ము.. ము.. ము.. ము.. ముద్దంటే చేదా.. నీకా ఉద్దేశం లేదా... అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ని ఉద్దేశించి. గతంలో ఎప్పుడూ పెదవి ముద్దులకు అడ్డుచెప్పని సల్లూభాయ్ ఇప్పుడు బుద్ధిమంతుడిలా మారిపోయారట. ముద్దంటే చేదే? అంటున్నారట. అసలు సంగతికొస్తే.. సల్మాన్‌ఖాన్, పొడుగుకాళ్ల సుందరి కత్రినా కైఫ్ మాజీ ప్రేమికులన్న సంగతి తెలిసిందే. గతంలో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరు ఆ తర్వాత విడిపోయారు. లవ్ బ్రేకప్ అయిన చాన్నాళ్లకు ఇద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ జిందా హై’.
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ డిమాండ్ చేయడంతో ఈ చిత్రంలో సల్మాన్–కత్రినా మధ్య ఓ లిప్‌లాక్ ప్లాన్ చేశారట దర్శకుడు. అయితే, తన మాజీ లవర్‌ని ముద్దు పెట్టుకునేందుకు సల్లూభాయ్ నో అనేశారట. ముద్దు విషయంలో దర్శకుడు ఎంతగా కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించినా ‘సారీ.. కుదరదు’ అన్నారట కండలవీరుడు. దీంతో చేసేదేం లేక ముద్దు సన్నివేశం లేకుండానే షూటింగ్ కానిచ్చేశారట. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదలవుతోంది. ఇంతకీ సల్మాన్ ముద్దు ఎందుకు వద్దన్నారు? తాజా లవర్ లూలియా వంటూర్ వద్దన్నారా? అయ్యే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment