VI Anand
-
Sundeep Kishan: ప్రయోగాత్మక సినిమాలో...
హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘టైగర్’ సినిమా విడుదలై ఆరేళ్లు అయింది. తాజాగా వీరి కాంబినేషన్లో మరో సినిమాని ప్రకటించారు. ఇది సందీప్‌కి 28వ సినిమా. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శుక్రవారం సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా ఈ కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కథ, కథనాల ప్రకారం ఇది సందీప్ కెరీర్లో ఓ ప్రయోగాత్మక చిత్రంలా నిలుస్తుంది. సందీప్ నుంచి ప్రేక్షకులు ఆశించే కొత్తదనం, వైవిధ్యమైన అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈ చిత్రంలో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బాలాజీ గుట్ట. -
‘డిస్కో రాజా’ సక్సెస్ సెలబ్రేషన్స్
-
థియేటర్ అనుభూతిని ఏదీ ఇవ్వలేదు
‘‘స్క్రిప్ట్‌లోని హీరో క్యారెక్టర్ని బట్టి పూర్తి కథ అల్లుకుని సినిమాలు తీయాలంటే నాకు భయం. అందుకే నా సినిమాల్లో కొత్తదనం, కంటెంట్ ఉండాలని కోరుకుంటాను. కాన్సెప్ట్ మూవీస్‌లో కమర్షియల్ అంశాలుండకూడదు. కమర్షియల్ సినిమాలో కాన్సెప్ట్ పెద్దగా ఉండకూడదనడం సరైంది కాదు. కాన్సెప్ట్ సినిమాలను కమర్షియల్ పంథాలో వినోదాత్మకంగా ప్రేక్షకులకు చూపించాలనే ‘డిస్కోరాజా’ చిత్రం తీశాను’’ అన్నారు వీఐ ఆనంద్. రవితేజ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొంది న చిత్రం ‘డిస్కోరాజా’. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానున్న సందర్భంగా వీఐ ఆనంద్ చెప్పిన విశేషాలు. ► ‘డిస్కోరాజా’ సైన్స్ ఫిక్షన్ డ్రామా. లైవ్ పోర్షన్, రెట్రో పోర్షన్స్, సెన్స్ ఫిక్షన్ ఇలా సినిమాలో మూడు రకాల సీక్వెన్స్ ఉన్నాయి. పదేళ్ల క్రితమే ఈ సినిమా మెయిన్ పాయింట్ నా దగ్గర ఉంది. అయితే ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా ఎలా తీయాలని పరిశోధన చేస్తున్నాను. ఓ సందర్భంలో బయో రీసెర్చ్‌కు చెందిన ఆర్టికల్ చదివాను. ఆర్టికల్‌లో ప్రస్తావించిన ప్రయోగం సక్సెస్ అయితే ఎలా ఉంటుంది? అని ఊహించి ‘డిస్కోరాజా’ కథ రాశాను. అది ఎలాంటి ప్రయోగం అనే విషయం గురించి ఇప్పుడు చెప్పలేను. నా కెరీర్లోనే ‘డిస్కోరాజా’ పెద్ద బడ్జెట్ మూవీ. అలాగే కెరీర్లో నేను ముందుకు వెళ్లడానికి కూడా ఈ సినిమా విజయం నాకు ముఖ్యం. ఇందులో రవితేజగారు సంగీతాన్ని అమితంగా ఇష్టపడే గ్యాంగ్‌స్టర్ పాత్రలో అద్భుతంగా నటించారు. ► ‘ఒక్క క్షణం’ చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి. నాకు పేరు వచ్చింది. కానీ సినిమా ఎందుకు ఆడలేదో, కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో ఎందుకు రాలేదో తెలియదు. సరైన సమయంలో విడుదల కాకపోవడం వల్లే ఇలా జరిగిందని అప్పట్లో విశ్లేషించుకున్నాం. ► అల్లు అర్జున్‌గారితో ఓ సినిమా గురించి చర్చలు జరిగిన మాట నిజమే. గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమాకు కమిట్మెంట్ ఉంది. అది ఎవరితో అనేది నిర్మాతలు వెల్లడిస్తారు. వెబ్ సిరీస్‌లు ఎంత హిట్ సాధించినా థియేటర్లో సినిమా చూడటం వేరు. ఆ అనుభూతిని ఏదీ మార్చలేదని నా అభిప్రాయం. ► నేను ఆర్కిటెక్ట్‌ని. చెన్నైలో బీఆర్ కాలేజీలో గోల్డ్ మెడల్ సాధించాను. ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా ఐదో ఏడాదిలో డిజైన్స్ పరంగా థీసిస్ చేయాల్సి ఉంటుంది. కొందరు హస్పిటల్స్‌ను, కొందరు రైల్వేస్టేషన్స్‌ను ఎంచుకున్నారు. నేను ఫిల్మ్ సిటీని ఎంచు కున్నాను. అప్పటినుంచే నాకు సినిమాలంటే ఇష్టం. ముందు∙అసిస్టెంట్‌గా వర్క్ చేసి, తర్వాత దర్శకుడిని అయ్యాను. -
ఫెయిల్యూర్స్‌ను ఎంజాయ్ చేస్తాను
‘‘తెలుగులో నాకు చాలా అవకాశాలు వచ్చాయి. వస్తున్నాయి. కానీ కథ లేని సినిమాల్లో నటించడం ఇష్టం ఉండదు. కథ బాగుంటేనే యాక్టర్‌గా నటించడానికి మనకు పని ఉంటుంది. పారితోషికంనాకు రెండో ప్రాధాన్యం. కంటెంట్ ముఖ్యం’’ అన్నారు నటుడు బాబీ సింహా. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిస్కోరాజా’. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించిన బాబీ సింహా చెప్పిన విశేషాలు. ►మా తల్లిదండ్రులది విజయవాడ దగ్గర బందర్. నేను హైదరాబాద్‌లో పుట్టాను. నాలుగో తరగతి వరకు హైదరాబాద్‌లో చదివాను. పదో తరగతి వరకు అవనిగడ్డలో చదువుకున్నాను.1995లో తమిళనాడులోని కొడైకెనాల్‌కు వెళ్లాం. ►‘డిస్కోరాజా’లో నేను సేతు పాత్రలో కనిపిస్తాను. నా పాత్రలో స్టైల్, కోపం, హాస్యం.. ఇలా అన్ని అంశాలు మిళితమై ఉన్నాయి. యంగ్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్‌లా సినిమాలో నావి రెండు లుక్స్ ఉన్నాయి. రవితేజగారు సెట్లో ఫుల్ ఎనర్జీతో ఉంటారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, టైమింగ్ బాగుంటాయి. నేను దాదాపు 45 సినిమాలు చేశాను. నా కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్‌గా ఆనంద్‌గారి పేరు చెబుతాను. ఆనంద్‌గారు కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తుంటారు. ►నటుడిగా నాకు అన్ని పాత్రలు చేయాలని ఉంది. పాజిటివ్ క్యారెక్టర్ అయితే కొన్ని పరిమితులకు లోబడి చేయాల్సి ఉంటుంది. అదే నెగటివ్ క్యారెక్టర్ అయితే యాక్టింగ్‌కు ఎలాంటి పరిమితులు ఉండవని నా భావన. చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాదు.. కథ బాగుంటే నటిస్తాను. ►రజనీకాంత్‌గారు నాకు స్ఫూర్తి. ‘పేట’లో ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ప్రస్తుతం కమల్‌హాసన్‌గారి ‘ఇండియన్ 2’లో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. కమల్‌గారికి అన్ని క్రాఫ్ట్స్‌పై అవగాహన ఉంది. తమిళంలో నా గత చిత్రాలు సక్సెస్ కాలేదు. ఫెయిల్యూర్స్‌ను ఎంజాయ్ చేస్తాను. కానీ, ఆడని సినిమాలు ఎందుకు సక్సెస్ కాలేదో విశ్లేషించుకుంటాను. నాతో పాటు స్టార్ట్ అయిన విజయ్ సేతుపతి ముందుకు పరిగెడుతున్నారు అంటున్నారు. నేను వెనక నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. నేను స్టార్ట్ చేస్తా. యాక్టర్స్‌లో కొందరు 100 స్పీడ్‌లో పరిగెడతారు. మరికొందరు 40. నేను 10 –15 స్పీడ్‌లో ఉన్నాననుకుంటున్నాను. కానీ రేస్‌లో మాత్రం ఉన్నాను. ►కెరీర్ మొదట్లో చాలా సినిమాల్లో జూనియర్ ఆరి్టస్టుగా చేశాను. కష్టాలు అనుభవించాను. అయితే అప్పటితో పోల్చి చూసినప్పుడు ఇప్పుడు అవకాశాలు పెరిగాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్ స్థాయి పెరిగింది. సోషల్ మీడియా ఉంది. నేను మొదట్లో తిరిగినట్లు చాలామంది హైదరాబాద్, చెన్నైలో యాక్టర్స్ కావాలని తిరుగుతుంటారు. దేవుడు అందరికీ అవకాశాలు ఇస్తాడు. అవకాశం కోసం ఎదురుచూడండి. వచి్చనప్పుడు మాత్రం శక్తి వంచన లేకుండా పని చేసి మనల్ని మనం నిరూపించుకోవాలి. ►అవార్డుకు అనుభవం అనేది ఒక కొలమానంగా ఉండాలనే మాట నా దృష్టిలో సరైంది కాదనుకుంటాను. అవార్డు అనేది ప్రేక్షకులు, ప్రభుత్వం ఇచ్చే ఒక గుర్తింపు. నాకు కానివ్వండి, ఇంకొకరికి కానివ్వండి. మనం చేసే పాత్రకు మనం న్యాయం చేశామా? లేదా? ప్రేక్షకులు మనల్ని గుర్తించారా? లేదా అన్నదే ముఖ్యం. ‘జిగర్తాండ’ చిత్రానికి నాకు జాతీయ అవార్డు రావడం సంతోషాన్నిచి్చంది. నిజానికి నాకు జాతీయ అవార్డు గురించి మొదట్లో తెలియదు. నేను జూనియర్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడు... ‘‘సార్... నేషనల్ అవార్డు అనేది నేను చేసినా కూడా వస్తుందా? అని అడిగితే, ‘హే... బాబీ అది నేషనల్ అవార్డు’ వదిలేయ్ అని ఓ డైరెక్టర్ అన్నారు. -
డిస్కో రాజా.. సెన్సార్ పూర్తి
మాస్ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిస్కో రాజా’. నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్‌లు కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర పోస్టర్లు, టీజర్, పాటలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక జనవరి 24న విడుదల కాబోతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. అయితే ఇప్పటివరకు చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయకపోవడంపై ఫ్యాన్స్ నిరుత్సాపడుతున్నారు. అయితే మూవీ మేకింగ్ వీడియోను మాత్రం వదిలారు. ఇక 2019లో రవితేజ నుంచి ఒక్క సినిమా రాని విషయం తెలిసిందే. దీంతో ఆ లోటును ‘డిస్కో రాజా’ను భర్తీ చేసి ఫ్యాన్స్‌ను ఉత్సాహపరచాలని రవితేజ భావిస్తున్నాడు. ఇక సైన్స్ ఫిక్షన్ జానర్లో రవితేజ తొలిసారి నటిస్తుండటం విశేషం. ‘ఎక్కడికిపోతావ్ చిన్నవాడా, ఒక్క క్షణం’ లాంటి భిన్నమైన చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వీఐ ఆనంద్.. రవితేజతో ఓ కొత్త ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సైన్స్‌తోపాటు రవితేజ స్టైల్లో కామెడీ జోడించినట్లు సమాచారం. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు. -
కష్టాన్నంతా మరచిపోయాం – తమన్
రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన చిత్రం ‘డిస్కో రాజా’. ఈ చిత్రంలో నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్‌లు కథానాయికలుగా నటించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని ‘కాలం ఆగాలి నా కాలి వేగం చూసి .. లోకం సాగాలి నా వేలి సైగే తెలిసి.. రమ్ పమ్ బమ్’ అనే పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బప్పి లహరి, రవితేజ ఈ పాటను పాడారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. చిత్రదర్శకుడు వీఐ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘సినిమాలో రవితేజగారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. ఈ సినిమా కోసం తమన్ సూపర్‌హిట్ ఆల్బమ్ ఇచ్చారు. ‘రమ్ పమ్ బమ్’ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది. ‘డిస్కోరాజా’ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రానికి మంచి పాటలు చేసే అవకాశం లభించింది. ఆల్రెడీ విడుదలైన ‘ఢిల్లీవాలా...’, ‘నువ్వు నాతో...’ పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు విడుదల చేసిన ‘రమ్ పమ్ బమ్’ పాటను చాలెంజింగ్‌గా తీసుకుని చేశాం. ఇప్పుడు ఈ పాటను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తోన్న తీరు మా కష్టాన్ని మర్చిపోయేలా చేసింది’’ అన్నారు సంగీత దర్శకుడు తమన్. ‘‘రవితేజగారితో నేను కొంత గ్యాప్ తర్వాత చేసిన చిత్రం ఇది. మా మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవి్వస్తాయి. డైరెక్టర్ ఆనంద్‌గారు ఓ విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తీశారు. ప్రేక్షకులకు, అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్‌లా ఉంటుంది’’ అన్నారు సునీల్. ‘‘రవితేజగారితో సినిమా చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ ‘రమ్ పమ్ బమ్’ పాటలో నా డ్యాన్స్ మూమెంట్స్ బాగుంటాయి’’ అన్నారు హీరోయిన్ నభా నటేష్. -
కొత్త లుక్కు... అదిరిపోయే కిక్కు
కొత్త ఏడాది వచ్చింది. వస్తూ వస్తూ సినిమాల కొత్త పోస్టర్లను, కొత్త చిత్రాల ప్రకటనలను మోసుకొచ్చింది. తెలుగు సినిమాకు కొత్త శోభను అలంకరించి ప్రేక్షకులకు అదిరిపోయే కిక్కు ఇచ్చింది. రజనీకాంత్ ‘దర్బార్’ ఈ నెల 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకడు. ఆర్మీమేజర్ అజయ్ కృష్ణగా మహేశ్‌బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. హీరో అల్లుఅర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘అల..వైకుంఠపురములో..’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. రవితేజ నటిస్తున్న ‘డిస్కోరాజా, క్రాక్’ చిత్రాల కొత్త లుక్స్ విడుదలయ్యాయి. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ‘డిస్కోరాజా’ చిత్రం ఈనెల 24న విడుదల కానుంది. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ‘క్రాక్’ వేసవిలో విడుదల అవుతుంది. ఈ నెల 15న ‘ఎంత మంచివాడవురా’ విడుదల కానుంది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన చిత్రం ఇది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ‘నిశ్శబ్దం’ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేరోజు ‘అశ్వథ్థామ’గా వస్తున్నారు నాగశౌర్య. రమణతేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నితిన్‌ను ‘భీష్మ’గా మార్చారు దర్శకుడు వెంకీ కుడుముల. ఫిబ్రవరిలో ‘భీష్మ’ విడుదల కానుంది. పులివాసు దర్శకత్వంలో కల్యాణ్ దేవ్ నటిస్తున్న ‘సూపర్‌మచ్చి’ పోస్టర్ని విడుదల చేశారు. అజయ్ కథుర్వర్, డింపుల్ జంటగా వేణు ముల్కల దర్శకత్వంలో తెరకెక్కించిన ‘విశ్వక్’ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ‘హిట్’ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ని విడుదల చేశారు. ఫిబ్రవరి 28న సినిమా విడుదలకానుంది. నిర్మాత రాజ్‌కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా నటించిన ‘చూసీ చూడంగానే..’ సినిమాను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రవిబాబు దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి ‘క్రష్’ అనే టైటిల్ ఖరారు చేశారు.రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా జంటగా బి. శశికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘22’ మూవీ టైటిల్ యానిమేషన్ లోగోని న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేశారు. ఇంకా ‘నా పేరు రాజా: ఈడోరకం’, ‘ఏమైపోయావే’, ‘ఒక చిన్న విరామం’, ‘అనుభవించు రాజా’ వంటి సినిమాల ప్రకటనలు, వీటికి సంబంధించిన ఫస్ట్‌లుక్, కొత్త లుక్‌లు కూడా ప్రేక్షకులకు కనువిందు చేశాయి. ఓసారి కోలీవుడ్ కాలింగ్ బెల్ కొడితే.. సూర్య హీరోగా ‘గురు’ ఫేమ్ సుధాకొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శూరారై పొట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’!) సెకండ్లుక్ను విడుదల చేశారు. కార్తీ ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రానికి ‘మాస్టర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. -
‘డిస్కోరాజా’ టీజర్ వచ్చేసింది!
‘medicine is changing The very nature of Nature.. మనమీ ప్రాజెక్టు చేయకూడదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. వీడైతే నో రికార్డ్స్, నో రిపోర్ట్స్, నో రిలేటివ్స్, జీరో రిస్క్..’ అంటూ వెరీ స్టైలిష్‌గా మాస్ మహారాజా రవితేజ తాజా సినిమా ‘డిస్కో రాజా’ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 24న విడుదల కానున్న ఈ సినిమాలో రవితేజ సరసన ‘ఇస్మార్ట్’ బ్యూటీ నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఆధారంగా దర్శకుడు వీఐ ఆనంద్ ఈ సినిమాను ప్రయోగాత్మకంగా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. టీజర్లో రివీల్ అయిన రవితేజ క్యారెక్టర్ చాలా ఇంట్రస్ట్ రేకెత్తిస్తోంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్. వెరీ స్టైలిష్‌గా రవితేజను డిఫరెంట్‌గా ప్రజెంట్ చేసిన ఈ సినిమా టీజర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. -
డేట్ గుర్తుపెట్టుకోండి: రవితేజ
మాస్ మహారాజా రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం 'డిస్కోరాజా'. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యాహోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రంపై రవితేజతో పాటు ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టికున్నారు. ఇప్పటికే విడుదలైన రవితేజ గ్రాఫిక్ పోస్టర్, బాబీ సింహ లుక్, లిరికల్ సాంగ్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అయితే సినిమా విడుదలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రవితేజ అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. అయితే మాస్ మహారాజ్ అభిమానులకు చిత్ర యూనిట్ తీపి కబురు చెప్పింది. ‘డిస్కో రాజా’ వచ్చే ఏడాది జనవరి 24న విడుదల కానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఎస్ఆర్టీ తన అధికారిక ట్విటర్లో తెలిపింది. దీనికి డేట్ గర్తుపెట్టుకోండి అంటూ రవితేజ రీట్వీట్ చేశాడు. దీంతో జనవరి 24న డిస్కోరాజాతో రవితేజ థియేటర్లలో సందడి చేయబోతున్నట్లు కన్ఫార్మ్ అయింది. సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యత ఉందని తెలిసిందే. అయితే అనుకున్న రీతిలో అవుట్‌పుట్ రాకపోవడంతో చిత్ర యూనిట్ సినిమా విడుదలను పలుమార్లు వాయిదా వేసింది. దీంతో ఈ సినిమా వచ్చే వేసవి ప్రారంభంలో విడుదుల కావచ్చనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. కాగా ఈ చిత్రాన్ని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. అబ్బూరి రవి మాటలు అందిస్తున్నాడు. Mark the Date!! 😎#DiscoRaja https://t.co/kpy30y6hQX — Ravi Teja (@RaviTeja_offl) November 7, 2019 -
అది ఫేక్ ఫోటో.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీం
పెరుగుతున్న టెక్సాలజీ సినీ రంగాన్ని ఇబ్బందుల పాలు చేస్తోంది. ఇప్పటికే పైరసీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ పరిశ్రమకు, ఇప్పుడు మొబైల్స్, యాప్స్ వల్ల కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా రవితేజ చేస్తున్న డిస్కోరాజా సినిమస్ను ఫేస్ యాప్ ఇబ్బందుల్లో పడేసింది. డిస్కోరాజా సినిమాలో రవితేజ లుక్ అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. రవితేజ 25 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తున్న ఈ ఫోటోపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. అయితే ఫైనల్ గా ఈ ఫోటోపై చిత్రయూనిట్ స్పందించారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న ఫోటో అఫీషియల్ కాదని, త్వరలోనే అధికారిక ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తామని దర్శకుడు వీఐ ఆనంద్ వెల్లడించారు. దీంతో రవితేజ యంగ్ లుక్‌పై క్లారిటీ వచ్చేసింది. The new makeover of Mass maharaja that's been circulated on online is not true. Team disco raja is not any way involved in circulating and promoting this pic. Original makeover will be officially unveiled in DiscoRaja first look soon! — vi anand (@Dir_Vi_Anand) August 24, 2019 -
ఈ ఫోటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా?
సినిమా నిర్మాణంలో టెన్నాలజీ, ప్రొస్తెటిక్స్ లాంటి వాటి రాకతో నటీనటులను ఎలా కావాలంటే అలా మార్చేస్తున్నారు. వయసు పెంచి, తగ్గించి చూపిస్తున్నారు. చాలా ఏళ్ల కిందటే భారతీయుడు సినిమా కోసం కమల్ వృద్ధుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇటీవల ఫ్యాన్ సినిమాలో షారూఖ్ కుర్రాడిలా కనిపించి మెప్పించాడు. తాజాగా అలాంటి ప్రయోగానికే రెడీ అవుతున్నాడు మాస్ మహరాజ్ రవితేజ. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు. ఒకటి తన ఇమేజ్‌కు తగ్గ మాస్ లుక్, కాగా మరోటి యంగ్ లుక్ అని తెలుస్తోంది. తాజాగా రవితేజ్ యంగ్ లుక్కు సంబంధించిన ఫోటో అంటూ.. ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో రవితేజ 25 ఏళ్ల కుర్రాడిల కనిపిస్తుండటంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇది నిజంగానే సినిమాలో పాత్రా, లేక అభిమానులు ఎవరైనా ఫేస్ యాప్ లాంటి టెక్నాలజీ ద్వారా చేశారా..? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. గత కొద్ది రోజులు ఈ చిత్ర షూటింగ్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే స్విట్జర్లాండ్‌లో తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు. -
అతడి కోసం నటులుగా మారిన దర్శకులు
సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. కార్తీక్ రాజు దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కుతోంది. సందీప్ కిషన్ సరసన అన్యా సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. జూలై 12న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో దర్శకులు విఐ ఆనంద్, కార్తీక్ నరేన్, కథానాయిక మాళవిక నాయర్ నటించారు. వీరు ముగ్గురు సందీప్ కిషన్‌కి మంచి మిత్రులు. సందీప్ కిషన్ హీరోగా నటించిన 'టైగర్' చిత్రానికి విఐ ఆనంద్ దర్శకుడు. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ 'డిస్కో రాజా' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, సందీప్ కిషన్ నటించిన ఓ తమిళ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన ఓ తమిళ సినిమా తెలుగులో 'డి 16' పేరుతో విడుదలై మంచి విజయం సాధించింది. వీరిద్దరూ సందీప్ కిషన్ అడగ్గానే ఆయన కోసం అతిథి పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ రీరికార్డింగ్ చేస్తున్నారు. ఇటీవలే నీరజ కోన రాసిన టైటిల్ సాంగ్ ‘నిను వీడని నీడను నేనే' విడుదలచేశారు. ఈ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన వస్తోంది. అలాగే, ఈ సినిమాలో ఫన్, హై ఎనర్జిటిక్ సాంగ్ 'ఎక్స్క్యూజ్ మీ రాక్షసి ...'ను హీరో సిద్ధార్థ్ పాడారు. త్వరలో ఈ పాట కూడా విడుదల కానుంది. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు నటిస్తున్నారు. -
డిష్యూం.. డిష్యూం
అంటూ విలన్ల తాట తీస్తున్నాడు రాజా. ఈ మాసీ ఫైట్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలంటే మాత్రం బొమ్మ థియేటర్లో పడేంత వరకు ఆగాల్సిందే. రవితేజ హీరోగా వీఐ. ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో హీరో, విలన్లపై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో రవితేజ తండ్రీ కొడుకుగా కనిపిస్తారని సమాచారం. ‘‘ఆల్రెడీ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు విశేష స్పందన లభించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలోని టెక్నికల్ అంశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరచేలా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. సునీల్, ‘వెన్నెల’ కిశోర్, సత్య, రామ్కీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. రచన: అబ్బూరి రవి. -
‘డిస్కోరాజా’ ఎక్కడున్నాడు?
సీనియర్ హీరో, మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డిస్కోరాజా. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాను ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. గతంలో రవితేజ హీరోగా నేలటిక్కెట్టు సినిమాను నిర్మిస్తున్న ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్కు నష్టాలు రావటంతో రవితేజ అదే బ్యానర్లో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి తరువాత ఎలాంటి అప్డేట్స్ బయటకు రాలేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. బడ్జెట్ విషయంలో నిర్మాత, దర్శకుల మధ్య వచ్చిన అభిప్రాయ బేధాల కారణంగా ప్రాజెక్ట్ ఆగిపోనట్టుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో డిస్కోరాజా కథ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఓ బేబి కథ ఒకే విధంగా ఉంటాయన్న వార్తలు కూడా సినిమా ఆగిపోవటానికి కారణం అన్న ప్రచారం జరుగుతోంది. -
‘డిస్కోరాజా’ షూటింగ్ ప్రారంభం
ఈ మధ్య మాస్ మహారాజా రవితేజ టైమ్ అస్సలు బాగోలేనట్టుంది. ఏ సినిమా చేసినా దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంటోంది. రీసెంట్గా వచ్చిన ‘అమర్‌అక్బర్‌ఆంటోని’ కూడా తీవ్ర నిరాశను మిగల్చగా.. ప్రస్తుతం ఓ డిఫరెంట్ స్టోరీతో రాబోతోన్న ‘డిస్కోరాజా’ షూటింగ్ నేడు ప్రారంభమైంది. ఈ మూవీని ప్రకటించి కూడా చాలా రోజులు అవుతున్నా.. చిత్రబృందం మాత్రం నేడు షూటింగ్‌ను లాంచనంగా ప్రారంభించింది. ఆ మధ్య సినిమా ఆగిపోయిందని, రెమ్యునరేషన్ విషయమై గొడవలు వచ్చాయని, స్క్రిప్ట్ సరిగా లేదని సినిమా ఆగిపోనుందనే వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్సే అని నేడు తేలిపోయింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్కక్షణం’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో.. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్‌లు హీరోయిన్లు నటిస్తున్నారు. -
‘డిస్కోరాజా’ కథ మొదటికొచ్చిందా.?
మాస్ మహరాజ్ రవితేజ ఇటీవల కాలంలో తన స్థాయికి తగ్గ హిట్స్ సాధించటంలో ఫెయిల్ అవుతున్నాడు. ఒక్క రాజా ది గ్రేట్ తప్ప ఆ తరువాత చేసిన సినిమాలేవి ఆకట్టుకోకపోవటంతో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న డిస్కోరాజా మీదే ఆశలు పెట్టుకున్నాడు మాస్ మహారాజ్. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. వృద్ధుడిగా, యువకుడిగా రెండు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ కథ సమంత, నందిని రెడ్డి కాంబినేషన్లో రూపొందుతున్న ఓ బేబీ సినిమా కథను పోలి ఉండటంతో రవితేజ పునరాలోచనలో పడ్డట్టుగా ప్రచారం జరుగుతోంది. కథలో మార్పలు చేసిన తరువాత షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారట డిస్కోరాజా యూనిట్. దీంతో డిస్కోరాజా కథ మళ్లీ మొదటికొచ్చినట్టైందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. -
యాక్టర్‌గా మారిన డైరెక్టర్
సాధారణంగా యాక్టర్స్ డైరెక్టర్స్‌గా మారడం ఇండస్ట్రీలో కొత్తేం కాదు. కానీ అప్పుడప్పుడు డైరెక్టర్స్ యాక్టర్స్‌గా మారతారు. ఇప్పుడు ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం’ చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్ ‘నిను వీడని నీడను నేనే’ అనే చిత్రంతో యాక్టర్‌గా మారారు. ఇందులో సందీప్‌కిషన్ హీరోగా నటిస్తున్నారు. నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు ఆయన. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. 2015లో సందీప్‌కిషన్ హీరోగా వచ్చిన ‘టైగర్’ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇక దర్శకుడి వీఐ ఆనంద్ ‘డిస్కోరాజా’ అనే చిత్రం తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ హీరో. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. -
‘డిస్కోరాజా’గా రవితేజ!
అమర్ అక్బర్ ఆంటోని లాంటి బారీ డిజాస్టర్ తరువాత రవితేజ మరో చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. నేడు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా..ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను విడుదల చేసింది చిత్రబృందం. ‘డిస్కో రాజా’గా విడుదల చేసిన టైటిల్ లోగో ఆసక్తికరంగా ఉంది. పోస్టర్లో is ను కొట్టేసి.. was అని ప్రత్యేకంగా రాయడంతో.. సినిమాలో ఏదో ప్లాష్‌బ్యాక్ ఉన్నట్లు తెలుస్తోంది. వీఐ ఆనంద్ డైరెక్షన్లో రాబోతోన్న ఈ మూవీ అయిన రవితేజకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. -
మాస్ మహారాజ్ బర్త్‌డే గిఫ్ట్!
రాజా ది గ్రేట్ తరువాత రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో వరుసగా టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటొని సినిమాలు బోల్తా కొట్టడంతో తదుపరిచిత్రం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న రవితేజ రిపబ్లిక్ రోజున అభిమానులకు ఓ గిప్ట్ ఇవ్వనున్నాడు. అదే రోజు రవితేజ పుట్టినరోజు కూడా కావటంతో తన తాజా చిత్రం టైటిల్ లోగోలను రిలీజ్ చేయనున్నాడు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తుండగా పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తోంది. -
విలన్‌గా మరో మూవీ.. క్లారిటీ ఇచ్చిన హీరో
హీరోలుగా మంచి ఫాంలో ఉన్న నటులు కూడా ఇటీవల ప్రతినాయక పాత్రల్లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తాజాగా నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌కు విలన్‌గా పరిచయం అయ్యాడు మాధవన్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాదించకపోయినా మాధవన్ నటనకు మంచి పేరు వచ్చింది. దీంతో మరిన్ని సినిమాల్లో మాధవన్ ప్రతినాయక పాత్రల్లో నటించేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలో మాధవన్ విలన్‌గా నటిస్తున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై స్పందించిన మాధవన్ తాను రవితేజ సినిమాలో నటించటం లేదని.. ఆ వార్తల్లో నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. -
మాస్ హీరోతో ‘టాక్సీవాలా’ బ్యూటీ.!
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీవాలా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ మరో క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. టాక్సీవాలా సినిమాలో మంచి నటనతో ఆకట్టుకున్న ప్రియాంక, మాస్ మహరాజ్ రవితేజ సినిమాలో హీరోయిన్గా ఫైనల్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ‘అమర్ అక్బర్ ఆంటొని’తో నిరాశపరిచిన రవితేజ త్వరలో విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌లో నటించనున్నాడు. ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉన్న ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్‌ను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. మరో హీరోయిన్గా ఇప్పటికే పాయల్ రాజ్‌పుత్‌ను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. -
మాస్ రాజా... డిస్కో రాజా!
రవితేజ యాక్షన్లోనే కాదు ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ పలికే తీరు కూడా ఫుల్ మాస్‌గా ఉంటాయి. మంచి మాస్ యాక్షన్ చిత్రాలతో ఆయన మాస్ మహరాజా అనిపించుకున్నారు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రంలో నటిస్తున్న రవితేజ ఇప్పుడు మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం’ చిత్రాల ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తారట. ఈ చిత్రానికి ‘డిస్కో రాజా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. ఇందులో రవితేజ తండ్రీ కొడుకుల పాత్రల్లో నటించనున్నారని ప్రచారం జరగుతోంది. కాగా, ప్రస్తుతం రవితేజ చేస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటొని’ అక్టోబర్ 5న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ మూడు పాత్రలు చేయడంలేదని టాక్. ఇందులో ఇలియానా కథానాయికగా నటిస్తున్నారు. -
‘నేల టిక్కెట్టు’ బ్యూటీతో వన్స్‌మోర్
సీనియర్ హీరో రవితేజ కెరీర్ పెద్దగా ఆశాజనకంగా లేదు. వరుసగా టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు సినిమాలు నిరాశపరచటంతో తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు మాస్ మహరాజ్. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటిస్తున్న రవితేజ, తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాలతో ఆకట్టుకున్న విఐ ఆనంద్ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించాడు. ఈ సినిమాలో రవితేజ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో మాళవిక శర్మను హీరోయిన్గా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ఈ భామ రవితేజ సరసన నటించిన నేల టిక్కెట్టు నిరాశపరిచినా మరోసారి మాళవికకు ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు రవితేజ. -
బన్నీతో కాదు రవితేజతో..!
-
బన్నీతో కాదు రవితేజతో..!
ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విఐ ఆనంద్ నెక్ట్స్ ఓ స్టార్ హీరోను డైరెక్ట్ చేయనున్నాడు. ఒక్క క్షణం తరువాత అల్లు అర్జున్ హీరోగా ఆనంద్ సినిమా తెరకెక్కించనున్నాడన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో స్టార్ హీరో పేరు తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ‘నేలటికెట్’ సినిమాలో నటిస్తున్న రవితేజ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు ఆనంద్. తన గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా డిఫరెంట్ జానర్లో తెరకెక్కనుందని తెలుస్తోంది. రామ్ తళ్లూరి నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఏప్రిల్ నుంచి శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా ప్రారంభించేందుకు రెడీ అవుతున్న రవితేజ ఆ సినిమా పూర్తయిన వెంటనే విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడు. -
'ఒక్క క్షణం' మూవీ రివ్యూ
టైటిల్ : ఒక్క క్షణం జానర్ : సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తారాగణం : అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ సంగీతం : మణిశర్మ దర్శకత్వం : విఐ ఆనంద్ నిర్మాత : చక్రి చిగురుపాటి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకునేందుకు కష్టపడుతున్నాడు. ఇప్పటికే శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న ఈ అల్లు వారబ్బాయి కాస్త గ్యాప్ తీసుకొని ఓ డిఫరెంట్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎక్కడిపోతావు చిన్నవాడా లాంటి హర్రర్ థ్రిల్లర్ ను రూపొందించిన విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక్క క్షణం అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో నటించాడు. సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు జీవితాలు ఒకే విధంగా ఉండటం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అల్లు శిరీష్ కు మరో విజయాన్ని అందించిందా..? విఐ ఆనంద్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ ప్రయోగం ఆకట్టుకుందా..? కథ : జీవా (అల్లుశిరీష్) మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగి. అమ్మా నాన్నలతో సరదాగా కాలం గడిపే జీవాకు ఓ రోజు ఇనార్బిట్ మాల్ లోని బేస్మెంట్ పార్కింగ్ పిల్లర్ నంబర్ బి 57 దగ్గర జ్యోత్స్న(సురభి) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తొలి చూపులోనే ఇద్దరు ప్రేమలో పడతారు. తరువాత వాట్సప్ చాటింగ్ లతో మరింత దగ్గరవుతారు. వారి ప్రేమను ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. తనచుట్టూ ఉన్న మనుషులను చూస్తూ టైం పాస్ చేసే జ్యోకి తమ అపార్ట్మెంట్ లోని పక్క పోర్షన్ లో ఉంటున్న శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్)ల మధ్య ఏదో జరుగుతుందన్న అనుమానం కలుగుతుంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేసిన జీవా, జ్యోత్స్నలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. (సాక్షి రివ్యూస్) సరిగ్గా ఏడాది క్రితం శ్రీనివాస్, స్వాతిల జీవితంలో ఏ సంఘటనలు అయితే జరిగాయో అవే సంఘటనలు జీవా, జ్యోత్స్నల జీవితంలో ప్రస్తుత కాలంలో జరుగుతుంటాయి. మహ్మద్ ఆస్తేకర్ (జయప్రకాష్) అనే ప్రొఫెసర్ ద్వారా ప్యారలల్ లైఫ్ గురించి తెలుసుకొని తన జీవితం కూడా స్వాతి జీవితం లాగే అవుతుందని భయపడుతుంది జ్యో. అదే సమయంలో స్వాతి తన అపార్ట్మెంట్ లో హత్యకు గురవుతుంది. ఆ హత్య శ్రీనివాసే చేశాడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. దీంతో జీవా తనను చంపుతాడని మరింత భయపడుతుంది జ్యో.. స్వాతిని నిజంగా శ్రీనివాసే చంపాడా..? ఆత్మహత్య చేసుకుందా..? స్వాతి లాగే జ్యోత్స్న కూడా చనిపోతుందా..? విధిని ఎదిరించి చేసే పోరాటంలో జీవా విజయం సాధించాడా..? నటీనటులు : శ్రీరస్తు శుభమస్తు సినిమాతో ఆకట్టుకున్న అల్లు శిరీష్.. ఈసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తను ప్రేమించిన అమ్మాయి చనిపోతుందని తెలిసి ఆమెను కాపాడుకునేందుకు పోరాటం చేసే యువకుడి పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే నటనపరంగా శిరీష్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. లవ్ రొమాంటిక్ సీన్స్ తో పరవాలేదనిపించినా.. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం శిరీష్ నటన తేలిపోయింది. చాలా సన్నివేశాల్లో అల్లు అర్జున్ ను ఇమిటెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. హీరోయిన్ గా నటించిన సురభి ఆకట్టుకుంది. అభినయంతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. కథకు కీలకమైన పాత్రల్లో అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ లు తమ పరిధి మేరకు మెప్పించారు. (సాక్షి రివ్యూస్) ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సీరత్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. యాక్టింగ్ తో పాటు గ్లామర్ షోలోను హీరోయిన్లు ఒకరితో ఒకరు పోటి పడ్డారు. కథ అంతా నాలుగు పాత్రల చుట్టూ నడుస్తుండటంతో ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. అతిధి పాత్రలో నటించిన దాసరి అరుణ్ మంచి విలనిజాన్ని పండించాడు. విశ్లేషణ : తన ప్రతీ సినిమాను డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో రూపొందించే విఐ ఆనంద్ ఈ సారి ప్యారలల్ లైఫ్ అనే సైన్స్‌ఫిక్షన్ కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో వేరు వేరు సమయాల్లో ఒకే విధమైన సంఘటనలు జరగటం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా తెర మీద ఆవిష్కరించటంలో సక్సెస్ సాధించాడు. అయితే కథనంలో థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన వేగం లోపించింది. ఫస్ట్ హాప్ స్లోగా నడిచినా ఇంట్రస్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఆడియన్స్ ను కట్టిపడేశాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ లో కథనం వేగం పుంజుకుంది. స్వాతి మరణానికి కారణం వెతికే సన్నివేశాలను ఆసక్తికరంగా తెరకెక్కించారు. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఇంకాస్త వేగంగా నడిచుంటే బాగుండనిపిస్తుంది. (సాక్షి రివ్యూస్) మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తన మార్క్ చూపించలేకపోయాడు. ఎండ్ టైటిల్స్ లో వచ్చే మాస్ సాంగ్ తప్ప మిగిలిన పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. ఇంటర్వెల్ లాంటి ఒకటి రెండు సన్నివేశాల్లో తప్ప మణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టకోలేదు. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథ లోని మలుపులు ఇంటర్వెల్ బ్యాంగ్ మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా వేగం తగ్గిన కథనం సంగీతం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
అల్లు హీరో సినిమాకు లైన్ క్లియర్
శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న అల్లు వారబ్బాయి శిరీష్, త్వరలో ఒక్క క్షణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేం విఐ ఆనంద్ దర్శకత్వంలో చక్రి నిర్మిస్తున్న ఈసినిమాపై కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొరియన్ సినిమా ప్యారలల్ లైఫ్ ఇన్సిపిరేషన్ తో ఈ సినిమా రూపొందిందన్న ప్రచారం జరిగింది. అయితే అదే సమయంలో ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ప్యారలల్ లైఫ్ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా ‘2 మేమిద్దరం’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు తేడాతో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. దీంతో ఈ రెండు చిత్రయూనిట్ ల మధ్య వివాదం నడుస్తోందన్న ప్రచారం జరుగింది. అయితే ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ తమ మధ్య ఎలాంటి ఇష్యూ లేదని క్లారిటీ ఇచ్చారు నిర్మాత అనిల్ సుంకర. తాజాగా ఈ వివాదంపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘ఒక్క క్షణం టీం విఐ ఆనంద్, చక్రి లతో మాట్లాడాను. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఒక్క క్షణం కథా కథనాలు విన్న తరువాత ఆ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనిపిస్తోంది. హీరో అల్లు శిరీష్, దర్శకుడు విఐ ఆనంద్, నిర్మాత చక్రిలకు నా శుభాకాంక్షలు’. అంటూ ట్వీట్ చేశారు. Had a pleasant chat with Vi Anand &Chakri of Okka Kshanam. All the concerns are sorted out &cleared. After knowing the entire content of d film, i am sure that its gonna be a big hit.Advanced congrats to @AlluSirish @directorvianand nd Chakri. Looking farward 2 working with dem. — Anil Sunkara (@AnilSunkara1) 19 December 2017 -
ఒక్క క్షణం టీజర్.. చాలా కొత్తగా ఉందే!
-
ఒక్క క్షణం టీజర్.. చాలా కొత్తగా ఉందే!
సాక్షి, సినిమా : టాలీవుడ్లో మరో ఆసక్తికర సబ్జెక్టుతో ఓ చిత్రం రాబోతుంది. శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన హీరో అల్లు శిరీష్.. ఎక్కడికి పోతావు చిన్నివాడా మరి గుర్తింపు పొందిన దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఒక్క క్షణం. ఈ చిత్ర టీజర్ కాసేపటి క్రితం విడుదలయ్యింది. ఫేట్ వర్సెస్ డెస్టినీ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా టీజర్‌ను చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. రెండు సమకాలీన జీవితాలు, ఒకరి ఫాస్ట్.. మరోకరి ఫ్యూఛర్ మీద ఆధారపడి ఉండటం అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు అర్థమౌతోంది. సస్పెన్స్‌తో కూడిన ఎలిమెంట్లు చూపించగా.. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టడానికి వెనకాడని యువకుడి పాత్రలో శిరీష్ నటించాడు. సురభి, సీరత్ కపూర్లు హీరోయిన్లుగా, అవసరాల శ్రీనివాస్, జయప్రకాశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఒక్క క్షణం డిసెంబర్ చివర్లో విడుదల కానుంది. Presenting the teaser of Okka Kshanam. Wondering if you also might be having a "parallel life" with someone? #OkkaKshanam https://t.co/SlpFoZtPnj — Allu Sirish (@AlluSirish) December 3, 2017 -
'ఒక్క క్షణం' ఫస్ట్ లుక్
గౌరవం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అల్లూ వారబ్బాయి శిరీష్, కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ఓ మలయాళ సినిమాలో అతిథి పాత్రలో మాలీవుడ్ కు కూడా పరిచయం అయిన ఈ యంగ్ హీరో త్వరలో ఒక్క క్షణం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సురభి హీరోయిన్ గా నటిస్తోంది. లవ్ వర్సెస్ డెస్టినీ అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సీరత్ కపూర్ మరో కథానాయిక నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను డిసెంబర్ నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Presenting the first look of #OkkaKshanam. December 2017. pic.twitter.com/mQ6DhLbkjJ — Allu Sirish (@AlluSirish) 29 November 2017 -
చంచల్‌గూడ జైల్లో టాలీవుడ్ హీరో
హైదరాబాద్: టాలీవుడ్ నూతన దర్శకుడు వీఐ ఆనంద్ డైరెక్షన్లో మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్, సురభి జంటగా ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ కొత్త సినిమా షూటింగ్ శనివారం చంచల్‌గూడ పురుషుల జైల్లో జరిగింది. దీంతో జైలు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. శిరీష్, అవసరాల శ్రీనివాస్, ప్రవీణ్‌లపై జైలు బయట, లోపల కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్ అనంతరం మహాపరివర్తన్లో భాగంగా అల్లు శిరీష్ ఖైదీలను ఉద్దేశించి మాట్లాడారు. తెలిసి, తెలియక చేసిన తప్పులకు జైలు శిక్ష అను భవిస్తున్న ఖైదీలు తప్పులను సరిదిద్దుకొవాలని ఆయన సూచించారు. చంచల్‌గూడ జైల్లో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ సమ్మయ్య, జైలర్లు విజయ్‌కుమార్, వెంకటేశం ఉన్నారు. మరోవైపు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా జరుగుతోంది. సీరత్ కపూర్ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరకర్తగా ఉన్నారు. -
అల్లు వారబ్బాయి వేదాంతం
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి బిగ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో అల్లు శిరీష్. భారీ స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూశాడు శిరీష్. ఇటీవల విడుదలైన శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి హిట్ అందుకున్నాడు. అయితే సక్సెస్ ట్రాక్ ను అలానే కంటిన్యూ చేయాలనే పట్టుదలతో నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు శిరీష్. సురభి, సీరత్ కపూర్లు హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకు 'ఏ నిమిషానికి ఏమి జరుగునో' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. -
ప్లీజ్ మేడమ్...త్వరగా టచప్ చేసుకోండి!
...మరీ ఈ రేంజ్లో రిక్వెస్ట్ చేస్తున్నది హీరోయిన్‌గారి అసిస్టెంట్ లేదా మేకప్‌మేన్ కాదు, హీరో అల్లు శిరీష్. సెట్టింగు, లైటింగు, సినిమా వింగ్ వింగు మొత్తం రెడీ. కానీ, హీరోయిన్ సురభి రెడీగా లేరు. మేకప్‌కి మెరుగులు అద్దుతూ టచప్ చేసుకుంటుండడంతో అందరూ వెయిటింగు అన్నమాట! కరెక్టుగా అప్పుడు సెట్లో ఓ కెమెరా క్లిక్మంది. ఆ ఫొటోనే మీరు చూస్తున్నారు. అల్లు శిరీష్, సురభి జంటగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు కదా. ఈ సీన్ ఆ సెట్లోది అన్నమాట. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. సీరత్ కపూర్ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరకర్త. -
ఓవర్సీస్లో చిన్నవాడి హవా
అసలు థియేటర్ల వరకు జనాలు వస్తారా అనుకుంటున్న సమయంలో రిలీజ్ అయి కూడా మంచి కలెక్షన్లు సాధిస్తోంది నిఖిల్ సినిమా. శంకరాభరణం లాంటి డిజాస్టర్ తరువాత నిఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా. టైగర్ ఫేం విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. పోటి కూడా లేకపోవటంతో ఈ చిన్న సినిమాకు కలెక్షన్ల పంట పండుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా ఓవర్‌సీన్‌లో మాత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రీమియర్ షోలతో 25 వేల డాలర్లు సాధించటంతో ఎక్కడికిపోతావు చిన్నవాడా కలెక్షన్లు జస్ట్ ఓకె అనుకున్నారు. అయితే రిలీజ్ రోజు మాత్రం ఓవర్సీస్లో కూడా దుమ్ముదులిపేసింది ఈ మూవీ. శుక్రవారం 95 వేల డాలర్లు సాధించి నిఖిల్ కెరీర్లోనే ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పటికే 2.8 లక్షల డాలర్లు సాధించిన ఈ సినిమా ఈ వారాంతానికి హాఫ్ మిలియన్ మార్క్ రీచ్ అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. -
వాళ్ల కోసం ఏం చేయడానికైనా రెడీ!
‘‘మరో పదేళ్ల తర్వాత నా కెరీర్‌ని విశ్లేషించుకుంటే, నేను గర్వంగా చెప్పుకునే చిత్రాల్లో ‘టైగర్’ తప్పకుండా ఉంటుంది’’ అని సందీప్ కిషన్ అన్నారు. మంచి కథలు ఎంచుకుని, చక్కని పాత్రలు చేసే హీరోగా సందీప్‌కి గుడ్ ఇమేజ్ ఉంది. ఆయన నటించిన తాజా చిత్రం ‘టైగర్’ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సందీప్‌తో చిట్ చాట్. *** ‘టైగర్’ అంటున్నారు.. పది మందిని రఫ్ఫాడించే పాత్ర చేసి ఉంటారేమో? లేదు. ఓ రెండు ఫైట్స్ ఉన్నాయి. హీరోయిజమ్‌ని ఎలివేట్ చేయడం కోసం పెట్టిన ఫైట్స్ కావవి. ‘ఇప్పుడు వీడు వాళ్లని కొడితే ఎంత బాగుండు’ అని ప్రేక్షకులు ఓ ఎమోషన్‌కి గురయ్యే టైమ్‌లో నేను ప్రత్యర్థులను కొడతాను. ఆ ఫైట్స్ బీభత్సంగా కూడా ఉండవు. *** ఇంతకీ ‘టైగర్’ కథ ఏంటి? ఓ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా ఇది. ఈ కథతో తమిళంలో వీఐ ఆనంద్ దర్శకత్వంలో మురుగదాస్‌గారు నాతో సినిమా తీయాలనుకున్నారు. కానీ, ఆలస్యం అవుతుండటంతో ఆనంద్ వేరే సినిమా చేద్దామనుకున్నారు. ఇలాంటి కథ వదులుకుంటే మళ్లీ దొరకదని నిర్మాత ‘ఠాగూర్’ మధుని సంప్రతించాను. మధు, మురుగదాస్ మంచి ఫ్రెండ్స్. తెలుగులో చేస్తానని మధు అనగానే, మురుగదాస్ ఓకే అన్నారు. ఇది చాలా క్లిష్టమైన కథ. ఈ కథను తెరకెక్కించడం అంత సులువు కాదు. ఇంత రిస్కీ కథను ఆనంద్ అద్భుతంగా తెరకెక్కించారు. ఇది మంచి యాక్షన్ థ్రిల్లర్. ప్రేక్షకులను ఉద్వేగానికి గురి చేసే సినిమా. నిజాయతీగా చేసిన ఓ మంచి ప్రయత్నం. *** టైటిల్ జస్టిఫికేషన్? ‘టైగర్’ అని ఎందుకు టైటిల్ పెట్టామో సినిమా చూస్తే తెలుస్తుంది. కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ సినిమా నా నమ్మకానికో పరీక్షలాంటిది. ‘గ్యారంటీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’ అనే బలమైన నమ్మకంతో చేశాను. ఈ పరీక్షలో మంచి మార్కులతో పాస్ అవుతానని నమ్ముతున్నాను. *** అది సరే.... నిజజీవితంలో టైగర్ని దగ్గరగా చూడటం కానీ, ఫొటో దిగడం కానీ చేశారా? (నవ్వుతూ). అంత సాహసం చేయలేదండీ. కాకపోతే, నా స్నేహితుల్లో చాలామంది పులిలాంటివాళ్లే. వాళ్లతో ఫొటోలు దిగాను. నాకు చాలా తక్కువమంది స్నేహితులు ఉన్నారు. వాళ్ల కోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోతుంటాను. ఎందుకంటే, స్నేహం విలువ నాకు బాగా తెలుసు. *** ఈ చిత్రంలో మీరు ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచే కనిపిస్తారనే టాక్ ఉంది? ముందు అలానే అనుకున్నాం. కానీ, ఆ తర్వాత మారింది. 21వ నిమిషం నుంచి కనిపిస్తాను. ఇందులో నాకు హీరోయిన్ లేదు. మూడు పాటల్లో నటించాను కానీ, అవి డ్యూయెట్స్ కాదు. సినిమాలో ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ ఉండదు. కథలో భాగంగానే కామెడీ ఉంటుంది. మొత్తం మీద ఓ ఫ్రెష్ మూవీ చూసిన ఫీల్ కలగడం ఖాయం. *** సినిమా నిడివి కూడా తక్కువ అట? అవును. 1 గంట 58 నిమిషాలు మాత్రమే. ఓ కమర్షియల్ మూవీకి ఉండే పారామీటర్స్‌ని బ్రేక్ చేస్తూ, చేసిన కమర్షియల్ సినిమా ఇది. *** మీ తదుపరి చిత్రం? ఓ తమిళ సినిమా చేస్తున్నాను. తెలుగులో రచయిత రాజసింహా దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించా. *** ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి అడిగితే.. ఇంకా టైముందన్నారు. ఇప్పుడూ అలానే అంటారా? అవునండి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పుడే పెళ్లెందుకండీ... *** అంటే.. పెళ్లి చేసుకుంటే ఆనందం పోతుందా? అయ్యయ్యో.. అలా అనడంలేదు. ఆ లైఫ్ కూడా బాగుంటుందని కొన్ని జంటలను చూసి నప్పుడు అనిపిస్తుంది. కానీ, ప్రస్తుతం కెరీర్ మీదే పూర్తి దృష్టి సారించాలనుకుంటున్నా. *** మీ డ్రీమ్ రోల్స్? బోల్డన్ని ఉన్నాయి. అలాగే, డ్రీమ్ డెరైక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. *** నటుడిగా మీ లక్ష్యం ఏంటి? వెరైటీ సినిమాలు చేయాలన్నది నా లక్ష్యం. కెరీర్ ఆరంభించినప్పుడు రాత్రికి రాత్రి స్టార్‌ని అయిపోవాలనుకోలేదు. సినిమా సినిమాకీ నటుడిగా ఎదగాలనుకున్నాను. అలాగే, ఎదుగుతున్నాను.