Tiger Movie
-
సల్మాన్ ఖాన్ కు సీక్వెల్ ఫీవర్.. టైగర్ 4 ప్లాన్!
-
దీపావళికి తిరిగొస్తున్న టైగర్..
-
పెళ్లి తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించిన కత్రీనా.. 'టైగర్ 3' కోసం ఢిల్లీకి
Katrina Kaif Resumes Shooting After Wedding And Going To Delhi: బాలీవుడ్ కొత్త జంట కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ తమ పెళ్లి తర్వాత ఎధావిధిగా సినిమా షూటింగ్‌ల్లో బిజీగా గడపనున్నారు. వారివారి సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌ను సెట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే విక్కీ కౌశల్ తన సినిమా షెడ్యూల్‌ను ప్రకటించాడు. ఇప్పుడు కత్రీనా కూడా మూవీ షూటింగ్లో పాల్గొననుంది. బాలీవుడ్ కండల వీరుడు, భాయిజాన్ సల్మాన్ ఖాన్‌తో నటిస్తున్న 'టైగర్ 3' (Tiger 3) చిత్రం చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసేందుకు కత్రీనా త్వరలో ఢిల్లీ వెళ్లనుంది. ఈ షెడ్యూల్ సుమారు 15 రోజుల వరకు ఉంటుందట. అన్ని సక్రమంగా జరిగేలా చిత్రబృంద్రం ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. అనుకున్నట్లు జరిగితే దేశ రాజధానిలో సల్మాన్, కత్రీనా ఇద్దరితో షూటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. అలాగే కత్రీనా, సల్మాన్ ఇద్దరూ పెద్ద స్టార్లు కావడంతో షూటింగ్‌కు సంబంధించిన చిత్రాలు బయటకు లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారట. సల్మాన్, కత్రీనాకు బెస్ట్ ఆన్‌స్క్రీన్ జోడీగా పేరుంది. వీరిపై ఎక్కువగా భాగం ఢిల్లీలోనే చిత్రీకరించనున్నారట. ఈ చిత్రీకరణకు సల్మాన్, కత్రీనా ఇద్దరూ సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌తో 'టైగర్ 3' చిత్రం ముగింపు దశకు రానున్నట్లు తెలుస్తోంది. స్పై థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా చిత్రీకరణను వివిధ నగరాల్లో షూట్ చేశారు. అయితే ఢిల్లీలో చిత్రీకరించే సన్నివేశాలు మాత్రం 'అత్యంత ఘోరమైన మిషన్'కు సంబంధించినవి అని సమాచారం. టైగర్ ఫ్రాంచైజీ నుంచి వస్తోన్న మూడో చిత్రం ఇది. దేశాన్ని, మానవాళిని రక్షించడానికి వివిధ మిషన్లలో పాలుపంచుకునే భారత్, పాక్ ఏజెంట్ల కథ ఆధారంగా తెరకెక్కిందే ఈ టైగర్ ఫ్రాంచైజీ. ఈ ఫ్రాంచైలో మొదటి భాగం 2012లో వచ్చిన 'ఏక్ థా టైగర్'ను కబీర్ ఖాన్ డైరెక్ చేయగా, రెండో భాగం 'టైగర్ జిందా హై' (2017)ను అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించాడు. మూడో సీక్వెల్ 'టైగర్ 3' చిత్రాన్ని మనీష్ శర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర చేయనున్నాడు. ఇదిలా ఉంటే కత్రీనా జోయా అక్తర్ దర్శకత్వంలో వస్తున్న 'జీ లే జరా' చిత్రంలో నటించనుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్‌లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది కత్రీనా. ఇదీ చదవండి: ఆ వ్యవహారంలోకి నన్ను లాగొద్దు: విక్కీ మాజీ ప్రేయసీ -
జిమ్‌లో సల్మాన్ కసరత్తులు.. వీడియో వైరల్
షూటింగ్ లొకేషన్లో నటుడిగా విజృంభించడానికి టైగర్ రెడీ అయ్యాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘టైగర్ 3’. మనీష్ శర్మ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్. ఇందులో ఇమ్రాన్ హష్మి, రణ్వీర్ శౌరే కీలక పాత్రధారులు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 23న ముంబైలోని ఓ స్టూడియోలో ప్రారంభం కానుంది. యాక్షన్ సీక్వెన్సెస్‌ను ప్లాన్ చేశారు మనీష్. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం సల్మాన్ జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సల్మాన్ మ్యాచో లుక్‌ని చూసి, అభిమానులు ఆనందపడుతున్నారు. View this post on Instagram A post shared by Salman Khan (@beingsalmankhan) -
సల్మాన్ ఖాన్ మూవీ భారీ సెట్ కూల్చివేత!
కరోనా కష్టాలు సిసీ పరిశ్రమను ఇప్పట్లో వదిలేలా లేవు. సినిమా భాషలో చెప్పాలంటే కరుడుగట్టిన విలన్లా మారింది. గత రెండేళ్ల నుంచి దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంది. రెండేళ్లుగా ఎన్నో సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోలేక మధ్యలోనే ఆగిపోయాయి. కరోనా సెకండ్ వేవ్, అకాల వర్షాల కారణంగా షూటింగ్ కోసం వేసిన ఎన్నో సెట్స్ దెబ్బతిన్నాయి. కొన్ని సెట్స్ కూలిపోయాయి కూడా. తాజాగా సల్మాన్ ఖాన్ సినిమా కోసం వేసిన ఓ భారీ సెట్‌ని కూల్చివేయాలని భావిస్తున్నారట చిత్ర నిర్మాత. సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం ‘టైగర్ 3’. ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో సెట్స్‌పైకి వెళ్లింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కత్రినాకు కొవిడ్ పాజిటివ్ అని తేలడంతో చిత్రీకరణ ఆగింది. ఈ సినిమా కోసం గుర్గావ్లో ప్రత్యేకంగా సెట్‌ను తీర్చిదిద్దారు. ఆ సెట్ మొన్నటి తౌటే తుపాను దెబ్బకు పాక్షికంగా దెబ్బతింది. ఇప్పుడేమో వర్షాలు మొదలయ్యాయి. షూటింగ్‌కి అనుమతి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అందుకే ఈ సెట్‌ను కూల్చేస్తున్నారట. అనుమతులు వచ్చి చిత్రీకరణలు మొదలయ్యాక తిరిగి కొత్తగా సెట్‌ను నిర్మించుకోవచ్చనే ఆలోచనలో నిర్మాత ఆదిత్య చోప్రా ఉన్నారని తెలుస్తోంది. చదవండి: బాలీవుడ్ లవ్ బర్డ్స్‌పై కేసు: హీరో తల్లి ఏమందంటే? ఆగిన MI-7 షూటింగ్..టామ్ క్రూజ్‌కి కరోనా! -
Sundeep Kishan: ప్రయోగాత్మక సినిమాలో...
హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘టైగర్’ సినిమా విడుదలై ఆరేళ్లు అయింది. తాజాగా వీరి కాంబినేషన్లో మరో సినిమాని ప్రకటించారు. ఇది సందీప్‌కి 28వ సినిమా. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శుక్రవారం సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా ఈ కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కథ, కథనాల ప్రకారం ఇది సందీప్ కెరీర్లో ఓ ప్రయోగాత్మక చిత్రంలా నిలుస్తుంది. సందీప్ నుంచి ప్రేక్షకులు ఆశించే కొత్తదనం, వైవిధ్యమైన అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈ చిత్రంలో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బాలాజీ గుట్ట. -
అతను సో స్వీట్!
న్యూ టాలెంట్ తెలుగు పరిశ్రమలో ఉత్తరాది భామలదే హవా. ఒక్క చాన్స్, హిట్ వస్తే చాలు.. ఆ తర్వాత ఇక్కడ తిరుగులేని తారలుగా మారిపోతారు. ‘రన్ రాజా రన్’ వంటి సక్సెస్ఫుల్ మూవీతో కథానాయికగా పరిచయమైన సీరత్ కపూర్ కూడా సౌత్‌లో తన కెరీర్ బాగుంటుందనే నమ్మకంతో ఉన్నారు. ఆమె నటించిన ‘టైగర్’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సీరత్‌తో చిట్ చాట్.. ♦ ముందు ఓ విషయం చెప్పండి.. హిందీ రంగంలో పెద్ద పేరున్న ‘కపూర్’ కుటుంబానికీ, మీకూ ఏమైనా బంధుత్వం ఉందా? ఇంటి పేరు ఒకటే కాబట్టి, అందరూ ఆ కపూర్ కుటుంబానికి బంధువునని అనుకుంటున్నారు. బాలీవుడ్లో కూడా చాలామంది విలేకరులు నన్నీ ప్రశ్న అడిగారు. కానీ, ఆ కుటుంబంతో నాకు బంధుత్వం లేదు. నేను ‘ఓన్ సీరత్ కపూర్’ని (నవ్వుతూ). ♦ పోనీ.. మీ కుటుంబంలో సినిమా రంగానికి చెందినవారెవరైనా ఉన్నారా? ముంబయ్‌లో రోషన్ తనేజా యాక్టింగ్ స్కూల్ ఉంది కదా.. రోషన్ తనేజా మా రెండో తాతగారు. ♦ రెండో తాతగారంటే? అంటే.. రోషన్ తనేజా కొడుకుని మా పిన్ని పెళ్లి చేసుకుంది. ఆయన యాక్టింగ్ స్కూల్లోనే నేను నటన నేర్చుకున్నా. ♦ ముందు డ్యాన్స్ మాస్టర్‌గా చేశారు కదా..? నేను క్లాసికల్ డ్యాన్సర్‌ని. క్లాసికల్ సింగర్‌ని కూడా. శిక్షణ తీసుకున్నాను. హిందీ సినిమాలకు నృత్యదర్శకురాలిగా చేసే అవకాశం వస్తే, ఒప్పుకున్నాను. ముందు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా, ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్‌గా చేశాను. ♦ రణబీర్ కపూర్ నటించిన ‘రాక్‌స్టార్’కి అసిస్టెంట్ డ్యాన్స్ డెరైక్టర్‌గా చేశారు కదా.. రణబీర్ గురించి నాలుగు మాటలు? రణబీర్‌కి పెద్ద స్టార్ అనే ఫీలింగే ఉండదు. అందరితో కలిసిపోతాడు. ఏదైనా స్టెప్ అర్థం కాకపోతే, ‘ఎలా చెయ్యాలి’ అని అడిగి, నేర్చుకుని చేసేవాడు. ‘రాక్‌స్టార్’ మ్యూజికల్ బేస్డ్ ఫిలిం కాబట్టి, డ్యాన్సులకు మంచి స్కోప్ ఉండేది. రణబీర్ చాలా బాగా చేశాడు. ♦ ఓకే.. తెలుగు చిత్రాల విషయానికొద్దాం... ‘రన్ రాజా రన్’లో కనిపించిన పదకొండు నెలలకు ‘టైగర్’తో వస్తున్నారు.. ఈ సినిమా అంగీకరించడానికి కారణం? ఈ చిత్రదర్శకుడు ఆనంద్ ముంబయ్‌కి ఫోన్ చేసి, నాకీ కథ వినిపించారు. చాలా బాగా నచ్చింది. కథతో పాటు నా పాత్ర కూడా బాగుంటుంది. ఇందులో నా పాత్ర పేరు ‘గంగ’. వారణాసిలో నివసించే సంప్రదాయబద్ధమైన కుటుంబానికి చెందిన అమ్మాయిని. ఒకవైపు ట్రెడిషనల్, మరోవైపు మోడర్న్.. రెండు రకాలుగా ఉంటుంది గంగ. నిజజీవితంలో నేను కూడా అంతే. సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్‌లతో కలిసి సినిమా చేయడం మంచి అనుభూతినిచ్చింది. మేమంతా మనసు పెట్టి చేశాం. విజయం ఖాయం అని నమ్ముతున్నా. ♦ ‘రన్ రాజా రన్’ అప్పుడు మిమ్మల్ని ప్రభాస్ అభినందించారు కదా.. ఏమనిపించింది? ప్రభాస్ సో స్వీట్. ఆ సినిమా షూటింగ్ లొకేషన్‌కి వచ్చేవారాయన. బాగా యాక్ట్ చేస్తున్నావని అప్పుడే అభినందించారు. ఆ తర్వాత ఫంక్షన్లో అందరి ముందూ ప్రశంసించారు. అంత పెద్ద స్టార్ నన్ను అభినందించడం మర్చిపోలేని విషయం. ♦ క్లాసికల్ సింగర్‌ని అన్నారు.. సినిమాలకు పాడతారా? యాక్చువల్‌గా నేనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోవాలని కూడా ఉంది. కానీ, తెలుగు భాష తెలియదు కాబట్టి, వేరే దారి లేక డబ్బింగ్ చెప్పించుకోవాల్సి వస్తోంది. ♦ మరి.. తెలుగు నేర్చుకుంటున్నారా? తెలుగు పదాలు పలకడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. పట్టుదల ఉంటే ఏదీ సాధ్యం కాదు. మొత్తం నేర్చేసుకుని, భవిష్యత్తులో నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటా. ♦ కొరియోగ్రఫీ, యాక్టింగ్.. దేనికి ప్రాధాన్యం ఇస్తారు? ప్రస్తుతానికి నటనపైనే. సినిమాల్లో ఎలాగూ డాన్స్ చేస్తాం కాబట్టి, దానికి దూరమయ్యే అవకాశం లేదు. భవిష్యత్తులో మాత్రం డెరైక్షన్ చేస్తా. ♦ తెలుగులో వేరే సినిమా ఏదైనా చేస్తున్నారా? సుమంత్ అశ్విన్ సరసన ‘కొలంబస్’లో నటిస్తున్నా.