మార్కెట్లోకి పొలారిస్ ‘స్కౌట్ సిక్స్టీ’ | Indian Motorcycles Launches the Scout Sixty in Hyderabad | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి పొలారిస్ ‘స్కౌట్ సిక్స్టీ’

Published Wed, Aug 10 2016 1:20 AM | Last Updated on Sat, Sep 15 2018 8:00 PM

మార్కెట్లోకి పొలారిస్ ‘స్కౌట్ సిక్స్టీ’ - Sakshi

మార్కెట్లోకి పొలారిస్ ‘స్కౌట్ సిక్స్టీ’

ధర రూ. 12.21 లక్షలు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వాహనాల తయారీ దిగ్గజం పొలారిస్ ఇండియా తాజాగా ఇండియన్ బ్రాండ్ కింద ‘స్కౌట్ సిక్స్ టీ’ మోటార్‌సైకిల్‌ను హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.12.21 లక్షలు (హైదరాబాద్ ఎక్స్ షోరూం). పొలారిస్ ఇండియా ఎండీ పంకజ్ దూబే, మహావీర్ డెక్కన్ ఆటో సంస్థ డెరైక్టర్ వికాస్ జబక్ మంగళవారమిక్కడ ఈ బైక్‌ను ఆవిష్కరించారు.

స్కౌట్ సిక్స్‌టీతో కలిపి దేశీయంగా మొత్తం ఏడు మోడల్స్‌ను విక్రయిస్తున్నట్లవుతుందని దూబే తెలిపారు. ఇప్పటిదాకా వెయ్యి సీసీపైగా సామర్ధ్యం గల బైక్‌లే విక్రయిస్తుండగా... ఇతర వర్గాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా 999 సీసీ సామర్ధ్యం గల స్కౌట్‌ను మార్కెట్లోకి తెచ్చినట్లు ఆయన తెలియజేశారు.

ప్రస్తుతం హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 7 షోరూమ్‌లున్నాయని, ఈ ఏడాది ఆఖరు నాటికి వీటిని పదికి పెంచుకోనున్నామని దూబే చెప్పారు. అలాగే అక్టోబర్ లేదా నవంబర్‌లో మరో కొత్త మోడల్‌ను ప్రవేశపెడతామన్నారు. సూపర్‌బైక్‌లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో వీటి మార్కెట్ పరిమాణం ప్రస్తుతం 8,000-10,000 యూనిట్ల స్థాయికి చేరిందని తెలిపారు. 1,400 పైగా సీసీ సామర్ధ్యం గల బైక్‌ల విభాగంలో తమకు దాదాపు 10 శాతం వాటా ఉందని దూబే చెప్పారు. వాహనాల ధరల శ్రేణి రూ. 12 లక్షల నుంచి రూ. 38 లక్షల దాకా ఉందన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement