ట్రాక్‌పై విషాదం.. 13 ఏళ్ల రేసర్‌ దుర్మరణం | Young rider Shreyas Hareesh Passed away in a racing incident in Chennai | Sakshi
Sakshi News home page

National Motorcycle Racing: ట్రాక్‌పై విషాదం.. 13 ఏళ్ల రేసర్‌ దుర్మరణం

Published Sun, Aug 6 2023 7:10 AM | Last Updated on Sun, Aug 6 2023 7:10 AM

Young rider Shreyas Hareesh Passed away in a racing incident in Chennai - Sakshi

చెన్నై: బెంగళూరుకు చెందిన 13 ఏళ్ల కుర్రాడు కొప్పారం శ్రేయస్‌ హరీశ్‌కు రేసింగే ప్రాణం. మోటార్‌సైకిల్‌ రేసింగ్‌లో బుల్లెట్‌లా దూసుకెళ్లే ఈ రైడర్‌ తన కలల్ని సాకారం చేసుకోకముందే కన్నవాళ్లకు కన్నీళ్లను మిగిల్చి వెళ్లాడు. తనకెంతో ఇష్టమైన ట్రాకే అతని ప్రాణం తీసింది. రేసింగ్‌లో మెరికగా చిరుప్రాయంలోనే జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన ఈ టీనేజ్‌ కుర్రాడు శనివారం పోల్‌ పొజిషన్‌తో భారత జాతీయ మోటార్‌సైకిల్‌ రేసింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలో పాల్గొన్నాడు.

రేసు ప్రారంభమైన కాసేపటికే మెరుపు వేగంతో దూసుకెళ్తున్న అతని బైక్‌ ‘టర్న్‌–1’ (మలుపు) వద్ద అదుపుతప్పింది. వేగంతో ఉండటం, కిందపడగానే తలకు బలయమైన గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
చదవండిఫైనల్లో  ప్రణయ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement