మాట నిలబెట్టుకుంటున్న బన్నీ | Allu Arjun Movie with VI Anand | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 9 2018 1:25 PM | Last Updated on Fri, Feb 9 2018 1:25 PM

VI Anand Allu Arjun - Sakshi

దర్శకుడు విఐ ఆనంద్‌తో అల్లు అర్జున్‌

అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన ఒక్క క్షణం సినిమా కమర్షియల్‌ గా ఆకట్టుకోకపోయినా.. తెలుగు తెర మీద సరికొత్త ప్రయత్నంగా పేరు తెచ్చుకుంది. గతంలో ఎప్పుడూ రాని ప్యారలల్‌ లైఫ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా శిరీష్‌కు మంచి ఇమేజ్‌ తీసుకువచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు వీఐ ఆనంద్‌తో అల్లు అర్జున్‌ సినిమా ఉంటుందన్న టాక్ బలంగా వినిపించింది. ఒక్క క్షణం సక్సెస్‌ సాధిస్తే వెంటనే బన్నీతో సినిమా ఉంటుదన్న వార్తలు కూడా వినిపించాయి.

ఈ లోగా బన్నీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో బిజీ కావటంతో ఆ టాపిక్ అంతా మర్చిపోయారు. తాజాగా మరోసారి బన్నీ, వీఐ ఆనంద్‌లో కాంబినేషన్ తెర మీదకు వచ్చింది. అన్న మాట ప్రకారం వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో సినిమా చేసేందుకు స్టైలిష్ స్టార్ ఇంట్రస్ట్‌ చూపిస్తున్నాడట. ఇప్పటికే బన్నీకి లైన్ వినిపించి ఓకె చేయించుకున్నాడట ఆనంద్‌. దీంతో ఈ కాంబినేషన్‌లో త్వరలోనే సినిమా ఓకె అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement