race
-
‘నన్ను అరెస్ట్ చేస్తారా.. చేస్కోండి’: కేటీఆర్
సాక్షి,తెలంగాణ భవన్: నేను ఏ తప్పు చేయలే .. అందుకే నేను భయపడను. ఈ రేస్ అయినా ఇంకేదైనా. అరెస్టు చేసుకుంటే చేసుకో అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. గురువారం రాష్ట్ర రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.చిట్‌చాట్‌లో కేటీఆర్ ఏమన్నారంటే..ఎస్పీ నారాయణ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల్ని వదిలేసి బీఆర్ఎస్ శ్రేణుల్ని కొట్టారు. దీనిపై మేధావులు ఎవరు మాట్లాడలేదు. పోలీసుల తీరు సరిగా లేదు. పోలీసులు వైఫల్యం ఉంది. ఇంటిజెన్స్ వ్యవస్థ అట్టర్ ప్లాప్ అయింది. రేవంత్‌రెడ్డి సైన్యంలా పరిస్థితి తయారైంది. రైతులు,బీఆర్ఎస్ శ్రేణుల్ని ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసినట్లు చేస్తున్నారు. నేను ఊరుకోను. రేవంత్ రెడ్డి నీ సంగతి తేలు. లగచర్ల బాధితులను ఢిల్లీకి తీసుకుపోయి.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తా. నేను ఏ తప్పు చేయలే.. అందుకే నేను భయపడను. ఈ రేస్ అయినా ఇంకేదైనా. అరెస్టు చేసుకుంటే చేసుకో. మీలాంటి వాళ్ళను చాలా మందిని చూశా. నీ కుర్చీ కాపాడుకో. ఎన్ని రోజులు ఉంటావో. ఉత్తమ్, భట్టీ నీ కుర్చిలో కూర్చుంటారు. బాంబులు పేల్చేది నీ మీదనే.. మీ పార్టీలోనే. మూసీ కోసం రేవంత్ కొత్తగా చేసిందేమీ లేదు. డబ్బు దండుకోవడమే. డీపీఆర్ లేకుండా రూ. లక్ష 50వేల కోట్లు ఎలా అవుతాయ్ రేవంత్. ఢిల్లీకి డబ్భులు పంపాలని ప్లాన్ చేశారు. నీ నియోజకవర్గంలో సమస్యనే పరిష్కరించలేని నువ్వు ఓ ముఖ్యమంత్రివి. నీదో కథ’ అని కేటీఆర్ చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. -
మళ్ళీ తెర పైకి ఈ-కార్ రేస్
-
చెన్నైలో 'రేస్' అదరహో.. సెలబ్రిటీల సందడి
సాక్షి, చెన్నై: ఫార్ములా కార్ రేస్ ఆదివారం అదరహో అనిపించే విధంగా జరిగింది. వినోదంతో కూడిన సాహసాలు హోరెత్తాయి. సినీ సెలబ్రిటీలు సందడి చేశారు. చెన్నై ఐలాండ్ గ్రౌండ్ వేదికగా ఫార్ములా కార్ రేస్ –4 శనివారం మొదలైన విషయం తెలిసిందే. తొలిరోజు అర్హత పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. రెండవ రోజు ఆదివారం ఉదయం నుంచి ట్రయల్ రన్ పేరిట పోటీలు హోరెత్తాయి. అలాగే, నగర వాసులు, ప్రేక్షకులను ఆకర్షించే దిశగా వినోద కార్యక్రమాలు, సాహసాలతో కూడిన కార్ రేసులు సాగాయి. జేకే టైర్ కార్ రేస్ ప్రత్యేక ఆకర్షణగా దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు తుది పోటీలు ఇండియన్ చాంపియన్‌షిప్, ఇండియన్ రేసింగ్ లీగ్ కేటగిరిలలో జరిగాయి. అత్యంత పోటాపోటీగా ఉత్కంఠ భరితంగా గాల్లో 200 కి.మీకి పైగా వేగంతో కార్లు దూసుకెళ్లాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు పోటీలలో విజయాన్ని కైవశం చేసుకునే దిశగా రేసులో దూసుకెళ్లారు.చివరి రోజు పోటీలను వీక్షించేందుక ప్రత్యేక ఆకర్షణగా త్రిష వంటి సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. అలాగే, భారత మాజీ క్రికెటర్ గంగూలి, బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్, జాన్అబ్రహం, నిర్మాత బోనికపూర్‌తో పాటు పలువురు నటీ నటులు హాజరయ్యారు. కోలీవుడ్‌కు చెందిన అనేక మంది స్టార్లు తరలి వచ్చారు.సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే, టాలీవుడ్ స్టార్ నాగచైతన్య ఈ ఫార్ములాకు మరింత ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. అర్ధరాత్రి జరిగిన విజయోత్సవంలో మరెందరో సినీ, క్రీడా సెలబ్రిటీలు సందడి చేశారు. శునకాల కోసం వేట కార్ రేస్‌కు శునకాలు పెద్ద సమస్యగా మారాయి. ఈ రేస్ జరిగే పరిసరాలలో కూవం నదీ తీరంలోని కొన్ని మురికి వాడలు ఉన్నాయి. ఇక్కడ శునకాలు ఎక్కవ. శనివారం రేస్ సమయంలో ఓ శునకం ట్రాక్‌లోకి దూసుకు రావడంతో రైడర్లు అలర్ట్ అయ్యారు. ఆ శునకం ట్రాక్‌ను రేస్ కారు వేగంతో దాటేయడంతో పెనుప్రమాదం తప్పినట్టైంది. దీంతో ఆదివారం రేసుకు శునకాల రూపంలో ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తలు పడ్డారు. ఆదివారం ఉదయం నుంచి ఆ పరిసరాలలో శునకాల కోసం కార్పొరేషన్ సిబ్బంది తీవ్ర వేట సాగించారు. పదికి పైగా శునకాలను పట్టేశారు. రాత్రి జరిగిన ఫైనల్స్‌లోకి శునకాలు ట్రాక్ వైపుగా దూసుకు రాకుండా డేగ కళ్లతో కార్పొరేషన్ సిబ్బంది నిఘా వేయాల్సి వచ్చింది. Lovely! Normal Traffic on the left lane! Races on the right lane..👌🏎️#Formula4Chennai pic.twitter.com/2fqMd5KDSY— Chennai Updates (@UpdatesChennai) September 1, 2024 -
లక్నో మెంటార్‌గా జహీర్ ఖాన్!
న్యూఢిల్లీ: భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్‌ను మెంటార్‌గా నియమించుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ప్రయత్నాలు చేస్తోంది. మెగా వేలం ప్రారంభానికి ముందే జహీర్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని లక్నో జట్టు యాజమాన్యం భావిస్తోంది. ముంబై ఇండియన్స్ గ్లోబల్ డెవలప్మెంట్ హెడ్‌గా పనిచేస్తున్న జహీర్ ఖాన్.. ఐపీఎల్లో 10 సీజన్లపాటు మూడు జట్ల తరఫున 100 మ్యాచ్‌లు ఆడి 102 వికెట్లు పడగొట్టాడు.2017లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జహీర్... అప్పటి నుంచి ముంబై ఇండియన్స్‌తో కొనసాగుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ 2023 సీజన్ అనంతరం లక్నోను వీడి కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్టుకు మారాడు. ఈ సీజన్లో గంభీర్ మార్గదర్శకత్వంలో కోల్‌కతా జట్టు అద్వితీయ ప్రదర్శన కనబర్చి మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ‘టీమ్ మెంటార్‌గా జహీర్ ఖాన్‌ను నియమించేందుకు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది.గంభీర్ నిష్క్రమణతో అతడి స్థానాన్ని జహీర్‌తో భర్తీ చేయాలని అనుకుంటున్నారు’ అని పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. గంభీర్ మెంటార్షిప్లో 2022, 2023లో ప్లేఆఫ్స్‌కు చేరిన లక్నో... ఈ ఏడాది అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా లక్నో బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా ఆ జట్టును వీడి... భారత జాతీయ జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. దీంతో లక్నో జట్టు ఐపీఎల్ మెగా వేలానికి ముందు సహాయక సిబ్బంది ఎంపిక పూర్తి చేయాలని భావిస్తోంది.మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టు కూడా కోచ్ కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. హెడ్ కోచ్ ట్రేవర్ బేలిస్ స్థానంలో భారత ఆటగాడికే ఈ బాధ్యతలు అప్పగించాలని పంజాబ్ యాజమాన్యం భావిస్తోంది. అయితే ఈ జాబితాలో వీవీఎస్ లక్ష్మణ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆటపై అపార అనుభవం ఉన్న లక్ష్మణ్ ప్రధాన కోచ్ పదవికి సరైన ప్రత్యామ్నాయం అని పంజాబ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.అయితే గత కొన్నాళ్లుగా బీసీసీఐతో కొనసాగుతున్న వీవీఎస్.. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్‌గా వ్యవహరిస్తున్నాడు. మరో ఏడాది కాలం లక్ష్మణ్ ఎన్సీఏ హెడ్‌గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రయత్నాలు ఫలిస్తాయా చూడాలి! -
సల్మాన్ రేస్‌లో లేరా?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘రేస్’లో లేరా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ‘రేస్’ మూవీ ఫ్రాంచైజీలో ఇప్పటికే మూడు సినిమాలు (2008లో ‘రేస్’, 2013లో ‘రేస్ 2’, 2018లో ‘రేస్ 3’) వచ్చి, బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. దీంతో ఈ ఫ్రాంచైజీలో రానున్న నాలుగో సినిమాపై ఫుల్ క్రేజ్ నెలకొంది. ‘రేస్, రేస్ 2’ చిత్రాలకు అబ్బాస్–మస్తాన్ దర్శకత్వం వహించగా, ‘రేస్ 3’కి రెమో డిసౌజా దర్శకత్వం వహించారు.‘రేస్ 3’లో సల్మాన్ ఖాన్, అనీల్ కపూర్, బాబీ డియోల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, డైసీ షా కీలక పాత్రలు పోషించారు. 2018 రంజాన్ సందర్భంగా రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ‘రేస్ 4’ పై ఎలాంటి అప్డేట్ వస్తుందా? అని ప్రేక్షకులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు నిర్మాత రమేశ్ ఎస్. తౌరానీ ఓ స్పష్టత ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ– ‘‘రేస్’ ఫ్రాంచైజీలో రానున్న నాలుగో చిత్రానికి ఇప్పటికే కథ సిద్ధంగా ఉంది. ఇందులో నూతన నటీనటులు ఉంటారు.‘రేస్ 4’లో సల్మాన్ ఖాన్ భాగమవుతాడా? లేదా అనేది ఇప్పుడే చెప్పలేను. ఈ మూవీకి దర్శకుడు ఎవరన్నది కూడా ఇంకా నిర్ణయించలేదు. ఈ ఏడాది చివరికల్లా ఈ ్రపాజెక్ట్ సెట్స్‌పైకి వెళుతుంది’’ అన్నారు. మరి ‘రేస్ 4’లో సల్మాన్ భాగమవుతారా? లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. -
SRH: సన్‌రైజర్స్ గుండెల్లో గుబులు.. మ్యాచ్ గనుక రద్దైతే!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే పదకొండేసి మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్(నెట్ రన్‌రేటు 1.453), రాజస్తాన్ రాయల్స్ రాయల్స్(నెట్ రన్‌రేటు 0.476) ఎనిమిది గెలిచి టాప్-2లో తిష్ట వేశాయి.చెరో పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం మూడో స్థానం కోసం 12 పాయింట్లతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (-0.065)మధ్య జరుగుతున్న పోటీలో ఇప్పటి వరకు రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్న సీఎస్కే(0.700)నే పైచేయి సాధించింది.ప్లే ఆఫ్స్ పోటీలో కీలక మ్యాచ్దీంతో రైజర్స్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. రాజస్తాన్ రాయల్స్‌పై మంగళవారం నాటి విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ సైతం ముందుకు దూసుకువచ్చింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ సైతం 12 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతూ టాప్-4పై కన్నేసింది.ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బుధవారం నాటి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకువెళ్తుంది. అదే సమయంలో ఓడిన జట్టు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.పొంచి ఉన్న వాన గండంఅయితే, సొంతగడ్డపై మ్యాచ్ జరుగనుండటం సన్‌రైజర్స్‌కు సానుకూల అంశమే అయినా.. వర్షం రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు 56 మ్యాచ్‌లు జరిగాయి.కానీ ఒక్క మ్యాచ్ కూడా వరణుడి కారణంగా రద్దు కాలేదు. అయితే, ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన సన్‌రైజర్స్- లక్నో మ్యాచ్‌కు మాత్రం వాన గండం పొంచి ఉంది. హైదరాబాద్‌లో మంగళవారం కుండపోతగా వర్షం కురిసింది.ఈ నేపథ్యంలో స్టేడియం సిబ్బంది మైదానంలోని మధ్య భాగాన్ని కవర్లతో కప్పి ఉంచారు. అయితే, వాతావరణ శాఖ రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని మంగళవారం హెచ్చరించడం ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో గుబులు రేపుతోంది.మ్యాచ్ గనుక రద్దు అయితేకాగా తాజా సీజన్లో ఆరంభ మ్యాచ్‌లో తడబడ్డా ప్యాట్ కమిన్స్ బృందం తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుంది. 266.. 277.. 287 స్కోర్లు నమోదు చేసి పరుగుల విధ్వంసానికి మారుపేరుగా నిలిచింది.అయితే, గత కొన్ని మ్యాచ్‌ల నుంచి సన్‌రైజర్స్ పేలవ బ్యాటింగ్‌తో తేలిపోతోంది. ఆఖరిగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక బుధవారం నాటి మ్యాచ్ గనుక రద్దైతే సన్‌రైజర్స్, లక్నోల ఖాతాలో చెరో పాయింట్ చేరుతుంది. అలా కాక మ్యాచ్ సాఫీగా సాగితే గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు వస్తాయి.వాతావరణ శాఖ హెచ్చరికనగరంలో వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.చదవండి: సంజూ శాంసన్‌కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ 𝙇𝙤𝙘𝙠𝙚𝙙 𝙖𝙣𝙙 𝙡𝙤𝙖𝙙𝙚𝙙 👊🔥#PlayWithFire #SRHvLSG pic.twitter.com/En1XXReksW— SunRisers Hyderabad (@SunRisers) May 8, 2024 -
స్పోర్ట్స్ న్యూస్: ‘పారిస్’ మార్క్‌ను దాటిన రాంబాబు..
న్యూఢిల్లీ: భారత రేస్ వాకర్ రాంబాబు పారిస్ 20 కిలో మీటర్ల రేసులో పారిస్ ఒలింపిక్స్ అర్హత టైమింగ్‌ను అందుకున్నాడు. స్లొవేకియాలో జరుగుతున్న టూర్ గోల్డ్ లెవల్ ఈవెంట్లో రాంబాబు మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్‌ను 1 గంటా 20 నిమిషాల్లో రాంబాబు పూర్తి చేశాడు. పెరూ, ఈక్వెడార్ అథ్లెట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. పారిస్ క్వాలిఫయింగ్ టైమింగ్ 1 గంటా 20 నిమిషాల 10 సెకన్లుగా ఉంది. అయితే ఈ ప్రదర్శనతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాంబాబు నేరుగా ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం లేదు. అతనికంటే ముందే ఆరుగురు భారత రేస్ వాకర్లు అర్హత టైమింగ్‌ను సాధించారు. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం దేశంనుంచి గరిష్టంగా ముగ్గురికే పాల్గొనే అవకాశం ఉంది. ఇవి చదవండి: నేడు జరిగే WPL లో.. కొత్త విజేత ఎవరో!? -
రామానాయుడు స్టూడియోలో కార్ రేసింగ్.. సందడి చేసిన టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
-
ఈ మూడు కారణాలే బాబాను సీఎం రేసు నుంచి తప్పించాయా?
రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి రేసు నుంచి బాబా బాలక్‌నాథ్ తప్పుకున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే బాబా బాలక్‌నాథ్ పేరు ముఖ్యమంత్రి పదవి రేసులో వినిపించింది. పార్టీ అంతర్గత సర్వేలో కూడా ఆయన ఆధిక్యత కనబరిచారు. ఎన్నికల్లో ఆయన గెలిచిన తర్వాత ఈ వాదన మరింత బలపడింది. పైగా బాబా బాలక్‌నాథ్.. బీజేపీ నేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో కూడా సమావేశం అయ్యారు. ఈ నేపధ్యంలో బాబా ముఖ్యమంత్రి అవుతారనే చర్చలు మరింత ఊపందుకున్నాయి. అయితే ఇప్పుడు ఆయన తాను ముఖ్యమంత్రి రేసులో లేనని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. అయితే బాబా సీఎం కాకపోవడానికి మూడు కారణాలను కీలకంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. మొదటిది: బాబా బాలక్‌నాథ్ ఓబీసీ వర్గానికి చెందినవారు. రాజస్థాన్ పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో సీఎం పదవికి బలమైన పోటీదారులుగా ఓబీసీ నేతలు ఉన్నారు. అటువంటి పరిస్థితిలో రాబోయే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా రెండు పొరుగు రాష్ట్రాలలో ఒకే సామాజికవర్గానికి చెందిన ముఖ్యమంత్రులను ఎంపిక చేసేందుకు బీజీపీ సుముఖంగా లేదని తెలుస్తోంది. రెండవది: బాబా బాలక్‌నాథ్‌కు రాజకీయాలలో తగినంత అనుభవం లేదు. ఒక ప్రకటనలో ఆయన కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. బాబా బాలక్‌నాథ్ ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే ఎంపీ అయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ కోణంలో చూస్తే బాబా రాజకీయ అనుభవం ఐదేళ్లు మాత్రమే. తగిన అనుభవం లేకపోవడంతోనే బాబా సీఎం కుర్చీ దూరమయ్యారనే మాట వినిపిస్తోంది. మూడవది: రాజస్థాన్‌కు పొరుగు రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్‌లోనూ బాబా బాలక్‌నాథ్‌ను సీఎం చేస్తే బీజేపీపై హిందుత్వ ముద్ర మరింత బలమవుతుంది. అప్పడు అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తామని చెబుతున్న బీజేపీ హామీకి విలువలేకుండా పోతుంది. అందుకే బాబాను సీఎం రేసు నుంచి బీజేపీ తప్పించిందని అంటున్నారు. ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్ సీఎం ఎవరు? రాజస్థాన్‌లో ఏం జరుగుతోంది? -
ఛత్తీస్‌గఢ్ సీఎం రేసులో వెనుకబడిన రమణ్ సింగ్!
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఈ నేపధ్యంలో బీజేపీ మరో విజయానికి ఇక్కడి నుంచే బీజం వేయాలని భావిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలలోనూ ప్రభావం చూపే నేతను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ భావిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని ఓబీసీ గిరిజన నేతకు అప్పగించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఈ వ్యూహాల నేపధ్యంలో ముఖ్యమంత్రి పదవి రేసులో మాజీ సీఎం రమణ్ సింగ్ పేరు వెనుకబడింది. సీఎం పదవికి బీజేపీ కొత్త పేరును పరిశీలిస్తోంది. చత్తీస్‌గఢ్‌లో సీఎం రేసులో ఎంపీ రేణుకా సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సావో, ఎంపీ గోమతి సాయి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా రేసులో ఉన్నారని చెప్పినప్పటికీ, మిగిలినవారు ఈ రేసులో ముందున్నారు. రమణ్ సింగ్ 71 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపధ్యంలో అతనిని పక్కన పెట్టాలని బీజేపీ భావిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ సీఎం రేసులో లతా ఉసేంది, రాంవిచార్ నేతమ్, విష్ణుదేవ్ సాయి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. విష్ణుదేవ్ సాయి గిరిజన నాయకుడు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. మూడుసార్లు ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఛత్తీస్‌గఢ్ సీఎం ఎంపిక కోసం ఈరోజు (ఆదివారం) జరిగే శాసనసభా పక్ష సమావేశంలో ముగ్గురు పరిశీలకులు, జార్ఖండ్ మాజీ సీఎం, గిరిజన నాయకుడు అర్జున్ ముండా, అస్సాం మాజీ సీఎం, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పరిశీలకులు సీఎం ఎంపిక విషయంలో ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకుని పార్టీ హైకమాండ్‌కు తెలియజేస్తారని విశ్వసనీయ సమాచారం. ఇది కూడా చదవండి: బొగ్గు గనుల మూసివేత పరిణామాలేమిటి? కూలీలు ఏం చెయ్యాలి? -
సీఎం ఎంపికపై మల్లగుల్లాలు.. ఢిల్లీకి వసుంధర రాజే!
రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు. ఈ నేపధ్యంలో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేను బీజేపీ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. రాజే బుధవారం రాత్రి 10:30 గంటలకు ఇండిగో ఎయిర్వేస్ విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. వసుంధర రాజే గురువారం ఉదయం జేపీ నడ్డా, అమిత్ షాలతో భేటీ కానున్నారు. రాజస్థాన్‌లో అధికారాన్ని వసుంధర రాజేకు అప్పగించాలని పార్టీ హైకమాండ్ మరోసారి భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది. డిసెంబరు 3న రాజస్థాన్‌లో బీజేపీకి మెజారిటీ వచ్చిన తరుణంలో ముఖ్యమంత్రి ఎవరనేదానిపై చర్చ మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో చాలా మంది పేర్లు వినిపించాయి. ఈ జాబితాలో వసుంధర రాజే, అర్జున్ రామ్ మేఘ్వాల్, గజేంద్ర సింగ్ షెకావత్, రాజేంద్ర రాథోడ్, దియా కుమారి, బాబా బాలక్‌నాథ్, ఓం బిర్లా పేర్లు ఉన్నాయి. సీఎం రేసులో అనేక మంది పేర్లు ఉండటంతో వసుంధర రాజే చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలను ఆమె విందుకు ఆహ్వానించారు. ఈ నేపధ్యంలో దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు ఆమెను ముఖ్యమంత్రిని చేసేందుకు అంగీకరించారని వసుంధర మద్దతుదారులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో రాజే ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: ఎంపీ పదవికి 10 మంది రాజీనామా -
తైవాన్ అధ్యక్ష రేసులో..టెర్రీ గౌ
ఐ ఫోన్ తయారీ సంస్థ ఫౌండర్, అపర కుబేరుడు టెర్రీ గౌ కూడా తైవాన్ అధ్యక్ష రేసులో నిలిచారు. కుచేలుడి నుంచి కుబేరుని స్థాయికి ఎదిగిన ఆసక్తికర నేపథ్యం టెర్రీది. కనుక ఆయనకున్న ప్రజాదరణ నేపథ్యంలో ఒక్కడే గనక బరిలో ఉంటే పాలక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కి గట్టి పోటీ ఇవ్వడం కూడా ఖాయమేనని అంటున్నారు. కానీ విపక్షాల తరఫున ఇప్పటికే ఇద్దరు రంగంలోకి దిగారు.ఈ నేపథ్యంలో టెర్రీ పోటీ విపక్ష ఓటును మూడుగా చీల్చి చివరికి 2024 జనవరిలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో అధికార పక్షం నెత్తిన పాలు పోసేలా కనిపిస్తోందన్నది పరిశీలకుల విశ్లేషణ... తైవాన్‌కు చెందిన 72 ఏళ్ల టెర్రీ అపర కుబేరుడు. ఐ ఫోన్ తయారీ సంస్థ ఫాక్స్ కాన్ వ్యవస్థాపకుడు.వ్యాపారవేత్తగా దేశ ప్రజల్లో ఆయనకున్న చరిష్మా అంతా ఇంతా కాదు. అధికార పక్షంతో ఇప్పటికే రెండు విపక్షాలు తలపడుతుండగా మూడో శక్తిగా ఆయన కూడా రంగంలోకి దిగి అధ్యక్ష ఎన్నికల రేసును ఆసక్తికర మలుపు తిప్పారు. బరిలో ఆ ముగ్గురు... అధ్యక్షుడు సై ఇంగ్ వెన్కు ఇది రెండో టర్మ్. అంతకు మించి పదవిలో కొనసాగేందుకు తైవాన్ నిబంధనలు అనుమతించవు. దాంతో ఈసారి అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) తరఫున విలియం లై చింగ్ తే బరిలో దిగుతున్నారు. ప్రధాన విపక్షమైన జాతీయవాద కోయిమిన్ టాంగ్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్గా చాన్స్ దక్కించుకునేందుకు టెర్రీ ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయనకు బదులుగా హొవ్ యూ ఇయ్కు పార్టీ అవకాశం ఇచ్చింది. మరో విపక్షం టీపీపీ తరఫున దేశ ప్రజల్లో అత్యంత ఆదరణ ఉన్న కో వెన్ జే పోటీ పడుతున్నారు. రాజధాని తాయ్ పీ సిటీ మేయర్‌గా చేసిన అనుభవం ఆయన సొంతం. పైగా యువ ఓటర్లు ఆయనను వేలం వెర్రిగా అభిమానిస్తారు. ప్రస్తుతం రేసులో రెండో స్థానంతో వెన్ దూసుకుపోతున్నారు. ఎంత ప్రయత్నించినా ప్రధాన విపక్షం డీపీపీ నుంచి అవకాశం దక్కకపోవడంతో టెర్రీ స్వతంత్ర హోదాలో పోటీకి దిగారు. అంతులేని సంపద, వ్యాపార విజయాలతో పాటు చైనాతో దీర్ఘకాలం పాటు విజయవంతంగా కలిసి పని చేసిన విశేషానుభవం టెర్రీకి మరింతగా కలిసొచ్చే అంశం.– నేషనల్ డెస్క్, సాక్షి తైవాన్ ఇంజనీరింగ్ ప్రతిభకు మానవ వనరులను కలగలిపి ఫాక్స్ కాన్ (హాన్ హై ఇండస్ట్రీస్)ను ప్రపంచంలోనే అతి పెద్ద ఎల్రక్టానిక్స్ తయారీదారుగా తీర్చిదిద్దారు టెర్రీ. 1980, 90ల్లో దక్షిణ చైనాలో అతి పెద్ద తయారీ సంస్థలను నెలకొల్పి చైనీయులకు వేలాదిగా ఉపాధి కల్పించారు. ఈ మోడల్ సూపర్ సక్సెస్ అయింది. ఎంతగా అంటే, యాపిల్ తన మాక్ బుక్స్, ఐ ఫోన్ల తయారీని ఫాక్స్ కాన్కే అప్పగించేలా ఒప్పించగలిగారు టెర్రీ. దాంతో ఫాక్స్ కాన్ అతి పెద్ద కంపెనీగా, టెర్రీ దేశంలోనే అతి సంపన్నుల్లో ఒకరిగా ఎదగడం సాధ్యపడింది. తైవాన్ సారబౌమత్వాన్ని కాపాడేందుకు చైనాతో తనకున్న సంబంధాలన్నింటిన్నీ ఉపయోగిస్తానని, దేశాభివృద్ధి కోసం తన అనుభవం మొత్తాన్నీ రంగరిస్తానని చెబుతున్నారు టెర్రీ. తైవాన్ను ఎలాగైనా పూర్తిగా తనలో కలిపేసుకోవాలని చైనా ప్రయత్నిస్తుండటం, ఇటీవల ఆ దిశగా దూకుడు పెంచడం, అది తైవాన్ కు కొమ్ము కాస్తున్న అమెరికాతో ఘర్షణ దాకా వెళ్లడం తెలిసిందే పాలక డీపీపీ అసమర్థ, అసంబద్ధ, దుందుడుకు విధానాలే ఈ దుస్థితికి కారణమని టెర్రీ ఆరోపిస్తున్నారు. కానీ తైవాన్ ప్రజల్లో అత్యధికులు ఈ వాదనను విశ్వసించడం లేదు. త్రిముఖ ఓటుతో ఇప్పటికే అవకాశాలు సన్నగిల్లేలా కనిపిస్తున్న టెర్రీకి ఇది మరింత ప్రతికూలంగా మారేలా ఉంది. 40 శాతానికి పైగా ఓటర్లు పాలక పక్షానికి గట్టిగా మద్దతిస్తున్నట్టు ఇటీవలి సర్వేలు కూడా తేల్చాయి. ఈ పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఒక్కటై ఉమ్మడిగా ఒకే అభ్యర్ని నిలిపితేనే అధికార పార్టీ కి కాస్తో కూస్తో పోటీ ఇవ్వడం సాధ్యపడేలా కనిపిస్తోంది. కానీ అందుకు రెండు విపక్షాల్లో ఏదీ సిద్ధంగా లేదు. దాంతో సర్వేలు చెబుతున్నట్టు అధికార డీపీపీకి కేవలం 40 శాతం ఓట్లు మాత్రమే వచ్చినా అది అధికారం నిలుపుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. -
ట్రాక్‌పై విషాదం.. 13 ఏళ్ల రేసర్ దుర్మరణం
చెన్నై: బెంగళూరుకు చెందిన 13 ఏళ్ల కుర్రాడు కొప్పారం శ్రేయస్ హరీశ్‌కు రేసింగే ప్రాణం. మోటార్‌సైకిల్ రేసింగ్‌లో బుల్లెట్లా దూసుకెళ్లే ఈ రైడర్ తన కలల్ని సాకారం చేసుకోకముందే కన్నవాళ్లకు కన్నీళ్లను మిగిల్చి వెళ్లాడు. తనకెంతో ఇష్టమైన ట్రాకే అతని ప్రాణం తీసింది. రేసింగ్‌లో మెరికగా చిరుప్రాయంలోనే జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన ఈ టీనేజ్ కుర్రాడు శనివారం పోల్ పొజిషన్‌తో భారత జాతీయ మోటార్‌సైకిల్ రేసింగ్ చాంపియన్‌షిప్ పోటీలో పాల్గొన్నాడు. రేసు ప్రారంభమైన కాసేపటికే మెరుపు వేగంతో దూసుకెళ్తున్న అతని బైక్ ‘టర్న్–1’ (మలుపు) వద్ద అదుపుతప్పింది. వేగంతో ఉండటం, కిందపడగానే తలకు బలయమైన గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. చదవండి: ఫైనల్లో ప్రణయ్ -
US: యూనివర్సిటీల్లో ఆ రిజర్వేషన్లపై నిషేధం
వాషింగ్టన్ డీసీ: అమెరికా సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. యూనివర్సిటీల అడ్మిషన్లలో జాతి సంబంధిత రిజర్వేషన్లపై నిషేధం విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఆఫ్రో-అమెరికన్లు, ఇతర మైనారిటీలకు విద్యావకాశాలను పెంపొందించే ఉద్దేశంతో యూనివర్సిటీ అడ్మిషన్లను అమలు చేస్తున్నారు. 1960 సంవత్సరం నుంచి ఇవి అమలు అవుతున్నాయి. ఈ మేరకు అడ్మిషన్ విధానాల్లో జాతి, తెగ పదాలను ప్రధానంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే.. ఇకపై ఆ పదాలను ఉపయోగించడానికి వీల్లేదని.. ఆ పదాలను నిషేధిస్తూ అమెరికా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 👨⚖️ ఈ మేరకు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆ సంచలన తీర్పు చదువుతూ.. ఒక స్టూడెంట్ను అతని అనుభవాల ఆధారంగా పరిగణించబడాలిగానీ జాతి ఆధారంగా కాదు. యూనివర్సిటీలలో ఇకపై జాతి సంబంధిత అడ్మిషన్లు కొనసాగడానికి వీల్లేదు అంటూ తీర్పు కాపీని చదివి వినిపించారాయన. 👉 అమెరికాలో అత్యంత పురాతనమైన ఉన్నత విద్యాసంస్థలు హార్వర్డ్ యూనివర్సిటీ, యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా (UNC)ల్లో అడ్మిషన్ల విధానంలో పారదర్శకత కోరుతూ ఓ విద్యార్థి సంఘం వేసిన పిటిషన్ ఆధారంగా అమెరికా సుప్రీం కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. 👉 ఒకప్పుడు అఫ్రో-అమెరికన్ల పట్ల విపరీతమైన జాతి వివక్ష కొనసాగేది. ఈ క్రమంలోనే అమెరికా ఉన్నత విద్యాసంస్థల్లో వాళ్లకు అవకాశాలు దక్కేవి కావు. 👉 అయితే.. 1960లో జరిగిన పౌర హక్కుల ఉద్యమం ఆధారంగా యూనివర్సిటీలలో నల్ల జాతి పౌరులకు,ఇతర మైనారీటీలకు విద్యావకాశాలు అందజేసే ఉద్దేశంతో పలు నూతన విధానాలు తీసుకొచ్చారు. 👉 అయితే.. జాతి సంబంధిత అడ్మిషన్ విధానాల వల్ల సమానత్వానికి తావు లేకుండా పోయిందని, పైగా మెరుగైన అర్హత కలిగిన ఆసియా అమెరికన్లకు అవకాశాలు దూరం అవుతున్నాయని సదరు గ్రూప్ సుప్రీం ముందు వాదించింది. 👉 నల్లజాతి అమెరికన్లకు చోటు కల్పించేందుకు ఆసియన్ల పట్ల వివక్ష చూపుతున్నారన్నది ప్రధాన అభ్యంతరం చాలా కాలంగా కొనసాగుతోందక్కడ. 👨⚖️ తాజాగా.. సుప్రీం కోర్టు ధర్మాసనంలోని 6-3 న్యాయమూర్తుల మెజార్టీ సదరు రెండు యూనివర్సిటీలలో జాతి సంబంధిత అడ్మిషన్లు చెల్లవంటూ తీర్పు ఇచ్చింది. ట్రంప్ తప్పా అంతా ఆగ్రహం యూనివర్శిటీ అడ్మిషన్లలో రిజర్వేషన్లపై నిషేధం తీర్పుపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పుతో తాను విబేధిస్తున్నట్లు తెలిపారాయన. అమెరికాలో వివక్ష ఇంకా మనుగడలోనే ఉందన్న విషయాన్ని గుర్తు చేశారాయన. జాతుల పరంగా వైవిధ్యం ఉన్నప్పుడే అమెరికా విద్యాసంస్థలు బలోపేతంగా ఉంటాయని తాను భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పు తుది నిర్ణయం కాదంటూ ప్రధానంగా ప్రస్తావించారాయన. The odds have been stacked against working people for too long – we cannot let today's Supreme Court decision effectively ending affirmative action in higher education take us backwards. We can and must do better. pic.twitter.com/Myy3D5jUGH — President Biden (@POTUS) June 30, 2023 సుప్రీం తీర్పు.. భవిష్యత్తు తరాలకు అవకాశాలను నిరాకరించడమే అవుతుందని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ అభిప్రాయపడ్డారు. తీర్పును వర్ణాంధత్వం అంటూ అభివర్ణించిన ఆమె.. దేశాన్ని వెనక్కి తీసుకెళ్లడమే అంటూ తీవ్రంగా వ్యతిరేకించారామె. Today’s Supreme Court decision in Students for Fair Admissions v. Harvard and Students for Fair Admissions v. University of North Carolina is a step backward for our nation. Read my full statement. pic.twitter.com/pIBCmVMr6d — Vice President Kamala Harris (@VP) June 29, 2023 రిజర్వేషన్లపై నిషేధం విధిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మండిపడ్డారు. అందరికీ అవకాశాల పేరిటే ఈ విధానాలు తెరపైకి వచ్చాయని.. తద్వారానే తాను, తన భార్య మిచెల్లీ లాంటి వాళ్లం వృద్ధిలోకి వచ్చామని అంటున్నారాయన. ఆ విధానాలు తెచ్చిన ఉద్దేశ్యాన్ని న్యాయవ్యవస్థ గుర్తించి ఉంటే బాగుండేదని అంటున్నారాయన. Affirmative action was never a complete answer in the drive towards a more just society. But for generations of students who had been systematically excluded from most of America’s key institutions—it gave us the chance to show we more than deserved a seat at the table. In the… https://t.co/Kr0ODATEq3 — Barack Obama (@BarackObama) June 29, 2023 ట్రంప్ మాత్రం ఇలా.. ఇది గొప్ప శుభదినం అంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ సైతం ఉంచారు. అమెరికాకు ఇది గొప్ప రోజు. ఇది ప్రతి ఒక్కరూ ఎదురుచూసిన.. ఆశించిన తీర్పు. దీని ఫలితం అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో మనల్ని పోటీగా ఉంచుతుంది అంటూ ట్రూత్‌సోషల్‌లో పోస్ట్ చేశారాయన. -
ఫైనల్ బెర్త్ ఎవరిది..
-
ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబో రేస్‌ని పూర్తి చేసిన తొలి భారతీయుడు
రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అభిలాష్ టోమీ చరిత్ర సృష్టించాడు. ఫ్రాన్స్‌లోని లెస్ సాబుల్స్ డి ఒలోన్ నుంచి ప్రారంభమైన సోలో సెయిలింగ్ రేస్‌లో ప్రపంచవ్యాప్తంగా చుట్టూ వచ్చిన సెయిలర్‌గా(నావికుడు) రెండో స్థానంలో నిలిచాడు. ఈ రేస్ సెప్టెంబర్ 4,2022న ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. దీంతో టోమీ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ రేస్‌ను పూర్తి చేసిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా సోలో సెయిలింగ్ రేసులో రెండో స్థానం దక్కించుకున్న వ్యక్తిగా నిలిచాడంటూ రేసు అధికారిక వెబ్‌పేజ్‌లో ఒక ప్రకటనలో వెల్లడించింది. (చదవండి: బ్యూటీపార్లర్‌కు వెళ్లనివ్వలేదని భార్య క్షణికావేశంతో..) -
ఈ–టూవీలర్ల కోసం రేస్‌ఎనర్జీ, హాలా జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ సంస్థ రేస్‌ఎనర్జీ, రైడ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ హాలా మొబిలిటీ తాజాగా జట్టు కట్టాయి. దేశవ్యాప్తంగా 2,000 పైచిలుకు ఎలక్ట్రిక్ టూ–వీలర్లను డెలివరీ సర్వీసుల కోసం వినియోగంలోకి తేనున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి తొలి దశ కింద కొన్ని వాహనాలు వినియోగంలోకి రానున్నట్లు సంస్థలు తెలిపాయి. విస్తృతమైన రేస్ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ .. తమ మార్కెట్, కస్టమర్ల బేస్‌ను మరింతగా పెంచుకునేందుకు సహాయకరంగా ఉండగలదని హాలా మొబిలిటీ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ఈ–ఆటో మార్కెట్లో తాము పటిష్టంగా ఉన్నామని, హాలాతో జట్టు కట్టడం ద్వారా మిగతా విభాగాల్లోకి కూడా గణనీయంగా విస్తరించగలమని రేస్‌ఎనర్జీ సహవ్యవస్థాపకుడు, సీఈవో అరుణ్ శ్రేయాస్ పేర్కొన్నారు. -
బ్రిటన్ ప్రధాని రేసు.. రెండో రౌండ్లోనూ రిషి సునాక్ జోరు
లండన్: బ్రిటన్ ప్రధాని రేసులో ఇవాళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ అత్యధిక ఓట్లతో రెండో దశ ఎన్నికలో ముందంజలో నిలిచారు. అదే సమయంలో.. భారత సంతతికే చెందిన సువెల్లా బ్రావర్మన్ తక్కువ ఓట్లతో పోటీ నుంచి ఎలిమినేట్ అయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ నిర్వహించిన రెండో దశ ఎన్నికల్లో.. 101 ఓట్లతో రిషి సునాక్ ముందంజలో నిలిచారు. పెన్నీ మోర్డాంట్ 83 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇక భారత సంతతికి చెందిన సువెల్లా బ్రావెర్మన్(అటార్నీ జనరల్) పోటీ నుంచి వైదొలిగారు. ప్రధాని రేసులో చాలామంది ఉండడంతో దశల వారీగా బ్యాలెట్ పోలింగ్ నిర్వహించి.. చివరికి ఒకరిని ఎన్నుకుంటారు. మెజార్టీ ఉన్న పార్టీ తరపున అభ్యర్థి కావడంతో కన్జర్వేటివ్ పార్టీ నుంచి చివరగా మిగిలిన వ్యక్తే ప్రధాని(బోరిస్ జాన్సన్ స్థానంలో) అవుతారు. అయితే ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి ఒకవేళ ఎన్నికలకు వెళ్లాలనుకుంటే.. వెళ్లొచ్చు. -
ఊహించని మలుపులు.. ప్రీతి పటేల్ అవుట్
లండన్: బ్రిటన్ రాజకీయాల్లో ఇవాళ కీలక, ఊహించని పరిణామాలే చోటుచేసుకున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థి విషయంలో మాజీ ఛాన్స్లర్ రిషి సునాక్‌కు అవకాశాలు కొంచెం కొంచెంగా మెరుగు అవుతున్నాయి. అదే సమయంలో.. బ్రిటన్ హోం సెక్రెటరీ ప్రీతి పటేల్(50) కీలక నిర్ణయం ప్రకటించారు. ప్రధాని రేసులో తాను దిగట్లేదని కాసేపటి కిందట ఆమె స్పష్టం చేశారు. 2016 బ్రెగ్జిట్ రిఫరెండమ్‌లో డేవిడ్ కామెరున్ క్యాబినెట్ నుంచి బోరిస్ జాన్సన్, మైకేల్ గోవ్తో పాటు ప్రీతి పటేల్ కూడా కీలకంగా వ్యవహరించారు. ఈ తరుణంలో..కన్జర్వేటివ్ పార్టీ తరపున నాయకత్వ రేసులో ఆమె దిగుతారని అంతా భావించారు. అయితే పోటీలో తాను లేనని హోం సెక్రటరీ ప్రీతి సుశీల్ పటేల్ ప్రకటించారు. సహచరుల నుంచి లభిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలని ఆమె పేర్కొన్నారు. అంతకు ముందు ఆమె మద్దతుదారులు.. పోటీ విషయంలో ఆమె ధృడంగా ఉన్నారని, సుదీర్ఘకాలం బ్రెగ్జిటర్గా ఉన్నారని పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రీతి పటేల్‌ను మార్గరేట్థాచర్తో పోల్చారు కొందరు సభ్యులు. అయితే ఆమె మాత్రం పోటీలో ఉండడం లేదని క్లారిటీ ఇచ్చారు. సరిపడా మద్దతు లేనందునే ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది.కానీ, పటేల్‌కు విద్యా మంత్రి ఆండ్రియా జెన్కీన్స్, న్యాయశాఖ మంత్రి టామ్ పుర్సుగ్లోవ్తో పాటు పదమూడు మంది సభ్యుల మద్దతు ఉంది. ఈ మద్దతు కోసం ఇప్పుడు మిగతా సభ్యులు చూస్తున్నారు. మరోవైపు రేసులో ఉన్న రిషి సునాక్(42) భారత సంతతి వ్యక్తికాగా, ప్రతీ కూడా భారత సంతతి వ్యక్తే కావడం గమనార్హం. ఇప్పటికే సువెల్లా బ్రావర్మన్, లిజ్ ట్రుస్స్లు బ్రిటన్ ప్రధాని రేసులో నిలబడ్డారు. ఇదిలా ఉంటే.. ప్రధాని రేసులో నిల్చునే అభ్యర్థి పేరును బ్యాలెట్ పేపర్లో చేర్చాలంటే కనీసం 20 ఎంపీల మద్దతు అయినా అవసరం ఉంటుంది. కన్జర్వేటివ్ పార్టీ తరపున అభ్యర్థి కోసం నిర్వహించిన ఓటింగ్‌లో.. ఊహించని మలుపులు ఇదిలా ఉంటే.. బ్రిటన్ రాజకీయాల్లో ఇవాళ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఉప ప్రధాని డోమినిక్ రాబ్, రవాణా శాఖ మంత్రి గ్రాంట్ షాప్స్లు.. రిషి సునాక్ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రకటన చేశారు. అంతేకాదు.. రాబ్ స్వయంగా సునాక్ ప్రచార ఈవెంట్‌ను లాంచ్ చేశారు ఇవాళ. ఇదిలా ఉంటే.. ప్రధాని రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించిన గ్రాంట్ షాప్స్.. ట్విటర్ ద్వారా సునాక్ అనుభవానికి, అర్హతకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: బ్రిటన్ తదుపరి ప్రధానిని ప్రకటించేంది అప్పుడే! -
గెలుపంటే ఇది అనిపించేలా సాధించింది: వీడియో వైరల్
Despite Losing Shoe She Won Track Race: మనం చాలా క్రీడల్లో చూస్తుంటాం. అసలు వాళ్లు ఆ ఆటలో ఓడిపోతారేమో అనుకునే సమయంలో అందర్నీ ఆశ్చర్యపరిచేలా గెలిచి చూపిస్తారు. అంతెందుకు క్రికెట్ మ్యాచ్ లేదా టెన్నిస్ మరే ఏ ఆటైన ఆ క్రీడాకారులు ఆడుతున్న తీరు చూసి గెలవరని అర్థమైపోతుంది. కానీ వాళ్లు అందరీ అంచనాలను తారుమారు చేసి మరీ మంచి గా ఆడి గెలుస్తారు. అచ్చం అలాంటి సంఘనటనే అమెరికాలో నెబ్రాస్కాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ప్రముఖ బాక్సర్ టెరెన్స్ క్రాఫోర్డ్ కుమార్తె 7 ఏళ్ల తలయా నార్త్‌వెస్ట్ హై స్కూల్లోని స్ప్రింట్ పోటీ(పరుగుల పోటీ) లో పాల్గొంది. ఐతే ఆ ట్రాక్ రేస్ మొదలైనప్పుడూ ఆమె కాలి షూ జారిపోతుంది. దీంతో ఆ రేస్‌లో పాల్గొన్న వాళ్లంతా తలయా కంటే చాలా ముందంజలో ఉన్నారు. కానీ ఆమె ఆ షు వేసుకోవడంలోనే ఉండిపోతుంది. ఆమె పరుగు మొదలు పెట్టేటప్పటికే చాలా ఆలస్యమవుతుంది. ఆ స్టేడియంలో ఉన్న ప్రేక్షకులంతా ఆమె గెలవదనే అనుకుంటారు. కానీ అందరీ అభిప్రాయలను తలకిందులు చేస్తూ అనుహ్యంగా తనతోటి రేసర్లను వెనక్కి నెట్టి మరీ ముందుంటుంది. చివరికీ ఆ పోటీలో ఆమె గెలుస్తుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: పొట్టు పొట్టు చినిగిన నాశనం అయిన షూస్.. ధర తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం) -
వరల్డ్ ఫస్ట్..రేసింగ్ కార్ కన్నా వేగంగా పని..
కార్ల రేస్‌లకు సంబంధించిన పోటీలను టీవీలో చూస్తున్నప్పుడు కొన్ని అత్యంత వేగంగా పల్టీలు కొడుతుండటం చూస్తుంటాం. ప్రమాదానికి గురైన కార్లను రేస్‌కు అడ్డు రాకుండా అంతే వేగంగా తొలగించే కార్యక్రమం కూడా జరుగుతుంటుంది. ఇప్పటివరకు ఈ పనిని పురుషులే చేసేవారు. కానీ, ఈ ప్రపంచంలోకీ ఓ మహిళ అడుగుపెట్టి, తన సత్తా చాటుతోంది. దీంతో వరల్ట్ ఫస్ట్ ఫిమేల్ క్రేన్ డ్రైవర్‌గా 30 ఏళ్ల మరియన్ అల్–బజ్ గుర్తింపు పొందింది. రేస్ పోటీల్లో క్రేన్ డ్రైవర్‌గా ఓ మహిళ నియమితురాలవడం ప్రపంచమంతా గుర్తించదగిన విషయంగా అరబ్ ట్రిబ్యూన్ ప్రకటించింది. ‘మోటార్ ఇంజిన్ల పట్ల ఆమెకున్న మక్కువే ఈ ఏడాది దిరియా ఇ–ప్రిక్స్ 2022లో పాల్గొనేలా చేసింద’ని స్పష్టం చేసింది. పురుషాధిపత్య రంగంలో ఆల్–బజ్ చూపిన సాహసం ఎంతోమంది మహిళల్లో స్థైర్యాన్ని నింపుతోంది. అల్–బజ్ 13 ఏట నుండి వాహనాలను నడపడంలో ఆసక్తి చూపింది. ఈ విషయాల గురించి ఆమె ఇలా ప్రస్తావిస్తుంది. ఆసక్తి నేర్పిన పాఠం ‘ఒక మహిళ ఈ రంగంలోకి ప్రవేశించగలదని ఎవరూ ఎప్పుడూ అనుకొని ఉండరు. మెకానికల్ ప్రపంచమంటేనే పురుషుల ఆధిపత్య వృత్తి. మా నాన్నకు మెకానిక్ పని అంటే చాలా ఇష్టం. ఆయన వద్ద చాలా పాత కార్లు ఉన్నాయి. వాటిని రిపేర్ చేసి, మళ్లీ మార్కెట్లోకి తీసుకువస్తాడు. నా చిన్నప్పటి నుంచి నాన్న చేసే పనిని ఆసక్తిగా చూస్తుండేదాన్ని. మెల్ల మెల్లగా నైపుణ్యాలను తెలుసుకుంటూ, పెంచుకుంటూ వచ్చాను. ఎప్పుడైనా, దేనిలోనైనా ప్రతిభ చూపాలనుకుంటే మా పేరెంట్స్ నాకు పూర్తి మద్దతు ఇస్తారు. అలా చదువుతోపాటు మెకానిక్ పరిజ్ఞానం కూడా అబ్బింది. సాధనతోనే చేరువైన కల ప్రతి కార్తోనూ ఎగ్జిబిషన్స్ లేదా రేసుల్లో పాల్గొనేదాన్ని. దీంతో నా కలను మరింత ముందుకు తీసుకెళ్లగలిగాను. నా ఇన్నేళ్ల జీవితంలో కార్లనే అపరిమితంగా ఇష్టపడ్డాను. రేసింగ్, డ్రిఫ్టింగ్‌లో తగినంత అనుభవం ఉంది. జూన్, 2018లో అరబ్ కంట్రీలో మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేయడంతో రేస్, డ్రైవర్, మెకానిక్ ల వంటి పాత్రలు మహిళలకు అవకాశాలు దక్కేలా చేశాయి. మెకానిక్‌ను కావాలనే నా లక్ష్య సాధనకు ఇది కూడా ఉపయోగపడింది. ఇప్పుడు వీధిలోంచి వెళ్తే చాలు... చుట్టూ ఉన్నవారు నా గురించి తెలుసుకోవడం, గుర్తుపట్టి పలకరించడం, ప్రోత్సహించడం, నా నుంచి నేర్చుకోవాలని ఆసక్తి చూపుతుండటం నాకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. కష్టమైన ఛాలెంజ్ ఈ ఏడాది జరిగిన ఇ–ప్రిక్స్‌లో ఫైర్, రికవరీ, ఫాగ్, ట్రాక్‌సైడ్ వంటి నాలుగు రకాల మార్షల్స్ ఉన్నాయి. వీటిలో నా సామర్థ్యాలను చూసి అధికారులు రికవరీ మార్షల్ బృందానికి రిఫర్ చేశారు. రేసు జరిగేటప్పుడు ట్రాక్‌పై ప్రమాదం జరిగితే వెనువెంటనే వారు తగిన చర్యలు తీసుకుంటారు. ఇన్నాళ్లూ రికవరీ మార్షల్‌గా ఉండటం మహిళలకు కష్టమైన పనిగా పరిగణించ బడింది. సర్క్యూట్లో ప్రమాదం జరిగినప్పుడు వీలైనంత త్వరగా కార్లను తీయడానికి క్రేన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. నా పని ఎంత వేగంగా చేయాలంటే రేసు ప్రవాహానికి అడ్డుపడనంత స్పీడ్‌గా ఉండాలి. ఏదైనా కారు రోడ్ బ్లాక్‌కు కారణమయితే, ఇతర రేసర్లకు అడ్డు అవుతుంది. అందుకే, ఈ వృత్తిలో ఏమాత్రం అలక్ష్యం చేయకుండా ప్రతి క్షణం అలర్ట్‌గా ఉండాలి’ అని తన పని గురించి వివరిస్తుంది అల్–బజ్. ఈ యువ డ్రైవర్ నేర్చుకున్నది మెకానిక్ పని. చదువు మాత్రం పూర్తి భిన్నమైది. లెబనాన్‌లో సైకాలజీ అండ్ మీడియాకు సంబంధించిన కోర్సులు పూర్తి చేసింది. కానీ, మోటార్ కార్ల ప్రపంచంలో తనని తాను నిరూపించుకోవడానికి ముందుంటుంది. తన మెకానిక్ నైపుణ్యాలతో ఇతరులకు శిక్షణ కూడా ఇస్తోంది. సొంతంగా ఆటోమొబైల్ రిపేర్ షాప్‌ను నిర్వహించాలనుకుంటున్న అల్–బజ్ డేరింగ్ డ్రైవర్‌గా మన్ననలు అందుకుంటోంది. -
కర్నూలులో వింత ఆచారం: భేష్.. గార్ధభాల రేస్
కోవెలకుంట్ల: మనలో చాలామందికి గుర్రాల పరుగు పందేలు తెలుసు. వృషభాల బండలాగుడు పోటీలు కూడా చూసే ఉంటారు. ఈ కోవలోనే గాడిదల (గార్ధభాలు)కూ పరుగు పందేలు ఇటీవల కాలంలో నిర్వహిస్తున్నారు. తరతరాల నుంచి ప్రజలు గాడిదలను బరువులు మోసేందుకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో కొండప్రాంతాల నుంచి ధాన్యం, అటవీ సంపదను గార్ధభాలపై వేసుకుని ఒకచోట నుంచి మరో చోటకు తరలించేవారు. జంతు బలప్రదర్శన పోటీలపై ఆసక్తి ఉన్న కొందరు వ్యక్తులు ఇటీవల గార్ధభాలను పెంచి పోషిస్తున్నారు. జిల్లాలోని కోవెలకుంట్ల, చాగలమర్రి, ఆళ్లగడ్డ, రుద్రవరం, బనగానపల్లె, అవుకు, కోడుమూరు, ఆదోని, పత్తికొండ, కల్లూరు, వెలుగోడు, తదితర మండలాల్లో గార్ధభాలను ప్రత్యేకంగా పెంచుతున్నారు. బలవర్ధక ఆహారం పోటీలకు పెంచే గార్ధభాలకు బలవర్ధక ఆహారం అందజేస్తున్నారు. కేవలం దాణారూపంలో పెసలు, ఉలవలు, వడ్లగింజలు, కొర్రలు, కొర్ర పిండి, బెల్లం, తదితర పప్పుదినుసులతోపాటు వివిధ పండుగల సందర్భంగా కజ్జికాయలు కూడా ఆహారంగా అందజేస్తున్నారు. పశుగ్రాసంతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో రోజుకు 750 గ్రాముల దాణాను ఆహారంగా ఇస్తున్నారు. పోటీలకు నిర్ణీత సమయం పరుగుపందెం పోటీల్లో ఇసుక సంచుల బరువుతో గార్ధభాలు నిర్ణీత పది నిమిషాలు సమయంలో నిర్దేశించిన దూరం పరుగెత్తాలి. సంజామల మండలం ఆల్వకొండ క్రాస్ సమీపంలో కాశినాయన ఆరాధనోత్సవాల సందర్భంగా ఇటీవల నిర్వహించిన పోటీల్లో ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి గ్రామానికి చెందిన యోహాన్ గార్ధభం నిర్ణీత సమయంలో 11వేల అడుగుల దూరం పరుగెత్తి విజేతగా నిలిచి రూ.20 వేలు బహుమతి కైవసం చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన నాగవైష్ణవి గార్ధభం 10,700 అడుగులు, చాగలమర్రి మండలం పెద్ద వంగలికి చెందిన పాములేటి గార్ధభం 10,500 అడుగుల దూరం పరుగెత్తి తర్వాతి రెండు, మూడుస్థానాల్లో రూ.10వేలు, రూ.8 వేలు గెలుపొందాయి. పండుగలు, తిరుణాళ్లలో పోటీలు ఏటా ఉగాది, శ్రీరామ నవమి, సంక్రాంతి పండుగలతోపాటు కాశినాయన ఆరాధోత్సవాలు, పాండురంగస్వామి బ్రహ్మోత్సవాలు, గ్యార్మీ, అమ్మవారి జాతరల సందర్భంగా కర్నూలు, నంద్యాల, చాగలమర్రి, ఆల్వకొండ, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల్లో ఎక్కువగా గార్ధభాల పరుగు పందెం పోటీలను నిర్వహిస్తున్నారు. నిర్వాహకుల నుంచి పోటీల సమాచారం తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో గార్ధభాలను పెంచే వారు పందేలకు కొన్ని రోజుల ముందు మరోసారి శిక్షణ ఇచ్చి పోటీల్లో పాల్గొంటున్నారు. రూ.లక్ష వరకు ధర పరుగు పందెం పోటీలకు ఉపయోగించే గార్ధభాల ధర మార్కెట్లో సైజును బట్టి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతోంది. వివిధ సైజుల్లోని గార్ధభాలను కొనుగోలు చేసిన వారు వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి పోటీలకు సిద్ధం చేస్తున్నారు. పోటీల్లో పాల్గొనే గార్ధభాలకు ఆయాసం రాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో పరిగెత్తించడం, పోటీలకు తగ్గట్టు ఇసుకను సంచుల్లో నింపి పరుగుపందెం ప్రాక్టీస్ చేయిస్తారు. వాటిపై ఇసుక సంచులు తాళ్లతో కట్టి పోటీలకు దింపుతారు. పోటీలలో గార్ధభం దాదాపు 200 కిలోల బరువుతో పరిగెత్తాల్సి ఉంటుంది. రూ.42 వేలతో కొన్నా వైఎస్సార్ జిల్లా జంగాలపల్లెలో నెల రోజుల క్రితం రూ.42 వేలు వెచ్చించి గార్ధభాన్ని కొన్నాను. ఆ జిల్లాలో పది పర్యాయాలు పరుగు పందెం పోటీల్లో పాల్గొని అది బహుమతులు కైవసం చేసుకుంది. ఆ గార్ధభాన్ని కొనుగోలు చేశాక ఇటీవల ఒంగోలు, ఆల్వకొండ ప్రాంతాల్లో జరిగిన పోటీలకు తీసుకెళ్లాను. – సుధాకర్, కోవెలకుంట్ల చాకిరేవు వృత్తితోపాటు పోటీలకు చాకిరేవు వృత్తితోపాటు గార్ధభం పోటీలపై ఆసక్తి ఉండటంతో ఏడాది క్రితం కర్నాటక రాష్ట్రంలో రూ.50 వేలు వెచ్చించి గార్ధభాన్ని కొనుగోలు చేశాను. ప్రతి రోజు జొన్నలు, వడ్లు కలిపి ఆహారంగా పెడుతున్నాను. ఇప్పటి వరకు నంద్యాల, అయ్యలూరు, చిన్నవంగలి, ఆల్వకొండలో జరిగిన పోటీల్లో పాల్గొన్నాను. – సుబ్బరాయుడు, ముక్కమల్ల, సంజామల మండలం -
వెన్నులో వణుకుపుట్టించిన దృశ్యం.. గాల్లో కార్ల రేసింగ్
ఫార్ములా వన్ రేసింగ్... కార్లు జెట్‌స్పీడ్‌లో ట్రాక్‌మీద దూసుకుపోతుంటే... ఊపిరి బిగబట్టి చూడటం ప్రేక్షకుల వంతవుతుంది. ఇక అవే కార్లు గాల్లో ఎగిరిపోతుంటే ఉండే థ్రిల్ అంతా ఇంతా కాదు. వినడానికే వెన్నులో వణుకు పుట్టిస్తోన్న ఈ ఎగిరేకార్ల రేసింగ్ గురువారం నాడు ఆస్ట్రేలియాలో జరిగింది. దీపావళి పండుగరోజు మన దగ్గర రాకెట్ పటాకులు ఆకాశంలో కాంతులీనితే... ఆస్ట్రేలియాలో మాత్రం రెండు కార్లు గాల్లో దూసుకుపోయాయి. ఎయిర్‌స్పీడర్ సంస్థ ఎక్సా సిరీస్ పేరుతో నిర్వహించిన ఫ్లయింగ్ కార్స్ రేస్‌లో అలౌడా ఎరోనాటిక్స్ కంపెనీ తయారు చేసిన ఎమ్కె3 (ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్ అండ్ల్యాండింగ్) కార్లు పాల్గొని విజయవంతంగా రేస్ పూర్తి చేశాయి. రన్‌వే అవసరమే లేదు... ఈ కార్లను నిపుణులైన ఆపరేటర్స్ రిమోట్ సా యంతో (డ్రోన్ల మాదిరిగా) కంట్రోల్ చేశారు. ఈ ఎమ్కె3 ఎగిరే కార్లు టేకాఫ్ అయిన 2.3 సెకన్లలోనే గంటకు వంద కి.మీ. వేగాన్ని అందుకోగలవు. సాధారణంగా విమానం, హెలికాప్టర్ టేకాఫ్ అవ్వడానికి రన్‌వే అవసరం. కానీ.. ఈ కార్లలో ఉన్న వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ కోసం థర్డ్ డైమెన్షన్‌ను యాడ్ చేశారు. దీంతో ఉన్న చోటనుంచే గాల్లోకి ఎగరగలదు కారు. 2022 నాటికి పైలట్ నడిపేట్టుగా... దాదాపు వంద కేజీల బరువున్న ఈ కార్లను కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. పైలట్ నడపాలంటే మాత్రం ఎమ్కె 4 తయారు చేయాలంటోంది కంపెనీ. 2022 కల్లా సాధ్యం చేసి చూపిస్తామని చెబుతోంది. క్షణాల్లో బ్యాటరీ రిప్లేస్మెంట్... సాధారణంగా ఫార్ములావన్ రేసింగ్‌లో ఫ్లాట్ టైర్ అయితే క్షణాల్లో మార్చే అవకాశం ఉంటుంది. ఫ్లయింగ్ కార్లలోనూ బ్యాటరీ రిప్లేస్మెంట్ వేగంగా చేయడం కోసం స్లైడ్ అండ్ లాక్ సిస్టమ్ రూపొందించారు. కారు గాల్లో ఉన్నప్పుడు రోటర్ లేదా బ్యాటరీ సిస్టమ్ ఫెయిల్ అయినా సురక్షితంగా ల్యాండయ్యేలా రూపొందించారు. సో పైలట్ సేఫ్. 2050 నాటికి లక్షల కోట్ల ఇండస్ట్రీ... జాబీ, అలౌడా, జెట్సన్, మేజర్ వంటి ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీలన్నీ ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ వాహనాల మీద పనిచేస్తున్నాయి. ఈ ‘ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఇండస్ట్రీ’ 2050 సంవత్సరం నాటికి లక్షన్నర కోట్ల పరిశ్రమగా అవతరిస్తుందని మోర్గన్ స్టాన్లీ అంచనా. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
గ్రామ సింహాలు.. పరుగో పరుగు
గట్టు (గద్వాల): మండలంలోని పెంచికలపాడులో చౌడేశ్వరిదేవి జాత రను పురస్కరించుకొని సోమవారం గ్రామ సింహాల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 12 గ్రామ సింహాలు పోటీల్లో పాల్గొన్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలోని అక్షాలకు చెందిన రాణి అనే గ్రామ సింహం మొదటి బహుమతి దక్కించుకోగా.. దాత ఆశప్ప రూ.10,016ను అందజేశారు. అలాగే ఏపీలోని గుడికల్‌కు చెందిన లక్కీ అనే గ్రామ సింహం ద్వితీయ స్థానంలో నిలవగా దాత నర్సింహులు రూ.5,016, ఆత్మకూరుకు చెందిన యువరాజు అనే గ్రామ సింహం తృతీయ స్థానంలో నిలవగా దాత శివప్ప రూ.3,016లను అందజేశారు. కార్యక్రమంలో న్యాయవాది శ్రీదర్శన్‌రెడ్డి, ఉపసర్పంచ్ ఆంజనేయులు, రాఘవేంద్ర, హలీంపాష, తిమ్మప్ప, సలీం, మహాదేవప్ప, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
సౌదీ అరేబియాలో ఎఫ్1 రేస్
దుబాయ్: ఫార్ములా వన్ (ఎఫ్1) రేసు క్యాలెండర్లో సౌదీ అరేబియా అరంగేట్రం చేయనుంది. వచ్చే ఏడాది జరిగే ఎఫ్1 సీజన్లో సౌదీలోని జిద్దా నగరాన్ని చేరుస్తూ ఎఫ్1 నిర్వాహకులు గురువారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సౌదీ ఆటోమొబైల్, మోటార్ సైకిల్ సమాఖ్య (ఎస్ఏఎమ్ఎఫ్)తో ఒప్పందం కుదిరినట్లు వారు పేర్కొన్నారు. కొత్తగా నిర్మించిన జిద్దా నగర శివార్లలోని ‘కార్నిక్’ వద్ద వద్ద స్ట్రీట్ ట్రాక్‌పై 2021 నవంబర్‌లో ఈ రేసును నిర్వహిస్తున్నట్లు ఎఫ్1 తెలిపింది. ఎర్ర సముద్రానికి సమాంతరంగా ఉండే ఈ ట్రాక్ చూపరులకు కనువిందు చేస్తుందని వెల్లడించింది. ‘ఎఫ్1 సీజన్లోకి సౌదీ అరేబియాను ఆహ్వానిస్తున్నాం’ అని ఎఫ్1 సీఈవో చేస్ క్యారీ వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశాల్లో బహ్రెయిన్, అబుదాబిలు ఇప్పటికే ఎఫ్1 సీజన్‌ల్లో ఏటా రేస్‌లకు ఆతిథ్యమిస్తూ వస్తున్నాయి. సౌదీ రాజధాని రియాద్‌లో 2030 నాటికి ఫార్ములా వన్ రేసును నిర్వహించేలా... ట్రాక్‌ను కూడా నిర్మిస్తున్నారు. 2021 ఎఫ్1 సీజన్ క్యాలెండర్ పూర్తయిందని... త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తామని క్యారీ తెలిపారు. సౌదీ దేశంలో ఉండే తీవ్ర ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ఈ రేస్‌ను రాత్రి వేళ నిర్వహించే ప్రతిపాదన కూడా ఉంది.