Katrina kaife
-
కత్రీనా పెళ్లిపై సల్మాన్ ఖాన్ రియాక్షన్.. కమిటెడ్ అని హింట్ !
Salman Khan Congratulates Katrina Kaif On Her Wedding: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నాడు. టైగర్ 3, పవనపుత్ర భాయిజాన్, దబాంగ్ 4, నో ఎంట్రీ 2 సినిమాలతో అలరించనున్నాడు. ప్రస్తుతం వీటిలో కొన్ని చిత్రీకరణ జరుపుకుంటుండగా మరికొన్ని సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. అయితే బీటౌన్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌గా పేరొందిన సల్మాన్ ఇటీవలే 56వ పడిలోకి అడుగు పెట్టాడు. అయితే తమ అభిమాన హీరో సల్లూ భాయ్ ఓ ఇంటివాడు అయితే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్లో పలువురు హీరోయిన్లతో సల్మాన్ రిలేషన్లో ఉన్నట్లు ఇప్పటికే అనేకసార్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై సల్లూ భాయ్ ఎప్పుడూ స్పందించలేదు. అయితే తాజాగా తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి తాజాగా స్పందిచాడు భాయిజాన్. అంతేకాకుండా తన స్నేహితురాలు కత్రీనా కైఫ్ వివాహంపై కూడా మాట్లాడాడు. జనవరి 30 ఆదివారం జరిగిన హిందీ బిగ్‌బాస్ సీజన్ 15 ఫినాలేలో ఆ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ గ్రాండ్ ఫినాలేకు పలువురు సెలబ్రిటీలు వచ్చి బిగ్‌బాస్ స్టేజిపై సందడి చేశారు. ఇందులో భాగంగా కత్రీనా కైఫ్ నర్తించిన చికినీ చమేలి పాటకు మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ రాఖీ సావంత్, రుబీనా దిలాయక్ డ్యాన్స్ చేశారు. తర్వాత 'కంగ్రాట్స్ కత్రీనా.. మీ వివాహ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. మీ వివాహంతో అందరూ సంతోషిస్తున్నారు.' అని కెమెరావైపు చూసి తెలిపాడు. అనంతరం కత్రీనా కైఫ్ విషయంపై షెహనాజ్ గిల్ సరదాగా సల్మాన్ టీజ్ చేసింది. సల్మాన్ అలా చెప్పగానే 'మీరు కూడా సంతోషంగా ఉన్నారా ? అయినా మీరు సింగిల్‌గా ఉంటేనే బాగుంటారు' అనగా 'అవును. నేను సింగిల్‌గా అయినప్పుడే మరింత మెరుగ్గా కనిపిస్తాను' అని సల్లూ భాయ్ సమాధానం ఇచ్చాడు. దీంతో షెహనాజ్ 'ఇప్పుడు మీరు కమిటెడ్ ఆ ?' అని అడగ్గా సల్మాన్ సమాధానం ఇవ్వకుండా నవ్వాడు. అయితే ఇటీవల సమంత లాక్‌వుడ్‌తో సల్మాన్ రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) -
పెళ్లి తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించిన కత్రీనా.. 'టైగర్ 3' కోసం ఢిల్లీకి
Katrina Kaif Resumes Shooting After Wedding And Going To Delhi: బాలీవుడ్ కొత్త జంట కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ తమ పెళ్లి తర్వాత ఎధావిధిగా సినిమా షూటింగ్‌ల్లో బిజీగా గడపనున్నారు. వారివారి సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌ను సెట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే విక్కీ కౌశల్ తన సినిమా షెడ్యూల్‌ను ప్రకటించాడు. ఇప్పుడు కత్రీనా కూడా మూవీ షూటింగ్లో పాల్గొననుంది. బాలీవుడ్ కండల వీరుడు, భాయిజాన్ సల్మాన్ ఖాన్‌తో నటిస్తున్న 'టైగర్ 3' (Tiger 3) చిత్రం చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసేందుకు కత్రీనా త్వరలో ఢిల్లీ వెళ్లనుంది. ఈ షెడ్యూల్ సుమారు 15 రోజుల వరకు ఉంటుందట. అన్ని సక్రమంగా జరిగేలా చిత్రబృంద్రం ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. అనుకున్నట్లు జరిగితే దేశ రాజధానిలో సల్మాన్, కత్రీనా ఇద్దరితో షూటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. అలాగే కత్రీనా, సల్మాన్ ఇద్దరూ పెద్ద స్టార్లు కావడంతో షూటింగ్‌కు సంబంధించిన చిత్రాలు బయటకు లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారట. సల్మాన్, కత్రీనాకు బెస్ట్ ఆన్‌స్క్రీన్ జోడీగా పేరుంది. వీరిపై ఎక్కువగా భాగం ఢిల్లీలోనే చిత్రీకరించనున్నారట. ఈ చిత్రీకరణకు సల్మాన్, కత్రీనా ఇద్దరూ సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌తో 'టైగర్ 3' చిత్రం ముగింపు దశకు రానున్నట్లు తెలుస్తోంది. స్పై థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా చిత్రీకరణను వివిధ నగరాల్లో షూట్ చేశారు. అయితే ఢిల్లీలో చిత్రీకరించే సన్నివేశాలు మాత్రం 'అత్యంత ఘోరమైన మిషన్'కు సంబంధించినవి అని సమాచారం. టైగర్ ఫ్రాంచైజీ నుంచి వస్తోన్న మూడో చిత్రం ఇది. దేశాన్ని, మానవాళిని రక్షించడానికి వివిధ మిషన్లలో పాలుపంచుకునే భారత్, పాక్ ఏజెంట్ల కథ ఆధారంగా తెరకెక్కిందే ఈ టైగర్ ఫ్రాంచైజీ. ఈ ఫ్రాంచైలో మొదటి భాగం 2012లో వచ్చిన 'ఏక్ థా టైగర్'ను కబీర్ ఖాన్ డైరెక్ చేయగా, రెండో భాగం 'టైగర్ జిందా హై' (2017)ను అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించాడు. మూడో సీక్వెల్ 'టైగర్ 3' చిత్రాన్ని మనీష్ శర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర చేయనున్నాడు. ఇదిలా ఉంటే కత్రీనా జోయా అక్తర్ దర్శకత్వంలో వస్తున్న 'జీ లే జరా' చిత్రంలో నటించనుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్‌లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది కత్రీనా. ఇదీ చదవండి: ఆ వ్యవహారంలోకి నన్ను లాగొద్దు: విక్కీ మాజీ ప్రేయసీ -
సల్మాన్,రణ్‌బీర్ నుంచి కత్రినాకు కాస్ట్లీ గిఫ్ట్స్!, అవేంటో తెలుసా?
Katrina Kaif Ex Boyfriends Salman Khan, Ranbir Kapoor Sends Costly Gifts On Her Wedding: ప్రస్తుతం బి-టౌన్లో కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ పెళ్లి హాట్‌టాపిక్‌గా మారింది. పెళ్లి వరకు గొప్యత పాటించిన ఈ జంట అనంతరం వరసపెట్టి ఫొటోలు షేర్ చేస్తున్నారు. ‘మా మనసులో ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమ, కృతజ్ఙత మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. మా ఈ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు కావాలంటూ’ విక్ట్రీనాలు పోస్ట్‌లు షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే వీరికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. కాగా రాజస్థాన్‌లో కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక దీనికి ఎంతమంది బాలీవుడ్ సెలబ్రెటీలు వెళ్లారు, ఎవరెవరికి ఆహ్వానాలు అందాయన్న దానిపై స్పష్టత లేదు. చదవండి: కాజల్‌పై బిగ్‌బాస్ నిర్వాహకులు సీరియస్! ఆ రూల్ బ్రేక్ చేసిందా? ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల నుంచి ఈ జంటకు ఖరీదైన బహుమతులు అందినట్లు తెలుస్తోంది. వీరిలో కత్రినా మాజీ ప్రియులు రణ్‌బీర్ కపూర్, సల్మాన్ ఖాన్లు ఉండటం ఆసక్తినెలకొంది. కత్రీనా పెళ్లి సందర్భంగా ఆమె మాజీ ప్రియుడు రణ్‌బీర్ కపూర్ 2.7 కోట్ల రూపాయలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇవ్వగా.. ఈ కొత్త జంటకు బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ 3 కోట్ల రూపాయల విలువైన రేంజ్ రోవర్ కారును కానుగా ఇచ్చినట్టు బి-టౌన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా గతంలో కత్రినా సల్మాన్ ఖాన్‌తో ప్రేమ వ్యవహరం నడపగా వీరిద్దరి బ్రేకప్ అనంతరం రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో మునిగితేలిన సంగతి తెలిసిందే. చదవండి: విక్కీ, కత్రినా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. రొమాంటిక్ లుక్‌లో మెరిసిపోతున్న క్యూట్ కపుల్ అంతేకాదు ముంబైలో ఓ ప్లాట్ తీసుకుని అక్కడ రణ్‌బీర్, కత్రినాలు ఎడాది పాటు కలిసి ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక సల్మాన్, రణ్‌బిర్‌తో పాటు అలియా భట్ లక్ష రూపాయల విలువైన పెర్ఫ్యూమ్ బాస్కెట్‌ను కత్రినాకు బహుమతిగా ఇచ్చిందని, రూ. 6.4లక్షల విలువైన డైమండ్ చెవి దుద్దులను విరూష్కలు గిఫ్ట్ పంపించారని సమాచారం. అలాగే షారుఖ్ ఖాన్ వారి వివాహ వేడుకలో రూ. 1.5 లక్షలు విలువ చేసే ఖరీదైన పెయింటింగ్‌ను ఇవ్వగా, హృతిక్ రోషన్.. విక్కీకి 3 లక్షల రూపాయలు విలువ చేసే బీఎండబ్య్లూ జీ310 ఆర్ బైక్‌ను ఇచ్చాడట. ఇక తాప్సీ కూడా విక్కీకి 1.4లక్షల రూపాయల విలువైన ప్లాటినం బ్రెస్లెట్ను బహుమతిగా ఇచ్చిందని తెలుస్తోంది. -
ఎల్లప్పుడూ ఇలానే ఉండనివ్వండి!.... సోదరీమణులతో దిగిన ఫోటోలను పోస్ట్ చేసిన కత్రినా!!
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ వివాహం డిసెంబర్ 9న సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే కత్రినా కైఫ్ తన పెళ్లిలో ధరించిన లెహంగాను డిజైనర్ సబ్యసాచి వజ్రాలు, ముత్యాలతో ఎంతలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారో వివరించింది. అంతేకాదు ఆ వివాహతంతులో ఆమె తన ఆరుగురు సోదరీమణులతో మహారాణీలా ఎంతో అందంగా రాజసం ఉట్టిపడేలా నడుస్తున్న ఫోటోలను సోషల్ మీడీయాలో పోస్ట్ చేసింది. (చదవండి: పాత కార్లు, సైకిల్ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!!) తన బలం తన సోదరీలేనని మా బంధం ఎప్పటికీ ఇలానే ధృఢంగా ఉండాలంటూ భావోద్వేగానికి లోనైంది. ఈ మేరకు కత్రినా తన పెళ్లిలో తన ఆరుగురి సోదరీమణులతో కలిసిన దిగిన ఫోటోల తోపాటు "మా సోదరీమణులు ఎల్లప్పుడూ ఒకరినొకరు రక్షించుకుంటాము. మేము ఎప్పుడూ ఒకరికొకరు అండంగా ఉంటాం... ఇది ఎల్లప్పుడూ అలాగే ఉండనివ్వండి!" అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: పెళ్లి చేసుకోమని అడిగినందుకు... గొంతు కోసి చంపేశాడు!) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
Katrina-Vicky wedding: సినీ స్టార్ట్స్తోపాటు, అంబానీ ఫ్యామిలీ
Katrina Kaif Vicky Kaushal Marriage Date: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ విక్కీ కౌశల్ కత్రినా కైఫ్‌ల వివాహం ముచ్చటే ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లోని విలాస వంతమైన హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో ఇప్పటికే కత్రినా, విక్కీ కౌశల్ మెహందీ వేడుక పూర్తి చేసుకున్నారు కూడా. మూడుముళ్ల వేడుక బుధవారం సాయంత్రం హల్దీ వేడుక, ఆ తరువాత సంగీత్ అనంతరం డిసెంబర్ 9, గురువారం మధ్యాహ్నం సిక్స్ సెన్సెస్ బార్వారా ఫోర్ట్ వేదికగా సెహ్రా బంద్ వేడుక తర్వాత ఏడు అడుగులు వేసేందుకు ఈ జంట సిద్ధమవుతోంది.పెళ్లయ్యాక కొత్త జంట రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించనున్నారు. వెడ్డింగ్ ప్లానర్లు ముఖ్య అతిథుల కోసం 8 నుండి 10 టెంట్లను బుక్ చేశారట. వీటికి రాత్రికి రూ.70 వేలు ఖర్చవుతుందట. ముఖ్య అతిథులు విక్కీ-కత్రినా వివాహానికి వీవీఐపీలతో పాటు కార్పొరేట్ దిగ్గజాలు ముఖేశ్ అంబానీ కుటుంబం, ఆయన సోదరుడు అనిల్ అంబానీ కుటుంబం కూడా ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్టు సమాచారం. ఒబెరాయ్ హోటల్లో వారి కోసం 5 గదులు కూడా రిజర్వ్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తదితర తారలతోపాటు, క్రికెటర్ విరాట్-అనుష్కతో ఈ వివాహానికి రావచ్చని అంచనా. అయితే ఆహ్వానితులకు సెక్యూరిటీ కోడ్ లేకుండా ఎంట్రీ లేదట. అయితే నేహా ధూపియా, అంగద్ బేడీ దంపతులు, సినీ దర్శకుడు కబీర్ ఖాన్ , ఆమె భార్య మినీ మాథుర్, నటి శార్వారీ బాగ్, రోహిత్ శెట్టి ఇప్పటికే వెడ్డింగ్ డెస్టినేషన్‌కు చేరుకున్నారు. మరోవైపు గూగుల్ విక్కీ భార్య కత్రినాగా గూగుల్ పేర్కొనడం విశేషం. ఓటీటీ దిగ్గజంతో డీల్: రూ. 100 కోట్లు ఆఫర్ సాధారణంగా సెలబ్రిటీలు తమ వివాహ ఫుటేజీలు, ఫోటోలను, మ్యాగజైన్లకు కొన్నిసార్లు ఛానెళ్లకు విక్రయించడం ఇపుడు ట్రెండ్. ఈ నేపథ్యంలో స్ట్రీమింగ్ దిగ్గజం పింక్ విల్లా పెళ్లికి సంబంధించిన ఫుటేజీ హక్కుల కోసం కత్రినా కైఫ్ , విక్కీ కౌశల్‌లకు ఏకంగా రూ. 100 కోట్లు ఆఫర్ చేసినట్టు టాక్. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by PHONEBHOOT ON 15 july 2022 (@katrinakaifinspiration) -
కత్రీనా పెళ్లి ఫుటేజ్ కోసం రూ. 100 కోట్లు ఆఫర్.. ఎందుకో తెలుసా ?
OTT Offers 100 Crores For Katrina And Vicky Marriage Footage: పెళ్లి వేడుకలు, ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ ఏం జరిగిన బాలీవుడ్ ఫిల్మ్ దునియాలో హాట్ టాపిక్ అవుతాయి. ప్రధానంగా స్టార్ కపుల్స్ వివాహం అంటే చాలు భారీ స్థాయిలో క్రేజ్ ఉంటుంది. ఎప్పుడూ వారి గురించి ఏం వార్త వస్తుందో అని ఎదురుచూస్తుంటారు. డేటింగ్ తర్వాత షాదీకి సిద్ధమైన హీరోహీరోయిన్లకు అభిమానుల్లో, వ్యాపార వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ పెళ్లి వేడుకలను వ్యాపారంగా మార్చుకున్న బిజినెస్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఎవరైనా బాలీవుడ్ స్టార్ కపుల్స్ అనుమతిస్తే పైసా ఖర్చు లేకుండా పెళ్లి చేస్తామని ఆఫర్లు ఇచ్చే కంపెనీలు ఉన్నాయి. ఇక వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలకు మంచి బిజినెస్ ఉంటుందని చెప్పొచ్చు. తాజాగా కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ వివాహాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ పోటీ పడుతోందని సమాచారం. ఈ వివాహానికి సంబంధించిన వీడియోలను రికార్డు చేసి, వీలు కుదిరితే విక్ట్రీనాలను ఇంటర్వ్యూ చేసి, అతిథుల అభిప్రాయాలను కూడా సేకరించి ఆ తర్వాత స్ట్రీమింగ్ చేసేందుకు విక్కీ, కత్రినాలతో సంప్రదింపులు జరిపిందని ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఏకంగా రూ. 100 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏ స్టార్ సెలబ్రిటీకి దక్కని రేంజ్లో వీరికి ఈ బంపరాఫర్ ఇవ్వడం విశేషం. అందుకే మొబైల్స్ ఫోన్స్ తీసుకురాకుండా పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలకు కూడా కఠినమైన ఆంక్షలు విధించినట్లు బీటౌన్‌లో టాక్. ఏ ఒక్క ఫొటో, వీడియో బయటకు లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు భోగట్టా. అయితే కత్రీనా గతంలోనే సల్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకుంటుందని అనేక రకాల వార్తలు వచ్చాయి. కానీ ఎమోషనల్‌గా వారి మధ్య బ్రేకప్ అయినట్లు ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు కత్రీనా మరొక హీరోను పెళ్లి చేసుకోబోతోంది అనడంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్‌గా మారింది. అందుకే జనాలు కచ్చితంగా చూస్తారని ఫుటేజ్ కోసం పలు ఓటీటీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కత్రీనా కైఫ్ వేసుకునే మెహందీ ప్రత్యేకత ఏంటో తెలుసా ? -
విక్ట్రీనా..వేడుకలు షురూనా
పెళ్లి వేడుక ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోవాలని చాలామంది కోరుకుంటారు. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ కత్రినా కైఫ్‌లు కూడా అలానే అనుకున్నట్లున్నారు. అందుకే తమ వివాహ వేడుకలను వీలైనంత ఘనంగా జరుపుకోవడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఈ ప్రేమికుల వివాహం రాజస్థాన్‌లో సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో జరగనుంది. నేటి నుంచి 10వ తేదీ వరకు రాజస్థాన్‌లో విక్ట్రీనా (విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జోడీకి ఫ్యాన్స్ పెట్టిన పేరు)ల వివాహ వేడుకలు జరగనున్నాయని బాలీవుడ్ టాక్. మంగళవారం సంగీత్, ఆ మర్నాడు మెహందీ, ఆ తర్వాత 9న విక్కీ–కత్రినాల వివాహం, 10న రిసెప్షన్ జరగనున్నాయట. కోటలో విక్కీకి ‘రాణా మాన్సింగ్’ పేరున్న సూట్‌ని, కత్రినాకు ‘రాణి పద్మావతి’ పేరున్న సూట్‌ని బుక్ చేశారని వినికిడి. ఒక్కో గది అద్దె రోజుకి దాదాపు 7 లక్షల రూపాయలని సమాచారం. సోమవారం వధూవరుల కుటుంబం ఫోర్ట్‌లో చెకిన్ అయ్యారు. 11న చెక్ అవుట్ అవుతారు. అలాగే అతిథుల కోసం కూడా విలాసవంతమైన గదులను బుక్ చేశారట. ఒక్కో గది అద్దె రోజుకి 70 వేల రూపాయలని టాక్. దాదాపు 120 మంది అతిథిలు ఈ వేడుకల్లో పాల్గొంటారని బాలీవుడ్ అంటోంది. పెళ్లికి హాజరయ్యేవారందరూ రెండు డోసుల వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసుకుని ఉండాలి లేదా ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ చూపించాలి. అలాగే సెల్‌ఫోన్‌కు అనుమతి లేదని కాబోయే వధూవరులు అతిథులకు విన్నవించుకున్నారట. వేడుకలకు హాజరయ్యేవారందరూ ప్రముఖులు కాబట్టి రక్షణ విషయంలో ఎలాంటి లోటుపాట్లు జరగకూడదని సుమారు వంద మంది బౌన్సర్లను నియమించారట. ఓటీటీలో పెళ్లి వేడుక: వివాహానికి సంబంధించిన వీడియోలను రికార్డు చేసి, వీలు కుదిరితే విక్ట్రీనాలను ఇంటర్వ్యూ చేసి, అతిథుల అభిప్రాయాలను కూడా సేకరించి ఆ తర్వాత స్ట్రీమింగ్ చేసేందుకు ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్ భారీ ఆఫర్‌తో విక్కీ, కత్రినాలతో సంప్రదింపులు జరిపిందని ప్రచారం జరుగుతోంది. అందుకే వేడుకలకు సంబంధించి ఒక్క ఫొటో కానీ, చిన్న వీడియో కానీ బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని భోగట్టా. మాజీలకు ఆహ్వానం లేదు... మరోవైపు విక్ట్రినా పెళ్లికి హాజరయ్యే బాలీవుడ్ ప్రముఖల జాబితాలో కత్రినా మాజీ ప్రేమికులు సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ పేర్లు ఉన్నాయా? లేవా? అసలు వీరికి ఆహ్వానాలు వెళ్లాయా? అనే చర్చ బాలీవుడ్లో జరుగుతోంది. కానీ తమకు ఆహ్వానం అందలేదని సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. అలాగే విక్కీ మాజీ ప్రేయసి హర్లీన్ సేథీని కూడా ఆహ్వానించలేదని భోగట్టా. వివాహానికి వెళ్లే అతిథుల్లో ఆలియా భట్, కరణ్ జోహార్, కబీర్ ఖాన్, రోహిత్ శెట్టి, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, వరుణ్ ధావన్ పేర్లు వినిపిస్తున్నాయి. -
ఫిక్సైన విక్కీ-కత్రినా పెళ్లి తేదీ, దానికి ముందు ముంబైలో కోర్డు వివాహం!
Katrina Kaif And Vicky Kaushal Marriage Date: కొద్ది రోజులుగా బాలీవుడ్ లవ్‌బర్డ్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌ల పెళ్లి వార్తలు హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాయి. మొదటి నుంచి వీరి రిలేషన్‌ను గోప్యంగా ఉంచుతూ వస్తున్న ఈ జంట దీపావళి పండుగ సందర్భంగా సీక్రేట్ రోకా ఫంక్షన్ జరుపుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నుంచి వరుసగా వీరి పెళ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వారి వివాహనికి సంబంధించిన అప్డేట్స్ను కూడా ఈ జంట సీక్రెట్‌గా ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో విక్కీ-కత్రినాల పెళ్లి తేదీ ఖరారైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా డిసెంబర్లో ఈ జంట మూడు మూళ్ల బంధంతో ఒక్కటవ్వబోతున్న సంగతి తెలిసిందే. చదవండి: Disha Patani: దిశ పటానీకి సర్జరీ వికటించిందా? తాజా వీరి వివాహని ముహుర్తం కూడా ఖరారైనట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని రిసార్ట్ అయిన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో ఈ జంట వివాహ మహోత్సవ వేడుకను జరనుందని బి-టౌన్ జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే ఆ రోజే విక్కీ-కత్రినా పెళ్లి చేసుకోవడం పక్కా అంటూ కత్రినా కైఫ్ సన్నిహితులు చెబుతున్నారు. రాజస్థాన్‌లో జరిగే వీరి వివాహ కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 7, 8 తేదీల్లో సంగీత్, మెహందీ వేడుక జరగనున్నాయట. ఇక 9న ఈ జంట పెళ్లి జరగనుందని వినికిడి. చదవండి: ముగ్గురు టాలీవుడ్ హీరోలు, సెలబ్రెటీలకు రూ. 200 కోట్లు కుచ్చు టోపి! వెడ్డింగ్‌కు 200 మంది అతిధులు హాజరు కానున్నారని కూడా బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పెళ్లికి మరికొద్ది రోజులే మిగిలి ఉండడంతో సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. పెళ్లికి ఎవరు మొబైల్స్ తీసుకురావొద్దనే కండీషన్ పెట్టారనే ప్రచారం కూడా నడుస్తుంది. అయితే వివాహానికి జైపూర్ పయనమయ్యే ముందు విక్కీ, కత్రినా వచ్చే వారం ముంబైలో కోర్టు వివాహం చేసుకుంటారని కత్రినా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కత్రినా, విక్కీ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సీక్రెట్ గా ఉంచాలని అనుకుంటున్నారట. అందుకనే ఇంకా పెళ్లి విషయాన్నీ కూడా అధికారికంగా ప్రకటించలేదని సమాచారం. చదవండి: కత్రీనా కైఫ్ వేసుకునే మెహందీ ప్రత్యేకత ఏంటో తెలుసా ? -
కత్రీనా కైఫ్ వేసుకునే మెహందీ ప్రత్యేకత ఏంటో తెలుసా ?
The Specialty Of Katrina Kaif Wedding Mehndi: పెళ్లి అంటే ఎన్నెన్నో కలలు కంటారు అమ్మాయిలు. ఆ వేడుకలో జరిగే ప్రతీ తంతు ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు. మెహందీ నుంచి హనీమూన్ దాకా, కాలి మెట్టెల నుంచి నుదిటిపై పాపడ బిళ్ల వరకు విభిన్నంగా, ఆసక్తికరంగా చేయాలని కోరుకుంటుంది మగువల మనసు. మరీ ఇక సెలబ్రిటీల విషయానికస్తే..! ప్రతీ ఫంక్షన్లో కొత్తగా కనపించేందుకు ఆరాటపడుతుంటారు. కొన్నిసార్లు సీనీ సెలబ్రిటీలు ఎలాంటి ఆర్భాటం లేకుండా వివాహాలు చేసుకున్న కూడా సందర్భాలు ఉన్నాయి. అలా ఏ అధికారిక ప్రకటన లేకుండా జరుగుతుందే బాలీవుడ్ తారలు కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ వివాహం. ఈ వేడుకల్లో కత్రీనా కైఫ్ వేసుకునే మెహందీ ప్రత్యేకత, దానికి ఎంత ఖర్చువుతుందే తెలుసుకుందాం. ఇది చదవండి: పెళ్లి తర్వాత కత్రీనా పేరు మార్చుకుంటుందా..? రాజస్థాన్ సవాయ్ మాధోపూర్ జిల్లాలోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ హోటల్లో కత్రీనా, విక్కీ కౌశల్ వివాహం జరగనుందని తెలిసిందే. అధికారికంగా వెల్లడవని ఈ వేడుకలు డిసెంబర్ 7 నుంచి 12 వరకు జరగనున్నాయి. అయితే తాజా నివేదికల ప్రకారం కత్రీనా తన కాళ్లు, చేతులకు వేసుకునే మెహందీ (హెన్నా) రాజస్థాన్‌లో ప్రసిద్ధిచెందిన 'సోజత్ మెహందీ'తో తయారు చేయబడిందట. సోజత్‌లోని కళకారులు ఎలాంటి రసాయనాలు లేకుండా చేతితో తయారు చేస్తారట. దీని విలువ సుమారు రూ. 50,000 నుంచి రూ. లక్ష వరకు ఉంటుందని సమాచారం. ఇది చదవండి: విక్కీ, కత్రీనా పెళ్లి చేసుకునే హోటల్ చరిత్ర ఏంటో తెలుసా..? అలాగే పలు నివేదికల ప్రకారం ఈ కార్యక్రమానికి సుమారు 125 మంది వీఐపీ అతిథులు హాజరవనున్నారు. ముంబై నుంచి ప్రయాణించే గెస్ట్‌లు మొదట జైపూర్‌లో దిగుతారు. వారికోసం భారీ లగ్జరీ బస్సులు, కార్లు కూడా బుక్ అయ్యాయని సమాచారం. ఈ పెళ్లిలో ప్రముఖ రాజస్థానీ వంటకాలు వడ్డించనున్నారట. ప్రత్యేకంగా 'కేర్ సంగ్రీ' వంటకం కూడా తయారు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వంటకాల కోసం వేడుక నిర్వాహకులు సవాయ్ మాధోపూర్‌లోని ప్రముఖ మిథైవాలా దుకాణంలో పనిచేసే కైలాశ్ శర్మ సహాయం తీసుకున్నారు. కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ జంట తమ వివాహంలో ఏస్ డిజైనర్ సభ్యసాచి వస్త్రాలను ధరించనున్నారని తెలిసిందే. ఇది చదవండి: విక్కీ కౌషల్, కత్రీనా కైఫ్ ప్రేమ మందిరం.. పెళ్లి తర్వాత మకాం అక్కడేనా? -
పెళ్లి తర్వాత కత్రీనా పేరు మార్చుకుంటుందా..?
Katrina Kaif Will Change Her Name After Wedding: బాలీవుడ్ జంట రాజ్ కుమార్ రావు, పత్రలేఖ వివాహం జరిగింది. ఇక ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోండి రాబోయే మరో గ్రాండ్ బాలీవుడ్ కపుల్ వెడ్డింగ్‌కు సిద్ధమవ్వండి. హా.. అదే కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి గురించే. ఇప్పటికే కత్రీనా తన వివాహం కోసం దుస్తులను ఎంచుకోవడం ప్రారంభించింది. విక్కీ కౌశల్ వారి వివాహం తర్వాత ఉండటం కోసం ఖరీదైన ఇళ్లు కొనుగోలు చేశారు. అయితే వివాహం తర్వాత కత్రీనా కైఫ్ తన పేరును కత్రీనా కైఫ్ కౌశల్‌గా మార్చుకుంటుందా అని తాజాగా చర్చ జరుగుతోంది. పేరు మార్చుకునే అవకాశం ఉందని బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. అలా అయితే సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'టైగర్ 3' చిత్రం పోస్టర్లు, ట్రైలర్లో కత్రీనా కైఫ్ కౌశల్ అని వస్తుందేమో చూడాలి. డిసెంబర్లో రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ హోటల్లో కత్రీనా, విక్కీ వివాహం కానుందని ప్రచారం జరుగుతున్నట్లు తెలిసిందే. ఈ షాదీ వివరాలు మెలిమెల్లిగా పాకి టైగర్ 3 సెట్స్‌లో ఓ ప్రశ్న తలెత్తిందట. కత్రీనా కైఫ్ తన పెళ్లి తర్వాత కత్రీనా కైఫ్ కౌశల్‌గా పేరు మార్చుకుంటుందా అని. కత్రీనా పేరులోని మొదటి అక్షరాలు కెకె (KK) అయితే, వివాహం తర్వాత కౌశల్ పేరులోని కె (K) జతగా మారి కెకెకె (KKK) అని కౌగిలించుకున్నట్లు అవుతుందని ఆమె స్నేహితులు చమత్కరిస్తున్నారట. అయితే ఈ విషయంలో నిర్ణయం పూర్తిగా ఆమెదే అని కత్రీనా సన్నిహితులు చెబుతున్నారు. కత్రీనా పేరు మార్చుకోవాలనుకుంటే టైగర్ 3 పోస్టర్లు, ట్రైలర్‌పై మేకర్స్ కత్రీనా కైఫ్ కౌశల్‌గా క్రెడిట్ ఇస్తారు. ఇంతకుముందు కరీనా కపూర్ తలాష్‌లో కరీనా కపూర్ ఖాన్‌గా మార్చుకున్నారు. ఐశ్వర్య రాయ్ కూడా, ఐశ్వర్య రాయ్ బచ్చన్‌గా పేరు మార్చుకున్నారు. దీపికా పదుకొణె మాత్రం తన పేరును మార్చుకోలేదు. చదవండి: విక్కీ, కత్రీనా పెళ్లి చేసుకునే హోటల్ చరిత్ర ఏంటో తెలుసా..? -
సూపర్ పోలీస్ వస్తున్నాడు
అక్షయ్ కుమార్ హీరోగా దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించిన సూపర్ పోలీస్ చిత్రం ‘సూర్యవన్షీ’. కత్రినా కైఫ్ కథానాయిక. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్, అజయ్ దేవగణ్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం గత ఏడాది మార్చిలో థియేటర్స్‌లోకి రావాల్సింది. కోవిడ్ వల్ల వాయిదా పడింది. తాజాగా ఏప్రిల్ 2న ‘సూర్యవన్షీ’ని థియేటర్స్‌లోకి తీసుకురావాలనుకుంటున్నారు. కోవిడ్ తర్వాత థియేటర్స్‌లో విడుదలవుతున్న పెద్ద హిందీ చిత్రం ఇదే కావడం విశేషం. -
ఇంటర్వెల్ లేని విజయ్ సేతుపతి మూవీ!
‘అంధాధున్’ తర్వాత దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఏ సినిమా చేస్తారనే ఆసక్తి ఉంది బాలీవుడ్‌కి. తమిళ నటుడు విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారాయన. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ అని సమాచారం. ఈ సినిమాను కేవలం 90 నిమిషాల నిడివితో తెరకెక్కించనున్నారట. అలాగే ఈ సినిమాకు ఇంటర్వెల్ కూడా ఉండదట. ఏప్రిల్ నెలలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నారు. పూణె పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తారు. ఒకే షెడ్యూల్లో సినిమా మొత్తాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. -
సేతుపతికి జోడీగా...
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి జోడీగా ఓ సినిమా చేయబోతున్నారు అనే క్రేజీ వార్త తిరుగుతోంది. ఈ ఇద్దరూ హిందీ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ సినిమాలో కలసి నటించబోతున్నారట. ‘అంధా ధున్’ తర్వాత శ్రీరామ్ రాఘవన్ ఓ భారీ పీరియాడికల్ చిత్రం ప్రకటించారు. అయితే ఆ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతం పక్కన పెట్టారట. తాజాగా విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారాయన. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
మళ్లీ వస్తున్నాం
బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, ఆయన కుమారులు బాబీ డియోల్, సన్నీ డియోల్ కలసి స్క్రీన్ మీద నవ్వులు పండించిన చిత్రం ‘అప్నే’. ధర్మేంద్ర, సన్నీ, బాబీ, కత్రీనా కైఫ్, శిల్పా శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం 2007లో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ‘అప్నే’కు సీక్వెల్‌గా ‘అప్నే 2’ను తెరకెక్కించే పనిలో ఉన్నట్టు ఆదివారం ప్రకటించారు ధర్మేంద్ర. ‘మీ అందరికీ ‘అప్నే 2’ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’ అని ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ∙సన్నీ డియోల్, ధర్మేంద్ర, బాబీ డియోల్ -
పరీక్ష తప్పదు
కోవిడ్ తర్వాత అన్నీ మారాయి. కొత్త విధానాలు అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి. సినిమాల చిత్రీకరణ మొదలెట్టాలంటే నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ కరోనా పరీక్ష చేయించుకోవాలి.. ఆ తర్వాతే పని ప్రారంభిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఓ కొత్త సినిమా చిత్రీకరణలో భాగంగా కరోనా టెస్ట్ చేయించుకున్నారు. పరీక్ష చేయించుకుంటున్న వీడియోను పంచుకుని– ‘‘జాగ్రత్త ముఖ్యం. షూట్ ముందు టెస్ట్ తప్పనిసరి’ అని పేర్కొన్నారు. కాగా ఈ పరీక్షలో కత్రినాకి కరోనా నెగెటివ్ వచ్చింది. -
సూపర్ హీరోయిన్లు
సూపర్ హీరోల సినిమాలు తరచూ చూస్తూనే ఉంటాం. సూపర్‌మేన్, స్పైడర్‌మేన్ వంటివి. మన దేశీ సూపర్ హీరోలు శక్తిమాన్, క్రిష్ కూడా ఉన్నారు. కానీ సూపర్ హీరో సినిమాలతో పోల్చు కుంటే సూపర్ హీరోయిన్ల సినిమాలు తక్కువ. హాలీవుడ్లో వండర్ ఉమెన్, బ్లాక్ విడో, కెప్టెన్ మార్వెల్ సినిమాలు ఉన్నాయి. కానీ భారతీయ చిత్రాల్లో సూపర్ హీరోయిన్ సినిమాలు అసలు రాలేదు. ప్రస్తుతం సూపర్ హీరోయిన్ సినిమాలను స్క్రీన్ మీదకు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ విశేషాలు... శ్రద్ధ... నాగకన్య శ్రద్ధా కపూర్ ఓ సినిమాలో నాగకన్యగా నటించనున్నారని తెలిసిందే. మూడు భాగాలుగా రూపొందించనున్న ఈ సినిమాను ఓ సూపర్ హీరోయిన్ ఫిల్మ్‌లా డిజైన్ చేస్తున్నారట చిత్రబృందం. విషాల్ ఫూరియా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో అవసరమైనప్పుడు నాగకన్యగా మారే శక్తులు శ్రద్ధకపూర్కి ఉంటాయని తెలిసింది. మరి సూపర్ హీరోలకు ప్రేక్షకులు ప్రేమను పంచినట్టే సూపర్ హీరోయిన్లను కూడా ఆదరిస్తారా? వేచి చూడాలి. అదితీ... ఆనా కన్నడంలో ‘ఆనా’ అనే సూపర్ హీరోయిన్ ఫిల్మ్ చిత్రీకరణ పూర్తయింది. అదితీ ప్రభుదేవా లీడ్ రోల్లో పి. మనోజ్ దర్శకత్వం వహించారు. ‘తొలి ఫీమేల్ సూపర్ హీరోయిన్ చిత్రం’ ఇదే అని చిత్రబృందం ప్రకటించింది. రెండు భాగాలుగా తెరకెక్కే ఈ సినిమా తొలి భాగానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమా మిగతా భాషల్లోనూ విడుదల కావచ్చు. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగంలో మరింత యాక్షన్ ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. కత్రినా... ది సూపర్ ఉమన్ ‘సుల్తాన్, టైగర్ జిందా హై’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఓ సూపర్ హీరోయిన్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం కత్రినా కైఫ్ తొలిసారి సూపర్ హీరోయిన్గా మారుతున్నారు. ఆల్రెడీ ఇందులో చేయబోయే యాక్షన్ సన్నివేశాల కోసం శిక్షణ తీసుకుంటున్నారు కత్రినా. వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. సుమారు నాలుగైదు దేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరపనున్నట్టు ప్రకటించారు అలీ అబ్బాస్. -
శరీరాన్ని కష్టపెట్టకండి
‘ఫిట్నెస్ అనేది మానసిక మరియు శారీరక ప్రయాణం. ఫిట్నెస్ కోసం చేసే వర్కవుట్స్‌ని ఆనందంగా చేయాలి కానీ ఏదో సాధించాలనే తాపత్రయంతో శరీరాన్ని ఇబ్బందిపెట్టకూడదు’’ అంటున్నారు కత్రినా కైఫ్. బాలీవుడ్లో ఫిట్‌గా ఉండే హీరోయిన్స్‌లో కత్రినా ఒకరు. పదిహేనేళ్ల క్రితం కెరీర్ ప్రారంభించినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే కనిపిస్తున్నారామె. ఫిట్నెస్ గురించి తన ఆలోచనలు పంచుకుంటూ –‘‘ఫిట్‌నెస్‌లో ముఖ్యమైన విషయం బ్యాలెన్స్. విపరీతంగా వర్కవుట్ చేస్తే నష్టమే. అందుకే బ్యాలెన్డ్స్‌గా ఉండాలి. జాగింగ్ అయినా రన్నింగ్ అయినా ఏ వ్యాయామం అయినా ఆస్వాదిస్తూ చేయాలి. క్రమం తప్పని పద్ధతిని ఫాలో అవ్వాలి. మనం ఆనందిస్తూ, ఆస్వాదిస్తూ చేసినప్పుడు ఏదీ కష్టం కాదు. అలాగే తమ శరీరాకృతిని మార్చుకోవడానికి కొందరు శరీరాన్ని బాగా కష్టపెడతారు. అది మంచిది కాదు. సినిమా స్టార్స్ అంటే ఫిట్‌గా కనిపించాలి, క్రీడాకారులు ఫిట్‌గా ఉండాలి.. మనకెందుకు? అని కొంతమంది అనుకుంటారు. అయితే మనం చేస్తున్న వృత్తికి, ఫిట్నెస్కి సంబంధం లేదు. మనం ఏ వృత్తిలో ఉన్నా ఫిట్‌గా ఉండటం ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌ని సీరియస్‌గా తీసుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి’’ అన్నారు కత్రినా కైఫ్. -
ఖైదీకి జోడి
ఖైదీకి జోడీగా మారనున్నారట కత్రినా కైఫ్. తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించిన చిత్రం ‘ఖైదీ’. కార్తీ నటించిన ఈ సినిమా హిందీలో రీమేక్ కాబోతోంది. హిందీలో అజయ్ దేవగన్ హీరోగా నటించనున్నారు. హీరోయిన్ గా కత్రినా కైఫ్ నటిస్తారని తాజా సమాచారం. ఒరిజినల్ లో హీరోయిన్ పాత్ర లేదు. హీరోకి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కానీ అందులోనూ హీరోయిన్ ని చూపించలేదు. అయితే ఈ రీమేక్ లో హీరోయిన్ పాత్రను యాడ్ చేయనున్నారట. అజయ్ భార్యగా కత్రినా నటించనున్నారట. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది ఖరారు కాలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు. -
పదే పదే నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి
‘షీలా కీ జవానీ’, ‘చిక్నీ చమేలీ’, ‘జర జర టచ్ మీ’ అంటూ ఐటంసాంగ్లతో చిలిపి చూపులు రువ్వే కత్రినా కైఫ్‌లో చిన్నపాటి తాత్వికురాలు ఇలా మెరిసి అలా మాయమవుతుంది. ఆ మెరుపులను పట్టుకోగలిగితే అవి ఇలా ఉంటాయి.... మదిలో... అకారణ ఆందోళన, అకారణ భయం... ఇలాంటి సమస్యలను బాలీవుడ్లో చాలామంది ప్రముఖులతో పాటు నేను కూడా ఎదుర్కొన్నాను. ఆలియా భట్ తన సమస్యల గురించి చెప్పుకుంది. డిప్రెషన్‌తో తాను ఎలా పోరాడింది దీపికా చెప్పింది. ఆమె డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి ఎంతోమంది వ్యక్తులు సహకరించారు. ఇక నా విషయానికి వస్తే పుస్తకాలు, ఇతర విషయాలు తోడ్పడ్డాయి. పనికిరాని విషయాలను మదిలోకి ఆహ్వానించి వాటి కింద నలిగిపోతుంటాం. అందుకే వాటిని దూరంగా పెట్టడం అవసరం. ఈ విశ్వం అనేది నా వల్లో, మీ వల్లో నడవడం లేదు. మరి అంతగా ఆందోళన పడాల్సిన అవసరం ఏమిటి? ఈ విశ్వాన్ని ఎవరైతే నడుపుతున్నారో, మనల్ని తీసుకెళ్లాల్సిన సమయంలో తీసుకువెళతారు. స్థూలంగా అర్థం చేసుకోవాల్సిన విషయమేమిటంటే, మనకు ఉన్నది ఒకటే జీవితం, ఏదో ఒకరోజు మనం వెళ్లిపోవాల్సిన వాళ్లమే. ఈ ఎరుక ఉంటే చాలా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. కొత్త ద్వారాలు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సున్నితంగా ఉండేదాన్ని. కాని ఇప్పుడు నాలో మార్పు వచ్చింది. నా చుట్టూ జరిగే విషయాలను లోతుగా విశ్లేషిస్తున్నాను. ఇబ్బంది పెట్టే ఆలోచనలను మనసు నుంచి ఖాళీ చేయించడం నేర్చుకున్నాను. ఆరోజు ‘బార్ బార్ దేఖో’ సినిమా షూటింగ్ కోసం థాయ్‌లాండ్ వెళుతున్నాను. కొద్దిరోజుల క్రితం ఏదో జరిగింది... అంతే దాని గురించే ఎన్నో ఆలోచనలు. పదే పదే నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు అనిపించింది. దీని నుంచే ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. కొత్త ప్రపంచానికి ద్వారాలు తెరుచుకున్నట్లు అనిపించింది. గతంలో ఈ ప్రపంచం దారి ఒకవైపు, నా దారి ఒకవైపు అన్నట్లుగా ఆలోచించేదాన్ని. ఇప్పుడు మాత్రం నేను ప్రపంచంతో కలిసి నడుస్తున్నట్లుగా ఉంది. పగటి కలలు చిన్నప్పుడు నేను నాదైన ప్రపంచంలో ఉండేదాన్ని. ‘ఇలా జరిగితే బాగుంటుంది కదా!’, ‘అలా జరిగితే బాగుంటుంది కదా!’ అని కలలు కనేదాన్ని. నా పగటి కలలు నన్ను నలుగురిలో కలవకుండా చేశాయి. ‘అసలు నేనేనా సినిమాల్లో నటిస్తున్నది?’ అని అప్పుడప్పుడూ నాకు నేనే ఆశ్చర్యపోతుంటాను! ‘అలా జరిగి ఉండాల్సింది కాదు’, ‘నేను అలా చేసి ఉండాల్సింది కాదు’ అంటూ గతాన్ని తలచుకొని బాధ పడను. ప్రతి సంఘటనా పాఠాన్ని నేర్పే అనుభవం, ఒక ప్రయాణం అనుకుంటాను. అనుభవాలు నేర్పించే పాఠాల వల్ల మానసిక పరిణతి వస్తుంది. ఇక నేను నమ్మే విషయాలకు వస్తే, ప్రతి వ్యక్తికీ తనదైన లక్ష్యం, గుర్తింపు ఉండాలని, ఎప్పుడు ఇతరులకు భారం కాకూడదనుకుంటాను. ఇక నా లోపాల గురించి చెప్పాల్సి వస్తే... అన్ని విషయాలను సమానంగా బ్యాలెన్స్ చేయడంలో విఫలమవుతున్నానేమో అనిపిస్తుంటుంది. -
కత్రినాపై రణ్‌బీర్‌కు ఎంత ప్రేమో!’
రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్ నటించిన సినిమాల్లోని పాత్రల పేర్లను గుక్కతిప్పుకోకుండా చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా గతంలో వీరిద్దరూ బి-టౌన్లో చెట్టాపట్టేలుసుకు తిరిగిన విషయం తెలిసిందే. ఒకానోక సమయంలో ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం కూడా చేశారు. ఇక వీరిద్దరూ కలిసి చాలా సినిమాలలో జంటగా నటించారు. వీరు ప్రేమికులుగా నటించిన ‘ఆజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ’, ‘రాజ్‌నీతి’, ‘జగ్గా జాసూస్’ చిత్రాల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రి బాగా కుదిరిందంటూ ప్రశంసలను కూడా అందుకున్నారు. కాగా గతంలో కత్రినాతో పీకల్లోతూ ప్రేమలో మునిగిన రణ్‌బీర్ ఓ ఇంటర్యూలో.. కత్రినా ఏఏ దర్శకులతో నటించారు.. ఆ సినిమాల్లో ఆమె నటించిన పాత్రల పేర్లను గబాగబా చెప్పేస్తున్న ఈ వీడియోకు ప్రస్తుతం వైరల్ అవుతుంది. అంతేకాదు వీడియో చివర్లో తనని తాను ‘ఏ కత్రినా కైఫ్’ అని కూడా పిలుచుకున్నాడు. (వైరలవుతున్న అలియా, రణ్‌బీర్ వెడ్డింగ్ కార్డు!) View this post on Instagram In this throwback video #RanbirKapoor takes a quiz on how well does he know #KatrinaKaif. Check out how he performs 😀 A post shared by Bollywood Hungama🎥 (@realbollywoodhungama) on May 4, 2020 at 3:16am PDT ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘రణ్‌బీర్‌కు కత్రినా అంటే ఎంత ప్రేమో’, రణ్‌బీర్... కత్రినా కైఫ్ ఎన్సైక్లోపిడియా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2010 నుంచి 2016 వరకూ బి-టౌన్లో క్యూట్ కపుల్‌గా పేరొందిన ఈ జంట ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ప్రస్తుతం రణ్‌బీర్, బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్‌తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు పుకార్లు కూడా వస్తున్నాయి. కాగా ప్రస్తుతం రణ్‌బీర్, అలీయాతో కలిసి ‘బ్రహ్మస్త్ర’లో నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్లో విడుదల కానున్నట్లు సమాచారం. ఇక కత్రినా చివరిగా భరత్‌లో నటించారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన ‘సూర్యవంశీ’లో నటిస్తున్నారు. (ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పేసిన విక్కీ) -
కరోనా: గిన్నెలు కడుగుతున్న హీరోయిన్
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గత కొంతకాలంగా బాలీవుడ్ సెలబ్రిటీలంతా ఇంటికే పరిమితమమైన సంగతి తెలిసిందే. ఇక ఏప్పుడు బిజీబిజీగా ఉండే స్టార్ హీరోలు సైతం ఇంట్లో ఉండటంతో ఈ విలువైన విరామ సమయాన్ని తమ కుటంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ కూడా ఇంట్లో తను సరదగా గడుపుతున్న వీడియోలను, ఫొటోలను నిరంతరం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. గతంలో తను వ్యాయమం చేస్తున్న వీడియోను షేర్ చేయగా.. తాజాగా గిన్నెలు కడుగుతూ ఇంటి పనుల్లో బిజీగా ఉన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు. (జనతా కర్ఫ్యూ: ఆత్మతో అక్కడ ఉన్నాను) View this post on Instagram 🍽 +🧽=🙂🏠 really makes u appreciate all the help we have at home #socialdistancing #staysafe #helpoutathome A post shared by Katrina Kaif (@katrinakaif) on Mar 23, 2020 at 7:37am PDT అంతేగాక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన మేనల్లుడు ఆహిల్ శర్మతో కలిసి ఫామ్‌లో సందడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఫామ్‌లో తిరుగుతూ చెట్ల పండ్లను కోస్తూ ఆహిల్‌కు అందిస్తుంటే.. ఆహిల్ అత్యుత్సాహం చూపిస్తున్న ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లోని సల్మాన్ ఫ్యాన్స్ క్లబ్ అకౌంట్లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ఆహిల్ చాలా క్యూట్‌గా ఉన్నాడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అర్జున్‌కపూర్, అనన్య పాండేలతో పాటు ఇతర సెలబ్రిటీలు సైతం ఇంట్లో సరదాగా గడుపుతున్న ఫొటోలను నిరంతరం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. (జనతా కర్ఫ్యూ.. ప్రభుత్వ సెలవు కాదు: సల్మాన్ ఖాన్) View this post on Instagram @beingsalmankhan spend some quality times with his nephew #Ahil at #ArpitaFarm panvel 💖💖💖💖 . . #beingsalmankhan #katrinakaif #salmankhanmerijaan #salmankhanlove #salmankhanlife #salmankhanprem #salmankhansmile #dabangg3 #kick #BharatWithFamily #IAmBharat #BharatInMalta #salmaniacs #inshasayed #arpitakhansharma #salmakhan #salimkhan #arbazkhan #wardakhannadiadwala #sohailkhan #alvirakhanagnihotri #skffilms #Radhe #RadheEid2020 #kabhieidkabhidiwalieid2021 A post shared by BeingSalman❤2712(Insha Sayed) (@radhe_salmankhan2712) on Mar 20, 2020 at 11:28am PDT -
తండ్రీకూతుళ్లుగా...
అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ త్వరలోనే తండ్రీ కూతుళ్లు కానున్నారట. తండ్రీ–కూతుళ్ల బంధం మీద బాలీవుడ్ దర్శకుడు వికాశ్ బాల్ ‘డెడ్లీ’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అంత్యక్రియల కార్యక్రమం చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుందట. ఇందులో అమితాబ్ బచ్చన్, కత్రినా తండ్రీ కూతుళ్ల పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాలో నటించడానికి ఆల్రెడీ తమ అంగీకారాన్ని తెలిపారట బచ్చన్, కత్రినా. ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్‌ను మే నెలలో ప్రారంభించాలనుకున్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణను కొన్నిరోజులు ఆగి ప్రారంభించాలనుకుంటున్నారు. -
కత్రినాకు షాకిచ్చిన హీరో!
సోషల్ మీడియాలో సెలబ్రెటీలు షేర్ చేసే ఫొటోలకు వారి సహా నటులు సరదగా కామెంట్స్ చేసి ఆటపట్టిస్తుంటారు. ఇందులో బాలీవుడ్ సెలబ్రిటీలు ముందుంటారు. ముఖ్యంగా హీరో అర్జున్ కపూర్ బాలీవుడ్ నటి, నటులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వారి ఫొటోలకు కామెంట్లు పెట్టి ఏడిపంచడంలో ముందుంటాడన్న సంగతి తెలిసిందే. అయితే ఏప్పుడూ అందరిని ఏడిపించే అర్జున్ను తాజాగా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఏడిపించారు. అర్జున్ తాజా ఫొటో షూట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను అభిమానుల కోసం సోషల్ మీడియా షేర్ చేశాడు. ఇక అవి చూసి కత్రినా ‘ఏమైంది.. నువ్వు ఏమైనా పోగొట్టుకున్నావా’ అని ఫన్నీగా కామెంట్ చేశారు. దీనికి అర్జున్ ‘అవును.. నీ నెంబర్ పోయింది. ఇక్కడ పంపించవా ప్లీజ్’ అంటూ సమాధానం ఇచ్చి కత్రినా షాకిచ్చాడు. (140 కిలోల బరువు పెరిగాడు.. ఆ తర్వాత..) వేడుకలో తళుక్కుమన్న మలైకా, అర్జున్ View this post on Instagram ⏮️ A post shared by Arjun Kapoor (@arjunkapoor) on Feb 26, 2020 at 9:27pm PST అనుష్కను ఆటపట్టించిన హీరో! కాగా కత్రినా షేర్ చేసినా ఫొటోలకు కూడా అర్జున్ కామెంట్స్‌తో ఏడిపించాడు. ఇటీవల బీజ్ తీరంలో కత్రినా తీసుకున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇక వెంటనే అర్జున్ ‘ఫొటోకి ఫోజ్ ఇస్తూ.. స్తంభాన్ని గుద్దేస్తావా ఏంటి’ అంటూ కత్రినాను ఆటిపట్టించాడు. ఇలా వీరిద్దరూ సోషల్ మీడియాలో ఏడిపించుకోవడం కొత్తేమి కాదు.. గతంలో కూడా కత్రినా షేర్ చేసినా ఫొటోలకు అర్జున్ కామెంట్స్ చేసి ఏడిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాగా కత్రినా ప్రస్తుతం బాలీవుడ్ ‘కిలాడి’ అక్షయ్ కుమార్ సరసన ‘సూర్యవంశీ’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అర్జున్, రకుల్‌ప్రీత్ సింగ్‌తో కలిసి ఓ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. View this post on Instagram 💙💚💛 A post shared by Katrina Kaif (@katrinakaif) on Jul 12, 2019 at 9:18am PDT -
యాక్షన్‌కి రెడీ
హీరోయిన్ కత్రినాకైఫ్ ఈ ఏడాది సూపర్‌హీరోగా మారబోతున్నారని బాలీవుడ్ సమాచారం. ఆల్రెడీ ఇందుకు తగ్గ పనులు కూడా మొదలయ్యాయట. సల్మాన్‌ఖాన్‌తో ‘సుల్తాన్’ (2016), ‘టైగర్ జిందా హై’(2017), ‘భారత్’ (2019) చిత్రాలను తెరకెక్కించిన అలీ అబ్బాస్ జాఫర్, కత్రినాను సూపర్ హీరోగా మార్చే కథను రెడీ చేస్తున్నారట. ఇందులో క్యారెక్టర్ పరంగా కత్రినా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను చేయబోతున్నారని బాలీవుడ్ టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు అలీ అబ్బాస్. వీలైనంత త్వరగా కథను ముగించి, ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు. కాగా అలీ అబ్బాస్ దర్శకుడిగా తెరకెక్కించిన తొలిచిత్రం ‘మేరే బ్రదర్‌కీ దుల్హన్’లో హీరోయిన్గా నటించిన కత్రినా ఆ తర్వాత ‘టైగర్ జిందా హై’, ‘భారత్’ చిత్రాల్లోనూ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. -
కత్రినా పెళ్లి.. తల్లిదండ్రులుగా బిగ్‌బీ దంపతులు!
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌కు తల్లిదండ్రుగా మారి ఆమె వివాహాం జరిపించారు బాలీవుడ్ బిగ్‌బీ దంపతులు అమితాబ్ బచ్చన్, జయబచ్చన్లు. ఈ వివాహా మహోత్సవానికి తెలుగు, తమిళ, కన్నడ అగ్రకథానాయకులు నాగార్జున, ప్రభు, శివరాజ్‌లు హజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేంటి కత్రినా పెళ్లి జరిగిందా! ఎవరితో.. అది కూడా బిగ్‌బీ దంపతులు తల్లిదండ్రులుగా ఆమెకు వివాహాం జరిపించడమేంటి అని షాక్ అవుతున్నారా. అయితే ఇదంతా జరిగింది రీల్లో రీయల్గా కాదు. అసలు విషయం ఎంటంటే కత్రినా ప్రముఖ కళ్యాణ్ జ్యూవెల్లర్స్ నగల దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ నగల దుకాణం ప్రమోషన్లో భాగంగా ఓ యాడ్‌ను చిత్రికరిస్తున్నారు. ఇందులో కత్రినా పెళ్లి కూతిరిగా కనిపించగా ఆమెకు తల్లిదండ్రులుగా బిగ్‌బీ, ఆయన సతిమణి జయ బచ్చన్లు కనిపించనున్నారు. ఈ పెళ్లిలో నాగార్జున, ప్రభు గణేషన్, శివ రాజ్కూమార్లు ముఖ్య అతిథులుగా హాజరై పెళ్లి జరిపించారు. కాగా కళ్యాణ్ జ్యూవెల్లర్స్‌కు తెలుగులో అంబాసిడర్‌గా నాగార్జున వ్యవహిరించగా తమిళంలో ప్రభు గణేషన్, కన్నడలో శివరాజ్ కుమార్‌లు అంబాసిడర్లుగా వ్యవహిరస్తున్నారు. వీరితో పాటు అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ అంబాసిడర్లుగా ఉన్నారు. T 3419 - - Historic moment for Jaya and me .. 3 superstar sons of 3 Iconic Legends of Indian Film Industry , work together with us .. what honour .. Nagarjun - son Akkineni Nageshwara Rao, Telugu Shivraj Kumar - son Dr Raaj Kumar, Kannada Prabhu - son Shivaji Ganesan, Tamil pic.twitter.com/Plvtd372ZH — Amitabh Bachchan (@SrBachchan) 24 January 2020 కాగా ఈ యాడ్‌కు సంబంధించిన షూటింగ్ ఫొటోలను బిగ్ బీ తన ట్విటర్ షేర్ చేస్తూ.. ‘జయకు నాకు ఇది ఎంతో గౌరవకారణమైనది. దీన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేం. సీనీ పరిశ్రమలోని ముగ్గురూ లెజెండరి సూపరస్టార్ కుమారులతో కలిసి నటించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. తెలుగు అగ్రకథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున, తమిళ సూపర్ స్టార్ శివాజీ గణేషన్ తనయుడు ప్రభు గణేషన్, కన్నడ స్టార్ రాజ్‌కుమార్ తనయుడు శివరాజ్ కుమార్‌లతో కలిసి నటించాము’ అంటూ షేర్ చేశారు. తమ అభిమాన సూపర్ స్టార్లను ఒకే వేధికపై చూసిన ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా ఉండదు. అలాంటిది ఒకే తెరపై కలిసి నటిస్తూ అది కూడా వివాహా వేడుకల్లో చూస్తే ఇంకా అభిమానులకు ఎంతటి కనుల పండగగా ఉంటుందో మీరే ఊహించుకోండి. -
ఇంకో పోలీస్ కావలెను!
బాలీవుడ్లో ఓ లేడీ పోలీసాఫీసర్ కోసం నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారట నటుడు షారుక్ ఖాన్, దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్. వీరిద్దరి కాంబినేషన్లో గత ఏడాది విడుదలైన ‘జీరో’ బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఇప్పుడు షారుఖ్ –ఆనంద్ ఓ సినిమాను నిర్మించాలనుకుంటున్నారు. ఇది ఓ సౌత్ కొరియన్ సినిమాకు హిందీ రీమేక్ అట. కథ ప్రకారం సినిమాలో ఇద్దరు లేడీ పోలీసాఫీసర్లు ఉంటారట. అందులో ఒక పోలీసాఫీసర్ పాత్ర కోసం కత్రినా కైఫ్‌ను ఎంపిక చేశారని బాలీవుడ్ టాక్. మరో లేడీ పోలీసాఫీసర్ కోసం హీరోయిన్ల జాబితాను పరిశీలిస్తున్నారట. విద్యాబాలన్ పేరు తెరపైకి వచ్చినప్పటికీ ఇంకా ఫైనలైజ్ కాలేదట. ప్రస్తుతం ‘సూర్యవన్షీ’ చిత్రంతో బిజీగా ఉన్నారు కత్రీనాకైఫ్. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరో. -
ఇప్పుడు కత్రినాతో వాన పాట
పాపులర్ అయిన పాత పాటలన్నీ కొత్త సినిమాల కోసం రీమిక్స్ చేసే ట్రెండ్ తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లోనూ ఉంది. ముఖ్యంగా ఈ మధ్య హిందీలో ఈ రీమిక్స్ లెక్క పెరిగింది. గత ఏడాది రీమిక్స్ సాంగ్స్ ‘దిల్బర్ దిల్బర్...’ (సత్యమేవ జయతే), ‘ఆంఖ్ మారే..’ (సింబా) విన్నాం. తాజాగా అక్షయ్ కుమార్ కూడా ఓ రీమిక్స్ సాంగ్‌కు స్టెప్ వేయనున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ‘సూర్యవన్షీ’ అనే పోలీస్ స్టోరీ చేస్తున్నారు అక్షయ్. కత్రినా కైఫ్ కథానాయిక. ‘మోహ్రా’ సినిమాలోని అక్షయ్, రవీనా టాండన్ పాడుకున్న వాన పాట ‘టిప్ టిప్ బర్సా పానీ...’ ఎంత పాపులరో తెలిసిందే. చెప్పాలంటే ‘మోహ్రా’ సినిమాలో ప్రతీ పాట బ్లాక్‌బస్టరే. ‘తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్..’, ‘నా కజ్రే కా దర్’ పాటలు ఆ సినిమాలోవే. ఇక అక్షయ్, కత్రినా కాలు కదపనున్న ‘టిప్ టిప్ బర్సా పానీ..’ పాటకు ఫర్హాఖాన్ కొరియోగ్రఫీ చేయనున్నారు. ఒకప్పుడు తాను డ్యాన్స్ చేసిన పాటను మళ్లీ తన సినిమాలోనే రీమిక్స్ చేయడం పట్ల అక్షయ్ స్పందిస్తూ – ‘‘ఈ పాటను వేరే ఏ యాక్టర్ రీమిక్స్ చేసినా కచ్చితంగా నిరుత్సాహపడేవాణ్ణి. ఎందుకంటే నాకు, నా కెరీర్‌కు ఈ పాట చాలా స్పెషల్’’ అన్నారు. ‘సూర్యవన్షీ’ వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది. -
ముద్దంటే చేదే!
‘ముద్దు సన్నివేశాల్లో నటించడం నాకు అసౌకర్యంగా ఉంటుంది’’ అంటున్నారు సల్మాన్ ఖాన్. ఆయన హీరోగా, కత్రినాకైఫ్, దిశా పటానీ హీరోయిన్లుగా రూపొందిన ‘భారత్’ ఈ నెల 5న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లో పాల్గొన్న సల్మాన్‌ను ‘మీరు ముద్దు సీన్లలో ఎందుకు నటించరు?’ అని అడిగిన మీడియాతో– ‘‘ఇప్పుడు ట్రెండ్ మారింది. లిప్‌లాక్, రొమాంటిక్ సన్నివేశాలను సాధారణంగా తీసుకుంటున్నారు. అయినప్పటికీ అలాంటి సన్నివేశాలు నాకు అసౌకర్యంగా అనిపిస్తాయి. మనం ఫ్యామిలీతో సినిమా చూస్తున్నప్పుడు ముద్దు సీన్ వస్తే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. నా సినిమా అంటే మొత్తం కలిసి చూసేలా ఉండాలి. రొమాంటిక్ సీన్లలో చేయమని కొందరు దర్శకులు అడిగితే కుదరదని చెప్పేశా. ‘మైనే ప్యార్ కియా’ (1989) సినిమాలో వచ్చిన రొమాంటిక్ సన్నివేశాలు నేను నేరుగా చేసినవి కావు. ఆ టైమ్‌లోనే అలాంటి సీన్లు చేయలేదు.. ఇప్పుడెందుకు ఒప్పుకుంటా?’’ అన్నారు. -
ప్రొడ్యూసర్ కత్రినా
కథానాయికలు ఇటీవల నిర్మాతలుగా మారడం మనం గమనిస్తూనే ఉన్నాం. బాలీవుడ్లో ఆల్రెడీ ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మలు సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి కత్రినా కైఫ్ కూడా జాయిన్ కాబోతున్నారు. ఫ్రెంచ్ చిత్రం ‘హీ లవ్స్ మీ.. హీ లవ్స్ మీ నాట్’ హక్కులను కత్రినా తీసుకున్నారని, ఈ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ విషయం గురించి కత్రినా మాట్లాడుతూ – ‘‘ఆ ఫ్రెంచ్ చిత్రకథ మీద కొంత కాలంగా వర్క్ చేస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ నన్ను చాలా ఎగై్జట్ చేసింది. ఈ సినిమాకు నిర్మాతగా నా పేరు వేసుకోబోతున్నాను. ఈ ఏడాదే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్తాం’’ అని పేర్కొన్నారు. మరోవైపు కత్రినా నటించిన ‘భారత్’ జూన్ 5న రిలీజ్ కానుంది. -
మేకప్‌కే రెండున్నర గంటలు
సాధారణంగా సినిమా నిడివి రెండు నుంచి మూడు గంటల మధ్యలో ఉంటుంది. కానీ సినిమాలో ఒక్కో సీన్లో కనిపించే గెటప్ కోసం సుమారు రెండు గంటలు మేకప్ రూమ్‌లో గడిపారట సల్మాన్. తన తాజా చిత్రం ‘భారత్’లో 18 ఏళ్ల వయసు నుంచి 71 ఏళ్ల వృద్ధుడిగా విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారాయన. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్, కత్రీనా కైఫ్, దిశా పాట్నీ నటించిన చిత్రం ‘భారత్’. ఈ సినిమాలో సల్మాన్ గెటప్స్ గురించి అలీ అబ్బాస్ జాఫర్ మాట్లాడుతూ– ‘‘ 70 ఏళ్ల వ్యక్తి పాత్ర కోసం యూకే కంపెనీ వాళ్లు వర్క్ చేశారు. ఈ పాత్రకు ఏ లుక్ సూట్ అవుతుందా? అని చాలా ట్రై చేశాం. 20 రకాలు గడ్డాలు, మీసాలు చూశాం. ఫైనల్‌గా ఇప్పుడు పోస్టర్స్‌లో చూస్తున్న లుక్ ఓకే అయింది. ప్రోస్థటిక్ మేకప్ కోసం రెండున్నర గంటలు సమయం తీసుకునేవారు. స్క్రిప్ట్‌లో ఈ లుక్స్ అవసరాన్ని సల్మాన్ అర్థం చేసుకొని చాలా సపోర్ట్ చేశారు’’ అన్నారు. ‘భారత్’ జూన్ 5న విడుదలవుతోంది. -
కత్రినా.. నువ్వు లేకుంటే చచ్చిపోతా.. పెళ్లి చేసుకో!
‘కత్రినా.. నిన్ను నేను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను. నువ్వు లేకపోతే చచ్చిపోతాను. నన్ను పెళ్లి చేసుకో. నీ నెంబర్ ఇవ్వు’ .. ఇది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్ ట్వీట్. ఓ వెబ్ షోలో పాల్గొన్న కత్రినా ఈ ట్వీట్‌కు పాజిటివ్‌గా స్పందిస్తూ.. ‘ ఈ రోజుల్లో కూడా ఇంతటి బలమైన భావోద్వేగాలు గల మనుషులు ఉన్నారని తెలియడం ఆనందం కలిగిస్తోంది. ఈ రోజుల్లో అందరూ పరిస్థితులకు అనుగుణంగా ఉండిపోతూ.. ఏదీ సీరియస్‌గా తీసుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. నటుడు ఆర్బాజ్ ఖాన్ నిర్వహించే వెబ్ షో ‘పించ్’లో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియాలో నటులు, సెలబ్రిటీలపై వచ్చే కామెంట్లు, ట్రోలింగ్లు వారికి చదివి వినిపిస్తారు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో వచ్చిన పెళ్లి ప్రతిపాదనను చూపించగా.. కత్రినా ఒకింత ఉద్వేగంగానే స్పందించారు. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి కూడా ఆమె మాట్లాడారు. రణ్‌బీర్ కపూర్‌తో రిలేషన్‌షిప్‌కు బ్రేకప్ చెప్పిన తర్వాత సింగిల్‌గానే ఉంటున్న ఆమె.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఏమో ఐడియా లేదు. ఒకరోజు పెళ్లి చేసుకుంటాను. జీవితం ఊహించలేనిది. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు’ అని బదులిచ్చారు. వైవాహిక వ్యవస్థపై నమ్మకముందా? అని ప్రశ్నించగా.. ‘ఒక వ్యక్తిగా నాకు పెళ్లి, పిల్లలపై నమ్మకముంది. ఒకరోజు నేను పెళ్లి చేసుకుంటాను’ అని తెలిపారు. -
పరుగుల రాణి
బాలీవుడ్‌కు బయోపిక్స్ ఫీవర్ ఇప్పట్లో తగ్గేలా లేదు. లేటెస్ట్గా మరో బయోపిక్‌కి శ్రీకారం జరగనుందనే వార్త వినిపిస్తోంది. పరుగుల రాణి పీటీ ఉషా జీవితం ఆధారంగా ఓ చిత్రం తయారు కానుందట. పీటీ ఉష పాత్రలో కత్రినా కైఫ్ నటిస్తారని సమాచారం. బయోపిక్ జానర్లో ఇప్పటి వరకూ యాక్ట్ చేయలేదు కత్రినా. ఉషా జీవితం ఆధారంగా దర్శకురాలు రేవతి యస్. వర్మ ఓ కథను తయారు చేయడం, కత్రినాతో పలు చర్చలు జరపడం కూడా జరిగాయట. ఈ బయోపిక్‌లో నటించడానికి కత్రినా ఆసక్తిగా ఉన్నారని బాలీవుడ్ టాక్. ఇందులో నటించడానికి కత్రినాకు కావాల్సిన ట్రైనింగ్‌ని పీటీ ఉషా దగ్గరుండి పర్యవేక్షించనున్నారని తెలిసింది. పరుగు పందెంలో ఎన్నో మెడల్స్ గెలిచిన ఉషా జీవితం నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కూడా పరుగులు పెట్టడం ఖాయం. -
సినీ హోలీ
రంగురంగుల హోలీ వేడుకల్లో ఆనందాన్ని చల్లుకుని, చిరునవ్వులను పంచుకుని అనుభూతులను దాచుకున్నారు సినీ తారలు. కొందరు కుటుంబంతో హోలీని జరుపుకుంటే మరికొందరు హోలీడే అయినా నో హాలిడే అంటూ సెట్లో జరపుకున్నారు. మరికొందరు స్నేహితులతో కలిసి జరుపుకున్నారు. వాటిలో కొన్ని ఫొటోలే ఇక్కడున్నవి. సన్నీ లియోన్ కల్యాణ్ దేవ్, శ్రీజ కత్రినా కైఫ్ కృతీ సనన్, కంగన నిహారిక, అల్లు అర్జున్, స్నేహ వరుణ్, నటాషా అమలా పాల్, ప్రియా ప్రకాశ్ రాయ్ లక్ష్మీ -
రేస్‌లో ముందు!
కామెడీ టైమింగ్‌లో మహేశ్‌బాబు టాలెంట్ ఏంటో ‘దూకుడు’ సినిమాలో ఫుల్‌గా చూశాం. స్క్రిప్ట్‌ను బట్టి ఇదే జోరును ఆ తర్వాత కొనసాగిస్తున్నారు మహేశ్. ఇక ‘ఎఫ్ 2’ సినిమాతో ప్రేక్షకులకు బాగా కితకితలు పెట్టారు అనిల్ రావిపూడి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా పట్టాలెక్కడానికి రంగం సిద్ధమవుతుందనే సంగతి తెలిసిందే. స్క్రిప్ట్‌లో ఫన్‌కి చాలా స్కోప్ ఉందట. ప్రస్తుతం మహేశ్‌బాబు ‘మహర్షి’ సినిమా షూట్‌తో బిజీగా ఉన్నారు. మే 9న విడుదల కానున్న ఈ సినిమా ఒక కొలిక్కి రాగానే అనిల్ రావిపూడితో కలిసి సెట్స్‌కు వెళ్తారు మహేశ్‌బాబు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం సాయిపల్లవి, కత్రినా కైఫ్, రష్మికా మండన్నా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ ముగ్గురిలో రష్మికా మండన్నా రేస్‌లో ముందు వరుసలో ఉన్నారని తెలిసింది. రష్మికానే ఆల్మోస్ట్ ఒకే అయ్యారట. -
100 డేస్... 5 లుక్స్
పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది ఓ జంట. అంతలోనే భర్తకు ఆర్మీ నుంచి పిలుపొచ్చింది. దేశ సేవ కోసం వెంటనే సరిహద్దు దిశకు ప్రయాణం మొదలు పెట్టే సమయం ఆసన్నం అవుతుంది. అప్పుడు ఆ దంపతులు ఎలా ఎమోషనల్‌గా ఫీలయ్యారు? అనే దృశ్యాలను వెండితెరపై చూడాలంటే ‘భారత్’ సినిమా చూడాల్సిందే. సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా ఈ చిత్రం రూపొందుతోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిశా పాట్నీ, టబు కీలక పాత్రలు చేస్తున్నారు. శనివారంతో ఈ సినిమా షూటింగ్ వంద రోజులకు చేరుకుంది. ఇంతటితో ప్యాచ్ వర్క్ మినహా ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. చివరిగా ముంబైలో సల్మాన్, కత్రినాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. మాల్తా, అబుదాబి, లూధియానా, ఢిల్లీ ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో సల్మాన్ ఐదు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తారు. 1947 నుంచి 2000 కాలపరిణామ నేపథ్యంలో ఈ సినిమా స్రీన్‌ప్లే ఉంటుంది. 2014లో వచ్చిన కొరియన్ హిట్ మూవీ ‘యాన్ ఓడ్ టు మై ఫాదర్’కి ‘భారత్’ హిందీ రీమేక్. ఈ సినిమాను ఈ ఏడాది రంజాన్‌కి విడుదల చేయాలనుకుంటున్నారు. -
పది కోట్లు నేలపాలు!
సినిమాల్లో భారీ సెట్లను రూపొందించడం మామూలే. ఎక్కువ సందర్భాల్లో ఆ సెట్లను అలా ఉంచేసి కొద్దిమార్పులతో మరో సినిమాకు వినియోగిస్తుంటారు. కానీ సల్మాన్ ఖాన్ ‘భారత్’ టీమ్ మాత్రం 10 కోట్ల వ్యయంతో రూపొందించిన సెట్‌ను ధ్వంసం చేయాలనుకుంటోందట. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, దిశా పాట్నీ నటిస్తున్న చిత్రం ‘భారత్’. ఈ సినిమా కోసం పది కోట్ల వ్యయంతో ఓ సెట్‌ను నిర్మించారు. కథానుసారంగా క్లైమాక్స్‌లో ఈ సెట్‌ను ధ్వంసం చేయాల్సి రావడంతో సెట్‌ను కూల్చేయడానికి సిద్ధమయ్యారు. ఆమిర్ ఖాన్ తాజా చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ సినిమాకూ ఇలానే జరిగింది. ఆ సినిమా కోసం తయారు చేసిన భారీ ఓడను సినిమాలో భాగంగా నిజంగానే ధ్వంసం చేశారు. ఇప్పుడు ‘భారత్’ టీమ్ 10 కోట్లను నేలపాలు చేయబోతోంది. ఇంకో వారం రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి కానుందట. ఈద్ స్పెషల్‌గా థియేటర్స్‌లోకి ఈ చిత్రం రానుంది. -
స్క్రీన్ టెస్ట్
1960–70లలో ఓ ఐటెమ్ సాంగ్ ఉంది అంటే ఆ పాటల కోసం స్పెషల్ ఆర్టిస్ట్‌లు ఉండేవారు. 90లలో సీన్ మారింది. స్పెషల్ ఆర్టిస్టులతో దాదాపు పని లేకుండా పోయింది. అందుకే అప్పట్లో జయమాలిని, జ్యోతిలక్ష్మి, అనురాధ, హలం, సిల్క్ స్మితల్లా ఇప్పుడు బోలెడంత మంది ఐటమ్ డ్యాన్సర్స్ లేరు. స్పెషల్ సాంగ్స్‌ను హీరోయిన్లు కూడా చేస్తున్నారు. సినిమా మార్కెటింగ్‌కు ఇదో కొత్తరూట్ అన్నమాట. ఏది ఏమైనా ‘ఐటమ్ సాంగ్’ అంటే కిక్కే వేరు. ఇలాంటి మస్త్ మసాలా పాటలకు కాలు కదిపిన తారల గురించి ఈ వారం క్విజ్. సరదాగా ఓ లుక్కేయండి. 1 ‘ఓ సుబ్బారావో ఓ అప్పారావో ఓ వెంకట్రావో ఎవరో ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా...’ అనే పాట యన్టీఆర్, శ్రీదేవి, జయచిత్ర నటించిన ‘బొబ్బిలిపులి’ చిత్రంలోనిది. ఆ పాట రచయిత ఎవరు? ఎ) వేటూరి బి) దాసరి నారాయణరావు సి) సిరివెన్నెల డి) కొసరాజు 2 ‘ఇప్పటికింకా నా వయను నిండా పదహారే, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే’... ఈ ఒకే ఒక్క పాటతో యూత్ మొత్తానికి దగ్గరైన నటి ఎవరు? ఎ) గాబ్రియేలా బి) ముమైత్‌ఖాన్ సి) ఆండ్రియా డి) ముంతాజ్ 3 1980–90ల దశకంలో ఐటమ్ సాంగ్‌లతో ఓ వెలుగు వెలిగారు ప్రముఖ డ్యాన్సర్ అనూరాధ. అమె దాదాపు ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా? ఎ) 330 బి) 550 సి) 700 పైన డి) 1000 చిత్రాలు పైనే 4 సూపర్‌హిట్ సాంగ్ ‘లే లే లే లేలేలే నా రాజా..’ ప్రేమనగర్’ చిత్రంలోనిది. ఈ పాటను పాడిన సింగర్ పేరేంటి? ఎ) పి. సుశీల బి) ఎస్. జానకి సి) జిక్కీ డి) ఎల్.ఆర్. ఈశ్వరి 5. ‘నేను పక్కా లోకల్ పక్కా లోకల్, నేను పక్కా లోకలో...’ అంటూ చిందులేసిన ప్రముఖ హీరోయిన్ ఎవరు? ఎ) కాజల్ అగర్వాల్ బి) అనుష్క సి) నయనతార డి) లావణ్యా త్రిపాఠి 6 1974లో ‘ఆడదాని అదృష్టం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు జయమాలిని. ఆమెను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన దర్శకుడెవరు? ఎ) కె.వి. రెడ్డి బి) విఠలాచార్య సి) వి. మధుసూదన్‌రావు డి) పి.సి. రెడ్డి 7 ‘మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల’ పాట చాలా ఫేమస్. ఆ పాట ఏ సినిమాలోనిదో తెలుసా? ఎ) వయ్యారిభామలు వగలమారి భర్తలు బి) స్త్రీజన్మ సి) దేవుడు చేసిన మనుషులు డి) విచిత్ర కుటుంబం 8 ‘అ అంటే అమలాపురం ఆ ఆంటే ఆహాపురం...’ సూపర్‌హిట్ సాంగ్‌లో నటించిన నటి పేరేంటి? ఎ) నటాలియా కౌర్ బి) అభినయశ్రీ సి) రచనా మౌర్య డి) స్కార్లెట్ విల్సన్ 9 ‘నా ఇంటిపేరు సిల్క్ నా వంటి రంగు మిల్క్...’ అంటూ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో చిందేసిన బ్యూటీ పేరేంటో? ఎ) శ్రియ బి) రాశీఖన్నా సి) సమంత డి) తమన్నా భాటియా 10 ‘మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రోడే...’ అనే పాటలో ప్రభాస్‌తో కాలు కదిపిన భామ ఎవరో? ఎ) మధుశర్మ బి) హంసానందిని సి) జబీన్ ఖాన్ డి) అల్ఫోన్సా 11 ‘జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాణి...’ అంటూ ‘రంగస్థలం’ చిత్రంలో హీరో రామ్‌చరణ్ స్టెప్పులేసిన భామ పేరేంటి? ఎ) కియరా అద్వానిæ బి) శ్రుతీహాసన్ సి) అమీ జాక్సన్ డి) పూజా హెగ్డే 12 దర్శకుడు శేఖర్ కమ్ముల మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సినిమాలు చేస్తారని పేరుంది. సందర్భానుసారంగా ఆయన కూడా ఓ సినిమాలో ఐటెమ్ సాంగ్‌ను చిత్రీకరించారు. ఆ సాంగ్‌లో నటించింది ప్రముఖ టీవి యాంకర్. ఎవరా యాంకర్? ( క్లూ: ఆ పాట ఏంటంటే.. ‘రాజశేఖరా నీపై మోజూ తీరలేదురా, రాజసాన ఏలరా రాజా రాజా...’) ఎ) శిల్పాచక్రవర్తి బి) ఉదయభాను సి) అనసూయ డి) సుమ 13. ‘కొప్పున పూలెట్టుకొని బుగ్గన ఏలెట్టుకొని ఈదంట నేనెల్తుంటే, కెవ్వుకేక....’ అనే పాటలో నటించిన బాలీవుడ్ హాట్ లేడీ ఎవరో కనుక్కోండి? ఎ) ఆలియా భట్ బి) ఊర్మిళా మటోండ్కర్ సి) కత్రినాకైఫ్ డి) మలైకా అరోరా 14 ‘డియో డియో డిసక డిసక...’ అంటూ యూత్‌ను ఎట్రాక్ట్ చేసిన నటి పేరేంటి? ఎ) సన్నీ లియోన్ బి) రాఖీ సావంత్ సి) సెలీనా జైట్లీ డి) యానా గుప్తా 15 ‘బావలు సయ్యా మరదలు సయ్యా, రింబోల రింబోలా..’ అంటూ కోట శ్రీనివాసరావు, బాబుమోహన్లను ఓ ఆట ఆడించిన నటి ఎవరో గుర్తుందా? ఎ) డిస్కో శాంతి బి) ‘సిల్క్’ స్మిత సి) విజయలలిత డి) కుయిలీ 16 ‘చిలకలూరి చింతామణి నా పేరంటే తెలియనోళ్లు లేరే జానీ...బ్లాక్‌బస్టరు బ్లాక్‌బస్టరే ’అని అంజలి ఏ హీరోతో డ్యాన్స్ చేశారు? ఎ) రామ్‌చరణ్ బి) మహేశ్‌బాబు సి) యన్టీఆర్ డి) అల్లు అర్జున్ 17. ‘వెల్కమ్ టూ సక్కుబాయ్... గరమ్ చాయ్ తాగేసెయ్.. మజాచెయ్...’ అని చార్మీ ఏ హీరోతో స్టెప్పులేశారో గుర్తుందా? ఎ) నాగార్జున బి) బాలకృష్ణ సి) వెంకటేశ్ డి) రానా 18 ‘పుట్టింటోళ్లు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు...’ అనే సాంగ్‌లో యన్టీఆర్‌తో కలిసి స్టెప్పులేసిన ప్రముఖ డ్యాన్సర్ ఎవరో కనుక్కోండి? ఎ) హలం బి) అనురాధ సి) జయమాలిని డి) జ్యోతిలక్ష్మీ 19 ‘అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి...’ అల్లు శిరీష్, రెజీనా జంటగా నటించిన ‘కొత్తజంట’ చిత్రంలోని పాట ఇది. ఈ పాటలో నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) కేథరిన్ బి) హన్సిక సి) మధురిమ డి) ఈషా రెబ్బా 20, ‘బళ్లారి బావ...’ అంటూ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సమీరారెడ్డి హీరోలు వెంకటేశ్, రానాలతో కలిసి చిందేశారు. ఆ చిత్ర దర్శకుడెవరో తెలుసా? ఎ) వంశీ పైడిపల్లి బి) క్రిష్ సి) సుకుమార్ డి) కృష్ణవంశీ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) బి 3) సి 4) డి 5) ఎ 6) బి 7) సి 8) బి 9) డి 10) బి 11) డి 12) బి 13) డి 14) ఎ 15) బి 16) డి 17) ఎ 18) సి 19) సి 20) బి -
అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి!
అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని అన్నారు ఆత్రేయ. ప్రస్తుతం హిందీ చిత్రపరిశ్రమలో నటీనటుల ఎంపికకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. సినిమాకు కొబ్బరికాయ కొట్టేప్పుడు ఉన్న స్టార్లు పూర్తయ్యాక గుమ్మడికాయ కొడతారన్న గ్యారంటీ లేకుండా పోయింది. ‘ఈ సినిమా మనదే’ అని అనుకున్న తారల స్థానంలో అనుకోకుండా వేరే తారలు రావడం జరుగుతోంది. యాహూ అంటూ సినిమాను స్టార్ట్ చేసిన తారలు తూచ్ అంటూ మధ్యలోనే తారుమారు అవుతున్నారు. ఇటీవల అలా ఒకరి ప్లేస్‌లోకి మరొకరు రీప్లేస్ అయిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. ప్రియాంకా పెళ్లి... సల్మాన్ లొల్లి ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు ప్రియాంకా పెళ్లి సల్మాన్‌కు తలనొప్పి పుట్టించింది. ‘రేస్ 3’ సినిమాతో ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకున్న తర్వాత సల్మాన్‌ఖాన్ ‘భారత్’ అనే సినిమాను స్టార్ట్ చేశారు. ఇందులో ప్రియాంకా చోప్రాను కథానాయికగా తీసుకున్నారు. రెండేళ్ల తర్వాత ‘భారత్’ సినిమా కోసం ప్రియాంకా బాలీవుడ్‌కు తిరిగొచ్చారు. కానీ అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ‘భారత్’ సినిమా నుంచి ప్రియాంకా తప్పుకున్నట్లు ఈ చిత్రదర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ప్రకటించారు. కారణం ఏంటి? అంటే.. ప్రియాంకా పెళ్లి అన్నారు. నా సినిమానే వదులుకుంటుందా? అని సల్మాన్ ఫీలయ్యారనే వార్తలు వచ్చాయి. ప్రియాంక, సల్మాన్ మధ్య వాదన కూడా జరిగిందట. ఆ తర్వాత ప్రియాంకా పెళ్లి బాజాలకు ఈ వివాదం వినిపించకుండాపోయింది. ఇక ‘భారత్’లో ప్రియాంకా స్థానాన్ని కత్రినా కైఫ్‌తో భర్తీ చేశారు. కొరియన్ చిత్రం ‘ఓడ్ టు మై ఫాదర్’కి హిందీ రీమేక్ అయిన ‘భారత్’ చిత్రం రంజాన్‌కు విడుదల కానుంది. ఏబీసీడీ.. కత్రినా నాట్ రెడీ ‘భారత్’ సినిమాకు తొందరగా గుమ్మడికాయ కొట్టి ‘ఏబీసీడీ 3’ (వర్కింగ్ టైటిల్) చిత్రానికి వరుణ్ ధావన్‌తో కలిసి స్టెప్పులేద్దామనుకున్నారు కత్రినా కైఫ్. కానీ కత్రినా ఊహ నిజం కాలేదు. ఫలితంగా ‘ఏబీసీడీ 3’ చిత్రం నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే.. హఠాత్తుగా ‘భారత్’ సినిమాకి డేట్స్ ఇవ్వడంతో ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ‘ఏబీసీడీ’కి అడ్జస్ట్ చేయలేకపోయారు. దాంతో కత్రినా ప్లేస్‌లో శ్రద్ధా కపూర్‌ను తీసుకున్నారు. దర్శకుడు రెమో డిసౌజా ‘ఏబీసీడీ’ ఫ్రాంచైజీలో వస్తోన్న థర్డ్ పార్ట్ ఇది. రెండోపార్ట్‌లో కూడా వరుణ్‌ధావన్, శ్రద్ధాకపూర్‌నే నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. కియారాకి కుదిరింది ‘అర్జున్‌రెడ్డి’ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయబోతున్నారు అనే వార్త రాగానే హీరోగా ఎవరు నటించబోతున్నారు? అని చర్చలు మొదలయ్యాయి. ఫైనల్‌గా ‘కబీర్‌సింగ్’ (హిందీ టైటిల్)గా షాహిద్‌కపూర్ ఫిక్స్ అయ్యారు. హీరోగా షాహిద్ ఓకే కాగానే హీరోయిన్ ఎవరు? అనే టాపిక్ ఊపందుకుంది. అనన్యా పాండే అనే ఓ కొత్తమ్మాయి పేరు స్ట్రాంగ్‌గా వినిపించింది. ఇంతలో ఆమె హిందీలో తొలిసారి సైన్ చేసిన టైగర్‌ష్రాఫ్ ‘స్టూడెంట్ ఆఫ్ దిఇయర్ 2’ సినిమా రిలీజ్ వాయిదా పడింది. దీంతో ‘కబీర్ సింగ్’ చేయి పట్టుకునే అవకాశం అనన్యకు కుదర్లేదు. కియారా అద్వానీకి కుదిరింది. సెట్లో షాహిద్‌కు జోడి కట్టింది. తెలుగు ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ వంగానే ‘కబీర్ సింగ్’కి కూడా దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. అనన్యా పాండే హౌస్‌లోకి ఎంట్రీ హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో రాబోతున్న ఫోర్త్ పార్ట్ ‘హౌస్‌ఫుల్ 4’. సాజిద్ ఖాన్ దర్శకునిగా ఈ సినిమా మొదలైంది. ఆ తర్వాత సాజిద్‌పై ‘మీటూ’ ఆరోపణలు రావడంతో ఈ సినిమా డైరెక్షన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఫర్హాద్–సామ్జీ ద్వయం మిగిలిన పార్ట్‌ను కంప్లీట్ చేశారు. కానీ సాజిద్ ఎదుర్కొన్నట్లే సినిమాలో ఓ కీలక పాత్రకు ఎంపికైన నానా పటేకర్‌పై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయన హౌస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కట్ చేస్తే హౌస్‌లోకి రానా ఎంటర్ అయ్యారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. రానా సౌత్‌లో...ముందు ఇద్దరు.. చివరికి ఒకరు ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఆనంత్ మహదేవన్, ఆర్. మాధవన్ దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తారని అధికారికంగా చిత్రబృందం పేర్కొంది. కట్ చేస్తే ఈ చిత్రానికి మాధవన్ ఒక్కరే దర్శకునిగా ఉంటారని ఇటీవల అధికారిక ప్రకటన వచ్చింది. ఇక అనంత్ మహదేవన్ తప్పుకున్నట్లే కదా. ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. మాధవన్ నో డైరెక్టర్ డైరెక్టర్ లేకుండా సినిమా సంపూర్తి కాదు. కానీ డైరెక్షన్ క్రెడిట్ లేకుండా మాత్రం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘దటీజ్ మహాలక్ష్మి’. బాలీవుడ్ హిట్ ‘క్వీన్’కు తెలుగు రీమేక్ ఇది. ఈ సినిమాకు తొలుత నీలకంఠ దర్శకుడు. ఆ తర్వాత ‘అ!’ ఫేమ్ ప్రశాంత్‌వర్మ ఇదే సినిమాకు డైరెక్షన్ చైర్లో కూర్చొన్నారు. కారణం ఏమిటంటే.. ‘క్రియేటివ్ డిఫరెన్సెస్’ వల్ల నీలకంఠ తప్పుకున్నారట. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ సినిమా టీజర్లో దర్శకుడి పేరు లేదు. ఇదే సీన్ గతేడాది శ్రీకాంత్ హీరోగా నటించిన ‘రారా’ సినిమా విషయంలో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. సెట్స్‌పైకి వెళ్లక ముందే! చిరంజీవి ‘సైరా’ సినిమాకు ముందు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏ ఆర్ రెహమాన్‌ని తీసుకున్నారు. ప్రస్తుతం అమిత్ త్రివేది సంగీతం ఇస్తున్నారు. అన్నీ కుదిరితే రామ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ ఏవో కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ‘యన్.టి.ఆర్’ బయోపిక్ తేజ డైరెక్షన్ నుంచి క్రిష్ డైరెక్షన్లోకి మారిన విషయం తెలిసిందే. ‘సంఘమిత్ర’ కోసం శ్రుతీహాసన్ ప్లేస్‌లో దిశా పాట్నీ వచ్చారు. ‘కాప్పాన్’లో అల్లు శిరిష్ చేయాల్సిన పాత్రను ఆర్య చేస్తున్నారు. ఈ పాత సంగతులన్నీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటాయి. డేట్స్ కుదరకో, పారితోషికం విషయంలో లెక్క కుదరకో, ముందు ఒప్పుకున్న కమిట్మెంట్స్ కారణంగానో ఇలా ఒకరి స్థానంలోకి మరొకరు రావడం జరుగుతుంది. అంతేకదా.. అనుకున్నవన్నీ జరిగితే డ్రామా ఏం ఉంటుంది? సినిమాలో అయినా జీవితంలో అయినా డ్రామా కామన్. ఊరించి.. ఉసూరుమనిపించి బాలీవుడ్లో తాïప్సీ హవా బాగానే కొనసాగుతోంది. ఆమె నటించిన ‘తడ్కా, బద్లా’ అనే హిందీ చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఇటీవల ‘పతీ పత్నీ ఔర్ ఓ’(1978) అనే సినిమా రీమేక్‌లో నటించే అవకాశం ఆమెకు చేజారిపోయింది. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు. ఆనన్యా పాండే, భూమి ఫడ్నేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో ఆనన్య పాత్రను తాప్సీకే ఆఫర్ చేశారు చిత్రబృందం. తీరా సినిమా సెట్స్‌పైకి వెళ్లే సమయానికి లిస్ట్‌లో తాప్సీ పేరు లేదు. దీంతో తాప్సీ తన అవేదనను వ్యక్తం చేశారు. టీ సిరీస్–బీఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంతకీ తాప్సీని లిస్ట్‌లోంచి ఎందుకు తీసేసినట్లు అంటే.. ఈ నిర్మాతలతో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ‘సోను కే టిట్టు కీ స్వీటీ’ చిత్రం వంద కోట్ల క్లబ్లో చేరింది. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్, అనన్య లవ్‌లో ఉన్నారని, కార్తీక్ కోరిన మీదటే తాప్సీ ప్లేస్‌లో ఆనన్య వచ్చిందని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మార్పులు.. చేర్పులు! గత నెల 25న ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రం విడుదలైంది. టైటిల్ పాత్రలో కంగనా రనౌత్ నటించారు. తొలుత ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. షూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందన్న టైమ్‌లో డైరెక్షన్ చైర్లో కంగనా కూర్చున్నారు. క్రిష్ ‘యన్.టీ.ఆర్’ బయోపిక్ సినిమాతో బిజీగా ఉండటం వల్ల కంగనా మెగాఫోన్ పట్టారని చెప్పుకొచ్చారు టీమ్. అంతలోనే ఈ సినిమా నుంచి సోనూ సూద్ తప్పుకున్నారు. ఈ ప్లేస్‌లో మహ్మద్ అయూబ్‌ను తీసుకున్నారు. వెంటనే స్వాతి సెమ్వాల్ తప్పుకున్నారు. సోనూ, స్వాతి కంటే ముందు ఈ సినిమా ఎడిటర్ తప్పుకున్నారని తెలిసింది. ఇలా పలు రీప్లేస్మెంట్లతో ‘మణికర్ణిక’ షూటింగ్ పూర్తయింది. కానీ డైరెక్షన్ క్రెడిట్నే కంగానా కూడా షేర్ చేసుకున్నారు. ‘యన్.టీ.ఆర్: కథానాయకుడు’ సినిమా రిలీజ్ వరకు ఈ విషయం గురించి మాట్లాడని క్రిష్, ఆ తర్వాత కంగనాపై విమర్శలవర్షం కురిపించారు. డైరెక్షన్ క్రెడిట్‌కు ఆమెకు అర్హత లేదని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఈ సినిమాలోని మేజర్ టీమ్ అంతా క్రిష్‌కు మద్దుతు తెలిపారు. నిర్మాత కమల్‌జైన్ మాత్రం కంగనా వైపు ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘క్రిష్ చెప్పిన మాటలను నిరూపించుకోవాలి. ‘మణికర్ణిక’ సినిమాకు చెందిన ముఖ్య నిర్ణయాలను నేనే తీసుకున్నా. ఈ చిత్రానికి నేనే దర్శకురాలిని’’ అని కంగనా అన్నారని బాలీవుడ్లో తాజాగా కథనాలు వస్తున్నాయి. మరి... ఈ వివాదం ఎప్పుడు ఎక్కడ ముగుస్తుందో చూడాలి. క్రిష్, కంగనా రనౌత్ – ముసిమి శివాంజనేయులు -
స్క్రీన్ టెస్ట్
ప్రతిభకు కొలమానం ఏంటి? అంటే చెప్పలేం. అయితే ప్రతిభను గుర్తించి ప్రేక్షకులు కొట్టే చప్పట్లు, అభినందనలు, ప్రతిష్టాత్మక పురస్కారాలు ఏ కళాకారుడిలో అయినా ఉత్సాహాన్ని నింపుతాయి. భారతదేశ ప్రతిష్టాత్మక పురస్కారం అయిన ‘పద్మ’ అవార్డు వరిస్తే ఆ గౌరవమే వేరు. జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించిన సందర్భంగా ఇప్పటివరకూ ఈ అవార్డు అందుకున్న స్టార్స్‌లో కొందరి గురించి ఈ వారం స్పెషల్ క్విజ్. 1. ‘పడమటి సంధ్యారాగం’ చిత్రంలో సహాయ నటునిగా నటించారు ఈ నటుడు. 2019వ సంవత్సరంలో ఈయనను పద్మశ్రీ వరించింది. సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎవరాయన? ఎ) మణిశర్మ బి) యం.యం. కీరవాణి సి) శివమణి డి) కోటి 2. 2011వ సంవత్సరానికి పద్మశ్రీ అవార్డుగ్రహీత ఈ నటి. వెంకటేశ్ నటించిన ఓ సూపర్‌హిట్ సినిమా ద్వారా తెరంగేట్రం చేశారీమె. ఎవరా నటి? ఎ) టబు బి) రమ్యకృష్ణ సి) మీనా డి) కత్రినా కైఫ్ 3. 1968లో పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్‌లను దక్కించుకున్న ఏకైక నటుడెవరు? ఎ) యస్వీ రంగారావు బి) శోభన్‌బాబు సి) కాంతారావు డి) అక్కినేని నాగేశ్వరరావు 4. అద్భుతమైన నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, సింగర్‌గా చాలా ఫేమస్ ఈ నటి. 1966లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ అవార్డులను తన ఖాతాలో వేసుకున్న ఆ నటి ఎవరు? ఎ) భానుమతి బి) జమున సి) సావిత్రి డి) అంజలీదేవి 5. కామెడీ యాక్టర్‌గా ఎన్నో సంవత్సరాలు చిత్రపరిశ్రమను ఏలారు. 1990లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ ప్రకటించింది. ఆ నటుని పేరేంటి? ఎ) అల్లు రామలింగయ్య బి) పద్మనాభం సి) సుత్తివేలు డి) నగేశ్ 6. 2019వ సంవత్సరానికి గాను ప్రభుదేవాని పద్మశ్రీ వరించింది. తన నృత్యంతో అలరించిన ఆయన్ను ఏ ప్రభుత్వం పద్మశ్రీకి నామినేట్ చేసిందో తెలుసా? ఎ) తమిళనాడు బి) తెలంగాణ సి) కర్ణాటక డి) కేరళ 7. ‘సిరివెన్నెల’ చిత్రం తర్వాత చెంబోలు సీతారామశాస్త్రి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా మారిపోయారు. ఆయన్ను చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడెవరు? (సీతారామ శాస్త్రికి ‘సిరివెన్నెల’ మొదటి చిత్రం కాదు) ఎ) కె.రాఘవేంద్రరావు బి) కె.విశ్వనాథ్ సి)ఆదుర్తి సుబ్బారావు డి) దాసరి నారాయణరావు 8. తన గళంతో ఎన్నో భాషల్లోని పాటలను అలవోకగా ఆలపించే గాయకుడు కె.జె. ఏసుదాస్. భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ (1977), పద్మభూషణ్ (2002), పద్మవిభూషణ్‌లతో సత్కరించింది. ఆయన ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్ అందుకున్నారో తెలుసా? (సి) ఎ) 2011 బి) 2013 సి) 2017 డి) 2009 10 1968లో పద్మశ్రీ అవార్డు పొందిన నటుడెవరో కనుక్కుందామా? ఎ) యన్టీఆర్ బి) చిత్తూరు నాగయ్య సి) గుమ్మడి డి) కాంతారావు 9. 2006లో ఆయన్ను కేంద్రప్రభుత్వం పద్మభూషణ్‌తో గౌరవించింది. అదే సంవత్సరం ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నుండి డాక్టరేట్‌ను కూడా పొందారు. ఎవరా హీరో? ఎ) కృష్ణంరాజు బి) చిరంజీవి సి) బాలకృష్ణ డి) నాగార్జున 11. 2009లో పద్మశ్రీ అవార్డు పొందిన ఈ నటుడు అప్పటికే ఒకే భాషలో దాదాపు 700 చిత్రాలు పైగా నటించారు. ఎవరతను? ఎ) కైకాల సత్యనారాయణ బి) అలీ సి) బ్రహ్మానందం డి) ధర్మవరపు çసుబ్రహ్మణ్యం 12. కమల్‌హాసన్ నటించిన ‘శుభసంకల్పం’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు ఈయన. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. ఎవరితను? ఎ) దాసరి నారాయణరావు బి) టి. సుబ్బరామిరెడ్డి సి) ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డి) డి. రామానాయుడు 13. అనేక భాషల్లో తన సంగీతం ద్వారా చాలా సుపరిచుతులు ఈయన. 2010లో పద్మభూషణ్, 2018లో పద్మవిభూషణ్ ఆయన్ను వరించాయి. ఎవరా సంగీత దర్శకుడు? ఎ) కె.వి. మహదేవన్ బి) ఇళయరాజా సి) మంగళంపల్లి బాలమురళీ కృష్ణ డి) పి.బి. శ్రీనివాస్ 14. 2013వ సంవత్సరంలో కేంద్రప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డ్‌ను తిరస్కరించిన ప్రముఖ సింగర్ ఎవరో తెలుసా? (అవార్డును నిరాకరించటానికి ఆ సింగర్ చెప్పిన కారణం ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని) ఎ) ఎస్. జానకి బి) పి. సుశీల సి) వాణీ జయరాం డి) జిక్కీ 15. కర్ణాటక ప్రభుత్వ సిఫార్సుతో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పద్మశ్రీ అవార్డును దక్కించుకున్నారు. ఆయన ఏ సంవత్సరంలో ఈ అవార్డును పొందారో తెలుసా? ఎ) 2014 బి) 2016 సి) 2018 డి) 2019 16. 340 తెలుగు చిత్రాలకు పైగా నటించారు ఈ ప్రముఖ నటుడు. 2009లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మభూషణ్ ప్రకటించింది. ఎవరా హీరో? ఎ) కృష్ణ బి) కృష్ణంరాజు సి) శోభన్‌బాబు డి) శరత్‌బాబు 17. కళలు, విద్యా రంగాలకు సంబంధించి 2007లో పద్మశ్రీ అవార్డును పొందిన ప్రముఖ తెలుగు నటుడెవరో తెలుసా? ఎ) మోహన్‌బాబు బి) మురళీమోహన్ సి) శ్రీధర్ డి) రంగనాథ్ 18. 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ అవార్డులను సొంతం చేసుకున్న ప్రముఖ హీరో ఎవరు? ఎ) కమల్‌హాసన్ బి) రజనీకాంత్ సి) విక్రమ్ డి) శరత్‌కుమార్ 19. నాటకరంగం నుండి సినిమా రంగానికి వచ్చి ఎన్నో సినిమాల్లో నటించారు ఈ ప్రముఖ క్యారెక్టర్ నటుడు. 2015లో ఆయన్ను పద్మశ్రీ వరించింది. ఎవరా నటుడు కనుక్కోండి? ఎ) జయప్రకాశ్ రెడ్డి బి) తనికెళ్ల భరణి సి) బెనర్జీ డి) కోట శ్రీనివాసరావు 20 .1992లో పద్మశ్రీ అవార్డు పొందారు ఈ ప్రముఖ దర్శకుడు. 2017లో భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. ఆ దర్శకుని పేరేంటి? ఎ) కె. భాగ్యరాజా బి) భారతీరాజా సి) కె. విశ్వనాథ్ డి) కె. బాలచందర్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (సి) 2) (ఎ) 3) (డి) 4) (ఎ) 5) (ఎ) 6) (సి) 7) (బి) 8) (సి) 9) (బి) 10) (ఎ) 11) (సి) 12) (సి) 13) (బి) 14) (ఎ) 15) (బి) 16) (ఎ) 17) (ఎ) 18) (బి) 19) (డి) 20) (సి) నిర్వహణ: శివ మల్లాల -
భారత్ వెనక ఏమీ వద్దు
‘‘నా చుట్టూ ఉండేవాళ్లు తరచూ అడిగేవారు. నీ పేరేంటి? నీ కులమేంటి? మతమేంటి? అని. భారతదేశం లాంటి గొప్ప దేశం మీదున్న ప్రేమతో నాకు ‘భారత్’ అని పేరు పెట్టారు మా నాన్న. అలాంటి గొప్ప పేరు వెనుక కులం, మతాల పేర్లు అంటించేటువంటి హానికర చర్యలు చేయలేకపోయాను’’ అనే డైలాగ్స్‌తో సాగింది సల్మాన్ ఖాన్ లేటెస్ట్ చిత్రం ‘భారత్’ టీజర్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఇది. కత్రినా కైఫ్, దిశా పాట్నీ, జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేశారు. 20 ఏళ్ల యువకుడి నుంచి 50 ఏళ్ల వృద్ధుడిగా సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కనిపిస్తారు. రంజాన్ పండగకు రిలీజ్ కానున్న ఈ చిత్రం కొరియన్ ‘ఓడ్ టు మై ఫాదర్’ చిత్రానికి రీమేక్. -
‘నీ కులం, జాతి, మతం ఏంటని అడుగుతుంటారు’
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భారత్’ . కత్రినా కైఫ్, దిశా పటానీ, జాకీ ష్రాఫ్ ముఖ్య తారలుగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ‘నీ ఇంటిపేరు, నీ జాతి, నీ కులం, నీ మతం ఏంటి అని అందరూ నన్ను అడుగుతుంటారు. వారందరికీ చిరునవ్వుతో నేనిచ్చే సమాధానం.. మా నాన్న ఈ దేశం పేరు మీదుగా నాకు భారత్ అనే పేరు పెట్టారు. దేశ ప్రతిష్టకు మచ్చ రాకుండా నడుచుకుంటాను’ అంటూ సల్మాన్ వాయిస్ ఓవర్‌తో సాగిన భారత్ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. దేశ విభజన సన్నివేశాలతో ప్రారంభమైన టీజర్లో.. నేవీ అధికారిగా, బైక్‌స్టంట్స్ చేసే వ్యక్తిగా, బాక్సర్‌గా సల్మాన్ కనిపించాడు. ఇక సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారత్ ఈ ఏడాది రంజాన్‌కు విడుదల కానుంది. -
స్క్రీన్ టెస్ట్
1. ‘ఈ జెండా పసిబోసి చిరునవ్వురా, దాస్య సంకెళ్లు తెంచిందిరా..’ అనే పాట మహేశ్‌బాబు నటించిన ఓ చిత్రంలోనిది. ఈ పాటలో ఓ పసిబాబు చేతిలో నుండి జాతీయ జెండా ఓ కొండపై నుండి కింద పడుతుంది. ఆ జెండా కింద పడకుండా హీరో పట్టుకునే ఈ సీన్ ఏ సినిమాలోనిది? ఎ) బాబీ బి) అతడు సి) ఖలేజా డి) ఒక్కడు 2. అక్కినేని, సావిత్రి జంటగా నటించిన చిత్రం ‘వెలుగు నీడలు’. ఈ చిత్రంలోని ‘పాడవోయి భారతీయుడా’ పాట రచయితెవరో కనుక్కోండి? ఎ) కొసరాజు బి) ఆత్రేయ సి) శ్రీశ్రీ డి) సినారె 3. ‘తెలుగు వీర లేవరా, దీక్ష బూని సాగరా...’ అనే పాటలో నటించిన నటుడెవరో తెలుసా? ఎ) శోభన్‌బాబు బి) యన్టీఆర్ సి) అక్కినేని డి) కృష్ణ 4. ‘జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాదపీ గరీయశీ...’ అనే పాట రచించింది, దర్వకత్వం వహించింది ఒక్కరే. ఎవరా దర్శకుడు? ఎ) ముత్యాల సుబ్బయ్య బి) దాసరి నారాయణరావు సి) రవిరాజా పినిశెట్టి డి) కోడి రామకృష్ణ 5. ‘దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే...’ అనే పాటలో నటించిన నటుడెవరో తెలుసా? (చిన్న క్లూ: ఈ చిత్రానికి తేజ దర్శకుడు) ఎ) ఉదయ్‌కిరణ్ బి) నవదీప్ సి) ప్రిన్స్ డి) దిలీప్ రెడ్డి 6. ‘కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరుకొక్క వీధి పేరు కాదురా గాంధీ...’ పాట శ్రీకాంత్ నటించిన 100వ చిత్రం ‘మహాత్మ’ లోనిది. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. ఈ దేశభక్తి గీతం సూపర్‌హిట్. ఈ పాటలో నటించిన క్యారెక్టర్ నటుని పేరేంటి ? ఎ) రామ్‌జగన్ బి) తనికెళ్ల భరణి సి) పరుచూరి గోపాలకృష్ణ డి) అజయ్ ఘోష్ 7. ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రంలోని ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి... జన్మ భూమి నాదేశం సదా స్మరామి...’ అనే పాటలో యన్టీఆర్ నటించారు. ఆ పాటను రచించింది జాలాది. సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) మణిశర్మ బి) యంయం కీరవాణి సి) రాజ్–కోటి డి) చక్రవర్తి 8. ‘వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా’ పాట ఏ చిత్రంలోనిది? (మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు). ఎ) బొంబాయి బి) రోజా సి) దిల్సే డి) దళపతి 9. ‘వందేమాతరం’ చిత్రంలోని ‘వందేమాతరం, వందేమాతరం... వందేమాతర గీతం వరస మారుతున్నది... తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది..’ అనే పాటతో శ్రీనివాస్ ఇంటి పేరు ‘వందేమాతరం’ అయింది. ఈ పాటలో నటించింది హీరో రాజశేఖర్, హీరోయిన్గా నటించింది ఎవరో తెలుసా? ఎ) విజయశాంతి బి) భానుప్రియ సి) సుమలత డి) జీవిత 10. ‘భారత మాతకు జేజేలు... బంగరు భూమికి జేజేలు’ పాట యన్టీఆర్ నటించిన ‘బడిపంతులు’ చిత్రంలోనిది. పీసీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యన్టీఆర్ మనవరాలిగా నటించిన బాల నటి ఎవరో కనుక్కోండి? (తర్వాత కాలంలో ఆమె యన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించారు) ఎ) విజయనిర్మల బి) జయసుధ సి) శ్రీదేవి డి) జయంతి 11. ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా... పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలపరా నీ జాతి నిండు గౌరవమూ...’ పాట ‘అమెరికా అబ్బాయి’ సినిమాలోనిది. అమెరికాలో షూటింగ్ చేసుకున్న ఈ క్రాస్ ఓవర్ సినిమాకు దర్శకుడెవరు? ఎ) బాలచందర్ బి) కె. విశ్వనాథ్ సి) సింగీతం శ్రీనివాసరావు డి) భారతీరాజ 12. ‘ఓ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్లీ కావాలి...’ అనే పాట చిరంజీవి నటించిన ‘శంకర్‌దాదా జిందాబాద్’ చిత్రంలోనిది. ఈ దేశభక్తి గీతాన్ని సుద్దాల అశోక్‌తేజ రచించగా దేవీశ్రీ ప్రసాద్ స్వరపరిచారు. ఈ చిత్రానికి దర్శకుడెవరు? ఎ) బి. గోపాల్ బి) ప్రభుదేవా సి) జయంత్.సి. పరాన్జీ డి) వీవీ వినాయక్ 13. 1982లో విడుదలైన ‘గాంధీ’ చిత్రానికి రిచర్డ్ అటెన్‌బరో స్వీయదర్శకత్వం వహించారు. బెన్ కింగ్స్లే ‘గాంధీ’ పాత్రధారి. బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కస్తూర్బా గాంధీ పాత్రలో నటించిన ప్రముఖ బాలీవుడ్ నటి ఎవరో కనుక్కోండి? ఎ) బి) రేఖ సి) రోహిణి హట్టంగడి డి) హేమమాలిని 14. ఆంగ్లేయుల వద్ద సిపాయిగా పనిచేసిన ‘మంగల్ పాండే’ పాత్రలో నటించారు ఆమిర్‌ఖాన్. ఆ చిత్రంలో ఆయన సరసన హీరా పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసుకుందామా? ఎ) రాణీ ముఖర్జీ బి) కరిష్మా కపూర్ సి) కరీనా కపూర్ డి) అమీషా పటేల్ 15. ‘మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్...’ పాట ‘ఖడ్గం’ చిత్రంలోనిది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ముస్లిం పాత్రలో నటించి, మెప్పించిన నటుడెవరు? ఎ) శ్రీకాంత్ బి) రవితేజ సి) ప్రకాశ్‌రాజ్ డి) బ్రహ్మాజీ 16. ‘ఏ మేరా ఇండియా, ఐ లవ్ మై ఇండియా...’ పాట సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించిన ‘పరదేశ్’ చిత్రంలోనిది. ఆ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన నటించిన నటి ఎవరు? ఎ) మహిమా చౌదరి బి) ప్రీతి జింటా సి) కాజోల్ డి) కత్రినాకైఫ్ 17. సంజయ్‌దత్, అజయ్ దేవ్గన్, సైఫ్ అలీఖాన్, అర్మాన్ కోహ్లి, సునీల్ శెట్టి, సంజయ్ కపూర్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ఖన్నా.. ఇంతమంది బాలీవుడ్ హీరోలు నటించిన చిత్రం ‘ఎల్ఓసి కార్గిల్’. వారితో పాటు ఆ చిత్రంలో నటించిన తెలుగు హీరో ఎవరో తెలుసా? ఎ) ప్రభాస్ బి) నాగార్జున సి) రానా డి) వెంకటేశ్ 18. శంకర్ దర్శకత్వం వహించిన ‘భారతీయుడు’ చిత్రంలో స్వాతంత్య్ర సమర యోధుడు సేనాపతి పాత్రలో నటించారు కమల్‌హాసన్. మళ్లీ సేమ్ కాంబినేషన్లో ‘భారతీయుడు–2’ తెరకెక్కుతోంది. ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ సీక్వెల్ ప్రారంభించారో కనుక్కోండి? ఎ) 22 బి) 18 సి) 20 డి) 25 19. తెల్లదొరలపై తిరగబడ్డ తెలుగుబిడ్డ ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన చరిత్రను సినిమా గా రూపుదిద్దిన నటుడెవరో తెలుసా? (అతనే నిర్మాత, దర్శకుడు, నటుడు) ఎ) చంద్రమోహన్ బి) విజయ్ చందర్ సి) మురళీమోహన్ డి) నరేశ్ 20. చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా’. ఆంగ్లేయులను ఎదిరించిన తెలుగువాడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర ఇది. ఈ చిత్రంలోని ‘మైరారెడ్డి’ పాత్రను పోషిస్తున్న నటుడెవరో తెలుసా? ఎ) జగపతిబాబు బి) సుదీప్ సి) అమితాబ్ డి) విజయ్ సేతుపతి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (ఎ) 2) (సి) 3) (డి) 4) (బి) 5) (బి) 6) (ఎ) 7) (బి) 8) (బి) 9) (ఎ) 10) (సి) 11) (సి) 12) (బి) 13) (సి) 14) (ఎ) 15) (సి) 16) (ఎ) 17) (బి) 18) (ఎ) 19) (బి) 20) (ఎ) నిర్వహణ: శివ మల్లాల -
అనుష్కా.. నా గురించి మీ ఆయనకు చెప్పు!
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ మరో బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మను రికమెండ్ చేయమని అడిగారు. సినిమా చాన్స్ కోసం అయితే కాదండోయ్. క్రికెట్ నేర్చుకోవడం గురించి. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భారత్’ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు కత్రినా కైఫ్. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పాక ఓ రోజు రాత్రి టీమ్‌తో కలిసి కత్రినా క్రికెట్ ఆడారు. ‘‘క్రికెట్ ప్రపంచ కప్ దగ్గరపడుతోంది. నా గురించి టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కాస్త చెప్పు. (అనుష్కా శర్మ భర్త విరాట్ కోహ్లీ అన్న విషయం తెలిసిందే). నేను ఆల్ రౌండర్ అవ్వాలనుకుంటున్నాను. మన టైమ్ వస్తుంది’’ అని సరదాగా తాను క్రికెట్ ఆడుతున్న వీడియోను షేర్ చేశారు కత్రినా. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల 26న ‘భారత్’ చిత్రం టీజర్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. చిత్రాన్ని ఈ ఏడాది రంజాన్‌కు విడుదల చేయాలనుకుంటున్నారు. -
సొంత ఇంటికి వచ్చిన భావన కలుగుతుంది : కత్రినా
‘తనతో పనిచేయడం ఎప్పుడూ సౌకర్యంగానే ఉంటుంది. తన టీమ్‌తో కలిసినపుడు సొంత ఇంటికి వచ్చిన భావన కలుగుతుంది. రేస్ సినిమాలో జర జర సాంగ్ బాగా రావడం కోసం తను నన్ను ప్రోత్సహించిన విధానాన్ని మర్చిపోలేను. ఇప్పుడేమో ఆనంద్ రాయ్, బోస్కీ డాన్స్‌ను ఎలా ఎంజాయ్ చేయాలో.. మనకోసం మనం డాన్స్ చేస్తే అందులో ఉండే ఆనందం ఏమిటో ఈ పాట ద్వారా తెలియచేశారు’ అంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) on Dec 16, 2018 at 10:02pm PST బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో.. ఆనంద్ ఎల్ రాయ్ జీరో మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కింగ్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో... క్యాట్స్ మూవీ స్టార్‌గానే అలరించనున్నారు. ఈ నేపథ్యంలో ‘హసన్ పర్చామ్’ అనే సాంగ్ కోసం చేసిన డ్యాన్స్ రిహార్సల్ తాలూకు వీడియోను కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇంత మంచి స్టెప్స్‌ను నేర్పించినందుకు థాంక్స్ అంటూ కొరియోగ్రాఫర్ బోస్కోమార్టిస్ను ప్రశంసిస్తూ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. అంతటితో ఆగకుండా కత్రినా డ్యాన్సింగ్ క్వీన్.. తెరవెనుక ఇంత కష్టపడాల్సి ఉంటుందా.. నిజంగా చాలా గ్రేట్ అంటూ ఆమెను కొనియాడుతున్నారు కూడా. -
సౌత్ అండ్ నార్త్.. గుడ్ కాంబినేషన్
షారుక్ ఖాన్... పెద్ద పరిచయం అక్కర్లేదు. ఆయన చేసే సినిమాల్లానే షారుఖ్ నటన కూడా విభిన్నంగా ఉంటుంది. షారుక్ హీరోగా నటించిన మరో డిఫరెంట్ మూవీ ‘జీరో’. కత్రినా కైఫ్, అనుష్కా శర్మ కథానాయికలుగా నటించారు. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘జీరో’ ప్రయాణాన్ని ‘సాక్షి’తో షారుక్ ఇలా పంచుకున్నారు. ► ‘జీరో’ సినిమా కథనం ఎలా ఉంటుంది? సాధారణ జీవితం గడిపే ప్రజల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఎమోషనల్ కంటెంట్ ఉంది. దేవుడు మనకు ఒకటే జీవితం ఇచ్చాడు. మనలో ఉన్న లోపాలను గుర్తు చేసుకుంటూ ఏం సాధించలేకపోతున్నాం అని పశ్చాత్తాప పడకూడదు. ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ కాదని చెప్పే చిత్రం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అసంపూర్ణమైన అంశం ఉంటుంది. దేవుడు మనల్ని ఎలా సృష్టిస్తే అలానే జీవితాన్ని ఆస్వాదించాలి. మనం మనలా ఉంటేనే జీవితాన్ని ఆస్వాదించగలం. కానీ సక్సెస్ అయిన వాళ్ల ప్లేస్‌లో మనం ఉంటే బాగుండేదని కొందరు ఆలోచిస్తుంటారు. అది తప్పు. మన బాడీ మనది, మన ఎమోషన్ మనది. అలా జరిగి ఉంటే.. ఇలా జరిగి ఉంటే... ఇలాంటి ఆలోచనలను వదిలివేయాలి. నిజాన్ని ఒప్పుకోవాలి. నీకు పాటలు పాడటంలో నైపుణ్యం ఉంటే సాధనతో లతా మంగేష్కర్ కూడా అవ్వొచ్చు. మనం సచిన్ టెండూల్కర్ ఎందుకు కాలేదు? అని ఆలోచిస్తుంటారు కొందరు. ► మనలో ఉన్న లోపాల గురించి బాధపడకూడదు. సెలబ్రేట్ చేసుకోవాలి. అదే ‘జీరో’ సినిమా అంటున్నారు. నిజ జీవితంలో ఇది సాధ్యమా? హృదయం, శరీరం, మెదడు అందిరికీ ఉంటాయి. జుట్టు, కలర్, ముక్కు, నోరు ఉంటాయి. తేడాలు మనం పిలుచుకునేవి. లైఫ్‌లో పెరగడంలో కొన్ని ఫేజ్లను దాటుకుంటూ వస్తాం అంతే. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నా కొన్ని కుదరవు. మనకు మనం ప్రత్యేకమని తెలుసుకోవాలి. ఒక కుటుంబంలోని తండ్రి అందరినీ ఒకేలా చూస్తాడు. ఎక్కువ తక్కువలు ఉండవు. కొందరు మా ఫాదర్ అది ఇవ్వలేదు. ఇది ఇవ్వలేదు అంటారు. జీవితం ఇచ్చాడు. ఇంకేం ఇవ్వాలి. నీకు లోపాన్ని ఇచ్చిన దేవుడు ఏదో ప్రత్యేకత కూడా ఇచ్చే ఉంటాడు. వెతికి పట్టుకుని పోరాడు. ► మనల్ని మనం నమ్మడం అంటే? నేను బేసిక్‌గా లోయర్ మిడిల్ క్లాస్ అబ్బాయిని. మధ్య తరగతి వారందరికీ నేను ఒక ఉదాహరణ. మా అమ్మానాన్నలు కూడా మమ్మల్ని పోషించడానికి, చదివించడానికి కష్టపడ్డారు. వారు అంతగా చదువుకోలేదు. నిన్ను నువ్వు నమ్మాలి. నేను బెస్ట్ ఫైటర్ని కాదు, బెస్ట్ బాడీ లేదు. కానీ నాకు పని ఉంది. కష్టపడాలి అనుకున్నాను. నా బెస్ట్ ఇచ్చాను. తపన ఉంటే ఎవరైనా నాలాగా కావచ్చు. కానీ చేస్తున్న పనిని నమ్మాలి. నా కెరీర్స్టార్టింగ్లో నాకు పెద్ద నాలెడ్జ్ లేదు. చాలా తెలుసుకున్నాను. చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ ఉంది. అఫ్కోర్స్ ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఉంటాను కూడా. ఇది నిజం. హీరో కాబట్టి నాకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఖరీదైన దుస్తులు వేసుకుంటాను. నేను ఏం చెప్పినా చిటికెలో జరిగిపోతుంది. ఇవన్నీ సినిమాలోనే. నిజ జీవితంలో నేనూ చాలా సింపుల్‌గా ఉంటాను. అందరూ చేసే పనులే చేస్తుంటాను. ► 40 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ చేశారు కదా? హార్డ్ వర్క్‌ను నమ్ముతాను. నా డ్యాన్స్ హృతిక్ రోషన్‌లా ఎందుకు లేదు? అమితాబ్గారిలా నా వాయిస్ ఎందుకు బాగా రాలేదు? అని నేను బాధపడలేదు. నాకు చేతనైనంతలో దేవుడు నాకు ఇచ్చిన దాంతో కష్టపడుతుంటాను. వాళ్ల స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. కానీ వారిలా కావాలని అనుకోను. నేను దేశంలో బెస్ట్ డ్యాన్సర్‌ని కాను. నా 42 ఏళ్ల వయసులో నేను సిక్స్‌ప్యాక్ చేశాను. ఎలా చేశానంటే నేను చేయగలనని నమ్మాను. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ బాడీలను చూశాను. ఇన్స్పైర్ అయ్యాను. చేశాను. ఇతరుల ప్రతిభను అంగీకరించడం మంచి లక్షణం. నువ్వు సాధించాలని అనుకున్నదాని గురించి నీ మైండ్‌లో నువ్వు ఎంత బలంగా ఫిక్స్ అయ్యావు? అన్నదే ముఖ్యం. ► ‘జీరో’ టైటిల్ పెట్టడానికి కారణం? జీరో అంటే రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి జీరోతోనే ఏదైనా స్టార్ట్ అవుతుంది. మరోటి జీరోతో ముగుస్తుంది. దేన్ని తీసుకోవాలో మన చేతుల్లో ఉంటుంది. సినిమా అంటనే లైఫ్‌లో చేయలేనివి చేయడం. కొన్ని సినిమాల్లో నేనూ చేశాను. ఒక్కడినే వందమందిని కొట్టాను. వెయ్యి మందితో డ్యాన్స్ చేశాను. గాల్లో ఎగిరాను. కానీ నేను సినిమా హీరోని. రియల్ లైఫ్ హీరోలు చాలా సింపుల్‌గా ఉంటారని నా నమ్మకం. నిజానికి జీవితం ముందు మనం చిన్నవాళ్లం. నీ దగ్గర ఏమీ లేదని నువ్వు అనుకున్నప్పుడు నీవు ఏదైనా సాధించగలవు అనే నమ్మకం కలుగుతుంది. అప్పుడు జీరోతోనే స్టార్ట్ కావాలి. ► ఇటీవల మీ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయా? సినిమాను హిట్ చేయడం, చేయకపోవడం నా చేతుల్లో లేదు. ఆడియన్స్ చూస్తారు. నచ్చితే హిట్ అవుతుంది. లేకపోతే లేదు. నేను నమ్మినదాన్ని ఫాలో అవుతాను. కష్టపడతాను. అలానే నేను షారుక్ ఖాన్ అయ్యాను. నా సినిమా సరిగ్గా ఆడలేదు అంటే నేను సరిగ్గా చేయలేదని కాదు. ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లు సినిమాలో ఏదో మిస్ అయ్యిందని. అంతే. అలాగే నా సినిమా హిట్ సాధిస్తే అది నా గొప్పతనం కాదు. ఆడియన్స్ సినిమాను హిట్ చేశారు. ఒకే రకమైన సినిమాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. ‘చక్ దే ఇండియా, చెన్నై ఎక్స్‌ప్రెస్, ఫ్యాన్, దిల్వాలే దిల్ లేజాయేంగే, దేవదాసు, రాయీస్, బాజీఘర్, అశోక’.. ఇలా దేనికదే విభిన్నం. ► ‘జీరో’ సినిమా షూటింగ్లో గాయపడ్డారట కదా? యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు తప్పవు. నేను గాయపడ్డ సినిమాలన్నీ సూపర్ హిట్లే. కానీ జీవితంలో ముందుకు వెళ్లాలంటే రిస్క్ తీసుకోవడానికి ఆలోచించకూడదు. ప్రయత్న లోపం ఉండకూడదు. ► 100 కోట్లు, 200 కోట్లు.. ఇలా సినిమాల క్లబ్‌ల గురించి మాట్లాడుతుంటారు? ఇవి మీకు ఎలా అనిపిస్తుంటాయి? కొన్ని ఇంటర్వ్యూస్‌లో చూస్తుంటాను. ఈ సినిమా వందకోట్లు చేస్తుంది. 200 కోట్ల కలెక్షన్స్ వస్తాయి అని రిలీజ్‌కు ముందే చెబుతుంటారు. బాధగా ఉంటుంది. ప్రేక్షకులు సినిమాకు గౌరవం ఇవ్వాలి. నంబర్‌కి కాదు. తక్కువ నంబర్లు ఉంటేనే ఎక్కువ నేర్చుకోగలం. నా చిన్నప్పుడు 20 రూపాయలే నాకు పెద్ద అమౌంట్. 20 ఏళ్ల క్రితం నా దగ్గర ఏమీ లేనప్పుడు కోటి రూపాయలు ఉంటే కోటీశ్వరుడిని అవుతాను కదా అని అనుకునేవాడిని. దర్శకుడు మహేశ్ భట్ నీకు గొప్ప భవిష్యత్ ఉంది అని ప్రోత్సహించేవారు. 500 మిలియన్స్ బిల్‌గేట్స్‌కు తక్కువ అమౌంట్ కావొచ్చు. కానీ నేను బిల్ గేట్స్‌ని కాదు. కష్టపడి పెరిగాను. డబ్బు విలువ తెలుసు. ► అభిమానులు మిమ్మల్ని కింగ్ ఖాన్ అని పిలుస్తుంటే ఆ ఫీలింగ్ మీకు ఎలా ఉంటుంది? కొందరు అభిమానులు నన్ను కింగ్‌ఖాన్ అని పిలుస్తుంటారని విన్నాను. ఆ పిలుపుని నేను పెద్ద సీరియస్‌గా తీసుకోను. షూటింగ్స్‌కి వెళతాను. కుటుంబంతో సమయం గడుపుతాను. నిజానికి రజనీసార్ ఈజ్ తలైవా. అమితాబ్‌బచ్చన్ ఈజ్ షెహన్షా (రాజులకే రాజు). మనం కింగ్స్ కాదు (నవ్వుతూ).. – గౌతమ్ మల్లాది ప్రాంతీయ సినిమాల గురించి .... ప్రాంతీయ సినిమాలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇండియా మొత్తం రిలీజ్ చేయాలనుకోరు కాబట్టి క్రియేటివ్ స్కోప్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ల సక్సెస్‌కు అదొక కారణం అయ్యుండొచ్చు. కమర్షియల్ సినిమా ప్యారామీటర్ కూడా మారుతోంది. ఇండస్ట్రీ అభివృద్ధిని కాంక్షించే ఏ మార్పు అయినా మంచిదే కదా. హైదరాబాద్‌తో మీ అనుబంధం... అవును. మా అమ్మగారు హైదరాబాదీ. టోలీచౌకిలో ఉండేవాళ్లం. మా నాన్నగారు నార్త్. సౌత్ అండ్ నార్త్ గుడ్ కాంబినేషన్ (నవ్వుతూ). మా అమ్మ తరఫు బంధువులు ఉన్నారు. షూటింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వారిని కలవాలనుకుంటాను. కానీ టైమ్ కుదరదు. లైఫ్‌లో అన్నీ మారుపోతుంటాయని కాలం అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటుంది. షారుక్ ఖాన్, కత్రినా కైఫ్ ‘జీరో’ సెట్లో షారుక్ ఖాన్, అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ షారుక్ ఖాన్, అనుష్కా శర్మ -
విడిపోవడం మంచికే!
ఈ ఏడాది బాలీవుడ్లో పెళ్లి బాజా బాగా మోగింది. అనుష్కాశర్మ–విరాట్ కోహ్లీ, నేహాధూపియా–అంగద్ బేడీ, సోనమ్ కపూర్–ఆనంద్ అహూజా, దీపికా పదుకోన్–రణ్వీర్ సింగ్ తాజాగా ప్రియాంకా చోప్రా–నిక్ జోనస్ ఈ సంవత్సరం ఏడడుగులు వేశారు. మరికొన్ని జంటలు పెళ్లికి రెడీ అవుతున్నాయి. తోటి కథానాయికలందరూ పెళ్లిచేసుకుని ఒక ఇంటివారు అవుతున్నారు. మీ పెళ్లి ఎప్పుడు? అని కత్రినా కైఫ్‌ని అడిగితే.. ‘‘పెళ్లి గురించిన ఆలోచన ఉంది. కానీ ఎందుకో వర్కౌట్ కావడం లేదు. నీ లైఫ్‌లో నువ్వు నిర్మించుకున్న దారిలో వెళ్లాల్సిందే. అందుకే పెళ్లి గురించి పెద్దగా ఒత్తిడికి లోనవ్వాలని అనుకోవడం లేదు. కొన్ని విషయాలు నేను అనుకున్నట్లు జరగలేదు. సమయం కలిసొచ్చినప్పుడు పెళ్లి కబురు చెబుతా’’ అని పేర్కొన్నారు. ఇక రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడుతూ– ‘‘అతన్నుంచి విడిపోవడం నా మంచికే జరిగింది’’ అన్నారు. -
సల్మాన్ 5.. కత్రినా 4!
ఇక్కడున్న ఫొటో చూశారుగా.. బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్ చీర కట్టుకుని ఎంత అందంగా కనిపిస్తున్నారో. ఈ లుక్ ఆమె నటిస్తున్న ‘భారత్’ సినిమాలోనిది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో దిశా పాట్నీ, జాకీష్రాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. ఈ సినిమాలో నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు కత్రినా. అందులో ఇక్కడున్న లుక్ ఒకటి. అలాగే సల్మాన్ కూడా ఐదు డిఫరెంట్ లుక్స్‌లో వెండితెరపై సందడి చేయనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల చేయనున్నారు. ఇక కత్రినా ఒక కథానాయికగా నటించిన ‘జీరో’ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది. షారుక్‌ఖాన్ ఇందులో కథానాయకుడు. -
గాయపడ్డారు
అభిమానులకు అద్భుతమైన అనుభూతిని ఇవ్వడం కోసం హీరోలే ఎక్కువశాతం యాక్షన్ సన్నివేశాలను స్వయంగా చేస్తున్నారు. డూప్‌లకు స్కోప్ ఇవ్వనంటున్నారు. ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా కొన్నిసార్లు గాయాలపాలు అవుతూనే ఉంటారు. తాజాగా సల్మాన్ ఖాన్ ‘భారత్’ సినిమా సెట్లో గాయపడ్డారట. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, దిశా పాట్నీ ముఖ్యపాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ‘భారత్’. ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పంజాబ్‌లో జరుగుతోంది. ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుంటే సల్మాన్ గాయపడ్డారట. దాంతో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి చికిత్స కోసం ముంబై చేరుకున్నారు సల్మాన్. ఈ గాయం వివరాలేవీ చిత్రబృందం బయటకు చెప్పలేదు. షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి. -
వాఘాలో పాగా!
భారతదేశంలోని అమృత్సర్, పాకిస్తాన్‌లోని లాహోర్ నగరాలను కలిపే రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాఘా గ్రామంలో పాగా వేశారు సల్మాన్‌ఖాన్ అండ్ కత్రినా కైఫ్. ఇంతకీ సల్మాన్, కత్రినా భారత్‌కు వస్తున్నారా? లేక పాకిస్తాన్ వెళ్తున్నారా? అనే విషయాలు వెండితెరపై తెలుసుకోవాలి. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, దిశా పాట్నీ, జాకీ ష్రాఫ్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘భారత్’. సౌత్ కొరియన్ మూవీ ‘ఓడ్ టు మై ఫాదర్’కి ఇది రీమేక్. ఈ సినిమా తాజా షెడ్యూల్ పంజాబ్‌లోని లూధియానాలో ప్రారంభమైంది. సల్మాన్, కత్రినాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నిజానికి ఈ సినిమా షెడ్యూల్‌ను వాఘా గ్రామంలో ప్లాన్ చేశారు చిత్రబృందం. కానీ అనుమతి లభించకపోవడంతో లూధియానాలోనే వాఘా గ్రామ సరిహద్దు సెట్‌ను భారీ స్థాయిలో ఏర్పాటు చేసి, చిత్రీకరణ జరుపుతున్నారట. ఈ షెడ్యూల్ మరో వారం రోజులపాటు సాగుతుంది. ‘భారత్’ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల కానుంది. -
మ్యూజిక్ టీచర్!
పైనున్న ఫొటో చూశారుగా! కథానాయిక కత్రినా కైఫ్ ఎంత ఏకాగ్రతతో సంగీత సాధన చేస్తున్నారో! ఇది చూసి ఆమె ఏమైనా మ్యూజిక్ డైరెక్టర్‌గా మారాలనుకుంటున్నారా? అంటే అదేం కాదు. ఇదంతా తాజా ‘భారత్’ చిత్రం కోసం. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, టబు, దిశా పాట్నీ కీలక పాత్రలు చేస్తున్న చిత్రమిది. కొరియన్ చిత్రం ‘ఓడ్ టు మై ఫాదర్’ చిత్రానికిది రీమేక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతోందట. ‘‘భారత్’ ప్రిపరేషన్లో భాగంగా ఇలా సంగీత సాధన చేస్తున్నా’’ అని పేర్కొన్నారు కత్రినా. దీంతో ఈ సినిమాలో కత్రినా సింగర్‌గా కనిపిస్తారని కొందరు అంటుంటే.. లేదు లేదు.. మ్యూజిక్ టీచర్‌గా కనిపిస్తారని ఇంకొందరు అంటున్నారు. అసలు విషయం ఏంటీ? అనేది వచ్చే ఏడాది రంజాన్‌కు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడే ‘భారత్’ సినిమా రిలీజ్ అవుతుంది. -
జీరో.. మేడ్ ఇన్ ఇండియా
‘‘ఎటువంటి పరిస్థితుల్లో అయినా పాజిటివిటీ వెతుక్కొని ముందుకు వెళ్లాలి అని చెప్పే కథ ‘జీరో’. మనలోని బలహీనతలను కూడా అంగీకరించగలిగి జీవితాన్ని పూర్తిగా జీవించాలని చెప్పే ప్రయత్నం ‘జీరో’’ అని షారుక్ అన్నారు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో షారుక్ ఖాన్, అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జీరో’. గౌరీ ఖాన్ నిర్మించారు. డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను షారుక్ బర్త్‌డే సందర్భంగా ఈనెల 2న ముంబైలో రిలీజ్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ శాతం ఉత్తరప్రదేశ్‌లో మీరట్‌లో జరిగింది. అందుకే ఈ వేడుక మీరట్‌ను తలపించేలా సెట్ రూపొందించారు. ఈ ఫంక్షన్లో షారుక్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘మరుగుజ్జు పాత్ర అనగానే కమల్ హాసన్ నటించిన ‘అప్పూ రాజా’తో పోల్చారు. కానీ అలాంటి కథాంశం కాదు ఈ చిత్రం. అనుష్క, కత్రినాతో ‘జబ్ తక్ హై జాన్’ తర్వాత మళ్లీ కలసి నటిస్తున్నాను. ఈ ప్రయాణంలో అనుష్క దగ్గర ‘నిజాయతీగా’ ఉండగలగడం, కత్రినా కైఫ్ దగ్గర నుంచి అనుకున్నదాని కోసం కష్టపడటం’ నేర్చుకున్నాను. ఇప్పుడు వాళ్ల కంటే నేనే బెటర్ పర్సన్ అయ్యాననుకుంటా(నవ్వుతూ). ‘జీరో’కి సాధారణంగా మనం విలువ ఇవ్వం. కానీ, అది ఏ అంకెకి తోడైనా దాని విలువ పెరుగుతుంది. అసలు దాన్ని లెక్కలోకి తీసుకోం. కానీ లెక్కలన్నీ దాని చుట్టూనే తిరుగుతుంటాయి. మన ఆర్యభట్టగారు ప్రపంచానికి అందించిన బహుమానం ‘జీరో’. మేడ్ ఇన్ ఇండియా చిత్రమిది. నాతో నటించిన దీపికా, అనుష్కా అందరికీ పెళ్లిళ్లు అయిపోతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. సౌత్ ఇండియా సినిమాల్లో నటించడానికి ఆసక్తిగా ఉన్నాను ’’ అన్నారు షారుక్ ఖాన్. ‘‘షారుక్ లాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేస్తున్నట్టు షూటింగ్లో ఒక్కసారి కూడా అనిపించలేదు. ఆయనలోని సూపర్‌స్టార్‌ని నేనింకా కలవలేదు’’ అన్నారు దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్. ‘‘మా పాత్రలను ఇంత కొత్తగా తీర్చిదిద్ది, సరికొత్తగా ఆవిష్కరించినందుకు దర్శకుడికి కృతజ్ఞతలు. నమ్మకమే ఈ సినిమాను నడిపింది’’ అని అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ అన్నారు. -
అమ్మమ్మ మీద ఒట్టు
‘‘నా పేరే ఫిరంగీ మల్హా. నా వంటి నిజాయతీ పరుడు ఈ భూ ప్రపంచం మీద ఎక్కడా దొరకడు. నిజం నా రెండో పేరు. నిజాయతీ నా పని తీరు. మా అమ్మమ్మ మీద ఒట్టు’’ అని తన పాత్ర విశేషాలు పంచుకున్నారు ఆమిర్ ఖాన్. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’. ఈ చిత్రంలోని ప్రతీ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు చిత్రబృందం. సోమవారం ఆమిర్ ఖాన్ లుక్‌ను రిలీజ్ చేశారు. గాడిద మీద కూర్చొని, పచ్చని జాకెట్, ఎర్రటి కళ్లజోడు, టోపీతో విచిత్రమైన వేషధారణలో ఫిరంగీ పాత్రలో కనిపించనున్నారు ఆమిర్. ఈ చిత్రం ట్రైలర్ ఈ నెల 27న, సినిమా నవంబర్ 8న రిలీజ్ కానున్నాయి. -
కారం సరిపోయిందా?
షూటింగ్ లేని సమయాల్లో వేరే పనులేవీ లేకుండా ఖాళీగా ఉంటే స్టార్స్ ఫన్నీగా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తుంటారు. కొందరు గొంతు సవరించుకుని పాట పాడతారు. శ్రుతీహాసన్, సోనాక్షి సిన్హా లాంటి వారు పెయింటింగ్‌తో బిజీ అయిపోతారు. ఇంకొందరు పుస్తకంలో తలదూర్చుతారు. మరికొందరు గరిటె పడతారు. సల్మాన్ ఖాన్ మల్టీ టాలెండెడ్. పాడతారు. అలాగే పెయింటింగ్, వంట కూడా చేస్తారు. నిన్న (ఆదివారం) సల్మాన్‌కి బాగా తీరిక చిక్కినట్లుంది. వంట చేసే పనిలో పడ్డారు. సల్మాన్ ఖాన్ వంట చేస్తున్నది ఇక్కడ కాదు.. అబుదాబిలో. ‘భారత్’ సినిమా కోసం అక్కడికి వెళ్లారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. కత్రినా కైఫ్ కథానాయిక. ఇక్కడున్న ఫొటో చూస్తుంటే.. కర్రీలో కారం సరిపోయిందా? అని సల్మాన్ ఆలోచిస్తున్నట్లు ఉంది కదూ. -
టాప్ సాంగ్!
గతేడాది డిసెంబర్లో రిలీజైన సల్మాన్‌ఖాన్ ‘టైగర్ జిందా హై’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కత్రినా కైఫ్ కథానాయికగా నటించారు. అంతేకాదు ‘ఏక్ తా టైగర్’ సినిమా తర్వాత ఐదేళ్లు గ్యాప్ ఇచ్చి సల్మాన్, కత్రినా కలిసి చేసిన చిత్రమిదే కావడం విశేషం. అలాగే ఈ సినిమాలోని ‘స్వాగ్ సే స్వాగత్’ సాంగ్‌కు యూ ట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్‌కు యూ ట్యూబ్‌లో 600 మిలియన్ (60 కోట్లు) వ్యూస్ వచ్చాయి. ఈ ఫీట్‌ను సాధించిన తొలి ఇండియన్ సాంగ్ ఇదేనని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలోని పాటలకు విశాల్–శేఖర్ ద్వయం సంగీతం అందించారు. ‘స్వాగ్ సే స్వాగత్’ పాటకు విశాల్, నేహా గాత్రం అందించారు. ఇర్షాద్ కామిల్ లిరిక్స్ అందించారు. వైభవి మర్చెంట్ కొరియోగ్రాఫర్. ఇప్పటికే 600 మిలియన్స్‌ను టచ్ చేసిన ఈ పాట ప్యూచర్లో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. అలాగే అలీ అబ్బాస్ జాఫర్–సల్మాన్ ఖాన్–కత్రినా కాంబినేషన్లోనే రూపొందుతున్న ‘భారత్’ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
నయా లుక్
ఇక్కడున్న ఫొటో చూశారుగా.. హీరో ఆమిర్‌ఖాన్ 1980 నాటి సిగార్‌ను నోట్లో పెట్టుకుని ఎలా దర్జాగా కూర్చున్నారో. ఇది ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ సినిమా కోసమే. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ఇది. ఫిలిప్ మెడోస్ టేలర్ రాసిన ‘కన్ఫెషన్స్ ఆఫ్ ఏ థగ్’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ లుక్‌ను కత్రినా కైఫ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. అలాగే ఇకనుంచి సినిమాలో కీలక తారాగణానికి సంబంధించిన లుక్స్‌ని వారానికి ఒకటి విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్‌లో విడుదల కానుంది. -
జై బోలో గణేశ్ మహారాజ్‌కి...జై!
పండగ రోజు షూటింగ్‌లకు కాస్త గ్యాప్ ఇచ్చి వినాయక చవితి సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా జరుపుకున్నారు బాలీవుడ్ సినీ తారలు. ఇంట్లో పండగ చేసుకుని ఇరుగింటికి పొరుగింటికి కూడా వెళ్లారు. ఈ తొమ్మిది రోజులూ బాలీవుడ్లో ఇలా సందడి సందడిగా ఉంటుంది. సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ అయితే ఘనంగా పూజా కార్యకమాలు ఏర్పాటు చేసి, ఇండస్ట్రీ ప్రముఖులను ఆహ్వానించారు. కత్రినా కైఫ్, ఆమె చెల్లి ఇసబెల్లా కైఫ్, సంజయ్‌దత్, ఆయన సతీమణి మాన్యతా దత్, సోహా అలీఖాన్, సల్మాన్ ప్రేయసి లూలియా వంటూర్, షారుక్ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్.. ఇలా చాలా మంది స్టార్స్ అర్పితాఖాన్ అండ్ ఆయుష్ శర్మల ఇంటి వినాయకుడ్ని సందర్శించారు. ఈ ప్రముఖులు కొన్ని కెమెరా కళ్లకు చిక్కారు. ఇక ఇక్కడే ఉన్న ఫొటోలో చూశారుగా గణేశ్ మహరాజ్‌ని మాధురీ దీక్షిత్ ఎంత భక్తిగా ప్రార్థిస్తున్నారో. ప్రతి ఏడాదిలానే శిల్పా శెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో కలసి స్వయంగా మార్కెట్‌కి వెళ్లి వినాయకుడ్ని కొని తెచ్చారు. నిమజ్జనం రోజున ఆమె చేసే సందడి మామూలుగా ఉండదు. క్రేజీ స్టార్స్ తమన్నా, శ్రద్ధాకపూర్‌లను చూస్తున్నారా? నవ్వులు చిందిస్తూ పూజ చేస్తున్నారు. మరో బ్యూటీ సోనమ్ కపూర్‌కి పెళ్లయ్యాక వచ్చిన తొలి వినాయక చవితి ఇది. ఆమె కూడా ఘనంగా జరుపుకున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ గాళ్ కంగనా రనౌత్ సెలబ్రేషన్స్‌లో మాత్రం వెనక్కు తగ్గుతారా? తన సోదరి రంగోలి రనౌత్ కొడుకుతో కలిసి హ్యాపీ వినాయక చవితి చెప్పారు. అలాగే సెన్సేషనల్ స్టార్ సన్నీ లియోన్ ఇంట్లో కూడా పండగ వాతావరణం వచ్చింది. ఇక్కడున్న ఫొటోలో ఆమె భర్త డానియల్, సన్నీల దత్త పుత్రిక నిషాలను చూడొచ్చు. ఇదే రేంజ్లో షారుక్‌ఖాన్, అనుష్కా శర్మ.. ఇలా మరెందరో బాలీవుడ్ తారలు పండగని ఘనంగా జరుపుకున్నారు. బచ్చన్ ఫ్యామిలీని మరచిపోతే ఎలా? ఆ ఇంటి పండగ సందడి కూడా బ్రహ్మాండంగా వినిపించిందని బాలీవుడ్ టాక్. సోదరి తనయుడితో కంగనా రనౌత్; భర్త రాజ్ కుంద్రా, తనయుడు వియాన్‌తో శిల్పా శ్రద్ధాకపూర్ దత్త పుత్రిక, భర్తతో సన్నీ కత్రినా, ఇసబెల్లా, ; చెల్లి ఇంటి దారిలో సల్మాన్... -
మస్త్ మార్కెటింగ్
మార్కెటింగ్ మెళకువలు బాగా తెలిసిన నటుడు ఆమిర్ ఖాన్. కేవలం మంచి స్క్రిప్ట్ ఎంచుకోవడంలోనే కాదు దాన్ని ఆడియన్స్ వరకూ తీసుకెళ్లడంలోనూ మాస్టర్ ఆయన. అందుకే కలెక్షన్స్ రాబట్టడంలో టాప్‌లో ఉంటారు. లేటెస్ట్గా విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్, అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేస్తోన్న భారీ బడ్జెట్ పీరియాడికల్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’. కత్రినా కైఫ్, ఫాతిమా సనాషేక్ హీరోయిన్లు. ఈ సినిమాను 3డి, ఐమాక్స్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసింది చిత్రబృందం. అలాగే తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయనుంది. ఈ రెండు భాషల్లో మాత్రమే కాదు.. వీలైనన్ని ఎక్కువ భాషల్లో రిలీజ్ చేసి అన్ని మార్కెట్స్‌లో కలెక్షన్స్ కొల్లగొట్టాలనుకుంటోంది. నవంబర్ 7న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ సంస్థ నిర్మిస్తోంది. -
సల్మాన్ ఫ్యాన్స్‌కు ఇండిపెండెన్స్ డే కానుక
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్నసినిమా భారత్. భారత 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సల్మాన్‌ఖాన్ తన లేటెస్ట్ మూవీ భారత్ టీజర్ రిలీజ్ చేశాడు. ఇండియన్ మ్యాప్‌ను చూపిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో సల్మాన్ చెప్పే ఎమోషనల్ డైలాగ్‌తో టీజర్ సాగిపోతుంది. ‘కొన్ని బంధాలు మట్టితో పెనవేసుకుంటాయి.. మరికొన్ని రక్త సంబంధంతో ముడిపడి ఉంటాయి. నాకు ఆ రెండు బంధాలు ఉన్నాయి’ అన్న సల్మాన్ వాయిస్ ఓవర్‌తో టీజర్ ముగుస్తుంది. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో ఈ వహిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఐదు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో సల్మాన్ సరసన కత్రినా, దిశాపటానీలు నటిస్తున్నారు. టబు, సునిల్ గ్రోవర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీని వచ్చే యేడాది ఈద్‌కు విడుదల కానుంది. -
ప్రియాంక పోయి కైఫ్ వచ్చె!
‘భారత్’ సినిమా నుంచి ఆఖరి నిమిషంలో తప్పుకున్నారు ప్రియాంకా చోప్రా. బాయ్ ఫ్రెండ్ నిక్ జోనస్‌తో వివాహం కారణంగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని బీ టౌన్ టాక్. ఈ సినిమా నుంచి ప్రియాంక వెళ్లిపోయినా చిత్రదర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఫీలవ్వలేదు. హ్యాపీగా అంగీకరించారు. కానీ ప్రియాంకా చోప్రా పాత్రకు సంబంధించిన షూటింగ్ వచ్చే వారంలో స్టార్ట్ కావాల్సింది. ఇప్పుడు ప్రియాంక ప్లేస్‌ను కత్రినా కైఫ్ రీప్లేస్ చేయనున్నారట. ఆల్రెడీ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్లది హిట్ కాంబినేషన్ కాబట్టి కత్రినా కరెక్ట్ అని చిత్రబృందం ఆలోచిస్తోందని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమాలో దిశా పాట్నీ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దిశాది సల్మాన్ సిస్టర్ పాత్ర అని వినికిడి. సల్మాన్ ఫాదర్‌గా జాకీ ష్రాఫ్ నటిస్తున్నారని బీ టౌన్లో ప్రచారం జరుగుతోంది. ‘భారత్’ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్ కానుంది. -
కేరాఫ్ కత్రినా
ఇట్స్ టైమ్ టు డ్యాన్స్ అంటున్నారు కొత్త హీరోయిన్ ఇసబెల్లే కైఫ్. ఇంతకీ.. ఈ ఇసబెల్లే కైఫ్ ఎవరో తెలుసా? కేరాఫ్ కత్రినా కైఫ్! అదేనండీ.. కత్రినా కైఫ్ సిస్టర్ అని చెప్తున్నాం. స్టాన్లీడ్ కోస్తాస్ దర్శకత్వంలో సూరజ్ పాంచోలి హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘టైమ్ టు డ్యాన్స్’. ఈ సినిమా షూటింగ్ లండన్‌లో స్టార్ట్ అయ్యింది. టైటిల్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఫుల్ డ్యాన్స్ బేస్డ్ మూవీ అని. మరి... ఓన్ సిస్టర్ సినిమా అంటే కత్రినా ఊరుకోరు కదా. అందుకే... ‘‘కంగ్రాట్యులేషన్స్ టు ఇస్సీ’’ అని తనదైన స్టైల్లో బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. కెరీర్ స్టార్టింగ్‌లో డ్యాన్స్‌తో ఇబ్బంది పడ్డారు కత్రినా. ఇప్పుడు ఆమె చెల్లెలు ఏమో డైరెక్ట్‌గా డ్యాన్స్ బేస్డ్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. -
స్క్రీన్ టెస్ట్
1. ఓ సినిమా కోసం మహేశ్‌బాబు సిక్స్‌ప్యాక్ చేశారు. ఆ సినిమా ఏదో తెలుసా? ఎ) 1 నేనొక్కడినే బి) బిజినెస్ మేన్ సి) పోకిరి డి) ఖలేజా 2. భారతదేశ విశిష్ట పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్... ఈ మూడు పురస్కారాలను దక్కించుకున్న ఏకైక భార తీయ సినీ నటుడెవరు? ఎ) అక్కినేని నాగేశ్వరరావు బి) యన్టీ రామారావు సి) చిరంజీవి డి) అమితాబ్ 3. ‘వీర మహాదేవి’ అనే చిత్రంలో నటిస్తున్న హాట్ గర్ల్ ఎవరో తెలుసా? ఎ) షెర్లిన్ చోప్రా బి) సన్నీ లియోన్ సి) మల్లికా శెరావత్ డి) పూనమ్ పాండే 4. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న చిత్రంలో హీరోయిన్ ఎవరు? ఎ) శ్రుతీహాసన్ బి) కృతీ సనన్ సి) పూజా హెగ్డే డి) అదితీరావ్ హైదరీ 5. దర్శకుడు కోడి రామకృష్ణ.. దాసరి నారాయణరావు శిష్యుడు. గురువుకు, శిష్యునికి దర్శకులవ్వటానికి అవకాశం ఇచ్చిన నిర్మాత ఒక్కరే. ఆ నిర్మాత ఎవరు? ఎ) నాగిరెడ్డి–చక్రపాణి బి) దుక్కిపాటి మధుసూదనరావు సి) కె. రాఘవ డి) డి. రామానాయుడు 6. ‘అవతలి వాళ్లని మనం ఎంత కోరుకుంటున్నామో అది మన కళ్లల్లో కనిపించాలి’.. అనే డైలాగ్ రాసిన రచయితెవరో కనుక్కోండి? (చిన్న క్లూ– ఈ డైలాగ్ ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలోనిది) ఎ) అబ్బూరి రవి బి) కోన వెంకట్ సి) మేర్లపాక గాంధీ డి) బుర్రా సాయిమాధవ్ 7. బాలీవుడ్లో నానాపటేకర్ నటించిన ‘క్రాంతివీర్’ తెలుగు రీమేక్‌లో నానా స్థానంలో నటించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) శోభన్ బాబు బి) మోహన్ బాబు సి) నాగార్జున డి) వెంకటేశ్ 8. ‘ఓ సుబ్బారావో, ఓ అప్పారావో, ఓ వెంకట్రావో, ఓ రంగారావో ఎవరో ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా..’ అనే పాటను రాసింది పాటల రచయిత కాదు ఓ దర్శకుడు. ఆ దర్శకుడెవరో తెలుసా? ఎ) ఎ. కోదండ రామిరెడ్డి బి) కోడి రామకృష్ణ సి) కె. రాఘవేంద్ర రావు డి) దాసరి నారాయణరావు 9. హీరో కృష్ణతో ఎక్కువ సినిమాల్లో (50 చిత్రాలు) హీరోయిన్గా నటించిన హీరోయిన్ విజయనిర్మల. ఆమె తర్వాత ఆయన సరసన ఓ హీరోయిన్ 45 సినిమాల్లో నటించారు. ఆ హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) శారద బి) జయప్రద సి) విజయశాంతి డి) జయసుధ 10. ‘చారులత’ సినిమాలో అవిభక్త కవలలుగా నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) అంజలి బి) ప్రియమణì æ సి) స్నేహ డి) హన్సిక 11. హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ ఇప్పటివరకు చేసిన తెలుగు సినిమాలెన్నో ఓ సారి లెక్కెట్టండి? ఎ) 12 బి) 15 సి) 18 డి) 19 12. వేల్ రికార్డ్స్ ఆడియో కంపెనీ అధినేత ఎవరో తెలుసా? చిన్న క్లూ: ఆమె ఓ ప్రముఖ సంగీత దర్శకుని సతీమణి. ఎ) వల్లీ బి) రమా సి) సునీత డి) కౌసల్య 13. ‘అ’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు బాలీవుడ్లో వచ్చిన ‘క్వీన్’ సినిమా తెలుగు రీమేక్‌ని తెరకెక్కిస్తున్నారు. ‘అ’ని నిర్మించింది ఓ ప్రముఖ తెలుగు హీరో. ఎవరా హీరో? ఎ) సందీప్ కిషన్ బి) నాగశౌర్య సి) నాని డి) నాగచైతన్య 14. నాగార్జున, అమల వివాహ తేదీ జూన్ 11. ఏ సంవత్సరంలో వీరి పెళ్లి జరిగింది? ఎ) 1990 బి) 1989 సి) 1995 డి) 1992 15. ‘పండగ చేస్కో’ సినిమాలో రామ్ సరసన ఇద్దరు కథానాయికలు నటించారు. అందులో ఒకరు రకుల్ ప్రీత్‌సింగ్, మరో హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) అనుపమా పరమేశ్వరన్ బి) తమన్నా సి) సోనాల్ చౌహాన్ డి) మాళవికా శర్మ 16. ఈ మధ్యే 75 చిత్రాల క్లబ్లో చేరిన సంగీత దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) అనూప్ రూబెన్స్ బి) యస్.యస్. తమన్ సి) దేవిశ్రీ ప్రసాద్ డి) సాయి కార్తీక్ 17. ఇటీవల రిలీజైన బాలీవుడ్ చిత్రం ‘రాజీ’ 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) కరీనా కపూర్ బి) కత్రినా కైఫ్ సి) ఆలియా భట్ డి) డయానా పెంటీ 18. 1961లో ఎన్టీఆర్ నటించిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రానికి దర్శకుడెవరో తెలుసా? ఆయన నటుడు కూడా. ఎ) ఎన్టీఆర్ బి) అక్కినేని సి) కాంతారావు డి) యస్వీ రంగారావు 19. ఈ ఫొటోలోని చిన్నారి ఎవరు? ఎ) నిత్యామీనన్ బి) అనుపమా పరమేశ్వరన్ సి) ఆలియా భట్ డి) శోభన 20. ఈ స్టిల్ ఏ సినిమాలోదో చెప్పుకోండి? ఎ) మిస్సమ్మ బి) గుండమ్మకథ సి) అన్నపూర్ణ డి) దొంగరాముడు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) ఎ 3) బి 4) సి 5) సి 6) సి 7) బి 8) డి 9) బి 10) బి 11) బి 12) ఎ 13) సి 14) డి 15) సి 16) బి 17) సి 18) ఎ 19) ఎ 20) డి నిర్వహణ: శివ మల్లాల -
స్క్రీన్ టెస్ట్
► ప్రభాస్ నటించిన ఓ సినిమాకు ‘వారధి’ అని పేరు పెట్టారు. తర్వాత వేరే కారణాలవల్ల సినిమాకు పేరు మార్చారు. ఏ సినిమాకు ఇలా జరిగిందో తెలుసా? ఎ) మిర్చి బి) మిస్టర్ పర్ఫెక్ట్ సి) మున్నా డి) డార్లింగ్ ► తెలుగులో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఓ హీరోయిన్ తన తమ్ముడిని హీరోగా చేయటానికి ప్రయత్నిస్తోంది. ఆ హీరోయిన్ ఎవర బ్బా? ఎ) తమన్నా బి) రకుల్ ప్రీత్ సింగ్ సి) హన్సిక డి) లావణ్యా త్రిపాఠి ► నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘ఏ మాయ చేశావె’ చిత్రానికి సంగీతదర్శకుడెవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) యస్.యస్. తమన్ బి) హారీస్ జయరాజ్ సి) అనూప్ రూబెన్స్ డి) ఏ.ఆర్. రెహమా¯Œ ► దర్శకుడు రాజమౌళిని ఓ హీరో జక్కన్న అని పిలుస్తారు. ఎవరా హీరో? ఎ) యన్టీఆర్ బి) ప్రభాస్ సి) రామ్‌చరణ్ డి) రవితేజ ► ‘బాషా’ దర్శకుడు సురేశ్‌కృష్ణ దర్శకత్వంలో ‘అస్త్రం’ అనే సినిమాలో నటించారు హీరోయిన్ ‘అనుష్క’. ఆ సినిమా హీరో ఎవరో గుర్తుందా? ఎ) సుమంత్ బి) రానా సి) విష్ణు డి) గోపీచంద్ ► ‘కలలా నా జీవితంలోకి వచ్చావ్, కల కంటున్నపుడు వెళ్లిపోయావ్, మళ్లీ ఇన్నాళ్లకి మెరిశావు... కలో నిజమో అర్థం కావట్లేదు’ అనే డైలాగ్ హీరో వరుణ్ తేజ్ ఏ హీరోయి¯Œ తో చెప్పాడో తెలుసా? ఎ) పూజా హెగ్డే బి) రాశీ ఖన్నా సి) హెబ్బా పటేల్ డి) ప్రగ్యా జైస్వాల్ ► ‘జానకి జానకి జానకి ఎక్కడికి పోతావే జానకి ’ అనే సూపర్‌హిట్ పాట రచయిత ఎవరు? ఎ) వనమాలి బి) అనంత శ్రీరామ్ సి) భాస్కరభట్ల డి) చంద్రబోస్ ► త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ హీరో ఫస్ట్ టైమ్ ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే సెట్స్‌కి వెళ్లిన ఆ సినిమా హీరో ఎవరో తెలుసా? ఎ) ప్రభాస్ బి) ఎన్టీఆర్ సి) రామ్‌చరణ్ డి) చిరంజీవి ► ‘హాంకాంగ్’లో పుట్టిన ఈ ప్రముఖ బాలీవుడ్ కథానాయిక కుటుంబం లండన్‌లో సెటిల్ అయ్యింది. ఆమె తెలుగు సినిమాలో కూడా నటించిన హీరోయినే.ఎవరయ్యుంటారామె? ఎ) అమీషా పటేల్ బి) అయేషా టకియా సి) కంగనా రనౌత్ డి) కత్రినా కైఫ్ ► ‘ఇన్స్టాగ్రామ్’లో 71 లక్షలమంది ఫాలోయర్లను సొంతం చేసుకున్నహీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) కాజల్ అగర్వాల్ బి) శ్రుతీహాసన్ సి) ఇలియానా డి) సమంత ► నటుడు ప్రకాశ్‌రాజ్ ఏ దర్శకుని ద్వారా సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారో తెలుసుకుందామా? ఎ) దాసరి బి) భారతీరాజా సి) బాలు మహేంద్ర డి) బాలచందర్ ► 1998లో ఈ హీరోయిన్ ‘మిస్ సూరత్’. ఆ తర్వాత తెలుగు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఎవరా హీరోయిన్? ఎ) నమిత బి) మీనా సి) త్రిష డి) సిమ్రాన్ ► ‘నేను నా జీవితం’ అనే పుస్తకాన్ని రచించిన ప్రముఖ నటుడెవరో తెలుసా? ఎ) కాంతారావు బి) కృష్ణ సి) అక్కినేని నాగేశ్వరరావు డి) శోభన్‌బాబు ► ఇటీవల థాయ్‌ల్యాండ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ స్విమ్ మీట్ ఈత పోటీల్లో భారతదేశం తరపున కాంస్య పతకం సాధించిన వేదాంత్ ఏ హీరో కుమారుడో తెలుసా? ఎ) విజయ్ బి) మాధవన్ సి) విక్రమ్ డి) అజిత్ ► సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘మహానటి’. అందులో జెమినీ గణేశన్ పాత్రలో నటించింది ఎవరు? ఎ) విజయ్ దేవరకొండ బి) మోహన్బాబుసి) నాని డి) దుల్కర్ సల్మాన్ ► మణిపాల్ యూనివర్శిటీలో జర్నలిజం చదువుకుని, తర్వాత హీరోయిన్గా సింగర్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ ఎవరో కనుక్కోండి చూద్దాం? ఎ) నివేథా థామస్ బి) నిత్యామీనన్ సి) అనూ ఇమ్మాన్యుయేల్ డి) అనుపమా పరమేశ్వరన్ ► ‘శంకర్‌దాదా’ చిత్రంలో అతిథి పాత్రలో నటించిన యువ హీరో ఎవరో గుర్తుందా? ఎ) శర్వానంద్ బి) సందీప్ కిషన్ సి) శ్రీనివాస్ అవసరాల డి) ప్రిన్స్ ► ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రంలో శ్రీదేవి ముఖ్య తారగా నటించారు. శ్రీదేవి మేనకోడలి పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? శేఖర్ కమ్ముల ‘లీడర్’ చిత్రంలో ఒక హీరోయిన్గా ఆమె నటించారు? ఎ) రిచా గంగోపాధ్యాయ బి) దీక్షాసేథ్∙ సి) ప్రియా ఆనంద్ డి) కమలినీ ముఖర్జీ ► సుమన్, భానుప్రియ నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో కనుక్కోండి? ఎ) సితార బి) అన్వేషణ సి) ఆలాపన డి) ప్రేమించు పెళ్లాడు ► ఈ ఫొటోలోని ప్రముఖ హాస్యనటి ఎవరో కనుక్కోండి? ఎ) శ్రీలక్ష్మీ బి) రమాప్రభ సి) గీతాంజలి డి) తెలంగాణ శకుంతల మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) బి 3) డి 4) ఎ5) సి 6) బి 7) సి 8) బి 9) డి 10) ఎ 11) డి 12) ఎ 13) సి 14) బి 15) డి 16) బి17) ఎ 18) సి 19) ఎ20) బి నిర్వహణ: శివ మల్లాల -
కత్రినా పెళ్లి కూతురాయెనె!
ప్రజెంట్ బీటౌన్‌లో పెళ్లి గాలి బాగా వీస్తోంది. విరాట్ కోహ్లితో ఆల్రెడీ హీరోయిన్ అనుష్కా శర్మ ఏడడుగులు వేశారు. మరో కథానాయిక సోనమ్ కపూర్ కూడా తన బాయ్‌ఫ్రెండ్ ఆనంద్ అహుజాతో వచ్చే నెల ఫస్ట్ వీక్‌లో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ టైమ్‌లో పెళ్లికూతురు గెటప్‌లో కనిపించారు కత్రినా కైఫ్. తాను ఆ గెటప్‌లో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు కత్రినా. అంతే... కత్రినా పెళ్లి కూతురాయెనే అని బీటౌన్‌లో టామ్ టామ్ చేశారు కొందరు. అయితే కత్రినా కైఫ్ పెళ్లికూతురయ్యారు కానీ నిజ జీవితంలో కాదు. సినిమా జీవితంలో. ఆనంద్. ఎల్. రాయ్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘జీరో’. ఇందులో కత్రినా కైఫ్, అనుష్కా శర్మ కథానాయికలు. ఈ సినిమాలో కత్రినా పెళ్లి కూతురి గెటప్‌లో కనిపించనున్నారు. ఇందులో ఆల్కహాల్‌కు ఎడికై్టన అమ్మాయి పాత్రలో కత్రినాకైఫ్, సైంటిస్ట్‌గా సక్సెస్ సాధించాలని స్ట్రగులయ్యే పాత్రలో అనుష్కా శర్మ కనిపించనున్నారని బాలీవుడ్ టాక్. ఈ సినిమాలో షారుక్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘జీరో’ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 21న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘జబ్ తక్ హై జాన్’ తర్వాత షారుక్, అనుష్క, కత్రినా కలిసి నటించిన ఈ సినిమా పై బాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి. లైఫ్ జర్నీతో బుక్: కత్రినా తన లైఫ్ జర్నీని ఒక పుస్తక రూపంలో (ఆటోబయోగ్రఫీ) రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఈ ఆటోబయోగ్రఫీ కోసం ఆల్రెడీ ఒక పబ్లిషింగ్ హౌస్‌తో సంప్రదింపులు కూడా జరిపారని సమాచారమ్. ఈ బుక్‌లో ముఖ్యంగా తన బాల్యాన్ని, లండన్, జపాన్, ఇండియా ఇలా వివిధ దేశాల్లో ఉండటం వల్ల తన లైఫ్‌లో సంస్కృతులు చూపిన ప్రభావం, బాలీవుడ్లో 15 ఏళ్ల కెరీర్‌ను ఎక్కువగా ప్రస్తావించనున్నారట. ఈ బుక్ ఇన్స్పిరేషనల్గా ఉండబోతోందట. -
చిన్నపిల్లోడిగా ఎదుగుతున్నా
ఎవరైనా ఎదుగుతూ ఎదుగుతూ పెద్దవాళ్లు అయిపోతారు. కానీ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ మాత్రం చిన్నపిల్లాడిగా ఎదుగుతున్నారట. చిన్నపిల్లాడు అయిపోవటానికి కారణం ఏంటంటే.. షారుక్ ఖాన్ ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో ‘జీరో’ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఇందులో ఆయన మరుగుజ్జు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తయ్యే వరకూ వేరే సినిమా సైన్ చేయకూడదని ఫిక్స్ అయ్యారు షారుక్. ఈ కమిట్మెంట్ చూస్తేనే అర్థం అవుతుంది ఈ సినిమాపై షారుక్ ఎంత ప్రేమను పెంచుకున్నారో. ‘జీరో’ అనుభవాలను షేర్ చేసుకుంటూ –‘‘ ఐయామ్ లవ్వింగ్ అంyŠ లివ్వింగ్ ఇన్ ‘జీరో’ (జీరోని ప్రేమిస్తున్నాను, అలాగే జీవిస్తున్నాను కూడా) టీమ్ అందరికీ ధన్యవాదాలు. ఈ ఎక్స్‌పీరియన్స్‌ని వివరించమంటే మాత్రం ‘చిన్నపిల్లోడిగా ఎదిగిపోతున్నాను. అది కూడా చాలా ఫాస్ట్‌గా’ అని చెప్ప గలను’’ అని పేర్కొన్నారు షారుక్. కత్రినా కైఫ్,అనుష్కా శర్మ కథానాయికలు. గౌరీ ఖాన్, ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. -
సల్మాన్, కత్రినా వైరల్ వీడియో
ముంబయి : బ్రేకప్ అవ్వొచ్చు.. పరిస్థితులు దూరం చేయొచ్చు.. కానీ, ఒకసారి ప్రేమించుకున్నవారు తిరిగి ఎప్పుడైనా ఎదురుపడినా, పక్కపక్కనే ఉన్నా తామిద్దరం ఎప్పటికీ ఒకటే అని కొంతమంది నిరూపించుకుంటుంటారు. అలాంటి వాళ్లల్లో ప్రముఖంగా బాలీవుడ్ నటుడు, ఇండస్ట్రీ మోస్ట్‌వాంటెడ్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ ఆయన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్‌ను చెప్పుకోవచ్చు. వారిద్దరు ఎప్పుడో విడిపోయారని చెప్పుకున్నప్పటికీ పలు సందర్భాల్లో వారి మధ్య అన్యోన్యతను ప్రదర్శిస్తూ ఎన్నో సార్లు మీడియాకు చిక్కి చర్చల్లో నిలిచారు. సరిగ్గా చాలా రోజుల తర్వాత మరోసారి దొరికిపోయారు. అది కూడా ఏకంగా ఒకే కప్పులో కాఫీని ఇద్దరు తాగేస్తూ. అవును.. ద-బాంగ్ చిత్రం కోసం ప్రత్యేక టూర్లో ఉన్న సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా పుణెలో ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ సమయంలో ఫ్యాన్స్‌కు మాత్రం కళ్లన్నీ సల్మాన్, కత్రినాలపైనే పడ్డాయి. వారు ఏం చేస్తారా అని ఆసక్తిగా ప్రతి మూమెంట్ గమనిస్తున్నారు. అదే సమయంలో ఒకే కాఫీ కప్పును ఇద్దరు షేర్ చేసుకోవడం చూశారు. సల్మాన్ కొంచెం తాగి ఇచ్చిన కాఫీ కప్‌ను తీసుకుని కత్రినా తాగేసింది. దాంతో ఖంగుతిన్న ఫ్యాన్స్ వెంటనే ఆ సీన్‌ను తమ ఫోన్లలో వీడియో తీసి ఇన్‌స్టాగ్రమ్‌లో పంచుకున్నారు. అంతటితో ఆగకుండా దానికి కపుల్ గోల్స్ అంటూ పేరు కూడా పెట్టారు. ఇదిప్పుడు పెద్దగా వైరల్ అవుతోంది. -
సల్మాన్, కత్రినా వైరల్ వీడియో
-
నాకు సున్నా మార్కులేశాడు!
కమిలి కమిలి (ధూమ్ 3–2013), చిక్నీ చమేలి (అగ్నిపత్–2012), షీలాకి జవానీ (థీస్ మార్ ఖాన్–2010)... ఇప్పటికే మీకు గుర్తొచ్చి ఉంటుంది. ఈ సాంగ్స్‌లో హీరోయిన్ కత్రినా కైఫ్ కుర్రకారును ఏ లెవల్లో ఊర్రూతలూగించారో. ఆ పాటల్లో కత్రినా చేసిన డ్యాన్స్‌కు ఎంతోమంది ఫిదా అయ్యారు. అలాంటి కత్రినా కైఫ్ కెరీర్ స్టార్టింగ్‌లో డ్యాన్స్‌తో కాస్త ఇబ్బందిపడ్డారట. ఈ విషయం గురించి కత్రినా చెబుతూ– ‘‘తెలుగులో ఓ స్టార్ హీరోతో సినిమా చేశాను. అప్పట్లో నా డ్యాన్స్ స్కిల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల సాంగ్స్ షూట్‌కు టైమ్ పట్టింది. అప్పుడు ఆ కొరియోగ్రాఫర్ నన్ను ఏమీ అనలేదు. ఆ తర్వాత అదే కొరియోగ్రాఫర్ ఓ హిందీ సినిమాకు వర్క్ చేస్తున్న టైమ్‌లో కత్రినా కైఫ్‌కు డ్యాన్స్‌లో ‘జీరో మార్క్స్’ అన్నారని నా సన్నిహితులు నాతో చెప్పారు. అది విని షాక్ అయ్యాను’’ అని పేర్కొన్నారు. ఇంకా చెబుతూ– ‘‘డ్యాన్స్‌లో నేను కాస్త వీక్ అని నాకు తెలుసు. అయితే నాతో విషయం చెప్పకుండా వేరేవాళ్ల దగ్గర నన్ను విమర్శించడం బాధ అనిపించింది. ఆ తర్వాత కథక్ గురు వీరు కృష్ణణ్ పర్యవేక్షణలో డ్యాన్స్ స్కిల్స్‌ను మెరుగుపర్చుకున్నాను. ప్రతిరోజూ 12 గంటలకు పైగా సాధన చేశాను. కొరియోగ్రాఫర్ బాస్కో సీజర్ నాలో ఆత్మవిశ్వాసం నింపారు’’ అన్నారు కత్రినా. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా, ఫాతిమా సనాషేక్ ముఖ్య తారలుగా రూపొందుతున్న ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ సినిమాలో ఓ డ్యాన్స్ నంబర్‌కు ఇటీవల కాలు కదిపారామె . ఈ సాంగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడే ఈ విషయాలు పంచుకున్నారు. -
టైగర్ దూకుడు.. అత్యంత భారీగా వసూళ్లు!
ముంబై: సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'టైగర్ జిందా హై' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. అంచనాలకు మించి వసూళ్లు రాబడుతూ.. త్వరలోనే వందకోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టే దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమా తొలి రెండురోజుల కలెక్షన్స్ వివరాలు కళ్లు చెదిరేలా ఉన్నాయి. మొత్తానికి వరుస ప్లాపులతో డీలాపడిన బాలీవుడ్లో కొత్త జోష్ నింపేలా ఈ కలెక్షన్లు ఉండటం గమనార్హం. ఈ సినిమాకు యావరేజ్ రివ్యూలు వచ్చినా.. సల్మాన్ ఛరిష్మా కారణంగా భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ మౌత్‌టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా తొలిరోజు రూ. 33 కోట్లు రాబట్టగా.. రెండోరోజు శనివారం ఏకంగా రూ. 34.10 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. మొత్తం మీద రెండురోజుల్లో రూ. 69.40 కోట్లు కలెక్ట్ చేసిన ‘టైగర్ జిందా హై’... నేడు, రేపు మరో రెండురోజులు సెలవులు ఉండటంతో అతిత్వరలోనే వందకోట్ల మార్కును అందుకునే అవకాశముందని సినీ ట్రేడ్ నిపుణుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. మూడురోజుల్లోనే ఈ సినిమా వందకోట్ల మార్కును దాటితే.. అత్యంత వేగంగా వందకోట్ల క్లబ్బులో చేరిన సినిమాగా ’టైగర్ జిందా హై’ నిలువనుంది. ఇప్పటికే, బాహుబలి-2 తర్వాత తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా 'టైగర్ జిందా హై' రికార్డు సాధించింది. సల్మాన్, కత్రినా కైఫ్ జంటగా అలీ అబ్బాస్ తెరకెక్కిన ’టైగర్ జిందా హై’ .. ఏక్ థా టైగర్ చిత్రానికి సీక్వెల్. -
ఈ పులిని ఆడనివ్వలేదు
‘టైగర్ జిందా హై’ నిన్న ప్రపంచమంతా విడుదలైంది. రాజస్థాన్‌లోనే రిలీజ్ అవలేదు! థియేటర్లకు బాక్సులు చేరుకున్నాయి కానీ, ‘షో’ వేస్తే బాక్సు బద్ధలౌతుందని ‘వాల్మీకి’ కమ్యూనిటీ కర్రలు పట్టుకుని నిల్చుంది. సినిమాకు వ్యతిరేకంగా స్లోగన్లు ఇచ్చింది. వాల్‌పోస్టర్లు చింపేసింది. ఫస్ట్ అజ్మీర్‌లో మొదలైంది ప్రొటెస్ట్. తర్వాత జైపూర్‌కి, అక్కడి నుంచి కోట ప్రాంతానికి పాకింది. ఆగ్రహజ్వాలలు కదా, అలాగే స్పీడ్‌గా వ్యాపిస్తాయి. సల్మాన్‌ఖాన్, కత్రీనా కైఫ్.. హీరో హీరోయిన్లు. హీరో గారు వాల్మీకి కమ్యూనిటీకీ వ్యతిరేకంగా సినిమాలో అయితే ఏమీ డైలాగులు కొట్టలేదు. మరి ఎక్కడ కొట్టారు? ఎప్పుడు కొట్టారు? రిలీజ్‌కు ముందు మూవీ ప్రమోషన్లో కొట్టాడట. ఏదో యాసలో మాట్లాడి! అదీ వీడియోలో. అది వైరల్ అయింది. రాజస్థాన్‌కు అంటుకుంది. మొన్న ‘పద్మావతి’, న్ని ్న ‘టైగర్ జిందా హై’! చివరికి రాజస్థాన్.. సినిమాలకు కూడా ఎడారి ప్రాంతం అయిపోతుందా?! -
‘డ్రా’తో ఐఎస్ఎల్ షురూ
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ నాలుగో సీజన్ ‘డ్రా’తో మొదలైంది. కేరళ బ్లాస్టర్స్, అట్లెటికో డి కోల్‌కతా జట్ల మధ్య శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. ఆట ముగిసే సమయంలో కేరళ, కోల్‌కతా జట్లకు గోల్ చేసే అవకాశం త్రుటిలో చేజారింది. కోల్‌కతా ప్లేయర్ బ్రాంకో సూపర్ కిక్‌తో దాదాపు గోల్ అయినట్లే అనిపించినా... గోల్‌పోస్ట్‌ను తాకి బంతి బయటకు వెళ్లిపోయింది. మ్యాచ్‌కు ముందు బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హుషారెత్తించే నృత్యాలతో హోరెత్తించారు. శనివారం జరిగే మ్యాచ్‌లో నార్త్ఈస్ట్ యునైటెడ్‌తో జంషెడ్పూర్ ఎఫ్‌సీ ఆడుతుంది. -
ముద్దంటే చేదా?
ము.. ము.. ము.. ము.. ముద్దంటే చేదా.. నీకా ఉద్దేశం లేదా... అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ని ఉద్దేశించి. గతంలో ఎప్పుడూ పెదవి ముద్దులకు అడ్డుచెప్పని సల్లూభాయ్ ఇప్పుడు బుద్ధిమంతుడిలా మారిపోయారట. ముద్దంటే చేదే? అంటున్నారట. అసలు సంగతికొస్తే.. సల్మాన్‌ఖాన్, పొడుగుకాళ్ల సుందరి కత్రినా కైఫ్ మాజీ ప్రేమికులన్న సంగతి తెలిసిందే. గతంలో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరు ఆ తర్వాత విడిపోయారు. లవ్ బ్రేకప్ అయిన చాన్నాళ్లకు ఇద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ జిందా హై’. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ డిమాండ్ చేయడంతో ఈ చిత్రంలో సల్మాన్–కత్రినా మధ్య ఓ లిప్‌లాక్ ప్లాన్ చేశారట దర్శకుడు. అయితే, తన మాజీ లవర్ని ముద్దు పెట్టుకునేందుకు సల్లూభాయ్ నో అనేశారట. ముద్దు విషయంలో దర్శకుడు ఎంతగా కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించినా ‘సారీ.. కుదరదు’ అన్నారట కండలవీరుడు. దీంతో చేసేదేం లేక ముద్దు సన్నివేశం లేకుండానే షూటింగ్ కానిచ్చేశారట. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదలవుతోంది. ఇంతకీ సల్మాన్ ముద్దు ఎందుకు వద్దన్నారు? తాజా లవర్ లూలియా వంటూర్ వద్దన్నారా? అయ్యే ఉంటుంది. -
మాజీ లవర్‌తో మళ్లీ చేయను!
‘అవును.. ఇదే నా ఆఖరి చిత్రం.. ఇకపై తనతో ఎప్పుడూ నటించను’ అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు కత్రినాకైఫ్. అంతగా ఆమె ద్వేషిస్తున్న ఆ హీరో ఎవరు? అంటే.. ఇంకెవరూ.. ఒకప్పటి కత్రినా లవర్ రణబీర్ కపూర్. ఈ మాజీ లవర్స్ తాజాగా నటించిన ‘జగ్గా జాసూస్’ ప్రమోషన్లో రణబీర్‌తో కలిసి నటించనని కత్రినా స్పష్టం చేశారు. ‘‘రణబీర్‌తో పనిచేయడం కష్టంగా అన్పించింది. నాతో మరో సినిమాలో నటించనని రణబీర్ ‘జగ్గా జాసూస్’ సినిమా చిత్రీకరణ టైమ్‌లో చెప్పాడు. అందుకే, నేను కూడా అతనితో సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నా. రణబీర్‌తో ఇదే నా చివరి చిత్రం’’ అన్నారు.