Sundeep Kishan: ప్రయోగాత్మక సినిమాలో... | Sundeep Kishan team up with director Vi Anand for new Film | Sakshi
Sakshi News home page

Sundeep Kishan: ప్రయోగాత్మక సినిమాలో...

Published Sat, May 8 2021 4:20 AM | Last Updated on Sat, May 8 2021 2:10 PM

Sundeep Kishan team up with director Vi Anand for new Film - Sakshi

హీరో సందీప్‌ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కిన ‘టైగర్‌’ సినిమా విడుదలై ఆరేళ్లు అయింది. తాజాగా వీరి కాంబినేషన్‌లో మరో సినిమాని ప్రకటించారు. ఇది సందీప్‌కి 28వ సినిమా. హాస్య మూవీస్‌ పతాకంపై రాజేష్‌ దండ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శుక్రవారం సందీప్‌ కిషన్‌  బర్త్‌ డే సందర్భంగా ఈ కొత్త సినిమాను ప్రకటించారు.

ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కథ, కథనాల ప్రకారం ఇది సందీప్‌ కెరీర్‌లో ఓ ప్రయోగాత్మక చిత్రంలా నిలుస్తుంది. సందీప్‌ నుంచి ప్రేక్షకులు ఆశించే కొత్తదనం, వైవిధ్యమైన అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. కోవిడ్‌ ప్రభావం తగ్గిన తర్వాత చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈ చిత్రంలో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బాలాజీ గుట్ట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement