బన్నీతో కాదు రవితేజతో..! | Vi Anand Next With Raviteja | Sakshi
Sakshi News home page

Mar 15 2018 3:10 PM | Updated on Mar 16 2018 8:39 AM

Vi Anand Next With Raviteja - Sakshi

రవితేజ

ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విఐ ఆనంద్‌ నెక్ట్స్‌ ఓ స్టార్ హీరోను డైరెక్ట్ చేయనున్నాడు. ఒక్క క్షణం తరువాత అల్లు అర్జున్‌ హీరోగా ఆనంద్‌ సినిమా తెరకెక్కించనున్నాడన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో స్టార్‌ హీరో పేరు తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ‘నేలటికెట్‌’ సినిమాలో నటిస్తున్న రవితేజ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు ఆనంద్‌.

తన గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా డిఫరెంట్‌ జానర్‌లో తెరకెక్కనుందని తెలుస్తోంది. రామ్‌ తళ్లూరి నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఏప్రిల్‌ నుంచి శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా ప్రారంభించేందుకు రెడీ అవుతున్న రవితేజ ఆ సినిమా పూర్తయిన వెంటనే విఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు డేట్స్‌ ఇవ్వనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement