స్కౌట్‌తో క్రమశిక్షణ
-
సింగరేణి సీజీఎం సుధాకర్ రెడ్డి
గోదావరిఖనిటౌన్ : స్కౌట్ క్రమశిక్షణకు మారు పేరని, విద్యార్థి దశలో ప్రతి విద్యార్థి స్కౌట్‌లో చేరాలని ఆర్జీ–1 సీజీఎం సుధాకర్‌రెడ్డి కోరారు. స్థానిక బేడెన్ పావెల్ పార్క్‌లో నిర్వహిస్తున్న వరంగల్, మెదక్, కరీంనగర్ మూడుజిల్లాల స్థాయి టెస్టింగ్ క్యాంప్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్కౌట్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్ అండ్ గైడ్ విద్యార్థులు సేవా భావంతో ముందుండడం గర్వకారణమన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, గవర్నర్ టెస్టింగ్‌లతోపాటు రాష్ట్ర అవార్డుకు ఎంపిక కావాలని కోరారు. ప్రతీ విద్యార్థి నిత్యం సామాజిక సేవలో ముందుండాలని సూచించారు. సింగరేణి యాజమాన్యం స్కౌట్‌కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని పేర్కొన్నారు. స్కౌట్ కోసం సింగరేణిలో శిక్షణ తరగతులు, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు. సింగరేణి ప్రాంత కార్మికుల పిల్లలు ఈ కార్యక్రమాలను వినియోగించుకోవాలని కోరారు. డీజీఎం పర్సనల్ శ్రీనివాస్ మాట్లాడుతూ స్కౌటిజం నిజ జీవితంలో ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రైనింగ్ కమిషనర్ భవంతరావు, జిల్లా కార్యదర్శి రాంరెడ్డి, జిల్లా గైడ్ కమిషనర్ జ్యోతి, డీటీసీ రోజ్‌లీన్, సీనియర్ స్కౌట్ మాస్టర్లు రోవర్స్ రాంచందర్, చంద్రమౌళి, విజయ్‌కుమార్, రవీందర్, శ్రీనివాస్, నాగరాజు పాల్గొన్నారు.