salmankhan
-
Salman Khan : రెండు గంటలే నిద్రపోతా! నిపుణులు ఏమంటున్నారంటే..!
బాలీవుడ్ ప్రముఖ నటుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉంటుంది. ఈ వయసులో కూడా ఆయన కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్లో గ్లామర్‌గా ఉంటారు. ఇప్పటికీ అదేవిధంగా బాడీ మెయంటైన్ చేస్తూ తన అభిమానులను ఖుషి చేస్తుంటారు. సల్మాన్ సినిమా అనగానే ప్రేక్షకుల అంచనాలే వేరేలెవెల్లో ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే తన అభినయంతో మెప్పించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు సల్మాన్. అంతేగాదు ఆయన నటనకు గానూ ఎన్నో అవార్డు వరించాయి కూడా. ఆయన తన మేనల్లుడు అర్హాన్ ఖాన్‌తో జరిగిన సంభాషణలో తన జీవనశైలి గురించి మాట్లాడారు. అది వింటే అన్ని గంటలేనా నిద్ర అని విస్తుపోతారు. అయితే నిపుణులు మాత్రం అది మంచిది కాదంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మరీ సల్మాన్ ఏం చెప్పారు. ఎంతసేపు నిద్రపోతే ఆరోగ్యం సురక్షితం తదితరాల గురించి చూద్దామా..!.సల్మాన్ ఖాన్ ఇటీవల తన మేనల్లుడు అర్హాన్ ఖాన్‌తో జరిగిన సంభాషణలో తాను సాధారణంగా రెండు గంటలే పడుకుంటానంటూ బాంబు పేల్చారు. ఎప్పుడో నెలకు ఒకసారి మాత్రమే ఏడు నుంచి ఎనమిది గంటలు పడుకుంటానని అన్నారు. అందువల్లే ఒకోసారి సెట్లో చిన్న విరామాలో నిద్రపోతానని అన్నారు. 59 ఏళ్ల సల్మాన్ తనకు వేరే పనిలేకపోతేనే నిద్రపోతానని చెబుతున్నారు. ముఖ్యంగా తాను జైల్లో ఉన్నప్పుడు బాగా నిద్రపోయానని అన్నారు. అలాగే విమానంలో కూడా నిద్రపోతానని అన్నారు. ఇదే మాదిరిగా షారుక్ కూడా ఒకనొక సందర్భంలో తన నిద్ర షెడ్యూల్ గురించి మాట్లాడారు. తాను ఉదయం 5 గంటలకు నిద్రపోయి 9 గంటలకు మేల్కొంటానని అన్నారు. ఇలా నిద్రపోతే మంచిదేనా అంటే..క్రమరహితమైన నిద్ర ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ప్రతి వ్యక్తి రాత్రి 7 నుంచి 9 గంలటకు నిద్రపోవాలని నొక్కి చెబుతున్నారు. నిద్రలేమి వల్ల ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్, డిప్రెషన్, చిత్తవైకల్యం, కొన్ని రకాల కేన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు. దీని కారణంగా డ్రైవింగ్ సామర్థ్యం కూడా బలహీనపడుతుందని చెబుతున్నారు నిపుణులు. మొత్తం నిద్రను ఒకేసారి పూర్తి చేయడం మంచిది. రాత్రిపూటకే ప్రాధాన్యత ఇవ్వాలి లేదంటే పగటిపూట అంతేస్థాయిలో సమతుల్య నిద్రను పూర్తిచేయాలి. నిద్ర స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. ఒకే సమయానికి పడుకోవడం, మేల్కొనడం వంటివి చేయాలి. స్థిరమైన నిద్ర షెడ్యూల్ మొత్తం మెరుగైన ఆరోగ్యంతో ముడిపడి ఉందని చెబుతున్నారు వైద్యులు .(చదవండి: నీట్ ఎగ్జామ్ పాసైన 62 ఏళ్ల డాక్టర్.. స్టూడెంట్‌గా కాలేజ్‌లో..!) -
సల్మాన్ ఖాన్ తో సంక్రాంతికి వస్తున్నాం..
-
అనంత్ అంబానీ - రాధిక హల్దీ : హాట్ టాపిక్‌గా సల్మాన్ ఖాన్ వాచ్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు సందడి చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో స్టయిల్‌తో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. తాజాగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్ రీవెడ్డింగ్ బాష్‌లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ధరించిన వాచ్ హాట్ టాపిక్గానిలిచింది.అనంత్ అంబానీకి ఎంగేజ్మెంట్మొదలు, తొలి, రెండో క్రూయిజ్ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్, ఇలా ప్రతీవేడుకలోనూ సల్మాన్ హాజరు తప్పకుండా ఉండాల్సిందే. ఇటీవల అనంత్-రాధిక సంగీత్‌లో కూడా అనంత్‌తో కలిసి స్టెప్పులేశారు. ఇక హల్దీ వేడుకలో సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచ్‌తో పాటు ఆల్-బ్లాక్ లుక్‌తో అలరించాడు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన డైమండ్స్ పొదిగిన వాచ్ అందర్నీ ఆకర్షించింది. అయితే సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచెస్ ధరించడం కొత్తేం కాదు. కోట్ల విలువ చేసే లగ్జరీ వాచెస్ కలెక్షన్ విలవ కోట్ల రూపాయకుపైమాటే. తాజాగా లగ్జరీ బ్రాండ్ పాటెక్ ఫిలిప్ రెయిన్ బో (Patek Philippe Rainbow Watch) కి చెందిన వాచ్ ధరించాడు. ఆక్వానాట్ లూస్ రెయిన్బో మినిట్ రిపీటర్ హాట్ జ్యూయిలరీ వాచ్ సుమారు 130 వజ్రాలతో పొదిగి ఉందట. దీని ధర దాదాపు రూ. 23.54 కోట్లు ఉంటుందని అంచనా.కాగాజూలై 12న అనంత్, రాధిక వివాహ వేడుక మూడు రోజుల పాటు ఘనంగా జరగ బోతోంది. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology) -
ఆర్జీవి పై సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
-
దబాంగ్ 3: అదిరిపోయిన ఫస్ట్‌లుక్
దబాంగ్ సిరీస్‌తో చుల్‌బుల్‌పాండేగా అలరించిన కండలవీరుడు సల్మాన్‌ఖాన్ దబాంగ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ మోషన్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు. చుల్బుల్ పాండే గెటఫ్లో సల్మాన్ మరోసారి అదిరిపోయారు. పోస్టర్‌పై 'స్వాగతించారా' అనే క్యాప్షన్ హైలెట్‌గా నిలిచింది. ప్రభుదేవా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తున్నారు. దబాంగ్ మొదటి రెండు బాగాల్లో కనిపించిన అర్బాజ్‌ఖాన్, మహీగిల్ తమ పాత్రలను నిలుపుకోగా, కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ విలన్ పాత్ర పోషించనున్నాడు. కాగా డిసెంబర్ 20న దబాంగ్ 3 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా హిందీతో పాటు తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లోనూ విడుదల కానుంది. -
దబాంగ్ 3లో...
‘దబాంగ్’ చిత్రం సల్మాన్ ఖాన్ కెరీర్లో పెద్ద హిట్స్‌లో ఒకటి. ఆల్రెడీ ఈ సినిమాకి ఓ సీక్వెల్ కూడా వచ్చింది. ఇప్పుడు మూడో భాగం రూపొందించే పనిలో పడ్డారు హీరో సల్మాన్ ఖాన్, దర్శకుడు ప్రభుదేవా. మూడో భాగాన్ని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు ప్రభుదేవా. అందుకే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కన్నడ నటుడు సుదీప్‌ను తీసుకోవాలనుకుంటున్నారట. సుదీప్‌కు బాలీవుడ్లో యాక్ట్ చేయడం కొత్తేమీ కాదు. ఆల్రెడీ రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ‘ఫూంక్’తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చారు సుదీప్. ఆ తర్వాత ‘ఫూంక్ 2, రక్త చరిత్ర’ సినిమాలతో బాలీవుడ్ ఆడియన్స్‌ని పలకరించారు. ఇప్పుడు ‘దబాంగ్ 3’తో బాలీవుడ్ ఆడియన్స్‌కు మరోసారి హాయ్ చెప్పనున్నారీ కన్నడ స్టార్ హీరో. ఇందులో సుదీప్ది విలన్ క్యారెక్టర్ అని సమాచారం. -
ఆ నటికి కళ్లుచెదిరే రెమ్యూనరేషన్
సాక్షి, న్యూఢిల్లీ : గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా రెమ్యూనరేషన్ సైతం చుక్కలను తాకుతోంది. బాలీవుడ్ సూపర్స్టార్లకు దీటుగా ఆమె పారితోషికం వసూలు చేస్తోంది. అమెరికన్ సిరీస్ క్వాంటికోతో అంతర్జాతీయ స్టార్‌గా మారిన ప్రియాంకకు తాజాగా సల్మాన్ సరసన భారత్ మూవీలో నటించేందుకు చిత్ర నిర్మాతలు ఏకంగా 6.5 కోట్లు ముట్టచెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారత్‌ను సుల్తాన్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జఫర్ తెరకెక్కిస్తున్నారు. సల్మాన్, ప్రియాంకతో పాటు మూవీలో దిశా పటానీ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈద్‌కు సందడి చేయనున్న ఈ సినిమాను సల్మాన్ బావ మరిది అతుల్ అగ్నిహోత్రి నిర్మిస్తున్నారు. ఇక అమెరికన్ సింగర్, బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనాస్‌తో సన్నిహితంగా మెలుగుతున్న ప్రియాంక త్వరలోనే వివాహంతో ఒక్కటి కావాలని వీరు నిర్ణయించుకున్నట్టు సమాచారం. -
సల్మాన్‌కు ఐదేళ్ల జైలు
జోధ్‌పూర్: కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్(52)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 1998 నాటి ఈ కేసులో జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు అతనిని దోషిగా నిర్ధారిస్తూ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కోర్టు తీర్పు అనంతరం సల్మాన్ ఖాన్‌ను పోలీసులు జోధ్‌పూర్ కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సహ నటులు సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సొనాలీ బెంద్రెలతో పాటు స్థానిక వ్యక్తి దుష్యంత్ సింగ్‌ను ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. జైలు శిక్ష మూడేళ్లకు మించి ఉండడంతో బెయిల్ కోసం సల్మాన్ పైకోర్టులో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు నిలుపుదల/బెయిల్ కోసం సెషన్స్ కోర్టులో అప్పీలు చేస్తామని సల్మాన్ తరఫు న్యాయవాది ఆనంద్ దేశాయ్ తెలిపారు. దేశమంతా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి జోధ్‌పూర్ కోర్టు వద్ద హడావుడి వాతావరణం కొనసాగింది. మీడియా ఎప్పటికప్పుడు కోర్టు వద్ద పరిణామాల్ని ప్రసారం చేసింది. సల్మాన్ అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా కోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ కేసులో మార్చి 28నే తుది వాదనలు ముగియగా.. చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ దేవ్ కుమార్ ఖత్రి తీర్పును రిజర్వ్ చేశారు. గురువారం ఉదయం సల్మాన్‌తో పాటు, సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సొనాలీ బెంద్రెలు కోర్టు హాజరైన అనంతరం జడ్జి తీర్పు కాపీని చదువుతూ ‘వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని 9/51 సెక్షన్ కింద సల్మాన్‌ను దోషిగా తేలుస్తూ ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తున్నా’ అని పేర్కొన్నారు. ‘నిందితుడు ప్రముఖ నటుడు కావడం వల్ల అతడి చర్యల్ని ప్రజలు అనుసరిస్తారు’ అని జడ్జి చెప్పారు. సల్మాన్‌కు ‘బెనిఫిట్ ఆఫ్ ద ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్’ను వర్తింప చేయాలని అతని తరఫు న్యాయవాదులు వాదించారు. ‘కేసులోని వాస్తవాల్ని, నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆ యాక్ట్‌ను వర్తింపచేయడం న్యాయసమ్మతం కాదు’ అని జడ్జి పేర్కొన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సల్మాన్ సోదరీమణులు అల్విరా, అర్పితలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కేసులో 9/51 సెక్షన్ కింద గరిష్టంగా ఆరేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. తీర్పు అనంతరం పలువురు బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్ పట్ల సానుభూతి ప్రకటించగా.. తీర్పును జంతు హక్కుల కార్యకర్తలు స్వాగతించారు. గతంలోనూ ఇదే జైల్లో..: కోర్టు తీర్పు అనంతరం పోలీసులు సల్మాన్‌ను బొలెరో వాహనంలో జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా రెండు కిలోమీటర్ల మేర.. మీడియా సిబ్బంది కవరేజ్, భద్రతా సిబ్బంది పహారాతో హంగామా నెలకొంది. జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో సల్మాన్ శిక్ష అనుభవించడం ఇది నాలుగోసారి.. వన్యప్రాణుల్ని వేటాడిన కేసుల్లో గతంలో 1998, 2006, 2007ల్లో మొత్తం 18 రోజులు జోధ్‌పూర్ జైల్లో సల్మాన్ గడిపారు. కృష్ణ జింక కేసు సాగిందిలా.. 1998, అక్టోబర్ 2: సల్మాన్‌తో పాటు సైఫ్ అలీఖాన్, సోనాలీ బెంద్రె, టబు, నీలంపై రాజస్తాన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2006, ఏప్రిల్ 10: ట్రయల్ కోర్టు సల్మాన్‌ను దోషిగా ప్రకటించి అయిదేళ్లు జైలు శిక్ష, 25 వేల రూపాయల జరిమానా విధించింది. వారం పాటు జైల్లో ఉన్న సల్మాన్ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. 2006, ఆగస్టు 31: ట్రయల్ కోర్టు తీర్పుపై రాజస్తాన్ హైకోర్టు స్టే. 2016, జులై 25: సల్మాన్‌ను నిర్దోషిగా విడుదల చేసిన హైకోర్టు. 2016, నవంబర్ 11: హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన రాజస్తాన్ ప్రభుత్వం.. కేసును మళ్లీ విచారించాలని జోధ్‌పూర్ ట్రయల్ కోర్టును ఆదేశించిన సుప్రీం కోర్టు. ఖైదీ నెంబర్ 106 లక్షలాది మందికి సల్మాన్ అభిమాన హీరో కావచ్చు.. అయితే జోధ్‌పూర్ జైల్లో మాత్రం అతను ఖైదీ నెంబర్ 106. రేప్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు గదికి పక్కనే ఉన్న బ్యారక్‌ను సల్మాన్‌కు కేటాయించారు. తొలి రోజు జైల్లో సల్మాన్‌కు పప్పు, చపాతీ ఇవ్వగా తినేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. సల్మాన్‌ను సాధారణ ఖైదీగానే చూస్తామని, అతని గదిలో చెక్క మంచం, రగ్గు, కూలర్ మాత్రమే ఉన్నాయని జైలు సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ చెప్పారు. కేసుల వీరుడు సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో మంచిపేరు సంపాదించుకున్న సల్మాన్ జీవితం ఆ తర్వాత పూర్తిగా వివాదాలమయమే. కేసులు, కోర్టుల చుట్టూ తిరగడం, కటకటాల జీవితం అలవాటుగా మారిపోయింది. సల్మాన్ కేసుల చిట్టాలను ఒకసారి పరిశీలిస్తే.. జోధ్‌పూర్ జైల్లోని జైలర్ కార్యాలయంలో సల్మాన్‌ఖాన్ కృష్ణ జింకల కేసు (1998) హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ సమయంలో రాజస్తాన్‌లోని కంకణి గ్రామంలో రెండు కృష్ణ జింకల్ని సల్మాన్ కాల్చి చంపారని కేసు నమోదైంది. 20 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సల్మాన్‌ను జో«««ద్‌పూర్ ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అక్రమ ఆయుధాల కేసు (1998) కృష్ణ జింకల్ని చంపే సమయంలో సల్మాన్ వద్ద అక్రమ ఆయుధాలు ఉన్నాయంటూ కేసు నమోదైంది. కృష్ణ జింకల్ని వేటాడడానికి అమెరికాలో తయారైన .22 రైఫిల్, .32 రైఫిల్ వాడారని అభియోగాలు నమోదయ్యాయి. 2017, జనవరి 18న కోర్టు ఈ కేసును కొట్టేసింది. సల్మాన్ అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంది. చింకారా కేసు (1998) హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ సమయంలోనే సల్మాన్ మూడు చింకారా (లేళ్లు)లను వేటాడారని మరో కేసు నమోదైంది. సల్మాన్ ఖాన్ భావాడ్ గ్రామంలో రెండు లేళ్లు, మాంథానియా గ్రామంలో మరో లేడిని వేటాడారని వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి. 2006లో ట్రయల్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించినా, 2017లో రాజస్థాన్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. హిట్ అండ్ రన్ కేసు (2002) ముంబైలోని బాంద్రా వీ«ధుల్లో ఫుట్‌పాత్‌పైకి కారు నడిపి ఒకరి మృతికి కారణమయ్యాడని సల్మాన్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు సల్మాన్‌ను దోషిగా నిర్ధారించినా..2015లో ముంబై హైకోర్టు సల్మాన్‌ను నిర్దోషిగా తేల్చింది. కృష్ణ జింకల ప్రేమికులు..బిష్ణోయి ప్రజలు వన్యప్రాణుల పరిరక్షణ చట్టం కింద ఎన్ని కఠిన శిక్షలున్నా.. మూగజీవాల్ని పొట్టనబెట్టుకుంటున్న వేటగాళ్లను శిక్షించడం మనదేశంలో అంత సులువుకాదు. ఇక సరదా కోసం వన్యప్రాణుల్ని చంపే ప్రముఖుల్ని పట్టుకోవడం దాదాపు అసాధ్యమే. బిష్ణోయ్ ప్రజలు పోరాడకుండా ఉంటే సల్మాన్ విషయంలోను అదే జరిగేదేమో.. ఎంతో ఇష్టంగా చూసుకునే కృష్ణ జింకల్ని సల్మాన్ పొట్టన పెట్టుకోవడం కళ్లారా చూసిన రాజస్తాన్‌లోని బిష్ణోయ్ తెగ ప్రజలు.. అతను జైలుకెళ్లే వరకూ పోరాటాన్ని కొనసాగించారు. కృష్ణ జింకల కేసులో సల్మాన్‌కు జైలు శిక్ష నేపథ్యంలో కేసు పూర్వాపరాల్ని ఒకసారి పరిశీలిస్తే.. సల్మాన్‌ను వెంటాడిన కంకణి గ్రామస్తులు 1998, అక్టోబర్ 1.. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్లో ఉన్న సల్మాన్ ఇతర బాలీవుడ్ తారలతో కలిసి సమీపంలోని కంకణి గ్రామంలో రెండు కృష్ణ జింకల్ని వేటాడారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. స్థానికంగా నివసించే బిష్ణోయి తెగ ప్రజలకు తుపాకీ చప్పుళ్లతో పాటు జింకల అరుపులు వినిపించాయి. కృష్ణ జింకల పరిరక్షణను యజ్ఞంలా నిర్వహిస్తున్న ఈ తెగవారు హుటాహుటిన వచ్చి చూడగా రక్తపు మడుగులో జింకలు, వాహనంలో పరారైపోతూ సల్మాన్ కనిపించారు. గ్రామస్తులు వారిని వెంటాడినా ఫలితం లేకుండా పోయింది. సల్మాన్ ప్రయాణించిన జీపు నెంబర్‌ను గుర్తు పెట్టుకున్న వాళ్లు అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు సల్మాన్‌తో పాటు మిగతావారిపై కేసు నమోదైంది. జింక ఇరుక్కుంటే రక్షించానంతే: సల్మాన్ అయితే ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారనేది సల్మాన్ ఖాన్ వాదన. గతంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ.. ‘ఆ రోజు షూటింగ్ ముగించుకొని మేమందరం వెళుతుండగా ఒక పొదల్లో చిక్కుకుపోయిన జింక పిల్లని చూశాం. పొదల్లోంచి దాన్ని బయటకు తీసి నేనే నీళ్లు పట్టాను. బిస్కెట్లు కూడా తినిపించాను. కాసేపటికి తేరుకున్న ఆ జింక అక్కడ్నుంచి వెళ్లిపోయింది‘ అని చెప్పుకొచ్చారు. జింకకి దగ్గరగా ఉండడం చూసిన గ్రామస్తులు తనను తప్పుగా అర్థం చేసుకొని కేసులు పెట్టారని సల్మాన్ పేర్కొన్నారు. -
న్యూ టాలెంట్
సల్మాన్ ఖాన్‌లోని నటుడు మనందరికీ ఎప్పటినుంచో పరిచయమే. ఆ తర్వాత పెయింటర్‌గా, సింగర్‌గా మారి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు తనలో దాగున్న మరో కొత్త టాలెంట్‌ను బయటకు తీశారు సల్మాన్. తాజా చిత్రం ‘రేస్ 3’ కోసం ఆయన పాటల రచయితగా మారారు. ఈ సినిమాలో హీరో,హీరోయిన్ మధ్యలో వచ్చేఓ రొమాంటిక్ సాంగ్‌ను ఒక ప్రముఖ రచయితతో రాయించాలని చిత్రబృందం చూస్తుంటే ‘నేను రాసుకున్న పాట ఒకటి ఉంది’ అని, తను రాసుకున్న పాటను చదివి వినిపించారట సల్మాన్. టీమ్ అందరికీ ఆ పాట బాగా నచ్చిందట. వెంటనే ఆ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేసే పనిలో పడ్డారట సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా. ఈ రొమాంటిక్ సాంగ్‌ను సల్మాన్, జాక్వెలిన్‌పై నృత్యదర్శకుడు రెమో డిసౌజా చిత్రీకరించనున్నారట. ఈ చిత్రాన్ని ఈ ఏడాది రంజాన్‌కి విడుదల చేయాలనుకుంటున్నారు. సో.. సల్మాన ్ ఖాన్‌లోని ఈ న్యూ టాలెంట్‌ను మనం రంజాన్‌కు వినొచ్చన్నమాట. ఆ సంగతలా ఉంచితే.. సల్మాన్ లవర్స్ లిస్ట్ చాలానే ఉంది. సంగీతా బిజలానీ, ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్, లూలియా వంటూర్.. ఇంకా కొంతమంది ఉన్నారు. మరి.. వీళ్లల్లో ఎవరి కోసం సల్మాన్ ఆ రొమాంటిక్ సాంగ్ రాశారో? -
సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు..!
-
చంపేస్తా.. భాయ్‌కు బెదిరింపులు
‘సల్మాన్‌ని చంపేస్తాను’ అంటూ రాజస్థాన్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణొయి సంచలన వ్యాఖ్య చేశారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అందులో భాగంగా జోద్పూర్ కోర్టులో హాజరయ్యారు. ఆ తర్వాతి రోజే రాజస్థానీ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణొయి మర్డర్ కేసులు, కార్ జాకింగ్, కిడ్నాప్ వంటి ఆరోపణల మీద కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో సల్మాన్‌ను చంపేస్తాం అంటూ సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఇంతకీ సల్మాన్ మీద బిష్ణాయికి ఎందుకంత కోపం అంటే.. ఓ కారణం ఉంది. లారెన్స్ వాళ్లు రాజస్థానీ తెగలకు చెందిన వాళ్లు. ఈ కమ్యూనిటీ వాళ్లు కృష్ణ జింకను దైవంగా కొలుస్తారట. అందుకే సల్మాన్‌ని చంపేస్తామని బెదిరించారు. ఈ బెదిరింపులను తేలికగా తీసిపారేయడానికి లేదని ‘రేస్ 3’ బృందం అంటోంది. ప్రస్తుతం సల్మాన్ నటిస్తోన్న చిత్రం ఇది. ఈ షూటింగ్ స్పాట్ చుట్టూ కొంతమంది అనుమానాస్పదంగా కనిపించారట. ఈ విషయాన్ని ముంబై పోలీసులు గ్రహించారట. వెంటనే రంగంలోకి దిగి, ‘రేస్ 3’ సినిమా షూటింగ్ లొకేషన్‌కి వెళ్లి, సల్మాన్, చిత్రనిర్మాతలను కలిసి షూటింగ్‌ని నిలిపివేయాలని కోరారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య సల్మాన్ ఖాన్ని బాంద్రాలోని అతని ఇంటి దగ్గర దింపారు. సల్మాన్ కొన్ని రోజులు పాటు తన నివాసంలో ఉండటమే క్షేమమని భావించిన ముంబాయి పోలీస్‌లు.. కొన్ని రోజులు పాటు షూటింగ్స్ కూడా నిలిపివేయాలని కోరారు. ఎక్కడ ఉంటున్నాడనే విషయాన్ని ఎవరి దగ్గరా చెప్పొద్దనీ, సోషల్ మీడియా ద్వారా పంచుకోవద్దని కూడా కోరారు. సల్మాన్ ఖాన్ వీలున్నప్పుడల్లా ముంబై వీధుల్లో సైకిల్ మీద షికార్లు చేస్తుంటారు. కొన్ని రోజుల పాటు సైక్లింగ్ వద్దన్నారు. ‘‘సల్మాన్‌కు మాగ్జిమమ్ పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నాం’’ అని ముంబై పోలీసులు పేర్కొన్నారు. -
భాయ్.. బాలీవుడ్‌ను బతికించాడు!
ప్రతిసారీ రంజాన్‌కు కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ది ఒక సినిమా రావడం, అది సూపర్‌హిట్ అవ్వడం సర్వసాధారణం. ఈ ఏడాది జూన్‌లో, రంజాన్ సీజన్లో ‘ట్యూబ్‌లైట్’ అనే సినిమాతో వచ్చాడు సల్లూభాయ్! అయితే అది డిజాస్టర్. సల్మాన్ ఖాన్ సినిమా పరిస్థితి ఇలా అయినా మిగతా సినిమాలన్నా ఆడతాయిలే అనుకున్నారంతా! కానీ ఆ మిగతా సినిమాలూ అంతంతే ఆడాయి. దీంతో ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ డీలా పడిపోయింది. తెలుగు సినిమా ‘బాహుబలి–2’ అక్కడ డబ్ అయి పెద్ద హిట్ అవ్వడం తప్పితే, స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. ఉన్నవాటిల్లో బాగా ఆడిందంటే, ఒక్క ‘గోల్మాల్ అగైన్’ మాత్రమే! ఈ నేపథ్యంలో బాలీవుడ్‌కు 2017 బ్యాడ్ ఇయర్ అని ట్రేడ్ చెప్పుకుంటూ ఉంటే, మళ్లీ భాయే స్వయంగా వచ్చి కొత్తగా ఊపిరి పోశాడు. అదీ తన కొత్త సినిమా ‘టైగర్ జిందా హై’తో! జూన్‌లో పోతోనేమి, డిసెంబర్లో వచ్చి బాక్సాఫీస్‌ను గట్టిగానే కొల్లగొడుతున్నాడు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమా అయిన ‘టైగర్ జిందా హై’ గత శుక్రవారం విడుదలై, అందరి అంచనాలను అందుకుంటూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సల్మాన్ ఖాన్ గత చిత్రం ‘ట్యూబ్‌లైట్’ ఇండియాలో మొత్తం రన్లో 120 కోట్ల రూపాయలు వసూలు చేస్తే, ‘టైగర్ జిందా హై’ ఐదే ఐదు రోజుల్లో 173.07 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు రాబట్టింది. క్రిస్మస్ లాంగ్ వీకెండ్ సినిమాకు బాగా కలిసొచ్చింది. దీంతో వంద కోట్ల క్లబ్లో ఎక్కువ సినిమాలున్నా (12) స్టార్‌గా సల్మాన్ ఖాన్ అవతరించాడు. వీక్డేస్లోనూ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గకపోవడంతో మూడువందల కోట్ల క్లబ్‌లోనూ ‘టైగర్ జిందా హై’ చేరుతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇప్పటికే సల్మాన్ ఖాతాలో రెండు మూడు వందల కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలున్నాయి. అవి భజ్రంగీ భాయ్‌జాన్ (320.34 కోట్లు), సుల్తాన్ (300.45 కోట్లు). డబుల్ సెలెబ్రేషన్..! ఇక ‘టైగర్ జిందా హై’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూంటే, సల్మాన్‌ఖాన్ ఆనందానికి అవధుల్లేవు. ఈ జోరులోనే ఆయన తన పుట్టినరోజును (డిసెంబర్ 27) కూడా గ్రాండ్‌గా జరుపుకున్నాడు. సన్నిహితులు, ‘టైగర్ జిందా హై’ టీమ్‌తో కలిసి తన ఫామ్‌హౌస్‌లో సల్మాన్ బర్త్‌డే చేసుకున్నాడు. బర్త్‌డే సర్ప్రైజ్..! బర్త్‌డే సందర్భంగా తాను కొత్తగా చేయబోతున్న సినిమాను అనౌన్స్ చేసి, అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు సల్మాన్. ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’లతో తనకు బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన అలీ అబ్బాస్ జాఫర్తోనే సల్మాన్ కొత్త సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు ‘భరత్’ అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. అతుల్ అగ్నిహోత్రి, భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా భాయ్ సెంటిమెంట్ ప్రకారం.. అభిమానులకు పండగ కానుకగా వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల కానుంది. కేక్ కట్ చేస్తూ... కత్రినాతో... ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో... -
కంట్రోల్ తప్పితే...
... దూసుకెళ్లారు కత్రినా కైఫ్. ఏ రేసులో పాల్గొంది అనుకుంటున్నారా? దూసుకెళ్లింది రేసులో కాదండి బాబు. తను నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ జిందా హై’ షూటింగ్లో. ఇదో హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అని మనకు తెలిసిన విషయమే. సినిమాలో ఒక కీలక సన్నివేశంలో వచ్చే కార్ చేజ్ సీక్వెన్స్‌లో భాగంగా కారు తను చెప్పిన మాట వినలేదట. అదేనండీ కంట్రోల్ అవ్వలేదట. చివరకు కార్‌ను తీసుకెళ్ళి ఓ గోడకు ఢీ కొట్టారట కత్రినా. ‘‘సినిమా ముందర కొద్దిగా శిక్షణ తీసు కున్నప్పటికీ మొరాకోలోని చిన్న వీధులు నన్ను కన్ఫ్యూజ్ చేసేశాయి. నేను కారుని గోడకు ఢీ కొట్టాక.. మా టీమ్ నాకు ఏమైందో అని కంగారు పడకుండా నా కారుకు తగిలించిన ఎక్స్పెన్సివ్ కెమెరాకు ఏమైందో అని కంగారుపడ్డారు’’ అని నవ్వేశారు కైఫ్. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్ కానుంది. -
మంచి పోజ్ ఇవ్వు భాయ్
అని.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను అడిగి మరీ, కెమెరా క్లిక్‌మనిపించారు వరుణ్ ధావన్. ఈ యంగ్ హీరో ఫొటోగ్రాఫర్‌గా మారారేమో అనుకుంటున్నారా? అదేం కాదు. సరదాగా సెల్ కెమెరాని క్లిక్‌మనిపించారు. సల్మాన్ నటిస్తోన్న ‘రేస్ 3’ షూటింగ్ జరుగుతున్న లొకేషన్‌ను సందర్శించారు వరుణ్. షూటింగ్ గ్యాప్‌లో ఇలా ఆట విడుపుగా ఫొటోలు తీసి, సందడి చేశారు. ‘మంచి పోజ్ ఇవ్వు భాయ్’ అని వరుణ్ ఫొటోలు క్లిక్‌మనిపించారు. ఈ ఫొటోని సల్మాన్ తన టిట్టర్ అకౌంట్లో షేర్ చేసుకున్నారు. ‘రేస్ 3’ మరియు బిగ్ బాస్ రియాలిటి షోలతో బిజీ బిజీగా గడుపుతున్నారు సల్మాన్. -
అడవిలో ఫైట్
అడవిలో ఫైట్ఫారెస్ట్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆమిర్ ఖాన్. ఆ వెంటనే బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా వెళ్లారు. వాళ్ల తర్వాత ‘దంగల్’ ఫేమ్ ఫాతిమా సనాషేక్ కూడా వెళ్లారు. ‘ముందు మీరు వెళ్లండి.. సల్మాన్ ఖాన్ కోసం నేను చేయాల్సిన వర్క్ కొంచెం ఉంది. తర్వాత వస్తా’ అని అన్నారట కత్రినా కైఫ్. ఇంతకీ ఆ అడవి ఎక్కడుందో చెప్పలేదు కదూ! థాయ్‌ల్యాండ్ పరిసర ప్రాంతాల్లో. అమిర్, అమితాబ్, కత్రినా, ఫాతిమా సనా షేక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’. ‘ధూమ్ 3’ చిత్రంతో దర్శకునిగా మారిన విజయ్ కృష్ణ ఆచార్య ఈ సిన్మాకు దర్శకుడు. ఇప్పటికే మాల్టా, ముంబై లొకేషన్స్‌లో రెండు షెడ్యూల్స్‌ని కంప్లీట్ చేసిన ఈ చిత్రబృందం థర్డ్ షెడ్యూల్ కోసం థాయిలాండ్ వెళ్లారు. అక్కడ కొన్ని యాక్షన్ సీక్వెన్స్, కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తారట విజయ్. అదండీ సంగతి. ఇంతకీ కత్రినా తన మాజీ ప్రేమికుడు సల్మాన్ కోసం చేయబోయే వర్క్ గురించి తెలుసుకోవాలనుంది కదూ! అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్, కత్రినా జంటగా రూపొందిన ‘టైగర్ జిందా హై’ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కత్రినా థాయిలాండ్ వెళ్లలేదు. సల్మాన్‌తో కలసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదీ..మేటర్. -
బాలకృష్ణ చెల్లెలు
ఒక కడుపులో పుట్టకపోయినా కత్రీనా బాలకృష్ణ చెల్లెలే! ఒక కడుపులో ఏంటి కర్మ, ఒక కాంటినెంట్లోనే పుట్టలేదు. ఇద్దరూ ఆన్ స్క్రీన్‌లో రొమాన్స్ చేసినా ఆఫ్ స్క్రీన్ మాత్రం ఒక్క విషయంలో కత్రీనా బాలకృష్ణ సిస్టరే. ఎలాగంటారా? సల్మాన్‌ఖాన్ తెలుసు కదా. అబ్బా... బాలకృష్ణ, కత్రీనా మధ్యలో సల్మాన్‌ఖాన్ ఎక్కడి నుంచి వచ్చాడు? సల్మాన్ ఖాన్ ఫ్లయిట్‌లోంచి దిగి ఎయిర్‌పోర్ట్‌లోకి వచ్చాడు. వెనకాలే కత్రీనా కూడా వస్తోంది. ఒక యంగ్ ఫ్యాన్ పరిగెత్తుకుంటూ వచ్చి మీ గ్రాఫ్ బాగుంది ఒక ఆటోగ్రాఫ్ పెడతారా అని అడిగాడు. సల్మాన్‌ఖాన్ వాణ్ణి వొడిలో కూచోబెట్టుకుని సంతకం పెట్టి పంపించాడు. అదే ఉత్సాహంలో వెనకాల కనబడిన కత్రీనా దగ్గర కూడా ఆటోగ్రాఫ్ కోసం ఈ యంగ్‌స్టర్ వెళ్లాడు. అలా వెళ్తే బాలకృష్ణ ఏం చేస్తాడు? ఫటాక్. ఢిషూం. ఢిష్కూం. అంతే కదా. కత్రీనా కైఫ్ కూడా బాలకృష్ణ చెల్లెలే. చెయ్యి ఎత్తలేదు. పెన్ను పట్టలేదు. పట్టించుకోకుండా వెళ్లిపోయింది. బాలకృష్ణ సిస్టరైనా ఒక కడుపులో పుట్టకపోయినా, ఒకే కాంటినెంట్‌లో భూమ్మీద పడకపోయినా ఫ్యాన్స్ అంటే బేఖాతరు. జస్ట్ లైక్ బ్రదర్ అండ్ సిస్టర్. -
నాకు పెళ్లైతే మీకేంటి లాభం?
బాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో ఎవరంటే సల్మాన్ ఖాన్ అని టక్కున చెప్పేస్తారు. ‘ప్రేమకు సై.. పెళ్లికి నై’ అన్నది ఈ కండల వీరుడి సిద్ధాంతం అని జోక్లేస్తారు కూడా. మరి.. సల్మాన్ లవర్స్ లిస్ట్ తక్కువేం కాదు కదా! సంగీతా బిజ్లానీ, ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్, ప్రస్తుతం లూలియా వంతూర్... ఇలా చాలా మందితో ఈయనగారు ప్రేమాయణం సాగించారు. బట్.. పెళ్లి? ఊహూ! మూడు ముళ్లు వేసేదాకా ఏ ప్రేమనూ కొనసాగించలేదు. అందుకే సల్మాన్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ‘మీ పెళ్లెప్పుడు?’ అని అడగకుండా ఉండరు. తాజాగా ఇదే ప్రశ్న మరోసారి ఈ కండలవీరుడికి ఎదురైంది. సల్మాన్, కత్రినా జంటగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన ‘టైగర్ జిందా హై’ డిసెంబరు 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలో ఈ సినిమా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మెజారిటీ ఫ్యాన్స్ సల్లూభాయ్ పెళ్లి విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. ఇందుకు సల్మాన్ స్పందిస్తూ– ‘‘నా పెళ్లి గురించి మీరందరూ ఆలోచిస్తుండటం సంతోషంగా ఉంది. పెళ్లి టైమ్ వస్తే అయిపోతుంది. లేకుంటే లేదు. పెళ్లి గురించి ప్రత్యేకంగా ఆలోచించడం లేదు. నాకు పెళ్లి అయితే మీకేం లాభమో నాకర్థం కావడం లేదు. అయినా నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా’’ అంటూ ఎప్పటిలానే పెళ్లెప్పుడో చెప్పకుండా దాటేశారు. -
ముద్దంటే చేదా?
ము.. ము.. ము.. ము.. ముద్దంటే చేదా.. నీకా ఉద్దేశం లేదా... అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ని ఉద్దేశించి. గతంలో ఎప్పుడూ పెదవి ముద్దులకు అడ్డుచెప్పని సల్లూభాయ్ ఇప్పుడు బుద్ధిమంతుడిలా మారిపోయారట. ముద్దంటే చేదే? అంటున్నారట. అసలు సంగతికొస్తే.. సల్మాన్‌ఖాన్, పొడుగుకాళ్ల సుందరి కత్రినా కైఫ్ మాజీ ప్రేమికులన్న సంగతి తెలిసిందే. గతంలో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరు ఆ తర్వాత విడిపోయారు. లవ్ బ్రేకప్ అయిన చాన్నాళ్లకు ఇద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ జిందా హై’. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ డిమాండ్ చేయడంతో ఈ చిత్రంలో సల్మాన్–కత్రినా మధ్య ఓ లిప్‌లాక్ ప్లాన్ చేశారట దర్శకుడు. అయితే, తన మాజీ లవర్ని ముద్దు పెట్టుకునేందుకు సల్లూభాయ్ నో అనేశారట. ముద్దు విషయంలో దర్శకుడు ఎంతగా కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించినా ‘సారీ.. కుదరదు’ అన్నారట కండలవీరుడు. దీంతో చేసేదేం లేక ముద్దు సన్నివేశం లేకుండానే షూటింగ్ కానిచ్చేశారట. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదలవుతోంది. ఇంతకీ సల్మాన్ ముద్దు ఎందుకు వద్దన్నారు? తాజా లవర్ లూలియా వంటూర్ వద్దన్నారా? అయ్యే ఉంటుంది. -
సల్మాన్.. కత్రినా.. ఓ లూలియా!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, రుమేనియా బ్యూటీ లూలియా వంటూర్ల లవ్‌కి ఫుల్స్టాప్ పడిందా? ఎవరి దారి వారు చూసుకున్నారా? లూలియా తన దేశం వెళ్లిపోయారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఆ మధ్య సల్మాన్–లులియా చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. ఇటీవల ఈ ప్రేమపక్షులు ఎక్కడా కనిపించడం లేదు. దాంతో ప్రేమకి ఫుల్స్టాప్ పడ్డట్టేనని, అందుకే లూలియా రుమేనియా వెళ్లిపోయారని కొందరు అంటుంటే... లూలియా వీసా గడువు ముగియడంతోనే స్వదేశం వెళ్లారని మరికొందరు అంటున్నారు. కాగా, వీరిద్దరి లవ్ బ్రేకప్‌కి సల్మాన్ మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్ కారణం అని బిటౌన్ గుసగుస. సల్మాన్‌తో బ్రేకప్ అయ్యాక రణ్‌బీర్ కపూర్‌తో లవ్‌లో పడ్డారు కత్రినా. అయితే, ‘టైగర్ జిందా హై’ చిత్రీకరణ సమయంలో సల్మాన్, కత్రినాల మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందట. ఇది తెలిసే లూలియా రుమేనియా వెళ్లిపోయారని సమాచారం. నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. మరి, సల్మాన్–లూలియాల విషయంలో వాస్తవాలేంటో తెలియాలంటే వేచి చూడాలి. -
ట్యూబ్‌లైట్ ప్రమోషన్లో సల్మాన్
-
అదరగొట్టిన సల్లూబాయ్.. సానియా
‘బేబీకో బేస్ పసంద్ హై...’ అంటూ సల్మాన్ ఖాన్ చిందేస్తుంటే... అనుష్కశర్మ అతనికి పోటీగా అడుగులు కదపడం ‘సుల్తాన్’ సినిమాలో చూస్తాం. అయితే అదే పాటకి సల్మాన్ కి తోడుగా టెన్నిస్ స్టార్ సానియా స్టెప్స్ వేయడం చూడగలమా? సిటీకి చెందిన కొందరికి మాత్రం ఆ అదృష్టం దక్కింది. మన టెన్నిస్ సంచలనం తన సోదరి ఆనమ్ మీర్జా వివాహ వేడుకలో స్టెప్స్ వేసి టెన్నిస్ రాకెట్‌తోనే కాదు డ్యాన్సులతోనూ మెరపించగలనని నిరూపించారు. గోల్కొండ రిసార్ట్స్ వేదికగా బుధవారం జరిగిన ఈ సంగీత్ విశేషాల గురించి ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసిన ట్విస్ట్ అండ్ టర్న్ సంస్థ కొరియోగ్రాఫర్ ఆర్యన్ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... ‘ఏడేళ్లుగా సానియా కుటుంబంతో పరిచయం ఉంది. పెళ్లికి ముందే నా స్నేహితుల ద్వారా ఆమె నాకు పరిచయం. చాలా మంది సెలబ్రిటీలతో పోలిస్తే సానియా బాగా డౌన్ టు ఎర్త్. ఒకప్పుడు అసలు వరల్డ్ చాంపియన్ తో మాట్లాడడమే గొప్ప అనుకున్నాం. అయితే ఆమె మాతో పక్కింటి అమ్మాయిలా ఉండడం మరింత ఆశ్చర్యం. సానియా, ఆనమ్‌మీర్జా ఇద్దరి పెళ్లి సంగీత్లకు కొరియోగ్రఫీ అందివ్వడం నాకు దక్కిన గొప్ప గౌరవం. సానియా చాలా పెద్ద స్టార్ అని అందరికీ తెలిసిందే. అయితే ఆమె ఓ గొప్ప ఫ్యామిలీ పర్సన్ అని సన్నిహితంగా మెలిగే వాళ్లకు మాత్రమే తెలుసు. ఇక ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఒకరి గురించి ఒకరు అన్నట్టుంటారు. ఈ పెళ్లికి మొత్తం సానియానే పెద్దయ్యారు. చెల్లెలి కోసం సానియా స్వయంగా శ్రమపడి ఎన్నో రెడీ చేశారు. థీమ్స్ అండ్ డ్యాన్స్.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక బ్లాక్ బస్టర్ ఈవెంట్. ఈ సంగీత్‌ను చాలా స్పెషల్‌గా తీర్చిదిద్దాం. గర్ల్స్ వర్సెస్ బాయ్స్ థీమ్, బాలీవుడ్ థీమ్, కపిల్‌శర్మ షో... వంటివి ఈ ఈవెంట్‌కి హైలెట్. థీమ్స్లోనూ డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌ను తొలిసారిగా ఈ సంగీత్ కోసం కలగలిపాం. సుల్తాన్ లోని ‘బేబీ కో బేస్ పసంద్ హై’ పాటకు సానియా, షోయబ్‌ల డ్యాన్స్ , వీరితో కలిసి సల్మాన్ ఖాన్, పరిణితి చోప్రాలు సైతం అడుగులు కదపడం వంటి ఆకర్షణలెన్నో యాడ్ అయ్యాయి. సెలబ్రిటీ సంగీత్‌తో పాటు బంధువులు, సన్నిహితుల కోసం మరో ప్రత్యేక సంగీత్‌ను కూడా నిర్వహించాం. -
ఇక సుప్రీంలో సల్మాన్ కేసు విచారణ
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను హిట్ అండ్ రన్ కేసు వెంటాడుతోంది. ఈ కేసును సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ కేసులో బాంబే హైకోర్టు సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. కాగా వెంటనే విచారణను ప్రారంభించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరగా, 6 నెలల తర్వాత విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. 2002 సెప్టెంబర్ 28 అర్ధరాత్రి ఒక బార్లో మద్యం సేవించి, మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తూ సల్మాన్ బాంద్రా శివార్లలో పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపై వాహనంతో దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి చనిపోగా, మరో నలుగురు తీవ్ర గాయపడ్డారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం హిట్ అండ్ రన్ కేసులో సెషన్ కోర్టు సల్మాన్‌ను దోషిగా ప్రకటించి ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. కాగా బాంబే హైకోర్టు సల్మాన్‌ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. -
సల్మాన్ హీరో..చరణ్ ప్రొడ్యూసర్
-
మరి మా నాన్నను చంపిందెవరు?
ముంబై: 13 ఏళ్ల పాటు తన మదిలో మెదిలిన ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయంటూ 2002 హిట్ అండ్ రన్ కేసు బాధితుడు బాంబే హైకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. సల్మాన్ ఖాను నిర్దోషిగా ప్రకటించడంపై ఆవేదన వెలిబుచ్చాడు. ఆనాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నూరుల్లా ఖాన్ కుమారుడు ఫిరోజ్ షేక్(25) తన తండ్రిని ఎవరు చంపారన్న ప్రశ్నకు ఇప్పటికీ తనకు సమాధానం దొరకలేదని వాపోయాడు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే అతడు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. తన తండ్రికి ఆత్మకు శాంతి కలగలేదంటూ షైక్ కన్నీరు పెట్టాడు. ఆయన (సల్మాన్) అమాయకుడైతే మరి తన తండ్రిని చంపింది ఎవరని ఫిరోజ్ ప్రశ్నిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ సినిమాలంటే పడి చచ్చిపోయే తనకు, సల్మాన్ విడదల కావడంపై బాధ లేదన్నాడు. కానీ, తన తండ్రిని పొట్టన పెట్టుకుంది ఎవరో తనకు తెలియాలని డిమాండ్ చేస్తున్నాడు. తన తండ్రి మరణానికి కారణమైన సల్మాన్ ను క్షమిస్తాను.. కానీ నిజమేంటో సమాజానికి తెలియాలని కోరుతున్నాడు. కాగా 13 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. అయితే ఆనాటి ప్రమాదంలో తండ్రి నూరుల్లా ఖాన్ చనిపోవడతో ఫిరోజ్ షేక్ చదువు మానేసి కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకున్నాడు. కాగా, సల్మాన్ ఖాన్ ను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. -
హీరో రివ్యూ
టైటిల్ ; హీరో జానర్ ; రొమాంటిక్ లవ్ స్టోరీ తారాగణం ; సూరజ్ పంచోలి, అథియా శెట్టి, ఆదిత్య పంచోలి దర్శకత్వం ; నిఖిల్ అద్వాని నిర్మాత ; సల్మాన్ ఖాన్, సుభాష్ ఘాయ్ నిడివి ; 132 నిమిషాలు సుభాయ్ ఘాయ్ దర్శకత్వంలో 1983లో రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమా 'హీరో'కు రీమేక్ గా అదే పేరుతో నిఖిల్ అద్వాని దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఒరిజినల్ కథలో ఎలాంటి మార్పులు చేయకపోయిన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా స్క్రీన్‌ప్లేలో కొద్ది పాటి మార్పులతో ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా బజరంగీ భాయ్‌జాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్లో సుభాష్ ఘాయ్‌తో కలిసి ఈ సినిమాను తెరకెక్కించడం, స్టార్ వారసులు సూరజ్ పంచోలి, అథియా శెట్టిలను తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించటంతో రిలీజ్‌కు ముందు నుంచే 'హీరో' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంత వరకు అందుకుందో రివ్యూలో చూద్దాం. కథ ; 80లలో సంచలన విజయం సాధించిన సినిమాకు రీమేక్ కావడంతో 'హీరో' కథా కథనాలపై అభిమానుల్లో పెద్దగా అంచనాలు లేవు. ముంబై సిటిలో గ్యాంగ్‌స్టర్ గా ఉన్న సూరజ్ ( సూరజ్ పంచోలి ), సిటీ పోలీస్ చీఫ్ మథుర్ కూతురు రాధ ( అథియా శెట్టి )ను ట్రాప్ చేసి కిడ్నాప్ చేస్తాడు. కాశ్మీర్ తీసుకెళ్లి ఆమెను బంధించి ఉంచుతాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది. ఆ తరువాత పరిస్థితులేంటి, గ్యాంగ్ స్టర్ అయిన సూరజ్, రాధ ప్రేమను ఎలా సాధించుకున్నాడు. అందుకోసం ఎలాంటి సాహసాలు చేశాడు, వీరి ప్రేమ కథకు ఎవరెవరు అడ్డువస్తారు, అన్నదే సినిమా కథ. విశ్లేషణ ; ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓ లాంచింగ్ హీరో ఇలాంటి సినిమా చేయటం అన్నది రిస్క్ అనే చెప్పాలి. మాస్టర్ పీస్ లాంటి సినిమాలు రీమేక్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి 'హీరో' మేకింగ్ లో కనిపించలేదు. ప్రారంభంలో అద్భుతంగా అనిపించినా, సినిమా ముంగిపుకు వచ్చేసరికి బోర్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా కథా కథనాల్లో చేసిన మార్పులు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కథ మీద కన్నా హీరో హీరోయిన్లను ప్రజెంట్ చేయటం మీదే ఎక్కువగా దృష్టి పెట్టిన మేకర్స్ ఆ విషయంలో మాత్రం పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఇక మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించటం, క్వాలిటీ పరంగా కూడా 'హీరో' చాలా బాగా వచ్చింది. నటన ; తొలి సినిమానే అయినా సూరజ్ మంచి ఈజ్ కనబరిచాడు. అయితే నటన మీద కన్నా తన బాడీని చూపించటం మీదే ఎక్కువగా దృష్టి పెట్టిన ఈ యంగ్ హీరో చాలా సన్నివేశాలు సల్మాన్ ఖాన్ ను అనుకరించినట్టుగా అనిపించింది. ఇక అథియా శెట్టి ఒకటి రెండు సన్నివేశాల్లో ఆకట్టుకున్న ఆమె పాత్రకు అంత ఇంపార్టెన్స్ లేకపోవటంతో నిరాశపరిచింది. గ్లామర్ పరంగా కూడా అథియా ఫెయిలయ్యిందనే చెప్పాలి. సాంకేతిక నిపుణులు డైరెక్షన్ పరంగా కూడా హీరో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 1983 నాటి ఫార్ములా సినిమాను అదే విధంగా ఇప్పటి ప్రేక్షకులకు అందించిన దర్శకుడు మినిమమ్ మార్కులు కూడా సాధించలేకపోయాడు. హీరోను పవర్ ఫుల్ గా చూపించాలన్న ఆలోచనతో కథను పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది. సంగీతం కూడా పెద్దగా అలరించలేకపోయింది. సల్మాన్ పాడిన ఒక్క మెలోడి తప్ప గుర్తుంచుకునే స్థాయిలో మరే పాట లేదు. యాక్షన్ సీన్స్ లో నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. సిక్స్ ప్యాక్ బాడీతో సూరజ్ చేసిన యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ ను అలరిస్తాయి. ప్లస్ పాయింట్స్ ; యాక్షన్ సీన్స్ క్వాలిటీ మేకింగ్ మైనస్ పాయింట్స్; పాత కథ పూర్ టేకింగ్ మ్యూజిక్ ఓవరాల్‌గా హీరో సూరజ్ పంచోలి, అతియా శెట్టిల రాంగ్ చాయిస్. ఆడియన్స్‌కు బోరింగ్ యాక్షన్ డ్రామా. -
సల్మాన్ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో బాలీవుడ్ టాప్ స్టార్‌గా ఎదుగుతున్నాడు. ఇటీవల బజరంగీ బాయ్‌జాన్ సినిమాతో సత్తా చాటిన సల్మాన్ త్వరలో ఓ యాక్షన్ సినిమాకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో ఓ యాక్షన్ డ్రామాలో నటించనున్నాడు. సుల్తాన్ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాను యష్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్యచొప్రా నిర్మిస్తున్నాడు. సల్మాన్ రెజలర్ గా నటిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ లార్నెల్ స్టొవల్ ఫైట్ సీక్వన్స్ను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రేమ్ రతన్ ధన్ పాయో షూటింగ్ పూర్తి చేసిన సల్మాన్, ఇప్పటికే సల్మాన్ ఖాన్ లాస్ ఏంజిల్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటుండగా అక్కడికి చేరుకున్న డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. విశాల్ - శేఖర్లు సాంగ్స్ రికార్డింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఎట్టిపరిస్థితుల్లో 2016 ఈద్‌కు రిలీజ్ ప్లాన్ చేస్తున్న యూనిట్ పక్కాప్లానింగ్‌తో సినిమా కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇంత వరకు హీరోయిన్ ఎంపిక మాత్రం పూర్తి కాలేదు. వచ్చే ఏడాది ఈద్ బరిలో తన సినిమాను కూడా ప్లాన్ చేస్తున్న షారూఖ్‌కు గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు సల్మాన్. -
ఎందుకలా జరిగిందంటే...
ముంబై : సల్మాన్‌ఖాన్ ఒక్కసారి మాట ఇస్తే ఇక ఆ మాటకు తిరుగు ఉండదు. సరే, ఇదేదో బానే ఉంది గాని, ఆయన 'ఇచ్చిన మాట' పరిణితిచోప్రాకు ఇబ్బందికరంగా మారింది. విషయం ఏమిటంటే... సల్మాన్‌ఖాన్ తన సొంత బ్యానర్ 'సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్' పై 'జుగల్బందీ' సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సమీర్‌శర్మ దర్శకత్వం వహించే ఈ సినిమాలో సైఫ్ ఆలిఖాన్ నటించనున్నారు. ఆయన సరసన హీరోయిన్గా పరిణితిచోప్రాను అనుకున్నారు. ఈ సినిమా తన కెరీర్‌ను ఎక్కడికో తీసుకువెళుతుందని ఆమె కూడా ఆశ పడింది. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే తాజా వార్త ఏమిటంటే, పరిణితిచోప్రా స్థానంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటించనున్నారు. సల్మాన్ సినిమాలో నటించలేనంత బిజీగా ఉందా చోప్రా? ఆమె చేతిలో ఉన్న సినిమాలు చూస్తే అదేమీ లేదని అర్థమవుతుంది. మరోవైపు ఫెర్నాండేజ్ డేట్లు సర్దుబాటు చేయలేనంత బిజీలో ఉంది. అయినప్పటికీ జుగల్బందీలో నటించడానికి ఎందుకు ఒప్పుకున్నట్లు? దీనికి కారణం సల్మాన్‌ఖాన్. తన నిర్మాణ సంస్థలో అవకాశం ఇస్తానని అప్పుడెప్పుడో సల్మాన్, ఫెర్నాండేజ్‌కు ప్రామిస్ చేశాడట. తన మాట కాస్త లేటుగా గుర్తుకువచ్చి చోప్రాను తప్పించాడట. వేరే సినిమాలతో చాలా బిజీగా ఉన్నప్పటికీ...'జుగల్బందీ' లో ఫెర్నాండేజ్ నటించడానికి కారణం...సల్మాన్ మాటకు గౌరవం ఇవ్వడంతో పాటు, ఈ మ్యూజికల్ డ్రామా స్క్రిప్ట్ కూడా ఆమెకు బాగా నచ్చడం. పాపం పరిణితి! -
ఈ కథే... సినిమా స్టోరీ అయితే..
(వెబ్సైట్ ప్రత్యేకం) ఎట్టకేలకు పదమూడేళ్ళ తరువాత బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ఒక సంచలనాత్మక తీర్పు వెలువడింది. అవును సంచలన తీర్పే.. ఏదో సరదాగా పార్టీ కెళ్ళి... ముచ్చటపడి మందేసి.... పొరపాటున....రోడ్డు మీద నడపాల్సిన తన ఖరీదైన వాహనాన్ని...దిక్కూ మొక్కూలేక పేవ్మెంట్ మీద నిద్రపోతున్న కార్మికులపైకి ఎక్కించేసి... ఒక అనామకుడ్ని చంపేస్తే.... నేరమా? దానికి ఐదేళ్ళ జైలు శిక్ష వేయాలా? 25 వేల రూపాయల జరిమానా? అసలు ఫుట్‌పాత్ మీద పడుకోమని ఎవరు చెప్పారు? దిక్కులేనివాళ్లు ...కుక్కల్లా పేవ్మెంట్ పడుకుంటే...అంతే జరుగుతుంది...అసలు అలాంటి వాళ్ళను ముంబై లాంటి గొప్ప నగరాల నుండి తరిమికొట్టాలి ..ఇవీ తీర్పు వెలుడినప్పటినుంచీ జాతీయ మీడియాలోడిజైనర్ ఫరా అలీఖాన్, సింగర్ అభిజిత్ లాంటి వాళు చేస్తున్న చర్చలు, వాదనలు. బుధవారం సల్మాన్ ఖాన్‌ను దోషిగా నిర్ధారిస్తూ ముంబై సెషన్స్ కోర్టు తీర్పు వెలువడిన తరువాత దేశవ్యాప్తంగా కొంతమంది సో కాల్డ్ నటులు, హీరోగారి అభిమానుల అభిప్రాయాలు.. ఆగ్రహావేశాలు.. బాలీవుడ్ అగ్ర హీరో.. అదీ ఏక్ దమ్మున 100 కోట్ల రూపాయల వసూళ్లను సాధించగలిగే సత్తా ఉన్న హీరో. మరి అలాంటి హీరోకి ఐదేళ్ళ జైలు శిక్షా! హన్నన్నా... ఎంత అన్యాయం... ఎంత అమానుషం...అభిమానులు గుండెలు పగిలిపోవు? అభిమాన సంఘాలు బావురుమనవూ? అందుకే టాలీవుడ్ మెగాస్టార్ కూడా పాపం బాధపడ్డారు..పొరబాటుగా జరిగిందానికీ, ఉద్దేశపూర్వకంగా జరిగిందానికి తేడా చూడాలంటూ వాపోయారు... అయినా హైకోర్టుగా ఉందిగా అప్పీలు చేసుకోవడానికన్నారు. ఎంత ధీమా ...భారత న్యాయవ్యవస్థ మీద. ఇదంతా చూస్తున్న సగటు ప్రేక్షకుడు మాత్రం నివ్వెరపోయాడు... చనిపోయిన పేదవాడి ప్రాణానికి విలువ లేదా? వీధిన పడిన ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఇప్పుడు బాధపడే మనషులకు... ఆ ప్రాణం గాల్లో కలిసినా పట్టదా? ఆయనకు(సల్మాన్ ఖాన్) ఎంత శిక్షపడితే మాకేంటి.. మా కడుపుకు పట్టెడన్నం దొరికితే చాలు.. అంటున్న ఆ అభాగ్యుల రోదన వీరి చెవులకెక్కదా...తప్పతాగి ...రోడ్డు మీద నడపాల్సిన కారును ఫుట్‌పాత్ మీద ఎక్కించేస్తే తప్పులేదుగానీ.. కనీస మౌలిక అవసరాలు తీరని పేద కార్మికుడు.. వేరే గత్యంతరం లేక అలసి సొలసి ఫుట్‌పాత్‌మీద నిద్రపోవడం నేరమా? రీల్ లైఫ్‌కి రియల్ లైఫ్‌కి అంతరాలు అవగతమైన మనసులు మౌనంగా మూలుగుతున్నాయి. మొదటిరోజు మొదటి ఆట కోసం క్యూలో నిలబడ్డపుడు పడిన అవస్థలు.. ప్రమాదాలు.. చావులు ..ఒకటా..రెండా... ఎన్నని..వరుసగా అన్నీ ఒక్కసారిగా తెరలు తెరలుగా కదలాడాయి.. తెరపై తమ అభిమాన హీరో ఎంట్రీ కోసం..ఆ సీన్ కోసం ఆరాటపడి... ఖరీదైన కారులో...హీరో గారి పాదం అలా కనపడగానే ఈలలు....కేకలు.. వేసి.. చప్పట్లతో తీన్మార్ నృత్యం చేసిన క్షణాలు మదిలో మెదిలాయి. అంతేనా.. ఎన్నో ప్రశ్నలు..ఎన్నెన్నో అనుమానాలు..పన్నుకు-పన్ను, కన్నుకు - కన్ను, హత్యకు హత్య ..ఏ సినిమా శుభం కార్డయినా దాదాపు ఇదే కదా.. మరి 13 ఏళ్ళ పాటు జీళ్లపాకంలా సాగిన ఈ కారు కథనే సల్మాన్‌ఖాన్‌ను హీరోగా పెట్టి సినిమాగా తీస్తే ముగింపు ఎలా ఉంటుంది. ఫుట్‌పాత్‌మీద పడుకునే నిర్భాగ్యులు లేని దేశంగా మన భారతదేశాన్ని మార్చేస్తారా... అవినీతి కుళ్లు కంపుకొడుతున్న వ్యవస్థను అమాంతం ప్రక్షాళన చేసేలా ఉంటుందా? పేద, ధనిక అన్న తేడా లేకుండా రాజ్యాంగంలో ఆమోదించుకున్న చట్టాల అమలుకు పూనుకుంటారా? లేకపోతే....కార్మికుడి చావుకు కారణమైన వ్యక్తిని....??? (సూర్యకుమారి) -
స్పెషల్ ఎడిషన్ : ’తాత్కాలిక బెయిల్’
-
ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్ నిర్మాతలు
ముంబై: బాలీవుడ్ నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అక్రమ ఆయుధాల కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు సుమారు రెండు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు అనే వార్తలొచ్చిన నేపథ్యంలో ప్రొడ్యూసర్ల గుండెలు గుభేలు మన్నాయి. ఈ కేసులో జోధ్ పూర్ కోర్టు తుది తీర్పును బుధవారం వెల్లడిస్తుందని ముందు అనుకున్నప్పటికీ, మార్చి 3 కు తీర్పును వాయిదా వేయడంతో వారికి కొంత ఊరట లభించింది. బాలీవుడ్ లోని పలువురు నిర్మాతలు హీరో సల్మాన్ పై సుమారు 200 కోట్లపైగా పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. 'బాడీగార్డ్' జైలుకెడితే తమ సినిమాల పరిస్థితి ఏంటని వారు ఆందోళన పడ్డట్టు సమాచారం. తీర్పును వాయిదా వేయడంలో వారంతా ఊరట చెందారట. అయితే ఒక వేళ తీర్పు వెలువడినప్పటికీ, మళ్ళీ అప్పీలుకు వెళ్ళే అవకాశం ఉండటం నిర్మాతలకు మరింత రిలీఫ్ నిచ్చే అంశం. ఈ నలభైతొమ్మిదేళ్ల కండల వీరుడు ప్రస్తుతం అరడజనుకు పైగా ప్రాజెక్టులపై సైన్ చేశాడట. ప్రస్తుతం సూరజ్ భర్జాత్య డైరక్షన్ లో వస్తున్న ప్రేమ్ రతన్ ధన్ పాయో షూటింగులో బిజీ బిజీగా ఉంటే, కబీర్ ఖాన్ దర్శకత్వంలోని భజరంగి భాయ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. ఒక్క ఈ రెండు సినిమాలపైనే 150 కోట్లకు పెట్టుబడి పెట్టినట్టు బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ కమల్ నహ్తా అంచనా వేస్తున్నారు. మరో 50 కోట్లకు పైగా విలువ చేసే ఇతర ప్రాజెక్టులపై సైన్ చేశారట ఈ దబాంగ్ హీరో. -
న్యూ గాళ్ ఫ్రెండ్!
సినిమాలతో పాటు ఎప్పటికప్పుడు గాళ్‌ఫ్రెండ్స్‌ను అప్డేట్ చేయడంలో సల్మాన్‌ఖాన్‌తో ఎవరూ పోటీపడలేరేమో! అప్పుడెప్పుడో ఐశ్వర్యారాయ్, ఆ మధ్య కత్రినా, తరువాత జాక్వెలిన్ ఫెర్నాండజ్‌తో రొమాన్స్ చేసిన ఈ బ్యాచిలర్ లిస్ట్‌లో ఇప్పుడు మరో భామ చేరింది. చెల్లి అర్పితాఖాన్ పెళ్లి సందర్భంగా ఈ విషయం వెలుగు చూసింది. ‘ఓ తేరీ’లో చేసిన ఐలియా వంచూర్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదట సల్మాన్. ఆ అమ్మాయిని తెచ్చి ఫ్యామిలీ మెంబర్స్, అర్పిత క్లోజ్ ఫ్రెండ్స్‌కు పరిచయం చేశాడట. -
సల్మాన్, కమల్, ప్రియాంకలకు మోడీ ఛాలెంజ్!
న్యూఢిల్లీ : ఐస్ బక్కెట్ ఛాలెంజ్.... ఇప్పుడు స్వచ్ఛ భారత్‌కు కూడా పాకింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...తొమ్మిదిమంది సెలెబ్రెటీలకు సవాల్ విసిరారు. బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్యంలో పాల్గొనాలని ఆయన ఆ తొమ్మిదిమందికి ఆహ్వానం పలికారు. . స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఆ తొమ్మిది మంది స్వచ్ఛ భారత్‌లో పాల్గొని...వారి మరో తొమ్మిదిమందికి ఆహ్వానం పలకాలని కోరారు. మోడీ ఆహ్వానం పలికినవారిలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ప్రియాంకా చోప్రా, శశిథరూర్, సచిన్ టెండుల్కర్, కమల్ హాసన్, తారక్ మెహతా, అనీల్ అంబానీ, మృదుల సిన్హా, బాబా రాందేవ్ తదితరులు ఉన్నారు. కాగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పాల్గొన్నాడు. -
ట్రాన్సిస్టర్.. పీకే!
‘అందం చూడవయా... ఆనందించవయా’ అంటూ ఆమిర్‌ఖాన్ ‘పీకే’ పోస్టర్లో నగ్నంగా కనిపించి పిచ్చెక్కిస్తుంటే... దానిపై సెటైర్లు పేల్చి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు అతడి థిక్ దోస్త్ సల్మాన్‌ఖాన్. ‘ఈ మధ్య ఆమిర్ తన ట్రాన్సిస్టర్ అమ్మేసి ఐప్యాడ్‌తో తిరుగుతున్నాడు’ అంటూ బిగ్‌బాస్ షోలో నర్మగర్భంగా కామెంట్ చేశాడు కండల వీరుడు. ‘దూమ్ 3లో నేను ధరించినలాంటి హ్యాట్ పెట్టుకున్న సల్మాన్... మరి ఇప్పుడు పీకే పోస్టర్లో నాలా మారిపోతాడా’ అంటూ నవ్వుతూనే అడిగిన ఆమిర్‌కు కౌంటరే సల్మాన్ తాజా కామెంట్. ఇంతకీ ట్రాన్సిస్టర్ ట్విస్ట్ అర్థమైందా..! ‘పీకే’ పోస్టర్లో ఆమిర్ ఆచ్ఛాదనగా వాడుకున్నది. -
హిందీలో హ్యాపీ డేస్?
ఈ ఏడేళ్లల్లో వచ్చిన యూత్‌ఫుల్ చిత్రాల్లో ‘హ్యాపీ డేస్’కి ప్రత్యేక స్థానం ఉంటుంది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఆస్వాదించేలా శేఖర్ కమ్ముల ఆ చిత్రాన్ని మలిచారు. ఇక్కడివారినే కాదు.. బాలీవుడ్వారిని సైతం ఆకట్టుకున్న చిత్రం ఇది. ఎంతగా ఆకట్టుకుందంటే కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ చిత్రాన్ని హిందీలో పునర్నిర్మించాలనుకుంటున్నారట. ఇటీవలే ఆయన ఓ సొంత సంస్థను ఆరంభించారు. సల్మాన్ ఆప్తమిత్రుల్లో ఒకరు ‘హ్యాపీ డేస్’ గురించి ఆయన దగ్గర చెప్పారట. దాంతో ఈ చిత్రం గురించి సల్మాన్ వాకబు చేసి, రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారని భోగట్టా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. -
కొనసాగుతున్నఫొటోల నిషేధం
తెలుగులో హిట్టయిన ‘కిక్’ హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా రీమేకై, శుక్రవారం విడుదలై, పాజిటివ్ టాక్‌తో నడుస్తోంది. అయితే, ఈ చిత్ర ప్రచారం సందర్భంగా పది రోజుల క్రితం ఫొటోగ్రాఫర్లతో, సల్లూ భాయ్‌కి రేగిన వివాదం మాత్రం ఇంకా నడుస్తూనే ఉంది. సాజిద్ నడియాడ్వాలా దర్శకత్వంలో తయారైన ఈ చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన వేసినప్పుడు ఫొటోగ్రాఫర్లు కూడా హాజరయ్యారు కానీ, సల్మాన్‌ను ఫొటో తీయలేదు. సినీ కార్యక్రమాల్లో సల్మాన్ ఫొటోలు తీయకూడదంటూ, తమకు తాముగా విధించుకున్న నిషేధానికి ముంబయ్ ఫొటోగ్రాఫర్లు కట్టుబడి ఉన్నారు. ఈ నిషేధం ఫలితంగా ‘కిక్’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో సల్మాన్ ఖాన్ ఫొటోలు రావడం లేదు. సల్మాన్ దురుసు ప్రవర్తనకు నిరసనగా, ఆయనను బాయ్‌కాట్ చేయాలని ముంబయ్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ నిర్ణయించుకున్నప్పటికీ, సినిమా ప్రమోషన్‌కు మాత్రం సహకరించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ మాట మీదే నిలబడింది. అయితే, సల్లూ భాయ్ మాత్రం ఫొటోగ్రాఫర్ల నిషేధాన్ని తేలికగా తీసుకొని, ‘వాళ్ళ వల్ల నేనేమీ స్టార్‌ను కాలేద’న్న మాటకే కట్టుబడ్డారు. వెరసి, ప్రత్యేక ప్రదర్శనలో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, స్క్రీన్‌ప్లే రచనలో పాలుపంచుకొన్న ప్రముఖ రచయిత చేతన్ భగత్, నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ లాంటి వారి ఫోటోలు తీయడంలో ఫొటోగ్రాఫర్లు మునిగిపోయారు. ‘కిక్’ వాణిజ్య ఫలితం ఎలా ఉన్నా, మీడియాతో ఈ వివాదానికి సల్లూ భాయ్ ఫుల్స్టాప్ పెడితేనే, ఇరు పక్షాలకు మేలని వేరే చెప్పాలా? -
కథ నచ్చకే ఇంత గ్యాప్:జరైన్ ఖాన్
ముంబై: ప్రస్తుతం వెండితెరపై అవకాశాలు తక్కువగా రావడానికి తనకు వచ్చే ప్రాజెక్టులు నచ్చకేనని స్పష్టం చేశారు పాకిస్తానీ నటి జరైన్ ఖాన్. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ 'వీర్' సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అవకాశాలు అరుదుగా రావడంపై స్పందించారు. 'నాకు అవకాశాలు బాగానే వస్తున్నాయి.అయితే కథా పరంగా పాత్రలు నచ్చకే కొన్నింటిని వదులు కున్నాను. ఈ క్రమంలోనే చిత్రాల ఎంపికకు సమయం వెచ్చించాల్సి వస్తుందని, ప్రస్తుతం నా చేతిలో మంచి ప్రాజెక్టులు కూడా ఉన్నాయని' జరైన్ పేర్కొంది. తాజాగా విడుదలైన పంజాబీ ఫిల్మ్ మంచి లాభాల బాటలో పయనిస్తుందన్నారు. తన ముందు ఇప్పుడు రెండు హిందీ చిత్రాలు ఉన్నాయన్నారు. అందులో ఒకటి విడుదలకు సిద్ధంగా ఉందని.. రెండోది త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందన్నారు. 2012 లో వచ్చిన హౌస్ ఫుల్ 2 అనంతరం జరైన్ ఖాన్ కు అవకాశాలు సన్నగిల్లిన సంగతి తెలిసిందే.