Okka Kshanam
-
రీమేక్ మీద మనసుపడ్డ అల్లువారబ్బాయి
మెగా ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. స్టార్ ఇమేజ్ అందుకోవడం కోసం తంటాలు పడుతున్న యువ కథానాయకుడు అల్లు శిరీష్. శ్రీరస్తు శుభమస్తు లాంటి హిట్ సినిమా వచ్చినా అది శిరీష్ కెరీర్‌కు పెద్దగా ప్లస్ అవ్వలేదు. ఇటీవల ఒక్క క్షణం అనే డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్ ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయాడు. దీంతో శిరీష్ తదుపరి చిత్రం విషయంలో ఆలోచనలో పడ్డాడు. శిరీష్.. రిస్క్ తీసుకోకుండా రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మాలీవుడ్‌లో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘ఏబీసీడీ (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ)’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాడు. 2013లో రిలీజ్ అయిన ఈ సినిమా మాలీవుడ్‌లో సంచలన విజయం సాధించటంతో పాటు దుల్కర్‌కు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమాను మధురా శ్రీధర్ నిర్మాణంలో సంజీవ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించనున్నారు. మరి ఈ రీమేక్ అయిన శిరీష్‌కు స్టార్ ఇమేజ్ తీసుకువస్తుందేమో చూడాలి. -
బన్నీతో కాదు రవితేజతో..!
-
బన్నీతో కాదు రవితేజతో..!
ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విఐ ఆనంద్ నెక్ట్స్ ఓ స్టార్ హీరోను డైరెక్ట్ చేయనున్నాడు. ఒక్క క్షణం తరువాత అల్లు అర్జున్ హీరోగా ఆనంద్ సినిమా తెరకెక్కించనున్నాడన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో స్టార్ హీరో పేరు తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ‘నేలటికెట్’ సినిమాలో నటిస్తున్న రవితేజ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు ఆనంద్. తన గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా డిఫరెంట్ జానర్లో తెరకెక్కనుందని తెలుస్తోంది. రామ్ తళ్లూరి నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఏప్రిల్ నుంచి శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా ప్రారంభించేందుకు రెడీ అవుతున్న రవితేజ ఆ సినిమా పూర్తయిన వెంటనే విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడు. -
మాట నిలబెట్టుకుంటున్న బన్నీ
అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన ఒక్క క్షణం సినిమా కమర్షియల్ గా ఆకట్టుకోకపోయినా.. తెలుగు తెర మీద సరికొత్త ప్రయత్నంగా పేరు తెచ్చుకుంది. గతంలో ఎప్పుడూ రాని ప్యారలల్ లైఫ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా శిరీష్‌కు మంచి ఇమేజ్ తీసుకువచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు వీఐ ఆనంద్‌తో అల్లు అర్జున్ సినిమా ఉంటుందన్న టాక్ బలంగా వినిపించింది. ఒక్క క్షణం సక్సెస్ సాధిస్తే వెంటనే బన్నీతో సినిమా ఉంటుదన్న వార్తలు కూడా వినిపించాయి. ఈ లోగా బన్నీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో బిజీ కావటంతో ఆ టాపిక్ అంతా మర్చిపోయారు. తాజాగా మరోసారి బన్నీ, వీఐ ఆనంద్‌లో కాంబినేషన్ తెర మీదకు వచ్చింది. అన్న మాట ప్రకారం వీఐ ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు స్టైలిష్ స్టార్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఇప్పటికే బన్నీకి లైన్ వినిపించి ఓకె చేయించుకున్నాడట ఆనంద్. దీంతో ఈ కాంబినేషన్లో త్వరలోనే సినిమా ఓకె అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. -
యాంకర్ అవతారమెత్తిన అల్లు హీరో
మెగా వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన అల్లు శిరీష్ స్టార్ ఇమేజ్ ను అందుకోవటంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. శ్రీరస్తు శుభమస్తు సినిమాతో పరవాలేదనిపించినా.. తరువాత ఆ సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయలేకపోయాడు. పలు సినీ వేడుకల్లో వ్యాఖ్యతగానూ ఆకట్టుకున్న శిరీష్ ఓ యూట్యూబ్ చానల్ కోసం యాంకర్ అవతారమెత్తాడు. పింక్ విల్లా చానల్ కోసం రిడ్లింగ్ విత్ అల్లు శిరీష్ అనే షో చేస్తున్నాడు శిరీష్. ఈ షోలో భాగంగా తనతో పాటు ఒక్క క్షణం సినిమాలో నటించిన శీరత్ కపూర్ ను ఇంటర్వూ చేశాడు శిరీష్. ఫన్నీ ఫన్నీగా సాగిన ఈ ఇంటర్వూలో శిరీష్ తన కామిక్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. -
నా నమ్మకం నిజమైంది – అల్లు శిరీష్
‘‘నా కెరీర్లో 2017కి చాలా ప్రత్యేకత ఉంది. మలయాళ సినిమా ‘1971 బియాండ్ బోర్డర్’లో మోహన్‌లాల్‌గారితో నటించా. నా పాత్రకి మంచి స్పందన వచ్చింది. డిసెంబర్ 28న విడుదలైన ‘ఒక్కక్షణం’ నాకు మరచిపోలేని సినిమాగా నిలిచింది’’ అని హీరో అల్లు శిరీష్ అన్నారు. అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ ముఖ్య తారలుగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించిన ‘ఒక్కక్షణం’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘గౌరవం’ సరైన విజయం అందుకోలేదు. దాంతో కొత్తగా చేద్దామనే ఆలోచన తగ్గిపోయింది. ‘కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు’ వంటి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేశాక మళ్లీ ధైర్యం తెచ్చుకుని, ఏదైనా కొత్తగా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ‘ఒక్కక్షణం’ చేశా. ఈ రోజు నా నమ్మకం నిజమైంది. సినిమా చూసినవారందరూ అభినందిస్తున్నారు. భవిష్యత్‌లోనూ మంచి సినిమాలు చేయాలనే కాన్ఫిడెన్స్ ఇచ్చిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులు సహా అందరికీ థ్యాంక్స్. రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు, సహకారం అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు వీఐ ఆనంద్. ‘‘ఒక్కక్షణం’ సక్సెస్‌తో 2018కి మేం సంతోషంగా స్వాగతం పలికేలా చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు సీరత్ కపూర్. నిర్మాత చక్రి చిగురుపాటి, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
కొత్త క్షణం
-
కసి ఉన్నవాళ్లతో పనిచేస్తే ఎనర్జీ వస్తుంది
‘‘ఒక్కక్షణం’ సినిమాకి వస్తున్న ఫీడ్‌బ్యాక్, రెస్పాన్స్‌తో హ్యాపీగా ఉన్నా. ప్రత్యేకించి ఈ సినిమాలోని కథతో పాటు హీరో గురించి మాట్లాడుతున్నారు. ఓ యాక్టర్‌గా అది నాకు బాగా అనిపించింది. గత సినిమాలకంటే ఈ సినిమాలో నటుడిగా ఎదిగావు. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయంటుంటే వెరీ హ్యాపీ’’ అని హీరో అల్లు శిరీష్ అన్నారు. అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ ముఖ్య తారలుగా వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించిన ‘ఒక్కక్షణం’ ఈ గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ చెప్పిన విశేషాలు. ► ‘కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలతో సేఫ్ గేమ్ ఆడా. ఏదైనా కొత్తగా చేయాలనుకుంటున్నప్పుడు ఆనంద్ ‘ఒక్కక్షణం’ కథ తీసుకొచ్చారు. తను కథ చెప్పిన విధానం నచ్చి వెంటనే ఓకే చెప్పేశా. ఆ తర్వాత నాన్నగారు (అల్లు అరవింద్) కథ విని బాగుందన్నారు. అన్నయ్యకి (అల్లు అర్జున్) స్టోరీ లైన్ తెలుసు. కథ పూర్తిగా తెలీదు. ఫస్ట్ కాపీ చూసి బాగుందన్నారు. ► ‘ఒక్కక్షణం’ ప్రాజెక్ట్ కొంచెం ఆలస్యమైంది. అయితే సినిమాపై నమ్మకంతో వేరే ఏ సినిమా నేను ఒప్పుకోలేదు. ప్యారలల్ లైఫ్ పాయింట్ కొత్తగా అనిపించింది. కథను నేను బాగా నమ్మడంతో ఇన్వాల్వ్ అయి చేశా. కథకి అవసరం మేరకే మూడు ఫైట్స్ ఉన్నాయి. అవి అనవసరం అనిపించవు. ► ఆనంద్ చెప్పిన కథని అంతే చక్కగా తెరకెక్కించారు. సినిమా విడుదల తర్వాత ఆయనపై నాకు మరింత గౌరవం పెరిగింది. అమ్మ సెంటిమెంట్ సీన్‌కి చాలామంది కనెక్ట్ అయ్యారు. కెమెరామ్యాన్ శ్యాం కె.నాయుడుతో పనిచేయాలనే నా కోరిక ఈ చిత్రంతో తీరింది. మరో సినిమాకి ఆయనతో పనిచేయనున్నా. ఈ చిత్రంలో సంగీతం కంటే నేపథ్య సంగీతానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. మణిశర్మగారు చాలా బాగా చేశారు. ఆయనలా ఎవరూ చేయలేరు. ► ప్రమోషన్ సాంగ్‌ను ఇంటర్వెల్ తర్వాత పెట్టాలని షూట్ చేశాం. లెంత్ ఎక్కువ అవుతుందని పెట్టలేదు. ఎండింగ్ టైటిల్స్ అప్పుడు ఆ పాట ఉంటుంది. కొన్ని కామెడీ సన్నివేశాలు తీసేశాం. ► లవ్‌స్టోరీ, ఫ్యామిలీ డ్రామాలంటే ఇష్టం. అన్నీ అటువంటివే చేయాలని కాదు. నా పాత్ర కొత్తగా ఉండాలి. వైవిధ్యమైన సినిమాలు చేస్తేనే ప్రేక్షకులకు నచ్చుతుంది. ► మంచి పాత్ర అయితే వేరే హీరోల సినిమాలో చేయడానికి రెడీ. నా సినిమాలో ఏ హీరో చేయడానికైనా అభ్యంతరం లేదు. మల్టీస్టారర్ మూవీ కథలను రచయితలు రాయడం లేదు. మలయాళంలో ‘1971’ సినిమాలో మోహన్‌లాల్‌గారితో కలిసి నటించడం మరచిపోలేను. ‘ఒక్కక్షణం’ మలయాళంలో డబ్బింగ్ చేయడానికి అక్కడివారు ముందుకొచ్చారు. ► ఓ నిర్మాత కొడుకుగా అది కావాలి.. ఇది కావాలి.. అంటూ నేను నిర్మాతలను డిమాండ్ చేయను. ప్రాజెక్ట్‌పై ఎంత శ్రద్ధ ఉంటుందో పబ్లిసిటీ, డిస్ట్రిబ్యూషన్పైనా అంతే శ్రద్ధ పెట్టమని చెబుతానంతే. ► నాన్నగారు వేరే హీరోతో హిట్ సాధించారంటే ఓ కొడుకుగా సంతోషిస్తా. అదే నేను హీరోగా చేసిన సినిమా హిట్ అయిందంటే నాకు మరో పది రెట్లు సంతోషంగా ఉంటుంది (నవ్వుతూ). ► కొత్త డైరెక్టర్లతో పనిచేయాలనే ఎగై్జట్‌మెంట్ ఉంది. ఇప్పుడొస్తున్న మంచి సినిమాలన్నీ కొత్తవారి నుంచి వస్తున్నవే. ఆనంద్ ఓ కొత్త డైరెక్టర్లా కష్టపడ్డాడు. అంత కసి ఉన్నవాళ్లతో పనిచేస్తుంటే ఎనర్జీ వస్తుంది. కొత్త, పాత డైరెక్టర్లు చెప్పిన రెండు మూడు కథలు విన్నా. నెలలోపు ఫైనలైజ్ చేస్తా. నేను క్రమశిక్షణతో పనిచేస్తా. కొత్త ఏడాది నుంచి మరింత క్రమశిక్షణగా పనిచేయాలనుకుంటున్నా. -
'ఒక్క క్షణం' మూవీ రివ్యూ
టైటిల్ : ఒక్క క్షణం జానర్ : సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తారాగణం : అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ సంగీతం : మణిశర్మ దర్శకత్వం : విఐ ఆనంద్ నిర్మాత : చక్రి చిగురుపాటి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకునేందుకు కష్టపడుతున్నాడు. ఇప్పటికే శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న ఈ అల్లు వారబ్బాయి కాస్త గ్యాప్ తీసుకొని ఓ డిఫరెంట్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎక్కడిపోతావు చిన్నవాడా లాంటి హర్రర్ థ్రిల్లర్ ను రూపొందించిన విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక్క క్షణం అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో నటించాడు. సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు జీవితాలు ఒకే విధంగా ఉండటం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అల్లు శిరీష్ కు మరో విజయాన్ని అందించిందా..? విఐ ఆనంద్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ ప్రయోగం ఆకట్టుకుందా..? కథ : జీవా (అల్లుశిరీష్) మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగి. అమ్మా నాన్నలతో సరదాగా కాలం గడిపే జీవాకు ఓ రోజు ఇనార్బిట్ మాల్ లోని బేస్మెంట్ పార్కింగ్ పిల్లర్ నంబర్ బి 57 దగ్గర జ్యోత్స్న(సురభి) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తొలి చూపులోనే ఇద్దరు ప్రేమలో పడతారు. తరువాత వాట్సప్ చాటింగ్ లతో మరింత దగ్గరవుతారు. వారి ప్రేమను ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. తనచుట్టూ ఉన్న మనుషులను చూస్తూ టైం పాస్ చేసే జ్యోకి తమ అపార్ట్మెంట్ లోని పక్క పోర్షన్ లో ఉంటున్న శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్)ల మధ్య ఏదో జరుగుతుందన్న అనుమానం కలుగుతుంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేసిన జీవా, జ్యోత్స్నలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. (సాక్షి రివ్యూస్) సరిగ్గా ఏడాది క్రితం శ్రీనివాస్, స్వాతిల జీవితంలో ఏ సంఘటనలు అయితే జరిగాయో అవే సంఘటనలు జీవా, జ్యోత్స్నల జీవితంలో ప్రస్తుత కాలంలో జరుగుతుంటాయి. మహ్మద్ ఆస్తేకర్ (జయప్రకాష్) అనే ప్రొఫెసర్ ద్వారా ప్యారలల్ లైఫ్ గురించి తెలుసుకొని తన జీవితం కూడా స్వాతి జీవితం లాగే అవుతుందని భయపడుతుంది జ్యో. అదే సమయంలో స్వాతి తన అపార్ట్మెంట్ లో హత్యకు గురవుతుంది. ఆ హత్య శ్రీనివాసే చేశాడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. దీంతో జీవా తనను చంపుతాడని మరింత భయపడుతుంది జ్యో.. స్వాతిని నిజంగా శ్రీనివాసే చంపాడా..? ఆత్మహత్య చేసుకుందా..? స్వాతి లాగే జ్యోత్స్న కూడా చనిపోతుందా..? విధిని ఎదిరించి చేసే పోరాటంలో జీవా విజయం సాధించాడా..? నటీనటులు : శ్రీరస్తు శుభమస్తు సినిమాతో ఆకట్టుకున్న అల్లు శిరీష్.. ఈసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తను ప్రేమించిన అమ్మాయి చనిపోతుందని తెలిసి ఆమెను కాపాడుకునేందుకు పోరాటం చేసే యువకుడి పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే నటనపరంగా శిరీష్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. లవ్ రొమాంటిక్ సీన్స్ తో పరవాలేదనిపించినా.. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం శిరీష్ నటన తేలిపోయింది. చాలా సన్నివేశాల్లో అల్లు అర్జున్ ను ఇమిటెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. హీరోయిన్ గా నటించిన సురభి ఆకట్టుకుంది. అభినయంతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. కథకు కీలకమైన పాత్రల్లో అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ లు తమ పరిధి మేరకు మెప్పించారు. (సాక్షి రివ్యూస్) ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సీరత్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. యాక్టింగ్ తో పాటు గ్లామర్ షోలోను హీరోయిన్లు ఒకరితో ఒకరు పోటి పడ్డారు. కథ అంతా నాలుగు పాత్రల చుట్టూ నడుస్తుండటంతో ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. అతిధి పాత్రలో నటించిన దాసరి అరుణ్ మంచి విలనిజాన్ని పండించాడు. విశ్లేషణ : తన ప్రతీ సినిమాను డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో రూపొందించే విఐ ఆనంద్ ఈ సారి ప్యారలల్ లైఫ్ అనే సైన్స్‌ఫిక్షన్ కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో వేరు వేరు సమయాల్లో ఒకే విధమైన సంఘటనలు జరగటం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా తెర మీద ఆవిష్కరించటంలో సక్సెస్ సాధించాడు. అయితే కథనంలో థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన వేగం లోపించింది. ఫస్ట్ హాప్ స్లోగా నడిచినా ఇంట్రస్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఆడియన్స్ ను కట్టిపడేశాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ లో కథనం వేగం పుంజుకుంది. స్వాతి మరణానికి కారణం వెతికే సన్నివేశాలను ఆసక్తికరంగా తెరకెక్కించారు. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఇంకాస్త వేగంగా నడిచుంటే బాగుండనిపిస్తుంది. (సాక్షి రివ్యూస్) మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తన మార్క్ చూపించలేకపోయాడు. ఎండ్ టైటిల్స్ లో వచ్చే మాస్ సాంగ్ తప్ప మిగిలిన పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. ఇంటర్వెల్ లాంటి ఒకటి రెండు సన్నివేశాల్లో తప్ప మణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టకోలేదు. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథ లోని మలుపులు ఇంటర్వెల్ బ్యాంగ్ మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా వేగం తగ్గిన కథనం సంగీతం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
‘నిర్మాత లేకుంటే ఇండస్ట్రీయే లేదు’
‘‘ఓ కొత్త కథను అరటిపండు వలిచినట్టు అందరికీ అర్థమయ్యేలా అందంగా చెప్పారు ఆనంద్. తను చెప్పిన కథ వినగానే నేను ఎగ్జయిట్ అయ్యా. ‘ఒక్క క్షణం’ వంటి మంచి సినిమాను శిరీష్‌తో తెరకెక్కించినందుకు ఆనంద్‌గారికి థ్యాంక్స్. ఈ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా హిట్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘ఒక్క క్షణం’. వీఐ ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘నిర్మాతగారి అబ్బాయిలుగా నిర్మాత విలువేంటో నాకు తెలుసు. నిర్మాత లేకుంటే ఇండస్ట్రీయే లేదు. నేను ‘దిల్’ రాజుగారితో జర్నీ స్టార్ట్ చేసినట్లే.. చక్రిగారితో శిరీష్ జర్నీ స్టార్ట్ చేశాడు. తన జర్నీ ఇలాగే సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలి. ఆనంద్‌గారి ‘టైగర్’ సినిమా చూశా. చాలా బాగుందని శిరీష్‌కి చెప్పా. తను పెద్దగా విన్నట్లు కనపడలేదు. తర్వాత ఓ రోజు నన్ను కలిసి నేను ఆనంద్‌గారితో సినిమా చేయబోతున్నాను అని అన్నాడు. అలా ఈ సినిమా ప్రారంభం కావడంలో నేను కూడా ఓ చిన్న పాత్ర పోషించాననిపిస్తోంది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా నేను గర్వపడే చిత్రం అవుతుందనుకుంటున్నా. జనవరి 1న టీజర్ రిలీజ్ అవుతుంది’’ అన్నారు. ‘‘నాపై నమ్మకంతో చక్రిగారు సినిమా మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. 14 నెలలుగా శిరీష్ ఈ సినిమా కోసమే వర్క్ చేశారు’’ అన్నారు వీఐ ఆనంద్. ‘‘ప్యారలల్ లైఫ్ అనే కాన్సెప్ట్‌తో చేసిన సినిమా ఇది. ప్రేక్షకులకు కొత్త రకం సినిమా అవుతుంది’’ అన్నారు అల్లు శిరీష్. నటుడు నాగబాబు, సురభి, అవసరాల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘ఒక్క క్షణం’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
అల్లు హీరో సినిమాకు లైన్ క్లియర్
శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న అల్లు వారబ్బాయి శిరీష్, త్వరలో ఒక్క క్షణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేం విఐ ఆనంద్ దర్శకత్వంలో చక్రి నిర్మిస్తున్న ఈసినిమాపై కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొరియన్ సినిమా ప్యారలల్ లైఫ్ ఇన్సిపిరేషన్ తో ఈ సినిమా రూపొందిందన్న ప్రచారం జరిగింది. అయితే అదే సమయంలో ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ప్యారలల్ లైఫ్ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా ‘2 మేమిద్దరం’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు తేడాతో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. దీంతో ఈ రెండు చిత్రయూనిట్ ల మధ్య వివాదం నడుస్తోందన్న ప్రచారం జరుగింది. అయితే ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ తమ మధ్య ఎలాంటి ఇష్యూ లేదని క్లారిటీ ఇచ్చారు నిర్మాత అనిల్ సుంకర. తాజాగా ఈ వివాదంపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘ఒక్క క్షణం టీం విఐ ఆనంద్, చక్రి లతో మాట్లాడాను. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఒక్క క్షణం కథా కథనాలు విన్న తరువాత ఆ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనిపిస్తోంది. హీరో అల్లు శిరీష్, దర్శకుడు విఐ ఆనంద్, నిర్మాత చక్రిలకు నా శుభాకాంక్షలు’. అంటూ ట్వీట్ చేశారు. Had a pleasant chat with Vi Anand &Chakri of Okka Kshanam. All the concerns are sorted out &cleared. After knowing the entire content of d film, i am sure that its gonna be a big hit.Advanced congrats to @AlluSirish @directorvianand nd Chakri. Looking farward 2 working with dem. — Anil Sunkara (@AnilSunkara1) 19 December 2017 -
అందుకే రెండు పడవల ప్రయాణం
‘‘నేను దర్శకుడి కంటే ముందు రచయితని. నాలోని రచయితనే ఎక్కువ ఇష్టపడతాను’’ అన్నారు నటుడు–దర్శకుడు అవసరాల శ్రీనివాస్. అల్లు శిరీష్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ‘ఒక్క క్షణం’లో ముఖ్య పాత్ర పోషించారు అవసరాల. చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా అవసరాల శ్రీనివాస్ పలు విశేషాలు పంచుకున్నారు. ► ప్యారలల్‌ౖ లెఫ్ కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రమిది. ఒక జంట లైఫ్‌లో జరిగిన సంఘటనలు మరో జంటకు సంవత్సరం తర్వాత జరుగుతుంటాయి. అలా ఎందుకు జరుగుతాయి? అన్నది మాత్రం సస్పెన్స్. నేను ఆర్కిటెక్ పాత్రలో కనిపిస్తాను. వీఐ ఆనంద్ తను చూసిన సంఘటనలతో ఈ కథ బాగా రాసుకున్నారు, బాగా తెరకెక్కించారు. ► ఇండస్ట్రీలో నా ప్రయాణం అంత సులువుగా జరగలేదు. ‘అమృతంలో చందమామ’ తర్వాత అవకాశాలు రాలేదు. ‘ఊహలు గుస గుసలాడే’తో మళ్లీ నటుడిగా బిజీ అయ్యాను. నాకు ఒకే బాటలో ఉండిపోవటం ఇష్టం ఉండదు. అందుకే నటుడిగా, దర్శకుడిగా రెండు పడవల్లో ప్రయాణం చేస్తున్నాను. ► దర్శకత్వం, రచన ఈ రెండిటిలో నేను రచనకే ఓటు వేస్తాను. ఒక సినిమా విజయం కథ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రచయితకు సరైన గుర్తింపు లభించడం లేదు. వాళ్ళ ఇగోను సంతృప్తిపరుచుకోవటానికి దర్శకులుగా మారుతున్నారు. డైరెక్టర్‌గా వారాహి సంస్థకు ఒక ప్రేమకథను, సితార ఎంటర్టైన్మెంట్స్కు ఒక థ్రిల్లర్ మూవీని చేయబోతున్నా. నేను ఇచ్చిన కథతో ఇతర దర్శకులు రెండు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. నటుడిగా ‘అ!, మహానటి’ సినిమాలతో బిజీగా ఉన్నాను. -
'ఒక్క క్షణం' మూవీ స్టిల్స్