి ఈ ఏడాది జూన్ లో దుర్ఘటన జరిగినా మీడియా దృష్టికి రాలేదు. అక్కడి మీడియా సంస్ధలు తెలిపిన వివరాల ప్రకారం.. ఓరేగాన్ కు చెందిన కొలిన్ నాథనీల్ స్కాట్, అతని సోదరి(పేరు చెప్పలేదు) విహారయాత్రకు ఎల్లోస్టోన్ జాతీయ ఉద్యానవనానికి వెళ్లారు. అగ్నిపర్వతాల ప్రభావం వల్ల అసాధారణ వేడితో ప్రవహించే నీటి కుంటలను చూడాలనే ఆసక్తితో అనుమతిలేని ప్రదేశంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఓ వేడి నీటి కుంట వద్దకు వెళ్లి అక్కడ ఎంత వేడి ఉందో తెలుసుకోవడానికి స్కాట్ ప్రయత్నించగా జారీ అందులో పడిపోయినట్లు మీడియా సంస్ధలు పేర్కొన్నాయి. దీంతో అతని సోదరి పార్కు సిబ్బందిని సంప్రదించగా సహాయక బృందం అక్కడికి చేరుకునే లోపే మరణించాడని చెప్పాయి. వేడి నీటి కుంట వద్ద అసాధారణ రీతిలో ఉష్ణోగ్రత ఉండటంతో స్కాట్ శరీరాన్ని కూడా సహాయక బృందం బయటకు తీయలేకపోయాయని తెలిపాయి. మరుసటి రోజు ఉదయాన్నే వేడి నీటి కుంట వద్దకు వెళ్లి చూడగా కుంటలోని స్కాట్ శరీరం మాయమైందని చెప్పాయి. దీనిపై స్పందించిన పార్కు సిబ్బంది నీటిపై భాగంలో సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారవుతుందని చెప్పారు. యాసిడ్ వల్లే స్కాట్ శరీరం నీటిలో కరిగిపోయిందని వెల్లడించారు. భూగర్భంలో ఉన్న రాళ్లు, మట్టిలో గల హైడ్రోజన్ సల్ఫైడ్ ను నీరు తాకినప్పుడు సల్ఫూరిక్ యాసిడ్ తయారవుతుందని తెలిపారు. ఆ తర్వాత భూమి పైభాగానికి వచ్చిన నీరు దగ్గరలోని అగ్నిపర్వత వేడికి ప్రభావితమైన అత్యధిక ఉష్ణోగ్రతతో ప్రవహిస్తుంటుందని పేర్కొన్నారు. కాగా, స్కాట్ నీటిలో పడిన సంఘటనను మొత్తం అతని సోదరి మొబైల్ లో చిత్రీకరించింది. ఈ వీడియోను బయటకు విడుదల చేసేందుకు పార్కు అధికారులు ఒప్పుకోలేదు. -
రాష్ట్ర స్థాయి స్కౌట్స్ టాలెంట్ పోటీల్లో ఆలేరు విద్యార్థుల ప్రతిభ
ఆలేరు (నెల్లికుదురు) : రాష్ట్ర స్థాయి స్కౌట్స్ లాలెంట్ పోటీల్లో ఆలేరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు జిల్లా స్కౌట్స్ పెట్రోల్ ఎస్కార్ట్ మాస్టర్, ఆలేరు పాఠశాల ఉపాధ్యాయు డు ఎల్తూరి నర్సయ్య తెలిపారు. హైదరాబాద్ లోని జీడిమెట్లలో ఈనెల 19 నుంచి 23 వరకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ ట్రైనింగ్ సెంటర్లో ఈ పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మండలకేంద్రంలో ఆదివారం విలేకరు ల సమావేశంలో వివరాలు తెలిపారు. వరంగల్ జిల్లా తరఫున ఎనిమిది మంది ఎంపిక కాగా ఆలేరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బానోతు జీవన్, షేక్ జహీర్, నిమ్మ గోపికృష్ణ, బానోత్ దేవేందర్ పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్ర స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేన్ రాష్ట్ర సెక్రటరీ చంద్రశేఖర్, లీడర్ ఆఫ్ ది కోర్స్ పరమేశ్వర్, జా¯న్సామ్యూల్ చేతులమీదుగా బహుమతులు అందుకున్నట్లు తెలిపారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రటరీ శ్రీనివాస్, ట్రైనింగ్ కమిషనర్ రామమౌళి, అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు, హెచ్ఎం వెంకటేశ్వర్లు, ఎస్ఎంసీ చైర్మన్ బోజ్యానాయక్ అభినందించారు. -
‘స్కౌట్స్ అండ్ గైడ్స్’లో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానం
మచిలీపట్నం (కోనేరు సెంటర్) : స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణలో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిషనర్ ఎస్.శ్రీదేవి తెలిపారు. కృష్ణాజిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యాంపస్‌లో విద్యార్థినుల తృతీయ సోఫాన్ శిక్షణ ముగింపు కార్యక్రమం ఆదివారం స్థానిక జెడ్పీ సెంటర్లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలు, పుష్కరాలు వంటి పుణ్యకార్యాలు, మొక్కలు పెంచడం వంటి సామాజిక కార్యక్రమాల్లో శిక్షణ పొందిన విద్యార్థులు సమాజానికి సేవలు అందించటం అభినందనీయమన్నారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని అన్ని పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణకు విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. ప్రతి విద్యార్థి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ వంటి క్రమశిక్షణ కలిగిన రంగాల్లో శిక్షణ పొంది సమాజానికి మంచి సేవలను అందించేందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం స్కౌట్ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి కరింశెట్టి కైలాసపతి, లయన్స్ జిల్లా చైర్మన్ పంచపర్వాల సత్యనారాయణ, రజియాబేగం, ఐ.శ్రీనివాసరావు, కె.శర్మ, విద్యార్థులు పాల్గొన్నారు. -
ముగిసిన స్కౌట్స్ శిక్షణ తరగతులు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని స్కౌట్స్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్కౌట్స్, గైడ్స్ శిక్షణా తరగతులు శనివారం ముగిశాయి. ఈ నెల 6 నుంచి నిర్వహించిన శిబిరంలో పోల్కంపల్లి, పూడూర్, డోకూర్, అంకిళ్ల, పేరూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, షాద్‌నగర్ పట్టణంలోని ఠాగూర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు శిక్షణ పొందినట్లు స్కౌట్స్, గైడ్స్ జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ రాజగోపాల్ తెలిపారు. ఐదు రోజుల శిక్షణలో వీరికి ప్రథమచికిత్స, ముడులు, దిక్సూచి, పట నైపుణ్యం, హస్తకళలు, ఆరోగ్య, విద్య, సాహస క్రీడలు, ప్రకతి పర్యావరణ రక్షణ తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాల వల్ల విద్యార్థుల్లో మానవీయత, భావవ్యక్తీకరణ, వ్యక్తిగత వికాసం, ఆత్మసై ్థర్యం, ఆధ్యాత్మిక చింతన, దేశభక్తి, ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనే ధైర్యం వంటి లక్షణాలు అలవడుతాయని అన్నారు. క్యాంప్ లీడర్‌గా రవీందర్, అసిస్టెంట్ ఆఫీసర్లుగా హన్మంతు, ఆనంద్ వ్యవహరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వసంధుర, శకుంతల, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ మార్కెట్లోకి ఇండియన్ స్కౌట్ సిక్స్టి
-
మార్కెట్లోకి పొలారిస్ ‘స్కౌట్ సిక్స్టీ’
♦ ధర రూ. 12.21 లక్షలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వాహనాల తయారీ దిగ్గజం పొలారిస్ ఇండియా తాజాగా ఇండియన్ బ్రాండ్ కింద ‘స్కౌట్ సిక్స్ టీ’ మోటార్‌సైకిల్‌ను హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.12.21 లక్షలు (హైదరాబాద్ ఎక్స్ షోరూం). పొలారిస్ ఇండియా ఎండీ పంకజ్ దూబే, మహావీర్ డెక్కన్ ఆటో సంస్థ డెరైక్టర్ వికాస్ జబక్ మంగళవారమిక్కడ ఈ బైక్‌ను ఆవిష్కరించారు. స్కౌట్ సిక్స్టీతో కలిపి దేశీయంగా మొత్తం ఏడు మోడల్స్‌ను విక్రయిస్తున్నట్లవుతుందని దూబే తెలిపారు. ఇప్పటిదాకా వెయ్యి సీసీపైగా సామర్ధ్యం గల బైక్‌లే విక్రయిస్తుండగా... ఇతర వర్గాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా 999 సీసీ సామర్ధ్యం గల స్కౌట్‌ను మార్కెట్లోకి తెచ్చినట్లు ఆయన తెలియజేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 7 షోరూమ్లున్నాయని, ఈ ఏడాది ఆఖరు నాటికి వీటిని పదికి పెంచుకోనున్నామని దూబే చెప్పారు. అలాగే అక్టోబర్ లేదా నవంబర్‌లో మరో కొత్త మోడల్‌ను ప్రవేశపెడతామన్నారు. సూపర్‌బైక్‌లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో వీటి మార్కెట్ పరిమాణం ప్రస్తుతం 8,000-10,000 యూనిట్ల స్థాయికి చేరిందని తెలిపారు. 1,400 పైగా సీసీ సామర్ధ్యం గల బైక్‌ల విభాగంలో తమకు దాదాపు 10 శాతం వాటా ఉందని దూబే చెప్పారు. వాహనాల ధరల శ్రేణి రూ. 12 లక్షల నుంచి రూ. 38 లక్షల దాకా ఉందన్నారు. -
స్కౌట్తో క్రమశిక్షణ
సింగరేణి సీజీఎం సుధాకర్ రెడ్డి గోదావరిఖనిటౌన్ : స్కౌట్ క్రమశిక్షణకు మారు పేరని, విద్యార్థి దశలో ప్రతి విద్యార్థి స్కౌట్లో చేరాలని ఆర్జీ–1 సీజీఎం సుధాకర్‌రెడ్డి కోరారు. స్థానిక బేడెన్ పావెల్ పార్క్‌లో నిర్వహిస్తున్న వరంగల్, మెదక్, కరీంనగర్ మూడుజిల్లాల స్థాయి టెస్టింగ్ క్యాంప్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్కౌట్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్ అండ్ గైడ్ విద్యార్థులు సేవా భావంతో ముందుండడం గర్వకారణమన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, గవర్నర్ టెస్టింగ్లతోపాటు రాష్ట్ర అవార్డుకు ఎంపిక కావాలని కోరారు. ప్రతీ విద్యార్థి నిత్యం సామాజిక సేవలో ముందుండాలని సూచించారు. సింగరేణి యాజమాన్యం స్కౌట్కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని పేర్కొన్నారు. స్కౌట్ కోసం సింగరేణిలో శిక్షణ తరగతులు, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు. సింగరేణి ప్రాంత కార్మికుల పిల్లలు ఈ కార్యక్రమాలను వినియోగించుకోవాలని కోరారు. డీజీఎం పర్సనల్ శ్రీనివాస్ మాట్లాడుతూ స్కౌటిజం నిజ జీవితంలో ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రైనింగ్ కమిషనర్ భవంతరావు, జిల్లా కార్యదర్శి రాంరెడ్డి, జిల్లా గైడ్ కమిషనర్ జ్యోతి, డీటీసీ రోజ్లీన్, సీనియర్ స్కౌట్ మాస్టర్లు రోవర్స్ రాంచందర్, చంద్రమౌళి, విజయ్‌కుమార్, రవీందర్, శ్రీనివాస్, నాగరాజు పాల్గొన్నారు. -
స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శిగా శ్రీనివాస్
వర్ధన్నపేట : మండలంలోని బండౌతపురం శివారు అంబేద్కర్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆరెల్లి శ్రీనివాసులు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్(బీఎస్అండ్జీ) జిల్లా కార్యదర్శిగా ఎన్నికైనట్లు ఆ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎ.చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. హన్మకొండలోని డీఈఓ కార్యాలయ ప్రాంగణంలో ఇటీవల జరిగిన బీఎస్అండ్జీ ఎన్నికల్లో జిల్లా కార్యదర్శిగా శ్రీనివాసులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
రేపు స్కౌట్స్ అండ్ గైడ్స్ సమావేశం
ఒంగోలు: భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం మంగళవారం సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు స్థానిక జవహర్ నవోదయ విద్యాలయంలో జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సుప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్ స్కూళ్ళలో స్కౌట్ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ఈ సమావేశంలో సంబంధిత ఉపాధ్యాయులు వారి సభ్యత్వ రుసుంను కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ ఉపాధ్యాయులను సంబంధిత మండలాల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు ఈనెల 5వ తేదీన తప్పనిసరిగా రిలీవ్ చేసి సమావేశానికి హాజరయ్యేటట్లు చూడాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశించారు. -
మీ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతున్నారా..?
ముంబై: మీరు తరచుగా ఫారెన్ టూర్ లకు వెళ్తుంటారా? అక్కడి టూరిస్ట్ స్పాట్ లలో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా స్నేహితులకు తెలియజేస్తుంటారా? అయితే, ఇక నుంచి మీ ట్రిప్పులకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేయడంలో జాగ్రత్త వహించండి. ఇన్ కం ట్యాక్స్ అధికారులు ఎక్కవగా విదేశాలకు వెళ్లే వారి పన్ను చెల్లింపులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. విదేశాలకు వెళ్లే వారి ట్యాక్స్ చెల్లింపుల వివరాల కోసం వారి సోషల్ మీడియా అకౌంట్లను కూడా ఐటీ శాఖ తనిఖీ చేయాలనే ఆలోచనలో ఉంది. అయితే, ఈ విషయం పై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్(సీబీడీటీ)దే తుది నిర్ణయం కానుంది. ఈ అంశం స్పందించిన ఆదాయపు పన్నుశాఖ అధికారి ఒకరు సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం కొన్ని సందర్భాలలో సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఇది పన్ను చెల్లింపుదారుడిని వేధించడం కాదనీ.. దీని ముఖ్య ఉద్దేశం వ్యక్తి సంపదను తెలుసుకోవడానికేనని చెప్పారు. -
సమాజ సేవలో భాగస్వాములు కావాలి
స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు గవర్నర్ పిలుపు సాక్షి, హైదరాబాద్: ‘అదృష్టమో.. దురదృష్టమో.. రాష్ట్రం రెండుగా విడిపోయింది. అయినప్పటికీ రెండు రాష్ట్రాల స్కౌట్స్ అండ్ గైడ్స్ క్రమశిక్షణ, అంకితభావంతో పని చేస్తూ, స్వతంత్రంగా ఎదగాలి’ అని ఇరురాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. బుధవారం ద భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ స్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామన్ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ అభియాన్, డి అడిక్షన్ వంటి కార్యక్రమాలు స్కౌట్స్ అండ్ గైడ్స్ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కనీసం నెలకు ఒక కార్యక్రమంలోనైనా స్కాట్స్ అండ్ గైడ్స్ పాల్గొనాలన్నారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. ప్రతిభ కనబరిచే వారికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. వచ్చే సమావేశం నాటికి ఇరు రాష్ట్రాల వారు గొప్పగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి తమ సత్తా చూపాలని కోరారు. పదవీ విరమణ చేసిన వారు యువతను జాగృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గవర్నర్ చెప్పారు. ఎంపీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ స్టేట్ అసోసియేషన్ చీఫ్ కమిషనర్ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాష్ట్రమే కాదు స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగం కూడా సామరస్యంగానే విడిపోయిందన్నారు. రెండు ప్రాంతాల్లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ అభివృద్ధిలో గవర్నర్ ప్రముఖ పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తెలంగాణలోని విద్యార్థులను పాఠ శాల దశ నుంచే స్కౌట్స్ అండ్ గైడ్స్ వైపు ఆకర్షితులయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కమిషనర్ స్కౌట్స్ ఎస్ బాలసుబ్రమణ్యం, కామన్ అడ్మినిస్ట్రేటర్ కేవీ మిశ్రాలు మాట్లాడారు. అనంతరం గవర్నర్ చేతుల మీదుగా జిల్లాల్లో సేవా కార్యక్రమాల్లో ముందు నిలిచిన పలువురికి జిల్లాల వారిగా గుర్తింపు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ చేత గవర్నర్ నరసింహన్ శాంతి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బీఎస్ అండ్ జీ ఏపీ అధికారి ఆర్కే శశిధర్, బీఎస్ అండ్ జీ అధికారులు సంధ్యారాణి, ఎ.చంద్రశేఖర్లతో పాటు జిల్లాల కమిషనర్లు పాల్గొన్నారు. -
సింగరేణి స్కౌట్స్‌కు రాష్ట్రపతి అవార్డు
► సర్టిఫికెట్లు ప్రదానం చేసిన గవర్నర్ నరసింహన్ ► లైఫ్ మెంబర్షిప్ చెక్కు అందచేసిన ► డెరైక్టర్(పా) పవిత్రన్‌కుమార్ ► స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు ప్రశంసనీయం : ఎంపీ కవిత కొత్తగూడెం/శ్రీరాంపూర్ : విద్యార్థి దశలోనే సేవా భావాన్ని పెంపొందించే స్కౌట్స్ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ మరింత అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఈసీఎల్.నరసింహన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సింగరేణి స్కౌట్స్ అండ్ గైడ్స్ అందిస్తున్న సేవలను రాష్ట్ర భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్, ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశంసించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో బుధవారం స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కామన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా గవర్నర్ నరసింహన్, ఎంపీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా 2015-16 సంవత్సరంలో రాష్ట్రపతి అవార్డు అందుకున్న కొత్తగూడెంకు చెందిన వరుణ్‌కు, ప్రీ-ఏఎల్టీ శిక్షణ పూర్తిచేసిన గోలేటి సింగరేణి హైస్కూల్ స్కౌట్ మాస్టర్ కె.భాస్కర్‌కు గవర్నర్ సర్టిఫికెట్లు అందచేశారు. సింగరేణి కాలరీస్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తరఫున 52 మంది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర జీవితకాల సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన రూ.58,032 చెక్కును సింగరేణి సంస్థ డెరైక్టర్(ఫైనాన్స్, పా), భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి డిస్ట్రిక్ట్ చీఫ్ కమిషనర్ జె.పవిత్రన్‌కుమార్ ఎంపీ కవితకు అందచేశారు. అనంతరం పవిత్రన్‌కుమార్ మాట్లాడుతూ సీఎండీ ఎన్.శ్రీధర్ నాయకత్వంలో సమాజహిత, సంక్షేమ కార్యక్రమాలన్నింటిలో సింగరేణి స్కౌట్స్‌ను భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పారు. పాఠశాల, కళాశాల స్థాయిలోనే విద్యార్థులకు స్కౌట్స్, గైడ్స్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ, కోల్‌బెల్ట్ ప్రాంతంలో స్కౌట్స్ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ప్రణాళికలు రూ పొందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ తరఫున అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కమిషనర్ కె.వి.రమణ, డిస్ట్రిక్ట్ ట్రెరుునింగ్ కమిషనర్ జె.వి.కృష్ణారావు, స్టేట్ హెడ్ క్వార్టర్ కమిషనర్ ఎల్.గోపాలకృష్ణయ్య, లైఫ్ మెంబర్ ఎండీ.ఖాసీం, స్కౌట్ మాస్టర్లు కె.భాస్కర్, పి.సాయినిరంజన్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత వరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
స్కౌట్స్‌లో ఏపీ, తెలంగాణ కలసి పనిచేయాలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు స్కౌట్స్‌లో కలసి పనిచేయాలని ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. బుధవారం అధికారికంగా ఏపీ, తెలంగాణ స్కౌట్‌గా విభజించారు. తెలుగు రాష్ట్రాలు రెండూ అభివృద్ధి చెందాలని నరసింహన్ అన్నారు. నెలకు ఓసారైనా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. -
స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు అన్ని విధాలా ప్రోత్సాహం
స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా కల్వకుంట్ల కవిత ప్రమాణం హైదరాబాద్: స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు ప్రోత్సాహం అందించి తెలంగాణ రాష్ట్ర యూనిట్‌ను దేశంలోనే నంబర్ వన్‌గా నిలుపుతామని నిజామాబాద్ ఎంపీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమిషనర్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ నెల 13 తర్వాత రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకెళతామన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆమె స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర తొలి చీఫ్ కమిషనర్‌గా ప్రమాణం చేశారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏపీ, తెలంగాణ కామన్ అడ్మినిస్ట్రేటర్ కేపీ మిశ్రా ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు అంకితభావం, సేవాభావంతో పని చేసే వారని, గతంలో వేల సంఖ్యలో ఉన్న స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం వందల్లోకి తగ్గిందని చెప్పారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో విద్యార్థులను చేర్చేలా ప్రైవేట్ పాఠశాలలను భాగస్వాములను చేస్తామని, ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందేలా కృషి చేస్తామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ దేశాభివృద్ధిని కాంక్షిస్తూ, సమాజాన్ని బాగు చేసే దిశలో సాగే స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతగా ప్రోత్సహించడంలేదన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఎంపీ కవిత.. ఈ కార్యక్రమంలో నేషన ల్ హెడ్ క్వార్టర్స్ డెరైక్టర్ సుకుమార, ఏపీ రాష్ట్ర చీఫ్ కమిషనర్ ఆర్కే శశిధర్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త అవతారంలో కవిత
-
స్కౌట్స్ అండ్ గైడ్స్ టీ.చీఫ్ కమిషనర్‌గా కవిత
హైదరాబాద్ : భారత్ స్కౌట్క్ అండ్ గైడ్స్ తెలంగాణ చీఫ్ కమిషనర్‌గా నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత సోమవారం దోమలగూడలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోనే స్కౌట్క్ అండ్ గైడ్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. స్కౌట్క్ అండ్ గైడ్స్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కవిత తెలిపారు. గతంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ వేలల్లో ఉండగా, ప్రస్తుతం వందల సంఖ్యకు తగ్గిపోయారని ఎంపీ కవిత అన్నారు. స్కౌట్క్ అండ్ గైడ్స్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఏపీ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ శశిధర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
శివం శంకరం
మహాశివరాత్రికి పోటెత్తిన భక్తజనం 1.25 లక్షల వుందికి దర్శనభాగ్యం లఘుదర్శనంతో... శివరాత్రి సక్సెస్స్ శభాష్ రామిరెడ్డి.. సావూన్యులకు సువర్ణదర్శనం స్కౌట్స్ సేవలు అభినందనీయుం శ్రీకాళహస్తి: దక్షిణకైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తి క్షేత్రం మంగళవారం భక్తుల శివనావుస్మరణలతో మార్మోగింది. శివరాత్రి పర్వదినాన స్వామి, అవ్మువార్ల దివ్యదర్శనం కోసం భక్తులు లక్షలాదిమంది తరలివచ్చారు. దీంతో ఆలయు ప్రాంగణవుంతా కిక్కిరిసిపోరుుంది. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నుంచి సామాన్యుల వరకు అందరికీ లఘు దర్శనం అమలుచేశారు. అధికారులు ఊహించిన మేర కంటే భక్తులు తాకిడి అధికమైనప్పటికీ ఈవో రామిరెడ్డి ప్రణాళికాబద్ధంగా క్యూలను ఏర్పాటు చేయించడంతో భక్తులు సులువుగా స్వామివారిని దర్శించుకోగలిగారు. అరుుతే పలువురు ఆలయాధికారులు వూత్రం ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా వీఐపీలు, తమ ఆప్తుల సేవల్లో తరించిపోయూరు. అరుునప్పటికీ స్కౌట్స్, వలంటీర్లు ఈవోకు పూర్తిగా సహకరించడంతో ఉత్సవం విజయువంతంగా పూర్తిచేశారు. శివరాత్రి సందర్భంగా ఆలయు ప్రాంగణాన్ని పుష్పాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అలాగే స్వామివారి మూలవిరాట్లతోపాటు ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలతో అలంకరించారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. అప్పటి నుంచే భక్తులు స్వర్ణముఖినదిలో స్నానాలు చేసి, ఆలయానికి రావడం ప్రారంభించారు. రద్దీని నిలువరించడానికి సాధారణ భక్తులతో పాటు వీఐపీలకు అధికారులు ప్రత్యేక క్యూను ఏర్పాటు చేశారు. ఇసుకేస్తే రాలని జనం మహాశివరాత్రిని పురస్కరించుకుని పలు ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేశారు. ఉదయం నుంచి భక్తులు రద్దీ గంటగంటకు పెరగడంతో ఎటుచూచినా భక్తజనంతో ఆలయం నిండిపోయింది. ఇక మధ్యాహ్నం తర్వాత భక్తుల రద్దీ ఇసుకేస్తే రాలనంతగా జనసందడి కనిపించింది. 1.25 లక్షలకుపైగానే భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే 50 వేలమంది భక్తులు మాత్రమే టికెట్లు కొనుగోలు చేసినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. శభాష్ రామిరెడ్డి శ్రీకాళహస్తీశ్వరాలయుంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ లో పక్కా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగడంతో భక్తులకు ఇబ్బందులు తప్పాయని, ఈవో పని తీరు శభాష్ అని పలువురు కొనియాడారు. శివరాత్రిరోజు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 200 మంది తన అనుచరులతో పట్టువస్త్రాల సమర్పణకు హాజరైనా క్యూ ఏర్పాటు చేయుడంతో ఆటంకాలను అధికమించి సావూన్య భక్తులకు సైతం దర్శనం కలిగించారు. ఈ ఏడాది డీఎస్పీ వెంకటకిషోర్ పోలీసులకు పలు సలహాలిస్తూ పటిష్టమైన భద్రతాచర్యలు చేపట్టారు. భక్తులకు అందుబాటులో ప్రసాదాలు భక్తులకు ఇబ్బందులు లేకుండా పులిహోర, లడ్డు,వడ,జిలేబీలను సిద్ధం చేశారు. సుపథావుండపంలో ప్రత్యేకంగా పదికౌంటర్లను ఏర్పాటుచేయుడంతో ప్రతిభక్తుడు ప్రసాదాన్ని సౌకర్యవంతంగా అందుకున్నాడు. అంతేకాకుండా ఆలయుం తరపున ఉచితప్రసాదాలను అందించడం జరిగింది. రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమా ల్లో సినీ గాయకుడు హేమచంద్ర బృందం సంగీత విభావరి ప్రేక్షకులను మైమరిపించింది. స్వర్ణవుుఖినదిలో భక్తులు స్నానాలు చేసుకునేందుకు, వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి అధికారులు చేసిన ఏర్పాట్లు విజయువంతవుయ్యూరుు. ఈవో రామిరెడ్డికి అధికారు లు పూర్తిసహకారం అందించకపోరుునప్పటికీ ఆయున వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో శివరాత్రి ఉత్సవాన్ని దిగ్విజయుంగా పూర్తిచేయుగలిగారని పలువురు అభిప్రాయపడ్డారు. బుధవారం తెల్లవారుజావుున వుూడుగంటలకు లింగోద్భవ దర్శనభాగ్యం ప్రతి భక్తుడు పొందేలా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. -
పతకాల ‘పల్లె’
క్రమశిక్షణకు వారు మారుపేరుగా నిలుస్తారు. సోదరభావంతో మెలుగుతారు. సేవా కార్యక్రమాలలో ముందుంటారు. ఆ విద్యార్థులు మారుమూల గ్రామం నుంచి జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభను చూపుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దీనతంటికి కారణం వారు స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో చేరడమే. ఉపాధ్యాయుల నిర్వి రామ కృషి, గ్రామస్తుల సహకారంతో విద్యార్థులు రాజ్యపురస్కార్ అవార్డును అందుకున్నారు. సేవామూర్తుల ముల్లె - స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో రాణిస్తున్న ‘గిద్ద’ విద్యార్థులు - క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్న హైస్కూల్ సదాశివనగర్: సదాశివనగర్ మండలంలోని ‘గిద్ద’ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్‌గా చేరి ‘ఉత్తములు’గా రూపొందుతున్నారు. ఈ పా ఠశాలలో మొదటగా 2009లో స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను ప్రారంభించారు. ప్రారంభంలో విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కార్యక్రమాలు కూడా మొక్కుబడి గా సాగేవి. ఈ క్రమంలో సౌజన్యకుమా ర్ అనే ఉపాధ్యాయుడు 2008-2009లో పాఠశాలకు వచ్చారు. ఆయన స్కౌట్ మాస్టర్ కూడా కావడంతో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. దేవుళ అనే మరో ఉపాధ్యాయుడు అసిస్టెంట్ స్కౌట్ మా స్టర్‌గా వ్యవహరించారు. వీరిద్దరు కలిసి బాలబాలికలను మెరికలుగా తీర్చిదిద్దా రు. వారి చేత నిత్య సాధన చేయిస్తూ, జా తీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచేలా చేశారు. జంబోరీలో గ్యాడ్జెట్స్ నిర్మాణం, కలర్ పార్టీ, మార్చ్ ఫాస్ట్, అడ్వెంచర్ యాక్టివిటీ, సిగ్నలింగ్, టవర్ విల్డింగ్, యూత్ కాంగ్రెస్, భారత్ నిర్మాణ్, ఫుడ్‌ప్లాజా, స్కిల్ ఓ-రమ వంటి అంశాలలో విద్యార్థులు తిరుగులేని నైపుణ్యాన్ని సాధించారు. చిరస్మరణీయమైన విజయాలనెన్నింటినో అందుకున్నారు. పతకాల మీద పతకాలను సాధించారు. ఊరి పేరు ను నిలిపి, జిల్లా ప్రతిష్టను సరిహద్దులు దాటించారు. సామాజిక కార్యక్రమాలతో మొక్కల పెంపకం, పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ ని షేధం, పార్థీనియం మొక్కల నివారణ, మరుగుదొడ్ల నిర్మాణం, వాడకంపై ప్రచారం, వయోజన విద్య, నీటి పారిశుధ్యంపై అవగాహన తదితర సేవా కార్యక్రమాలలో స్కౌట్లు, గైడ్లు పాలుపంచుకుంటున్నారు. సాధించిన విజయాలు ⇒ 2009 నవంబర్ 22న హైదరాబాద్‌లోని జీడిమె ట్ల ‘పెట్రో లీడర్ క్యాంప్ స్టేట్ ట్రైనింగ్ సెంటర్’ నిర్వహించిన శిబిరంలో నరేశ్, శ్రీకాంత్ ప్రతిభను చూపారు. ⇒ 2010 జనవరి 26న రిపబ్లిక్‌డే పరేడ్‌లో పాఠశాల నుంచి నలుగురు స్కౌట్లు, నలుగురు గైడ్స్ పాల్గొన్నారు. ⇒ 2010 నవంబర్ 15నుంచి 19వరకు పాఠశాలలో 120మంది స్కౌట్స్, 10మంది గైడ్స్‌తో, స్కౌట్ మాస్టర్లతో సన్నాహక శిబిరం నిర్వహించారు. ⇒ 2010 డిసెంబర్ 22న హైదరాబాద్‌లో జరిగిన జంబోరీకి గిద్ద పాఠశాల నుంచి 21 మంది గైడ్స్, 25మంది స్కౌట్స్, ఇద్దరు స్కౌట్ మాస్టర్లు హాజరయ్యారు. ⇒ 2010 ఫిబ్రవరిలో నిర్వహించిన రాజ్యపురస్కార్ టెస్టింగ్ శిబిరంలో నలుగురు విద్యార్థులు గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ⇒ అడ్వెంచర్ విభాగంలో 36 అంశాలలో పోటీ పడి 25 మంది బంగారు పతకాలు, 20 మంది వెండి పతకాలు సాధించారు. ⇒ జాతీయ స్థాయి మార్చింగ్ కాంపిటేషన్‌లో రాష్ట్రం నుంచి 45 మంది ఎంపిక కాగా, అందులో 25 మంది స్కౌట్స్, గైడ్స విద్యార్థులు గిద్ద పాఠశాలకు చెందినవారే. ⇒ పీస్ మార్చ్‌లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ⇒ ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా మద్ధికుంట జాతర, పోసానిపేట్ జాతరలో సేవలు అందిస్తారు. -
క్షమించలేను
అమ్మ... ఏ మనిషి జీవితానికైనా పునాది. జన్మనిచ్చిన నాటి నుంచి జన్మను చాలించే వరకూ కూడా బిడ్డే లోకంగా బతుకుతుంది తల్లి. కానీ మౌరీన్ అలా చేయలేదు. చేసి ఉంటే కొలెట్ జీవితం ఇలా ఉండేది కాదు. మౌరీన్ తనకు జన్మనిచ్చినా ఆమెను అమ్మా అని పిలవడానికి ఇష్టపడదు కొలెట్. ఎందుకని? అంతగా ఆ తల్లి ఏం చేసింది? ఈ బిడ్డ మనసు ఎందుకు విరిగింది? ‘‘వెరీగుడ్... నీకిక ఏ సమస్యా లేదు. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్’’ డాక్టర్ అన్న మాటకు నవ్వొచ్చింది నాకు. ఏ సమస్యా లేదట. నా జీవితమే ఒక సమస్యని ఆయనకు తెలియదు కదా.. అందుకే ఆ మాట అనివుంటాడు. లేదంటే ఆత్మహత్యాయత్నం చేసి, మృత్యుదేవత చిన్నచూపు చూస్తే బతికినదాన్ని పర్ఫెక్ట్లీ ఆల్రైట్ అని అంటారా ఎవరైనా! డాక్టర్ నన్ను పరీక్షిస్తూ ఉంటే నేను గుమ్మం దగ్గర నిలబడి ఉన్న మా అమ్మనే చూస్తున్నాను. నా కూతురు బాగయ్యిందో లేదోనన్న ఆతృత ఆమెలో కించిత్ కూడా లేదు. నా చావు తనకు చుట్టుకుంటుందని భయపడి చికిత్స చేయించి ఉంటుంది తప్ప, నేను బతికినందువల్ల ఆమెకు ఏ ఆనందమూ కలగదు.కన్నతల్లి గురించి ఇలా మాట్లాడుతోందేమిటి అనుకుంటున్నారా? నా కథ తెలిస్తే నా మాటలు తప్పనిపించవు మీకు. కన్నతల్లి ఒడి సైతం క్రూరమృగపు నీడ అయిన దౌర్భాగ్యం నాది. ఉప్పెనంత శోకసంద్రంలో గుప్పెడంత మమత కోసం వెతికిన వెత నాది. ఈ లోకమంతా ప్రేమే నిండి ఉంటుందని అంటారు. అంత ప్రేమలో రవ్వంత కూడా నాకు దొరకలేదంటే నమ్ముతారా?! అప్పుడు నాకు ఎనిమిదేళ్లు. సడెన్‌గా పోలీసులు వచ్చారు. నన్ను తమతో రమ్మన్నారు. ఎందుకు అని అడిగే ధైర్యం నాకు లేదు. అడగాలని కూడా అనిపించలేదు. మౌనంగా అనుసరించాను. వాళ్లు నన్ను తీసుకెళ్లి ఓ మహిళకు అప్పగించారు. ఆమె నన్ను తనతో తీసుకెళ్లింది. ‘దొంగతనం చేసినందుకు మీ అమ్మని అరెస్ట్ చేశారు, ఆమె వచ్చేవరకూ నువ్వు నా దగ్గరే ఉండాలి’ అంది. నా స్థానంలో మరెవ్వరూ ఉన్నా బెంబేలెత్తి ఉండేవారు. కానీ నేను మాత్రం సంతోషపడ్డాను. కొన్నాళ్లయినా మా అమ్మకు దూరంగా ఉండే అదృష్టం దక్కినందుకు పొంగిపోయాను. అక్కడ నాకో కొత్త ప్రపంచం పరిచయమయ్యింది. ఆ ప్రపంచం నిండా ఆనందమే! ఆ ఆంటీ నన్ను బాగా చూసుకునేది. కడుపు నిండా తిండి పెట్టేది. ఆడుకోనిచ్చేది. ప్రతి ఆదివారం చర్చ్‌కి తీసుకెళ్లేది. కారులో క్యాండీస్ ఇచ్చి తినమనేది. నాకు కళ్లలోంచి నీళ్లొచ్చేవి. అవి మా అమ్మమీద బెంగతో వచ్చాయని ఆమె అనుకునేది. కానీ తనలాంటి అమ్మ లేదనే బాధతో వచ్చాయని ఆమెకు అర్థమయ్యేది కాదు. ఆరు నెలల శిక్ష ముగిశాక మా అమ్మ వచ్చింది. ఈ అమ్మకాని అమ్మను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ రోజు నేను పడిన బాధ అంతా ఇంతా కాదు. ఎవరైనా తల్లికి దూరమైతే బాధపడతారు. నేను తల్లి దగ్గరకు వెళ్లడానికి ఎందుకు బాధపడుతున్నాను అనే సందేహం వచ్చింది కదూ! అది నివృత్తి కావాలంటే... నా బతుకు పుస్తకంలోని ప్రతి పేజీ మీకు తెలియాలి. భర్త స్కాట్‌తో సంతోషంగా కొలెట్ కొలెట్ ఇప్పటికీ కోలుకోలేదు. దుర్మార్గురాలైన తల్లి పెట్టిన బాధలు ఆమెను ఇంకా వేధిస్తూనే ఉన్నాయని డాక్టర్లు అంటున్నారు. అయితే భర్త, పిల్లల అనురాగం ఆమెను కాపాడుతోంది. మరో విషయం ఏమిటంటే... చిన్నప్పుడు తన గురించి ఎన్ని ఫిర్యాదులు అందినా పట్టించుకోకుండా వదిలేసిన ఎన్జీవో మీద కొలెట్ కేసు వేసింది. ఆమె ఆవేదనను అర్థం చేసుకున్న న్యాయస్థానం... కొలెట్కు భారీ నష్ట పరిహారాన్ని చెల్లించమంటూ సదరు సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. పిల్లలను హింసించేవారిని, ఆ హింసను చూస్తూ కూడా పట్టించుకోని వారిని శిక్షకు అర్హులుగా ప్రకటిస్తూ యూకే ప్రభుత్వం ‘సిండ్రెల్లా చట్టం’ రూపొందించింది. బర్మింగ్‌హామ్ (ఇంగ్లండ్)... ఈ పేరు చెప్పగానే అందరికీ ప్యాలెస్ గుర్తొస్తుంది. కానీ అక్కడ రాజభవనాలే కాదు.. వెలుగు కూడా చొరబడని ఇరుకు నివాసాలూ ఉన్నాయి. అలాంటి ఓ ఇంట్లో ఉండేవాళ్లం మేము. నాకు ఊహ తెలిసేనాటికి మా అమ్మానాన్నలతో ఉన్నాను. కానీ ఊహ తెలిసిన కొన్నాళ్లకు మా నాన్న స్థానంలోకి మరో వ్యక్తి వచ్చాడు. తానే నాన్నని అన్నాడు. అమ్మ అదే నిజమంది. దాంతో అతడిని నాన్నా అని పిలవడం మొదలు పెట్టాను. కానీ తర్వాత అర్థమైంది, అతడు ‘నాన్న’ అన్న పిలుపునకు అనర్హుడని. అతగాడికి నామీద కోపమెందుకో అర్థమయ్యేది కాదు. నన్నెందుకు ద్వేషించేవాడో అంతు పట్టేది కూడా కాదు. నన్ను చూస్తేనే ముఖం తిప్పుకునేవాడు. దగ్గరికెళ్తే తోసేసేవాడు. ఎవరి మీద కోపమొచ్చినా నా మీద చూపించేవాడు. పసిదాన్నని చూడకుండా పిడిగుద్దులు గుద్దేవాడు. తట్టుకోలేక అమ్మ దగ్గరకు పరుగెత్తేదాన్ని. మీ అమ్మ అయితే ఏం చేస్తుంది? ‘నా తల్లీ, ఎందుకేడుస్తున్నావే’ అంటూ గుండెల్లో పొదువుకునేది. కానీ మా అమ్మ ఏం చేసేదో తెలుసా? నన్ను దూరంగా తోసేది. ‘ఎప్పుడూ ఏడుస్తూ ఉంటావేంటే ఏడుపుగొట్టుదానా’ అంటూ మొట్టేది. నా అరుపులు ఆమె చెవులను చేరేవి కాదు. నా కన్నీళ్లు ఆమె మనసును తడిపేవీ కావు. అమ్మ అంటే ఇలానే ఉంటుందా అనిపించేంది. ఇల్లంటే నరకమేనేమో అని నా మనసు తలిచేది. ఎవరితోనో ప్రేమలో పడి, అమ్మ వేసిన తప్పటడుగుకు ఫలితంగా పుట్టానట నేను. అందుకే ఆమెకు నేను నచ్చనట. నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండేది, వద్దనుకున్నా బయటపడ్డావ్ అని ఆమె అంటున్నప్పుడు నా చిన్ని గుండె పడిన వేదన ఎలా చెప్పాలి?! తప్పు చేసింది తను. శిక్ష ఏమో నాకా?! నన్ను చూస్తే తన తప్పు గుర్తొచ్చి బాధపడుతుందేమో అనుకున్నాను మొదట. కానీ తప్పు చేయడమే తన జీవితం అని ఆమె జీవితంలోకి వచ్చిపోతున్న మగాళ్లను చూశాక అర్థమైంది. అసహ్యం పెరిగింది. అమ్మ గురించి ఇలా మాట్లాడటం తప్పేమో. కానీ ఏనాడైనా అమ్మలా ప్రవర్తిస్తే కదా గౌరవించడానికి! అమ్మ ప్రవర్తన నన్ను పిచ్చిదాన్ని చేసింది. ఓసారి మా పక్కింటావిడ చెప్పింది... ఊహ తెలియని వయసులో నేను మా వీధిలో ఏడుస్తూ తిరిగేదాన్నట. ఆకలితో గుక్కపెట్టి ఏడ్చేదాన్నట. చూసినవాళ్లు జాలిపడి ఎత్తుకునేవారట కానీ మా అమ్మ మాత్రం బయటికొచ్చి చూసేది కాదట. ఎలా చూస్తుంది? ఇంటిలోపల చీకటి గదుల్లో తప్పు చేయడంలో మునిగిపోయివుంటే?! వీధిలోని వాళ్లు విసిగిపోయి ఓ ఎన్జీవో వాళ్లకు విషయం చెప్పార్ట. వాళ్లు వచ్చి అడిగితే అంతా అబద్ధమని అమ్మ చెప్పిందట. దాంతో వాళ్లు వెళ్లిపోయారట. దొంగని దొంగతనం చేశావా అని అడగడంలో అర్థముందా? కడుపులో దాచుకునేది తల్లి. కళ్లలో పెట్టుకుని పెంచుకునేది తల్లి. కానీ కళ్లముందే తప్పులు చేయడానికి అలవాటు పడింది నా తల్లి. తన భర్త కాని భర్త పిల్లల మీద ప్రేమ కురిపించి, నన్ను ఎంగిలాకులాగ విసిరేయాలనుకునేది నా తల్లి. సాయంత్రమైతే నేను నా గదిలోకి వెళ్లిపోవాలి. మళ్లీ పొద్దున్నే కిందికి రావాలి. మధ్యలో కనిపించానో... ఒంటిమీద వాతలు పడేవి. బాత్రూమ్కి వెళ్లాలంటే మెట్లు దిగి వెళ్లాలి. కానీ వెళ్తే చంపేస్తారని భయపడి పక్క తడిపేసేదాన్ని. ఆ తడిలోనే పొర్లాడేదాన్ని. దాహంతో నాలుక పిడచకట్టుకు పోతున్నా, ఆకలితో పేగులు మెలికలు పడుతున్నా.. కాలు కింద పెట్టడానికి వీల్లేదు. నరకం... ఘోర నరకం! దేవుడా, ఎందుకిచ్చావు ఇలాంటి జన్మ అంటూ రాత్రంతా ఏడ్చి సోలిపోయేదాన్ని. పదే పదే ఇంటి నుంచి పారిపోయేదాన్ని. కానీ ఎక్కడికెళ్లాలో తోచక మళ్లీ ఆ నరక కూపానికే చేరేదాన్ని. మా టీచర్ దగ్గర నా బాధ చెప్పుకుని ఏడ్చేదాన్ని. ఆవిడ చాలాసార్లు ఎన్జీవోకి ఫిర్యాదు చేసింది. కానీ వారి నిర్లక్ష్యం నాకు శాపమైంది. నా జీవితం మా అమ్మ రాక్షస నీడలోనే మగ్గిపోయింది. బతుకు మీద ఆశ పోయింది. పదిహేనుసార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేశాను. కానీ మృత్యువు కూడా మా అమ్మలాంటిదే... నన్ను తృణీకరించింది! ఇక నావల్ల కాలేదు. ఆ ఈసడింపులు, చిత్రహింసలు భరించే శక్తి నాకు లేదనిపించింది. మళ్లీ ఆ ఇంటి గడప తొక్కకూడదని నిర్ణయించుకుని పద్దెనిమిదో ఏట ఇల్లు వదిలిపెట్టాను. ఓ చిన్న ఉద్యోగం చూసుకున్నాను. నా జీవితం నేను జీవించాలని నిర్ణయించుకున్నాను. శాపనార్థాలు వినబడవు. మూతి విరుపులు కనబడవు. ఆకలిని అణచుకోనక్కర్లేదు. స్వేచ్ఛను చంపుకోనక్కర్లేదు. కన్నీళ్లు లేవు. కష్టాలు గుర్తు రావు. నాకు నచ్చినట్టుగా బతకొచ్చు అనుకున్నాను. కానీ నేను శారీరకంగానే బయటికొచ్చాను తప్ప మానసికంగా కాదు. కన్నుమూస్తే పీడకలలు! అమ్మరూపం కదలాడగానే ఉలిక్కిపడి లేచేదాన్ని. ప్యానిక్ అటాక్స్ వచ్చి పిచ్చిదాన్ని అయ్యేదాన్ని. శాపగ్రస్తమైన నా బాల్యం నన్ను వెంటాడి భయపెట్టేది. ఆ జ్ఞాపకాలు పదే పదే నా జీవితంలోకి తొంగి చూసి వణికించేవి. అప్పుడే ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ఆడ పిల్లలకు తల్లిని చేశాడు. కానీ అతడు మా అమ్మను మించిన క్రూరుడు. మొదట ప్రేమను ఒలకబోసినవాడు మెల్లగా హింసించడం మొదలు పెట్టాడు. నన్ను, నా పిల్లల్ని చంపేస్తానని బెదిరించేవాడు. పిల్లలతో పాటు బాత్రూమ్లో భయంగా దాక్కున్న రోజులు నాకింకా గుర్తున్నాయి. బిక్కుబిక్కుమంటూ చూస్తున్న నా చిట్టి తల్లుల్ని గుండెలకు అదుముకుని వెక్కి వెక్కి ఏడ్చిన క్షణాలు ఇంకా నన్ను గుచ్చుతూనే ఉన్నాయి. ఎలాగైతేనేం... వాడి కబంధ హస్తాల నుంచి తప్పించుకున్నాను. వాడి నీడ పడని చోటికి నా పిల్లల్ని తీసుకుని పారిపోయాను. కష్టపడి వాళ్లను పెంచడం మొదలుపెట్టాను. వాళ్ల చుట్టూ అందమైన ప్రపంచాన్ని అల్లుకోవడం ప్రారంభించాను. అప్పుడే మా ప్రపంచంలోకి చొరబడ్డాడు స్కాట్ ఎలియట్. నా మీద మనసు పడ్డాడు. గత అనుభవాలు నన్ను హెచ్చరించడంతో దూరం జరిగాను. దగ్గర కాలేనని చెప్పాను. అర్థం చేసుకున్నాడు. అంగీకారం కోసం ఎదురు చూశాడు. చివరకు నా మనసును గెలుచుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకుని నా పిల్లలకు తండ్రిగా మారాడు. నాకంటే ఎక్కువగా నా పిల్లలను ముద్దు చేస్తాడు. మా ఇద్దరికీ ఇద్దరు పిల్లలు కలిగినా తనకు పుట్టని నా బిడ్డలను కూడా గుండెల్లో పెట్టుకుంటాడు. ఇప్పుడు నా చుట్టుపక్కలంతా సంతోషమే ఉంది. కానీ నా గుండెల్లో ఎక్కడో ఓ మూల మా అమ్మ ఇంకా ఉంది. అప్పుడప్పుడూ భయపెడుతూంటుంది. ప్యానిక్ అటాక్స్‌తో నేను వణికిపోతుంటే నా భర్త, పిల్లలు నన్ను హత్తుకుంటారు. ఆ స్పర్శలో నీకు మేమున్నామనే భరోసా కనిపిస్తుంది. అది చాలు నాకు గత జీవితపు చేదును మరచిపోవడానికి. అది చాలు బతుకులో అమృతాన్ని నింపుకోవడానికి! (పలు ఇంటర్వ్యూలు, తను రాసిన ‘అన్ ఫర్‌గివబుల్’ అనే పుస్తకంలో కొలెట్ చెప్పిన విషయాల ఆధారంగా) - సమీర నేలపూడి -
గణతంత్ర పరేడ్‌కు జిల్లా విద్యార్థుల ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26న హైదరాబాద్‌లో నిర్వహించే పరేడ్‌లో పాల్గొనేందుకు జిల్లాలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగం విద్యార్థులను ఎంపిక చేశారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి తరలివచ్చిన విద్యార్థులకు గురువారం స్థానిక మెడికల్ కళాశాల పక్కనున్న భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యాలయ ప్రాంగణంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఎంపికైన వారిలో వై. రామకృష్ణ(మున్సిపల్ హైస్కూల్-బాపట్ల), డి. వ్యాసు (జెడ్పీ హైస్కూల్-గణపవరం), పి. జయరాజ్(జెడ్పీ హైస్కూల్-అబ్బినేని గుంటపాలెం), డీవీ సాయిమనోజ్( అశోక్ హైస్కూల్-పెదనందిపాడు), కె. వంశీకృష్ణ, సీహెచ్ కృష్ణవేణి, కె.స్వాతి, టి. అనిత(సన్ జాన్స్ హైస్కూల్-కారంపూడి) ఉన్నారు. కార్యక్రమంలో గుంటూరు డివిజన్ ఉప విద్యాశాఖాధికారి పి. రమేష్, స్కౌట్స్, గైడ్స్ రాష్ట్ర కార్వ నిర్వాహక కమిషనర్ పి. శ్రీనివాసరావు, జోనల్ కార్యదర్శి డీఎల్ నారాయణ, జిల్లా కోశాధికారి రత్నాకర్, వ్యాయామ ఉపాధ్యాయులు బి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పవర్ రేంజర్స్
అబ్బాయి బీటెక్ పూర్తయింది. బెంగుళూరులోని పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం. రెండ్రోజుల్లో వెళ్లి జాయిన్ అవ్వాలి. ఇప్పుడేం చేస్తున్నాడు? ఆకలవుతుంటే... ఆఫీస్ నుంచి అమ్మ ఎప్పుడొస్తుందా అని నకనకలాడుతూ ఎదురుచూస్తున్నాడు! ఎట్లీస్ట్ ఆమ్లెట్ వేసుకోవడం కూడా తెలీని అబ్బాయి! అమ్మాయి ఉద్యోగం చేస్తోంది. ఆఫీస్ అయ్యాక ఇంటికి వచ్చే దారిలో క్యాబ్ ట్రబులిస్తే డ్రైవర్ మధ్యలోనే దింపేశాడు. అదేం ఏరియానో తనకు తెలీదు. బిక్కుబిక్కుమంటూ నాన్నకు ఫోన్ చేసింది. ‘‘ఇప్పుడు ఎక్కడున్నావమ్మా...’’ అంటే సరిగ్గా చెప్పలేకపోతోంది! ఎట్లీస్ట్ ఇంటికి కూడా దారి తెలీని అమ్మాయి! ఆలోచిస్తే ఈ రెండూ చాలా చిన్న సమస్యలు. పరిష్కరించుకోలేక పోతే అవే పెద్ద సమస్యలు. చదువుతోపాటు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే స్కౌట్స్ అండ్ గైడ్స్‌ని మనం పెద్దగా పట్టించుకోం కానీ, ఈ శిక్షణ పిల్లల్ని ‘పవర్ రేంజర్స్’లా తీర్చిదిద్దుతుంది. జీవితంలో ఎదురయ్యే అనూహ్యమైన సందర్భాలలో... పిల్లలకు ఉపయోగపడుతుంది. పిల్లలకే కాదు, వారి ద్వారా సమాజానికి కూడా! ఎలా అన్నదే... ఈవారం ‘ప్రజాంశం’. స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే పదం వినే ఉంటారు. చదువుతోపాటు పిల్లలకు సమాజం పట్ల బాధ్యత, తోటివారికి రక్షణగా నిలబడే స్థైర్యం... ఇవన్నీ నేర్పేదే స్కౌట్స్ అండ్ గైడ్స్. ఈ స్వచ్ఛంద సంస్థ మన దేశానికొచ్చి శతాబ్దం దాటినా చాలామంది విద్యార్థులకు దీని గురించి తెలియదు. దేశానికి బాధ్యతగల పౌరులను తయారుచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ సంస్థ సేవల్ని ప్రపంచంలో వంద దేశాలు పూర్తిస్థాయిలో అందుకుంటున్నాయి. మన రాష్ర్టంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏం చేస్తోందో చెప్పేదే ఈ కథనం... స్కౌట్స్ అనేది ఆర్మీకి సంబంధించిన పదం. శత్రువుల సమాచారం సేకరించే వ్యక్తిని స్కౌట్ అంటారు. గైడ్ అంటే సంరక్షణ. ఇంగ్లండ్‌కి చెందిన రాబర్ట్ స్టీఫెన్ స్మిత్ అనే ఆర్మీ వ్యక్తి పదేళ్ల పిల్లల కోసం 1907లో ఒక క్యాంప్ ఏర్పాటుచేశారు. ఈ క్యాంప్‌కి వచ్చి, పదిరోజుల పాటు పిల్లలు ఎవరిసాయం లేకుండా ఉంటారు. ఈ విషయాన్ని గమనించి ఆయన ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం మన దేశానికి కూడా వచ్చింది. 1920 నాటికి స్కౌట్స్ పేరున కొన్ని, గైడ్స్ పేరుతో కొన్ని శిబిరాలు ఏర్పాటయ్యాయి. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దేశంలో ఉన్న అన్ని శిబిరాలకు ఒకే వేదిక ఉండాలనే ఉద్దేశ్యంతో 1950లో ఢిల్లీ కేంద్రంగా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటయింది. ఆ లోకం వేరు... స్కూల్లో తరగతి వేళల తర్వాత ఓ గంటపాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ క్లాసులు ఉంటాయి. ఇందులో చేరిన విద్యార్థులకు, టీచర్లకు కూడా యూనిఫాం ఉంటుంది. 3 - 5 ఏళ్ల వయసున్న విద్యార్థుల్ని బన్నీస్ అనీ, 6 - 10 వయసున్న అమ్మాయిల్ని బుల్బుల్స్ అనీ, అబ్బాయిల్ని కబ్స్ అనీ, 10 - 16 ఏళ్ల విద్యార్థుల్ని రోవర్స్ అండ్ రేంజర్స్ అనీ పిలుస్తారు. వారి పాఠాలను... ప్రథమ సోపాన్, ద్వితీయ సోపాన్, తృతీయ సోపాన్ అని మూడు విభాలుగా విభజిస్తారు. ఇవి పూర్తయ్యాక రాజ్య పురస్కార్ ఉంటుంది. రోవర్స్ అండ్ రేంజర్స్‌కి వెళ్లాక సోపాన్లతో పాటు రాష్ట్రపతి పురస్కార్ కూడా ఉంటుందన్నమాట. ప్రథమ సోపాన్‌లో... ప్రథమ చికిత్స మొదలు పరిశుభ్రత వరకూ అన్ని విషయాల్ని బోధించి ప్రాక్టికల్స్ కూడా చేయిస్తారు. ప్రకృతి పరిశీలన, పరోపకారం కూడా ప్రథమ సోపాన్‌లో భాగం. ద్వితీయ సోపాన్‌లో... వంట చేయడం నుంచి హెరిటేజ్ అండ్ కల్చర్ వరకూ పాఠాలుంటాయి. తృతీయ సోపాన్‌లో... క్యాంపులు, స్విమింగ్, జాతీయ సమైక్యతకు సంబంధించిన విషయాలపై బోధన, ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ క్యాంపుల్లో విద్యార్థులు స్వయంగా తయారుచేసుకున్న గుడారాల్లో ఉంటారు. ‘‘పౌరులను... చదువొక్కటే గొప్పవారిగా తీర్చిదిద్దదు. తోటివారికి ఉపయోగపడాలన్న భావన కలగడానికి కావలసిన శిక్షణ మా సంస్థ మాత్రమే ఇవ్వగలదని నేను గర్వంగా చెప్పగలను’’ అంటారు ఆంధ్రప్రదేశ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ జి. పరమేశ్వర్. సమైక్యత కోసం... జాతీయ సమైక్యత క్యాంపుల కోసం... విద్యార్థుల్ని జిల్లాలు, రాష్ట్రాలు దాటిస్తోంది. రెండేళ్లకిత్రం మెదక్జిల్లాలోని శంకర్‌పల్లిలో జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్‌కి దేశవ్యాప్తంగా 20 వేల మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు హాజరయ్యారు. ఆహారపదార్థాల నుంచి ఆహార్యం వరకూ అన్నింటినీ ఒకరితో ఒకరు పంచుకున్నారు. ‘‘చదువొక్కటే మనిషిని శభాష్ అనిపించదు. కళ్లెదురుగా ఎవరికైనా గాయమైతే వెంటనే సహాయపడాలి’’ అని స్వచ్ఛందంగా ప్రతిజ్ఞ చేశారు. ఎన్ని నేర్పితే ఏం లాభం... ‘‘స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇచ్చే రాజ్యపురస్కార్, రాష్ర్టపతి పురస్కార్ సర్టిఫికెట్లు వల్ల మాకు ఉపయోగం ఏంటి?’’ అనే విద్యార్థులూ ఉంటారు. ఎన్సిసి సర్టిఫికెట్ల వల్ల ఉద్యోగాల సమయంలో ఉపయోగం ఉంటుంది. అలాంటి ఉపయోగం స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికెట్‌కి కూడా ఉండాలి. లేదంటే ఈ సంస్థల ప్రాధానత్య తగ్గిపోతుంది. ‘మంచి పౌరుడిగా తీర్చిదిద్దడం వరకూ స్కౌట్స్ అండ్ గైడ్స్ విజయం సాధించగలదు. ఇందులో చేరడం వల్ల మా పిల్లాడికి ఏం లాభం?’ అని అడిగే తల్లిదండ్రులకు మా దగ్గర జవాబు లేదు. ‘‘విద్యార్థికి ఇచ్చిన మెరిట్ సర్టిఫికెట్ చూసి, ఉద్యోగ అవకాశాలు కలిగించాలని కోరుకుంటున్నాం. దాని కోసం మన రాష్ర్ట ప్రభుత్వానికి లేఖ కూడా రాశాం’’ అని వివరించారు పరమేశ్వర్. విద్య సర్టిఫికెట్తో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికెట్ తీసికెళ్లిన విద్యార్థికి ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత ఉందని తెలిస్తే ప్రతి పాఠశాలలోనూ స్కౌట్స్ అండ్ గైడ్స్ క్లాస్‌లు ప్రత్యక్షమవుతాయి. ప్రయోజనం లేకుండా ప్రేమించడం కూడా దండగనుకునే రోజుల్లో సేవలు పొందడానికి తాయిలాలు తప్పనిసరి. ఆ రకంగానైనా స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠాలు ప్రతి విద్యార్థికి అందే అవకాశం ఉంటుంది. ఆ రోజులు త్వరగా రావాలని కోరుకుందాం. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: ఎస్. ఎస్. ఠాగూర్ మీ స్కూల్లో ఉండాలంటే.. స్కౌట్స్ అండ్ గైడ్స్ బోధనలు మీ స్కూల్లో కూడా ఉండాలంటే హైదరాబాద్‌లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రధాన కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. మీ స్కూలు టీచర్లకు స్కౌట్స్ అండ్ గైడ్స్ సిబ్బంది ప్రత్యేక శిక్షణ ఇచ్చి మీ విద్యార్థులకు క్లాసులు చెప్పిస్తారు. - జి. పరమేశ్వర్, ఆర్గనైజింగ్ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ -
ఢిల్లీలో గూఢచారులకు యమక్రేజ్
ఎన్నికల ముందు రాజకీయ’ గూఢచర్యం కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్న నేతలు దీంతో డిటెక్టివ్ నారదలకు చేతి నిండా పని.. జేబు నిండా డబ్బు న్యూఢిల్లీ: ఇందు గలదు అందు లేదని సందేహం వలదు. ఎందెందు చూసినా అందందే గూఢచారి అవసరం ఉండు. ఇప్పుడు ఢిల్లీలో ప్రైవేటు గూఢచారులకు యమ క్రేజ్ వచ్చింది. అక్కడి రాజకీయ నాయకుల వల్లే ఇదంతా. త్వరలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీలోనే టికెట్ కోసం పోటీపడే ప్రత్యర్థులపై ఓ కన్నేసి ఉంచడానికి నాయకులు గూఢచారుల్ని ఆశ్రయిస్తున్నారు. టికెట్ సాధనలో ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి ఇదంతా చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉంటే 1,600 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, వెయ్యికి పైగా బీజేపీ అభ్యర్థులు టికెట్ కోసం పోటీపడుతున్నారు. ఇంతమంది పోటీలో ఉండడంతో టికెట్ ఎవరిని వరిస్తుందో తెలియని పరిస్థితి. దీంతో పార్టీలోని ప్రత్యర్థుల ఎత్తులు తెలుసుకోవడానికి టికెట్లు ఆశించే వాళ్లు గూఢచారులను ఆశ్రయిస్తున్నారు. మరోపక్క అభ్యర్థుల సత్తాను తెలుసుకోవడానికి, టికెట్ దక్కనివాళ్లు ఎలాంటి చర్యలకు దిగుతారనే అంచనా వేయడానికి రాజకీయ పార్టీలు కూడా గూఢచారులనే నియమిస్తున్నాయి. దీంతో డిటెక్టివ్ నారదలకు చేతినిండా పని, జేబు నిండా డబ్బు. నియోజకవర్గాన్ని, పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను బట్టి డిటెక్టివ్ ఏజెన్సీలు చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ మొత్తం రూ. 5 లక్షలు దాటే ఉంటుం దని సమాచారం. ఢిల్లీలో 150 డిటెక్టివ్ ఏజెన్సీలు ఉండగా.. వాటిలో 13 మాత్రం రాజకీయ గూఢచర్యంలో నైపుణ్యం ఉన్న వి. ‘ఇప్పటికే మా చేతినిండా పని ఉంది. ఇకపై వచ్చే వాళ్లని తిప్పి పంపేస్తున్నాం’ అని జీడీఎక్స్ ఏజెన్సీ ఎండీ మహేశ్ చంద్ర శర్మ తెలిపారు. ఎన్నికల ముందు ప్రత్యర్థి పార్టీలపై గూఢచర్యం సాధారణమేనని, అయితే పార్టీలోని ప్రత్యర్థుల టికెట్ చాన్స్‌లు తెలుసుకోండంటూ అభ్యర్థులు కోరడం కొత్త ట్రెండ్ అని చెప్పా రు. టికెట్ రాని అభ్యర్థి పార్టీలోని తన ప్రత్యర్థులను ఎన్నికల్లో దెబ్బకొట్టడానికి కూడా గూఢచారుల్ని నియమించుకుంటున్నారని ఏపీడీ ఏజెన్సీ చైర్మన్ విక్రం సింగ్ చెప్పారు.