Tiger 3 Movie: Katrina Kaif Resumes Shooting After Wedding - Sakshi
Sakshi News home page

Katrina Kaif: పెళ్లి తర్వాత తిరిగి షూటింగ్‌ ప్రారంభించిన కత్రీనా.. 'టైగర్‌ 3' కోసం ఢిల్లీకి

Published Sat, Dec 18 2021 5:27 PM | Last Updated on Mon, Dec 27 2021 4:27 PM

Katrina Kaif Resumes Shooting After Wedding And Going To Delhi - Sakshi

Katrina Kaif Resumes Shooting After Wedding And Going To Delhi: బాలీవుడ్‌ కొత్త జంట కత్రీనా కైఫ్‌, విక్కీ కౌశల్‌ తమ పెళ్లి తర్వాత ఎధావిధిగా సినిమా షూటింగ్‌ల్లో బిజీగా గడపనున్నారు. వారివారి సినిమా షూటింగ్‌ షెడ్యూల్స్‌ను సెట్‌ చేసుకుంటున్నారు. ఇప్పటికే విక్కీ కౌశల్‌ తన సినిమా షెడ్యూల్‌ను ప్రకటించాడు. ఇప్పుడు కత్రీనా కూడా మూవీ షూటింగ్‌లో పాల్గొననుంది. బాలీవుడ్‌ కండల వీరుడు, భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌తో నటిస్తున్న 'టైగర్‌ 3' (Tiger 3) చిత్రం చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసేందుకు కత్రీనా త్వరలో ఢిల‍్లీ వెళ్లనుంది. ఈ షెడ్యూల్‌ సుమారు 15 రోజుల వరకు ఉంటుందట. అన్ని సక్రమంగా జరిగేలా చిత్రబృంద్రం ప్లాన్‌ చేస్తుందని తెలుస్తోంది. అనుకున్నట్లు జరిగితే దేశ రాజధానిలో సల్మాన్‌, కత్రీనా ఇద్దరితో షూటింగ్‌ నిర్వహించే అవకాశం ఉంది. అలాగే కత్రీనా, సల్మాన్‌ ఇద్దరూ పెద్ద స్టార్లు కావడంతో షూటింగ్‌కు సంబంధించిన చిత్రాలు బయటకు లీక్‌ కాకుండా జాగ్రత్త పడుతున్నారట. 

సల్మాన్‌, కత్రీనాకు బెస్ట్‌ ఆన్‌స్క‍్రీన్‌ జోడీగా పేరుంది. వీరిపై ఎక్కువగా భాగం ఢిల్లీలోనే చిత్రీకరించనున్నారట. ఈ చిత్రీకరణకు సల్మాన్‌, కత్రీనా ఇద్దరూ సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌తో 'టైగర్‌ 3' చిత్రం ముగింపు దశకు రానున్నట్లు తెలుస్తోంది. స్పై థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా చిత్రీకరణను వివిధ నగరాల్లో షూట్ చేశారు. అయితే ఢిల‍్లీలో చిత్రీకరించే సన్నివేశాలు మాత్రం 'అత్యంత ఘోరమైన మిషన్‌'కు సంబంధించినవి అని సమాచారం. టైగర్‌ ఫ్రాంచైజీ నుంచి వస్తోన్న మూడో చిత్రం ఇది. దేశాన్ని, మానవాళిని రక్షించడానికి వివిధ మిషన్లలో పాలుపంచుకునే భారత్‌, పాక్‌ ఏజెంట్ల కథ ఆధారంగా తెరకెక్కిందే ఈ టైగర్‌ ఫ్రాంచైజీ. 

ఈ ఫ్రాంచైలో మొదటి భాగం 2012లో వచ్చిన 'ఏక్‌ థా టైగర్‌'ను కబీర్‌ ఖాన్‌ డైరెక్‌ చేయగా, రెండో భాగం 'టైగర్‌ జిందా హై' (2017)ను అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించాడు. మూడో సీక్వెల్‌ 'టైగర్‌ 3' చిత్రాన్ని మనీష్ శర‍్మ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఇమ్రాన్‌ హష్మీ కీలక పాత్ర చేయనున్నాడు. ఇదిలా ఉంటే కత్రీనా జోయా అక్తర్‌ దర్శకత్వంలో వస్తున్న 'జీ లే జరా' చిత్రంలో నటించనుంది. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌, గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా జోనాస్‌లతో కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకోనుంది కత్రీనా. 

ఇదీ చదవండి: ఆ వ్యవహారంలోకి నన్ను లాగొద్దు: విక్కీ మాజీ ప్రేయసీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement