జిమ్‌లో సల్మాన్‌ కసరత్తులు.. వీడియో వైరల్‌ | Tiger 3: Salman Khan shares Intense Workout Video | Sakshi
Sakshi News home page

Tiger 3:జిమ్‌లో సల్మాన్‌ కసరత్తులు.. వీడియో వైరల్‌

Published Thu, Jul 22 2021 1:00 PM | Last Updated on Thu, Jul 22 2021 1:02 PM

Tiger 3: Salman Khan shares Intense Workout Video - Sakshi

షూటింగ్‌ లొకేషన్‌లో నటుడిగా విజృంభించడానికి టైగర్‌ రెడీ అయ్యాడు. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘టైగర్‌ 3’. మనీష్‌ శర్మ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌ హీరోయిన్‌. ఇందులో ఇమ్రాన్‌ హష్మి, రణ్‌వీర్‌ శౌరే కీలక పాత్రధారులు. ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల 23న ముంబైలోని ఓ స్టూడియోలో ప్రారంభం కానుంది. యాక్షన్‌ సీక్వెన్సెస్‌ను ప్లాన్‌ చేశారు మనీష్‌. ఈ యాక్షన్‌ సన్నివేశాల కోసం సల్మాన్‌ జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో సల్మాన్‌ మ్యాచో లుక్‌ని చూసి, అభిమానులు ఆనందపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement