మెగా వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన అల్లు శిరీష్ స్టార్ ఇమేజ్ ను అందుకోవటంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. శ్రీరస్తు శుభమస్తు సినిమాతో పరవాలేదనిపించినా.. తరువాత ఆ సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయలేకపోయాడు. పలు సినీ వేడుకల్లో వ్యాఖ్యతగానూ ఆకట్టుకున్న శిరీష్ ఓ యూట్యూబ్ చానల్ కోసం యాంకర్ అవతారమెత్తాడు. పింక్ విల్లా చానల్ కోసం రిడ్లింగ్ విత్ అల్లు శిరీష్ అనే షో చేస్తున్నాడు శిరీష్. ఈ షోలో భాగంగా తనతో పాటు ఒక్క క్షణం సినిమాలో నటించిన శీరత్ కపూర్ ను ఇంటర్వూ చేశాడు శిరీష్. ఫన్నీ ఫన్నీగా సాగిన ఈ ఇంటర్వూలో శిరీష్ తన కామిక్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment