displane
-
క్రమశిక్షణతో మెదిలితేనే ‘ముందడుగు’
యువత సన్మార్గంలో పయనిస్తే మంచి భవిష్యత్తు ఎస్పీ జోయల్ డేవిస్ పెద్దపల్లిరూరల్ : విద్యావంతులైన యువకులు, విద్యార్థులు సన్మార్గంలో పయనిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎస్పీ జోయల్‌డేవిస్ అన్నారు. మండలంలోని బందంపల్లిలో శనివారం వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులతో సమావేశమై బంగారు భవిష్యత్తుకోసం అనుసరించాల్సిన మార్గాలను వివరించేందుకు ‘ముందడుగు’ పేరిట సమావేశాన్ని ఏర్పాటుచేశారు. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడారు. ఉన్నతవిద్యను చదివే సమయమే కీలకమైందన్నారు. ఆ సమయంలో యువత సక్రమమైన మార్గాలలో క్రమశిక్షణతో చదివితే భవిష్యత్ అంతా బంగారుమయమేనని పేర్కొన్నారు. వక్రమార్గంలో పయనించి జీవితాన్ని నాశనం చేసుకుని తల్లిదండ్రులకు శోకం మిగుల్చొద్దన్నారు. కాలేజీల్లో ర్యాగింగ్ పేరిట తోటి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుందన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకోసం శ్రమిస్తే సత్ఫలితాలే వస్తాయన్నారు. పోలీసులు ఇచ్చిన సందేశాత్మక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డీఎస్పీ మల్లా రెడ్డి, కళాశాలల కరస్పాండెంట్లు రేపాల రమేశ్, అల్లెంకి శ్రీనివాస్, తొడుపునూరి శ్రీనివాస్, ఎస్ఐలు శ్రీనివాస్, విజయేందర్ పాల్గొన్నారు. -
స్కౌట్తో క్రమశిక్షణ
సింగరేణి సీజీఎం సుధాకర్ రెడ్డి గోదావరిఖనిటౌన్ : స్కౌట్ క్రమశిక్షణకు మారు పేరని, విద్యార్థి దశలో ప్రతి విద్యార్థి స్కౌట్లో చేరాలని ఆర్జీ–1 సీజీఎం సుధాకర్‌రెడ్డి కోరారు. స్థానిక బేడెన్ పావెల్ పార్క్‌లో నిర్వహిస్తున్న వరంగల్, మెదక్, కరీంనగర్ మూడుజిల్లాల స్థాయి టెస్టింగ్ క్యాంప్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్కౌట్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్ అండ్ గైడ్ విద్యార్థులు సేవా భావంతో ముందుండడం గర్వకారణమన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, గవర్నర్ టెస్టింగ్లతోపాటు రాష్ట్ర అవార్డుకు ఎంపిక కావాలని కోరారు. ప్రతీ విద్యార్థి నిత్యం సామాజిక సేవలో ముందుండాలని సూచించారు. సింగరేణి యాజమాన్యం స్కౌట్కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని పేర్కొన్నారు. స్కౌట్ కోసం సింగరేణిలో శిక్షణ తరగతులు, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు. సింగరేణి ప్రాంత కార్మికుల పిల్లలు ఈ కార్యక్రమాలను వినియోగించుకోవాలని కోరారు. డీజీఎం పర్సనల్ శ్రీనివాస్ మాట్లాడుతూ స్కౌటిజం నిజ జీవితంలో ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రైనింగ్ కమిషనర్ భవంతరావు, జిల్లా కార్యదర్శి రాంరెడ్డి, జిల్లా గైడ్ కమిషనర్ జ్యోతి, డీటీసీ రోజ్లీన్, సీనియర్ స్కౌట్ మాస్టర్లు రోవర్స్ రాంచందర్, చంద్రమౌళి, విజయ్‌కుమార్, రవీందర్, శ్రీనివాస్, నాగరాజు పాల్గొన్నారు.