సింగరేణి స్కౌట్స్‌కు రాష్ట్రపతి అవార్డు
► సర్టిఫికెట్లు ప్రదానం చేసిన గవర్నర్ నరసింహన్
► లైఫ్ మెంబర్‌షిప్ చెక్కు అందచేసిన
► డెరైక్టర్(పా) పవిత్రన్‌కుమార్
► స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు ప్రశంసనీయం : ఎంపీ కవిత
కొత్తగూడెం/శ్రీరాంపూర్ : విద్యార్థి దశలోనే సేవా భావాన్ని పెంపొందించే స్కౌట్స్ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ మరింత అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఈసీఎల్.నరసింహన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సింగరేణి స్కౌట్స్ అండ్ గైడ్స్ అందిస్తున్న సేవలను రాష్ట్ర భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్, ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశంసించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో బుధవారం స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కామన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా గవర్నర్ నరసింహన్, ఎంపీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా 2015-16 సంవత్సరంలో రాష్ట్రపతి అవార్డు అందుకున్న కొత్తగూడెంకు చెందిన వరుణ్‌కు, ప్రీ-ఏఎల్టీ శిక్షణ పూర్తిచేసిన గోలేటి సింగరేణి హైస్కూల్ స్కౌట్ మాస్టర్ కె.భాస్కర్‌కు గవర్నర్ సర్టిఫికెట్లు అందచేశారు.
సింగరేణి కాలరీస్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తరఫున 52 మంది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర జీవితకాల సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన రూ.58,032 చెక్కును సింగరేణి సంస్థ డెరైక్టర్(ఫైనాన్స్, పా), భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి డిస్ట్రిక్ట్ చీఫ్ కమిషనర్ జె.పవిత్రన్‌కుమార్ ఎంపీ కవితకు అందచేశారు. అనంతరం పవిత్రన్‌కుమార్ మాట్లాడుతూ సీఎండీ ఎన్.శ్రీధర్ నాయకత్వంలో సమాజహిత, సంక్షేమ కార్యక్రమాలన్నింటిలో సింగరేణి స్కౌట్స్‌ను భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పారు.
పాఠశాల, కళాశాల స్థాయిలోనే విద్యార్థులకు స్కౌట్స్, గైడ్స్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ, కోల్‌బెల్ట్ ప్రాంతంలో స్కౌట్స్ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ప్రణాళికలు రూ పొందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ తరఫున అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కమిషనర్ కె.వి.రమణ, డిస్ట్రిక్ట్ ట్రెరుునింగ్ కమిషనర్ జె.వి.కృష్ణారావు, స్టేట్ హెడ్ క్వార్టర్ కమిషనర్ ఎల్.గోపాలకృష్ణయ్య, లైఫ్ మెంబర్ ఎండీ.ఖాసీం, స్కౌట్ మాస్టర్లు కె.భాస్కర్, పి.సాయినిరంజన్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత వరుణ్ తదితరులు పాల్గొన్నారు.