చంపేస్తా.. భాయ్‌కు బెదిరింపులు | Police disrupts Salman Khan's Race 3 shooting after 3 men threaten to kill him in Mumbai | Sakshi
Sakshi News home page

చంపేస్తా.. భాయ్‌కు బెదిరింపులు

Published Fri, Jan 12 2018 12:42 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

Police disrupts Salman Khan's Race 3 shooting after 3 men threaten to kill him in Mumbai - Sakshi

‘సల్మాన్‌ని చంపేస్తాను’ అంటూ  రాజస్థాన్‌ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణొయి సంచలన వ్యాఖ్య  చేశారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ ఖాన్‌ ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అందులో భాగంగా జోద్‌పూర్‌ కోర్టులో హాజరయ్యారు. ఆ తర్వాతి రోజే రాజస్థానీ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణొయి మర్డర్‌ కేసులు, కార్‌ జాకింగ్, కిడ్నాప్‌ వంటి ఆరోపణల మీద కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో సల్మాన్‌ను చంపేస్తాం అంటూ సెన్సేషనల్‌ కామెంట్‌ చేశారు.

ఇంతకీ సల్మాన్‌ మీద బిష్ణాయికి ఎందుకంత కోపం అంటే.. ఓ కారణం ఉంది. లారెన్స్‌ వాళ్లు రాజస్థానీ తెగలకు చెందిన వాళ్లు. ఈ కమ్యూనిటీ వాళ్లు కృష్ణ జింకను దైవంగా కొలుస్తారట. అందుకే సల్మాన్‌ని చంపేస్తామని బెదిరించారు. ఈ బెదిరింపులను తేలికగా తీసిపారేయడానికి లేదని ‘రేస్‌ 3’ బృందం అంటోంది. ప్రస్తుతం సల్మాన్‌ నటిస్తోన్న చిత్రం ఇది. ఈ షూటింగ్‌ స్పాట్‌ చుట్టూ కొంతమంది అనుమానాస్పదంగా కనిపించారట. ఈ విషయాన్ని ముంబై పోలీసులు గ్రహించారట. వెంటనే రంగంలోకి దిగి, ‘రేస్‌ 3’  సినిమా షూటింగ్‌ లొకేషన్‌కి వెళ్లి, సల్మాన్, చిత్రనిర్మాతలను కలిసి షూటింగ్‌ని నిలిపివేయాలని కోరారు.

కట్టుదిట్టమైన భద్రత మధ్య సల్మాన్‌ ఖాన్‌ని బాంద్రాలోని అతని ఇంటి దగ్గర దింపారు. సల్మాన్‌ కొన్ని రోజులు పాటు తన నివాసంలో ఉండటమే క్షేమమని భావించిన ముంబాయి పోలీస్‌లు.. కొన్ని రోజులు పాటు షూటింగ్స్‌ కూడా నిలిపివేయాలని కోరారు. ఎక్కడ ఉంటున్నాడనే విషయాన్ని ఎవరి దగ్గరా చెప్పొద్దనీ, సోషల్‌ మీడియా ద్వారా పంచుకోవద్దని కూడా కోరారు. సల్మాన్‌ ఖాన్‌ వీలున్నప్పుడల్లా ముంబై వీధుల్లో సైకిల్‌ మీద షికార్లు చేస్తుంటారు. కొన్ని రోజుల పాటు సైక్లింగ్‌ వద్దన్నారు. ‘‘సల్మాన్‌కు మాగ్జిమమ్‌ పోలీస్‌ ప్రొటెక్షన్‌ ఇస్తున్నాం’’ అని ముంబై పోలీసులు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement