Motorcycle
-
2025 డాకర్ ర్యాలీ - ఎడారిలో దుమ్ములేపుతున్న బైకులు (ఫోటోలు)
-
త్వరలో అతిపెద్ద మోటార్‌సైకిల్ వేలం: కనిపించనున్న అరుదైన వాహనాలు ఇవే (ఫోటోలు)
-
హోండా మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ (ఫొటోలు)
-
వీల్‌చెయిర్ మోటార్బైక్గా మారిపోతే..!
ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్... ఎలా పిలిచినా అంగవైకల్యం అనేది జీవితంలో ఎంతో పెద్ద లోటు. శరీరంలో ఏ అవయవం లేకపోయినా కష్టమే. వైకల్యాన్ని జయించేందుకు ఎంతో మనోస్థయిర్యం అవసరం. వికలాంగుల కోసం ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అలాంటి వాటిలో మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థులు చేసిన ఈ ప్రయోగం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. వికలాంగుల వీల్ చెయిర్‌ను మోటార్బైక్గా మార్చే ఈ టెక్నాలజీ ఓ కొత్త స్టార్టప్‌గా మారిపోయింది. ఇప్పటి వరకు 5,200 బైకులు కొనుగోలు చేశారని సమాచారం.‘నియోమోషన్’ మోటర్బైక్కొద్ది రోజుల క్రితం జొమాటో డెలివరీ పార్ట్నర్ సయ్యద్ షహజాద్ అలీ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మోటార్బైక్గా మారిపోయిన ఓ వీల్‌చెయిర్‌లో అలీ దిలాసాగా కూర్చుని ఉన్నాడు. ‘‘వైకల్యమనేదే లేదు.. మనం చేయాలనుకుంటే ఏదీ అసాధ్యం కాదు. అయితే మనం అంకితభావంతో కృషిచేయాలంతే’’ అని అలీ అంటున్నాడు. ఈ కొత్త వీల్చెయిర్బైక్ కి ఆయన ‘నియోమోషన్’ అని పేరుపెట్టాడు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థుల సృజనాత్మకతకు ఇది నిదర్శనమి అలీ చెప్పాడు. ఈ వినూత్న సృష్టి.. వికలాంగులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అంటున్నాడు.వైకల్యం ఓ పెద్ద సవాలు.. ఈ వాహనాన్ని తయారుచేసిన ఫౌండర్లలో ఒకరైన సిద్ధార్ధ్ డాగా మాట్లాడుతూ ‘‘నియోమోషన్ వికలాంగుల జీవితాలను సమూలంగా మార్చివేయబోతోంది’’ అన్నారు. నియోమోషన్ ప్రయాణం ఐఐటీ మద్రాస్‌లో ప్రారంభమైంది. ఫైనల్ ఇయర్లో ఉండగా డాగా, ఇంకా ఆయన స్నేహితులను వారి ప్రొఫెసర్ డాక్టర్ సుజాతా శ్రీనివాసన్ చాలా ప్రభావితం చేశారు. డాక్టర్ సుజాతా శ్రీనివాసన్ టిటికె సెంటర్ ఫర్ రిహాబిలిటేషన్ రీసెర్చ్ అండ్ డివైస్ డెవలప్మెంట్ విభాగం చూసేవారు. వైకల్యాన్ని అధిగమించే పరికరాలపై వారు చాలా పరిశోధనలు చేసేవారు. ముందు డాగా మిత్రబృందానికి అప్పగించిన పనేమిటంటే... స్విమ్మింగ్‌పూల్‌లో వికలాంగులు సురక్షితంగా దిగడం, బైటకు రావడం, వ్యాయామంగా ఈతను ఉపయోగించుకోవడం ఎలా అనే అంశాలను పరిశీలించమన్నారు. వికలాంగులు ఎదుర్కొనే అనేక సవాళ్లను ఇది వారి కళ్లకు కట్టింది.సౌకర్యవంతంగా.. దృఢంగా..ఆ అనుభవం నుంచే ఈ నియోమోషన్ (వీల్‌చెయిర్ వాహనం) ఐడియా వారికి వచ్చింది. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ డిజైన్. మార్కెట్లో దొరికే వీల్చెయిర్లు అన్నీ ఒకే డిజైన్‌లో ఉంటాయి. వైకల్యం ఉన్నవారికి అందరికీ ఒకే రకమైన వీల్‌చెయిర్ పనిచేయదు. కానీ ఈ నియోమోషన్ వీల్‌చెయిర్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. చాలా దృఢంగా కూడా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చున్నా ఎలాంటి ఇబ్బందీ ఉండదు.గంటకు 50 కి.మీ ప్రయాణంనియోమోషన్ నిజానికి నియోఫ్లై అనే వీల్ చెయిర్, నియోబోల్ట్ అనే మోటార్బైక్గా ఉపయోగపడే పరికరం రెండింటి సమ్మేళనం. నియోబోల్ట్ అనేది లిథియం–అయాన్ బ్యాటరీతో నడిచే విద్యుత్ పరికరం. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 25 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అలాగే 50 కిలోమీటర్లు ప్రయాణించే వేరియంట్ కూడా ఉంది.నాణ్యత ఎక్కువ..ధర తక్కువ..అయితే ఎన్ని సౌకర్యాలు, సౌలభ్యాలు ఉన్నా వికలాంగులకు అందుబాటు ధరలో ఉంటేనే ఉపయోగం. ఎక్కువమంది ఉపయోగించుకోగలుగుతారు. ఈ విషయాన్ని గమనంలో ఉంచుకునే సాధ్యమైనంత తక్కువ ధరకు లభించేలా.. అదే సమయంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నియోమోషన్ను తయారు చేసినట్టు డాగా వివరించారు. ప్రస్తుతం నియోమోషన్ రూ.1,10,000కు లభిస్తోంది. అంతర్జాతీయంగా ఇలాంటి పరికరాలతో పోలిస్తే ఇందులో సౌకర్యాలు ఎక్కువ అని, ధర చాలా తక్కువని డాగా వివరించారు. -
‘ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తాలూకా..!’
ఏ మోటార్ సైకిల్, అయినా, స్కూటర్ అయినా నంబర్ ప్లేట్ ఉండటం సహజం. నంబర్ ప్లేట్ లేకుండా వెళ్తే అది చోరీ చేసిన బైక్‌గా పోలీసులు అనుమానించి, కేసు నమోదు చేయడం పరిపాటి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ పారీ్టపై తెలుగు తమ్ముళ్లు అభిమానం శృతి మించి పాకాన పడింది. నంబర్..గింబర్ జాన్తా నై..అని బైక్‌లపై నంబర్ప్లేట్లు తొలగించేశారు. ఏకంగా పసుపు రంగు ప్లేట్‌పై చంద్రబాబునాయుడు ముఖచిత్రంతో ‘ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తాలూకా’ అని ప్లేట్ అమర్చి నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్నారు.కుప్పం రూరల్: కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు పట్టం కట్టిన తెలుగు తమ్ముళ్లు మోటార్ వాహనాల చట్టం నిబంధనలను తుంగలో తొక్కి, పార్టీ అధినేతపై తమ అభిమానాన్ని కొత్తరీతుల్లో చాటుకునేందుకు ఉబలాటపడుతున్నారు. ద్విచక్ర వాహనాలకు నంబర్లు తొలగించి పెళ్లి పిలుపుల తరహాలో బోర్డులు ఏర్పాటు చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ‘ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తాలూకా’ అంటు నంబర్ ప్లేట్ స్థానంలో తమదైన ప్లేట్ వేసుకుంటున్నారు. తద్వారా తాము టీడీపీ వీరాభిమానులం అని చూపరుల దృష్టిని ఆకర్షించే యత్నం చేస్తున్నారు. ఇలాంటి పోకడల్ని నిరోధించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ఈ ఒరవడి మరింతగా విస్తరిస్తోంది. వీళ్లను కట్టడి చేసేదెవరు..? నంబర్ లేకుండా ఇలా వెళ్లే మోటార్ సైకిల్ సైక్లిస్టులు ఊహించని విధంగా ప్రమాదాలకు గురైతే పరిస్థితి ఏమిటనే ప్రశ్నకు తావిస్తోంది. ప్రమాదాలు జరిగితే ద్విచక్ర వాహనాలు అడ్రస్ ఎలా గుర్తిస్తారు? నిబంధనలను అతిక్రమిస్తున్నా వీరికి అపరాధ రుసుం ఎందుకు విధించరు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే నాధుడే లేరు.ఇదేనా బాబు నేర్పన క్రమశిక్షణ?పార్టీలో అందరూ క్రమశిక్షణ పాటించాలని, దానికే మొదటి ప్రాధాన్యత ఇస్తానంటూ పదే పదే సభల్లో ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లకు ఇదేనా నేరి్పన క్రమశిక్షణ అని ‘ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తాలూకా’ ప్లేట్‌తో వెళ్తున్న బైక్‌లను చూసి విస్తుపోతున్నారు. ఇవి చంద్రబాబు దృష్టికి ఇది వెళ్లకున్నా కనీసం వీటిని చూస్తున్న అధికారులు ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని ప్రశి్నస్తున్నారు. ఒకవేళ అడ్డుకుంటే తమకే ఇబ్బందులు వస్తాయో అని పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. -
2000 సీసీ బీఎండబ్ల్యూ బాక్సర్ (ఫోటోలు)
-
‘ప్రచార బుల్లెట్’ ఎక్కిన బెంగాల్ బీజేపీ చీఫ్
పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థులను ప్రకటించిన మరుసటి రోజే భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బుల్లెట్ వాహనంపై బాలూర్ఘాట్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. సోమవారం ఉదయం 7 గంటలకు బాలూర్ఘాట్ రైల్వేస్టేషన్లో రైలు దిగిన మజుందార్‌కు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నాయకుల నినాదాల మధ్య దాదాపు మూడు కిలోమీటర్ల మేర మోటర్ సైకిల్ నడుపుతూ మజుందార్ ప్రచారం నిర్వహించారు . మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఎంసీపై పలు విమర్శలు చేశారు. ‘ఓ వైపు ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తుంటే మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. తృణమూల్ ఇక్కడి నుంచి అనేక కుంభకోణాలు చేసిన దొంగను అభ్యర్థిగా నిలబెట్టింది. ఇది దొంగలు, మంచి వ్యక్తుల మధ్య పోరు. తృణమూల్ కాంగ్రెస్ ఈ నియోజకవర్గాన్ని మోసం చేసింది’ అన్నారు. బాలూర్ఘాట్ నియోజకవర్గం నుండి టీఎంసీ తన లోక్‌సభ అభ్యర్థిగా బిప్లబ్ మిత్రను నిలబెట్టింది. మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి దూరం జరిగిన తృణమూల్ కాంగ్రెస్ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది. -
ప్యూర్ ఈవీ నుంచి ఎకోడ్రిఫ్ట్ బైక్
హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ ప్యూర్ ఈవీ తమ కొత్త మోటార్ సైకిల్ వేరియంట్ ఎకోడ్రిఫ్ట్ 350ని ఆవిష్కరించింది. దీన్ని ఒక్కసారి చార్జి చేస్తే 171 కి.మీ. వరకు ప్రయాణించగలదు. ప్రతి రోజూ ఎక్కువ దూరాలు ప్రయాణించే వినియోగదారులకు ఇది ఎంతో అనువుగా ఉంటుందని సంస్థ తెలిపింది. దీనితో నెలవారీగా రూ. 7,000 పైచిలుకు ఆదా కాగలదని వివరించింది. దీని ధర రూ. 1,29,999గా ఉంటుందని ప్యూర్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ వదేరా తెలిపారు. సులభతరమైన ఈఎంఐ సదుపాయం రూ. 4,000 నుంచి ఉంటుందని పేర్కొన్నారు. 110 సీసీ సెగ్మెంట్లో హీరో స్ప్లెండర్, హోండా షైన్, బజాజ్ ప్లాటినా వంటి మోటార్‌సైకిల్స్‌తో దీటుగా పోటీపడగలిగేలా దీన్ని తీర్చిదిద్దినట్లు వివరించారు. ఇందులో రివర్స్ మోడ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్ హిల్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 75 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. -
భళారే బార్బీ బుల్లెట్
దిల్లీ వీధుల్లో పరుగులు తీస్తున్న మినియేచర్ మోటర్ సైకిల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 4.6 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ‘మినీ బుల్లెట్ వోన్లీ ఫస్ట్ ఇన్ ఇండియా’ అనే కాప్షన్‌తో ఈ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సింగిల్ సీట్ ఉన్న ఈ బైక్‌కు టియర్ షేప్డ్ ఫ్యూయెల్ ట్యాంక్ ఆకర్షణ. తన కూతురు కోసం ఈ మోటర్‌సైకిల్‌ను రైడరే తయారు చేసి ‘పింకీ’ అని పేరు పెట్టాడు. నెటిజనులు మాత్రం దీనికి ‘బార్బీ బుల్లెట్’ అని పేరు పెట్టారు. ఇక రెండో వీడియోలో బార్బీ బుల్లెట్ రోడ్ల మీద పరుగులు తీస్తున్నప్పుడు జనాల రియాక్షన్ కళ్లకు కడుతుంది. -
ట్రాక్‌పై విషాదం.. 13 ఏళ్ల రేసర్ దుర్మరణం
చెన్నై: బెంగళూరుకు చెందిన 13 ఏళ్ల కుర్రాడు కొప్పారం శ్రేయస్ హరీశ్‌కు రేసింగే ప్రాణం. మోటార్‌సైకిల్ రేసింగ్‌లో బుల్లెట్లా దూసుకెళ్లే ఈ రైడర్ తన కలల్ని సాకారం చేసుకోకముందే కన్నవాళ్లకు కన్నీళ్లను మిగిల్చి వెళ్లాడు. తనకెంతో ఇష్టమైన ట్రాకే అతని ప్రాణం తీసింది. రేసింగ్‌లో మెరికగా చిరుప్రాయంలోనే జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన ఈ టీనేజ్ కుర్రాడు శనివారం పోల్ పొజిషన్‌తో భారత జాతీయ మోటార్‌సైకిల్ రేసింగ్ చాంపియన్‌షిప్ పోటీలో పాల్గొన్నాడు. రేసు ప్రారంభమైన కాసేపటికే మెరుపు వేగంతో దూసుకెళ్తున్న అతని బైక్ ‘టర్న్–1’ (మలుపు) వద్ద అదుపుతప్పింది. వేగంతో ఉండటం, కిందపడగానే తలకు బలయమైన గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. చదవండి: ఫైనల్లో ప్రణయ్ -
బురదరోడ్లు.. ఆపై వైద్యులు లేరు..
బజార్హత్నూర్: వర్షానికి పాడైన రోడ్లు.. సమయానికి అందుబాటులో లేని డాక్టర్లు .. వెరసి ఓ బాలుడి నిండు జీవితం బలైంది. బురద రోడ్డుపై మోటార్‌సైకిల్‌పై ఆ స్పత్రికి చేరడం ఆలస్యం కావడం.. సమ యానికి వైద్యులూ అందుబాటులో లేక ఆ బాలుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం డేడ్ర గ్రామానికి చెందిన గిరిజన దంపతులు పంద్ర లక్ష్మణ్, జమునల కుమారుడు పరుశురాం(3) బుధవారం రాత్రి నుంచి తీవ్ర జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడ్డాడు. గ్రామం నుంచి పీహెచ్‌సీకి 16కిలోమీటర్ల దూరం ఉండగా.. వర్షాలకు అధికభాగం రోడ్డు బురదమయమైంది. అదే రోడ్డుపై గురువారం ఉదయం 6 గంటలకు బయలుదేరి మోటార్‌సైకిల్‌పై పీహెచ్‌సీకి బాలుడిని తీసుకువచ్చారు. అయితే ఆ సమయంలో వైద్యులు అందు బాటులో లేరని, కింది స్థాయి సిబ్బంది పట్టించుకోలేదని, రిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారని లక్ష్మణ్ తెలిపాడు. కొద్దిసేపటికే బాబు మృతిచెందాడని, వైద్యులు అందుబాటులో ఉంటే తన కుమారుడు బతికేవాడని ఆవేదన వ్యక్తం చేశాడు. దంపతులిద్దరూ మోటార్‌సైకిల్‌పైనే మృతదేహంతో గ్రామానికి చేరుకున్నారు. చనిపోయిన తర్వాతే తీసుకొచ్చారంటూ మెడికల్ ఆఫీసర్ వితండవాదన కాగా, ఈ విషయమై మెడికల్ ఆఫీసర్ భీంరావ్‌ను ఫోన్లో సంప్రదించగా.. బాలుడు మృతిచెందిన తర్వాతే ఆస్పత్రికి తీసుకొచ్చారని తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులే లేరు కదా మృతిచెందినట్లు ఎవరు నిర్ధారించారని అడగ్గా.. సమాధానం చెప్పలేదు. -
నేరం నాది కాదు సార్..!
విజయనగరం క్రైమ్: పెండింగ్‌లో ఉన్న పాత ఈ చలానాల వసూలుకు ప్రత్యేక డ్రైవ్ గురువారం చేపట్టగా ఒక మోటార్ సైకిల్‌పై 93 ఈ చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించామని ట్రాఫిక్ డీఎస్పీ డి.విశ్వనాథ్ తెలిపారు. ఆ వాహనదారు వేరే వ్యక్తి నుంచి వాహనం కొనుగోలు చేసే సమయంలో గతంలో పెండింగ్‌లో ఉన్న ఈచలానాల గురించి తనకు తెలియదని చెప్పడంతో వాహనాన్ని సీజ్ చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు పాత వాహనాలు కొనుగోలు చేసే సమంయలో రికార్డులను పరిశీలించుకోవడంతో పాటు, ఆ వాహనంపై పెండింగ్‌లో ఉన్న ఈ చలానాల గురించి కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించారు. అలా తెలుసుకోకుంటే పెండింగ్‌లో ఉన్న ఈ చలానాలను చెల్లించాల్సిన బాధ్యత ప్రస్తుత యజమానిపైనే ఉంటుందన్నారు. ఈ చలానాలను సకాలంలో చెల్లించకపోవడం వల్ల వాహనాలపై కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే సమయంలో పోలీసులు చేపట్టే తనిఖీల్లో ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేక డ్రైవ్‌లో పెండింగ్ ఈ చలనాలను పరిశీలించి, చలానాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టడంతో 163 మంది వాహనదారులు పాత ఈ చలానాలను చెల్లించారని డీఎస్పీ వివరించారు. స్పెషల్ డ్రైవ్‌లో ట్రాఫిక్ ఎస్సైలు లోవరాజు, రాజు, త్రినాథరావు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. -
దివ్యాంగులను ఆదుకుంటున్న వైఎస్ జగన్ ప్రభుత్వం
-
పీటలపై పెళ్లికొడుకు వేషాలు.. బండి కొనిస్తేనే పెళ్లి చేసుకుంటా!
శంకరపట్నం (మానకొండూర్): పెళ్లికూతురు మెడలో తాళికట్టే సమయానికి బండి కొనిస్తేనే పెళ్లి చేసుకుంటా.. అని వరుడు మొండికేయడంతో అతిథిగా వెళ్లిన ఎమ్మెల్యే తానుబండి కొనిస్తా అని డబ్బులు ఇచ్చి వివాహంజరిపించిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్‌లో చోటుచేసుకుంది. శంకరపట్నం మండలం అంబాల్‌పూర్ మాజీ సర్పంచ్ గాజుల లచ్చమ్మ, మాజీ ఉపసర్పంచ్ మల్లయ్య కూతురు అనూష వివాహం సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన సంఘాల వినయ్‌తో కుదిరింది. రూ.5 లక్షల కట్నంతో పాటు మోటార్ సైకిల్ కొనిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. కట్నం డబ్బులు ముట్టచెప్పారు. మొలంగూర్ శివారులోని ఓ ఫంక్షన్హాల్లో శుక్రవారం పెళ్లి మండపానికి వధువు, వరుడి బంధువులు చేరుకున్నారు. కొత్తజంటను ఆశీర్వదించేందుకు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా హాజరయ్యారు. తీరా.. తాళికట్టే సమయంలో మోటార్ సైకిల్ కొనిస్తేనే పెళ్లి చేసుకుంటా.. అని వరుడు వినయ్ మొండికేశాడు. దీంతో వరుడు, వధువు బంధువులు గొడవకు దిగడంతో ఎమ్మెల్యే రసమయి జోక్యం చేసుకుని పెళ్లి కొడుకు వినయ్‌తో మాట్లాడి మోటార్ సైకిల్ కొనుక్కోమని సొంత డబ్బులను (సుమారు రూ.50వేలు) అప్పటికప్పుడే పందిట్లోనే అందించారు. మిగతా సొమ్ము కూడా తానే ఇస్తానని హామీ ఇచ్చారు. అనంతరం దగ్గరుండి వివాహం జరిపించి నూతన జంటను ఆశీర్వదించారు. తోడబుట్టిన అన్నగా పెళ్లి మండపంలో పరువు కాపాడావని మాజీ సర్పంచ్ గాజుల లచ్చమ్మ కన్నీరు పెట్టుకుంది. -
మిట్ట మధ్యాహ్నం ఒక్కసారిగా కుంగిన రోడ్డు.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
-
అమ్మానాన్నకు ఏమైంది అన్నయ్య?
ఖమ్మం : ఘోర రోడ్డు ప్రమాదం భార్యాభర్తలను పొట్టన పెట్టుకుని ముక్కుపచ్చలారని చిన్నారులను అనాథలుగా మిగిల్చింది. తల్లిదండ్రుల మృతదేహాల వద్ద బంధువులు రోదిస్తుండడంతో ఏం జరిగిందో తెలియక చిన్నారులు అమ్మానాన్నలకు ఏమైంది? అంటూ అమాయకంగా అడుగుతుండడంతో సమాధానం చెప్పలేక బంధువులు సతమతమయ్యారు. మండలంలోని జల్లేపల్లి గ్రామానికి చెందిన దువ్వా రమేష్, రేణుకలు బంధువులతో కలిసి సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వెంకట్రాపురంలోని బంధువుల ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకలకు ఆదివారం వెళ్లారు. వేడుక ముగిశాక ఆదివారం రాత్రి తిరిగి వస్తుండగా అనంతగిరిలో గుంతను తప్పించే క్రమంలో ఆటో డ్రైవర్ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. ఈ ఘటనలో రమేష్, రేణుక మృతి చెందగా పోస్టుమార్టం అనంతరం సోమవారం ఉదయం మృతదేహాలను స్వగ్రామానికి తీసుకొచ్చారు. తెల్లారాక వెళ్లాలని కోరినా.... జల్లేపల్లికి చెందిన దువ్వా రమేష్ వ్యవసాయ పనులతో పాటు హమాలీగా పనిచేస్తుండగా ఆయనకు భార్య రేణుక, ఐదేళ్ల కుమారుడు కార్తీక్, నాలుగేళ్ల కుమార్తె హాసిని ఉన్నారు. వెంకట్రాంపురంలో రమేష్ చెల్లెలు కుమారుడి బర్త్‌డే వేడుకలకు తురక వెంకన్న ఆటోలో రమేష్ తన భార్యాపిల్లలతో పాటు మరికొందరిని పంపించాడు. ఆతర్వాత తన బావమరిదితో కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్లాడు. వేడుకలు ముగిశాక చలి పెరగడంతో అక్కడే ఉండి తెల్లారాక వెళ్లాలని బంధువులు కోరారు. అయినప్పటికీ ధాన్యం కోతల సమయంలో కావడంతో రాత్రే బయలుదేరగా ప్రమాదం బారిన పడ్డారు. ఈ ఘటనలో ఆటో ముందు భాగంలో కూర్చున్న రమేష్, రేణుక మృతిచెందగా ఆటో డ్రైవర్ తురక వెంకన్నకు తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్ తరలించారు. అలాగే, మిగతా వారికి కూడా బలయమైన గాయాలయ్యాయి. మోటార్‌సైకిల్‌పై వచ్చినా బతికేవాడేమో... దువ్వా రమేష్ వెళ్లేటప్పుడు బావమరిది మోటార్ సైకిల్‌పై వెళ్లగా వచ్చేటప్పుడు చలి పెరగడంతో ఆయన బావమరిది అక్కడే ఆగిపోయాడు. దీంతో దువ్వా రమేష్ ఆటోలో వస్తుండగా ప్రమాదం జరిగింది. ఒకవేళ ఆయన మోటార్ సైకిల్‌పై వచ్చినా ప్రాణాలు దక్కేవని చెబుతున్నారు. ఏది ఏమైనా రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందడంతో చిన్నారులు కార్తీక్, హాసిని అనాథలుగా మిగిలారు. గ్రామస్తులు రోదనల నడుమ అంత్యక్రియలు పూర్తిచేయగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భాషబోయిన వీరన్న తదితరులు నివాళులరి్పంచారు. -
నిరుద్యోగమే నిప్పంటించింది!
తల్లాడ: మోటార్‌సైకిల్‌పై వచ్చి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ ఎన్టీఆర్ నగర్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. అయితే ఉద్యోగం రాలేదనే మనస్తాపంతోనే తమ కొడుకు ఈ దారుణానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడ శ్రీనగర్ కాలనీకి చెందిన యడపల్లి రామ్‌గోపాల్ (24) మోటార్‌సైకిల్‌పై ఆదివారం మధ్యాహ్నం సమయంలో తల్లాడకు వచ్చాడు. ఎన్టీఆర్ నగర్ సమీపంలోని రాష్ట్రీయ రహదారి నుంచి పొలాల్లోకి వెళ్లే రోడ్డులో మోటార్‌సైకిల్‌ను ఆపాడు. దానిపైనే కూర్చుని పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో మోటార్‌సైకిల్ పూర్తిగా కాలిపోయింది. అతడికి కూడా తీవ్రంగా మంటలు అంటుకోగా తాళలేక కాలుతున్న శరీరంతోనే రాష్ట్రీయ రహదారిపైకి పరుగులు తీశాడు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్లేవారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తల్లాడ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటల బాధ తట్టుకోలేక కేకలు వేస్తున్న యువకుడిని ట్రాలీ ఆటోలో ఖమ్మం తరలిస్తుండగా.. మార్గమధ్యలో కొణిజర్ల వద్ద మృతి చెందాడు. సంఘటనా స్థలంలో సెల్‌ఫోన్, ఏటీఎమ్ కార్డు, ఐడీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐడీ కార్డు ఆధారంగా మృతుడిని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తల్లాడ ఏఎస్ఐ జేవీయర్ తెలిపారు. కాగా, తమ కుమారుడు బీటెక్ పూర్తి చేశాడని, ఉద్యోగం రాలేదని నిత్యం మనోవేదన చెందేవాడని, ఆ కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని రామ్‌గోపాల్ తండ్రి పోలీసులకు చెప్పారు. -
సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్
-
సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్
సాక్షి, ముంబై: అత్యంత సాహసంతో బాలుడి ప్రాణాలను కాపాడిన రైల్వే ఉద్యోగిపై ప్రశంసల జల్లుకురవడమే కాదు విలువైన బహుమతులు కూడా లభిస్తున్నాయి. ప్రమాదవశాత్తూ రైల్వే ట్రాక్‌పై నిలిచిపోయిన బాలుడిని రక్షించిన మయూర్ షెల్కేని స్వయంగా రైల్వే శాఖమంత్రి పియూష్ గోయల్ అభినందించారు. రైల్వే మంత్రిత్వ శాఖ బహుమతిని కూడా ప్రకటించింది. తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ ఈ కోవలో నిలిచింది. సమయానుకూలంగా స్పందించి, ప్రాణాలను పణంగా పెట్టి మరీ బాలుడిని కాపాడి హీరోగా నిలిచిన షెల్కేకు జావా మోటార్ సైకిల్‌ను గిఫ్ట్‌గా ప్రకటించింది. మయూర్ షెల్కే ధైర్యసాహసాలు ప్రశంసనీయమంటూ క్లాసిక్ లెజెండ్స్ చీఫ్ అనుపమ్ థరేజా అభినందించారు. మొత్తం జావా కుటుంబం ఆయనను అభినందిస్తోందన్నారు. రైలు దూసుకొస్తున్నప్పటికీ బాలుడిని సురక్షితంగా కాపాడిన తీరు తమను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిందని థరేజా పేర్కొన్నారు. జావా హీరోస్ ఇనీషియేషన్‌లో భాగంగా ఈ అవార్డు ఇస్తున్నామన్నారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఇలాంటి హీరోలను గుర్తించి జావా హీరోస్ పేరుతో సత్కరించనున్నామని వెల్లడించారు. దీనిపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. మూవీల్లోని సూపర్ హీరోలను మించిన హీరోగా మెరుగైన ధైర్య సాహసాలను ప్రదర్శించారంటూ ట్వీట్ చేశారు. జావా కుటుంబంలో మనమందరం అతనికి సెల్యూట్ చేద్దామన్నారు. అలాగే క్లిష్ట సమయాల్లో ఎలా ప్రవర్తించాలో షెల్కే మనకు చూపించారంటూ ఆయన ప్రశంసించారు.(పట్టాలపై చిన్నారి..దూసుకొస్తున్న రైలు.. ఇంతలో) కాగా ఏప్రిల్ 17న వంగని రైల్వే స్టేషన్లో మయూర్ షెల్కే అత్యంత సాహసంతో బాలుడిన కాపాడిన వైనం చోటు చేసుకుంది. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలను రైల్వే శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. సెంట్రల్ రైల్వేలో పాయింట్స్‌మన్‌గా పని చేస్తున్నమయూర్ షెల్కేకు రైల్వే మంత్రిత్వ శాఖ రూ.50 వేలు బహుమతిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
భారీ ఇంజిన్‌తో ఖరీదైన బైక్
సాక్షి, న్యూఢిల్లీ: యూకేకు చెందిన మోటార్‌సైకిల్ తయారీ దిగ్గజం ట్రయంఫ్ రాకెట్ 3 బ్రాండ్ లో అత్యంత ఖరీదైన కొత్త మెటార్ బైక్ లాంచ్ చేసింది. భారీ ఇంజిన్‌తో రాకెట్ 3 జీటీ పేరుతో దీన్ని భారతదేశంలో విడుదల చేసింది. దీని ధర రూ .18.4 లక్షలుగా నిర్ణయించింది. కరోనా సంక్షోభం కాలంలో అమ్మకాలు లేక దేశం నుంచి వైదొలగాలని మరో దిగ్గజ సంస్థ హార్లే డేవిడ్సన్ భావిస్తున్న తరుణంలో ట్రయంఫ్ అద్భుత ఫీచర్లతో ఈ కొత్త మోటార్ సైకిల్ తీసుకువడం విశేషం. రాకెట్ 3 జీటీ స్పెసిఫికేషన్లు ట్రిపుల్ మెటారు ప్రధాన ఆకర్షణ. అతిపెద్ద 2,500 సీసీ ఇన్ లైన్ 3-సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజిన్ 6000 ఆర్ పీఎమ్ వద్ద 167 బిహెచ్పి శక్తిని, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 221 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది గత వెర్షన్ కంటే 11 శాతం ఎక్కువ. కొత్త క్రాంక్కేస్ అసెంబ్లీ, ఇంటిగ్రల్ ఆయిల్ ట్యాంక్, బ్యాలెన్సర్ షాఫ్ట్ కలిగి ఉంది. ఇంజిన్ బరువును 18 కిలోలకు పరిమితం చేసింది. పాత తరం బైక్‌తో పోలిస్తే బరువును సుమారు 40 కిలోలు తగ్గించింది. టూరింగ్ స్టయిల్ హ్యాండిల్‌బార్, పొడవైన విండ్‌స్క్రీన్, గో ప్రో కంట్రెల్స్ తో బ్లూటూత్-ఎనేబుల్డ్ ఫుల్-కలర్ టిఎఫ్టి డాష్, హిల్-హోల్డ్ కంట్రోల్, 4 రైడ్ మోడ్స్, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. ఇంకా టార్క్ అసిస్టెడ్ క్లచ్, ఎల్ఇడి హెడ్‌ల్యాంప్, ఎక్స్టెండెడ్ ఫ్లై స్క్రీన్, అడ్జస్టబుల్ ఫుట్‌పెగ్, తేలికపాటి 20-స్పోక్ అల్యూమినియం వీల్ లాంటి ఇతర ఫీచర్లు ఈ బైక్ సొంతం. తమ కొత్త ట్రయంఫ్ రాకెట్ 3 జీటీ ఔత్సాహికుల బైక్ అని ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా బిజినెస్ హెడ్ షుయెబ్ ఫారూక్ తెలిపారు. అత్యుత్తమ టెక్నాలజీ, ఎర్గోనామిక్స్, ఆశ్చర్యపరిచే పనితీరుతో ఇదొక లెజెండ్ బైక్ అన్నారు. -
వైరల్: కనిపించేదంతా నిజం కాదు
-
ఒక్క క్షణం.. అందరినీ పిచ్చోళ్లను చేశాడు
మీరు సైకిల్ చూశారు, బైక్ చూశారు.. కానీ "సైకిల్ బైక్" మాత్రం చూసుండరు. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. ఓ యువకుడు దీన్ని నిజంగానే తయారు చేశాడు. ఇది ముందు నుంచి బైక్‌లాగా, వెనక నుంచి సైకిల్‌గా కనిపిస్తుంది. దీన్ని తొక్కుతున్నప్పటికీ ముందు నుంచి చూసేవాళ్లకు అరె.. ఎంత స్పీడుగా నడపుతున్నాడో అనిపిస్తుంది. తీరా అది మనల్ని దాటి వెళ్లిపోయాక అసలు సంగతి అర్థమవుతుంది. ఇలాంటి ఓ ఫన్నీ వీడియోను సీసీటీవీ ఇడియట్స్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. (అక్కడ టూ వీలర్స్‌పై పూర్తి నిషేధం) ఇందులో హీరోలా బైక్ నడుపుతున్నట్లు కనిపించే వ్యక్తి పక్కనున్న బైకర్‌ను కూడా దాటి ముందుకెళ్లిపోయాడు. కానీ కొన్ని సెకన్ల లోపే అతను నడపుతోంది బైక్ కాదు సైకిల్ అని స్పష్టమవుతోంది. లక్షలాది మంది వీక్షించిన ఈ వీడియోకు ఫన్నీ కామెంట్లు పోటెత్తుతున్నాయి. "ఒక్క క్షణం అందరినీ పిచ్చోళ్లను చేశావు కదరా.." అంటూ నెటిజన్లు ఫూల్ అయ్యామని ఒప్పేసుకుంటున్నారు. "కంటికి కనిపించేదంతా నిజం కాదు", "అతని తెలివికి ఏమిచ్చినా తక్కువే..", "తక్కువ బడ్జెట్ బైక్" అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (‘అట్లాస్’ మళ్లీ వస్తుందా..?) -
హోండా బీఎస్-6 బైక్ ‘ఎస్పీ 125’ లాంచ్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తాజాగా భారత్ స్టేజ్ (బీఎస్)–6 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న సరికొత్త బైక్‌ను దేశీ మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఎస్పీ 125’ పేరిట విడుదలైన ఈ అధునాతన బైక్ ప్రారంభ ధర రూ. 72,900. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా నూతన ఉద్గార నిబంధనలు అమలుకానున్న నేపథ్యంలో సీబీ షైన్ ఎస్పీ 125 మోటార్ సైకిల్ స్థానాన్ని భర్తీ చేయడానికి ఈ బైక్‌ను తెచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మినోరు కటో మాట్లాడుతూ.. ‘125 సీసీ విభాగంలో సాంకేతికత, శైలి, పనితీరు పరంగా కొత్త మోడల్ మరింత మెరుగుపడింది. మునుపటి మోడల్‌తో పోలిస్తే ధర 11 శాతం పెరగ్గా, మైలేజీ 16 శాతం పెరిగింది’ అని చెప్పారు. ఈ విభాగంలో 80 లక్షల యూ నిట్లు అమ్ముడుపోగా, మార్కెట్ వాటా 39% గా ఉందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యాద్విందర్ సింగ్ గులేరియా చెప్పారు. -
18 లక్షలు పెట్టి బైక్ కొన్న హీరో
ముంబై: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఖరీదైన బైక్ సొంతం చేసుకున్నాడు. అత్యంత శక్తివంతమైన బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ ఎడ్వెంచరస్ మోటార్‌సైకిల్ కొన్నాడు. రూ. 18.25 లక్షలు (ఎక్స్ షోరూమ్) వెచ్చించి దీన్ని కొనుగోలు చేశాడు. కొత్త బైక్‌తో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. హైఎండ్ బైకులంటే అమితాసక్తి చూపించే షాహిద్ కపూర్ దగ్గర డుకాటి స్కాంబ్లర్ 1200, హార్లే-డేవిడ్సన్ ఫాట్‌బాయ్, యమహా ఎంటీ 01 బైక్‌లు ఉన్నాయి. బీఎండబ్ల్యూ జీ310 ఆర్ బైక్‌ను టెస్ట్ రైడ్ చేసిన ఫొటోను కొద్ది రోజుల క్రితం ట్విటర్లో పెట్టాడు. ముంబై ట్రాఫిక్‌లో నడపడానికి అత్యంత అనువుగా ఈ బైక్ ఉంటుందని పేర్కొన్నాడు. అయితే ఈ బైక్‌ను కొన్నాడా, లేదా అనేది వెల్లడించలేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ తదితర ప్రముఖులు కూడా బీఎండబ్ల్యూ బైకులు వాడుతున్నారు. షాహిద్ కపూర్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈసినిమాకు కబీర్ సింగ్ అనే టైటిల్ పెట్టారు. టీ సిరీస్, సినీ 1 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను 2019 జూన్ 21న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. View this post on Instagram 1250 reasons to smile. Thank you @bmwmotorrad @bmwmotorrad_in for the stunning gs1250 #bikelover gone mad 🤩 A post shared by Shahid Kapoor (@shahidkapoor) on Mar 7, 2019 at 6:53am PST -
మళ్లీ మార్కెట్లోకి లాంబ్రెటా!
దేశీ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ప్రస్తుతం రెట్రో ట్రెండ్ నడుస్తోంది. గతంలో ఓ వెలుగు వెలిగి.. కనుమరుగైపోయిన పాత బ్రాండ్స్ ఒక్కొక్కటిగా మళ్లీ తిరిగొస్తున్నాయి. ఇటీవలే జావా మోటార్ సైకిల్ రీఎంట్రీ ఇవ్వగా .. తాజాగా సుమారు మూడు దశాబ్దాల తర్వాత స్కూటర్ బ్రాండ్ లాంబ్రెటా కూడా పునరాగమనానికి సిద్ధమవుతోంది. లాంబ్రెటా తయారీ సంస్థ ఇన్నోసెంటి ఈ విషయం తెలియజేసింది. 2020లో జరిగే ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో లాంబ్రెటా ఎలక్ట్రిక్ స్కూటర్ నమూనాను ప్రదర్శించనున్నట్లు తెలిపింది. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఉక్కుతో తయారు చేసే సూపర్ లాంబ్రెటాను డిజైన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుత లాంబ్రెటాతో పోలిస్తే పరిమాణంలో మరింత పెద్దగా ఉండే సూపర్ లాంబ్రెటా డిజైనింగ్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఎక్స్‌పోలో ప్రదర్శించబోయే లాంబ్రెటా ఎలక్ట్రిక్ ప్రస్తుతం మిలన్లో రూపుదిద్దుకుంటోంది. ప్రత్యర్థి సంస్థ పియాజియో వెస్పా ఎలట్రికా స్కూటర్‌కు పోటీగా దీన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఇన్నోసెంటి ఉంది. లాంబ్రెటా ఉత్పత్తులను గతంలో స్కూటర్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఐఎల్) భారత్‌లో విక్రయించేది. అప్పట్లో లాంబ్రెటా స్కూటర్స్‌ను విజయ్ సూపర్ పేరుతో, త్రిచక్రవాహనాలను విక్రమ్ పేరుతో ఉత్పత్తి చేసింది. 1997లో లాంబ్రెటా స్కూటర్స్ తయారీని పూర్తిగా నిలిపివేసిన ఎస్ఐఎల్ ఆ తర్వాత పూర్తిగా త్రిచక్ర వాహనాల ఉత్పత్తికే పరిమితమైంది. స్కూటర్ ఇండియాతో ట్రేడ్‌మార్క్ వివాదాలను పరిష్కరించుకుంటున్న ఇన్నోసెంటి మళ్లీ ఇన్నాళ్లకు లాంబ్రెటాను అందుబాటులో తేబోతోంది. లోహియా ఆటోతో జట్టు.. భారత్‌లో లాంబ్రెటాల తయారీ కోసం నోయిడా కేంద్రంగా పనిచేసే లోహియా ఆటోతో ఇన్నోసెంటి జట్టు కట్టింది. ప్లాంటుపై కసరత్తు కూడా జరుగుతోంది. ముంబైకి దగ్గర్లో... పుణె పారిశ్రామిక ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఆటోమొబైల్ దిగ్గజాలైన టాటా మోటార్స్, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, మెర్సిడెస్ బెంజ్, ఫోక్స్‌వ్యాగన్ మొదలైన వాటి ప్లాంట్లు కూడా ఇదే ప్రాంతంలో ఉన్నాయి. భారత్‌లో ఏర్పాటు చేసే ప్లాంటులో ఇటు దేశీ మార్కెట్‌తో పాటు అటు పొరుగుదేశాలు, ఆఫ్రికా మార్కెట్‌కి కూడా అవసరమైన స్థాయిలో స్కూటర్లు తయారు చేయాలని కంపెనీ భావిస్తోంది. ప్రీమియం మార్కెట్.. విలాసవంతమైన లాంబ్రెటా స్కూటర్లతో ప్రీమియం సెగ్మెంట్ కస్టమర్ల దృష్టిని ఆకర్షించాలని ఇన్నోసెంటి భావిస్తోంది. ఇటాలియన్ డిజైన్‌లోని సృజనాత్మకతతో యువ కస్టమర్లకు చేరువ కావాలని యోచిస్తోంది. అయితే, అప్పట్లో బజాజ్ చేతక్, వెస్పాలతో పోటీలో చాలా దూరంలో ఉండిపోయిన లాంబ్రెటాకు ఇది సాధ్యపడుతుందా? అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. కానీ, ఇన్నోసెంటి టార్గెట్ చేసుకుంటున్న ప్రీమియం విభాగంలో ప్రస్తుతం గణనీయంగా వ్యాపార అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొనుగోలుదారులను ఆకర్షించగలిగే ఫీచర్స్ లాంబ్రెటాలో పుష్కలంగా ఉంటాయంటున్నాయి. ఇందుకు జావాకి వచ్చిన బుకింగ్సే ఉదాహరణ అని చెబుతున్నాయి. వింటేజ్ బ్రాండ్‌గా రాయల్ ఎన్ఫీల్డ్ కూడా మంచి సక్సెస్ సొంతం చేసుకుందని పేర్కొన్నాయి. మైలేజీతో సంబంధం లేకుండా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లను రోజువారీ పనులపై తిరిగేందుకు ఉపయోగించే వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంటోంది. అయితే, వెస్పా క్రమక్రమంగా అమ్మకాలు పెంచుకుంటున్నప్పటికీ.. ఇంకా చెప్పుకోతగ్గ స్థాయిలో మార్కెట్లో పట్టు సాధించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీమియం సెగ్మెంట్లో అడుగుపెట్టాలనుకుంటున్నా లాంబ్రెటా పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమనేది కొన్ని వర్గాల మాట!! -
యూత్‌ను ఆకట్టుకునేలా జావా బైక్స్
చెకోస్లోవేకియా బైక్ బ్రాండ్ జావా మళ్లీ భారతమార్కెట్లలో హల్చల్ చేయనుంది. నవంబరు 15న ఈ జావా మోటార్‌సైకిళ్లు భారతీయ యూత్‌ను ఆకట్టుకునేందుగా సరికొత్తగా ముస్తాబై దూసుకురానున్నాయి. ఈ సందర్భంగా అప్‌కమింగ్ బైక్ డెస్ట్ డ్రైవ్ నిర్వహించింది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 సీసీ బైక్‌కు పోటీగా జావా 300 బైక్‌ను కంపెనీ లాంచ్ చేయనుంది. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు 293 సీసీ సింగిల్ సిలిండర్, 27బీహెచ్పీ, గరిష్టంగా 28ఎన్ఎం టార్క్, 6 స్పీడ్ ట్రాన్స్మిషన్, 18 అంగుళాల ఎంఆర్‌ఆఫ్ టైర్లు, డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్ సెటప్‌తో రానుంది. అయితే ఏబీఎస్ (ఆటోమేటిక్ బ్రేకి సిస్టం) ను అమర్చిందీ లేనిదీ స్పష్టతలేదు. ఇక ధర విషయానికి వస్తే రూ.1.5 - రూ.1.75 లక్షల (ఎక్స్-షోరూం) ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా1929లో తయారైన ఈ జావా మోటారు సైకిల్‌కు ప్రపంచవ్యాప్తంగా లభించిన ఆదరణ అతా ఇంతా కాదు. రాయల్ ఎన్ఫీల్డ్కు సమానంగా క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే 1990ల తర్వాత మార్కెట్లో కనుమరుగైనా బైక్ లవర్స్ గుండెల్లో మాత్రం పదిలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మహీంద్ర గ్రూపు ఈ ఐకానిక్ జావా బ్రాండ్‌ను తిరిగి లాంచ్ చేస్తోంది. -
సెల్ఫ్ డ్రైవింగ్ టూ వీలర్లు
సాక్షి, న్యూఢిల్లీ : లగ్జరీ కార్ల తయారీలో పేరెన్నికగన్న బీఎండబ్లూ కంపెనీ తానంతట తానే నడుపుకుపోయే ద్విచక్ర వాహనాన్ని అంటే, సెల్ఫ్ డ్రైవింగ్ బైక్‌ను తయారు చేసింది. రెండేళ్లపాటు శ్రమించి ‘ఆర్1200 జీఎస్’ పేరిట తయారు చేసిన ప్రోటోటైప్ మోడల్‌కు సంబంధించిన వీడియోను కంపెనీ శనివారం నాడు విడుదల చేసింది. మానవ ప్రయత్నం లేకుండానే ఈ బైక్ తానంతటన తనే స్టార్ట్ అవుతుంది. యాక్సిలేటర్ ద్వారా వేగాన్ని పెంచుకుంటుంది. ఆ తర్వాత వేగాన్ని తగ్గించుకొని తానంతట తానే బ్రేక్ వేసుకుంటుంది. స్టాండ్ కూడా వేసుకొని ఆగిపోతుంది. వీడియోలో కంపెనీ సేఫ్టీ ఇంజనీరు స్టీఫన్ హాన్స్ మాట్లాడుతూ మానవులు నడిపే బైకుల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన మరిన్ని భద్రతా చర్యల గురించి తెలసుకోవడానికే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ప్రోటోటైప్ మోడల్‌ను విడుదల చేశామని చెప్పారు. శాస్త్ర పరిశోధనల కోసం, వాణిజ్య అవసరాల కోసం ఈ బైక్‌ను రూపొందించినప్పటికీ ఇప్పట్లో ఈ బైకులు మార్కెట్లోకి రాకపోవచ్చని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రోటోటైప్ బైక్ ద్వారా బైకులు నడిపేటప్పుడు మానవులు చేసే తప్పిదాలు ఏమిటో తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు కూడా ఇప్పటికీ ప్రయోగాల దశలోనే ఉన్న విషయం తెల్సిందే. అవి మార్కెట్లోకి విడుదలయ్యాకే అలాంటి టూ వీలర్లు రావచ్చు. -
హోండా గోల్డ్ వింగ్ ధర రూ.26.85 లక్షలు
బెంగళూరు: ఈ ఏడాది ఫిబ్రవరి ఆటో ఎక్స్‌పోలో సందడి చేసిన హోండా గోల్డ్ వింగ్ మోటార్‌సైకిల్ డెలివరీ ప్రారంభమయ్యింది. క్యాండీ ఆర్డెన్ట్ రెడ్ కలర్ టూరర్ల డెలివరీ మంగళవారం నుంచి ప్రారంభించామని హోండా మోటార్స్ అండ్ స్కూటర్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యాద్విందర్ సింగ్ గులెరియా తెలిపారు. అత్యంత శక్తివంతమైన ఈ టూరర్ నూతనంగా అభివృద్ధిపరిచిన సిక్స్–సిలెండర్ ఇంజిన్, సెవెన్ స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్స్మెషీన్ను కలిగి ఉందని ఆయన వివరించారు. దీని ధర రూ.26.85 లక్షలు. -
ఆనంద్ మహీంద్ర సారీ చెప్పారా? ఎందుకు?
సాక్షి, ముంబై: మహీంద్రా & మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్ర బైక్ లవర్స్‌కు "క్రిస్మస్ బహుమతి" ప్రకటించారు. ఎం అండ్ ఎండ్ బ్రాండ్ బీఎస్ఏ నుంచి ఒక కొత్త మోటార్ సైకిల్ తీసుకొస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సారీ.. ఇన్ని సంవత్సరాలు మీ ఫావరెట్ రైడ్‌ను మిస్ అయ్యారు శాంటా.. కానీ ఈసారి కొత్త షైనీ మోటార్ సైకిల్ తీసుకొస్తున్నామంటూ ట్వీట్ చేశారు. దీంతోపాటు శాంటా బీఎస్ఏ మోటార్ సైకిల్ నడుపుతున్న ఒక ఫోటోను కూడా జతచేశారు. అయితే ఈ కొత్త వెహికల్ విడుదల తేదీ, టైం ఇంకా నిర్ధారించపోయినప్పటికీ, రాయల్‌ఎన్‌ఫీల్డ్, బజాజ్ వాహనాలకు భిన్నంగా బీఎస్ఏ వాహన లవర్స్‌కు మాత్రం ఇది శుభవార్తే. కాగా 2016 అక్టోబర్‌లో ఎం అండ్ ఎం అనుబంధ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ యూకేకు చెందిన మోటార్ సైకిల్ సంస్థ బీఎస్ఏ ను సొంతం చేసుకుంది. మార్కెట్ లీడర్ రాయల్ ఎన్ఫీల్డ్కు దడపుట్టించేలా నూతన లాంచ్‌లతో ముంచెత్తింది. అయితే గత ఆర్థిక సంవత్సరం ఫలితాల్లో ఎం అండ్ ఎం టూవీలర్స్ లిమిటెడ్ రూ.471కోట్ల నష్టాలను ప్రకటించింది. We’re sorry you’ve missed out on your favourite ride for all these years, Santa...We’re working on getting it back for you...A shiny new one, but with all the character of your old steed... pic.twitter.com/lgj0C7staC — anand mahindra (@anandmahindra) December 25, 2017 -
సాధారణ బీమా ప్రీమియం ప్రియం
ఏప్రిల్ 1నుంచి అమల్లోకి... న్యూఢిల్లీ: మోటారు సైకిళ్లు, కార్లు, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం ధరలు ఏప్రిల్ 1 నుంచి భారం కానున్నాయి. ఏజెంట్లకు చెల్లించే కమిషన్లలో సవరణలు చేసేందుకు, వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేందుకు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ అనుమతించింది. దీంతో పాలసీ ప్రీమియంలను బీమా కంపెనీలు సవరించనున్నాయి. అయితే, దీని కారణంగా ప్రీమియంల పెంపు 5 శాతం మించకుండా ఐఆర్డీఏఐ పరిమితి విధించింది. థర్డ్ పార్టీ కవరేజీ రేట్ల పెంపునకు ఇది అదనం. ఏప్రిల్ 1 నుంచి వాహన బీమా థర్డ్‌పార్టీ ప్రీమియం రేట్లను 50 శాతం పెంచేందుకు ఐఆర్డీఏఐ ఇప్పటికే పచ్చజెండా ఊపింది. ఈ రెండు రకాల పెంపులతో వినియోగదారులపై భారం పడనుంది. 1 నుంచి దేశవ్యాప్తంగా లారీల నిరవధిక సమ్మె కోల్‌కతా: వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంతో పాటు ఇతర చార్జీల పెంపునకు నిరసనగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని అఖిల భారత రవాణా వాహనాల యాజమానుల సమాఖ్య(ఏఐసీజీవీఓఏ) కేంద్రాన్ని హెచ్చరించింది. ఈ విషయాన్ని ఏఐసీజీవీఓఏ కార్యవర్గ సభ్యుడు సుభాష్ చంద్ర ఆదివారం మీడియాకు తెలిపారు. థర్డ్ పార్టీ ప్రీమియం 50 శాతం పెంపుతో పాటు ఇతర చార్జీల పెరుగుదల లారీలకు గుదిబండగా మారిందన్నారు. పాలు, ఇతర అత్యవసర వస్తువులు మినహా మిగతా అన్ని రంగాలకు సమ్మె వర్తిస్తుందన్నారు. దీనిపై కేంద్ర మంత్రులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలకు సమాచారం అందించినట్లు సుభాష్ తెలిపారు. -
స్కూటర్, మోటార్ సైకిళ్ళ ధరలు పెరుగుతాయట!
న్యూఢిల్లీ: దేశీయంగా ద్విచక్ర వాహనాల ధరలు పెరగనున్నాయిట. వచ్చే నెల 1 నుంచి బీఎస్-4 ఉద్గార నిబంధనలుమ అమల్లోకి రానున్న కారణంగా వాహన ధరలు 6-8 శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నిబంధనలకు లోబడి అన్ని వాహనాలను రూపొందించాలన్న ఆదేశాల నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరిగనున్నాయట. మార్చి 31 నుంచి భారత్ స్టేజ్-4(బీఎస్-4) ఉద్గార నియమ నిబంధనలు అన్ని వాహన తయారీ సంస్థలకు వర్తించనున్న నేపథ్యంలో ఈ పెరుగదల తప్పదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పలు విభాగాలకు చెందిన వాహనాలు వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయన్న కారణంతో పర్యావరణ కమిటీ పిటిషన్ స్పందించిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఉద్గార నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం కూడా యోచిస్తోంది. అయితే కార్ల తయారీ కంపెనీలు మరియు డీలర్లు సుప్రీంను ఆశ్రయించారు. 9 లక్షలకు పైగా వాహనాలు డీలర్ల దగ్గర పెండింగ్ లో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సుమారు 20వేల మంది కోట్ల రూపాయలు నష్టపోతారని, వేల ఉద్యోగాలు కోల్పోతామని, డీలర్లు ఫెడరేషన్ ఆప్ డీలర్స్ అసోసియేషన్ వాదిస్తోంది. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ పిటిషన్ సుప్రీం ఆదేశాలను రివ్యూ చేయాలని కోరింది. ఇప్పటికే దాదాపు అన్ని కార్ల కంపెనీలు ఈ నిబంధనలను పాటిస్తున్ననేపథ్యంలో .. ఈనిబంధనలను అమలుకు ముందు టూ వీలర్, ఇతర కమర్షియల్ వాహనాల ధరలు పెరిగే అవకాశం ఉందని ఏంజిల్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎనలిస్ట్ శ్రీకాంత్ అకోల్కర్ చెప్పారు. 6-8శాతం ధరల సవరణ చూడగలమన్నారు. అయితే బిఎస్-4 ప్రమాణాలను చాలా ప్యాసింజర్ వాహన తయారీదారులు ఇప్పటికే అనుసరిస్తునందున, ఆ తర్వాత దీని ప్రభావం మొత్తం రంగంపై తటస్థంగా ఉంటుందన్నారు. అటు గడువును పొడిగించాల్సిన అవసరం లేని డైమ్లర్ ఇండియా సీఈవో ఇటీవల ప్రకటించారు. అలాగే గడువు పెంపును వాహన పరిశ్రమ కోరడం లేదని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ దాసరి చెప్పారు. కొందరు పర్యావరణ కార్యకర్తలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మరోవైపు దీనిపై నివేదిక సమర్పించాల్సిందిగా సుప్రీంకోర్టు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) ను కోరింది. డిసెంబర్2015 మార్చి 24 తరువాత తయారైన బీఎస్-3 వాహనాలపై నెలవారీ వివరాలు సమర్పించాలని కోరింది. ఈ గడువును పొడిగించే విషయంలో వాహన పరిశ్రమ రెండు వర్గాలు చీలిపోయాయి . గడుపు పెంపు పై ఆశాభావంతో ఉన్నారు. మరి సుప్రీంతీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి. -
ఇండియన్ రోడ్లపై రాయల్ ఎన్ఫీల్డ్ 750సీసీ
-
ఇండియన్ రోడ్లపై రాయల్ ఎన్ఫీల్డ్ 750సీసీ
న్యూ ఢిల్లీ: బైక్ లవర్స్‌ను ఆకర్షిస్తూ యూత్ ఐకాన్‌గా నిలిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌కు సంబంధించి మరో వార్త నెట్లో హల్ చల్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టుగానే ఫీచర్స్‌ను అప్ డేట్ చేస్తూ కొత్త బైక్‌లను తయారు చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్. దీంతో రాయల్ ఎన్ఫీల్డ్లో కొత్తగా రానున్న కాంటినెంటల్ జీటీ 750సీసీ బైక్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ట్విన్ సిలిండర్ కలిగిన ఈ కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ను ఇండియన్ రోడ్లపై పరీక్షిస్తున్నట్టు సమాచారం. స్పెయిన్, యూకేలో మొదటగా టెస్ట్ చేసిన అనంతరం ఇప్పుడు భారత్‌లో టెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లుకొడుతోంది. రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 750సీసీని బీఎస్-4 ఎమిషన్ నార్మ్స్కు తగ్గట్టుగా తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో జీటీ 750సీసీలో ఫ్యూయల్ ఇంజక్షన్ టెక్నాలజీ వాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోల ప్రకారం 750సీసీ ఎయిర్ కూల్డ్ ట్విన్ సిలిండర్లతో పాటూ రెండు సైలెన్సర్లు కూడా ఉన్నాయి. జీటీ 750 ఇంజిన్ విషయానికి వస్తే 50పీఎస్ ఆఫ్ పవర్ సామర్థ్యంతో తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే మార్కెట్లో ఉన్న జీటీ 535 ఇంజిన్ సామర్థ్యం 29పీఎస్ మాత్రమే. కాంటినెంటల్ జీటీ 750సీసీలో యాంటీ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్)ను వాడినట్టు సమాచారం. రోడ్ సేఫ్టీ ప్రమాణాలకు సంబంధించి పరీక్షల్లో సఫలమైతే, ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం మొదట్లో దీనిపై అధికారికంగా ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
మోటార్ సైకిల్‌పై అసెంబ్లీకి..!
-
మోటార్ సైకిల్‌పై అసెంబ్లీకి..!
సాక్షి, హైదరాబాద్: ఆయనో ఎమ్మెల్యే.. వరుసగా మూడోసారి గెలిచారు. అయితేనేమీ..! అసెంబ్లీకి మోటార్ సైకిల్‌పై వచ్చారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య శనివారం బైక్‌పై అసెంబ్లీకి రావటం అందరినీ ఆశ్చర్యపరిచింది. గత సమావేశాల వరకు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి వెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వాహన వసతి కల్పించింది. క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి, సమావేశాలు ముగిశాక తిరిగి క్వార్టర్స్ వరకు ఎమ్మెల్యేలు వెళ్లేందుకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడిపింది. క్రమంగా ఈ బస్సుల్లో వచ్చే ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయింది. దీంతో బస్సును ప్రభుత్వం రద్దు చేసింది. వాహన సదుపాయాన్ని పునరుద్ధరిం చాలని ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. స్పందన రాకపోవడంతో రాజయ్య మోటార్ బైక్‌పైనే అసెంబ్లీకి వచ్చి వెళ్లారు. -
ప్యాసింజర్ వాహనాలపై ఫోకస్
• సియట్ వైస్ ప్రెసిడెంట్ నితీష్ బజాజ్ వెల్లడి • తెలుగు రాష్ట్రాల్లోకి పంక్చర్ సేఫ్ టైర్లు విడుదల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టైర్ల తయారీ సంస్థ సియట్ ప్రధానంగా కార్లు, మోటార్‌సైకిల్ తదితర ప్యాసింజర్ వాహనాల టైర్లపై దృష్టి సారిస్తోంది. ఇందుకు తగ్గట్లుగా కొంగ్రొత్త ఉత్పత్తులు ప్రవేశపెడుతోంది. ‘ప్రస్తుతం మేం ఎక్కువగా ప్యాసింజర్ సెగ్మెంట్‌పై (టూ, ఫోర్ వీలర్లు) ఆ తర్వాత ట్రక్స్ విభాగంపై దృష్టి పెడుతున్నాం. దానికి అనుగుణంగా ఈ సెగ్మెంట్ విక్రయాలు పెంచుకుంటున్నాం. అయిదేళ్ల క్రితం మా ట్రక్ విభాగం విక్రయాలు దాదాపు 60 శాతం ఉండేవి. ప్రస్తుతం ట్రక్ సెగ్మెంట్ వాటా 40-45 శాతం మేర ఉంటుండగా.. మిగతాది ట్రక్యేతర విభాగం వాటా ఉంటోంది’ అని సియట్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) నితీశ్ బజాజ్ సాక్షి బిజినెస్ బ్యూరోకి తెలిపారు. ఈ వ్యూహంలో భాగంగానే తాజాగా ద్విచక్ర వాహనాల కోసం తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి పంక్చర్ సేఫ్ టైర్లను ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు. వీటి ధర సాధారణ టైర్లతో పోలిస్తే కొంత అధికంగా దాదాపు రూ. 1800-1,900 శ్రేణిలో ఉండగలదని బజాజ్ తెలిపారు. సుమారు నాలుగు మి.మీ. మందం గల మేకులు గుచ్చుకున్నా పంక్చర్ కాకుండా దృఢంగా ఉండేట్లు రీజెన్ టెక్నాలజీతో ఈ ట్యూబ్‌లెస్ టైర్లను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ముందుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో వీటిని ప్రవేశపెడుతున్నామని, మరో ఆరునెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని తెలిపారాయన. మెరుగైన వర్షపాతం, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా డిమాండ్, ఎకానమీ రికవరీ తదితర అంశాల కారణంగా ద్వితీయార్ధంలో వాహన అమ్మకాలు పుంజుకుని, టైర్ల విక్రయాలు మరింత మెరుగ్గా ఉండగలవని ఆశిస్తున్నట్లు బజాజ్ వివరించారు. ప్రస్తుతం 8 శాతం మేర వృద్ధి సాధిస్తున్న పరిశ్రమ రెండంకెల స్థాయిని నమోదు చేయగలదని అంచనాలున్నట్లు చెప్పారు. విలువపరంగా టైర్ల మార్కెట్లో తమకు 10-12 శాతం వాటా ఉందని తెలిపారు. అమ్మకాలు దాదాపు రూ. 6,500 కోట్ల మేర ఉండగా.. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా సుమారు పది శాతం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా సొంత ప్లాంట్లు నాలుగు, శ్రీలంకలో ఒకటి ఉన్నాయని, కొత్తగా మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌లో మరో ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామని బజాజ్ తెలిపారు. ఇది వచ్చే ఆరు-తొమ్మిది నెలల్లో అందుబాటులోకి రాగలదని, అటు బంగ్లాదేశ్‌లోనూ ప్లాంటు ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. -
మార్కెట్లోకి పొలారిస్ ‘స్కౌట్ సిక్స్టీ’
♦ ధర రూ. 12.21 లక్షలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వాహనాల తయారీ దిగ్గజం పొలారిస్ ఇండియా తాజాగా ఇండియన్ బ్రాండ్ కింద ‘స్కౌట్ సిక్స్ టీ’ మోటార్‌సైకిల్‌ను హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.12.21 లక్షలు (హైదరాబాద్ ఎక్స్ షోరూం). పొలారిస్ ఇండియా ఎండీ పంకజ్ దూబే, మహావీర్ డెక్కన్ ఆటో సంస్థ డెరైక్టర్ వికాస్ జబక్ మంగళవారమిక్కడ ఈ బైక్‌ను ఆవిష్కరించారు. స్కౌట్ సిక్స్టీతో కలిపి దేశీయంగా మొత్తం ఏడు మోడల్స్‌ను విక్రయిస్తున్నట్లవుతుందని దూబే తెలిపారు. ఇప్పటిదాకా వెయ్యి సీసీపైగా సామర్ధ్యం గల బైక్‌లే విక్రయిస్తుండగా... ఇతర వర్గాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా 999 సీసీ సామర్ధ్యం గల స్కౌట్‌ను మార్కెట్లోకి తెచ్చినట్లు ఆయన తెలియజేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 7 షోరూమ్లున్నాయని, ఈ ఏడాది ఆఖరు నాటికి వీటిని పదికి పెంచుకోనున్నామని దూబే చెప్పారు. అలాగే అక్టోబర్ లేదా నవంబర్‌లో మరో కొత్త మోడల్‌ను ప్రవేశపెడతామన్నారు. సూపర్‌బైక్‌లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో వీటి మార్కెట్ పరిమాణం ప్రస్తుతం 8,000-10,000 యూనిట్ల స్థాయికి చేరిందని తెలిపారు. 1,400 పైగా సీసీ సామర్ధ్యం గల బైక్‌ల విభాగంలో తమకు దాదాపు 10 శాతం వాటా ఉందని దూబే చెప్పారు. వాహనాల ధరల శ్రేణి రూ. 12 లక్షల నుంచి రూ. 38 లక్షల దాకా ఉందన్నారు. -
స్ప్లెండర్ కొత్త బైక్ ఐస్మార్ట్ 110
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారి హీరో మోటార్ కార్పొరేషన్, తన మొదటి ఇన్-హోస్ మోటార్ సైకిల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. స్ప్లెండర్ ఐస్మార్ట్ 110 పేరుతో రూ.53,300లకు(ఎక్స్ షోరూం, ఢిల్లీ) ఈ బైక్ ను అందుబాటులోకి తెచ్చింది. హీరో నుంచి వచ్చిన ఈ కొత్త బైక్ ను, జైపూర్ లోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ(సీఐటీ)లో అభివృద్ధి చేశారు. అంతర్గతంగా అభివృద్ధి చేసిన హీరో బైక్ లో ఇదే మొదటిది. సీఐటీ నుంచి రాబోతున్న కొత్త ప్రొడక్ట్ లో కూడా ఇదే మొదటిదని హీరో మోటార్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పవన్ ముంజాల్ తెలిపారు. పవర్ అవుట్ పుట్ ను పెంచడానికి పెద్ద 110సీసీ ఇంజిన్ ను ఈ బైక్ కు పొందుపరిచారు. హీరోస్ ఐ3ఎస్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. డిజైన్ లో ప్రస్తుత తర స్ప్లెండర్ బైక్ లతో పెద్దగా తేడా లేనప్పటికీ, స్టయిల్ లో మాత్రం ఆకర్షణీయంగా ఉందని కంపెనీ చెబుతోంది. 4స్పీడ్ గేర్ బాక్స్, 68కి.మీ/లీటర్ మైలేజ్, 8.9బీహెచ్ పీ, 9ఎన్ఎమ్ పీక్ టార్క్, కొత్త అలాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లు ఈ బైక్ ప్రత్యేకతలు. ఈ బైక్ కున్న హెడ్ ల్యాంప్ యూనిట్ కూడా కొత్తదే. ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్(ఏహెచ్ఓ) తో పాటు, కొత్త టైల్ ల్యాంప్ ను ఈ ల్యాంప్ యూనిట్ కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోతున్న మోటార్ సైకిల్ బ్రాండ్లలో స్ప్లెండర్ ఒకటిగా ఉంది. భారత్ లో, విదేశాల్లో మొత్తం 280లక్షలకు పైగా వినియోగదారులను స్ప్లెండర్ మోడల్ సొంతంచేసుకుంది. -
చిత్రం వెనుక కథ!
కొత్తగా పుట్టిన పిల్లలు నిద్రలో నవ్వుతుంటే... వారికి గతజన్మలో విషయాలు గుర్తుకొస్తాయని , దేవుడే ఆ చిన్నారులను నవ్విస్తాడని వారి వారి నమ్మకాలను బట్టి చెప్తుంటారు. అయితే ఫేస్ బుక్ లో ఇటీవల కనిపించిన ఓ పసిపాప చిత్రం.. కోట్ల హృదయాలను కొల్లగొట్టింది. కొత్తగా లోకంలో అడుగుపెట్టి, నిద్రలోనే బోసినవ్వులను కురిపిస్తూ కనిపించిన ఆ ఫోటో వెనుక కథ ఎందరినో కదిలింప జేసింది. సుమారు నలభై లక్షలమంది లైక్ చేసిన చిత్రం.. ఎనభైవేల సార్లు షేర్ కూడ అయ్యింది. ఇంతకూ ఆ చిత్రం వెనుక కథేమిటో చూద్దామా. తొమ్మిది నెలలు మోసి కని పెంచే తల్లితోపాటు, కంటికి రెప్పలా కాపాడే తండ్రి స్పర్శకు సంబంధించిన విషయం.. ప్రతి గుండెను తట్టింది. లోకం తెలీని పసిపాప ప్రస్తుతం నిద్రలో నవ్వులు చిందిస్తున్నా... ఊహ తెలిపిన తర్వాత ఎంత వేదన పడుతుందో అంటూ సానుభూతి వ్యక్తమౌతోంది. ఆమె పుట్టడానికి కేవలం నెల రోజుల ముందు బైక్ రేసర్ అయిన తండ్రి చనిపోయినా.. అతడు వాడిన గ్లౌజ్ లు, హెల్మెట్ స్పర్శతోనే ఆమె నిద్రలో నవ్వులు పూయించడం ఓ మిరాకిల్ గా మారింది. మోటార్ సైకిల్ రేస్ అంటే అమితంగా ఇష్టపడే హెక్టార్ డానియల్ ఫెర్రర్ అల్వరేజ్ ఫ్లోరిడాలో ఏప్రిల్ నెలలో స్నేహితుడి చేతులో హత్యకు గురయ్యాడు. ఆయన జ్ఞాపకాలను మరచిపోలేని అల్వరేజ్ భార్య.. కేథరిన్ విలియమ్స్.. ఆయన వాడిన గ్లౌజ్ లు , హెల్మెట్ ను అతడి ప్రేమకు గుర్తుగా భద్రపరచుకుంది. నెలరోజుల తర్వాత ఆయన గుర్తుగా బిడ్డ ఆబ్రే పుట్టినా... మామూలు ప్రపంచంలోకి రాలేకపోయింది. భర్తను తలచుకొంటూ, అతడి ప్రేమకు గుర్తుగా గ్లౌజ్ లు, హెల్మెట్ దాచుకుంది. బిడ్డను హత్తుకున్నట్లుగా, తండ్రి చేతుల్లోనే నిద్రపోతున్నట్లు గ్లౌజ్ లు, హెల్మెట్ బిడ్డను హత్తుకున్నట్లుగా పెట్టి ఫోటోలు తీయించింది. గాఢంగా నిద్రపోతున్న ఆ పసిపాప.. తండ్రి గ్లౌజుల స్పర్మ తగలగానే చిరునవ్వులు ప్రారంభించిందని, నిజంగా ఆ సన్నివేశం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందంటూ ఫోటోగ్రాఫర్ కిమ్ స్టోన్ వివరించాడు. పసిపాప అమ్మమ్మ ఫోటో సెషన్ కోసం తనను బుక్ చేసిందని, చిన్నారి పుట్టక ముందే ఆమె తండ్రి చనిపోయినట్లు ఆవిడ చెప్పిందని, ఆ సన్నివేశాలు చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలను తీయాలంటూ తనను బుక్ చేశారని కిమ్ స్టోన్ తెలిపాడు. కుమార్తెను నిజంగా పట్టుకున్నట్లు గ్లౌజ్ లను పెట్టగానే..పసిపాప బోసి నవ్వులు చిందించడం ఆశ్చర్యం కలిగించినట్లు కిమ్ చెప్తున్నాడు. అలా కిమ్ తీసిన ఫోటోల్లోని ఓ చిత్రమే ఇప్పుడు ఫేస్ బుక్ లో వైరల్ గా మారింది. ఫొటో వివరాలను చెప్తూ కిమ్... సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అతి తక్కువ వ్యవధిలో కోట్లకొద్దీ మనసులను దోచుకుంది. ఆ చిట్టితల్లి చిరకాలం అలా నవ్వుతూనే ఉండాలంటూ ప్రతి మనసూ కోరుకుంది. స్టోన్ పోస్ట్ కు స్పందించిన విలియమ్స్.. అలాగే తన చిన్నారికి జీవితాంతం ప్రపంచవ్యాప్తంగా అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆయనకు సందేశాన్ని పంపింది. తన బిడ్డ కోసం ప్రపంచం ఎంత ప్రార్థించిందో ఆమె పెద్దయిన తర్వాత చూపిస్తానంటూ విలియమ్స్ తన సందేశంలో వివరించింది. తండ్రి కలలను ఫోటో నిజం చేసిందని, ఆయన చనిపోయినా చిరస్థాయిగా నిలిచేట్టు చేసిందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. నిద్రలో నవ్వుతుంటే పసిపాపలకు దేవుళ్ళు కనిపిస్తారంటారు... అది నిజంగా నిజమేనేమో అంటూ స్టోన్ వ్యాఖ్యానించగా.. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఫోటోను చూసి, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తండ్రి పాత్రకు తగిన గుర్తింపునిచ్చే ఉద్దేశ్యంతో సోనారా.. జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డే పండుగ వెలుగు చూసేలా చేస్తే... అదే సమయంలో.. తండ్రి స్పర్శ, జ్ఞాపకాలకు సంబంధించిన గుర్తులతో 'ఆబ్రే' ఫోటో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడం.. అందమైన 'ఫాదర్స్ డే' ఉత్సవానికి మరో మచ్చుతునకైంది. -
యమహా సాల్యుటో ఆర్ఎక్స్ అదరహా..
న్యూఢిల్లీ : జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ యమహా మరో కొత్త మోడల్ బైక్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. 125 సీసీ సెగ్మెంట్ లో స్మాటీ అండ్ స్పోర్టీ బైక్ సాల్యుటో ఆర్ఎక్స్ ను గురువారం అట్టహాసంగా విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం లో దీని ధర రూ. 46,400గా ప్రకటించింది. 1985 లో భారత్ బైక్ మార్కెట్లో అడుగిడిన యమహా, 2008 లో మిత్సు తో జతకట్టింది.ఈ జాయింట్ వెంచర్ లో ఎంట్రీ లెవల్ మొదలు ప్రీమియం సూపర్ బైకుల దాకా దేశీయ మార్కెట్ లో తన హవాను కొనసాగిస్తోంది. భారతదేశంలో బైక్స్ అమ్మకాల్లో 55 శాతం వాటాను కలిగివున్న యమహా మోటార్ కంపెనీ యువకులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మార్కెట్ లక్ష్యంగా ఎంచుకుంది. ఈ నేపథ్యంలో సాల్యుటో 125 మోడల్ ఫీచర్లతో పాటు మరిన్ని అధునాతన సదుపాయాలను జోడించి ఈ బైక్‌ను రూపొందించింది. స్పెసిఫికేషన్స్ 125 సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్, 4స్పీడ్ గేర్‌బాక్స్, టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యుయల్ షాక్ అబ్జార్బర్స్ , 7.4 బీహెచ్పీ పవర్, అనలాగ్ స్పీడో మీటర్, డ్రమ్ ఆటో మీటర్, అనలాగ్ ఫ్యూయల్ గాగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. గత మోడళ్ల కంటే ఈ బైక్ 22కిలోల తక్కువ బరువు ఉంటుందని, లీటరుకు 82 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
గుడుంబా విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
చెన్నూర్ : పట్టణంలోని బట్టిగూడెం, ఎనగుట్ట (ఎమ్మెల్యే) కాలనీల్లో గుడుంబా విక్రయిస్తున్న ఇద్దరిని పట్టుకొని మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ లక్ష్మణ్ తెలిపారు.బట్టిగూడెం కాలనీలో గిరెల్లి లచ్చయ్య, ఎనగుట్టలో గుండా సంతోష్ గుడుంబా విక్రయిస్తుండగా దాడులు నిర్వహించి పట్టుకున్నామన్నారు. లచ్చయ్య వద్ద 8 లీటర్లు, సంతోష్ వద్ద 10 లీటర్ల గుడుంబాతోపాటు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇద్దరిపై ఎక్సైజ్ కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై దిలీప్‌కుమార్, సిబ్బంది కుమారస్వామి, రాజయ్య, సుకన్య పాల్గొన్నారు. -
బాలికపై అత్యాచారయత్నం
యువకుడిపై కేసులు నమోదు తాండూర్ : మండలంలోని గోపాల్‌నగర్ గ్రామానికి చెందిన బాలిక(13)పై అత్యాచారానికి యత్నించిన తాండూర్ గ్రామానికి చెందిన ఆలేటి సిద్ధార్థపై పలు కేసులు నమోదయ్యాయి. ఎస్సై కె.అశోక్‌కుమార్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గోపాల్‌నగర్‌కు చెందిన బాలిక తాండూర్‌లో ఏడో తరగతి చదువుతోంది. శుక్రవారం పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు తాండూర్‌లో ఆటో కోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో మోటారుసైకిల్‌పై వచ్చిన సిద్ధార్థ తాను గోపాల్‌నగర్ వైపే వెళ్తున్నానని, తనతో వస్తే తీసుకెళ్లి దింపుతానని నమ్మబలికి మోటారుసైకిల్ ఎక్కించుకున్నాడు. తాండూర్ శివారు దాటిన తర్వాత నిర్మానుష్య ప్రదేశం వైపు తీసుకెళ్లాడు. పక్కనే ఉన్న పొదల్లోకిలాక్కెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ బాలిక కేకలు వేసింది. అది విని సమీప పంట చేలల్లో పని చేస్తున్న వారు పరుగెత్తుకు వచ్చారు. వారి రాకను గమనించిన సిద్ధార్థ పారిపోయాడు. బాలిక తల్లిదండ్రులు తాండూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై శనివారం బెల్లంపల్లి డీఎస్పీ రమణారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో విచారణ చేపట్టారు. యువకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, నిర్భయ, పోక్సో కేసులను నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు. -
పొడవాటి మోటార్ సైకిల్
తిక్క లెక్క మోటార్ సైకిల్ ఎంత పొడవుంటుందేంటి? మహా అయితే కాస్త అటూ ఇటుగా ఆరడుగులు ఉంటుందేమో! అంటారా..? మోటార్ సైకిల్ మీద ఎంత మంది కూర్చోగలరు..? చట్టబద్ధంగా అయితే ఇద్దరు... అయినా ఇండియాలో నలుగురైదుగురు కూడా కూర్చుంటుంటార్లెండి అనుకుంటున్నారా..? ఇదిగో ఈ మహా మోటార్ సైకిల్‌ను చూడండి. దీని పొడవు ఏకంగా 72 అడుగులు. ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ సైకిల్‌గా గిన్నెస్ రికార్డు సాధించిన ఈ వాహనం మీద ఏకంగా పాతిక మంది సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. బ్రిటన్‌లోని లింకన్‌షైర్‌కు చెందిన కోలిన్ ఫర్జ్ అనే ప్లంబర్ దీనిని రూపొందించాడు. దీని తయారీకి ఒక 125 సీసీ ఇంజన్ మోపెడ్‌ను పూర్తిగా, మరో మోపెడ్‌లోని సగభాగాన్ని ఉపయోగించాడు. -
బైక్, ఆటో ఢీ: ఇద్దరు మృతి
వైఎస్సార్ జిల్లా: లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించిన ద్విచక్రవాహనం పక్కనుంచి వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట జాతీయరహదారిపై ఆదివారం జరిగింది. వివరాలు.. కోడూరు గ్రామానికి చెందిన సోమశేఖర్(24) రాజంపేటకు చెందిన ఆంజనేయులు(28) ఇద్దరు రాజంపేట నుంచి కోడురుకు శుభకార్యానికి హాజరు కావడానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మంగంపేట సమీపానికి రాగానే.. లారీని ఓవర్టేక్ చేయడానికి యత్నించి అదుపు తప్పి ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సోమశేఖర్ వివాహం జరగి కేవలం మూడు నెలలు మాత్రమే అవుతుంది. వీరిద్దరి ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మోటార్ సైకిల్ కోసం కుమారుడి కిడ్నాప్
తుర్కపల్లి: ఓ తండ్రి మోటార్ సైకిల్ కోసం కన్న కొడుకునే కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలంలో గురువారం జరిగింది. మాదాపూర్ గ్రామ పరిధిలోని కేవ్లా తండాకు చెందిన సోనా, దేవసోతు దేవ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. భర్త తాగుడుకు బానిసై తరచూ హింసిస్తుండడంతో భార్య సోనా ఐదేళ్ల క్రితం తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. మూడేళ్ల క్రితం భార్యను పంపాలని వచ్చి అడిగిన సమయంలో మోటార్ సైకిల్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మాదాపూర్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న అతని పెద్దకుమారుడు వెంకటేశ్‌ను బుధవారం మధ్యాహ్నం దేవ తీసుకెళ్లాడు. గమనించిన స్థానికులు సోనికి సమాచారం అందించారు. విద్యార్థి మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు బుధవారం రాత్రి దేవను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా మోటార్‌సైకిల్ కోసమే తన కుమారుడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు చెప్పాడు. -
మార్కెట్లోకి హై ఎండ్ బైక్ - K03
-
ఉపాధి మర్రి
చెట్టు నీడనిస్తుంది. కానీ ఈ చెట్టు.. బతుకుదెరువునిస్తోంది. కాలమేదైనా సరే... అక్కడి పుచ్చకాయలు చల్లగా కడుపునింపుతాయి. నగరంలో తిరిగి అలసిన వారికి ఆ చెట్టు కింది నిమ్మ సోడా సాంత్వననిస్తుంది. మోటార్ సైకిల్‌పై మొబైల్ మెస్... ఆకలితో ఉన్నవారి కడుపు నింపుతుంది. అద్దెలు చెల్లించలేని చిరు వ్యాపారులకు బతుకు నీడనిస్తోంది మింట్ కాంపౌండ్ సమీపంలోని మర్రి చెట్టు. ఏళ్ల చరిత్ర ఉన్న ఆ చెట్టు డజనుకుపైగా వ్యాపారాలకు కేంద్రమైంది. ట్యాంక్‌బండ్‌పై షికార్లు కొట్టి అలసిన వారు, కార్యాలయాల్లో పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందడానికి వచ్చిన ఉద్యోగులు, ఆయా పనుల నిమిత్తం సెక్రటేరియేట్‌కు వచ్చే సామాన్యుల అవసరాలను తీర్చే కేంద్రంగా మారింది. ప్రతి కాలంలో పుచ్చకాయ... వేసవిలోనే పుచ్చకాయలు దొరుకుతాయి. ఈ మర్రిచెట్టు నీడలో కాలంతో సంబంధం లేకుండా ప్రతిరోజూ పుచ్చకాయలు అందుబాటులో ఉంటాయి. చుట్టుపక్కల కార్యాలయాల వాళ్లే కాదు... కూడలిలో ఉండటంతో వచ్చీపోయే జనం కూడా అక్కడ ఆగి మరి పుచ్చకాయలు తినేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ పుచ్చకాయల వ్యాపారంపై ఆధారపడి రెండు కుటుంబాలు బతుకుతున్నాయి. ‘ఫుల్’గా భోజనం... ఆకలి అవుతుంటే దగ్గర్లో ఏ హోటల్‌కు వెళ్లి భోజనం చేద్దామన్నా వందకు పైగా చెల్లించాల్సిందే. కానీ ఈ చెట్టు నీడన 40 రూపాయలకే పూర్తి భోజనం లభిస్తుంది. ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయలేని విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు... అనేక మంది ఇక్కడ భోజనం చేస్తుంటారు. ఇలా మూడు నుంచి నాలుగు కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. భోజనం వద్దనుకుంటే... అల్పాహార కేంద్రం కూడా అందుబాటులో ఉంది. ఆరోగ్య పరీక్షలు... ఇదే మర్రిచెట్టు నీడన ఆరోగ్య పరీక్షలు కూడా చేస్తున్నారు. 20 రూపాయలు ఇస్తే చాలు మీ ఎత్తుకు తగ్గ బరువున్నారా? మీ ఒంట్లో ఎంత కొవ్వు శాతం ఎంత? బీపీ తక్కువా? ఎక్కువా? తెలిపే ఓ యువకుడు కనిపిస్తాడు. ఒంటి నొప్పులకు, ఒత్తిడికి అక్యుపంక్చర్ వైద్యం ఎంతో ఉపశమనం. దీనికి సంబంధించిన పరికరాలు కూడా ఈ చెట్టు కింద లభిస్తాయి. వస్త్ర వ్యాపారం అదుర్స్.. సామాన్యులకు అందుబాటు ధరలో దుస్తుల వ్యాపారం ఓ పక్క జరుగుతుంటే... మరోపక్క కాలి బూట్లు, చెప్పులు అమ్ముతుంటాడో వ్యక్తి. ఓవైపు సోడా బండి, ఆ పక్కనే ఫ్రూట్ జ్యూస్ బండి ఉంటుంది. ఇంత మంది వచ్చే చోట వాహనాల రద్దీ ఉంటుంది కదా! వాటి పొల్యూషన్ చెకప్ చేయడానికి ఆర్టీఏ అనుమతి పొందిన ఏజెంట్ కూడా అక్కడే సిద్ధంగా ఉంటాడు. ఇలా చిరు వ్యాపారులకు ఆ మర్రి చెట్టు కల్పవృక్షంగా మారింది. ...::: వాంకె శ్రీనివాస్ -
వాలీబాల్ టోర్నీపై నెత్తుటి పంజా
అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదుల దురాగతం ఆత్మాహుతి దాడిలో 50 మందికిపైగా దుర్మరణం కాబూల్/ఖోస్ట్ (అఫ్ఘానిస్థాన్): అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి నెత్తుటి పంజా విసిరారు. వాలీబాల్ టోర్నమెంట్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. వాలీబాల్ మ్యాచ్ చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలి వచ్చిన సమయంలో ఈ దాడి జరగడంతో సుమారు 50 మంది మృతిచెందగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. మోటార్ సైకిల్‌పై వాలీబాల్ గ్రౌండ్లోకి వచ్చిన ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని పక్తికా ప్రావిన్స్‌లోని యాహ్యా ఖైల్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తాలిబన్ల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో అఫ్ఘాన్ నేషనల్ ఆర్మీ, పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 12,500 నాటో బృందాలు వచ్చే ఏడాది కూడా దేశంలో కొనసాగేందుకు అఫ్ఘానిస్థాన్ పార్లమెంట్ ఆమోదించిన రోజే ఈ దాడి జరగడం గమనార్హం. యాహ్యా ఖైల్‌లో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుండగా ఈ దాడి జరిగిందని పక్తికా ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ అతావుల్లా ఫజిల్ వెల్లడించారు. ఈ సమయంలో మ్యాచ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారని, ప్రొవిన్షియల్ అధికారులు, పోలీస్ చీఫ్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారని చెప్పారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే ఈ ఆత్మాహుతి దాడికి సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. అఫ్ఘాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొద్ది నెలలుగా తాలిబన్ ఉగ్రవాదులు యుద్ధం ప్రకటించారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా వరుస దాడులు చేస్తున్నారు. దేశంలో అత్యంత క్లిష్టమైన పక్తికా ప్రాంతంలో గత జూలైలోనూ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. రద్దీ మార్కెట్లోకి ట్రక్కుతో ప్రవేశించిన ఉగ్రవాది తనను తాను పేల్చుకోవడంతో 41 మంది దుర్మరణం పాలయ్యారు. కాగా, వాలీబాల్ టోర్నమెంట్ లక్ష్యంగా ఉగ్రవాదుల దాడిని అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఖండించారు. తాజా దాడి ఈ ఏడాది అఫ్ఘాన్‌లో జరిగిన అత్యంత దారుణమైన దాడిగా అధికారులు పేర్కొంటున్నారు. -
విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తుల దాడి
చాకుతో చేయి కోసిన వైనం భీమవరం : సైకిల్‌పై స్కూల్‌కు వెళుతున్న విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి పరారైన ఘటన భీమవరంలో చోటు చేసుకుంది. భీమవరం వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక గునుపూడికి చెందిన పొన్నాడ రాంబాబు కుమార్తె మేఘన హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఆదిత్య స్కూల్లో పదవ తరగతి చదువుతుంది. ఎప్పటి మాదిరిగానే సోమవారం సైకిల్‌పై స్కూల్‌కు వెళుతుండగా స్థానిక వన్‌టౌన్‌లోని శ్రీనివాస థియేటర్ రోడ్లోకి వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు మొహానికి ఖర్చీఫ్‌లు కట్టుకుని మోటారు సైకిల్‌పై వెళుతూ విద్యార్థిని చేతిని చాకుతో కోసి పరారయ్యారు. చేతి నుంచి రక్తం కారడంతో స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థినిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అనంతరం వన్‌టౌన్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. పది రోజులుగా ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై తన వెనుక వస్తూ వేధిస్తున్నారని విద్యార్థిని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. -
త్వరలో బజాజ్ మరో క్రూయిజర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో.. మోటార్ సైకిల్ బ్రాండ్‌గానే కొనసాగాలని నిశ్చయించింది. స్కూటర్ మార్కెట్లోకి తిరిగి అడుగు పెట్టే ఆలోచనేది సంస్థకు లేదని బజాజ్ మోటార్ సైకిల్ విభాగం ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో బజాజ్ నూతన డిస్కవర్ 150 బైక్‌ను విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా బైక్‌ల విపణిలో వ్యాపార అవకాశాలు అపారమని, భారత్‌లోనూ ఇంకా విస్తరించాల్సి ఉందని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే.. మరో క్రూయిజర్..: క్రూయిజర్ విభాగంలో ప్రస్తుతం అవెంజర్ 220ని విక్రయిస్తున్నాం. దేశవ్యాప్తంగా నెలకు 3,500 బైక్‌లు అమ్ముడవుతున్నాయి. క్రూయిజర్ విభాగంలో బజాజ్‌దే అగ్రస్థానం. కొత్త ఫీచర్లు, మంచి డిజైన్‌తో మరో మోడల్ రానుంది. అలాగే స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ పల్సర్‌లో మరో రెండు మోడళ్లను కొద్ది రోజుల్లో తీసుకొస్తున్నాం. నెలకు 56 వేల బైక్‌లు అమ్ముతున్నాం. స్పోర్ట్స్ బైకుల్లో 50% వాటా పల్సర్దే. ఇక డిస్కవర్ బ్రాండ్‌లో నెలకు 71 వేల బైక్‌లు విక్రయిస్తున్నాం. ప్రతి 3 నెలలకు ఒక కొత్త బైక్‌ను ఆవిష్కరిస్తున్నాం. తగ్గుతున్న 125 సీసీ.. భారత్‌లో 2007-08 ప్రాంతంలో నెలకు 5 లక్షల మోటార్‌సైకిళ్లు అమ్ముడయ్యేవి. ఇందులో 100 సీసీ బైక్‌లు 58 శాతం, 125 సీసీ 19 శాతం, స్పోర్ట్స్ బైక్‌లు 12 శాతం కైవసం చేసుకున్నాయి. ప్రస్తుతం 100 సీసీ, స్పోర్ట్స్ బైక్ విభాగాల వాటా చెరి 2 శాతం పెరిగాయి. 125 సీసీ విభాగం మాత్రం 2 శాతం తగ్గింది. వాహనదారుల అంచనాలను చేరుకోకపోవడమే 125 సీసీ బైక్‌ల అమ్మకాలు తగ్గడానికి కారణం. స్టైల్, పనితీరు, సౌకర్యం ఇవే కస్టమర్ కోరుకునేది. వీటిని ప్రాతిపదికగా చేసుకునే మోడళ్లను ప్రవేశపెడుతున్నాం. కొత్త డిస్కవర్ 150 డిజైన్‌కు రెండేళ్లు పట్టింది. ఈ బైక్ మైలేజీ 72 కిలోమీటర్లు. 100 సీసీ బైక్‌లు మాత్రమే మైలేజీ ఇస్తాయన్న ప్రచారంలో వాస్తవం లేదు. ప్రపంచ మార్కెట్లో 10 శాతం.. నైజీరియా, ఈజిప్ట్, కొలంబియా, ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు బైక్‌లను ఎగుమతి చేస్తున్నాం. ఈ దేశాల్లో బజాజ్‌దే అగ్రస్థానం. నెలకు దాదాపు 4 లక్షల యూనిట్లు విక్రయిస్తున్న బజాజ్‌కు ప్రపంచ మోటార్ సైకిల్ మార్కెట్లో 10 శాతం వాటా ఉంది. మరిన్ని దేశాలకు విస్తరించి వాటా పెంచుకుంటాం. భారత్‌లో ప్రస్తుతం కంపెనీకి 20 శాతం మార్కెట్ వాటా ఉంది. కంపెనీ ఉత్పత్తిలో సగం ఎగుమతులు ఉంటున్నాయి. ప్రస్తుతం దేశీయ బైక్‌ల మార్కెట్ 8 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. 2014-15లో రెండంకెల వృద్ధి ఖాయంగా కనపడుతోంది. పరిశ్రమ కంటే బజాజ్ వృద్ధి ఎక్కువగా ఉండనుంది. -
రెచ్చిపోతున్న చైన్‌స్నాచర్లు
*మహిళలే లక్ష్యంగా గొలుసు దొంగతనాలు * తాడేపల్లిగూడెంలో వారం రోజుల్లో మూడు ఘటనలు తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెంలో చైన్‌స్నాచర్లు రెచ్చిపోతున్నారు.. ఒంటిపై ఆభరణాలతో నడిచి వెళ్తున్న మహిళలే లక్ష్యంగా దోపిడీలకు తెగబడుతున్నారు. పట్టణంలో వారం రోజుల్లో వ్యవధిలో మూడు ఘటనలు చోటు చేసుకున్నారుు. గురువారం సాయంత్రం స్థానిక వీకర్స్ కాలనీకి చెందిన శ్రీధర గాయత్రి వాణి తన కుమారుడికి సంగీతం నేర్పించేందుకు తె నుకుల కోటయ్య వీధిలో ఉండే టీచర్ ఇంటికి తీసుకెళ్తుండగా.. వీధిలోకి వెళ్లేసరికి ఎదురుగా మోటార్ సైకిల్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని బంగారు సూత్రాల తాడును లాక్కుపోయూడు. గట్టిగా పట్టుకోవడంతో సూత్రాలు ఆమె చేతిలోనే ఉండిపోయాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని కృష్ణుడు చెరువు వద్ద ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి తెంపుకుపోయూడు. వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో మరో చైన్‌స్నాచింగ్ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. వారంలో వరుసగా మూడు చోరీలు జరగడంతో స్థానిక మహిళలు బయటకు రావడానికే భయపడుతున్నారు. ఈ ఘటనలన్నీ పట్టపగలే జరగడం గమనార్హం. చైన్‌స్నాచింగ్‌లపై పోలీస్ నిఘా పెట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. గుండుగొలనులో ఆభరణాల చోరీ భీమడోలు : ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బీరువాలోని 4 కాసుల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయూరు. భీమడోలు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అమీర్ తెలిపిన వివరాల ప్రకారం.. గుండుగొలను గ్రామం వేగిరెడ్డివారి వీధిలో నివాసం ఉంటున్న పోలా సింహాచలం కుమార్తె కుసుమకు వివాహం కాగా, కైకరంలోని అత్తారింట్లో ఉంటోంది. అనారోగ్యంగా ఉండడంతో కొద్దిరోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. బుధవారం రాత్రి మెడలోని బంగారు నానుతాడు, చెవిదిద్దెలతో పాటు ఇతర ఆభరణాలను బీరువాలో భద్రపరిచింది. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో అర్ధరాత్రి సమయంలో లోనికి ప్రవేశించిన దొంగలు బీరువాలో పెట్టిన బంగారు ఆభరణాలను దోచుకుపోయూరు. ఉదయాన్నే నిద్రలేచిన ఇంట్లోని వారంతా బీరువా తలుపులు తెరిచి ఉండడంతో కంగారుపడి ఆభరణాల కోసం వెతికారు. అనంతరం చోరీకి గురైనట్లు గుర్తించి భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పుణేలో పోలీస్ స్టేషన్‌ముందే పేలుడు
పుణే: పుణేలోని ఒక పోలీస్ స్టేషన్ ముందు గురువారం జరిగిన పేలుడులో ఒక పోలీస్ కానిస్టేబుల్ సహా ముగ్గురు గాయపడ్డారు. ఫరస్కానా పోలీస్ స్టేషన్వద్ద వాహనాలు నిలిపే స్థలంలోని ఒక మోటార్ సైకిల్‌పై ఉంచిన తక్కువ శక్తిగల పేలుడు పదార్థం పేలడంతో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) అధికారులతో కలసి ఆయన సంఘటనా స్థలాన్ని సందర్శించారు. సంఘటనా స్థలంనుంచి బాల్ బేరింగ్లను, మేకులను స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ పరీక్షకు పంపించామని, ఉగ్రవాద కోణంతోపాటు అన్ని అంశాలపై దర్యాప్తు చేస్తున్నామని సతీశ్ మాథుర్ చెప్పారు. పేలుడు పరికరం అమర్చిఉన్న మోటార్ సైకిల్ ఒక పోలీసుదని, కొన్నాళ్ల కిందట అది అపహరణకు గురైందని చెప్పారు. కాగా, పేలుడు వెనుక ఉగ్రవాద హస్తం లేకపోవచ్చని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. -
ముదురుతున్న రైల్వే ఎస్పీ వివాదం
ఎస్పీ శ్యాంప్రసాద్ బంగళాకు ధోబీ, క్లీనింగ్ ఉద్యోగి నిలిపివేత మోటార్‌సైకిల్ తొలగింపు న్యాయపోరాటానికి ఎస్పీ సిద్ధం సాక్షి, విజయవాడ : విజయవాడ రైల్వే ఎస్పీ డాక్టర్ సీహెచ్.శ్యామ్‌ప్రసాద్ బదిలీ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఏ కారణం లేకుండా తనను బదిలీ చేస్తున్నారంటూ ఎస్పీ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)కు ఫిర్యాదుచేసిన సంగతి విదితమే. క్యాట్ ఆయన బదిలీని నిలుపుదల చేస్తూ తొమ్మిదో తేదీ వరకు కేసును వాయిదా వేసింది. ప్రస్తుతం బదిలీ ఆగినప్పటికీ ఆయనపై పోలీసు బాస్‌ల వేధింపులు మాత్రం ఆగలేదు. ఆయనతో మాట్లాడవద్దంటూ కిందిస్థాయి ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో శ్యామ్ ప్రసాద్ తన కార్యాలయానికి వెళ్లకుండా బంగళాలోనే ఉంటున్నారు. ఆయన కోరిన ఫైల్స్ ఇవ్వవద్దని, ఆయన ఇచ్చే ఆదేశాలను అమలు చేయాల్సిన పనిలేదంటూ ఒక పోలీసు ఉన్నతాధికారి నుంచి సూచనలు వస్తున్నట్లు తెలిసింది. ధోబీ, క్లీనింగ్ సిబ్బంది తొలగింపు.. రైల్వే ఎస్పీని ఇక్కడినుంచి పంపించేందుకు అన్ని రకాల చర్యలను ఉన్నతాధికారులు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎస్పీ బంగళాలో పనిచేసే ధోబీ (రజకుడు)ని, 20 ఏళ్లుగా పనిచేస్తున్న క్లీనింగ్ ఉద్యోగిని నిలుపుదల చేశారు. గతంలో ఎస్పీకి ముగ్గురు డ్రైవర్లు మూడు షిప్టులలో అందుబాటులో ఉండేవారు. ఆయన ఏ నిమిషంలో తనిఖీలకు వెళ్లాలన్నా వారు సిద్ధంగా ఉండేవారు. ప్రస్తుతం ఒక్క డ్రైవర్‌ను ఉంచి మిగిలిన ఇద్దరినీ తొలగించి వారికి వేరేచోట పోస్టింగ్ ఇచ్చినట్లు తెలి సింది. ఎస్పీ కోసం ఒక మోటార్ సైకిల్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. దీన్ని విజయవాడ సీఐకి కేటాయించారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన డిపార్టుమెంట్లో ఐపీఎస్ స్థాయి అధికారిని ఈ విధంగా వేధించడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారుల నుంచి ఎన్ని వేధింపులు వచ్చినా న్యాయపోరాటానికి ఎస్పీ సిద్ధంగా ఉన్నారు. వివాదానికి కారణమిదే.... రైల్వే ఎస్పీని తొలుత పోలీసు చీఫ్ కార్యాలయంలో రిపోర్టు చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఏ కారణం చూపకుండా తనను బదిలీ చేయడాన్ని ప్రశ్నిస్తూ ఆయన క్యాట్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన బదిలీపై క్యాట్ స్టే ఇచ్చింది. ఈ ఉత్తర్వులను పట్టించుకోకుండా రైల్వే ఎస్పీని పోలీస్ అకాడమీకి బదిలీ చేశారు. ఆయన తిరిగి క్యాట్‌కు వెళ్లడంతో తొమ్మితో తేదీ వరకు కేసును వాయిదా వేసింది. శ్యామ్‌ప్రసాద్ బదిలీపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుచేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించడంతో ఆయనపై ఉన్నతాధికారులు వేధింపులకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కోర్టుకు ఫిర్యాదు చేయనున్న ఎస్పీ భార్య.. తమ ఇంట్లోంచి అర్ధంతరంగా ధోబీని, క్లీనింగ్ ఉద్యోగిని తొలగించడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని, తమ బంగళా అపరిశుభ్రంగా మారడంతో తమకు అలర్జీ వస్తోందంటూ కోర్టుకు వెళ్లేందుకు రైల్వే ఎస్పీ భార్య సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. -
హోండా చౌక బైక్ వచ్చేసింది
న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ కొత్త మోటార్ సైకిల్, సీడీ 110 డ్రీమ్‌ను శుక్రవారం ఆవిష్కరించింది. ధర రూ. 41,100(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. హోండా కంపెనీ నుంచి వస్తోన్న అత్యంత చౌక బైక్ ఇది. 110 సీసీ కేటగిరీలో కంపెనీ అందిస్తోన్న డ్రీమ్ బ్రాండ్ మూడో బైక్ కూడా. ఈ కొత్త సీడీ 110 బైక్ ధర, ఈ కంపెనీయే విక్రయిస్తున్న ఈ కేటగిరీ మోటార్‌సైకిళ్లు -డ్రీమ్ నియో బైక్ కంటే రూ.5,000, డ్రీమ్ యుగ కంటే రూ.7,000 తక్కువ. గ్రామీణ, మాస్ సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడం లక్ష్యంగా హోండా కంపెనీ ఈ బైక్‌ను తెస్తోంది. 100-110 సీసీ సెగ్మెంట్ అవసరాలను తీర్చేలా ఈ బైక్‌ను అందిస్తున్నామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్, మార్కెటింగ్) యద్విందర్ ఎస్. గులేరియా పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి విక్రయాలు ఇతర హోండా డ్రీమ్ బైక్‌ల్లో ఉపయోగించే 110 సీసీ ఇంజిన్నే ఈ సీడీ 110 డ్రీమ్ బైక్‌లో కూడా ఉపయోగిస్తున్నారు. హోండా ఈకో టెక్నాలజీ(హెచ్ఈటీ) కారణంగా ఈ బైక్ 74 కి.మీ. మైలేజీని ఇవ్వగలదని కంపెనీ చెబుతోంది. వచ్చే నెల నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ట్యూబ్‌లెస్ టైర్లు, విస్కస్ ఎయిర్ ఫిల్టర్ తదితర ఫీచర్లున్నాయి. హీరో మోటోకార్ప్‌కు చెందిన హెచ్ఎఫ్-డీలక్స్, టీవీఎస్ స్టార్ సిటీలకు ఇది గట్టిపోటీనిస్తుందని పరిశ్రమవర్గాల అంచనా. ఇతర డ్రీమ్ బైక్‌లకు, ఈ తాజా బైక్‌కు పెద్దగా తేడా లేదని పరిశ్రమ వర్గాలంటున్నాయి. సిల్వర్ కలర్ అలాయ్ వీల్స్, బాడీ గ్రాఫిక్స్ మాత్రం విభిన్నంగా ఉన్నాయి. రూర్బన్(రూరల్, ఆర్బన్) వినియోగదారులు లక్ష్యంగా కంపెనీ ఈ బైక్‌ను అందిస్తోంది. ఈ బైక్ మూడు రంగుల్లో లభ్యమవుతుంది. నలుపు రంగుపై రెడ్, బ్లూ, గ్రే చారలతో ఈ బైక్ లభిస్తుంది. డీలర్లకు డిస్పాచెస్ ఈ నెల రెండో వారం నుంచి కంపెనీ ప్రారంభిస్తుంది. త్వరలో హోండా 160 సీసీలో కొత్త బైక్‌ను తేనున్నది. 25% వాటా... ఈ కంపెనీ ప్రస్తుతం 100-110 సీసీ సెగ్మంట్లో డ్రీమ్ యుగ, డ్రీమ్ నియో, సీబీ ట్విస్టర్ మోడళ్లను విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 100-110 సీసీ సెగ్మెంట్లో 7.3 లక్షల బైక్‌లను విక్రయించామని గులేరియా చెప్పారు, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కొత్త బైక్‌తో ఈ సంఖ్య 8 లక్షలకు చేరగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో భారత టూ-వీలర్ కేటగిరీలో 25 శాతం మార్కెట్ వాటా సాధించామని చెప్పారు. హోండా ఈజ్ హోండా గత ఆర్థిక సంవత్సరంలో వివిధ కార్యకలాపాల నిమిత్తం రూ.5,200 కోట్లు పెట్టుబడులు పెట్టామని గులేరియా వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి సామర్థ్యం పెంపు కోసం రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ మానేసర్(హర్యానా), తపుకుర(రాజస్థాన్), నర్సాపుర(కర్నాటక)ల్లోని మూడు ప్లాంట్లలో టూవీలర్లను తయారు చేస్తోంది. ఈ మూడు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 46 లక్షలు. నాలుగో ప్లాంట్ గుజరాత్లో నిర్మాణంలో ఉంది. నాలుగో ప్లాంట్ కూడా అందుబాటులోకి వస్తే వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 58 లక్షలకు పెరుగుతుంది. హోండా ఈజ్ హోండా... పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్ని ఈ కంపెనీ ప్రారంభించింది. -
‘చున్ని’కృష్ణులు
ఉత్త(మ)పురుష అలనాడు దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాలను లాగేస్తుంటే శ్రీకృష్ణుడు ఆమెకు చీరలిచ్చాడన్న విషయం అందరికీ తెలిసిందే. అన్నయ్యంటే ఆయనే మరి. అప్పుడెప్పుడో ఆ సంఘటన జరిగింది కాబట్టి సరిపోయిందిగానీ... ఇప్పుడు జరిగుంటేనా... దుశ్శాసనుడి మీద ‘నిర్భయ’ చట్టం కింద కేసు బుక్ చేసి ఉండేవాళ్లం. పీడా వదిలిపోయి ఉండేది. సదరు దుశ్శాసనుడు ఇప్పుడు లేడనే బాధ కంటే ఇప్పుడు మన అమ్మాయిల మానమర్యాదలు కాపాడేందుకు కంకణం కట్టుకున్న శ్రీకృష్ణులు ఎక్కువయ్యారన్న బాధ ఎక్కువైంది. అరే... చెల్లెళ్ల మానమర్యాదలను కాపాడే అన్నయ్యలూ, కన్నయ్యలూ ఎక్కువైతే ఆనందించాలి గానీ... బాధపడాల్సిన అవసరమేముందంటారా? చెబుతా. సరదాగా మా శ్రీవారితో సైకిల్ మోటర్ మీద వెళ్దామని బయల్దేరుతానా... ఇక దాంతో పాటే మా కన్నయ్యల తాకిడి పెరిగిపోతోంది. సరదాగా సినిమాకు తీసుకెళ్లమని శ్రీవారిని అడిగా. ఎందుకో ఆయన మూడ్ బాగుంది. ‘సరే బయల్దేరు’ అన్నారు. మోటర్‌సైకిల్ స్టార్ట్ చేశాక ఆయన వెనక కూర్చున్నా. బయల్దేరిన కాసేపటికి మన మోటార్‌సైకిల్‌కి ప్యారలల్‌గా మరో బైక్ కాసేపు అదేపనిగా నడుస్తూ ఉంటుంది. మనం చీర కట్టుకుని ఉంటే... ‘చీర... చీర’ అంటూ హెచ్చరిస్తాడా బైకు మీది అపర కృష్ణుడు. అదే మనం గానీ చుడీదార్ వేసుకుని ఉంటే... ‘చున్నీ చున్నీ’ అంటూ జాగ్రత్త చెబుతాడు. పైగా ఆ మాట చెప్పాక... వాడేదో మనల్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడేసిన ఫీలింగును ముఖంలో పలికిస్తాడు. మనల్ని పెను విపత్తు నుంచి రక్షించిన అలసటను ఫేసులో ఒలికిస్తాడు. గతంలో ఇంటిదాకా దిగబట్టే బాడీగార్డుల్లాగే ఇటీవల ఈ తరహా ‘శారీగార్డు’లు ఎక్కువయ్యారు. అయితే తీరా చూసుకుంటే మన చీరో, చున్నీయో అంతా సక్రమంగానే ఉంటుంది. అప్పట్లో అమ్మాయిలను ఏదో వంకతో పలకరించాలంటే... మగాళ్లు తమ వాచీ దాచుకుని ‘టైమెంత’ అని అడిగేవాళ్లట. నాకనిపిస్తున్నదేమిటంటే... ఇప్పుడు ఆ మగాళ్లే కాసేపు వివాహితతో అధికారికంగానూ, తమకు ఎలాంటి దురాలోచనా లేదనే దృక్పథాన్ని చాటుకుంటూనో.... దాంతోపాటు ఏదో పెజాసేవను ఎగస్ట్రాగా ఒరగబెట్టామనే ఫీలింగిచ్చుకునే త్యాగిష్ఠిలా పోజిచ్చుకునేందుకో ఈ ‘చున్నీ’ హెచ్చరికలను చేస్తున్నారనే అనుమానం నా మనసులో ఓ మూలన ఉంది. వాస్తవంగా అతివ తాలూకు అంగవస్త్రం చక్రంలో చుట్టుకుపోతుందనే ఉద్దేశంతో ఆ ప్రమాదానికి చక్రం అడ్డేయడానికీ, మగువ మానాన్ని కాపాడటానికే హెచ్చరిక చేస్తే... ఆ మగాళ్లు నిజంగానే చెల్లెలి మానాన్ని కాపాడేందుకు సిద్ధపడ్డ అపర శ్రీకృష్ణులే. అదే... ఏదో ఒక ఒంకతో కాసేపు అమ్మాయి చీరనో, చున్నీనో సర్దుకునేలా చేసేందుకు పరోపకారి వేషం వేస్తే మాత్రం వాళ్లనేమని పిలవాలి? నా మటుకు నాకు అనిపిస్తుందేమిటో తెలుసా! నేను వాళ్లకు పెట్టిన పేరేమిటో తెలుసా... వాళ్లు కన్నయ్యల్లాంటి మా అన్నయ్యలైన ‘చున్ని’కృష్ణులు!! - వై! -
మట్టి మాఫియా దూకుడుకు చిన్నారి బలి
కైకలూరు, న్యూస్‌లైన్ :‘మమ్మీ..తొందరగా పదండి.. నానమ్మ చేసే ఉగాది పచ్చడి తినాలి.. డాడీ.. ఈ రోజు సన్డే.. స్కూల్లేదు..తొందరగా రా..’ అంటూ కుమార్తె కోరడంతో ఊరికి ప్రయాణమైన ఆ కుటుంబంపై వి ధి చిన్నచూపు చూసింది.వారు ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్ పైకి మట్టి మాఫియాకు చెందిన ట్రాక్టర్ యమపాశంలా దూసుకువచ్చి చిన్నారి ప్రాణాలు బలిగొంది. పోలీసులతోపాటు పలువురిని కంటతడి పెట్టించిన ఈ హృదయ విదారక ఘటన ఆదివారం ఉదయం పల్లెవాడ చర్చి వద్ద జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎన్నార్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న దారపురెడ్డి ఫణికుమార్ స్వగ్రామం ఏలూరు సమీపంలోని వట్లూరు. ఆరేళ్ల కిందట భార్గవిని వివాహం చేసుకున్నారు. వీరి ఏకైక కుమార్తె లక్ష్మీశర్వాణి(4) యూకేజీ చదువుతోంది. ఉగాదికి స్వగ్రామం రావాలని ఫణికుమార్ తల్లిదండ్రులు కోరడంతో భార్య, కుమార్తెతో కలిసి ఆదివారం ఉదయం మోటార్‌సైకిల్ పై బయలుదేరాడు. పల్లెవాడ గ్రామంలోని చర్చి వ ద్దకు రాగానే వదర్లపాడు నుంచి వస్తున్న మట్టి ట్రా క్టర్ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ ముగ్గురూ కింద పడిపోయారు. చిన్నారి తలకు బలమైన గాయమైంది. ఫణికుమార్ దంపతులు కూడా గాయపడ్డారు. ఆ స మయంలో వెనుక వస్తున్న చేపల రైతు ఉద్దరాజు రా మరాజు, డ్రైవర్ కారులో వారిని హుటాహుటిన కైకలూరు ప్రైవేటు అస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి లక్ష్మీశర్వాణి అప్పటికే చనిపోయిందని ని ర్ధారించారు. కైకలూరు సీఐ డి.వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి బాలికను ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. చిన్నారి చనిపోయిన విషయాన్ని తల్లిదండ్రులకు ముందుగా చెప్పలేదు. బంధువులు వచ్చిన త ర్వాత ఈ విషయాన్ని చెప్పారు. దీంతో వారి రోదనలు మిన్నంటాయి.‘ఇది కల అయితే ఎంత బాగుం డు’ అంటూ ఫణికుమార్ దంపతులు రోదించడం అందరి హృదయాలను కలిచివేచింది. పోస్టుమార్టం అనంతరం పాప మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. పల్లెవాడ ప్రాంతంలో చేపల చెరువుల్లో మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. కొందరు వ్యక్తులు నిబం ధన లు ఉల్లంఘించి వీటిని తవ్వుతూ ఇష్టారాజ్యంగా తర లిస్తున్నారని, ఇలాంటి సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. -
ముస్తాబు చేసి తీసుకొస్తామని..
దీప్తిని పథకం ప్రకారమే హత్యచేసిన తల్లిదండ్రులు నిందితుల అరెస్టు గుంటూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దీప్తి పరువు హత్య కేసులో నిందితులైన ఆమె తల్లిదండ్రులు పచ్చల హరిబాబు, సామ్రాజ్యంలను పట్టాభిపురం పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. నిందితులు గుంటూరులోని స్తంభాలగరువు ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందిందని, అక్కడే వారిని అరెస్ట్ చేశామని గుంటూరు వెస్ట్ డీఎస్పీ టి.వి. నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న దీప్తి.. అదే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగికి చెందిన అనంతపల్లి కిరణ్ కుమార్‌ను ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకుంది. వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి దీప్తి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఈ పెళ్లి చేసుకుంటే తమ పరువు పోతుందని, మాట వినకపోతే తాము ఆత్మహత్య చేసుకుంటామని దీప్తిని వారు బెదిరించారు. అంతేగాక ఆమెకు పెళ్లిసంబంధాలు కూడా చూడడం ప్రారంభించారు. ఇది తెలుసుకున్న దీప్తి, కిరణ్‌ను భారత్‌కు రప్పించి ఈ నెల 21న అతని తల్లిదండ్రులు, స్నేహితుల సమక్షంలో హైదరాబాద్‌లోని ఆర్యసమాజంలో వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని దీప్తి తన తల్లిదండ్రులకు తెలియజేసింది. రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని.. సమాచారమందుకున్న దీప్తి తల్లిదండ్రులు, పెదనాన్న సాంబశివరావు హైదరాబాదు చేరుకున్నారు. ముందస్తు పథకం ప్రకారం కిరణ్ బంధువుల వద్దకు వెళ్లి తాము దీప్తి వివాహానికి సానుకూలంగా ఉన్నామని, గుంటూరు జిల్లాలోని పాములపాడులో మొక్కుతీర్చుకోవాలంటూ నమ్మబలికారు. అంతేగాక తమ బంధువులందర్నీ పిలిచి రిసెప్షన్‌ను ఏర్పాటుచేస్తామని కూడా చెప్పారు. కుటుంబసమేతంగా రావాలని కిరణ్‌ను కోరారు. దీనికి అంగీకరించిన కిరణ్ తల్లిదండ్రులు, బంధువులు ఈ నెల 23 తెల్లవారుజామున గుంటూరు చేరుకున్నారు. హత్య జరిగిందిలా.. కిరణ్, అతని బంధువులకు పాములపాడు వెళ్ళేందుకు సిద్ధమవ్వమని చెప్పి, తమ కుమార్తెను ముస్తాబు చేసి తీసుకువస్తామని వారు బసచేసిన లాడ్జి నుంచి దీప్తిని గుంటూరులోని రాజేంద్రనగర్ 2వ లైనులో ఉన్న తమ ఇంటికి ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లారు. వారిపై నమ్మకం లేకపోవడంతో దీప్తి తల్లిదండ్రుల్ని అనుసరించాలని కిరణ్ తన స్నేహితులను పంపాడు. దీప్తిని ఇంట్లోకి తీసుకెళ్లడంతోనే ఆగ్రహంతో పరువుతీశావంటూ ఊగిపోయిన హరిబాబు బలంగా ఆమె మెడపై కొట్టాడు. ఆ దెబ్బకు దీప్తి మంచంపై పడిపోయింది. వెంటనే ఆమె మెడకు చున్నీని గట్టిగా బిగించి మంచం కోళ్లకు కట్టారు. కాళ్లు కదలించకుండా దీప్తి కాళ్లను తల్లి పట్టుకుంది. దీంతో దీప్తికి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. కుమార్తె చనిపోయిందని నిర్ధారించుకున్న అనంతరం భార్యాభర్తలు ఇంటికి తాళం వేసి మోటార్‌సైకిల్‌పై పరారయ్యారు. వారు హడావుడిగా బయటకు వెళ్లడాన్ని గమనించిన కిరణ్ స్నేహితులు ఆవిషయాన్ని కిరణ్‌కు తెలియజేశారు. అక్కడకు చేరుకున్న కిరణ్, అతని బంధువులు ఇంటి తాళాన్ని పగులకొట్టి చూడగా.. మంచంపై దీప్తి నిర్జీవంగా కనిపించింది. ఒక పథకం ప్రకారమే దీప్తిని తల్లిదండ్రులు హత్య చేశారనే విషయం తమ విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. కొన్నేళ్లపాటు తన జీతాన్ని తల్లిదండ్రులకు పంపే విధంగా కిరణ్‌ను దీప్తి ఒప్పించిందని, కూతురు మనసు తెలుసుకోకుండా తల్లిదండ్రులు ఆమెను హతమార్చారని ఆయన చెప్పారు. హత్యకేసు ఛేదించిన సిబ్బందిని ఆయన అభినందించారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపర్చారు. మాట వినలేదనే హతమార్చా.. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె తమ మాట కాదని కులాంతర వివాహం చేసుకోవటాన్ని జీర్ణించుకోలేకపోయామని దీప్తి తండ్రి హరిబాబు విలేకరులకు తెలిపారు. ఇంటికి రాగానే వివాహ విషయం ప్రస్తావించటంతో తనపై దీప్తి చేయిచేసుకుందని, క్షణికావేశంలో ఆమెను హతమార్చానని చెప్పారు. ఈ హత్యతో తన భార్యకు ఎటువంటి సంబంధం లేదని వెల్లడించారు. -
కుటుంబం ఉసురు తీసిన లారీ
మైలవరం, న్యూస్‌లైన్ : పొరపాటున ఎలుకల మందు తిన్న కుమారుడిని తీసుకుని తల్లిదండ్రులు ద్విచక్ర వాహనంపై ఆస్పత్రికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఎదురైన ఓ లారీ మోటార్‌సైకిల్‌ను ఢీకొని ఆ ముగ్గురినీ బలి తీసుకుంది. మండలంలోని పుల్లూరు జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. సేకరించిన వివరాల ప్రకారం.. పుల్లూరు పంచాయతీ శివారు మంగాపురం గ్రామంలో నక్కబోయిన శ్రీనివాసరావు, రమాదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు పవన్(3) ఆదివారం తెలియక ఎలుకల మందు తిన్నాడు. తల్లిదండ్రులు దీనిని గమనించి కుమారుడిని తీసుకుని శ్రీనివాసరావు అనే మరోవ్యక్తితో కలిసి అతడి ద్విచక్ర వాహనంపై మైలవరం ఆస్పత్రికి బయలుదేరా రు. పుల్లూరు జిల్లాపరిషత్ హైస్కూల్ వద్ద ఎదురుగా వస్తున్న లోడు లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నక్కబోయిన శ్రీనివాసరావు(30), పవన్ కింద పడిపోయారు. లారీ టైర్లు మీదకు ఎక్కడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. మరోవైపు పడిపోయిన రమాదేవికి తీవ్రంగానూ, వాహనం నడుపుతు న్న శ్రీనివాసరావుకు స్వల్పంగా గాయాలయ్యాయి. రమాదేవిని హుటాహుటిన మైలవరం ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం 108లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యం లో మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై దుర్గారావు తెలిపారు. -
పండుగ వేళ విషాదం
అనకాపల్లి రూరల్, న్యూస్‌లైన్: మరికొద్ది సేపట్లో దీపావళి పండుగ జరుపుకొందామనుకుంటుండగా లారీ ప్రమాదం వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. మండలంలోని రేబాక గ్రామం వద్ద మోటార్ సైకిల్‌ను అతి వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. పొక్లెయిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న చినమాకవరానికి చెందిన బోయిన అంజి (25) పండుగ జరుపుకొనేందుకు సిహెచ్.ఎన్.అగ్రహారంలోని అత్తవారి ఇంటికి వచ్చాడు. బంధువులందరూ పండుగ ఏర్పాట్లలో ఉండగా అంజి తన రెండేళ్ల కొడుకు వర్థన్ ను తీసుకుని మోటార్ సైకిల్‌పై సమీపంలోని సబ్బవరం మార్గంలోని పెట్రోల్ బంకుకు వచ్చాడు. పెట్రోల్ పోయించుకొని తిరిగి వస్తుండగా మార్గమధ్యలో లారీ ఢీకొనడంతో తండ్రి, కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుని భార్య పార్వతి గర్భవతి. మరికొద్ది రోజుల్లో మరొక బిడ్డకు జన్మనివ్వనుంది. భర్త, కొడుకు మృతి చెందారన్న విషాధ వార్త తెలియగానే అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే ఆమెను బంధువులు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కొడుకు వర్థన్ చావులోను విడిచిపోనంటూ తండ్రి కాలును పట్టుకుని కన్నుమూసిన దృశ్యం అందర్నీ కంటతడిపెట్టించింది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
2% పెరిగిన బజాజ్ అమ్మకాలు
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు సెప్టెంబర్‌లో 3 శాతం వృద్ధి చెంది 3,23,879 కు పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో 3,15,314 మోటార్ సైకిళ్లు విక్రయించామని బజాజ్ ఆటో బుధవారం పేర్కొంది. ఎగుమతులు 1,33,222 నుంచి 10 శాతం వృద్ధితో 1,46,847కు పెరిగాయని వివరించింది. మొత్తం మీద గత ఏడాది సెప్టెంబర్‌లో 3,60,152 వాహనాలు విక్రయించగా... ఈ ఏడాది సెప్టెంబర్‌లో 2 శాతం వృద్ధితో 3,67,815 వాహనాలు విక్రయించామని బజాజ్ ఆటో పేర్కొంది. 32% తగ్గిన అశోక్ లేలాండ్ అమ్మకాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో 7,232 వాహనాలు విక్రయించామని అశోక్ లేలాండ్ తెలిపింది. గత సెప్టెంబర్ అమ్మకాలతో(10,620)పోల్చితే 32 శాతం క్షీణించాయని పేర్కొంది. వాణిజ్య వాహనాల విక్రయాలు (దోస్త్ మోడల్ మినహా) 7,593 నుంచి 38 శాతం క్షీణించి 4,715కు తగ్గాయని వివరించింది. ఇక దోస్త్ విక్రయాలు 3,027 నుంచి 17 శాతం తగ్గి 2,517కు క్షీణించాయని పేర్కొంది. -
బైక్ ఢీ.. ఒకరి దుర్మరణం
జి.తిర్మలగిరి(చివ్వెంల), న్యూస్‌లైన్: అతివేగంగా వస్తున్న మోటార్‌సైకిల్ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని జి.తిర్మలగిరి ఆవాసం గుంపుల గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన సందా సుధాకర్‌రెడ్డి(32) తన వ్యవసాయ పొలం వద్దకు నడుచుకుంటూ వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈదే క్రమంలో పెన్‌పహాడ్ మండలం ధర్మాపురం ఆవాసం గంగ్లీ తండాకు చెందిన మాలోతు వెంకన్న తన ఇద్దరు కూతుళ్లతో మోటార్‌సైకిల్‌పై జి.తిర్మలగిరి వైపు వెళ్తూ రోడ్డు దాటుతున్న సుధాకర్‌రెడ్డిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సుధాకర్‌రెడ్డికి తీవ్రగాయాలై మృతిచెందా డు. వెంకన్న అతని కూతుళ్లకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ అంగోతు భోజ్యనాయక్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. బస్సు, కారు ఢీ.. ప్రమాద స్థలంలో రోడ్డుపై బైక్ పడి ఉండటంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సు డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న కారు, బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. -
రోడ్డు ప్రమాదంలో తల్లీ కొడుకుల మృతి
అనకాపల్లి అర్బన్ - మల్కాపురం, న్యూస్‌లైన్: అనారోగ్యంతో బాధపడుతున్న బంధువును పరామర్శించేందుకు వెళ్తున్న తల్లీకొడుకులను లారీ రూపం లో మృత్యువు కబళించింది. మోటారు సైకిలుపై వెళ్తున్న వారిని మరో మోటా రు సైక్లిస్టు డీకొట్టిన ప్రమాదంలో కిందపడిన వీరిపై నుంచి వెనుక వస్తున్న లా రీ వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పండగ వేళ మృతుల కుటుంబాన్ని విషాదం చుట్టుముట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలావున్నాయి. గాజువాక సమీపంలోని మల్కాపురం క్రాంతినగర్‌కు చెందిన తోట పైడమ్మ (45), కొడుకు నానాజీ (25)లు ఆదివారం ఉదయం చోడవరం మండలం చౌడువాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు మోటారు సైకిల్‌పై బయలుదేరారు. 11 గంటల సమయం లో అనకాపల్లి మండల పరిధిలోని జల గల మదుం సమీపాన వీరి మోటారు సైకిల్‌ను ఎదురుగా వస్తున్న మరో మో టారు సైక్లిస్టు ఢీకొట్టాడు. ఘటనానంతరం ప్రమాదానికి కారకుడైన మోటా రు సైక్లిస్టు రోడ్డు ఎడమ వైపునకు పడిపోగా, పైడమ్మ, నానాజీలు ఎడమవైపు పడిపోయారు. అదే సమయంలో వెను క నుంచి వస్తున్న లారీ వీరు తేరుకునేలోగానే వారిని ఢీకొట్టి 15 అడుగుల దూరం ఈడ్చుకుంటూ వెళ్లిపోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఈ దుర్ఘటనతో దిగ్భ్రమకు గురైన మోటా రు సైక్లిస్టు, లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడ నుంచి పరారయ్యారు. అనకాపల్లి పట్టణ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాలను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్రాంతినగర్‌లో విషాదం పైడమ్మ, నానాజీల మృతి దుర్ఘటన క్రాంతినగర్‌లో విషాదాన్ని నింపింది. సోమవారం వినాయక చవితి కావడంతో కుటుంబ సభ్యులంతా ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లలో మునిగి ఉండగా అందిన సమాచారంతో దిగ్భ్రమకు గురయ్యారు. బంధువులు హుటాహుటిన ఘటనా స్థలికి బయలుదేరి వెళ్లారు. అప్పారావు, పైడమ్మ దంపతులకు నా నాజీ, మంగ కొడుకూ కూతురు. కుమార్తెకు పెళ్లయింది. నానాజీ డాక్ యార్డు లో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. కొడుకు అందుకు రావడంతో అతన్ని ఓ ఇంటి వాడిని చేసి తమ బాధ్యత తీర్చుకోవాలని కలలు కంటున్న ఆ తండ్రి జరిగిన ఘటనతో షాకయ్యారు. భార్యా, బిడ్డ ఒకేసారి చనిపోయారన్న సమాచారం తో భోరుమంటూ కుప్ప కూలిపోయా రు. గుండెపగిలేలా ఏడుస్తున్న ఆయన ను చూసి పలువురు కంటతడిపెట్టారు. విదేశాలకు వెళ్లాలనుకుని... వృత్తి విద్యలో శిక్షణ పొందిన నానాజీ కొన్నాళ్లు విదేశాల్లో ఉద్యోగం చేసి గత ఏడాదే స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఒక్కగానొక్కకొడుకు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశించిన అప్పారావు దంపతులు తమ పాల వ్యాపారంతో వచ్చే అరకొర ఆదాయంతోనే కొడుకుని చదవించారు. కొడుకు ప్రయోజకుడై విదేశాల్లో ఉపాధి పొందడంతో సంతోషించారు. గత ఏడాది స్వదేశానికి వచ్చి న ఆయన మళ్లీ విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగానే నానాజీతోపాటు అతని తల్లినీ మృత్యువు కబ ళించింది. ‘ఆదుకుంటాడనుకున్న కొడుకు, జీవితాంతం తోడుంటానని ప్రమా ణం చేసి నువ్వు నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయారా పైడమ్మా’ అంటూ వారి చిత్రపటాలు పట్టుకుని భోరుమంటున్న అప్పారావును ఆపడం ఎవరి తరమూ కాలేదు. -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
కంచికచర్ల, న్యూస్‌లైన్ : స్థానిక పేరకలపాడు అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. స్థానిక ఎస్సై అల్లు దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వేములపల్లి గ్రామానికి చెందిన ధర్మవరపు రామకృష్ణ(24) మోటార్‌సైకిల్‌పై కంచికచర్ల వచ్చాడు. స్వగ్రామం తిరిగి వెళుతూ పేరకలపాడు అడ్డరోడ్డుకు సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్‌లోకి ఆయిల్ కోసం వెళేందుకు బైక్‌ను అకస్మాతుగా తిప్పాడు. అదే సమయంలో విజయవాడ వైపు వేగంగా వెళ్తున్న కారు అతడి వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో రామకృష్ణ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెం దాడు. పోలీసులు వచ్చి, వివరాలు సేకరించా రు. మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వాస్పత్రి కి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై చెప్పారు. ట్రాక్టర్ పైనుంచి పడి మరొకరు.. కోరుకొల్లు (కలిదిండి) : ట్రాక్టర్‌పై నుంచి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మం డలంలో జరిగింది. స్థానికుల కధనం ప్రకా రం.. మండలంలోని సానారుద్రవరం గ్రామాని కి చెందిన ట్రాక్టర్‌పై భాస్కరరావుపేట గ్రామానికి చెందిన కడలి నాగప్రసాద్ (25) కూలి పనికి వెళ్ళాడు. తోటి కూలీలతో డ్రమ్ముల్లో చేప పిల్లలను వేసి వాటిని చైతన్యపురం గ్రామానికి తీసుకువెళ్లాడు. అక్కడ చేపల చెరువుల వద్ద అన్లోడ్ చేసి తిరుగు ప్రయాణమయ్యాడు. కోరుకొల్లు పంచాయతీ శివారు బొబ్బిలిగూడెం వద్ద ఉన్న మలుపులో ట్రక్కుపై ఉన్న నాగప్రసాద్ జారి రహదారిపై పడిపోయాడు. తీవ్రం గా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెం దాడు. నాగప్రసాద్ తండ్రి సత్యనారాయణ పో లీసులకు ఫిర్యాదు మేరకు ఎస్సై బాలశౌరి సిబ్బందితో ఘటనాస్థలికి వెళ్లి, వివరాలు సేకరించారు. పోస్టుమార్డం నిమిత్తం కైకలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీ చెట్టును ఢీకొని డ్రైవర్.. రెడ్డిగూడెం : శ్రీరామపురం క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో లారీ చెట్టును ఢీకొంది. తాతకుంట్లకు చెందిన షేక్ మౌలాలీ(50) ఎ.కొండూరు నుంచి లారీ న డుపుకుంటూ విస్సన్నపేట వైపు వస్తున్నాడు. మార్గమధ్యంలో శ్రీరామపురం క్రాస్ రోడ్డు వద్ద మరో లారీని ఓవర్టేక్ చేసేందుకు యత్నిం చాడు. దీంతో లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మౌలాలీ కాళ్లు విరిగిపోయాయి. ఆ ప్రాంతంలో ఉన్న వారు అందించిన సమాచారంతో 108 సి బ్బంది వచ్చి, అతడిని విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మరణించాడు. ఆస్పత్రిలో మౌలాలీ ఇచ్చిన వాగ్మూలంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై తులసీ రామకృష్ణ తెలిపారు.