Allu Sirish
-
అల్లు అర్జున్ను అన్‌ఫాలో చేసిన రామ్‌చరణ్
ఒకప్పుడు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అంతా ఒకే కుటుంబంలా ఉండేది. ఏ పండగ వచ్చినా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేవాళ్లు. కానీ రానురానూ రెండు కుటుంబాల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. అది ఇటీవల తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో హీరో రామ్‌చరణ్ (Ram Charan) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ను అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ వరుసకు బావ, బావమరిది అవుతారు. బంధువులుగా కంటే స్నేహితుల్లానే ఎక్కువగా కలిసిమెలిసి ఉండేవారు. అన్‌ఫాలో చేసిన చరణ్?సడన్‌గా ఏమైందో ఏమో కానీ బన్నీని రామ్‌చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడు. రామ్‌చరణ్ అన్‌ఫాలో చేసినప్పటికీ అతడి భార్య ఉపాసన మాత్రం ఫాలో అవుతోంది. చరణ్ కంటే ముందు మెగా మేనల్లుడు, హీరో సాయిదుర్గ తేజ్ అల్లు అర్జున్ను అన్‌ఫాలో చేశాడు. బన్నీని వదిలేసిన చరణ్.. అల్లు శిరీష్ (Allu Sirish)ను మాత్రం ఫాలో అవుతుండటం గమనార్హం. అటు అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం తన భార్య స్నేహారెడ్డిని మాత్రమే అనుసరిస్తున్నాడు.దూరమవుతున్న బంధం?ఏపీ ఎన్నికల సమయం నుంచి అల్లు, మెగా కుటుంబాల మధ్య సరైన సత్సంబంధాలు లేవని తెలుస్తోంది. ఇటీవల తండేల్ (Thandel Movie) ఈవెంట్లోనూ అల్లు అరవింద్.. చరణ్ ఫస్ట్ సినిమా యావరేజ్ కంటే తక్కువే ఆడిందని కామెంట్స్ చేశాడు. ఒక్క వారంలోనే దిల్‌రాజు నష్టాలు చూశాడంటూ.. గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్ అన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు. దీనిపై ట్రోలింగ్ జరగడంతో అల్లు అరవింద్ వివరణ ఇచ్చాడు. రామ్‌చరణ్ తన ఏకైక మేనల్లుడని, తనకు కొడుకులాంటివాడని పేర్కొన్నాడు. ఈ గొడవకు ఫుల్స్టాప్ పెట్టాలని కోరాడు.చదవండి: చరణ్‌కు ఆడపిల్ల పుడుతుందేమోనని భయంగా ఉంది: చిరంజీవి -
'పుష్ప-2కు ఇంటర్నేషనల్ క్రేజ్'.. తమ్ముడి ట్వీట్ వైరల్!
అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మూవీపై ఐకాన్ స్టార్ తమ్ముడు అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రానికి.. ఓటీటీలోనూ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే దాదాపు ఏడు దేశాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పుష్ప-2 చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆదరిస్తున్నందుకు అల్లు శిరీష్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మీ సంస్కృతికి.. అంతగా పరిచయం లేని చాలా భిన్నమైన ఇలాంటి చిత్రానికి ఆదరణ దక్కడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. క్లైమాక్స్ సీన్‌పై ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ స్పందించడం అద్భుతమని పోస్ట్ చేశారు.సుకుమారా- బన్నీ కాంబోలో వచ్చిన పుష్ప- 2 ది రూల్ జనవరి 30 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్‌తో అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి కీలక పాత్రలో మెప్పించారు. టాలీవుడ్ నుంచి జగపతి బాబు, సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. I am glad the Pushpa 2 is receiving insane love from Western audience as well. Esp for a film like this which is vastly different from their culture or something they're not too familiar with.. @alluarjun @aryasukku @ThisIsDSP @MythriOfficial https://t.co/KprBKRPluw— Allu Sirish (@AlluSirish) February 4, 2025 -
వివాహ వేడుకలో చిరంజీవి, అల్లు అర్జున్ దంపతులు.. ఫోటోలు వైరల్
-
ఓటీటీలో అల్లు శిరీష్ 'బడ్డీ' సినిమా
టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ' బడ్డీ'. ఆగష్టు 2న విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే, తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. తమిళ్లో ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించాడు. గాయత్రి భరద్వాజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది.బడ్డీ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలనుకున్న అల్లు శిరీష్‌కు థియేటర్లో నిరాశే మిగిలింది. ఇప్పుడు ఓటీటీలో అయినా మెప్పిస్తాడేమో చూడాల్సి ఉంది. ఆగష్టు 30న ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.బడ్డీ కథ ఇదేఆదిత్య (అల్లు శిరీష్) ఓ పైలట్. విధి నిర్వహణలో భాగంగా తరచూ ఎయిర్ కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న పల్లవి ( గాయత్రి భరద్వాజ్)తో మాట్లాడతాడు. ఇద్దరు ఒకరిని ఒకరు నేరుగా కలుసుకోలేకపోయినా పరిచయంతోనే ప్రేమలో పడతారు. అయితే ఓసారి పల్లవి చేసిన తప్పిదంతో ఆదిత్య సస్పెండ్‌కు గురవుతాడు. తన కారణంగానే ఆదిత్య ఉద్యోగాన్ని కోల్పోయాడని భావించిన పల్లవి.. అతన్ని నేరుగా కలిసి క్షమాపణ చెప్పాలనుకుంటుంది. అతని కలిసేందుకు వెళుతున్న క్రమంలో పల్లవి కిడ్నాప్ అవుతుంది. గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి కోమాల్లోకి వెళ్లేలా చేస్తారు. అసలు పల్లవిని కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? కోమాలోకి వెళ్ళిన పల్లవి ఆత్మ టెడ్డిబేరులోకి ఎలా చేరుతుంది? అనేదే మిగతా కథ. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
Buddy Movie Review: అల్లు శిరీష్ 'బడ్డీ' సినిమా రివ్యూ
టైటిల్: బడ్డీనటీనటులు: అల్లు శిరీష్, గాయత్రీ భరద్వాజ్, అజ్మల్ తదితరులుదర్శకత్వం: శామ్ ఆంటోన్ నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజాసంగీతం : హిప్ హాప్ తమిళవిడుదల తేది: 02-08-2024టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ' బడ్డీ'. 2022లో ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో పలకరించిన శిరీష్ సుమారు రెండేళ్ల తర్వాత వెండితెరపై మెరిశాడు. అయితే, ఈసారి రీమేక్ సినిమాతో వచ్చాడు. తమిళ్లో ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించాడు. గాయత్రి భరద్వాజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. థియేటర్లో సందడి చేస్తున్న ఈ బడ్డీ సక్సెస్ అయ్యాడా..? అల్లు శిరీష్ సినీ ప్రియుల్ని ఏ మేరకు అలరించాడో తెలుసుకుందాం.కథ...ఆదిత్య (అల్లు శిరీష్) ఓ పైలట్. విధి నిర్వహణలో భాగంగా తరచూ ఎయిర్ కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న పల్లవి ( గాయత్రి భరద్వాజ్)తో మాట్లాడతాడు. ఇద్దరు ఒకరిని ఒకరు నేరుగా కలుసుకోలేకపోయినా పరిచయంతోనే ప్రేమలో పడతారు. అయితే ఓసారి పల్లవి చేసిన తప్పిదంతో ఆదిత్య సస్పెండ్‌కు గురవుతాడు. తన కారణంగానే ఆదిత్య ఉద్యోగాన్ని కోల్పోయాడని భావించిన పల్లవి.. అతన్ని నేరుగా కలిసి క్షమాపణ చెప్పాలనుకుంటుంది. అతని కలిసేందుకు వెళుతున్న క్రమంలో పల్లవి కిడ్నాప్ అవుతుంది. గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి కోమాల్లోకి వెళ్లేలా చేస్తారు. అసలు పల్లవిని కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? కోమాలోకి వెళ్ళిన పల్లవి ఆత్మ టెడ్డిబేరులోకి ఎలా చేరుతుంది? పల్లవి కిడ్నాప్‌కి.. హాంగ్ కాంగ్లో ఉన్న డాక్టర్ అర్జున్ (అజ్మల్ అమీర్)కి ఉన్న సంబంధం ఏంటి? టెడ్డీబేర్‌లో ఆత్మ ఉందని తెలిసిన తర్వాత ఆదిత్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? చివరకు పల్లవిని ఎలా రక్షించాడా..? లేదా..? అనేదే మిగతా కథఎలా ఉందంటే..?అవయవాల అక్రమ రవాణా ముఠా నేపథ్యంతో టాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. బడ్డీ సినిమా నేపథ్యం కూడా అదే. అయితే ఓ బొమ్మకు ప్రాణం రావడం అనే పాయింట్ కొత్తగా త్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. వాస్తవానికి ఇది తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన టెడ్డీకి తెలుగు రీమేక్. అయితే బొమ్మలోకి ఆత్మ రావడం అనే ఒక పాయింట్ మాత్రమే ఆ సినిమా నుంచి తీసుకొని మిగతాదంతా తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్చి తెరకెక్కించాడు. దర్శకుడు మార్చిన అంశాలు బాగున్నప్పటికీ వాటిని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో తడబడ్డాడు.అవయవాల అక్రమ కార్యకలాపాలు సాగించే డాక్టర్ అర్జున్ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు. ఆపై వెంటనే పల్లవి (గాయత్రి భరద్వాజ్) కోమాలోకి వెళ్లడం.. అనంతరం ఆమె జీవితంలోకి టెడ్డీబేర్ రావడం వంటి సీన్లు మెప్పిస్తాయి. అయితే, టెడ్డీ బేర్‌కు ప్రాణం వచ్చి రోడ్ మీద తిరుగుతుంటే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు లేదా భయపడుతారు. కానీ, ఇందులో అలాంటివి ఏవీ జరగవు. పైగా సెల్పీలు దిగేందుకు పోటీ పడుతుంటారు. అది ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాదు. అయితే చిన్ని పిల్లలకు కాస్త ఆసక్తిని కలిగించవచ్చు.సెకండాఫ్‌లో కథ అంతా హాంకాంగ్‌కు షిఫ్ట్ అయిపోతుంది. పల్లవి కోసం వెతుక్కుంటూ అల్లు శిరీష్ అక్కడికి చేరుకుంటాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో వచ్చే యాక్షన్ సీన్ పర్వాలేదనిపిస్తుంది. మిషన్ గన్ తో టెడ్డీబేర్ చేసే యాక్షన్ సీన్ నవ్వులు పూస్తాయి. ఫ్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథ సాగదీతిగా అనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే..పైలట్ ఆదిత్య పాత్రలో అల్లు శిరీష్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశారు. పల్లవిగా గాయత్రి భరద్వాజ్ చక్కగా నటించింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. విలన్‌గా అజ్మల్ ఎంట్రీ పవర్ ఫుల్‌గా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత సింపుల్‌గా అనిపిస్తుంది. ప్రిషా సింగ్ అలీ, ముకేష్ రిషితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. హిప్ హాప్ తమిళ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
అందుకే నా సినిమాలు లేట్ అవుతున్నాయి: హీరో అల్లు శిరీష్
‘బడ్డీ’ పోస్టర్ రిలీజ్ నుంచి ఇది రీమేక్ అని కామెంట్స్ వచ్చాయి. ఇదిస్ట్రైట్ ఫిల్మ్ అని చెప్పడమే మాకు పెద్ద సవాల్ గా మారింది. ఎంత చెప్పినా ఇది రీమేక్ అనే రాస్తున్నారు. అలాంటి వాళ్లను మనం మార్చలేం, వారికి మొత్తం సినిమా చూపెట్టి ప్రూవ్ చేయలేం కదా. సినిమా రిలీజ్ అయ్యాక వాళ్లకే తెలుస్తుంది "బడ్డీ" స్ట్రైట్ ఫిలిం అని. ఈ మూవీ క్లాస్, మాస్ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది’అన్నారు హీరో అల్లు శిరీష్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘బడ్డీ’. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 2న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో అల్లు శిరీష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇒ ‘బడ్డీ’ మూవీని లాస్ట్ ఇయర్ మార్చి లో మొదలుపెట్టి జూలైలో సినిమా కంప్లీట్ చేశాం. డిసెంబర్ లోనే రిలీజ్ కు తీసుకురావాలని అనుకున్నాం. నా మూవీస్ కు గ్యాప్ వస్తోంది. ఫాస్ట్ గా చేసి డిసెంబర్ 31 సక్సెస్ పార్టీ చేసుకోవాలని నేనూ నిర్మాత జ్ఞానవేల్ గారూ అనుకున్నాం. అయితే ఈ సినిమాలో 3 వేలకు పైగా సీజీ షాట్స్ ఉన్నాయి. బడ్డీ ఫేస్ ను యానిమేట్ చేయాలి. వాటిని పర్పెక్ట్ గా చేయాలంటే డబ్బుతో పాటు ఆర్టిస్టులకు టైమ్ ఇవ్వాలి. దాంతో లేట్ అయ్యింది. సమ్మర్ అనుకున్నది ఆగస్టుకు పోస్ట్ పోన్ అయ్యింది. బొమ్మకు ప్రాణం వస్తే ఎలా ఉంటుందనే కీ పాయింట్ మీదే సినిమా ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు తగ్గకుండా సీజీ వచ్చింది.⇒ డైరెక్టర్ శామ్ ఆంటోనీ ఈ కథతో నా దగ్గరకు వచ్చి టెడ్డీ బేర్ పాయింట్ తో ఉంటుందని చెప్పారు. టెడ్డీ మూవీ తమిళంలో వచ్చింది, అలాగే ఇంగ్లీష్ లోనూ ఇలాంటి సినిమా ఉందని చెప్పాను. మీరు కథ వినండి మీకు కొత్తగా అనిపిస్తుంది, స్టోరీ విన్నాక మల్లీ ఓటీటీలో టెడ్డీ మూవీ చూడండి అన్నారు శామ్ ఆంటోనీ. అలా కథ విన్నాను. టెడ్డీ బేర్ కు ప్రాణం రావడం అనే ఒక్క పాయింట్ ను మాత్రమే దర్శకుడు టెడ్డీ సినిమా నుంచి తీసుకున్నాడు. మిగతాదంతా కొత్త కథ.⇒ "బడ్డీ" కథ వింటునప్పుడు కొత్తగా అనిపించింది. నేనూ రోజు కథలు వింటా...ఒక వెరైటీ పాయింట్ ఏ కథలో దొరుకుతుందా అని వెతుకుతుంటా. ఆ కొత్తదనం "బడ్డీ" కథలో ఫీల్ అయ్యా. నేను ఫస్ట్ టైమ్ పైలట్ గా కనిపించబోతున్నా. నా క్యారెక్టర్ ఇంటెన్స్ గా ఉంటుంది.⇒ ఈ చిత్రంలో లవ్ స్టోరీ ఉంటుంది కానీ చాలా తక్కువ పార్ట్ ఉంటుంది. కథకు ఎంత కావాలో అంతే ఉంచాడు దర్శకుడు శామ్. లవ్ స్టోరీ ఎక్కువ ఉంటే కథ డీవీయేట్ అవుతుందని ఆయన భావించాడు. "బడ్డీ" సినిమా రన్ టైమ్ కూడా చాలా క్రిస్ప్ గా ఉంటుంది. 2 గంటల 8 నిమిషాలు రన్ టైమ్ ఉంది. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ కు ఎక్కువ లెంగ్త్ ఉంటే బాగుండదు⇒ హిప్ హాప్ తమిళ చేసిన మ్యూజిక్, బీజీఎం అదిరిపోతుంది. మేము "బడ్డీ" చూసినప్పుడు బీజీఎం సూపర్బ్ గా ఉందనిపించింది. స్పెషల్ షోస్ వేసినప్పుడు కూడా ప్రేక్షకుల నుంచి మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హిప్ హాప్ థమిళ చేసిన తని ఓరువన్, ధృవ లాంటి మూవీస్ పాటలు నాకు ఇష్టం.⇒ ప్రొడక్షన్ పరంగా మూవీ చాలా రిచ్ గా ఉంటుంది. స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా గారు సినిమాను రాజీ పడకుండా నిర్మించారు. ఒక పాత విమానం కొని దాన్ని మూవీ కోసం ఆర్ట్ వర్క్ చేసి అందులో షూట్ చేశాం. క్లైమాక్స్ ఫైట్ కూడా అందులోనే ఉంటుంది. సినిమాకు కావాల్సింది ఇస్తాను కానీ తక్కువ డేస్ లో షూటింగ్ చేయండని ప్రొడ్యూసర్ చెప్పేవారు. రెండు షిఫ్టుల్లో సినిమాను కంప్లీట్ చేశాం.⇒ ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడాన్ని ఇష్టపడను. ఒక సినిమా తర్వాతే మరొకటి. అందుకే నా మూవీస్ లేట్ అవుతున్నాయి. సాధారణంగా చిన్నా, పెద్దా ఏ సినిమా అయినా అనుకున్న టైమ్ కు చేయలేం. ఖచ్చితంగా ఎంతో కొంత ఆలస్యమవుతూనే ఉంటుంది. -
హీరో అల్లు శిరీష్ ‘బడ్డీ’ మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
అల్లు శిరీష్ 'బడ్డీ'.. అల్లు అర్జున్‌పై ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ప్రస్తుతం బడ్డీ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. అడ్వెంచర్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందించిన ఈ మూవీకి శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్ అభిమానులు అంచనాలు మరింత పెంచేశాయి. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. తాజాగా బడ్డీ ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మీడియా ప్రతినిధులకు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. చిన్నప్పటి నుంచి మీ బెస్ట్ బడ్డీ ఎవరు? అని శిరీష్‌ను అడిగారు.దీనిపై అల్లు శిరీష్ స్పందిస్తూ..' నా బెస్ట్ బడ్డీ మా అన్నయ్య.. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం.. మా డాడీ సినిమాలు చూస్తూ ఎక్కువగా హైదరాబాద్‌లో ఉండేవారు.. రెండు వారాలకొకసారి డాడీ వచ్చేవారు. నేను, అన్నయ్య 9 ఏళ్లపాటు ఓకే రూమ్‌లో ఉండేవాళ్లం. నాన్నతో కూడా షేర్ చేయలేని విషయాలను అన్నయ్యతోనే షేర్ చేసుకుంటా. విషయం ఏదైనా ముందు అతనికే ముందు చెబుతా. ' అని అన్నారు. కాగా.. బడ్డీ సినిమా అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నిర్మాతతో చర్చించి టికెట్ రేట్లు తగ్గించామని తెలిపారు. అల్లు శిరీష్ నటించిన బడ్డీ ఆగస్టు 2న థియేటర్లలో సందడి చేయనుంది. నా అన్న.. నా బెస్ట్ "BUDDY"❣️Sibling Goals ❤My brother @alluarjun is my "BEST BUDDY" says Actor @AlluSirish!! 🫂#AlluArjun #AlluSirish #Buddy #TeluguFilmNagar pic.twitter.com/PAxyrX1hIx— Telugu FilmNagar (@telugufilmnagar) July 31, 2024 -
అల్లు శిరీష్ బడ్డీ మూవీ.. గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్!
అల్లు శిరీష్ హీరోగా, గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘బడ్డీ’. ఈ చిత్రానికి శామ్ ఆంటోన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాను అడ్వెంచర్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న బడ్డీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో బడ్డీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీ టికెట్ రేట్లను తగ్గిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.99, మల్టీప్లెక్సుల్లో కేవలం రూ.125 గా నిర్ణయించినట్లు అల్లు శిరీష్ ట్వీట్ చేశారు. కుటుంబమంతా బడ్డీని చూసేందుకు మీకు అవకాశం కల్పిస్తున్నాం అంటూ పోస్ట్ చేశారు. దీంతో సినీ ప్రియులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే బడ్డీ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా.. బడ్డీ మూవీ ఆగస్టు 2న థియేటర్లలో రిలీజ్ కానుంది. Our team wants you & your whole family to enjoy #Buddy🧸in cinemas. So we've made the prices of ticket accessible. So, buddy.. Are you ready? #BuddyonAug2nd @StudioGreen2 pic.twitter.com/9yV1A3ZqSc— Allu Sirish (@AlluSirish) July 29, 2024 -
ఆ పాత్ర చేయడం కోసం వారిని గమనించా: బడ్డీ హీరోయిన్
అల్లు శిరీష్ హీరోగా నటించిన తాజా చిత్రం బడ్డీ. శామ్ ఆంటోన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంతో ప్రిషా సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రబృందం. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రిషా సింగ్ బడ్డీ సినిమాలో అవకాశం రావడంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.ప్రిషా సింగ్ మాట్లాడుతూ .. 'నా ఫొటోలను చూసి ఆడిషన్‌కు పిలిచారు. సెలక్ట్ అయ్యా. అయితే పాత్రలోని వేరియేషన్స్ నేను చేయగలనా అని కూడా ఆలోచించా. బడ్డీ చిత్రంలో నేను ఎయిర్ హోస్టెస్ పాత్రలో కనిపిస్తా. ఆ పాత్ర కోసం చాలా మంది ఎయిర్ హోస్టెస్లను గమనించా. వారెలా నడుస్తారు.. ఎలా మాట్లాడుతారు.. ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు? వంటి విషయాలను దగ్గరగా గమనించా. టాలీవుడ్ నటించటం నటిగా నాకొక మంచి అనుభవం. ఇంకా వైవిధ్యమైన పాత్రలు చేయటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని అన్నారు.అంతే కాకుండా తనకు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే అభిరుచి ఎక్కువని చెబుతోంది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో వాటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. వైల్డ్ లైఫ్ అంటే కేవలం జంతువులను, చెట్ల ఫొటోలను కెమెరాల్లో బంధించటం మాత్రమే కాదని అంటోంది. వాటి సహజమైన భావోద్వేగాలను కమెరాల్లో బంధించటమేనని వెల్లడించింది. మన కెమెరాల్లో బంధించే ప్రతి విషయానికి బలమైన కథ ఉంటుందని.. నటన పరంగానూ ఇది నన్ను మెరుగుపరుచుకునేలా చేసిందని తెలిపింది. అందుకే కెమెరా ముందు ధైర్యంగా నటిస్తున్నా అని ప్రిషా సింగ్ చెప్పుకొచ్చింది. కాగా.. బడ్డీ చిత్రం ఆగస్టు 2న థియేటర్లలో సందడి చేయనుంది. -
మా నాన్న నాతో సినిమా తీయలేదని ఎందుకు అన్నానంటే..
-
అల్లు శిరీష్‌తో ప్రత్యేక రాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ
-
ఆకట్టుకుంటున్న 'ఫీల్ ఆఫ్ బడ్డీ' సాంగ్
అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "బడ్డీ". గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. జూలై 26న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.ఈ రోజు ఈ సినిమా నుంచి 'ఫీల్ ఆఫ్ బడ్డీ' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను హిప్ హాప్ తమిళ కంపోజ్ చేసి ఐరా ఉడుపితో కలిసి పాడారు. సాయి హేమంత్ లిరిక్స్ అందించారు. 'చూసాలే ఊసాలే నాలో నీ కలనే...దాచాలే దాచాలే నాలో ఆ కలనే..అంటూ హార్ట్ టచింగ్ గా ఈ పాట సాగుతూ ఆకట్టుకుంది. -
అల్లు శిరీష్ 'బడ్డీ' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఈ సినిమాలో హీరో నేను కాదు..ఆ క్యారెక్టర్‌కు ఇంప్రెస్ అయ్యా: అల్లు శిరీష్
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ నటిస్తోన్న తాజా చిత్రం 'బడ్డీ'. ఈ మూవీలో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సామ్ ఆంటోన్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ..' లాస్ట్ ఇయర్ బడ్డీ పోస్టర్ రిలీజైనప్పుడు మళ్లీ రీమేక్ సినిమా చేస్తున్నావా? అని అడిగారు. బడ్డీ విషయంలో నాకు కూడా కొంచెం డౌట్ ఉండేది. టెడ్డీ బేర్‌తో యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నా. కానీ బడ్డీ ట్రైలర్ చూశాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది రెగ్యులర్ టైప్ మూవీ కాదు. కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో హీరో నేను కాదు.. టెడ్డీ బేర్. ఆ క్యారెక్టర్‌కు ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా చేశా. పుష్ప -2 గురించి నేను ఇప్పుడు మాట్లాడను. మాట్లాడితే మరింత హైప్ క్రియేట్ చేస్తారు. టీజర్, ట్రైలర్ చూసి మీరే డిసైడ్ చేసుకోవాలి.' అని అన్నారు.ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెగ ఆకట్టుకుంటోంది. అన్యాయంపై పోరాడే టెడ్డీబేర్‌ను మీరెప్పుడైనా చూశారా..? అంటూ చెప్పే డైలాగ్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది. చరిత్రలో ఇలాంటిది ఎప్పుడైనా చూశారా? అంటూ ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని పెంచేశారు. కాగా.. టెడ్డీ బేర్‌కు సాయం చేసే కెప్టెన్ పాత్రలో హీరో అల్లు శిరీష్ కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత అజ్మల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Buddy First Single: పాటతో రూమర్స్‌కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
‘ఊర్వశివో రాక్షసీవో’(2022) తర్వాత అల్లు శిరీష్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. ఆ సినిమా రిలీజైన కొన్నాళ్లకే బడ్డీ మూవీ అనౌన్స్ చేశాడు. చిన్న గ్లింప్స్ కూడా విడుదల చేశారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఒకనొక దశలో ఈ సినిమాను పక్కకు పెట్టేసినట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఓ పాటను రిలీజ్ చేసి రూమర్స్ అన్నింటికి చెక్ పెట్టారు మేకర్స్. బుధవారం ఉదయం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'ఆ పిల్ల కనులే..' రిలీజ్ చేశారు. హిప్ హాప్ తమిళ ఈ పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. సాయి హేమంత్ లిరిక్స్ అందించగా హిప్ హాప్ తమిళ తో కలిసి సంజిత్ హెగ్డే, ఐరా, విష్ణు ప్రియ రవి పాడారు. 'ఆ పిల్ల కనులే, చూశాక తననే ఊహల్లో ఎగిరే మైకంలో మునిగే , మైకంలో తేలే, మబ్బులు తాకే, ఇద్దరి కథ ఇక మొదలాయే, నింగి నేల కలిశాయో, ఊసులేవో పలికాయో..' అంటూ మంచి రొమాంటిక్ నెంబర్ గా సాగుతుందీ పాట.శిరీష్, గాయత్రి భరద్వాజ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించగా, స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. -
SRH vs RCB :ఉప్పల్ స్టేడియంలో తారల సందడి (ఫొటోలు)
-
15 ఏళ్ల క్రితం ఇదే మ్యూజియంలో అంటూ అల్లు శిరీష్ కామెంట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు బొమ్మను ఆవిష్కరించాడు. అక్కడ ఈ గౌరవం దక్కించుకున్న తొలి సౌత్ ఇండియన్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఎంతో ఘనంగా జరిగిన ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి బన్నీ కుటుంబంతో సహా దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ గౌరవం దక్కించుకున్న బన్నీకి ఎందరో శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఆయన సోదరుడు అల్లు శిరీష్ కూడా బన్నీని విష్ చేస్తూ దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంతో తమకు ఉన్న అనుబంధాన్ని ఇలా గుర్తుచేసుకున్నాడు. '15 ఏళ్ల క్రితం నేను, అన్నయ్య కలిసి దుబాయ్‌లోని ఇదే మ్యూజియానికి టూరిస్టులుగా వచ్చాం. ఆ సమయంలో మ్యూజియంలో ఉన్న పలు విగ్రహాలతో కలిసి ఫోటోలు దిగాం. కానీ ఇంతటి గొప్ప ప్లేస్‌లో మా కుటుంబం నుంచి ఒకరి మైనపు బొమ్మ ఇక్కడ ఉంటుంది అని ఎప్పుడూ ఊహించుకోలేదు. ఆ విగ్రహంతో కలిసి ఫోటోలు దిగుతామని అనుకోలేదు. అన్నయ్యా.. నీ సినీ ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.' అంటూ అల్లు శిరీష్ శుభాకాంక్షలు చెప్పారు. బన్నీతో దిగిన పోటోలను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహ కూడా శుభాకాంక్షలు తెలిపింది. బన్నీ భార్యగా తనకెంతో గర్వంగా ఉందని ఆమె తెలిపింది. ఎక్కడైనా సరే తనదైన ముద్రవేసే అల్లు అర్జున్ .. ఇప్పుడు మైనపు విగ్రంతో శాశ్వతంగా అందరినీ ఆకర్షిస్తుంటారని ఆమె తెలిపింది. మార్చి 28 ఎప్పటికీ మా గుండెల్లో ఉండిపోతుందని స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
షూటింగ్ సమయంలో బామ్మ చనిపోవడంతో..: హీరోయిన్
తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ తమిళంలో నిర్మించిన చిత్రం వడక్కుపట్టి రామసామి. కమెడియన్ సంతానం కథానాయకుడిగా నటించిన ఇందులో మేఘా ఆకాష్ హీరోయిన్గా నటించారు. ఎంఎస్ భాస్కర్, కూల్ జయంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందించారు. కార్తీక్ యోగి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 2వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. అతడితో నటించాలనుందన్న అల్లు శిరీష్ ఈ సందర్భంగా శనివారం ఉదయం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లు శిరీష్ మాట్లాడుతూ.. హాస్య పాత్రలు పోషిస్తున్నప్పటి నుంచి నటుడు సంతానంను గమనిస్తున్నానని, ఇప్పుడు ఆయన సక్సెస్ఫుల్ కథానాయకుడిగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. సంతానం హాస్యం అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన ఇంటర్వ్యూలు కూడా ఆసక్తిగా చూస్తుంటానని చెప్పారు. సంతానంతో కలిసి నటించాలనుందన్నారు. 65 రోజుల్లో షూటింగ్ పూర్తి సంతానం మాట్లాడుతూ.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత విశ్వ ప్రసాద్ తనతో రెండు చిత్రాలు చేస్తున్నారని, అందులో మొదటిగా విడుదలవుతున్న చిత్రం ఈ వడక్కుపట్టి రామసామి అని చెప్పారు. 65 రోజుల్లో ఈ చిత్రాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా భారీస్థాయిలో నిర్మించారని చెప్పారు. తాను నటించిన చిత్రాలన్నింటికంటే ఇది భారీ బడ్జెట్ చిత్రమన్నారు. అర్థం చేసుకున్నారు మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశాన్ని కల్పించిన విశ్వ ప్రసాద్‌కు, క్రియేటివ్ నిర్మాతకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారన్నారు. షూటింగ్ సమయంలో తన బామ్మ మరణించడంతో చాలా బాధపడ్డానని, దాన్ని అర్థం చేసుకుని అండగా నిలిచారని చెప్పారు. మంచి బలమైన పాత్రను ఇచ్చిన దర్శకుడు కార్తీక్ యోగికి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: క్యాన్సర్‌తో చనిపోయిన ప్రముఖ హీరోయిన్.. ప్రముఖుల నివాళి -
సలార్, దేవర సహా అవన్నీ నెట్‌ఫ్లిక్స్‌లోనే.. కానీ ఆ ఒక్కటే..
సంక్రాంతి పండగ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్రియులపై వరాల జల్లు కురిపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ పండగ పేరిట పలు సినిమాల అప్డేట్లను వరుస పెట్టి వదులుతోంది. సలార్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దేవర, బడ్డీ తదితర చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో రానున్నట్లు ప్రకటించింది. బాలయ్య 109వ చిత్రం, కార్తికేయ కొత్త సినిమా సహా ఇంకా టైటిల్ ఖరారు కాని చిత్రాల పోస్టర్లు వదులుతూ అవి థియేటర్లో రిలీజైన కొంతకాలానికే అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. సందీప్ స్థానంలో అల్లు శిరీష్ అయితే ఇందులో ఆసక్తి గొలుపుతున్న మూవీ బడ్డీ. నిజానికి ఈ సినిమా పేరు వినగానే ఇది తమిళంలో వచ్చిన టెడ్డీ చిత్రానికి రీమేక్ అనుకున్నారంతా! కానీ హీరో సందీప్ కిషన్ ఇది రీమేక్ కాదని అప్పట్లోనే క్లారిటీ ఇచ్చాడు. థియేటర్లో రిలీజైన తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించాడు. ఇది గతేడాది ముచ్చట. కట్ చేస్తే సడన్‌గా ఈ సినిమాలోకి అల్లు శిరీష్ వచ్చాడు, సందీప్ కిషన్ సైడైపోయాడు!దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాతలు అందరూ పాతవారే! గతేడాది, ఇప్పుడు సేమ్ క్యాప్షన్.. పోస్టర్ మారిందంతే సంక్రాంతి సందర్భంగా అల్లు శిరీష్ 'బడ్డీ' పోస్టర్‌ను రిలీజ్ చేసింది నెట్‌ఫ్లిక్స్. పోయిన సంవత్సరం పెట్టిన క్యాప్షన్‌ను యథాతథంగా పెట్టేసింది. త్వరలోనే థియేట్రికల్ రిలీజ్, ఆ తర్వాత ఓటీటీలోకి రాబోతుందని, ఈ ఏడాదిలోనే స్ట్రీమింగ్ ఉంటుందని ప్రకటించింది. ఇది చూసిన జనాలు నవ్వాపుకుంటున్నారు. పోయిన ఏడాది కూడా ఇదే మాట చెప్పావ్, జరగలేదు.. మరి ఈసారైనా ఈ మూవీ రిలీజ్ ఉంటుందా? లేదా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సామ్ ఆంటోని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. గాయత్రి భరద్వాజ్, గోకుల్ కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజవుతుందో చూడాలి! Get your guns and spy gear out for SVCC37! 🔫 🔍#SVCC37 is coming soon on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada as a post theatrical release! #NetflixPandaga pic.twitter.com/MPhOChK1cY — Netflix India South (@Netflix_INSouth) January 15, 2024 https://t.co/mX5PhE4Kg1 Last year 😅 — Tamilmemes3.0 (@tamilmemes30) January 15, 2024 చదవండి: సంక్రాంతి రేసులో ఏడుసార్లు.. ఎన్ని హిట్సో తెలుసా? -
అల్లు బ్రదర్స్ ఇంట్రెస్టింగ్ పిక్స్.. ఒకరు అలా మరొకరు ఇలా!
భర్తతో క్యూట్ ఫొటో షేర్ చేసిన అల్లు అర్జున్ భార్య స్నేహ మంచు లక్ష్మీ బుగ్గపై ముద్దుపెట్టిన అల్లు శిరీష్ హాట్ వీడియోతో హీట్ పెంచేసిన మృణాల్ ఠాకుర్ క్యూట్ పోజులో యంగ్ హీరోయిన్ మెహ్రీన్ కేక పుట్టించే లుక్‌లో ముద్దుగుమ్మ ప్రియా వారియర్ దీపావళి స్పెషల్.. మంట పుట్టించేస్తున్న సన్నీ లియోనీ సోనాల్ చౌహాన్ స్టన్నింగ్ లుక్.. వీడియో వైరల్ వయ్యారంగా గోడకు వంగి రచ్చ లేపుతున్న రకుల్ View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
Allu Business Park Launch Pics: అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం ఆవిష్కరణ (ఫొటోలు)
-
'బేబీ' ఫేమ్ వైష్ణవి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్.. హీరో ఎవరంటే
బేబీ హీరోయిన్ 'వైష్ణవి చైతన్య' పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్‌లో ఉంది. టాలీవుడ్లో హీరోయిన్ కావాలనే లక్ష్యంతో పరిశ్రమకొచ్చి. ఎనిమిదేళ్లైనా అది నెరవేరకపోవడంతో యూట్యూబర్‌గా అయినా కొనసాగాలని పలు షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ.. ఇన్‌స్టాలో రీల్స్ చేసుకుంటూ ఉంటున్న తనకు డైరెక్టర్ సాయిరాజేశ్ వల్ల బేబీతో సిల్వర్ స్క్రీన్‌పై మొదటిసారి మెరిసింది. వచ్చిన అవకాశం నిలబెట్టుకునేందకు తను కూడా ఎంతగానో కష్టపడింది కూడా. (ఇదీ చదవండి: నో డౌట్.. ఈ కామన్ మహిళ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఖాయం) మొదట కథ విన్నప్పుడు ఒక బస్తీలో పుట్టి పెరిగిన అమ్మాయి పాత్రలో కనిపిస్తావని డైరెక్టర్ చెప్పినప్పుడు ఎగిరి గంతేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో వైష్ణవి చెప్పింది. ఎందుకంటే తాను కూడా చాంద్రాయణగుట్టలోని ఒక బస్తీ అమ్మాయినే కాబట్టి అంటూ తన ఐడెంటీని దాచుకోకుండా చెప్పుకొచ్చింది. దీంతో ఒక తెలుగమ్మాయి టాలెంట్‌కు దక్కాల్సిన ఫేమ్ తనకు వచ్చింది. (ఇదీ చదవండి: నీకు కృతజ్ఞతే లేదు.. బన్నీని ముందు పెట్టి మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్) తాజాగా వైష్ణవి టాలీవుడ్లో ప్రముఖ సంస్థ అయినటువంటి గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి తనను అల్లు అరవింద్ సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధంచి స్టోరీ కూడా తన వద్ద ఉందని, అది కూడా ఫీమేల్ ఓరియేంటేడ్ అని బేబీ సక్సెస్ మీట్లోనే అల్లు అరవింద్ కొంతమేరకు లీకులు ఇచ్చారు. మరోవైపు అల్లు శిరీష్- వైష్ణవి జంటగా మరో స్టోరీతో కూడా మూవీని ప్లాన్ చేస్తున్నారని టాక్. అల్లు అర్జున్ కూడా బేబీలో వైష్ణవి నటనకు ఫిదా అయ్యానని ఓపెన్‌గానే చెప్పాడు. అల్లు కుటుంబం నుంచి తనకు మంచి గుర్తింపు ఉంది కాబట్టి. ఎదో ఒక ప్రాజెక్ట్‌లో గీతా ఆర్ట్స్ ద్వారా తన జర్నీలో మరో అడుగు పడటం ఖాయమని తెలుస్తోంది. -
అల్లు శిరీష్ కొత్త సినిమాకు ఆసక్తికరమైన టైటిల్!
మంచి ఆసక్తికరమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల ‘ఊర్వశివో రాక్షసివో’ మంచి హిట్ అందుకున్నారు. ప్రేక్షకుల నుంచి ఈ మంచి రెస్పాన్స్ లభించింది. సినిమాలో నటీనటుల నటనకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు శిరీష్ కొత్త సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తాజా సమాచారం ఏమిటంటే, టాప్ ప్రొడక్షన్ బ్యానర్ స్టూడియో గ్రీన్‌పై శిరీష్ కొత్త చిత్రం త్వరలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రాబోతోంది. మేకర్స్ ఈరోజు సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ని విడుదల చేశారు. రిలీజ్ చేసిన పోస్టర్లో అల్లు శిరీష్ తుపాకీతో కనిపిస్తుండగా, టెడ్డీ బేర్ అతని పక్కన ఫైటింగ్ పొజిషన్లో నిలబడి ఉంది. బడ్డీ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. అల్లు శిరీష్ తన బడ్డీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మించారు. గాయత్రి భరద్వాజ్, గోకుల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. -
ఇన్‌స్టా స్టార్ శ్వేతా నాయుడుకి గిఫ్ట్ పంపిన అల్లు శిరీష్
యంగ్ హీరో అల్లు శిరీష్ ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో వచ్చిన ‘ఊర్వశివో రాక్షసివో’ తర్వాత ఇంత వరకు మరో సినిమాకు కమిట్ అవ్వలేదు. అయితే తాజాగా అల్లు శిరీష్ కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఈ మేరకు అఫీషయల్ అనౌన్స్మెంట్ చేశాడు. ఈ మేరకు మెట్రో ట్రైన్లో టెడ్డీబేర్‌తో ఉన్న ఓ పోస్టర్ని వదిలారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఇది తమిళంలో ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్‌గా ఉంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా సాయేషా సైగల్ నటించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో ఇన్‌స్టా స్టార్ శ్వేతా నాయుడు కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు టెడ్డీతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ..మీ డెటెక్టివ్ స్కిల్‌ను ఉపయోగించి ఈ గిఫ్ట్‌ను నాకు ఎవరు ఇచ్చారో చెప్పుకోండి చూద్దాం అంటూ ఇంట్రెస్టింగ్ పోస్టును షేర్ చేసింది. View this post on Instagram A post shared by Swetha Naidu (@swethaa_naidu) -
రాజమండ్రిలో అల్లు శిరీష్, అనసూయ, నేహా శెట్టి సందడి (ఫొటోలు)
-
OTT release : 'యశోద', 'ఊర్వశివో రాక్షసివో' మూవీస్ థియేటర్స్‌లో మిస్ అయ్యారా?
సినీ అభిమానులకు శుక్రవారం వచ్చిందంటే పండగే. ఎందుకంటే సినిమాలు చాలావరకు ఆరోజే రిలీజ్ అవుతుంటాయి. ఇక ఈ మధ్యకాలంలో ఓటీటీల ప్రభావం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. థియేటర్లో సినిమా మిస్ అయిన వాళ్లు ఆ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. మరి ఒకేరోజు ఓటీటీలో మూడు సినిమాలు విడుదలైతే? ఈ శుక్రవారం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేస్తున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. సమంత ప్రధాన పాత్రలో నటించి యశోద సినిమా రీసెంట్గా హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 11న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ. 30కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీని థియేటర్స్‌లో మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేందుకు ఎదురు చూస్తున్నారు. రేపు( శుక్రవారం) యశోద సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హీరో నితిన్, కృతిశెట్టి హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ఆగస్ట్ 12న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. ఎలాగైన ఈసారి హిట్ కొట్టాలని ఎదురు చూసిన నితిన్‌కు నిరాశే మిగిలింది. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ 'జీ 5'లో డిసెంబరు 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. హీరో అల్లు శిరీష్, అను ఇమ్మానుయేట్ జంటగా నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా శిరీష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అయింది.డిసెంబర్ 9 నుంచి ‘ఆహా’లో ప్రీమియర్ కానుంది. పెళ్లి మంచిదా.. లివ్ ఇన్ రిలేషన్ షిప్ మంచిదా అనే దానిపై ఎవరికీ స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పలేరు. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే ఊర్వశివో రాక్షసివో. థియేటర్లో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసేయండి మరి. -
‘ఓటీటీ’లోకి ‘ఊర్వశివో రాక్షసివో’..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
అల్లు హీరో శిరీష్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అను ఇమ్మానుయేల్ హీరోయిన్. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న థియేటర్స్‌లో విడుదలైంది. లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అయింది. డిసెంబర్ 9 నుంచి ‘ఆహా’లో ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ ‘ప్రస్తుత కాలానికి చెందిన అమ్మాయి, అబ్బాయికి చెందిన ప్రేమకథా చిత్రమిది. నేటి తరం యువ జంటలు ఎదుర్కొన్న సవాళ్లను ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఇలాంటి సినిమాను ఆహా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. ఓ భావోద్వేగాన్ని మన చుట్టూ ఉండే అనే పరిస్థితులు ముందుకు నడిపిస్తాయి. ప్రతి సంబంధం దేనికదే ప్రత్యేకం. పెళ్లి మంచిదా.. లివ్ ఇన్ రిలేషన్ షిప్ మంచిదా అనే దానిపై ఎవరికీ స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పలేరు. అలాంటి ఓ ఆలోచనను సమాజం ఆకట్టుకునేలా ఊర్వశివో రాక్షసివో చిత్రాన్ని తెరకెక్కించారు. , వెన్నెల కిషోర్, సునీల్, ఆమని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
అల్లు అరవింద్‌కు నలుగురు కుమారులని తెలుసా?
స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు అల్లు అరవింద్. నటుడిగా కాకుండా నిర్మాతగా కెరీర్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో బడా నిర్మాతగా వెలుగొందుతున్నాడు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ కింద ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఆయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఆయనకు ముగ్గురు కుమారులు అని అందరూ అనుకుంటారు. వారే అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు వెంకటేశ్ (బాబీ). కానీ అల్లు అరవింద్‌కు మరో కుమారుడు కూడా ఉండేవాడన్న విషయాన్ని శిరీష్ బయటపెట్టాడు. 'మా నాన్నకు మేం నలుగురం. పెద్దన్నయ్య అల్లు వెంకటేశ్ తర్వాత రాజేష్ జన్మించాడు. వీళ్లిద్దరి తర్వాత అర్జున్ పుట్టాడు. ఐదారేళ్ల వయసులో రాజేశ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నేను పుట్టడాని కంటే ముందే ఇది జరిగింది' అని చెప్పుకొచ్చాడు అల్లు శిరీష్. చదవండి: మనసుకు గాయమంటూ రేవంత్ ఏడుపు చాలా నెర్వస్‌గా ఉంది, అంతా మీ చేతుల్లోనే: సమంత -
అప్పటి వరకు అల్లు శిరీష్ ఎవరో కూడా తెలియదు: అను ఇమ్మాన్యుయేల్
నటి అను ఇమ్మానుయేల్ కోలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడిందని చెప్పవచ్చు. టాలీవుడ్లో పలు చి త్రాల్లో నటించిన ఈమె తమిళంలో విశాల్‌కు జంటగా తుప్పరివాలన్ చిత్రంతో పరిచయం అయింది. ఆ చిత్రంలో ఈమె పాత్ర పరిమితమే. గుర్తింపు అంతంత మాత్రమే. ఆ తర్వాత శివ కార్తికేయన్‌కు జంటగా నమ్మవీటి పిళ్లై చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో కనిపించలేదు. అయితే తాజాగా కార్తీకి జంటగా జపాన్ చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. చదవండి: Anushka Shetty: ‘నేను యోగ టీజర్‌గా పనిచేశానని అందరికి తెలుసు.. కానీ అది ఎవరికి తెలియదు’ చిత్రం సోమవారం పూజా కార్య క్రమం చెన్నైలో ప్రారంభమైంది. కాగా అను ఇమ్మానుయేల్ గురించి ఇటీవల ఒక వదంతి వైరల్ అవుతోంది. ఈమె తెలుగులో అల్లు శిరీష్ జంటగా ఊర్వశివో.. రాక్షసివో చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్ఫుల్ గా ప్రదర్శింపబడుతుంది. ఇక్కడ వర కు బాగానే ఉంది. అసలు కథ ఏంటంటే అను ఇమాన్యుల్ నటుడు అల్లు శిరీష్‌తో ప్రేమాయణం అంటూ ప్రచారం నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. దీనిపై స్పందించిన ఆమె తాను అనుకోకుండానే ఈ రంగంలోకి ప్రవేశించానని చెప్పింది. కొన్ని సక్సెస్ఫుల్ చిత్రాల్లోనూ ప్లాప్ చిత్రాల్లోనూ నటించానని చెప్పింది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే తాజాగా తెలుగులో అల్లు శిరీష్ సరసన నటించడంతో ఆయనతో ప్రేమలో పడ్డట్టు వదంతులు పుట్టిస్తున్నారని చెప్పింది. ఇలాంటి వాటిని తాను అస్సలు పట్టించుకోనని, అయితే తన తల్లి ఏడ్చేసిందని తెలిపింది. దీంతో అమ్మ వేదన చూసి తనకు బాధ కలిగిందని చెప్పింది. నిజానికి ఊర్వశివో.. రాక్షసివో చిత్రం షూటింగ్‌కు ముందు అల్లు శిరీష్ గురించి తనకు తెలియదని ఆయన్ని చూసింది కూడా లేదని చెప్పింది. చిత్ర షూటింగ్ పూజ సమయంలోనే తాను అల్లు శిరీష్‌ను కలిశానని చెప్పింది. ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి కాఫీ తాగితే కూడా రకరకాలుగా కట్టు కథలను అల్లేస్తున్నారని నటి అను ఇమ్మానుయేల్ ఆవేదన వ్యక్తం చేసింది. -
ఏడ్చేసిన అల్లు అర్జున్, వీడియో వైరల్
అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ఈ నెల 4న విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఊర్వశివో రాక్షసివో బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చాడు. అల్లు శిరీష్ మాట్లాడుతున్న సమయంలో బన్నీ ఎమోషనలయ్యాడు. 'అరవింద్ గారి అబ్బాయిగా పుట్టడం నా అదృష్టం. బన్నీ అన్న.. నన్ను ఓ తమ్ముడిలా కాకుండా కొడుకులా చూస్తాడు. ఎప్పుడైనా విష్ చేయాలంటే మై బేబీ సిరి అని రాస్తాడు. నన్ను చిన్నపిల్లాడిలా బుగ్గలు గిల్లి ముద్దు చేస్తుంటాడు. మా అన్నయ్యకు నేనంటే అంత ప్రేమ. అలాంటి అన్నయ్యకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం' అని శిరీష్ మాట్లాడుతున్న సమయంలో బన్నీ కంటతడి పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Brother bond ❤️🥹🤝Bunny got emotional listing to brother @AlluSirish speech at #UrvasivoRakshasivo success celebration#AlluArjun@alluarjun@ArtistryBuzz #Pushpa2 pic.twitter.com/i8UO4MwB1p — ARTISTRYBUZZ (@ArtistryBuzz) November 6, 2022 About #PushpaTheRule 🔥 2023 next sensation #AlluArjun pic.twitter.com/oo9EkHgMls — Monika -YASHODAFromNOV11th (@Iam_MonikAArjun) November 6, 2022 చదవండి: దానివల్ల ఎలిమినేట్ అయ్యానంటే నేను ఒప్పుకోను: గీతూ డబ్బులు, కెరీర్, రిలేషన్.. అన్నింటా ఒత్తిడే: నటి మాజీ భర్త -
Urvasivo Rakshasivo: అందుకే అనుతో కెమిస్ట్రీ వర్కౌట్ అయింది
‘ఊర్వసివో రాక్షసివో సినిమా చూసినవాళ్లంతా అను ఇమ్మాన్యుయేల్‌తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. దానికి ప్రధాన కారణం సెట్స్‌కి వెళ్లడానికి ముందు మేం చేసిన ముందస్తు సన్నాహాలే. రొమాంటిక్ సన్నివేశాల్లో మాలో ఎలాంటి సందేహాలు లేవు. వీటికి కవితాత్మకంగా తెరపై చూపించామే తప్ప ఎక్కడా అసభ్యంగా చూపించలేదు’అని అల్లు శిరీష్ అన్నారు. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. తమిళ్ సూపర్ హిట్ ‘ప్యార్ ప్రేమ కాదల్’కి రీమేక్‌గా వచ్చిన చిత్రమిది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ శనివారం మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు.. ► కథ బాగా నచ్చితే తప్ప సినిమా చేయను. అందుకే సినిమా సినిమాకి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. రాకేశ్ శశి గతంలో నాకు రెండు మూడు కథలు చెప్పాడు. కానీ అవి వర్కౌట్ కాలేదు. చివరకు ఊర్వశివో రాక్షసివో చిత్రంలో మా కాంబినేషన్ సెట్ అయింది. ► ఈ సినిమా పట్టాలెక్కడానికి ప్రధాన కారణం మా నాన్న(అల్లు అరవింద్). ‘ప్యార్ ప్రేమ కాదల్’ ఆయనకి బాగా నచ్చింది. ఈ సినిమా బాగుంది..నీకు సెట్ అవుతుందని నాతో చెప్పాడు. దాంతో నేను కూడా ఆ సినిమా చూశా. నాకు కూడా బాగా నచ్చింది. మాతృకకు మరింత కామెడిని యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ► సినిమా చూసిన వాళ్లంతా మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీకుమార్ పాత్రలో ఒదిగిపోయావంటూ అభినందిస్తున్నారు. అయితే ఆ పాత్ర చేయడానికి టాలీవుడ్లో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ సింధూజ పాత్రలో అనుని తప్ప మరొకరిని ఊహించలేం. ఆ పాత్రలాగే మొండితనం ఉన్న అమ్మాయి అను. అందుకే సింధూజ పాత్రలో ఒదిగిపోయింది. ► నాకు వివాహ వ్యవస్థపై నమ్మకం ఉంది. సహజీవనంతో ప్రయాణం మొదలు పెట్టి పెళ్లి చేసుకోవాడన్ని ఇష్టపడతా. నా పెళ్లి విషయంలో ఇంట్లో ఒత్తిడేమి లేదు. పెళ్లనేది కూడా హిట్ సినిమా లాంటిదే. దానంతట అదే రావాలి తప్ప మనం అనుకుంటే రాదు(నవ్వుతూ..) ► రొమాంటిక్ కామెడీ సినిమాలకు ఇదివరకు ఓ మార్కెట్ ఉండేది. ఇప్పుడది ఓటీటీ జోనర్ అయింది. సింపుల్ డ్రామాలు, పాత్ర ప్రధానమైన కథలు ఓటీటీల్లోనే చూస్తున్నారు. ‘కాంతార’ తరహా చిత్రాలు, స్టార్ హీరోల సినిమాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తున్నాయి. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం. -
Urvasivo Rakshasivo: తమ్ముడికి సపోర్ట్‌గా అల్లు అర్జున్
ఎట్టకేలకు అల్లు శిరీష్ ఖాతాలో ఓ హిట్ పడింది. శుక్రవారం విడుదలైన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఓపెనింగ్స్ భారీ రేంజ్లో రాకపోయినా.. రెండో రోజు మాత్ర భారీ స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. సునీల్, వెన్నెక కిశోర్‌ల కామెడీ, శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్‌ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం ఫుల్ హ్యాపీగా ఉంది. శుక్రవారం సాయత్రమే సక్సెస్ మీట్ పెట్టి తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ఊర్వసివో రాక్షసివో మూవీ రివ్యూ) ఇక ఆదివారం ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించాలని చిత్రయూనిట్ నిర్ణయించుకుంది. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. తమ్ముడికి సపోర్ట్‌గా అన్న వస్తుండడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. శిరీష్‌కు జోడీగా అను ఇమ్మాన్యూయెల్ హీరోయిన్గా నటించింది. సునీల్, వెన్నెల కిశోర్, ఆమని ఇతర కీలక పాత్రలు పోషించారు. 𝑰𝑪𝑶𝑵 𝑺𝑻𝑨𝑹 @alluarjun garu to grace the 𝒀𝑶𝑼𝑻𝑯𝑭𝑼𝑳 𝑩𝑳𝑶𝑪𝑲𝑩𝑼𝑺𝑻𝑬𝑹 celebrations of #UrvasivoRakshasivo as chief guest on Nov 6th @ JRC Convention, Hyd. 🤩@AlluSirish @ItsAnuEmmanuel @rakeshsashii @tanvirmir #AchuRajamani @anuprubens @GA2Official pic.twitter.com/s8GAY8Otsi — Geetha Arts (@GeethaArts) November 5, 2022 -
రెండు ఓటీటీల్లోకి రానున్న ఊర్వశివో రాక్షసివో, స్ట్రీమింగ్ అప్పుడే
చాలా గ్యాప్ తర్వాత అల్లు హీరో శిరీష్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అను ఇమ్మానుయేల్ హీరోయిన్. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి షో నుంచే ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. ఫలితంగా శిరీష్ ఖాతాలో ఓ కమర్షియల్ హిట్ పడింది. ఇక థియేటర్లో అలరిస్తున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. చదవండి: చివరి రోజుల్లో ‘మహానటి’ సావిత్రికి సెట్లో అవమానం, అన్నం కూడా పెట్టకుండా.. ఈ మూవీని రెండు ఓటీటీ ప్లాట్ఫాంస్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ తెలుగు ఓటీటీ ఆహా వీడియోస్, నెట్‌ఫ్లిక్స్‌లు ఫ్యాన్సీ డీల్‌కు ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఏ సినిమా అయినా థియేట్రికల్ రన్ అనంతరం 8 వారాల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫాం వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పడు ఈ మూవీ కూడా 2 నెలల రోజుల తర్వాత ఓటీటీకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మించారు. చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన సుడిగాలి సుధీర్.. ఫుల్ ఖుషిలో ఫ్యాన్స్ -
అల్లు శిరీష్ 'ఊర్వశివో రాక్షసివో' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
Urvasivo Rakshasivo Review: ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ రివ్యూ
టైటిల్: ఊర్వశివో రాక్షసివో నటీనటులు: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, వెన్నెల కిశోర్, ఆమని, అనీష్ కురువిల్లా తదితరులు నిర్మాణ సంస్థలు: జీఏ2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాతలు: తమ్మారెడ్డి భరద్వాజ, ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం సమర్పణ: అల్లు అరవింద్ దర్శకత్వం: రాకేశ్ శశి సంగీతం: అచ్చు రాజమణి (మాయారే పాట: అనూప్ రూబెన్స్) సినిమాటోగ్రఫీ: తన్వీర్ ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ విడుదల తేది: నవంబర్ 4, 2022 గౌరవం’సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు వచ్చాయి. ఆ తర్వాత కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం లాంటి విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. శీరీష్ నుంచి చివరగా వచ్చిన ‘ఎబిసిడి’ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన శీరీష్.. రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ఊర్వశివో రాక్షసివో'తో నేడు(నవంబర్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మూడేళ్ల విరామం తర్వాత అల్లు శిరీష్ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో' చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. శ్రీకుమార్ అలియాస్ శ్రీ(అల్లు శిరీష్) ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న శ్రీకి పక్క ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తున్న సింధూజ అలియాస్ సింధు(అనూ ఇమ్మాన్యుయేల్) అంటే చాలా ఇష్టం. సింధూ..కెరీర్లో మంచి స్థాయికి ఎదగాలనే తపన ఉన్న అమ్మాయి. అమెరికాలో చదువుకొని ఇండియా వచ్చి మోడ్రన్ లైఫ్‌ని గడుపుతుంది. ఆమెకి పెళ్లి అంటే నచ్చదు. కానీ శ్రీకుమార్‌ని ఇష్టపడుతుంది. ఇద్దరు కలిసి సహజీవనం చేసేందుకు సిద్ధపడతారు. దీని కోసం శ్రీ తన ఇంటికి దగ్గరలో ఓ ఇల్లుని అద్దెకు తీసుకుంటాడు. మరోవైపు శ్రీకుమార్కి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తుంటారు అతని తల్లిదండ్రులు (ఆమని, కేదార్ శంకర్). శ్రీ మాత్రం తల్లిదండ్రుల దగ్గర సహజీవనం చేస్తున్న విషయాన్ని దాచి, సింధూని పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆమె అందుకు ఒప్పకోదు. కొడుకు పెళ్లి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న శ్రీ తల్లి ఓ రోజు అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతుంది. ఈ విషయం తెలిసిన తర్వాత శ్రీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తల్లి కోసం పెళ్లి చేసుకున్నాడా? లేదా ప్రేయసిని దక్కించుకోవడం కోసం సహజీవనాన్ని కొనసాగించాడా? కొడుకు తప్పిపోయాడని శ్రీ పేరెంట్స్ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారు? సహజీవనం విషయాన్ని తల్లిదండ్రులకు తెలియకుండా ఉంచడానికి శ్రీ పడిన కష్టాలేంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఎలాంటి గోల్ లేకుండా సాధారణ జీవితాన్ని గడిపే ఓ అమాయకపు యువకుడికి, కెరీర్ ఓరియెంటెడ్ అమ్మాయికి మధ్య ప్రేమకథ ఎలా నడించింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే యూత్ టార్గెట్‌గా తీసిన మూవీ అని అర్థమవుతుంది. కథనం కూడా అలాగే సాగుతుంది. ప్రతి 10 నిమిషాలకు ఒక రొమాంటి సీన్‌తో ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ప్రస్తుతం చాలా మంది యువతీయువకులు లివింగ్ లైఫ్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదే పాయింట్‌తో దర్శకుడు రాకేశ్ శశి ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ కథలో కొత్తదనం ఏమి ఉండదు.. కానీ ఫుల్ కామెడీ, రొమాంటిక్ సీన్స్‌తో సాగడంతో ఎక్కడా బోర్కొట్టినట్లు అనిపించదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌ని ఓ వర్గం ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎలాంటి సాగదీత లేకుండా సినిమా స్ఠార్టింగ్ నుంచే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ సాగుతుంది. ప్రేమించిన అమ్మాయి.. తను పని చేసే ఆఫీస్‌లోకి రావడం.. తన ప్రేమ విషయాన్ని ఆమెతో చెప్పడానికి హీరో పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. ఇక సెకండాఫ్ మొత్తం సహజీవనం చుట్టే సాగుతుంది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, కామెడీ ఆకట్టుకుంటాయి. సహజీవనం ఎపిసోడ్‌ని క్రికెట్ కామెంట్రీతో ముడిపెట్టి చెప్పడంతో కామెడీ బాగా పండింది. అయితే ఈ చిత్రంలో ఎమోషన్స్‌ని కూడా యాడ్ చేశారు కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. హీరోయిన్ పెళ్లి ఎందుకు వద్దనుకుంటుందో అనేదానికి బలమైన కారణాన్ని చూపించలేదు. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు కానీ..యూత్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. చాలా కాలం తర్వాత అల్లు శిరీష్ తెరపై కనిపించాడు. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో ఆయన నటన చాలా మెరుగుపడింది. మిడిల్ క్లాస్ యువకుడు శ్రీకుమార్ పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన కామెడీతో అదరగొట్టేశాడు. మోడ్రన్ అమ్మాయి సింధూ పాత్రకి అనూ ఇమ్మాన్యుయేల్ న్యాయం చేసింది. తన గ్లామర్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. శిరీష్, అనూల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం సునీల్, వెన్నెల కిశోర్‌ల కామెడీ. వీరిద్దరు కలిసి పండించిన కామెడీకి ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు. పొసాని కృష్ణమురళి ఒకటి రెండు సీన్స్‌లో కనిపించినా.. తనదైన శైలీ కామెడీతో నవ్వించాడు. హీరో తల్లిగా ఆమని మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించారు.కేదార్ శంకర్, పృథ్వితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అచ్చు రాజమణి సంగీతం బాగుంది. పాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. తన్వీర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి, వెబ్‌డెస్క్ -
అల్లు అరవింద్ అలా అడిగేసరికి షాక్ అయ్యాను : అను ఇమ్మానుయేల్
మజ్ను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయైన బ్యూటీ అను ఇమ్మానుయేల్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ అల్లు శిరీష్‌తో డేటింగ్లో ఉందంటూ కొద్ది రోజులుగా గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ లేకపోయినా వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరగుతున్నట్లు ఫిల్మీ దునియాలో టాక్ వినిపిస్తుంది. ఇదే విషయం గురించి అను ఇమ్మానుయేల్‌ని పిలిచి మరి అల్లు అరవింద్ డైరెక్ట్‌గా అడిగేశాడట. ఊర్వశివో రాక్షసివో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అను ఇమ్మానుయేల్ మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టేసింది. శిరీష్‌తో ప్రేమలో ఉన్నానంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ మూవీ ఓపెనింగ్ రోజు పూజలోని శిరీష్‌ని నేను కలిశాను. ఆ తర్వాత మూవీ కోసం ఓసారి కాఫీ షాప్‌లో మాట్లాడకున్నాం. ఆ మాత్రానికే డేటింగ్ అంటూ వార్తలు రాసేశారు. అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య మూవీలో నటించాను. అప్పటి నుంచి ఆ కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది అంతే. అల్లు అరవింద్ కూడా ఓసారి నన్ను నా కొడుకుతో డేటింగ్లో ఉన్నావా అని అడిగారు. ఆ తర్వాత చాలా సేపు దీని గురించి మాట్లాడి నవ్వుకున్నాం అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. -
అదే నాకు అతి పెద్ద ప్రశంస: ‘ఊర్వశీవో రాక్షసివో’ డైరెక్టర్
‘‘ఊర్వశివో.. రాక్షసివో’ చిత్రం వినోదాత్మకంగా ఉంటుంది. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. ఈ సినిమా ప్రివ్యూ అయిన తర్వాత శిరీష్‌గారు, ‘తెరపై నేను కనపడలేదు.. నేను చేసిన శ్రీకుమార్ పాత్ర మాత్రమే కనిపించింది.. థ్యాంక్స్’ అన్నారు.. అదే నాకు అతి పెద్ద ప్రశంస. ఆ తర్వాత అల్లు అరవింద్‌గారు కూడా హీరో క్యారెక్టర్ అద్భుతంగా ఉందన్నారు’’ అని దర్శకుడు రాకేష్ శశి అన్నారు. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలిలేని, విజయ్ ఎం. నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు రాకేష్ శశి మాట్లాడుతూ.. ‘‘జతకలిసే, విజేత’ చిత్రాల తర్వాత ‘ఊర్వశివో.. రాక్షసివో’ చేశాను. చదవండి: ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ ‘విజేత’ చూసి, అల్లు అరవింద్‌గారు నన్ను పిలిపించి, శిరీష్ కోసం కథ సిద్ధం చేయమన్నారు. ఆ తర్వాత శిరీష్‌గారితో ప్రయాణం చేసి ‘ఊర్వశివో.. రాక్షసివో’ కథని రెడీ చేశాను. షూటింగ్ ప్రారంభిద్దాం అనుకున్న సమయంలో లాక్డౌన్ రావడంతో ఆలస్యం అయింది. ఇప్పటివరకూ శిరీష్‌గారు చేయని సరికొత్త పాత్రను ఈ చిత్రంలో చేశారు. ఆయన కెరీర్లో ది బెస్ట్‌గా నిలుస్తుంది. అనూ ఇమ్మాన్యుయేల్ పాత్ర నేటి తరం అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించిన నిర్మాతలకు కృతజ్ఞతలు. డైరెక్టర్ మణిరత్నంగారంటే నాకు ఇష్టం. ఆయనలా నాకు సినిమాలు తీయాలని ఉంది’’ అన్నారు. -
'ఊర్వశివో రాక్షసివో' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
సినిమా ఇండస్ట్రీ ఓ కుటుంబం
‘‘సినిమా ఇండస్ట్రీ అనేది ఓ కుటుంబం. మనుషుల జీవితాల్లో సినిమా కూడా నిత్యసాధనం అయిపోయింది. ఇలాంటి సమయాల్లో ప్రేక్షకులకు మంచి సినిమాలు అందేలా దర్శక–నిర్మాతలు కృషి చేయాలి’’ అన్నారు హీరో బాలకృష్ణ. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రం నవంబరు 4న విడుదల కానుది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బాలకృష్ణ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం బిగ్ టికెట్‌ను బాలకృష్ణకు అందించారు అల్లు అరవింద్. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ–‘‘అరవింద్‌గారి అసోసియేషన్‌తో నేను చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’కు మంచి స్పందన లభిస్తోంది. అల్లు రామలింగయ్యగారితో వర్క్ చేసే అవకాశం దక్కడం నా అదృష్టం. ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా టీజర్, ట్రైలర్ బాగున్నాయి. శిరీష్, అను, దర్శకుడిగా రాకేశ్ బాగా చేశారనిపిస్తోంది. ప్రతి మనిషిలో విభిన్నకోణాలు ఉంటాయి. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందంటారు. ఓ కుటుంబాన్ని నిలబెట్టాలన్నా, కూల్చాలన్నా ఆ తాలూకు బరువు, బాధ్యతలన్నీ మహిళల చేతుల్లోనే ఉంటాయి. కాలంతో ఇప్పుడు కొన్ని పరిస్థితులు, అభిరుచులు కూడా మారుతున్నాయి. సహజీవనం, ఎఫైర్స్ అనేవి కూడా నడుస్తున్నాయి. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో ‘ఊర్వశివో రాక్షసివో..’ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘శిరీష్ మిడిల్ క్లాస్ అబ్బాయిలా ఈ మూవీలో నటించాడు. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న సమస్యల నుంచి పుట్టిన సినిమా ఇది. మంచి ఎంటర్టైనర్ అండ్ ఓ ఇన్‌డెప్త్ డిస్కషన్ ఈ సినిమాలో ఉంది.. దాన్ని తెరపైనే చూడాలి’’ అన్నారు. ‘‘చిరంజీవిగారి 60వ బర్త్ డే వేడుకల్లో బాలకృష్ణగారు పాల్గొన్నారు. కొంత సమయం తర్వాత ఆ ఫంక్షన్లో మా జోష్ తగ్గింది కానీ బాలకృష్ణగారి జోష్ తగ్గలేదు. ‘కొత్తజంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాల తర్వాత నాన్నగారితో ముచ్చటగా మూడోసారి నేను చేసిన ఈ చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అల్లు శిరీష్. ‘‘శిరీష్‌గారు, అను వల్ల ఈ సినిమా మేకింగ్ చాలా సాఫీగా జరిగింది’’ అన్నారు రాకేష్ శశి. ఈ కార్యక్రమంలో నటుడు సునీల్, కొరియోగ్రాఫర్ విజయ్, దర్శకులు మారుతి, పరశురామ్, చందూ మొండేటి, వశిష్ఠ్, వెంకటేశ్ మహా, దర్శక–నిర్మాత, రచయిత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శక–నిర్మాత సాయిరాజేష్, నిర్మాత ఎస్కేఎన్, ‘గీతాఆర్ట్స్’ బాబు, సత్య, పూర్ణా చారి, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధులు మాధవ్, నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రిపోర్టర్‌పై అను ఇమ్మాన్యుయేల్ ఫైర్.. అడగడానికి వేరే ప్రశ్నలు లేవా?
-
రిపోర్టర్‌పై హీరోయిన్ ఫైర్.. అడగడానికి వేరే ప్రశ్నలు లేవా?
మజ్ను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది అను ఇమ్మాన్యుయెల్. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా అల్లు శిరీష్‌తో జతకట్టింది. వీరిద్దరూ కలిసి నటించిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్‌పై హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ ఫైర్ అయ్యింది. ''మీరు అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య చేశారు. ఇప్పుడు శిరీష్‌తో 'ఊర్వశివో రాక్షసివో' చేశారు... అన్నదమ్ములిద్దరిలో ఎవరు క్యూట్, ఎవరు నాటీ''? అని రిపోర్టర్ అడిగాడు. దీంతో అసహనానికి గురైన అను మీ దగ్గర ఇంతకన్నా మంచి ప్రశ్నలేం లేవా.. అడగడానికి అంటూ కోప్పడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో అనూకి అంత కోపం ఎందుకో అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కాగా అను, శిరీష్ ఇద్దరు లవ్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. -
అల్లు శిరీష్ 'ఊర్వశివో రాక్షసివో' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
నాకు రెండు, మూడు సీరియస్ రిలేషన్స్ ఉన్నాయి: అల్లు శిరీష్
అల్లు హీరో శిరీష్ నటించి లేటెస్ట్ మూవీ ఊర్వశీవో రాక్షసివో. అను ఇమ్మానుయేల్ హీరోయిన్. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా శిరీష్ ఓ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రేమ, బ్రేకప్‌పై స్పందించాడు. మూవీలో హీరోయిన్‌తో లవ్ ట్రాక్ గురించి చెబుతుండగా యాంకర్ నిజ జీవితంలో కూడా రిలేషన్స్‌లో ఉన్నారా? అని ప్రశ్నించారు. చదవండి: ‘ఆదిపురుష్’ డైరెక్టర్‌కు లగ్జరీ ఫెరారీ కారు బహుమతి, ఎవరిచ్చారంటే.. దీనికి శిరీష్ స్పందిస్తూ.. ఈ కాలంలో రిలేషన్స్ లేకుండా ఎవరుంటారని, తనకు రెండు మూడు సీరియస్ రిలేషన్స్ ఉండేవంటూ ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. దీంతో యాంకర్ మీరు ఓ పెద్దింటి అమ్మాయితో సీరియస్ రిలేషన్లో ఉన్నారని, చివరికి మీరే బ్రేకప్ చెప్పారని విన్నాను నిజమెంత అని అడగ్గా.. అవును అని సమాధానం ఇచ్చాడు. ‘నాకు గతంలో రెండు మూడు సీరియస్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అయితే వారందరితో నాకు బ్రేకప్ అయ్యింది. చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆ రోజు నుంచి స్ట్రీమింగ్.. ఆ బ్రేకప్స్ వల్ల నేను కూడా బాధపడ్డాను. బ్రేకప్ చెప్పడం వల్ల ఎదుటి వాళ్లకు మాత్రమే పెయిన్ ఉండదు. చెప్పిన వాళ్లకి కూడా ఉంటుంది. అది ఆ నిమిషం మనకు తెలియదు. కానీ, ఏడాది తర్వాత దాని రిజల్ట్ తెలుస్తుంది. బ్రేకప్ చెప్పినప్పుడు నేను కూడా బాధపడ్డాను. అనవసరంగా బ్రేకప్ చెప్పి టైం వేస్ట్ చేస్తున్నానేమోనని ఇప్పటికీ అనిపిస్తుంది. లేదంటే ఇపాటికి నాకు పెళ్లి జరిగి ఉండేది కదా’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
పోరీల ఎంటపోకు ఫ్రెండూ అని పాడుతున్న అల్లు శిరీష్
భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ బ్యానర్లో రాబోతున్న నెక్స్ట్ మూవీ "ఊర్వశివో రాక్షసివో". అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో శిరీష్ సరసన "అను ఇమ్మాన్యూల్" హీరోయిన్గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన "ఊర్వశివో రాక్షసివో" చిత్ర టీజర్ కు, సాంగ్ కు అనూహ్య స్పందన లభించింది. తాజాగా ఈ మూవీలో ‘మాయారే’ అంటూ సాగే సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. రాహుల్ సిప్లీగంజ్ ఆలపించిన ఈ పాటను కాసర్య శ్యామ్ రచించారు. అనూప్‌రూబెన్స్,అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది. చదవండి: ఒంటరిగా రమ్మన్నాడు, కొలతలు అడిగి నీచంగా -
‘ఊర్వశివో రాక్షసివో’.. నుంచి ఫస్ట్ లవ్‌సాంగ్ వచ్చేసింది
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన చిత్రం "ఊర్వశివో రాక్షసివో". రాకేశ్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 4న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే టీజర్‌ను రిలీజ్ చేయగా,అనూహ్య స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేసింది. ‘‘దీంతననా దీంతననా నీ చూపుల దాడి.. చేసిందే చేసిందే ఈ గారడీ’’అంటూ సాగే ఈ సాంగ్‌ను సిద్ శ్రీరామ్ ఆలపించారు. -
"ఊర్వశివో రాక్షసివో" చిత్రం నుంచి ఫస్ట్‌సాంగ్ రిలీజ్ అప్పుడే
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన చిత్రం "ఊర్వశివో రాక్షసివో". GA2 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 10న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. అక్టోబర్ 10న ఈ సినిమా నుంచి దీంతననా అనే సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది. -
యూత్‌ని ఆకట్టుకునేలా అల్లు శిరీష్ ‘ఊర్యశివో రాక్షసివో’ టీజర్
అల్లు శిరీష్ , అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఊర్యశివో రాక్షసివో’. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. యూత్‌ని టార్గెట్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. టీజర్ లోని కొన్ని డైలాగ్స్, అలానే కొన్ని సీన్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అంతర్లీనంగా ప్రేమకి,స్నేహానికి ఉన్న తేడాను దర్శకుడు ఆవిష్కరించినట్లు అర్ధమవుతుంది. గీతాఆర్ట్స్ 2 బ్యానర్‌పై పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అల్లు శిరీష్ కొత్త చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్
‘గౌరవం’సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు వచ్చాయి. ఆ తర్వాత కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం లాంటి విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. శీరీష్ నుంచి చివరగా వచ్చిన ‘ఎబిసిడి’ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన శీరీష్.. ‘గీతా ఆర్ట్స్ ’మూవీతో రీఎంట్రీ ఇస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు శిరీష్ చేసిన చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాను నవంబర్4న విడుదల చేయనున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ టీజర్ ,త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. -
దీని కోసం పద్నాలుగేళ్లుగా ఎదురుచూశా: అల్లు శిరీష్
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నటిస్తున్న మూవీ 'ప్రేమ కాదంటా?'. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌తో, ఫస్ట్ లుక్ తెగ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఆ మధ్య నవంబర్ 11వ తేదీ నాకు చాలా ప్రత్యేకం అంటూ ట్వీట్ చేయడంతో ఏంటి, శిరీష్ ప్రేమలో పడ్డాడా? అని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. దీనిపై అతడు స్పందిస్తూ తన కొత్త సినిమా ఫిక్స్ అయిందని పుకార్లకు చెక్ పెట్టాడు. తాజాగా అతడు సోషల్ మీడియాలో మరోసారి ఎమోషనల్ అయ్యాడు. తెలుగులో నాని నటించిన 'జెర్సీ' మూవీ హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ హోర్డింగ్‌లో అల్లు ఎంటర్టైన్మెంట్స్ అని రాసి ఉండటాన్ని చూసి ఉద్వేగానికి లోనయ్యాడు. అల్లు ఎంటర్టైన్మెంట్స్ అని జుహు సర్కిల్లో ఓ హోర్డింగ్‌లో చూడాలని పద్నాలుగేళ్లుగా ఎదురుచూశాను. మొత్తానికి జరిగింది అని రాసుకొచ్చాడు. కాగా జెర్సీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 31న విడుదలవుతోంది. Waited 14 years to see a billboard of an Allu Entertainment film at the Juhu circle. Finally it's happening. pic.twitter.com/JoOT45hhT1 — Allu Sirish (@AlluSirish) December 24, 2021 -
మర్చిపోలేని రోజు, సోషల్ మీడియాను వీడుతున్నా: అల్లు శిరీష్
Allu Sirish: అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ ప్రస్తుతం 'Prema కాదంట' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. టైటిల్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ హీరో ఈ మూవీ కోసం సిక్స్ ప్యాక్ బాడీ ట్రై చేసి మెప్పించాడు. ఇదిలా వుంటే తాజాగా ఈ హీరో చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. 'ఈ ఏడాది నవంబర్ 11వ తేదీ నాకు చాలా ప్రత్యేకమైంది. నా వృత్తిజీవితంలోనే ఇది మర్చిపోలేని రోజు అవుతుంది. ఎందుకనుకుంటున్నారా? అది రానున్న రోజుల్లో నేనే చెప్తాను. అప్పటివరకు కొన్ని కారణాల వల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను' అని చెప్పుకొచ్చాడు. 11/11/2021 will be one of the best days in my profesional life. Why, what I'll share over the coming weeks. I've been off social media for a reason :) — Allu Sirish (@AlluSirish) November 11, 2021 దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'అన్నా లవ్ సెట్ అయిందా? పెళ్లి కుదిరిందా?' అన్న ప్రశ్నలకు.. 'నేను వృత్తిపరంగా స్పెషల్ డే అని మరీ మరీ చెప్పాను సామీ' అని సరదాగా రిప్లై ఇచ్చాడు శిరీష్. 'ఏంటన్నా? హాలీవుడ్‌కు వెళ్తున్నావా?' అన్న ప్రశ్నలకు శిరీష్.. 'అలాంటి ఆశయాలేమీ నాకు లేవు బ్రో, నా కొత్త సినిమా ఫిక్స్ అయింది, కథ నచ్చింది అన్న ఆనందం! నా కెరీర్లో ఇది బెస్ట్ స్క్రిప్ట్ అవుతుందనుకుంటున్నాస అంటూ అసలు మ్యాటర్ రివీల్ చేశాడు. Alanti ambitions nakem le bro. #Sirish7 lock ayyindi, andariki katha nacchindi anna anandam. The best script of my career, I feel. — Allu Sirish (@AlluSirish) November 11, 2021 -
త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న హీరో సాయితేజ్?
Sai Dharam Tej Marriage: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారా? మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ లిస్ట్ నుంచి త్వరలోనే తప్పుకోనున్నారా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇటీవలె రోడ్డు ప్రమాదానికి గురైన సాయితేజ్ పూర్తిగా కోలుకొని విజయ దశమి సందర్భంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. అయితే అదేరోజు సాయి తేజ్ పుట్టిరోజు కూడా ఉండటంతో మెగా ఫ్యామిలీలో ఆనందం మరింత రెట్టింపయ్యింది. చదవండి: 'మా' ఎన్నికలపై ఆర్జీవీ సెటైర్లు.. ట్వీట్ వైరల్ ఈ సందర్బంగా తేజ్ కజిన్స్ అతనికి వెల్కం హోం అంటూ బర్త్‌డే విషెస్‌ను తెలిపారు. ఇందులో సుష్మిత కొణిదెల, శ్రీజ, నిహారిక, అల్లు శిరీష్ సహా మిగతా కజిన్స్ సైతం తేజ్‌కు ఎంతో ప్రేమగా విషెస్ చెప్పారు. అయితే శిరీష్ మాట్లాడుతూ.. సింగిల్‌గా ఇదే నీ చివరి బర్త్‌డే అవ్వాలనుకుంటున్నా. ఈ మ్యారేజ్ రేస్‌లో నువ్వు నన్ను బీట్ చెయ్యాలనుకుంటున్నా అని సాయి తేజ్ పెళ్లిపై హింట్ ఇచ్చేశాడు. దీంతో ఇప్పటికే సంబంధాలు చూస్తున్నారని, త్వరలోనే సాయి తేజ్ పెళ్లిపై క్లారిటీ రానుందని మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: వైరల్: షో మధ్యలో బాలయ్యకు ఫోన్ చేసిన రోజా View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు బ్రదర్స్
Allu Ramalingaiah Statue: లెజెండరీ నటుడు, పద్మశ్రీ అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని అల్లు బ్రదర్స్ ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో అల్లు అర్జున్,బాబీ, శిరీష్‌లు అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. అనంతరం ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్విట్ చేస్తూ.. మా తాత, పద్మశ్రీ అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించాం. ఆయన మాకు ఎంతో గర్వ కారణం. అల్లు స్టూడియోస్ ప్రయాణంలో ఆయన ఎప్పుడూ ఉంటారు అంటూ ఫోటోలను షేర్ చేశారు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్సుకుమార్ దర్శకత్వంలో పుష్ఫ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్. ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ డిసెంబర్25న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: కొండపొలం నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల Unveiled the statue of my grandfather Padmashri #AlluRamalingaiah garu in ALLU Studios on his birth anniversary today along with #AlluBobby & @AlluSirish . He was our pride and will continue to be a part of our journey at Allu studios . pic.twitter.com/UHMZYvgiC3 — Allu Arjun (@alluarjun) October 1, 2021 -
హీరో అల్లు శిరీష్ మెడకు గాయం
Allu Sirish: టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ గాయపడ్డాడు. అయితే ఆయన గాయపడింది సినిమా షూటింగ్లో కాదు, వర్కవుట్ సమయంలో! ఈ మధ్య శిరీష్ ఫిట్నెస్ మీద బాగా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పటిలాగే వర్కవుట్స్ చేస్తుండగా ఆయన మెడకు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అతడే ఫొటోతో సహా స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. "ఇది ఫ్యాషన్ కోసం పెట్టుకుంది కాదు, స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు నిజంగానే మెడకు దెబ్బ తగిలింది" అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఫొటో షేర్ చేశాడు. ఇందులో శిరీష్ మెడకు పట్టీ కట్టుకుని కనిపిస్తున్నాడు. ఇది చూసిన అభిమానులు అతడికి త్వరగా నయం కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మధ్యే హిందీ పాటతో అలరించిన శిరీష్ ప్రస్తుతం రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్న "ప్రేమ కాదంట" సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా కనిపించనుంది. ఇటీవలే రిలీజైన ఫస్ట్ లుక్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే! -
రెయిన్ బో స్టడీ చేస్తున్న తమన్నా.. రెండే ఆప్షన్లు ఉన్నాయన్న నాని
మనకు రెండే ఆప్షన్లు ఉన్నాయంటున్నాడు హీరో నాని. 1. వ్యాక్సిన్ వేయించుకుని.. క్షేమంగా ఉందాం. 2. మన క్షేమం కోసం వ్యాక్సిన్ వేయించుకుందాం అంటూ టీకా వేయించుకున్న ఫోటోని షేర్ చేశాడు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్‌నీల్ తన ముద్దుల కూతురుకు ముద్దుపెడుతున్న ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు హరివిల్లుని అధ్యయనం చేస్తున్నానంటూ ఓ అందమైన ఫోటోని షేర్ చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పుడూ హ్యాపీ మూడ్‌లోనే ఉండలేమంటూ సీరియస్ లుక్ ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు అల్లువారి అబ్బాయి శిరీష్. View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Nani (@nameisnani) View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Prashanth Neel (@prashanthneel) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
నా మోరల్ సపోర్ట్ నువ్వే తమ్ముడూ.. బన్నీ ఎమోషనల్ ట్వీట్
Allu Arjun : అల్లు వారి చిన్నబ్బాయి, హీరో అల్లు శిరీష్ పుట్టిన రోజు నేడు(మే 30). ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా అల్లు శిరీష్ అన్న, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడూ.. నువ్ నా బిగ్గెస్ట్ మోరల్ సపోర్ట్.. రాబోయే రోజులు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేసిన అల్లు అర్జున్.. తమ్ముడితో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసుకున్నారు. ఇక తన అన్న అల్లు అర్జున్ చేసిన బర్త్‌డే ట్వీట్‌పై శిరీష్ స్పందిస్తూ.. థాంక్యూ AA(అల్లు అర్జున్).. మీలాంటి అన్నయ్య ముందు నేను ఎదగడం నా అదృష్టంగా భావిస్తున్నా. నా ఫ్రెండ్.. నా గైడ్ మీరే’ అంటూ అల్లు శిరీష్ ట్వీట్ చేశారు. Many many happy returns of the day to my sweetest brother who is my biggest moral of support . Wish you a wonderful day and a lovely year to come @AlluSirish 😘 pic.twitter.com/DAUtzDoBiC — Allu Arjun (@alluarjun) May 30, 2021 ఇక పుట్టిన రోజు సందర్భంగా అల్లు శిరీష్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్ స్క్రీన్ షేర్ చేసుకోనుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘ప్రేమ కాదంట’టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రానికి ‘విజేత’, ‘జతకలిసే’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తుండగా.. జీఏ2పిక్చర్స్ బ్యానర్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Thank you AA! I'm so fortunate to have grown around an elder brother like you. My best friend & guide in one person. ❤️❤️❤️ https://t.co/0qwJDVvmjW — Allu Sirish (@AlluSirish) May 30, 2021 -
అల్లు శిరీష్- అను ఇమ్మాన్యుయేల్: Prema కాదంట!
సరైన హిట్టు దొరక్కపోతే హీరోలు కొత్త ట్రాక్ ఎక్కుతారు. లేదంటే ప్రేక్షకుల నాడి తెలుసుకుని వారికి నచ్చేరీతిలో సినిమాలు చేసి మళ్లీ సక్సెస్‌ను రుచి చూస్తుంటారు. తాజాగా తెలుగు హీరో అల్లు శిరీష్ ఒకేసారి ఈ రెండు ఫార్ములాలను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పెద్దగా రొమాన్స్ జోలికి పోని శిరీష్ ఈ సినిమాలో మాత్రం ఓ రేంజ్లో రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది. ఇక ఈ మధ్య ప్రేమ కథాచిత్రాలు బాగా క్లిక్ అవుతుండటంతో పూర్తిగా లవ్ కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ సినిమాలో తన లుక్‌ను కూడా ఇదివరకే రిలీజ్ చేశారు. ఈ మధ్యే సిక్స్‌ప్యాక్‌తో అభిమానులను సర్ప్రైజ్ చేసిన ఈ హీరో తన సినిమాకు సంబంధించి వరుస ప్రీ లుక్‌లు రిలీజ్ చేస్తూ జనాలను ఆకర్షించాడు. నేడు(మే 30) అతడి బర్త్‌డేను పురస్కరించుకుని చిత్రయూనిట్ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు "Prema కాదంట" అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అద్దం ముందు ఫొటోలు దిగుతున్న అను ఇమ్మాన్యుయేల్ మీద హీరో ముద్దుల వర్షం కురిపిస్తున్న ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి 'విజేత', 'జతకలిసే' ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక అను, శిరీష్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరి టైటిల్‌తోనే వీరిది ప్రేమ కాదని చెప్పేసారా? ఏంటి? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ALLU SIRISH: TITLE + FIRST LOOK POSTERS... On #AlluSirish's birthday today, here's the title of #Sirish6 film: #PremaKadanta... The #Telugu film stars #AlluSirish and #AnuEmmanuel... Directed by Rakesh Sashii... #AlluAravind presentation. #Sirish6FirstLook pic.twitter.com/V3isLWWaxW — taran adarsh (@taran_adarsh) May 30, 2021 చదవండి: ప్రీ లుక్‌తోనే షాకిస్తున్న అల్లు శిరీష్.. అస్సలు తగ్గట్లేదుగా -
ప్రీ లుక్‌తోనే షాకిస్తున్న అల్లు శిరీష్.. అస్సలు తగ్గట్లేదుగా
ఇటీవల సిక్స్ ప్యాక్‌తో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్య పరిచిన అల్లు శిరీష్.. ఇప్పుడు తన కొత్త సినిమాకి సంబంధించి ప్రీలుక్లలో షాకిస్తున్నాడు. ఇప్పటికే అద్దం చాటున అను ఇమ్మాన్యుల్కి ముద్దులు ఇస్తున్న పోస్టర్ని విడుదల చేసి రచ్చ చేసిన ఈ యంగ్ హీరో.. తాజాగా మరో రొమాంటిక్ లుక్‌ని వదిలాడు. ఇందులో మరింత రెచ్చిపోయాడు శిరీష్. ఈ లేటెస్ట్ నయా ప్రీ లుక్ వైరల్ అయింది. మే 30న(శిరీష్ బర్త్‌డే)న ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు ప్రీలుక్ ద్వారా తెలియజేసింది. ఇప్పటి వరకు రొమాన్స్ జోలికి పెద్దగా వెళ్లని శిరీష్.. ఈ సినిమాలో రెచ్చిపోయినట్లు ప్రీ లుక్ పోస్టర్లు చూస్తే అర్థమవుతంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 'విజేత', 'జతకలిసే' ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శిరీష్ సిక్స్ ప్యాక్‌తో కనిపించబోతున్నట్లు సమాచారం. Here's our second prelook. Excited to share the title & first look our film tomorrow at 11am. #sirish6 @GA2Official @ItsAnuEmmanuel #rakeshsashii pic.twitter.com/7nKTuiyJNJ — Allu Sirish (@AlluSirish) May 29, 2021 చదవండి: సిగరెట్ కాలుస్తూ హీరో నిఖిల్.. మహానటి జ్ఞాపకాలు.. ఆ తర్వాతే ఊపిరి పీల్చుకున్న: కీర్తి -
అద్దం చాటున శిరీష్ ముద్దులు.. రొమాంటిక్ లుక్ రిలీజ్
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుల్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. మే 30న(శిరీష్ బర్త్‌డే)న ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు ప్రీలుక్ ద్వారా తెలియజేసింది. ఇందులో శిరీష్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌ను అద్దం చాటున ముద్దు పెడుతున్నట్లు ఉంది. ఇప్పటి వరకు రొమాన్స్ జోలికి పెద్దగా వెళ్లని శిరీష్.. తాజా చిత్రంలో లిప్ లాక్ ఇచ్చినట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 'విజేత', 'జతకలిసే' ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శిరీష్ సిక్స్ ప్యాక్‌తో కనిపించబోతున్నట్లు సమాచారం. Here’s a movie that gives a refreshing perspective to love and relationship. Presenting the Pre Look of @AlluSirish & @ItsAnuEmmanuel's #Sirish6 💞#Sirish6FirstLook 👉🏻 May 30th at 11 am! ✅ Advance Birthday Wishes to #AlluSirish 🥳#AlluAravind @GA2Official pic.twitter.com/18CIGvgeW6 — Geetha Arts (@GeethaArts) May 27, 2021 -
హీరోయిన్‌కు అల్లు శిరీష్ స్పెషల్ గిఫ్ట్, స్పెషలేంటో?
అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ 2013లో ఇండస్ర్టీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి రూమర్స్ లేవు. అయితే గత కొంతకాలంగా హీరోయిన్ అను ఇమాన్యుయేల్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ సెట్లోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరేస్తూ ఇద్దరూ కలిసి కాఫీ షాపులు, పార్టీలు అంటూ కెమెరాలకు చిక్కుతున్నారు. అమ్మాయిలంటేనే ఆమడ దూరంలో ఉండే శిరీష్..ఇమాన్యుయేల్‌తో ఇంత క్లోజ్‌గా మూవ్ అవ్వడంతో వీరి మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ ఉందంటూ ప్రచారం సాగుతోంది. ఇక ఇటీవలె అను ఇమాన్యుయేల్ బర్త్‌డే సందర్భంగా అల్లు శిరీష్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. హ్యాపీ బర్త్‌డే సైకో అంటూ అల్లు శిరీష్ స్పెషల్ విషెస్ చెప్పారు. ఇప్పడు మరోసారి వీరిద్దరి టాపిక్ హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ప్రయసిగా ప్రచారంలో ఉన్న అను ఇమాన్యుయేల్‌కు అల్లు శిరీష్ ప్రత్యేకంగా గిఫ్ట్ పంపారు. ప్రెట్టీ లిటిల్ సైకో అంటూ టీషర్ట్‌పై ప్రింట్ చేయించి అను ఇమాన్యుయేల్‌కు పంపాడు. దీనిపై స్పందించిన ఈ భామ..సైకో అని ఉన్నా దీన్ని క్లాంపిమెంట్గానే తీసుకుంటానని చెబుతూ అల్లు శిరీష్‌ని వియర్డో అంటూ సంభాషించింది. దీన్ని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన శిరీష్..వియర్డోనా...మనలో చాలా కామన్ విషయాలు ఉన్నాయి అంటూ స్వీట్‌గా ఈ భామపై సెటైర్ వేశారు. అంతేకాకుండా ఎనీవే యూ ఆర్ వెల్కమ్ మై ఫేవరేట్.. అంటూ షేర్ చేశారు. ప్రస్తుతం అల్లు శిరీష్-అను ఇమాన్యుయేల్ మధ్య జరిగిన ఈ చాట్ సోషల్ మీడియాలో హల్చల్గా మారింది. శిరీష్ తన పోస్టులో మై ఫేవరెట్...అంటూ గ్యాప్ ఇవ్వడంతో వీరి మధ్య ఏదో ఉందని, అందుకే ఇంత క్లోజ్‌గా నిక్ నేమ్స్ కూడా పెట్టుకున్నారని నెట్టింట ప్రచారం సాగుతోంది. అయితే ఈ రూమర్స్‌పై ఇప్పటిదాకా శిరీష్ స్పందించలేదు. చదవండి: కొన్నాళ్లుగా హీరోయిన్‌తో రిలేషన్షిప్లో ఉన్న అల్లు శిరీష్! తమ్ముడికి కంగ్రాట్స్ చెప్పిన అల్లు అర్జున్.. కారణం ఇదే -
నేను హ్యాంగ్ అవుట్ అయ్యేది అక్కడే : అల్లు శిరీష్
అల్లు శిరీష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటారు. రీసెంట్గా ఆయన తొలిసారి బాలీవుడ్లో నటించిన ఓ మ్యూజిక్ ఆల్భమ్ 100 మిలియన్ క్లబ్‌లోకి చేరిన సంగతి తెలిసిందే. 'విలయాటి షరాబి' అంటూ సాగిన ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఇక తాజాగా తనకెంతో ఇష్టమైన ప్లేస్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. కాఫీ షాప్స్, బుక్ స్టోర్స్ తర్వాత తాను అంతగా హ్యాంగ్ అవుట్ అయ్యే ప్రదేశం ఇదేనంటూ ఓ ఫోటోను పంచుకున్నారు. ఇది మరక్కడో కాదు..స్వయంగా వాళ్లింటిలోని గార్డెన్ ఏరియా. ఈ ప్లేస్‌లో తాను చిల్ అవుతానంటూ ఫోటోను షేర్ చేసుకున్నాడు. ఇక ఇంట్లో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో తాను కూడా టెస్టులు చేయించుకున్నానని, అయితే రెండుసార్లు తనకు నెగిటివ వచ్చిందని పేర్కొన్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే..అల్లు శిరీష్ నటించిన చివరి మూవీ ఏబీసీడీ. ఈ చిత్రం అనంతరం అను ఇమాన్యుయేల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ అను ఇమాన్యుయేల్‌తో శిరీష్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై శిరీష్ ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. చదవండి: హీరోయిన్‌తో అల్లు శిరీష్ డేటింగ్ ? ఫోటోలు వైరల్ తమ్ముడికి కంగ్రాట్స్ చెప్పిన అల్లు అర్జున్.. కారణం ఇదే -
తమ్ముడికి కంగ్రాట్స్ చెప్పిన అల్లు అర్జున్.. కారణం ఇదే
అల్లు శిరీష్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన తొలిసారి బాలీవుడ్లో నటించిన ‘విలయాటి షరాబి’ మ్యూజిక్ ఆల్భమ్ 100 మిలియన్ క్లబ్‌లోకి చేరిపోయింది. గతనెల చివర్లో యూట్యూబ్‌లో విడుదలైన ఈ స్పెషల్ వీడియో సాంగ్ ఇంటర్నెట్కు షేక్ చేసింది. అల్లు శిరీష్, హెలి దరువాలా జంటగా చేసిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది.దీంతో రిలీజ్ అయిన తక్కువ కాలంలోనే వీడియోకు 100 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సందర్భంగా తమ్ముడు సక్సెస్‌పై అల్లు అర్జున్ ఆనందం వ్యక్తం చేశారు. 'బిగ్ కంగ్రాట్ శిరీష్. నీ పాట వంద మిలియన్ వ్యూస్‌ని సాధించినందుకు గర్వంగా ఉంది' అంటూ అభినందించారు. ఇక ఊహించని ఈ సర్ ప్రైజ్‌కి అల్లు శిరీష్ సైతం ఆనందంలో మునిగితేలుతున్నాడు. ఈ పాట ఇంత సక్సెస్ అవుతుందని ఊహించలేదని, ఈ సాంగ్ కోసం కష్టపడ్డ ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) చదవండి : హీరోయిన్‌తో అల్లు శిరీష్ డేటింగ్ ? ఫోటోలు వైరల్ అల్లు స్నేహారెడ్డి ఐడియాకి సమంత ఫిదా -
హీరోయిన్‌తో అల్లు శిరీష్ డేటింగ్ ? ఫోటోలు వైరల్
ఇండస్ర్టీలో హీరోయిన్లతో ప్రేమ విషయానికి వస్తే కొందరు హీరోలు గుర్తొస్తారు. కొన్నాళ్ల పాటు వారి లవ్ స్టోరీ ఇండస్ర్టీ మొత్తం హాట్ టాపిక్ అవుతోంది. ఇంకొందరేమో అమ్మాయిలంటేనే చాలా దూరంగా ఉంటారు. ఈ కోవలోకే వస్తారు టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్. 2013లో ఇండస్ర్టీలోకి ఇచ్చిన ఈయనపై ఇప్పటి వరకు ఎలాంటి రూమర్స్ లేవు. అయితే తాజాగా శిరీష్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌తో ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి.. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాల్లో నటించింది ఈ భామ.. ఇప్పుడు అల్లు శిరీష్‌తో ప్రేమలో ఉందని ఇండస్ట్రీలో వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి కొంతకాలంగా వీరి మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. లేటెస్ట్గా అల్లు శిరీష్ షేర్ చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. రెండు రోజుల క్రితం మార్చి28న నటి అను ఇమ్మాన్యుయేల్ పుట్టినరోజు కావడంతో అల్లు సిరిష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. లేట్‌గా విషెస్ చెబుతున్నానని నాకు తెలుసు..కానీ ఈ వీడియోతో రావడానికి లేట్ అయ్యింది. హ్యాపీ బర్త్‌డే సైకో అంటూ శిరీష్ విషెస్ చెప్పారు.ఎప్పుడూ సినిమాలు లేదా ఫిట్‌నెస్‌పై మాత్రమే దృష్టి పెట్టే శిరీష్..కొన్నాళ్లుగా అను ఇమ్మాన్యుయేల్‌తో డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా త్వరలోనే వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించనున్నారని కూడా తెలుస్తుంది.ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తున్న మహా సముద్రం సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా, శిరీష్ ఓ సినిమాకు సైన్ చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) చదవండి : వకీల్‌సాబ్ ట్రైలర్ లాంచ్.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ దర్శకుడితో ప్రేమలో ప్రముఖ హీరోయిన్! -
బాలీవుడ్ పాటకి.. అల్లు శిరీష్ ఆట.. ఇదో రికార్డు
సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. సొంతంగా ఎదిగేందుకే ప్రయత్నిస్తున్నాడు యంగ్ హీరో అల్లు శిరీష్. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. అవార్డు ఫంక్షన్లకు తనదైన శైలీలో హోస్టింగ్ చేసి లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఒక నటుడిగా ప్రేక్షకులకు వినోదం అందించడానికి ఎన్ని విధాలుగా ప్రయోగాలు చేయాలో అన్నీ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఆల్బమ్‌లో నటించి మరో రికార్డు క్రియేట్ చేశాడు. ‘విలయాటి షరాబి’ అంటూ సాగుతున్న పాటలో హేలీతో కలిసి ఆడిపాడారు. దర్శన్ రావల్, నీతి మోహన్ ఆలపించిన ఈ గీతానికి కుమ్మార్ లిరిక్స్ అందించారు. లిజో జార్జ్-డీజే స్వరాలు సమకూర్చారు. ఆ సాంగ్‌ను ట్విటర్లో షేర్ చేసిన శిరీష్ ‘ఆనందకరమైన పార్టీ సాంగ్ విడుదలైంది. కచ్చితంగా హోళీ పార్టీలో మీరంతా ఈ సాంగ్‌కు చిందేస్తారు. ఈ మ్యూజిక్ వీడియోలో భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నా’అంటూ రాసుకొచ్చారు. బాలీవుడ్ ఆల్బమ్ చేసిన తొలి దక్షిణాది హీరోగా గుర్తింపు సంపాదించాడు. -
బర్త్‌డే పార్టీలో అల్లు అర్జున్ హంగామా
చావు కబురు చల్లగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత శరత్ చంద్ర నాయుడు బర్త్‌డే వేడుకల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తళుక్కున మెరిశాడు. సోమవారం అతడి పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు హాజరైన బన్నీ దగ్గరుండి కేక్ కట్ చేయించాడు. అనంతరం అతడికి ఆప్యాయంగా కేక్ తినిపించాడు. ఈ పార్టీలో నిర్మాత అల్లు అరవింద్, అల్లు శిరీష్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ గింగిరాలు తిరుగుతున్నాయి. ఇందులో బన్నీ లుక్ సరికొత్తగా ఉండటంతో 'అన్న మళ్లీ లుక్ మార్చాడురోయ్..' అంటూ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. 'స్టైల్ నీ డీఎన్ఏలోనే ఉంది', 'స్టైలిష్ స్టార్లు ఊరికే అయిపోరు మరి..' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా శరత్ చంద్ర.. బన్నీకి కుడి భుజంలా ఉంటూ అతడి వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. ఇదే విషయాన్ని బన్నీ 'చావు కబురు చల్లగా' ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ ప్రస్తావిస్తూ అతడిపై ప్రశంసలు కురిపించాడు. తనకన్నీ శరతే అని, అతడు తన ఫ్యామిలీ మెంబర్ అని పేర్కొన్నాడు. చదవండి: ఏం సక్కగున్నావ్రో.. అందరి కళ్లు బన్నీ పైనే! అల్లు అర్జున్ను కలిసి ‘కేజీఎఫ్’ డైరెక్టర్.. ఫొటో వైరల్ -
మెగా ఫ్యామిలిలో మళ్లీ పెళ్లి బాజాలు..
మెగా బ్రదర్ నాగాబాబు ముద్దుల కుమార్తె నిహారిక వివాహం ఇటీవల వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 9న ఉదయ్‌పూర్ వేదికగా జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక ఏడడుగులు వేశారు. ఇక మెగా కుటుంబంలో పెళ్లి సందడి జరిగి వారం తిరగకముందే మరో శుభవార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. మెగా ఫ్యామిలిలో త్వరలోనే మళ్లీ పెళ్లి బాజాలు మోగనునట్లు దీని సారాంశం. పెళ్లి విషయంలో అయితే చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ ముందు వరుసలో ఉన్నారు. వీరిలో సాయి ధరమ్ పెళ్లి ఖాయం అయ్యిందని అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఈ హీరో కుండబద్దలు కొట్టాడు. అంతేగాక పెళ్లి చేసుకోవడం కంటే సోలోగా ఉంటేనే తనకు సంతోషంగా ఉంటుందన్నారు. చదవండి: ఐమ్యాక్స్‌లో మెగా హీరో దీంతో ఈ పెళ్లి వార్త ప్రస్తుతం అల్లు శిరీష్పైకి మళ్లింది. త్వరలోనే శిరీష్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మెగా హీరో సాయిధరమ్ తేజ్ వెల్లడించారు. తను నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ప్రమోషన్లో ఇటీవల తేజ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘శిరీష్ నాకంటే పెద్దవాడు. వచ్చే ఏడాది తన పెళ్లి జరగవచ్చు. నేను పెళ్లి చేసుకునేందుకు ఇంకా సమయం ఉంది. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిని పెళ్లికి ముందే పూర్తి చేయాలి’. అని తెలిపారు. ఇక ఈ వార్త తెలియగానే మెగా అభిమానులు సంబరంలో మునిగితేలుతున్నారు. త్వరలోనే ఇటు అల్లు ఫ్యామిలీతోపాటు కొణిదెల కుటుంబంలో మరో పెద్ద పండగ రాబోతుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: పెళ్లెప్పుడు బాబాయ్ : అల్లు అయాన్ -
‘సూర్యగ్రహణం అప్పుడు సరిగా ప్రార్థించకపోతే’
హీరో అల్లు శిరీష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమాల గురించే కాకుండా.. ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను కూడా ఆయన ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇంట్లో జెంగా ఆడుతున్న ఓ చిన్న వీడియోను శిరీష్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే ఆటలో భాగంగా శిరీష్ చెక్క ముక్కను బయటకు తీస్తున్న సమయంలో టవర్ కూలిపోయింది. దీంతో అతను ఓటమి చెందాడు. ఈ ఫన్నీ వీడియోను షేర్ చేసిన శిరీష్.. సూర్య గ్రహణం సమయంలో సరిగా ప్రార్థించకపోతే ఇలానే జరుగుతోంది అని పేర్కొన్నారు.(చదవండి : ఫ్యాక్ట్ : నయన్-విఘ్నేశ్‌లకు కరోనా సోకిందా?) ఇక, జెంగా ఆట విషయానికి వస్తే ఇందులో.. ముందుగా చెక్క ముక్కలను టవర్ మాదిరిగా పేర్చుతారు. ఈ ఆటను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆడతారు. ఈ ఆటలో పాల్గొనవారు టవర్ కూలిపోకుండా.. వంతుల వారీగా మధ్యలో ఉన్న ఒక్కో చెక్కముక్కను బయటకు తీసి పైభాగంలో పెట్టాలి. అయితే ఎవరు చెక్క ముక్క బయటకు తీసేటప్పుడు టవర్ కూలిపోతుందో వాళ్లు ఓటమి చెందినట్టు. అంతకుముందు ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి అల్లు అరవింద్‌కు శిరీష్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నేడు తన తల్లి నిర్మల పుట్టిరోజు సందర్భంగా విషెస్ చెప్పారు. View this post on Instagram This is what happens if you don't pray properly during the surya grahan 😂😂😂 #jenga #weekendvibes A post shared by Allu Sirish (@allusirish) on Jun 21, 2020 at 7:14am PDT -
పెళ్లెప్పుడు బాబాయ్ : అల్లు అయాన్
సాక్షి, హైదరాబాద్ : షూటింగ్‌లతో ఎప్పుడూ బిజీగా ఉండే మన సినీ తారలు లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. అనుకోకుండా వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో విలువైన సమయం గడుపుతున్నారు. కొందరు కొత్త నైపుణ్యాలపై దృష్టి పెట్టారు. మరికొందరేమో ఇష్టమైన పనులు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రం ఫ్యాన్స్‌కు చేరువగానే ఉంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌లు తమ పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. తమ పిల్లలతో కలిసి చేసిన ఫన్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. (చదవండి : హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం) తాజాగా అల్లు అర్జున్ సతీమని స్నేహారెడ్డి, అయాన్, అల్లు అర్జున్‌కి సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో అల్లు అయాన్ తన బాబాయ్ శిరీష్ పెళ్లి గురించి ఆపిల్ శిరిని అడగటంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇందులో అల్లు అర్జున్ తనయుడు అయాన్ తన తండ్రి పెట్టుకున్న యాపిల్ వాచ్‌తో సంభాషిస్తూ..మీ పేరేమిటి అని అడుగుతాడు. అవతల నుంచి సిరి అని సమాధానం వస్తుంది. నువ్వు మా బాబాయ్‌వా అని ప్రశ్నించగా.. మీరేం అడుగుతున్నారో అర్థం కావడం లేదు అని అవతల నుంచి సమాధానం వచ్చింది. బాబాయ్ అంటే అంకుల్ అని, మీ పెళ్లెప్పుడు అని యాపిల్ సిరిని అడుగుతాడు. ఈ వీడియోకి ‘ఆపిల్ శిరీ మరియు అల్లు శిరీ దగ్గర ఆన్సర్ లేదు’అంటూ కామెంట్ పెడుతూ.. స్నేహారెడ్డి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయాన్.. తన బాబాయ్ అనుకొని జరిపిన సంభాషణ నెటిజన్స్‌తో పాటు బన్నీ ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. (చదవండి : శింబు పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రాజేందర్) -
బాబాయ్‌తో కలిసి చిందులు..
హైదరాబాద్ : హీరో అల్లు శిరీష్.. తన సోదరుల పిల్లలతో కలిసి సందడి చేశారు. అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హ, అల్లు వెంకట్ కుమార్తె అన్వితలతో కలిసి ఓ సాంగ్‌కు చిందేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బన్నీ భార్య స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ఫన్ విత్ శిరి బాబాయ్’ అని పేర్కొన్నారు. ఈ వీడియోలో అన్విత, అయాన్లు తమకు తోచిన స్టేప్పులు వేశారు. అర్హ మాత్రం పక్కన ఉన్న అయాన్, వెనకాల ఉన్న శిరీష్ ఏం చేస్తున్నారో చూసుకుంటూ.. చాలా క్యూట్ క్యూట్ స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్నేహారెడ్డి షేర్ చేసిన ఈ వీడియోపై శిరీష స్పందిస్తూ.. ‘2020లో అంకుల్ విధుల్ ఇవ్వే.. అందులో పిల్లలతో టిక్‌టాక్‌లు చేయించడం కూడా ఉంది’ అని పేర్కొన్నారు. ఇక, సినిమాల విషయానికి వస్తే.. శిరీష్ నటించిన చివరి చిత్రం ఏబీసీడీ విడుదలై నేటికి(మే 17) ఏడాది పూర్తి అయింది. అయితే ఇప్పటివరకు శిరీష్ తన తదుపరి చిత్రానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. (చదవండి : బుట్టబొమ్మకు పెదవి కలిపిన బుట్టబొమ్మ) View this post on Instagram Fun with Siri Babai ❤️ A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on May 16, 2020 at 2:47am PDT -
అల్లు శిరీష్‌తో.. అనూ ఇమ్మాన్యుయేల్..!
‘శైలజారెడ్డి అల్లుడు (2018)’ తర్వాత తెలుగులో కాస్త స్లో అయినట్లున్నారు హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్. మళ్లీ స్పీడ్‌ను అందుకోవాలనే ఆలోచనతో తాజాగా ఓ తెలుగు సినిమాకు అను సైన్ చేశారట. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్ హీరోగా పరిచయమైన ‘విజేత’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రాకేశ్ శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో అను హీరోయిన్గా నటించబోతున్నారని సమాచారం. ఇందులో అల్లు శిరీష్ హీరోగా నటిస్తారట. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారట శశి. -
చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది : శిరీష్
సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు ఫేక్ పోస్టులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం కూడా కష్టతరంగా మారింది. తమపై జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి పలువురు సెలబ్రిటీలు పోలీసులను ఆశ్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఓ ఫేక్ పోస్టుపై హీరో అల్లు శీరిష్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఓ నెటిజన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన శిరీష్.. నకిలీ స్ర్కీన్షాట్లు పోస్ట్ చేసి.. తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు. అయితే శిరీష్ స్పందించిన వెంటనే.. సదరు నెటిజన్ ఆ పోస్ట్‌ను తొలగించాడు. నాలుగేళ్ల తర్వాత.. మరో ట్వీట్లో అల.. వైకుంఠపురములో మ్యూజిక్ నైట్‌కు తను హాజరవుతున్నట్టు చెప్పారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత తన సోదరుడి చిత్రానికి సంబంధించిన ఈవెంట్‌కు హాజరవుతున్నట్టు తెలిపారు. 2016 సరైనోడు ఆడియో ఫంక్షన్‌కు హాజరయ్యానని గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి హాజరు అవుతుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా, గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్.. పలు చిత్రాల్లో మెప్పించారు. గతేడాది ఏబీసీడీ చిత్రంతో శిరీష్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పలు అవార్డు ఫంక్షన్లకు ఆయన హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. Please dont post fake screenshots and create such negativity. I'll be compelled to take legal action for doing such mischief. — Allu Sirish (@AlluSirish) January 6, 2020 -
స్నేహని పెళ్లి చేసుకుంటానని బన్నీ అన్నప్పుడు...
ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఇండస్ట్రీ అల్లు అరవింద్! ఇప్పటికీ బిజీ! కూర్చోడానికి కూడా ఖాళీ ఉండదు. అంత ఖాళీ లేనప్పుడు ఇప్పుడెలా కూర్చున్నారు?! ఇంత దగ్గరగా! ఇంత లవ్లీగా! ఇంత ప్లెజెంట్‌గా! ఇదంతా ఆయన బెటర్ హాఫ్ నిర్మల ఆయనకు ఇచ్చిన స్పేస్! స్పేస్ చేసుకోవడం కాదు.. స్పేస్ ఇచ్చుకోవడం ఉంటే.. ఆ దాంపత్యం ఎప్పటికీ స్వీట్ అండ్ స్ట్రాంగ్ అంటున్నారు.. మిస్టర్ అండ్ మిసెస్ అల్లు అరవింద్. మీ పెళ్లి బంధం ‘అల్లుకున్న’ రోజుల గురించి? అరవింద్: (నవ్వుతూ)... మా నాన్నగారు, నిర్మల పెదనాన్న ఫ్రెండ్స్. ‘మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మావాడు పల్లెటూరి అమ్మాయిని చేసుకోనంటున్నాడు. మినిమమ్ విజయవాడ అమ్మాయి అంటున్నాడు. చూడండి’ అని ఆయనతో మా నాన్నగారు అంటే, ‘మా తమ్ముడు కూతురు పెళ్లీడుకొచ్చింది. వాళ్లతో మాట్లాడతాను’ అన్నారాయన. ఆ తర్వాత నాన్నగారు వెళ్లి చూసొచ్చి, ‘అమ్మాయి బాగుంది. నాకు నచ్చింది’ అని చెప్పేశారు. నేను చూడ్డానికి వెళ్లాక పెద్దగా ఇంటర్వ్యూలు లేవు. అమ్మాయిని చూపించారు. అంతే.. తాంబూలాలు మార్చుకున్నారు. పెళ్లిచూపులకి, పెళ్లికి మధ్య గ్యాప్ ఎంత? అరవింద్: 1974లో మా పెళ్లి జరిగింది. పెళ్లి చూపులకి, పెళ్లికి మధ్య ఐదు నెలలు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌లో ఓసారి కాఫీకి తీసుకెళదామని ట్రై చేశాను. ‘మా అమ్మను అడగండి’ అంది. ‘నువ్వు అడుగు. వాళ్లు పంపిస్తే వెళదాం’ అన్నాను. ఊహూ అంది. యాక్చువల్‌గా మా అత్తగారు పాతకాలం మనిషిలా ఉండరు. అప్పట్లో మా అత్తగారిని మ్యానేజ్ చేసుకుని ఉంటే, ఈవిడని కాఫీకి తీసుకెళ్లగలిగేవాడిని. ముందు అది తెలియలేదు. ఆ తర్వాత మా అత్తగారు పాతకాలపు మనిషి కాదని తెలిసింది. మీకు ముగ్గురు సిస్టర్స్. మీ పెళ్లయ్యేనాటికే వాళ్ల పెళ్లయిందా? అరవింద్: నా చెల్లి వసంత పెళ్లి, మా పెళ్లి ఒక్క రోజు తేడాలో జరిగింది. ఏప్రిల్ 7న మా పెళ్లి. 8న ఇద్దరి రిసెప్షన్ ఒకే రోజు జరిగింది. మరి.. పెళ్లయ్యాక కాఫీకి వెళ్లారా? నిర్మల: వెళ్లాం. మా రిసెప్షన్ మదరాసులో జరిగింది. ఆ వేడుక కోసం మా అమ్మానాన్న వచ్చారు. వాళ్లని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్‌కి వెళ్లాం. ఇంటికి వచ్చేటప్పుడు భుహారీ హోటల్లో కాఫీ తాగాం. అప్పట్లో అది పెద్ద హోటల్. అరవింద్‌గారిలో మీకు నచ్చిన లక్షణాలు? నిర్మల: దేన్నీ సీరియస్‌గా తీసుకోరు. కూల్‌గా ఉంటారు. అది బాగా నచ్చుతుంది. అయితే మా పెళ్లయిన కొత్తలో ‘ఏంటీ.. ఏం చెప్పినా సీరియస్‌గా తీసుకోరు’ అనుకునేదాన్ని. అరవింద్: మామూలుగా భర్త అంటే కొంచెం సీరియస్‌గా అలా ఉంటారు కదా. నేనలా ఉండకపోయేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఇంత లైట్‌గా ఉన్నారేంటి అనుకుంది. అయితే కొన్ని సందర్భాల్లో నా కోపం చూసి, ఓహో కోపం కూడా వస్తుందనుకుంది. మీ కుటుంబానికి సినిమా పరిశ్రమతో సంబంధం లేదు కదా.. మరి ‘అల్లువారింట్లో’ అడ్జస్ట్ కావడానికి ఇబ్బందిపడ్డారా? నిర్మల: మా నాన్నగారిది ఆయిల్ బిజినెస్. సినిమాలతో సంబంధం లేదు. దాంతో పూర్తిగా వేరే కల్చర్‌లోకి వచ్చినట్లు అనిపించింది. మాది బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి ఇంట్లో చాలామంది పనివాళ్లు ఉండేవారు. నాన్న బిజినెస్ వ్యవహారాలు చూసుకునేదాన్ని. అంత లిబరల్గా పెంచారు. నన్ను క్వీన్లానే చూసుకున్నారు. మరి అత్తింట్లో కూడా క్వీన్లానే ఉన్నారా? నిర్మల: అరవింద్‌గారు, ఇంకా అందరూ అలానే చూసుకుంటారు (నవ్వుతూ). అరవింద్: అయితే తనకు కుటుంబ బాధ్యతలు ఎక్కువ. ఇంటికి పెద్ద కోడలిగా అన్నీ చూసుకుంది. పెళ్లికి ముందు ఉన్నంత లిబరల్గా అయితే లేదు. జాయింట్ ఫ్యామిలీనే కదా? నిర్మల: అవును. మా పెళ్లితో పాటు ఒక ఆడపడుచుకి పెళ్లయింది. తను కూడా కొన్నాళ్లు మాతోనే ఉంది. ఈయన అక్కగారు పెళ్లి చేసుకోలేదు. అప్పటికి సురేఖ (చిరంజీవి సతీమణి)గారికి కూడా పెళ్లి కాలేదు. సురేఖగారిది, నాదీ ఇంచు మించు ఒకే ఏజ్ కావడంతో బాగా కలిసిపోయేవాళ్లం. మా పుట్టింట్లో మా మేనత్తలతో కలిసి పెరిగాను. అలా ఉమ్మడి కుటుంబం నాకు అలవాటే. దాంతో ఇబ్బందిగా అనిపించలేదు. అరవింద్: తనకి మనుషులంటే ఇష్టం. చిరంజీవిగారు, సురేఖగారి పెళ్లి మీ చేతుల మీద జరిగిందనుకోవచ్చా? అరవింద్: అవును... దగ్గరుండి తనే బాధ్యతగా చేసింది. స్క్రీన్‌పై మీ మావయ్య (అల్లు రామలింగయ్య) గారు కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు. నటుడిగా అంత జోవియల్‌గా కనిపించిన ఆయన మీతో ఎలా ఉండేవారు? అరవింద్: ఈవిడకి ఆయన వెరీ గుడ్ ఫ్రెండ్. నిర్మల: అవును. మావయ్యగారు వెరీ ఫ్రెండ్లీ. అరవింద్: ఆయనకు భోజనం పెట్టడం అన్నీ చేసేది. వయసు పైబడిన తర్వాత నాన్నకు ఆరోగ్యం సహకరించకపోతే భోజనం తినిపించేది. మామాకోడలు అంత బాగుండేవాళ్లు. నిర్మల: నన్ను కూతుళ్లతో సమానంగా చూశారు. ఎప్పుడూ నన్ను పేరుతో పిలవలేదు. ‘అమ్మాయి’ అనే పిలిచేవారు. ఆయన షూటింగ్ నుంచి ఇంటికొచ్చాక వీళ్లెవరూ దొరికేవారు కాదు. దాంతో ఏదైనా చెప్పాలనుకుంటే నాతోనే షేర్ చేసుకునేవారు. అరవింద్: నాపై చాడీలు కూడా చెప్పేవారు. ‘ఆ వెధవ...’ అంటూ నన్ను తిట్టేవారు. మా కాపురంలో పుల్లలు పెట్టేవారు కూడా (నవ్వులు). నిర్మల: అవును.. ‘చూడమ్మాయి.. వాడు లేట్‌గా వస్తున్నాడంటే పని ఉందని కాదు.. నువ్వు జాగ్రత్తగా ఉండాలి’ అనేవారు. అరవింద్: ఎలా చెప్పేవారంటే.. ‘అమ్మాయి.. వాడు పది తర్వాత ఇంటికి వచ్చాడు. అంత పనేం లేదు. ఓ కంట కనిపెట్టు’ అనేవారు. అవి విన్నప్పుడు మీకు భయం అనిపించేదా? నిర్మల: అలా ఏం లేదు. మావయ్యగారు అలా అన్నారని ఆయనతో చెప్పేదాన్ని. ఇద్దరం నవ్వుకునేవాళ్లం. అరవింద్: నాన్నతో ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు చాలా గౌరవం కూడా ఇచ్చేది. అంతెందుకు? ఇప్పటికీ మా అమ్మ అలా హాల్లోకి వస్తే టక్కున లేచి నిలబడుతుంది. నిర్మల: ఆ రోజుల్లో అత్తగారు అంటే.. అలానే గౌరవించేవాళ్లు. ఆరోగ్యం సహకరించినంత వరకూ అత్తయ్యగారే అన్నీ చూసుకున్నారు. వంట చేసేటప్పుడు మాత్రం ఏం చేయాలని మాట్లాడుకుని చేసేవాళ్లం. నేను నాన్‌వెజ్ పెద్దగా తిననని నా కోసం వేరే చేసేవారు. నాకు వేడిగా తినడం అలవాటు. అందుకని అందరి కోసం వెయిట్ చేయకుండా తినమనేవారు. దాంతో నాకు అమ్మ ఇంటికి, అత్తింటికి తేడా తెలియలేదు. అత్తగారిని చూడగానే లేచి నిలబడే జనరేషన్ నుంచి వచ్చారు. మారిన కాలంలో ఇప్పటి కోడళ్లు అలా చేయకపోవచ్చు. ఈ మార్పు? నిర్మల: ఆ రోజుల్లో అలా ఒక అలవాటు ఉండేది. అత్తయ్యగారు అని కాదు. అప్పట్లో పెద్దవాళ్లు ఎవరు వచ్చినా లేచి నిలబడటం అనేది ఒక పద్ధతి. అప్పట్లో ఆడవాళ్లు పెద్దగా బయటకు వెళ్లడం ఉండేది కాదు. ఇప్పుడు ఆడవాళ్లు బయటకు వెళుతున్నారు. నిరూపించుకుంటున్నారు. ఇప్పటి కోడళ్ల అలవాట్లు ఇప్పటి కాలానికి కరెక్ట్. అరవింద్: మీకో విషయం చెప్పనా.. మా ఆవిడని ‘ఉత్తమ అత్తగారు’ అని మా కోడళ్లే చెబుతారు. అందుకే ఇంకా ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నాం. అత్తాకోడళ్లు ఫ్రెండ్లీగా ఉంటారు. మా కోడళ్లు మా ఆవిడని ‘నో నాన్సెన్స్’ అత్తగారు అని అంటారు (నవ్వుతూ). ఉమ్మడి కుటుంబంలో గొడవలు లేకుండా ఉండాలంటే ఏదైనా టిప్స్? నిర్మల: నేను ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉంటాను. కాలంతో పాటు మనం కూడా మారాలి. ఫలానా విషయం గురించి బన్నీకి చెప్పకపోయావా అమ్మా? అంటే బన్నీ గురించి మీకు తెలుసు కదా అత్తయ్యా అంటుంది. అరవింద్: వారి జీవితాలను ఓవర్‌ల్యాప్ చేయం. ఎవరి స్పేస్ వారికి ఇస్తాం. బాబీ, బన్నీ, శిరీష్.. ఈ ముగ్గురి మనవళ్లను చూసుకుని అల్లు రామలింగయ్యగారు మురిసిపోయిన విశేషాల గురించి? అరవింద్: పిల్లలతో బాగా ఆడుకునేవారు. మా పెద్దబ్బాయి బాబీ మీద ఒకసారి ఆయనకు ఎందుకో కోపం వచ్చింది. కర్ర తీసుకుని, వాడిని కొట్టడానికి ముందుకొస్తే, బాబీ పరిగెత్తాడు. కొంచెం పరిగెత్తాక ‘రేయ్.. ఆయాసం వస్తోంది. వచ్చి ఒక దెబ్బ తిని వెళ్లు’ అంటే, వాడు దగ్గరకొచ్చి ఒక్క దెబ్బ తిని వెళ్లాడు (నవ్వుతూ). అరవింద్‌గారు 45 ఏళ్ల వయసులో తన తండ్రితో చెంప దెబ్బ తిన్నారు. ఆ విషయాన్ని గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. ఆ చెంప దెబ్బ విషయం మీకు తెలుసా? అరవింద్: కారు ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకుంటూ, ఇంటికి రాగానే బ్రేక్ స్పీడ్‌గా వేశాను. నాన్నగారు విండ్ షీల్డ్‌కి కొట్టుకోబోయారు. ఆ కోపంతో నా చెంప మీద ఒక్కటిచ్చారు. మా ఆవిడ చూసేసిందేమోనని కంగారుపడ్డాను కానీ చూడలేదు. ఈ వయసులో కూడా నాన్నతో తన్నులు తిన్నాడనుకుంటుందేమోనని కంగారు. లోపలికెళ్లి నాన్న కొట్టిన విషయం చెప్పి, అమ్మ దగ్గర గొడవపడదామనుకున్నాను. కానీ అమ్మతో చెప్పేటప్పుడు తను వింటుందేమోనని మ్యాటర్‌ని సైలెంట్ చేసేశాను. కట్ చేస్తే.. బెడ్రూమ్లోకి వెళ్లగానే ఎందుకండీ మావయ్యగారు అలా కొట్టారు అంది. అబ్బా... తెలిసిపోయిందనుకున్నాను. తను వరండాలో నిలబడి చూసిందట. నాన్న నన్ను అలా కొట్టగానే భయపడి లోపలికి పారిపోయింది. పిల్లల పెంపకం బాధ్యతను ఇద్దరూ సమానంగా తీసుకున్నారా? అరవింద్: నేను బాధ్యత తీసుకోలేదు. ఆ అవసరం రాకపోవడం నా అదృష్టమనే చెప్పాలి. 1973లో ఇండస్ట్రీకి వచ్చినప్పటినుంచి ఈరోజు వరకూ బిజీగా ఉన్నాను. పిల్లల విషయాలను మా అమ్మ, నా పెద్ద చెల్లి వసంత, ఈవిడ.. ఈ ముగ్గురూ చూసుకున్నారు. మా చెల్లి కొన్నాళ్లు మాతోనే ఉంది. ఆవిడకి మేనల్లుళ్లు అంటే చాలా ప్రేమ. ఇప్పటికీ బాబీ, బన్నీ, శిరీష్ మా మీద కోపం వస్తే వాళ్ల మేనత్తకి కంప్లైంట్ చేస్తారు. బన్నీ (అల్లు అర్జున్)ని హీరోని చేయాలని ఎవరు అనుకున్నారు? నిర్మల: మా పెళ్లయిన నాలుగైదేళ్లకు చిరంజీవిగారితో సురేఖగారి పెళ్లి జరిగింది. ఆ తర్వాత చిరంజీవిగారి ఫంక్షన్స్ అవీ చూసి, బన్నీ హీరో అయితే బాగుంటుందనుకునేదాన్ని. ఇలాంటి ఫంక్షన్స్ జరుగుతాయి.. స్టేజ్ మీద బన్నీని చూసుకోవచ్చు అనే ఇమాజినేషన్ ఉండేది. కానీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి, మెచ్యుర్టీ వచ్చాక ఇండస్ట్రీలోకి వెళితే బాగుంటుందనుకునేదాన్ని. అయితే తను ఇష్టపడితేనే.. నా అభిప్రాయాన్ని పాటించాలనుకునేదాన్ని కాదు. మీక్కూడా బన్నీని హీరోగా చూడాలని ఉండేదా? ఫస్ట్ సినిమా ‘గంగోత్రి’తో పోల్చితే ఆ తర్వాతి సినిమాల్లో బన్నీ మేకోవర్ సూపర్.. అలా మార్చుకున్న తీరు గురించి? అరవింద్: బన్నీకి పట్టుదల ఎక్కువ. అనుకుంటే సాధిస్తాడు. యానిమేషన్ స్కూల్లో అడ్మిషన్ కావాలి. రోజుకు పది నుంచి 12 గంటలు ప్రాక్టీస్ చేస్తే కానీ అక్కడ పాస్ అవుతారు. ఓ మూడు నెలలు ప్రతి రోజూ 12 గంటలు సాధన చేశాడు. అక్కడ అడ్మిషన్ వచ్చింది. బన్నీ మంచి యానిమేటర్. అయితే సీట్ వచ్చాక ‘గంగోత్రి’కి చాన్స్ వచ్చింది. ‘ఒక సెమిస్టర్ మానేయ్.. ‘గంగోత్రి’ క్లిక్ అయితే చూద్దాం’ అన్నాను. ‘గంగోత్రి’ తర్వాత ‘ఆర్య’ చేశాడు. ప్రూవ్ చేసుకున్నాడు. దాంతో హీరోగా కంటిన్యూ అయ్యాడు. అరవింద్‌గారికి ఇంటిని పట్టించుకునే తీరిక లేదు కాబట్టి ఈ విషయంలో మీ ఇద్దరి మధ్య వాదనలు జరిగేవా? నిర్మల: అలా ఏం లేదు. ఇల్లు బాగుండాలంటే నేనన్నా వర్క్ చేయాలి లేదా ఆయన అయినా వర్క్ చేయాలి. కుటుంబంలో అందరూ ఆనందంగా ఉండాలంటే ఆయన నాతోనే ఉండాలి అనుకుంటే కుదరదు. నేను ఈ జనరేషన్ వాళ్లకి అదే చెబుతాను. మనం అన్ని సౌకర్యాలు అనుభవించాలంటే జీవిత భాగస్వామికి తప్పనిసరిగా స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు అరవింద్గారినే తీసుకోండి.. ఆయన ఏ పనీ చెయ్యకుండా నాతోనే ఉండాలి అనుకుంటే గీతా ఆర్ట్స్‌లాంటి పెద్ద సంస్థను ఎలా మేనేజ్ చేస్తారు? మా పిల్లలకు అన్నీ సమకూర్చాలంటే ఆయన స్పేస్ ఆయనకు ఇవ్వాల్సిందే. అలా కాకుండా బాగా పని మీద ఉన్నప్పుడు ‘ఇంటికి రండి’ అని నేను సతాయించకూడదు. అలా ఇంట్లోవాళ్లు సతాయిస్తే.. ‘అయ్యో ఇంటికి వెళ్లాలా’ అని ఆలోచిస్తారు. ఆ ఆలోచన రాకుండా మేనేజ్ చేయటంలోనే నేను ఆయనకు స్పేస్ ఇచ్చినట్లు. తప్పనిసరిగా ఆయనకు ఆ క్రియేటివ్ స్పేస్ నేను ఇస్తాను. ఫైనల్లీ.. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఏం చేయాలి? అరవింద్: భార్యాభర్తల మధ్య నమ్మకం ముఖ్యం. మా పెళ్లైన ఈ 45 సంవత్సరాల్లో ఇంత పెద్ద గ్లామర్ ఇండస్ట్రీలో నేను ఉన్నప్పటికీ ఏనాడూ తను నన్ను అనుమానించలేదు. అదే మా పెద్ద సక్సెస్. అసలు మనస్పర్థలను రోజుల తరబడి సాగనివ్వకూడదు. ఏదైనా సరే ఇద్దరూ కూర్చుని, మాట్లాడుకోవాలి. నిర్మల: మళ్లీ చెబుతున్నాను. పార్టనర్‌కి స్పేస్ ఇవ్వండి. మా ఇద్దరి విషయంలో మొదట్లోనే ఓ అగ్రిమెంట్ ఉంది. అదేంటంటే ‘క్యారెక్టర్ ఈజ్ యువర్సెల్ఫ్’. అంటే.. నువ్వేంటో అదే నీ క్యారెక్టర్ అని. ఆ క్యారెక్టర్ మీరు ఎలా చేసుకుంటారో అది మీ ఇష్టం. అందుకని ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని మేం ఒకరికొకరు చెప్పుకోం. మన క్యారెక్టర్ ఎలా ఉంటే బాగుంటుందో అలా ఉంటాం. మా జీవితం హ్యాపీగా గడిచిపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. భార్యాభర్తలు కష్ట సుఖాలను సమానంగా పంచుకుంటూ ముందుకెళ్లడం మంచి వైవాహిక జీవితానికి నిదర్శనం. మీ జీవితంలో జరిగిన ఓ విషాద ఘటన (కుమారుడు చనిపోవడం) తాలూకు బాధను ఎలా అధిగమించారు? అరవింద్: ఫ్యామిలీ సపోర్ట్ ముఖ్యం అండీ. నిర్మల కూడా చాలా ధైర్యం ఉన్న మనిషి. మా మూడో అబ్బాయి శిరీష్ పుట్టడం వెనకాల ఒక కారణం ఉంది. బన్నీ తర్వాత పుట్టిన అబ్బాయి చనిపోయాడు. ఆ బాబుకి ఐదేళ్లు. మాకు ఊహించని షాక్. ముగ్గురు బాబులు ఉన్నారు కదా, ఇక పిల్లలు వద్దనుకుని ఆపరేషన్ చేయించుకుంది. కానీ మూడో బాబు చనిపోయాక.. మళ్లీ తన కడుపున ఆ బాబు పుడతాడని, ‘రీకేనలైజేషన్’ (మళ్లీ పిల్లలు పుట్టడానికి) చేయించుకోవాలనుకుంది. 30ఏళ్ల క్రితం వైద్యశాస్త్రం ఇంత అభివృద్ధి చెందలేదు. అయినా తను ఆ నిర్ణయం తీసుకుంది. ‘మేజర్ ఆపరేషన్ సార్. మూడు గంటలు జరుగుతుంది. అయినా పిల్లలు పుట్టే చాన్స్ పది శాతమే’ అని డాక్టర్ అన్నారు. అప్పట్లో మూడు గంటల ఆపరేషన్ అంటే లైఫ్ రిస్క్ ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా.. వద్దని నిర్మలతో అన్నాం. గైనకాలజిస్ట్ కూడా ఇదే చెప్పారు. అయినా సరే నిర్మల ఒప్పుకోలేదు. ఆపరేషన్ చేయించుకుంది. కానీ, ఆ తర్వాత కొన్ని నెలల వరకూ గర్భం రాలేదు. దీంతో ఓ వైద్య పరీక్ష చేశాం. సారీ.. ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది అన్నారు. ఈ విషయం ఆమెకు చెప్పడానికి సందేహించాం. కానీ తనకు తెలిసిపోయింది. అయితే ‘ఐ విల్ గెట్ బ్యాక్ మై సన్’ అంది నిర్మల. అన్నట్లుగానే.. ఆ తర్వాతి నెల తను ‘కన్సీవ్’ అయింది. అలా పుట్టిన బాబే శిరీష్. నిర్మల: ఆ బాబు చనిపోయాడు, నేను ఏడ్చినా, ఏం చేసినా రాడు. ఈ గ్యాప్‌ని ఎలా ఫిల్ చేసుకోవచ్చని ఆలోచించాను. అందుకే మొండిగా ఆపరేషన్ చేయించుకున్నాను. స్నేహాని పెళ్లి చేసుకుంటానని బన్నీ అన్నప్పుడు మీ ఇద్దరి రియాక్షన్? అరవింద్: అర్జున్ ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్ విషయం మా ఇంట్లో అయిదు నిమిషాల్లోనే సెటిల్ అయ్యింది. ముందు స్నేహ విషయం బన్నీ తన అమ్మ దగ్గరే చెప్పాడు. నిర్మల: అర్జున్ వచ్చి స్నేహాని చేసుకుంటాను అంటే, నువ్వు చేసుకున్నా, మేం వేరే అమ్మాయిని చూసి చేసినా నువ్వు హ్యాపీగా ఉండాలి. మాకు ముఖ్యం అదే. నువ్వు హ్యాపీగా ఉంటే మేం హ్యాపీ అన్నాను. – డి.జి. భవాని -
అల్లు శిరీష్ సందడి
-
హుందాగా స్పందించిన అల్లు శిరీష్
అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ పుట్టినరోజు నేడు. అల్లు రామలింగయ్య మనవడిగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా వెండితెరకు పరిచయం అయిన శిరీష్, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. రొటీన్ ఫార్ములా కథలను కాకుండా డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు శిరీష్. ఈ ట్వీట్లో శిరీష్ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవల ఏబీసీడీ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చాడు శిరీష్. మలయాళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించిన శిరీష్ ప్రేక్షకుల తీర్పును గౌరవిస్తానన్నాడు. ‘మేమంతా మీకు మంచి సినిమా అందించేందుకు చాలా కష్టపడ్డాం. కానీ అంచనాలను అందుకోలేకపోయాం’ అంటూ ట్వీట్ చేశారు. ఫ్లాప్ సినిమాలకు కూడా సక్సెస్మీట్లు పెట్టి హడావిడి చేస్తున్న తరుణంలో శిరీష్ స్పందించిన తీరు హుందాగా ఉందంటున్నారు విశ్లేషకులు. ❤️🙏🏽 pic.twitter.com/kSUyKPNQbM — Allu Sirish (@AlluSirish) 30 May 2019 -
ఆ పరీక్షలో పాసయ్యాం
‘‘సినిమాను ఒక్కొక్కరు ఒక్కో దృష్టికోణంతో చూస్తారు. అందుకే సినిమా హిటై్టనా, ఫ్లాపైనా కొన్ని విమర్శలు వినిపిస్తుంటాయి. ఈ విమర్శలను విశ్లేషించుకుంటూ, కొత్తతప్పులు చేయకుండా ముందుకు వెళ్లడమే ఒక ఫిల్మ్ మేకర్‌గా నా పని’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్ అన్నారు. అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏబీసీడీ’. మలయాళ ‘ఏబీసీడీ’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజైంది. ఈ సినిమా మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోందని ‘మధుర’ శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఆయన చెప్పిన విశేషాలు. ∙నా కెరీర్లో ఇప్పటివరకు తీసినవన్నీ కాన్సెప్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ సినిమాలే. కమర్షియల్ సినిమాలు అంతగా తీయలేదు. అందుకే మంచి కాన్సెప్ట్ ఉన్న ‘ఏబీసీడీ’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాం. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సోమవారం కూడా మంచి కలెక్షన్స్ రావడం ముఖ్యం. ఈ సోమవారం పరీక్షలో మేం పాసయ్యాం. ∙‘ఒక్క క్షణం, శ్రీరస్తు శుభమస్తు’ సినిమాల్లో అల్లు శిరీష్ కామెడీ టైమింగ్ నచ్చి ఈ చిత్రానికి తీసుకున్నాం. శిరీష్ ఇంటెలిజెంట్, సిన్సియర్ యాక్టర్. బాగా నటించాడు. దర్శకుడు సంజీవ్ బాగా చేశాడు. యష్ రంగినేనిగారు బాగా సపోర్ట్ చేశారు. నా సినిమాలకు నిర్మాత డి. సురేశ్‌బాబుగారి సహకారం ఉండాలనుకుంటాను. ∙నా కెరీర్లో నేను చేసిన తొలి రీమేక్ ఇది. రీమేక్ చేయడం అంత ఈజీ కాదు. బహుశ ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ రీమేక్ కావొచ్చు. నా దర్శకత్వంలో వచ్చిన ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత నిర్మాతగా సినిమాలు చేస్తున్నాను. హిందీలో కరణ్ జోహార్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎక్కువగా నిర్మిస్తారు. అప్పుడప్పుడు సినిమాలను డైరెక్ట్ చేస్తారు. నేను కూడా ఆయనలా అన్నమాట. మంచి ఎగై్జటింగ్ కథ దొరికితే మళ్లీ డైరెక్ట్ చేస్తాను. భవిష్యత్‌లో వెబ్‌సిరీస్‌లకు మంచి డిమాండ్ ఉంటుంది. నేను నిర్మించాలనుకుంటున్నాను. కానీ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఉన్నప్పుడే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ∙మామూలుగా సినిమా విడుదలైన మొదటిరోజే థియేటర్లో చూస్తూ యూఎస్ నుంచి లైవ్ అప్డేట్స్ ఇస్తుంటారు. థియేటర్స్‌లో అప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ కూర్చుంటే వారు సినిమాను ఏం ఆస్వాదించగలరు? సినిమా చూసి కాస్త రిలాక్స్ అయ్యి వారి అభిప్రాయాలు చెబితే బాగుంటుందని నా అభిప్రాయం. ∙మా నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘దొరసాని’. ఈ చిత్రం ద్వారా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, జీవితా–రాజశేఖర్ కుమార్తె శివాత్మికలను పరిచయం చేస్తున్నాం. జూలై 5న సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం. -
‘ఏబీసీడీ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఏబీసీడీ (అమెరికన్ బార్న్ కన్‌ప్యూజ్డ్ దేశీ) జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : అల్లు శిరీష్, రుక్సర్ ధిల్లాన్, భరత్, రాజా, నాగబాబు సంగీతం : జుడా సాండీ దర్శకత్వం : సంజీవ్ రెడ్డి నిర్మాత : మథురా శ్రీధర్, యష్ రంగినేని మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ హీరోగా ప్రూవ్ చేసకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉన్నాడు. తెలుగులో నాలుగు సినిమాలు హీరోగా నటించినా స్టార్ ఇమేజ్ తీసుకు వచ్చే హిట్ ఒక్కటి కూడా పడలేదు. తాజాగా మలయాళంలో ఘనవిజయం సాధించిన ఏబీసీడీ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశాడు. తన వయసుకు, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో ఈ మంచి సక్సెస్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. మరి ఈ సినిమాతో అయిన అల్లు శిరీష్ సూపర్ హిట్ సాధించాడా..? కథ : అరవింద్ ప్రసాద్ (అల్లు శిరీష్) అలియాస్ అవి.. న్యూయార్క్‌లో సెటిల్ అయిన ఇండియన్ మిలియనీర్ విద్యా ప్రసాద్ (నాగబాబు ) కొడుకు. తన అత్త కొడుకు బాషా అలియాస్ బాలషణ్ముగం (భరత్)తో కలిసి సరదాగా లైఫ్ గడిపేస్తుంటాడు. నెలకు 20 వేల డాలర్లు ఖర్చు చేస్తూ ఎలాంటి బాధ్యత లేకుండా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. తన కొడుక్కి డబ్బు విలువ, జీవితం విలువ తెలియ జేయాలనుకున్న విద్యా ప్రసాద్.. వెకేషన్ పేరుతో అవి, బాషాలను ఇండియాకు పంపిస్తాడు. అలా ఇండియాకు వచ్చిన వారిద్దరిని నెలకు 5000 వేలు మాత్రమే ఖర్చు చేస్తూ ఎంబీఏ పూర్తి చేయాలని చెప్తాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఉండిపోయిన అవికి లోకల్ పొలిటీషన్ భార్గవ్‌తో గొడవ అవుతుంది. అవి, భార్గవ్‌ల మధ్య గొడవకు కారణం ఏంటి..? అమెరికాలో పెరిగిన అవి, బాషాలు ఇండియాలో ఎలా సర్ధుకుపోయారు..? ఓ సాధారణ యువకుడిగా ఇండియాలో అడుగుపెట్టిన అవి.. సెలబ్రిటీగా, యూత్ ఐకాన్‌గా ఎలా మారాడు? అన్నదే మిగతా కథ. నటీనటులు : అల్లు శిరీష్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో మంచి పరిణతి చూపించాడు. ఎలాంటి రెస్పాన్సిబులిటీ లేకుండా లైఫ్‌ను ఎంజాయ్ చేసే కుర్రాడి పాత్రలో సరిగ్గా సరిపోయాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లోనూ మంచి నటన కనబరిచాడు. బాలనటుడిగా సుపరిచితుడైన భరత్ ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయ్యాడు. తన పరిధి మేరకు బాగానే ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రుక్సర్ ధిల్లాన్ నటనకు పెద్దగా అవకాశం లేని పాత్రలో కనిపించారు. లుక్స్ పరంగా మాత్రం మంచి మార్కులు సాధించారు. హీరో తండ్రి పాత్రలో నాగబాబు ఒదిగిపోయాడు. విలన్‌గా రాజా పరవాలేదనిపించాడు. ఇతర పాత్రల్లో వెన్నెల కిశోర్, శుభలేక సుధాకర్, కోట శ్రీనివాసరావు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : మలయాళంలో సూపర్ హిట్ అయిన ఏబీసీడీ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొద్ది పాటు మార్పులతో రీమేక్ చేశాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి. కథ పరంగా బాగానే ఉన్నా కథనంలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. బలమైన సంఘర్షణ లేకపోవటం నిరాశకలిగిస్తుంది. ఇండియా వచ్చిన తరువాత హీరో ఇబ్బంది పడే సన్నివేశాల్లో మరింత కామెడీ, ఎమోషన్స్ చూపించే అవకాశం ఉన్నా దర్శకుడు సాదా సీదాగా నడిపించేశాడు. కథలోనూ బలమైన కాన్ఫ్లిక్ట్ లేకపోవటం కూడా మైనస్ అయ్యింది. జుడా సాండీ అందించిన సంగీతం బాగుంది. ‘మెల్ల మెల్ల మెల్ల మెల్లగా’ పాటతో పాటు నేపథ్యం సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి సినిమాకు మరో ప్లస్ పాయింట్. అమెరికాలో తెరకెక్కించిన సీన్స్‌తో పాటు హైదరాబాద్‌లోని స్టమ్లో తెరకెక్కించిన సన్నివేశాలను కూడా కలర్ఫుల్గా కెమెరాలో బంధించారు సినిమాటోగ్రాఫర్ రామ్. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథ కొన్ని కామెడీ సీన్స్ మైనస్ పాయింట్స్ : కామెడీ పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటం బలమైన సన్నివేశాలు లేకపోవటం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
స్టార్డమ్ ఏబీసీడీలు కూడా శిరీష్ స్టార్ట్ చేయాలి
‘‘ఏబీసీడీ’ సినిమా ట్రైలర్ చూస్తుంటే నా ‘పిల్ల జమీందార్’ సినిమా గుర్తుకు వస్తోంది. నా సినిమాను మించి ‘ఏబీసీడీ’ హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు హీరో నాని. అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరిక్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి’ అన్నది ఉపశీర్షిక. డి.సురేశ్‌బాబు సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాని మాట్లాడుతూ– ‘‘నేను యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు శిరీష్‌ను అప్పుడప్పుడు కలిశాను. అప్పుడు తను కాస్త లావుగా, బొద్దుగా ఉండేవాడు. సినిమా బిజినెస్ గురించి చాలా మంచి ఆర్టికల్స్ రాసేవాడు. ప్రొడక్షన్లో అరవింద్‌గారికి మంచి సక్సెసర్ దొరికాడని అనుకున్నాను. కట్ చేస్తే తను యాక్టర్ అయిపోయాడు. తన కెరీర్‌కు సంబంధించి ఏబీసీడీలు ఎప్పుడో స్టార్ట్ చేసిన శిరీష్, తన స్టార్డమ్కు సంబంధించిన ఏబీసీడీలు ఈ సినిమాతో స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ–‘‘రెండేళ్ల కిందట నా కజిన్ రామ్‌చరణ్ ‘ఏబీసీడీ’ మలయాళ సినిమా సీడీ నాకు ఇచ్చి, ఈ క్యారెక్టర్ నీకు కరెక్ట్‌గా సూట్ అవుతుందని చెప్పాడు. సినిమా చూస్తే చాలా బాగుందనిపించింది. ఈ సినిమాలో హీరో డబ్బు విలువ తెలియకుండా పాడైపోయాడని భావించిన తండ్రి అతన్ని బాగు చేసుకోవడానికి ఏం చేశాడనేదే కథ. బన్నీకి, రామ్‌చరణ్‌కు 21 ఏళ్లు వచ్చినప్పుడు కారు కొనిచ్చారు. నాకు 21 ఏళ్లు వచ్చాక మంచి స్పోర్ట్స్ కారు కొనివ్వమని నాన్నను అడగ్గానే ‘చెప్పుచ్చుకుని కొడతాను.. నీ వయసువాళ్లు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ట్రావెల్ చేస్తున్నారు. నీకు కారు కొనివ్వడమే లగ్జరీ. అలాంటిది స్పోర్ట్స్ కారు కొనివ్వమని అడుగుతున్నావ్’ అని కొనివ్వలేదు. నీ కారుకి బడ్జెట్ ఇంత అనుకుంటున్నాను అంటే, ఆ రోజు నేను కోపానికి పోయి ‘నాకు వద్దులే, నా సొంత డబ్బులతోనే కొనుక్కుంటాను’ అన్నాను. అయితే ఆ కారు కొనడానికి నాకు మూడేళ్లు పట్టింది. అప్పుడు నాన్న చేసిన పనివల్ల డబ్బు విలువ తెలిసి వచ్చింది. కాబట్టి ఈ సినిమాను మా నాన్నకు డెడికేట్ చేస్తున్నాను. ఈ చిత్రంలో నా తండ్రి పాత్రలో నాగబాబుగారిని తప్ప మరెవరినీ ఊహించుకోలేను’’ అన్నారు. ‘‘మధుర’ శ్రీధర్ నాకు మంచి స్నేహితుడు. అతనితో కొంతకాలంగా ట్రావెల్ చేస్తున్నాను. అల్లు అరవింద్‌గారు కూడా నాకు మంచి మిత్రుడు. ఈ సినిమాతో శిరీష్‌కు పెద్ద విజయం రావాలి’’ అన్నారు డి.సురేశ్‌బాబు. ‘‘అందరికీ థాంక్స్’’ అని ‘మధుర’ శ్రీధర్ రెడ్డి అన్నారు. ‘‘మధుర శ్రీధర్’తో ట్రావెల్ చేసేటప్పుడు మా నాన్నతో ఉన్నట్లే అనిపించింది. అల్లు శిరీష్ సినిమాలోనే కాదు.. రియల్ లైఫ్ హీరో కూడా. కొత్త డైరెక్టర్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. శిరీష్ నాకు లైఫ్ లాంగ్ హీరోగా ఉంటారు’’ అన్నారు సంజీవ్ రెడ్డి. రుక్సార్ థిల్లాన్, మ్యూజిక్ డైరెక్టర్ జుడా సాందీ, డైరెక్టర్ వేణు ఊడుగుల తదితరులు పాల్గొన్నారు. -
‘ఏబీసీడీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
ప్రెసిడెంట్‌గారి మనవరాలు
లండన్‌లో పుట్టి గోవాలో పెరిగి బెంగళూరులో చదువు పూర్తి చేసింది రుక్షర్ ధిల్లాన్. కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమైన రుక్సర్ ఆమధ్య ‘కృష్ణార్జున యుద్ధం’తో ‘ప్రెసిడెంట్‌గారి మనవరాలు’గా తెలుగు తెరపై మెరిసింది. అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్న రుక్షర్ గురించి కొన్ని ముచ్చట్లు... డిగ్రీ తరువాతే... గోవాలో నైంత్ గ్రేడ్ పూర్తయిన తరువాత తదుపరి చదువుల కోసం బెంగళూరు వచ్చింది రుక్షర్. అక్కడ బిషప్ కాటన్ హైస్కూల్లో చదువుకుంది. ఆ తరువాత ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. బెంగళూరులో వ్యాపారప్రకటనల్లో నటిస్తున్న రోజుల్లోనే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే... ‘‘డిగ్రీ తరువాతే సినిమాలు’’ అని డిసైడ్ కావడంతో సినిమాల జోలికి వెళ్లలేదు. తొలి సినిమా ‘రన్ ఆంటోనీ’ సినిమాతో వెండితెరకు పరిచమైంది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌లో రాజ్‌కుమార్ మనవడు వినయ్ రాజ్‌కుమార్ సరసన నటించింది. ఈ సినిమాలో సూసైడ్ బాంబర్‌గా నటించింది. ఆమె నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తరువాత ‘కృష్టార్జున యుద్ధం’ సినిమాలో రియా పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. షో టైమ్ ‘షో టైమ్’ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు ఎగిరి గంతేసినంత పనిచేసింది. ఎందుకంటే ఆ సినిమాను డైరెక్టర్ చేయబోయే యస్.యస్.కాంచీ బాహుబలి డైరెక్టర్ రాజమౌళికి కజిన్ అనేదే ఆమె ఉత్సాహానికి కారణం. ‘సెలెక్ట్ అవుతానా!’ అనే చిన్న బెరుకు ఉండేదట. మొత్తానికైతే ఆడిషన్లో సెలెకై్ట ఆ సినిమాలో భాగమైపోయింది. చారిత్రక పాత్రలు... విభిన్నమైన పాత్రలు చేయడం అంటే తనకు ఇష్టం అని చెబుతుంది రుక్షర్. సంజయ్ లీలా బన్సాలీ సినిమాల్లో కనిపించే చారిత్రక పాత్రలు వేయడమంటే తనకు ఇష్టమట. ‘భాంగ్రా పా లె’ సినిమాతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన రుక్షర్ ‘ఫలానా ఇండస్ట్రీలో మాత్రమే పనిచేయాలని ఉంది’లాంటి పట్టింపులు లేవు అని చెబుతుంది. ‘ప్రాంతీయ చిత్రాలు కూడా ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ అవుతున్నాయి’ అంటూ ప్రాంతీయ చిత్రాల గొప్పతనాన్ని చెప్పకనే చెప్పింది రుక్షర్. -
‘ ఏబీసీడీ ’మూవీ ట్రైలర్ లాంచ్
-
‘రిచ్‌గానే పుట్టాను.. రిచ్‌గానే పెరిగాను’
అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ సరైన హిట్ కోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. చివరగా.. ‘ఒక్క క్షణం’ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈసారి పక్క భాషలో హిట్ అయిన ఓ చిత్రం కన్నేశాడీ ఈ హీరో. మళయాలంలో సూపర్‌హిట్ అయిన ఈ చిత్రాన్ని ఏబీసీడీ(అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం పోస్టర్స్, సాంగ్స్‌తో మంచి హైప్‌ను క్రియేట్ చేయగా.. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో మాష్టర్ భరత్ ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. సురేశ్‌బాబు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించగా.. జుడా శాండీ సంగీతాన్ని సమకూర్చారు. -
‘తుగ్లక్’గా నందమూరి హీరో
ఇటీవల 118 సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నందమూరి యువ కథానాయకుడు కల్యాణ్ రామ్ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. కొత్త దర్శకుడు మల్లిడి వేణు డైరెక్షన్లో సోషియే ఫాంటసీ సినిమాలో నటించేందుకు కల్యాణ్ రామ్ ఓకె చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఫాంటసీ సినిమా కావటంతో బడ్జెట్ కూడా కాస్త ఎక్కువే అవుతుందని తెలుస్తోంది. అందుకే రిస్క్ లేకుండా ఈ సినిమాను తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట కల్యాణ్ రామ్. మల్లిడి వేణు సినిమాను ముందుగా అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కించే ప్రయత్నాలు చేశాడట. కానీ ఫైనల్ కల్యాణ్ రామ్ ఓకె చెప్పటంతో ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. -
‘ఏబీసీడీ’ మెల్ల మెల్లగా సాంగ్ లాంచ్
-
అల్లు వారి ‘ఏబీసీడీ’ వాయిదా..!
అల్లు ఫ్యామిలీ హీరోగా వెండితెరకు పరిచయం అయిన యువ కథానాయకుడు శిరీష్. హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం ఏబీసీడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మళయాలంలో ఘనవిజయం సాధించిన ఏబీసీడీ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ముందుగా మార్చి 1న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఏబీసీడీ రిలీజ్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలకు అన్‌సీజన్ కావటం, మార్చి నెలలో విద్యార్థులు పరీక్షలతో బిజీగా ఉంటారన్న ఉద్దేశంతో మార్చి నెలాఖరున రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. మార్చి 22న ఏబీసీడీ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో శిరీష్‌కు జోడిగా రుక్సర్ ధిల్లాన్ నటిస్తున్నారు. -
ఆకట్టుకుంటోన్న ‘ఏబీసీడీ’ మోషన్ పోస్టర్!
ఎంతో కాలంపాటు బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న అల్లువారబ్బాయి అల్లు శిరీష్‌కు ఏబీసీడీ రూపంలో హిట్ వచ్చేట్టు కనిపిస్తోంది. మాలీవుడ్ హిట్ మూవీ రీమేక్‌తో ప్రేక్షకులముందుకు రాబోతోన్న ఈ చిత్ర మోహన్ పోస్టర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఏబీసీడీ (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ)గా అల్లు శిరీష్ హాస్యాన్ని పండించబోతున్నాడని ఈ మోషన్ పోస్టర్లో తెలుస్తోంది. అమెరికాలో పుట్టిపెరిగిన వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో విలేజ్‌కు వచ్చి ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో సంజీవ్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మధుర శ్రీధర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
అప్పటినుంచి అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోయా
మెగా హీరో, అల్లువారబ్బాయి అల్లు శిరీష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబిస్తుంటారు. ప్రస్తుతం ఈ హీరో మలయాళ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏబీసీడీగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే అల్లు శిరీష్ తాజాగా చేసిన ట్వీట్ అల్లు అర్జున్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్ నటించిన 'ఆర్య 2' 2009లో ఇదే రోజు(నవంబర్ 27)న విడుదలైంది. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. ‘నేను సినిమాలు చూస్తూ ఎమోషన్ కి లోనైన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది 'ఆర్య 2' సినిమాలో అల్లు అర్జున్ తన స్నేహితుడి కోసం తన గొంతుపై కత్తి పెట్టుకున్న సీన్ చూసి చాలా ఎమోషనల్ అయ్యాను. ఆ సీన్ చూసిన దగ్గర నుంచే అల్లు అర్జున్‌కి అభిమానినయ్యాను. 'ఆర్య', 'ఆర్య 2' ఈ రెండు సినిమాల్లోను ప్రేమ.. స్నేహం.. త్యాగం గురించి గొప్పగా చెప్పారు. అందుకే ఈ సినిమాలంటే నాకెంతో ఇష్టం’ అంటూ ట్వీట్ చేశారు. -
ముగింపు దశలో ‘ఏబీసీడీ’
‘ఒక్క క్షణం’ సినిమాతో పలకరించిన అల్లు శిరీష్‌కు నిరాశే మిగిలింది. అనుకున్నస్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలని అల్లువారబ్బాయి మలయాళ రీమేక్‌పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. మాలీవుడ్‌లో హిట్ అయిన ‘ఏబీసీడీ’ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యుల్‌ను నవంబర్ 2న ప్రారంభించింది చిత్రయూనిట్. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ నటిస్తున్నారు. సంజీవ్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మధుర శ్రీధర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన అల్లు హీరో
కెరీర్లో భారీ హిట్ లేక సతమతమవుతున్నాడు మెగాహీరో అల్లు శిరీష్. దాంతో ఆచితూచి సినిమాలను సెలెక్ట్ చేస్తున్నాడు. ‘ఒక్క క్షణం’ తరువాత మళ్లీ తెరపై కనిపించలేదు. ‘1971’ సినిమా వచ్చినా అది డబ్బింగ్ చిత్రం ఖాతాలోకి వెళ్లిపోయింది. గ్యాప్ తీసుకున్నా పర్లేదు కానీ భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ప్రస్తుతం ఈ మెగాహీరో మాలీవుడ్‌లో హిట్ అయిన ఏబీసీడీ (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) సినిమాను రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో అదే పేరుతో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన నటించే అవకాశం ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేమ్ రుక్సర్ థిల్లాన్ సొంతం చేసుకున్నారు. నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు. యూఎస్ నుంచి ట్రిప్ కోసం ఇండియాకు వచ్చిన ఓ అబ్బాయి మిడిల్ క్లాస్ లైఫ్‌ను లీడ్ చేసి, ఏం తెలుసుకున్నాడన్నది ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నామని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. తనకి ఈ సినిమాతో మంచి హిట్ లభిస్తుందని ఈ మెగా హీరో కోటి ఆశలు పెట్టుకున్నాడు. అయితే సినిమాకు సంబంధించిన అప్డేట్ న్యూస్‌ను అల్లూ శిరీష్ స్వయంగా ట్విటర్లో షేర్ చేశాడు. ‘సినిమాలో నేను కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్లో నటిస్తున్నాను కావచ్చు. కానీ ప్రేక్షకులందరికీ ఫిబ్రవరి 8, 2019న థియేటర్లో వినోదాన్ని పంచడం పక్కా’అంటూ పోస్ట్ చేశాడు. -
అల్లు శిరీష్‌కు ఎంత పెద్ద మనసో..!!
విండోస్ యూజర్‌గా 20 ఏళ్ల పాటు కొనసాగిన టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్, మ్యాక్ యూజర్‌గా మారిపోయారు. తన అన్న అల్లు అర్జున్ ఇచ్చిన గిఫ్ట్‌తో అల్లు శిరీష్‌కు కొత్త ల్యాప్‌టాప్ వచ్చేసింది. ఈ సందర్భంగా తన అన్నకు కృతజ్ఞత చెబుతూ.. అల్లు శిరీష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు వెంటనే రిప్లైగా ఓ యూజర్ ఒక ట్వీట్ చేశాడు. ‘అన్నా నాకు కూడా ఒక చిన్న ల్యాప్‌టాప్ గిఫ్ట్ ఇవ్వు అన్నా. నేను కొనాలి అంటే ఇంకో మూడేళ్లు పడుతుంది. నాకు ఫ్యామిలీ ఉంది. శాలరీ తక్కువ. నా ఉద్యోగంలో ల్యాప్‌టాప్ వాడకం ఎక్కువ కానీ నాకు ల్యాప్‌టాప్ లేదు. కానీ నేను మీకు చాలా పెద్ద అభిమానిని శ్రీ’ అంటూ అల్లు అర్జున్‌కు, అల్లు శిరీష్‌కు ఆ ట్వీట్‌ను ట్యాగ్ చేశాడు. అభిమాని బాధను అర్థం చేసుకున్న వెంటనే అల్లు శిరీష్, ‘అయ్యో.. బాధపడకు బ్రదర్, నీవు సంపాదిస్తున్నావు. మీ కుటుంబాన్ని పోషిస్తున్నాయి. నా దగ్గర కొత్త ల్యాప్‌టాప్ ఉంది. నా సోని వైవో ల్యాప్‌టాప్‌ను నీవు తీసుకో. కూల్. నాకు డైరెక్ట్ మెసేజ్ పంపు. చీర్స్’ అంటూ ఈ యంగ్ హీరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అల్లు శిరీష్‌కు ఎంతో పెద్ద మనసో అంటూ.. అభినందనలు వెల్లువ కొనసాగుతోంది. సూపర్ అన్నయ్య మీలాంటి వాళ్లు రిప్లయ్ ఇవ్వడమే గొప్ప గిఫ్ట్ అని, దయా హృదయం అంటూ.. పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు అల్లు శిరీష్ అభిమానులు. కొంతమంది కొంటె అభిమానులు ‘అన్నా.. నాకు ఎప్పుడు ఇస్తావు గిఫ్ట్’ అంటూ ట్వీట్లు కూడా చేస్తున్నారు. బ్రదర్ నాకు ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ కావాలి. కొనాలంటే ఐదేళ్లు పట్టేలా ఉంది అంటూ మరో యూజర్ కొంటెగా రిప్లయి ఇచ్చాడు. అన్నా అలాగే ఇంకొంచెం పెద్ద మనసు చేసుకుని ఏపీ 9 బీడ్ల్యూ 666 ని నాకు ఇచ్చేయ్ అంటూ ట్వీట్ చేశాడు. త్వరలో అల్లు అర్జున్ మీకు కొత్త కారు గిఫ్ట్‌గా ఇస్తారంటూ కూడా అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. After being a Windows user for 20 yrs I've made the move to MacOS. Thank you @alluarjun for the gift. From my BenQ Joybook in school to now, you've always gifted me my laptops. pic.twitter.com/9G7oZs6Kd6 — Allu Sirish (@AlluSirish) September 26, 2018 Ayyo.. Dont worry bro, you earn and support your family.. Since I have new laptop, you take my Sony Vaio. Cool? Send me a DM. Cheers. https://t.co/GTKLDWn7I5 — Allu Sirish (@AlluSirish) September 27, 2018 -
యాక్టర్లు.. టీచర్ల అవతారం ఎత్తారు..
బంజారాహిల్స్: ‘నేను డాక్టర్ కాబోయి.. యాక్టర్ అయ్యాను’ అంటారు చాలామంది. అయితే ఇప్పుడు కొంతమంది యాక్టర్లు.. టీచర్ల అవతారం ఎత్తారు. ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. 2014లో ఏర్పాటైన ‘టీచ్ ఫర్ ఛేంజ్’ స్వచ్ఛంద సంస్థ.. సర్కార్ స్కూళ్లలోని విద్యార్థుల్లో ఆంగ్ల పరిజ్ఞానం పెంపొందించడం లక్ష్యంగా పనిచేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 200 ప్రభుత్వ పాఠశాలలను ఈ సంస్థ దత్తత తీసుకుంది. మొత్తం 600 మంది వలంటీర్లు వారానికోసారి ఆయా స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు ఇంగ్లిష్‌లో రాయడం, చదవడం, మాట్లాడటం నేర్పిస్తారు. ఈ సంస్థను మరింత ప్రోత్సహించేందుకు కొందరు సినీ తారలు ముందుకొచ్చారు. వీలైన సమయంలో పాఠశాలలకు వెళ్లి గంటపాటు ఇంగ్లిష్ బోధిస్తున్నారు. రానా దగ్గుబాటి, రకుల్‌ప్రీత్ సింగ్, రెజీనా, ప్రణీత, అల్లు శిరీష్ తదితరులు ఈ సంస్థకు చేయూతనందిస్తున్నారు. వీరు ఆసక్తిగా పాఠాలు బోధిస్తుండడంతో పాటు విద్యార్థుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇటీవల బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని గతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, హిమాయత్‌నగర్, ఫిలింనగర్, సికింద్రాబాద్ తదితర సర్కారు బడుల్లో రెజీనా, ప్రణీత పాఠాలు బోధించారు. ఇదో సంతృప్తి.. పేద విద్యార్థులకు పాఠాలు చెప్పడం నాకెంతో ఆనందాన్నిస్తోంది. ప్రతి నెలా రెండుసార్లు స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు క్లాస్ తీసుకుంటున్నాను. – రెజీనా టీచర్ వృత్తి ఎంతో గౌరవప్రదమైంది. నేను చదువుకునేరోజుల్లోటీచర్లను ఎంతో గౌరవించేదాన్ని.– రకుల్‌ప్రీత్ సింగ్ -
‘ఎంసీఏ’ అంటే కొత్త అర్థం చెప్పిన మెగాహీరో!
ఎంసీఏ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయ్ కాదు. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే అంతకంటే కాదు. ఎంసీఏ అంటే అల్లువారబ్బాయి అల్లు శిరీష్ కొత్త అర్థాన్ని చెప్పారు. బుధవారం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఎంతో మంది సెలబ్రెటీలు చిరుని కలిసేందుకు క్యూ కట్టారు. ఇలానే ఈ యువ హీరో కూడా చిరుతో దిగిన ఫోటోను షేర్ చేశాడు. చిరుతో దిగిన ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘చివరగా నేను నా సిగ్గును జయించి.. మా మామయ్యను ఓ సెల్ఫీ అడిగాను. నేను కూడా కోట్లలో ఒక్కడినే.. నేనెప్పుడూ గర్వ పడుతుంటా.. ఎంసీఏ (మెగాస్టార్ చిరంజీవి అభిమాని)ని అయినందుకు’ అంటూ పోస్ట్ చేశాడు. Finally overcame my shyness and asked my Uncle for a selfie! Like crores of others I am always a proud MCA (Megastar Chiranjeevi Abhimani). #megaselfie pic.twitter.com/kxmGIDXiYH — Allu Sirish (@AlluSirish) 22 August 2018 -
కథా చర్చలకు కాస్త బ్రేక్ అంటున్న మెగా హీరో!
మెగా హీరోలందరిలో కెల్లా అల్లు శిరీష్ కాస్త నెమ్మదించాడు. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ‘ఒక్క క్షణం’ తరువాత మళ్లీ తెరపై కనిపించలేదు. 1971 సినిమా వచ్చినా అది డబ్బింగ్ చిత్రం ఖాతాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ మెగాహీరో మాలీవుడ్‌లో హిట్ అయిన ఏబీసీడీ సినిమాను రీమేక్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రీమేక్‌కు సంబంధించిన స్టోరీ డిస్కషన్ బెంగళూరులో జరుగుతోంది. కథలో మార్పులు చేర్పులు చేయడానికి అక్కడ కసరత్తులు చేస్తున్నారు. అయితే ఈ పనికి కాస్త విరామం ఇస్తూ.. సైక్లింగ్‌కు వెళ్తున్నామంటూ శిరీష్ ట్వీట్ చేశాడు. యూఎస్ నుంచి ట్రిప్ కోసం ఇండియాకు వచ్చిన ఓ అబ్బాయి మిడిల్ క్లాస్ లైఫ్‌ను లీడ్ చేసి, ఏం తెలుసుకున్నాడన్నది ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర’ శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు. Taking a break from our story sessions and cycling around. #bengaluru #abcd pic.twitter.com/hxX8h0yniu — Allu Sirish (@AlluSirish) August 11, 2018 -
సెల్ఫీలు ఎవ్వరికీ ఊరికే రావు!
ఈ మాట వింటుంటే ఎక్కడో విన్నట్టుంది కదూ. కాకపోతే సెల్ఫీలకు బదులు అక్కడ డబ్బులు అని ఉంటుంది. ‘అవును మరి డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు’.. ఈ మాటని టీవీ యాడ్స్‌లో పదేపదే చెప్పి, తన వేషదారణతో ఫేమస్ అయ్యారు లలితా జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్. అయితే గతకొంతకాలం నుంచి ఈ యాడ్ టీవీల్లో పెద్దగా కనిపించటం లేదు. అయినా సరే ఈయన చెప్పిన డైలాగ్‌ను మాత్రం జనం మరిచిపోలేదు. తాజాగా మెగా హీరో అల్లు శిరీష్.. ఈయన్ను ఎయిర్‌పోర్ట్‌లో కలిసినప్పుడు ఓ సెల్ఫీ దిగి ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘సెల్ఫీలు ఎవ్వరికీ ఊరికే రావు! లక్ ఉండాలి. హహ అంటూ.. ఎయిర్‌పోర్ట్‌లో కలిశాను .. ఓ సెల్ఫీ అడిగాను’ అంటూ కిరణ్‌తో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేశారు. Selfies evvariki urike raavu! Luck undali ;) Haha! Met Lalitha Jewelry MD, Mr Kiran Kumar on the flight. Had to ask for a selfie! pic.twitter.com/NjBoDnVR6s — Allu Sirish (@AlluSirish) July 3, 2018 -
సూర్య సినిమాలో బొమన్ ఇరానీ!
కోలీవుడ్‌లో ఓ భారీ మల్టిస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ సూర్య, మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ఓ సినిమాలో కలిసి నటిస్తున్నారు. కేవీ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కతున్న ఈ మూవీపై కోలీవుడ్‌లో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాలో ‘అత్తారింటికి దారేది’ ఫేం బొమాన్ ఇరానీ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రకటించారు. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్‌కు తాతగా నటించి మెప్పించాడు. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా.. అంతగా గుర్తింపు తీసుకురాలేదు. అయితే తాజాగా సూర్య , మోహన్‌లాల్ కలిసి నటిస్తున్న సినిమాలో అవకాశం వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు శిరీష్ కూడా నటించనున్నాడు. ఇది సూర్యకు 37వ చిత్రం. గతంలో కేవీ ఆనంద్ డైరక్షన్లో వచ్చిన వీడొక్కడే, బ్రదర్స్‌తో హిట్స్ కొట్టిన సూర్య ఈ మూవీతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. Welcome to Kollywood, @bomanirani sir! #Suriya37 https://t.co/LNUAkSDVTb — Allu Sirish (@AlluSirish) June 22, 2018 -
అసహనం వ్యక్తం చేసిన మెగాహీరో
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే మెగాహీరో అల్లు శిరీష్. తన అభిమానులు వేసే ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెబుతూ ఉంటారు. ఎప్పుడూ కూల్‌గా ఉండే అల్లు శిరీష్ ఓ విషయంపై అసహనం వ్యక్తం చేశారు. చూస్తుంటే ఆ విషయం ఏదో కానీ తనకు ఎక్కడ లేని కోపాన్ని తెచ్చిపెట్టినట్టుంది. ఇంతకీ ఏం జరిగిందంటే. అల్లు శిరీష్ ఈ మధ్యే ఎయిర్టెల్ నుంచి వోడాఫోన్ నెట్‌వర్క్‌కు మారారట. అయితే వోడాఫోన్ నెట్వర్క్ సర్వీస్ చాలా ఘోరంగా ఉందని, బ్యాడ్‌నుంచి వరెస్ట్‌కు వచ్చినట్టైందని ఆవేదన వ్యక్తం చేశారు. 4జీ సర్వీస్ వదిలేయండి, కనీసం 2జీ కూడా సరిగా పనిచేయడం లేదని, ఒక్కోసారి కాల్ డ్రాప్స్ అవుతున్నాయని, సిగ్నల్ కూడా ఉండటంలేదని వాపోయారు. ఈ విషయంపైనే ఈ మెగా హీరో ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలియదంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు. అల్లు శిరీష్ ప్రస్తుతం కన్నడ రీమేక్ ఏబీసీడీలో నటిస్తున్నారు. "You'll never realise the value of something while you have it." Ported from Airtel to Vodafone. Its a move from bad to worse. Forget 4G, even 2G doesn't work most times. Forget call drops there's no signal only. Regret it! Lesson learnt. @VodafoneIN 😂😂😂 — Allu Sirish (@AlluSirish) June 21, 2018 -
ఆ ‘సర్ప్రైజ్’ రివీల్ చేసిన మెగా హీరో
పలు చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న బాల నుటుడు భరత్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తనున్నారు. అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కనున్న ఏబీసీడీ చిత్రంలో హీరో ఫ్రెండ్ పాత్రను పోషించనున్నారు. ఈ విషయాన్ని శిరీష్ సోమవారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. నిన్న అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనున్నట్టు చెప్పిన శిరీష్ నేడు ఆ విషయాన్ని బహిర్గతం చేశారు. ఈ చిత్రంలో శిరీష్‌కు ఫ్రెండ్ పాత్రలో భరత్ ఫుల్ లెన్త్ పాత్రలో కనపించనున్నారు. శిరీష్ ట్వీట్‌పై పలువురు సినీ ప్రముఖులు స్పందిసూ.. భరత్‌కు అల్ ది బెస్ట్ చెబుతున్నారు. వెంకీ, పోకిరి, ఢీ, రెడీ, కింగ్ వంటి అనేక చిత్రాల్లో భరత్ చేసిన పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. మాలీవుడ్‌లో హిట్ అయిన ఏబీసీడీ (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అమెరికా నుంచి ట్రిప్ కోసం ఇండియాకు వచ్చిన ఓ అబ్బాయి మిడిల్ క్లాస్ లైఫ్‌ను లీడ్ చేసి, ఏం తెలుసుకున్నాడన్నది ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ బాణీలు అందిస్తారు. కృష్ణార్జున యుద్దం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్సర్ థిల్లార్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. Master Bharath will be seen in a full length role as my best friend in ABCD. He transitions from child artiste to a character actor with this film. Welcome, Bharath. #ABCDTelugu pic.twitter.com/v4ES88ynp3 — Allu Sirish (@AlluSirish) June 11, 2018 -
అల్లు శిరీష్‌కు జోడీగా రుక్సర్?
హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ కృష్ణార్జున యుద్దం సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్‌పరంగా మంచి మార్కులే పడ్డాయి. తాజాగా అల్లు శిరీష్ నటిస్తోన్న ఓ సినిమాలో ఆమె హీరోయిన్గా ఎంపికైంది. అల్లు శిరీష్ మలయాళ రీమేక్ మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మాలీవుడ్‌లో హిట్ అయిన ఎబిసిడి (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. యూఎస్ నుంచి ట్రిప్ కోసం ఇండియాకు వచ్చిన ఓ అబ్బాయి మిడిల్ క్లాస్ లైఫ్‌ను లీడ్ చేసి, ఏం తెలుసుకున్నాడన్నది ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర’ శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు. Happy to share that @RuksharDhillon plays the female lead in ABCD. Hello & welcome onboard Rukshar! #ABCDTelugu pic.twitter.com/uJUvWi3M3k — Allu Sirish (@AlluSirish) June 1, 2018 -
చిన్నారి తమ్ముడికి ప్రేమతో : అల్లు అర్జున్
అల్లు శిరీష్ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ హార్ట్ టచింగ్ ట్వీట్‌తో శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నా జీవితంలోని తొలి చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ చిన్నారి నా కళ్లముందే పెరిగి పెద్దయ్యాడు. నా జీవితంలో అతి ఎక్కువ జ్ఞాపకాలను, రహస్యాలను పంచుకుంది కూడా ఇతనితోనే. నా చిన్నారి తమ్ముడు సిరి (శిరీష్)కు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. ట్వీట్ తో పాటు అల్లు శిరీష్, అల్లు అర్జున్ ఫ్యామిలీ కేక్ కట్ చేయిస్తున్న ఫొటోను ట్వీట్ చేశాడు అల్లు అర్జున్. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఇంతవరకు తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. శిరీష్ ప్రస్తుతం మలయాళ సినిమా ఏబీసీడీ రీమేక్‌తో పాటు సూర్య హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. Happy Birthday Day to the 1st Baby in my Life . The baby who grew in front of my eyes from the beginning of my time . The one with whom I shared the maximum amounts of memories & secrets 😉. My Baby Brother Siri . Happy Birthday 😘🎂. @AlluSirish pic.twitter.com/2EntnQXe6Y — Allu Arjun (@alluarjun) 30 May 2018 -
రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన మెగా హీరో
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో అల్లు శిరీష్ సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. కెరీర్‌ను గాడిలో పెట్టే సక్సెస్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరో త్వరలో ఓ రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కొద్ది రోజులుగా శిరీష్ చేయబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో రకరకాల వార్తలు ఫిలిం నగర్లో వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై శిరీష్ క్లారటీ ఇచ్చాడు. కొద్ది రోజులుగా తాను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాట్టుగా వస్తున్న వార్తలు రూమర్స్ అంటూ కొట్టి పారేశాడు. ఈ మధ్య కాలంలో ఎప్పుడు శ్రీకాంత్ అడ్డాలను కలవలేదని క్లారిటీ ఇచ్చారు. శిరీష్ ప్రస్తుతం తెలుగులో ఏబీసీడీ రీమేక్‌తో పాటు సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. -
ఇక స్పీడ్ పెంచుతా
‘‘నా సినిమా కథలు ముందుగా నాన్న వింటారు. సెట్స్‌కు వెళ్లే ముందు బన్నీ (అల్లు అర్జున్) కూడా వింటాడు. ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకుంటాను. షూటింగ్ పూర్తి చేసి, ఎడిటింగ్ అయిన తర్వాత కూడా వారికి సినిమా చూపిస్తా’’ అని హీరో అల్లు శిరీష్ అన్నారు. నేడు (బుధవారం) పుట్టినరోజు జరుపుకుంటున్న శిరీష్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది రెండు సినిమాలు చేస్తున్నాను. అందులో దుల్కర్ సల్మాన్ చేసిన మలయాళ ‘ఏబీసీడీ’ రీమేక్ ఒకటి. సూర్యగారు హీరోగా కె.వి.ఆనంద్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో నటిస్తున్నా. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌గారు కూడా ఉన్నారు. సూర్యగారికి నేను వీరాభిమానిని. ఆయనతో కలిసి పనిచేయడం హ్యాపీ. జూలై 1న లండన్‌లో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ‘ఏబీసీడీ’ రీమేక్‌లో మిలియనీర్ కొడుకుగా కనబడతా. సంజీవ్ కొత్త డైరెక్టర్ అయినా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. తనపై నాకు నమ్మకం ఏర్పడింది. రీమేక్ చేయడం చాలా కష్టం. రీమేక్‌ల గురించి మనం ఆలోచించినంతగా ప్రేక్షకులు ఆలోచించరు. వారికి సినిమా నచ్చితే చాలు. ఇలాంటి సినిమాలే చేయాలని హద్దులు పెట్టుకోలేదు. ‘ఒక్క క్షణం’ సినిమా కమర్షియల్‌గా ఆశించినంత రిజల్ట్ ఇవ్వలేదు. నా వరకు నా కెరీర్లో బెస్ట్ మూవీ అది. ఇతర హీరోల్లా వేగంగా సినిమాలు చేయడం లేదు. మా అన్నయ్య వచ్చి 15 ఏళ్లు అవుతున్నా 17 సినిమాలే చేశాడు. ఒక సినిమాపై ఫోకస్‌గా ఉంటే క్వాలిటీ బాగుంటుంది అనేది కరెక్టే. కానీ కమర్షియల్‌గా ముందుకెళ్లాలంటే ఎక్కువ చిత్రాలు చేయాలి. ఇకపై స్పీడ్ పెంచి, ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అన్నారు. -
కన్ఫ్యూజ్డ్ దేశీ.. కన్నడ మ్యూజిక్ డైరెక్టర్
దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళ చిత్రం ఏబిసిడి (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) చిత్రం తెలుగు రీమేక్‌లో అల్లు శిరీష్ నటిస్తున్న విషయం తెలిసిందే. నూతన దర్శకుడు సంజయ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర’ శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీని తీసుకున్నట్టు చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. ‘ఆపరేషన్ అలిమేలమ్మ, చమక్’ వంటి కన్నడ సూపర్ హిట్ సినిమాలకు సంగీతం సమకూర్చారు జుడా స్యాండీ. ‘‘ఏబిసిడికు జుడా స్యాండీను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నాం. కన్నడలో యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్. వెల్కమ్ టూ టాలీవుడ్ బ్రో’’ అంటూ స్యాండీను టాలీవుడ్‌కు వెల్కమ్ చేశారు శిరీష్. ‘‘తెలుగు సినిమాలో పార్ట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా, చాలా గౌరవంగా కూడా ఉంది’’ అని పేర్కొన్నారు జుడా స్యాండీ. -
అల్లు వారబ్బాయిది నెగెటివ్ రోల్ కాదట..!
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన అల్లు శిరీష్. శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న ఈ యంగ్ హీరో ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ మార్కెట్‌ను పెంచుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ సినిమా 1971 బెయాండ్ బార్డర్స్‌లో కీలక పాత్రలో నటించి మెప్పించాడు. తాజా సూర్య హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమాలోనూ శిరీష్ నటించేందుకు అంగీకరించాడు. అయితే ఈ సినిమాలో శిరీష్ నెగెటివ్ రోల్లో నటిస్తున్నట్టుగా తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై స్పందించిన శిరీష్ టీం క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో శిరీష్ చేసేది నెగెటివ్ రోల్ కాదని, ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో శిరీష్ సర్ప్రైజ్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. వీడొక్కడే, రంగం చిత్రాల దర్శకుడు కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మోహన్‌లాల్ మరో కీలకపాత్రలో నటిస్తుండగా.. అఖిల్ ఫేం సయేషా హీరోయిన్గా నటించే అవకాశం ఉంది. -
అభిమాన నటుడితో మెగా హీరో
మలయాళ స్టార్ హీరో కంప్లీట్‌యాక్టర్ మెహన్ లాల్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఓ అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. సూర్య హీరోగా వీడొక్కడే, బ్రదర్స్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఓ టాలీవుడ్ యంగ్ హీరో కూడా నటించనున్నాడు. మెగా ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న అల్లు శిరీష్, మెహన్ లాల్, సూర్య కాంబినేషన్లో రూపొందనున్న సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడట. ఈ విషయాన్ని అల్లు శిరీష్ తన సోషల్ మీడియా పేజ్‌లో అభిమానులతో షేర్ చేసుకున్నారు. తన అభిమాన హీరో సూర్యతో కలిసి నటించటం, మోహన్ లాల్ లాంటి టాప్ హీరోతో రెండో సారి కలిసి నటించే అవకాశం రావటం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు శిరీష్. Excited to be onboard for #Suriya37. As a @Suriya_offl fan its a dream come true to share screen space with him. Honoured to be sharing screen space with Lal sir again. Thx @anavenkat sir for giving me this opportunity. pic.twitter.com/9xIKz4Mc28 — Allu Sirish (@AlluSirish) 13 May 2018 -
కన్ఫ్యూజన్ కుర్రోడు
ఓ రిచ్ కుర్రాడు ట్రిప్ కోసం అమెరికా నుంచి ఇండియా రీచ్ అయ్యాడు. బ్యాక్ టు అమెరికా కాకుండా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందట. అయితే ఆ అబ్బాయి రిచ్ అయినప్పటికీ సడన్‌గా మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేయాల్సి వచ్చింది. ఎందుకలా అంటే.. ఆల్రెడీ దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన మలయాళ చిత్రం ‘ఏబీసీడీ: అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’ సినిమా చూసిన వారికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. అల్లు శిరీష్ హీరోగా నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి తెరకెక్కించనున్నారు. ‘మధుర’ శ్రీధర్ నిర్మించనున్నారు. ‘‘ఏబీసిడీ సినిమాలో కథనం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. యూఎస్ నుంచి ట్రిప్ కోసం ఇండియాకు వచ్చిన ఓ అబ్బాయి మిడిల్ క్లాస్ లైఫ్‌ను లీడ్ చేసి, ఏం తెలుసుకున్నాడన్నది ఆసక్తికరం’’ అని పేర్కొన్నారు అల్లు శిరీష్. ఈ నెల 28న ఈ చిత్రం ప్రారంభమవుతుందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే.. గతేడాది మేజర్ రవి దర్శకత్వంలో మోహన్‌లాల్ ప్రధాన పాత్ర చేసిన మలయాళ చిత్రం ‘1971: బియాండ్ ది బోర్డర్స్’లో అల్లు శిరీష్ కీలక పాత్ర చేశారు. ఇప్పుడు మలయాళ చిత్రం ‘ఏబీసీడీ’ రీమేక్‌లో నటించనుండటం విశేషం. -
రీమేక్ మీద మనసుపడ్డ అల్లువారబ్బాయి
మెగా ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. స్టార్ ఇమేజ్ అందుకోవడం కోసం తంటాలు పడుతున్న యువ కథానాయకుడు అల్లు శిరీష్. శ్రీరస్తు శుభమస్తు లాంటి హిట్ సినిమా వచ్చినా అది శిరీష్ కెరీర్‌కు పెద్దగా ప్లస్ అవ్వలేదు. ఇటీవల ఒక్క క్షణం అనే డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్ ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయాడు. దీంతో శిరీష్ తదుపరి చిత్రం విషయంలో ఆలోచనలో పడ్డాడు. శిరీష్.. రిస్క్ తీసుకోకుండా రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మాలీవుడ్‌లో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘ఏబీసీడీ (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ)’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాడు. 2013లో రిలీజ్ అయిన ఈ సినిమా మాలీవుడ్‌లో సంచలన విజయం సాధించటంతో పాటు దుల్కర్‌కు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమాను మధురా శ్రీధర్ నిర్మాణంలో సంజీవ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించనున్నారు. మరి ఈ రీమేక్ అయిన శిరీష్‌కు స్టార్ ఇమేజ్ తీసుకువస్తుందేమో చూడాలి. -
వాటే క్యూట్ ట్రైలర్..!
వాటే క్యూట్ ట్రైలర్... వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ అంటూ ‘ఛల్ మోహన్‌రంగ’ సినిమాపై అల్లు శిరీష్ ట్వీట్ చేశాడు. గత రాత్రి విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌పై అల్లు వారబ్బాయి ట్వీట్ చేయడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను తన మేనమామ పవన్ కల్యాణ్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. అసలే ‘చెప్పను బ్రదర్’ అంటూ బన్నీ పవన్ ఫ్యాన్స్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో బన్నీకి భిన్నంగా అల్లు శిరీష్ ట్వీట్ చేయడం పవన్ అభిమానులను ఖుషీ చేస్తోంది. పవన్ ఫ్యాన్స్‌కు దగ్గరవ్వాలన్న ఆలోచనతో శిరీష్ ఇలా ట్వీట్‌చేసి ఉంటాడన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ‘ఛల్ మోహనరంగ’ ట్రైలర్‌పై అల్లు వారబ్బాయి ప్రశంసల జల్లు కురిపించారు. పవర్ స్టార్ బ్యానర్ అంటూ ప్రత్యేకంగా పవన్ కల్యాణ్‌ను ప్రస్తావించారు. ‘వాటే క్యూట్ ట్రైలర్! ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. హీరో నితిన్, డైరెక్టర్ కృష్ణచైతన్యకు అభినందనలు, పవర్ స్టార్ బ్యానర్, గురూజీ (త్రివిక్రమ్) పేర్లను టైటిల్స్‌లో చూడటం బాగుంది’ అని పోస్ట్ చేశాడు. దీంతో పాటు ట్రైలర్‌ను ట్యాగ్చేశాడు. Whatte cute trailer! Waiting for this film. Wishing @actor_nithiin bro & dir Krishna Chaitanya all the best for #ChalMohanRanga! Nice to see Powerstar's banner & guruji's name in titles. https://t.co/UnZMHNP5EO — Allu Sirish (@AlluSirish) 26 March 2018 -
'యుద్ధభూమి' మూవీ స్టిల్స్
-
యంగ్ అండ్ డైనమిక్
తెలుగులో పట్టుమని పది సినిమాలు నటించకుండానే మాలీవుడ్ ఇండస్ట్రీ గడప తొక్కారు హీరో అల్లు శిరీష్. అక్కడి ఫ్యాన్స్ కూడా మల్లుభాయ్ అదేనండీ.. అల్లు అర్జున్ తమ్ముడని ఈజీగా శిరీష్‌ను ఓన్ చేసుకున్నారు. కానీ ‘1971: బియాండ్ ది బోర్డర్స్’ సినిమా తర్వాత శిరీష్‌కి సెపరేట్ ఐడెంటిటీ వచ్చింది. బన్నీ బ్రదర్ అని కాకుండా హీరో శిరీష్ అనడం మొదలుపెట్టారు. మోహన్‌లాల్, అరుణోదయ్ సింగ్, అల్లు శిరీష్ ముఖ్య తారలుగా మేజర్ రవి దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం ‘1971: బియాండ్ ది బోర్డర్స్’. ఈ చిత్రాన్ని జాష్ రాజ్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతకాలపై ‘యుద్ధభూమి’ అనే టైటిల్‌తో ఏయన్ బాలాజీ తెలుగులోకి అనువదిస్తున్నారు. ప్రస్తుతం అల్లు శిరీష్ తెలుగులో డబ్బింగ్ చెబుతున్న ఈ చిత్రం పాటలను ఈ నెలాఖరులో రిలీజ్ చేసి, చిత్రాన్ని మార్చిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘మేజర్‌గా మోహన్‌లాల్, ఎనర్జిటిక్ అండ్ యంగ్ డైనమిక్ సోల్జర్‌గా అల్లు శిరీష్ కనిపిస్తారు. గతంలో తమిళ్, హిందీ, మలయాళ చిత్రాలను తెలుగులో అనువదించాను. మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుంది. మార్చి ఫస్ట్ వీక్‌లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు బాలాజీ. -
20 ఏళ్ల క్రితమే అల్లు అర్జున్ సినిమా క్లైమాక్స్..!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అల్లు వారబ్బాయి శిరీష్, తాజాగా మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. రెండు రోజుల క్రితం కుంగ్‌ఫూ నేర్చుకుంటున్నప్పటి తమ చిన్ననాటి ఫోటోను ట్వీట్‌చేసిన శిరీష్ ‘ఈ ఫొటోలో అల్లు అర్జున్, నేను కాకుండా మరో నటుడు ఉన్నాడు ఎవరో కనిపెట్టండి’ అంటూ ట్వీట్ చేశాడు. తాజాగా ఆ ఫొటోల ఉన్న మరో నటుడు ఎవరో రివీల్ చేశాడు శిరీష్. దాదాపు 20 ఏళ్ల క్రితం తీసిన ఈ ఫొటోలో ఉన్నమరో నటుడు ఆది పినిశెట్టి అని వెల్లడించాడు. కుంగ్‌ఫూ తరగుల్లో అల్లు అర్జున్, ఆది పినిశెట్టి తలపడుతున్న ఫొటోలను ట్వీట్ చేసిన ‘దేవుడు 20 ఏళ్ల క్రితమే సరైనోడు సినిమా క్లైమాక్స్ ను డిజైన్ చేశాడని ఎవరికి తెలుసు..?’ అంటూ ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సరైనోడు సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. ఈ సినిమాతో టాలీవుడ్ స్టైలిష్ విలన్‌గా పరిచయం అయిన ఆది ప్రస్తుతం ప్రతినాయక పాత్రలతో పాటు సపోర్టింగ్ రోల్స్‌లోనూ దూసుకుపోతున్నాడు. Who knew God had designed the climax of #Sarrainodu 20 years back itself? ;) @alluarjun @AadhiOfficial pic.twitter.com/t280up3wev — Allu Sirish (@AlluSirish) 14 February 2018 -
మాట నిలబెట్టుకుంటున్న బన్నీ
అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన ఒక్క క్షణం సినిమా కమర్షియల్ గా ఆకట్టుకోకపోయినా.. తెలుగు తెర మీద సరికొత్త ప్రయత్నంగా పేరు తెచ్చుకుంది. గతంలో ఎప్పుడూ రాని ప్యారలల్ లైఫ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా శిరీష్‌కు మంచి ఇమేజ్ తీసుకువచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు వీఐ ఆనంద్‌తో అల్లు అర్జున్ సినిమా ఉంటుందన్న టాక్ బలంగా వినిపించింది. ఒక్క క్షణం సక్సెస్ సాధిస్తే వెంటనే బన్నీతో సినిమా ఉంటుదన్న వార్తలు కూడా వినిపించాయి. ఈ లోగా బన్నీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో బిజీ కావటంతో ఆ టాపిక్ అంతా మర్చిపోయారు. తాజాగా మరోసారి బన్నీ, వీఐ ఆనంద్‌లో కాంబినేషన్ తెర మీదకు వచ్చింది. అన్న మాట ప్రకారం వీఐ ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు స్టైలిష్ స్టార్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఇప్పటికే బన్నీకి లైన్ వినిపించి ఓకె చేయించుకున్నాడట ఆనంద్. దీంతో ఈ కాంబినేషన్లో త్వరలోనే సినిమా ఓకె అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. -
యాంకర్ అవతారమెత్తిన అల్లు హీరో
మెగా వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన అల్లు శిరీష్ స్టార్ ఇమేజ్ ను అందుకోవటంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. శ్రీరస్తు శుభమస్తు సినిమాతో పరవాలేదనిపించినా.. తరువాత ఆ సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయలేకపోయాడు. పలు సినీ వేడుకల్లో వ్యాఖ్యతగానూ ఆకట్టుకున్న శిరీష్ ఓ యూట్యూబ్ చానల్ కోసం యాంకర్ అవతారమెత్తాడు. పింక్ విల్లా చానల్ కోసం రిడ్లింగ్ విత్ అల్లు శిరీష్ అనే షో చేస్తున్నాడు శిరీష్. ఈ షోలో భాగంగా తనతో పాటు ఒక్క క్షణం సినిమాలో నటించిన శీరత్ కపూర్ ను ఇంటర్వూ చేశాడు శిరీష్. ఫన్నీ ఫన్నీగా సాగిన ఈ ఇంటర్వూలో శిరీష్ తన కామిక్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. -
అత్యంత ఇష్టమైన వ్యక్తిపై బన్నీ ట్వీట్
'ప్రపంచంలోనే నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. లవ్ యూ' అని ట్వీట్ చేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. దీంతో పాటు ఓ ఫొటోను కూడా షేర్ చేశాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆ వ్యక్తి ఎవరో కాదు.. ఆయన తండ్రి అల్లు అరవింద్. ఈ రోజు (జనవరి 10) మెగా ప్రొడ్యూసర్, గీతా ఆర్ట్స్ సంస్థ అధినేత అల్లు అరవింద్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా తన తండ్రికి బర్త్ డే విషెస్ చెప్పాడు బన్నీ. Happy Birthday Dad ! My most fav person in the world . Love You . pic.twitter.com/gbnfV7T0X2 — Allu Arjun (@alluarjun) January 10, 2018 అదేవిధంగా మరో వారసుడు శిరీష్ కూడా తన తండ్రితో దిగిన చిన్ననాటి ఫోటోని షేర్ చేస్తూ శుబాకాంక్షలు తెలిపాడు. 'హ్యాపీ బర్త్‌డే డాన్ కోర్లియోన్! నేను ఎంత ఎదిగినా ఎప్పటికీ నా తొలి గుర్తింపు.. శిరీష్.. సన్నాఫ్ అల్లు అరవింద్’ అనే ఉంటుంది. మై హీరో’ అని కామెంట్ పెట్టాడు. Happy birthday Don Corleone! How much ever I grow my first & favourite identity will always be "Sirish, son of Allu Arvind." #myhero pic.twitter.com/1MsBGoNVFd — Allu Sirish (@AlluSirish) January 10, 2018 -
'ఒక్క క్షణం' మూవీ రివ్యూ
టైటిల్ : ఒక్క క్షణం జానర్ : సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తారాగణం : అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ సంగీతం : మణిశర్మ దర్శకత్వం : విఐ ఆనంద్ నిర్మాత : చక్రి చిగురుపాటి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకునేందుకు కష్టపడుతున్నాడు. ఇప్పటికే శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న ఈ అల్లు వారబ్బాయి కాస్త గ్యాప్ తీసుకొని ఓ డిఫరెంట్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎక్కడిపోతావు చిన్నవాడా లాంటి హర్రర్ థ్రిల్లర్ ను రూపొందించిన విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక్క క్షణం అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో నటించాడు. సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు జీవితాలు ఒకే విధంగా ఉండటం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అల్లు శిరీష్ కు మరో విజయాన్ని అందించిందా..? విఐ ఆనంద్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ ప్రయోగం ఆకట్టుకుందా..? కథ : జీవా (అల్లుశిరీష్) మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగి. అమ్మా నాన్నలతో సరదాగా కాలం గడిపే జీవాకు ఓ రోజు ఇనార్బిట్ మాల్ లోని బేస్మెంట్ పార్కింగ్ పిల్లర్ నంబర్ బి 57 దగ్గర జ్యోత్స్న(సురభి) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తొలి చూపులోనే ఇద్దరు ప్రేమలో పడతారు. తరువాత వాట్సప్ చాటింగ్ లతో మరింత దగ్గరవుతారు. వారి ప్రేమను ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. తనచుట్టూ ఉన్న మనుషులను చూస్తూ టైం పాస్ చేసే జ్యోకి తమ అపార్ట్మెంట్ లోని పక్క పోర్షన్ లో ఉంటున్న శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్)ల మధ్య ఏదో జరుగుతుందన్న అనుమానం కలుగుతుంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేసిన జీవా, జ్యోత్స్నలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. (సాక్షి రివ్యూస్) సరిగ్గా ఏడాది క్రితం శ్రీనివాస్, స్వాతిల జీవితంలో ఏ సంఘటనలు అయితే జరిగాయో అవే సంఘటనలు జీవా, జ్యోత్స్నల జీవితంలో ప్రస్తుత కాలంలో జరుగుతుంటాయి. మహ్మద్ ఆస్తేకర్ (జయప్రకాష్) అనే ప్రొఫెసర్ ద్వారా ప్యారలల్ లైఫ్ గురించి తెలుసుకొని తన జీవితం కూడా స్వాతి జీవితం లాగే అవుతుందని భయపడుతుంది జ్యో. అదే సమయంలో స్వాతి తన అపార్ట్మెంట్ లో హత్యకు గురవుతుంది. ఆ హత్య శ్రీనివాసే చేశాడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. దీంతో జీవా తనను చంపుతాడని మరింత భయపడుతుంది జ్యో.. స్వాతిని నిజంగా శ్రీనివాసే చంపాడా..? ఆత్మహత్య చేసుకుందా..? స్వాతి లాగే జ్యోత్స్న కూడా చనిపోతుందా..? విధిని ఎదిరించి చేసే పోరాటంలో జీవా విజయం సాధించాడా..? నటీనటులు : శ్రీరస్తు శుభమస్తు సినిమాతో ఆకట్టుకున్న అల్లు శిరీష్.. ఈసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తను ప్రేమించిన అమ్మాయి చనిపోతుందని తెలిసి ఆమెను కాపాడుకునేందుకు పోరాటం చేసే యువకుడి పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే నటనపరంగా శిరీష్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. లవ్ రొమాంటిక్ సీన్స్ తో పరవాలేదనిపించినా.. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం శిరీష్ నటన తేలిపోయింది. చాలా సన్నివేశాల్లో అల్లు అర్జున్ ను ఇమిటెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. హీరోయిన్ గా నటించిన సురభి ఆకట్టుకుంది. అభినయంతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. కథకు కీలకమైన పాత్రల్లో అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ లు తమ పరిధి మేరకు మెప్పించారు. (సాక్షి రివ్యూస్) ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సీరత్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. యాక్టింగ్ తో పాటు గ్లామర్ షోలోను హీరోయిన్లు ఒకరితో ఒకరు పోటి పడ్డారు. కథ అంతా నాలుగు పాత్రల చుట్టూ నడుస్తుండటంతో ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. అతిధి పాత్రలో నటించిన దాసరి అరుణ్ మంచి విలనిజాన్ని పండించాడు. విశ్లేషణ : తన ప్రతీ సినిమాను డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో రూపొందించే విఐ ఆనంద్ ఈ సారి ప్యారలల్ లైఫ్ అనే సైన్స్‌ఫిక్షన్ కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో వేరు వేరు సమయాల్లో ఒకే విధమైన సంఘటనలు జరగటం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా తెర మీద ఆవిష్కరించటంలో సక్సెస్ సాధించాడు. అయితే కథనంలో థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన వేగం లోపించింది. ఫస్ట్ హాప్ స్లోగా నడిచినా ఇంట్రస్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఆడియన్స్ ను కట్టిపడేశాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ లో కథనం వేగం పుంజుకుంది. స్వాతి మరణానికి కారణం వెతికే సన్నివేశాలను ఆసక్తికరంగా తెరకెక్కించారు. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఇంకాస్త వేగంగా నడిచుంటే బాగుండనిపిస్తుంది. (సాక్షి రివ్యూస్) మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తన మార్క్ చూపించలేకపోయాడు. ఎండ్ టైటిల్స్ లో వచ్చే మాస్ సాంగ్ తప్ప మిగిలిన పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. ఇంటర్వెల్ లాంటి ఒకటి రెండు సన్నివేశాల్లో తప్ప మణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టకోలేదు. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథ లోని మలుపులు ఇంటర్వెల్ బ్యాంగ్ మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా వేగం తగ్గిన కథనం సంగీతం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
‘ఒక్క క్షణం’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
చిరంజీవిగారి వల్లే కష్టాలు...
అందమైన కుటుంబ బాంధవ్యాలు విడిపోవడానికి, తెగిపోవడానికి ఒక్క క్షణం చాలు. కలిపి ఉంచడానికి ఒక జన్మ సరిపోదేమో! అల్లు అరవింద్ తన కుటుంబాన్నే కాదు... మెగా కుటుంబం కూడా తన కుటుంబమే అనుకున్నారు. అందరి బాధ్యతలనూ తన జీవితం అనుకున్నారు. అలా పెనవేసుకున్న ప్రేమలే పిల్లల్లో కూడా అల్లుకుని ఉన్నాయి. ఆ అల్లుకున్న ఆనందమే మన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. అల్లు అరవింద్ అనే వృక్షం నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొమ్మలు (అల్లు అర్జున్, అల్లు శిరీష్) మీరు. ఆ చెట్టు నీడలో ఉంటూనే ‘సొంత ఐడెంటిటీ’ తెచ్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? శిరీష్: పెద్ద బాధ్యత అండి. ఆ నీడలో ఉన్న మేం తప్పటడుగులు వేయకూడదు. తప్పు చేయకూడదని భయపడుతూ ఉంటాం. కానీ కెరీర్ పరంగా గతంలో కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చు. ప్రస్తుతం కరెక్ట్ డైరెక్షన్ వైపు వెళుతున్నాను. దీంతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. నా ఆలోచనా పరిధి పెరిగింది. పెద్దలు కష్టపడి సంపాదించుకున్న కుటుంబ గౌరవం, పేరును చెడగొట్టకూడదన్న భయంతో కూడిన బాధ్యత మాలో ఉంది. ప్రొఫెషనల్‌గా సొంత ఐడెంటిటీ మా కష్టంతోనే వస్తుంది. అన్నయ్య (అల్లు అర్జున్) కష్టపడి పేరు తెచ్చుకున్నాడు. నేనూ నా కష్టంతోనే నిలబడాలనుకుంటున్నా. కెరీర్‌వైజ్‌గా తప్పు చేశా అన్నారు.. ఏంటా తప్పు? శిరీష్: ‘గౌరవం’ లాంటి సినిమాతో హీరోగా పరిచయం కావడం కరెక్ట్ కాదని తర్వాత తెలుసుకున్నాను. ఆ సినిమా ఇప్పుడు చేసి ఉంటే ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకునేవాళ్లేమో. బిగ్ మిస్టేక్ కాదు. బట్.. కెరీర్లో ఫస్ట్ సినిమా చాయిస్‌గా ‘గౌరవం’ కరెక్ట్ కాదు అనిపించింది. డాడీ ‘గౌరవం’ చూసి, ‘ఆడితే పేరు వస్తుంది. కలెక్షన్స్ వస్తాయి. ఆడకపోతే కష్టాలు వస్తాయి’ అన్నారు. అలా మెంటల్‌గా ప్రిపేర్ అవ్వమని ముందే సూచించారు. డాడీ నా నిర్ణయాన్ని గౌరవించడంతోపాటు నా అభిప్రాయాలకు విలువ ఇచ్చారు. అయినా ‘గౌరవం’ సినిమా చేయడం వల్ల నేను రిగ్రెట్ అవ్వడంలేదు. ఆ సినిమాను గౌరవించేవాళ్లు చాలామంది ఉన్నారు. చిరంజీవిగారు ‘మెగాస్టార్’ స్థాయికి రావడం వెనక మీ సపోర్ట్ చాలా ఉంది. ఇప్పుడు మీ ఇద్దరి కొడుకులకు అంతే సపోర్ట్ ఉండటం వాళ్లకు ఓ పెద్ద బలం అని చెప్పొచ్చు.. అరవింద్: పైకి రావాలంటే ఎవరైనా కష్టపడాల్సిందే. షార్ట్ కట్స్ ఉండవు. ఈ విషయమే నా ఇద్దరి కొడుకులకు చెబుతుంటాను. చిరంజీవిగారు ఎంతో కష్టపడ్డారు. ఆయనకు బదులు నేను వెళ్లి యాక్ట్ చేయలేను కదా. చిరంజీవిగారు నన్ను నమ్మడం నేను బాధ్యతగా ఫీలయ్యాను. వెనకాల చిన్న చిన్న బాధ్యతలను నేను తీసుకున్నాను.. అంతే. దాంతో ఆయన ఫ్రీగా సినిమాల మీద కాన్సంట్రేట్ చేయగలిగారు. ఎటువంటి ఆలోచనలు లేకుండా యాక్ట్ చేయగలిగారు. నాకు చేతనైనంతలో ఆయనకు నేను చేసిన సాయం అదే. అందరూ ఓ మూస ధోరణిలో వెళుతున్న టైమ్‌లో చిరంజీవిగారు పాత్ బ్రేకింగ్ సినిమాలు చేసి పైకి వచ్చారు. మా అసోసియేషన్ దాదాపు నలభై ఏళ్లది. జనరల్‌గా అన్ని రోజుల అసోసిషియేషన్ ఇండస్ట్రీలో చాలా తక్కువమందికి ఉంటుంది. నాకు గుర్తు ఉన్నంత వరకు చాలా తక్కువ మందికి ఉంది. ‘బాపు–రమణలగారికి’, ‘చిరంజీవిగారికి–నాకు’, ‘అచ్చిరెడ్డి–కృష్ణారెడి’్డలకి. మేమంతా ఎన్నో ఏళ్లుగా కలసి ట్రావెల్ చేస్తున్నాం. అలా ట్రావెల్ చేయాలంటే... ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లెవల్స్ చాలా ఎక్కువగా ఉండాలి. నాకు, చిరంజీవిగారికి మధ్య ఆ అండర్స్టాండింగ్ ఉంది. ఇన్నేళ్ల జర్నీలో చిరంజీవిగారితో టఫ్ సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయా? అరవింద్: వ్యక్తిగతంతా ఎప్పుడూ రాలేదు. పాలిటిక్స్‌లోకి వెళ్లినప్పుడు చిన్న చిన్న టఫ్ సిచ్యువేషన్స్ వచ్చాయి. కానీ, అవి పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయాయి. ఎప్పటిలానే మేమిద్దరం ఒకటే. శిరీష్... మీ ‘ఒక్క క్షణం’ గురించి కొన్ని మాటలు చెబుతారా? శిరీష్: ప్యారలల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో ఈ సినిమా సాగుతుంది. ఇద్దరి లైఫ్‌లో ఒకేలా ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. గతంలో సైంటిఫికల్గా ఇది ప్రూవ్ అయ్యింది. ఒకరి తల రాత ఇంకొకరి చేతిలో ఉంటే ఎలా? అనే కాన్సెప్ట్‌తో కథ సాగుతుంది. డైరెక్టర్‌గారు (వీఐ ఆనంద్) కథ చెప్పిన 20 నిమిషాలకే నచ్చింది. సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశాం. 40 మినిట్స్ విన్న తర్వాత సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. నాన్నగారు ఒక్కసారి వినాలి అని చెప్పాను. గతేడాది అక్టోబర్‌లో సైన్ చేశాను. 14 నెలలు పట్టింది సినిమా కంప్లీట్ అవ్వడానికి. నిర్మాత చక్రి చిగురుపాటి రాజీపడలేదు. నన్ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే సినిమా ఇది అని నమ్మాను. అందుకే వేరే సినిమా సైన్ చేయలేదు. ‘ఒక్క క్షణం’ని నేనెంత నమ్మానో దీన్నిబట్టి మీరు ఊహించుకోవచ్చు. ఒక అప్‌కమింగ్ హీరో 14 నెలలు ఒక సినిమాకి ఇచ్చేయడం కరెక్టేనంటారా? అరవింద్: అస్సలు కరెక్ట్ కాదు. నేను ఇష్టపడలేదు. మధ్యలో ఇంకో సినిమా చేయాల్సిందనిపించింది. తాత (అల్లు రామలింగయ్య) గారి లక్షణం అబ్బినట్లుంది. నాన్నగారు తన మాటే నెగ్గాలనుకునేవారు. మా నాన్నతో పోల్చితే నేను చాలా మైల్డ్. ఆయన అగ్రెసివ్. అల్లు శిరీష్‌కి కొంచెం ఆ పోలికలే వచ్చాయి.. అల్లు రామలింగయ్యగారు మీ మాట కాదని చేసిన ఓ ఇన్సిడెంట్‌ని గుర్తు చేసుకుంటారా? అరవింద్: రాఘవేంద్రరావుగారు, నాన్నగారు బాగా సన్నిహితులు. ఆయన సినిమాలో నాన్నగారు ఓ క్యారెక్టర్ చేస్తానని ఒప్పుకున్నారు. అప్పటికే పెద్ద వయసు వచ్చేయడంతో ఆరోగ్య రీత్యా అవుట్డోర్ షూటింగ్స్‌కు వెళ్లొద్దని చెప్పేవాణ్ణి. అలా వెళ్లనవసరం లేని సినిమాలైతేనే చేయమనేవాణ్ణి. కానీ, రాఘవేంద్ర రావుగారి సినిమా కోసం వైజాగ్ వెళ్లడానికి రెడీ అయ్యారు. ఆరోగ్యం ఏమవుతుందోనని భయపడ్డాను. మా మాట వినరు కదా. వెళ్లారు. అక్కడేమో అనుకున్న రోజులకన్నా ఎక్కువైంది. నేను భయపడినట్లుగానే ఆయన ఆరోగ్యం దెబ్బతింది. నేను వైజాగ్ వెళ్లేలోపే నాన్నగారిని ఐసీయూలో ఉంచారు. కొంచెం తేరుకున్నాక హైదరాబాద్ తీసుకు వచ్చాం. మీ నాన్నగారితో క్లోజ్‌గా ఉండేవారా? శిరీష్: నేను చెబుతా. తాతగారు, డాడీ చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లు. ఎలా అంటే... తాతగారు డాడీని కొట్టేవారు. ఫార్టీ ఇయర్స్ ఏజ్‌లో కూడా డాడీ తాత దగ్గర దెబ్బలు తిన్నారు. ఏం డాడీ? (అల్లరిగా చూస్తూ). అవునా.. పెళ్లయి, పిల్లలు పుట్టాక కూడా మీ నాన్నగారి దగ్గర దెబ్బలు తిన్నారా? ఏదైనా ఒక్క సంఘటన చెబుతారా? అరవింద్: మా నాన్నగారు 40ఏళ్ల వయసులో నన్ను ఓసారి కొట్టారు. అది కూడా చాలా సీరియస్‌గా. ఓ రోజు నేను, నాన్నగారు బయటికి వెళ్లాం. నేను కారు డ్రైవ్ చేస్తుంటే నాన్నగారు పక్కన కూర్చున్నారు. డ్రైవ్ చేస్తూ సడన్ బ్రేక్ వేశా. ఆయన అమాంతంగా ముందుకు ఒరిగిపోయి, బ్యాలెన్స్ కోసం ముందు అద్దానికి చేయి ఆన్చారు. ఆ తర్వాత ‘ఫట్‌మని’ నా చెంప మీద ఒక్కటిచ్చారు. ఆ క్షణం నాకేమీ అర్థం కాలేదు. కానీ ఆయన దూరమైన తర్వాత.. ఆయన కోపాలు నాకు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. కొడుకు 40 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ తండ్రి కొట్టాడంటే.. ఆ కొడుకుని ఆయన ఇంకా చిన్నవాడిగానే చూసినట్లు కదా. కొడుకు ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఆ తండ్రికి అతను కొడుకే కదా. నాన్నగారు అలా అనుకునే నన్ను కొట్టారు. అందుకే నా మనసులో ఆ సంఘటన అలా పదిలంగా ఉండిపోయింది. మరి.. శిరీష్... మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టిన సందర్భం... శిరీష్: మా అమ్మ పర్లేదు. బాగా కోపం వస్తే ఒక్క చిన్న దెబ్బ... అంతే. డాడీ మాత్రం చాలాసార్లు కొట్టారు. ఓసారి టీవీలో వీడియో గేమ్ ఆడుకుందామని, వైర్ పెట్టడానికి టీవీ ముందుకు జరిపాను. అది కింద పడిపోయింది. అప్పట్లో దాని రేట్ లక్ష రూపాయలు. టీవీ పగలగొట్టానని నన్ను పై నుంచి కొట్టుకుంటూ కిందకు తీసుకొచ్చారు. కింద నానమ్మ ఉండటంతో బతికిపోయాను. తను ఆపింది. నేను బాగా లావుగా ఉండేవాణ్ణి. అందుకు కూడా కొట్టేవారు. అవునూ.. వంద కేజీల వరకూ బరువు ఉండేవారట.. ఎలా తగ్గించేశారు? శిరీష్: యాక్చువల్లీ నేను పెద్దగా తినేవాణ్ణి కాదు. కానీ బరువు పెరుగుతూ ఉండేవాణ్ణి. చివరకు థైరాయిడ్ ప్రాబ్లమ్ వల్ల అలా అవుతున్నానని తెలిసింది. దాంతో ఆ సమస్య సాల్వ్ చేసుకున్నాను. రెండేళ్లు కష్టపడి 25 కేజీలు తగ్గాను. అప్పుడు ముంబయ్‌లో ఉండి చదువుకున్నాను. దాంతో నా డైట్ నేనే సెట్ చేసుకోవాల్సి వచ్చింది. తగ్గడానికి అది కూడా మంచిదే అయింది. నా ఏజ్ అప్పుడు 18 ఇయర్స్. ఆ ఏజ్‌లో అందరూ బాగా కనపడాలని కోరుకుంటారు కదా. అరవింద్: కాలేజీ స్టార్ట్ అయ్యింది కదండీ. అమ్మాయిల కోసమే తగ్గాలనుకున్నాడేమో అనుకునేవాణ్ణి (నవ్వుతూ) శిరీష్: ఏమో.. ఇన్నర్‌గా అది కూడా ఉండేదేమో డాడీ (నవ్వేస్తూ). కానీ, అదైతే మెయిన్ రీజన్ కాదు. అందరూ స్టైల్‌గా ఉంటున్నారు. నేనెందుకలా ఉండకూడదని తగ్గాను. కొంతమంది ఈజీగా బరువు పెరుగుతారు. నాది అలాంటి శరీర తత్వం. అయితే అంతే ఈజీగా తగ్గగలగడం నా లక్. 100 నుంచి 70 కేజీల బరువుకి చేరుకున్నాను. మాక్కూడా టిప్స్ చెబుతారా? అంటే చెప్పను. ఎందుకంటే, నా బాడీకి వర్కవుట్ అయిన టిప్ ఇంకొకరికి అవ్వకపోవచ్చు. వాళ్ల శరీర తత్వం వేరుగా ఉంటుంది. హీరోగా బన్నీ ‘సరైనోడు’ అనిపించుకున్నారు. మరి.. శిరీష్ అంత పేరు తెచ్చుకోగలుగుతారనే నమ్మకం ఉందా? అరవింద్: ఇంకాస్త టైమ్ పడుతుంది. శిరీష్ కష్టపడాలి. బన్నీ హీరో అవుతాడని తెలుసు. కానీ ఇంత తక్కువ టైమ్‌లో ఇంత స్టార్డమ్ వస్తుందని ఊహించలేదు. బన్నీ ఫోకస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. శిరీష్ ఫోకస్ కూడా అంతే. అందుకని తనూ నిలబడతాడనే నమ్మకం ఉంది. అయితే ఇప్పుడు శిరీష్ స్టూడెంట్ క్యారెక్టర్స్, యంగ్ క్యారెక్టర్స్ చేయాలని నా కోరిక. ఇప్పుడే మాస్ క్యారెక్టర్స్ చేయకూడదు. కొట్టగానే పదిమంది గాల్లో లేచి పడటం... అలాంటివి ఇప్పుడే కరెక్ట్ కాదు. శిరీష్: ఈ విషయంలో డాడీతో నేను ఏకీభవిస్తున్నానండి. ప్రజల్ని కాపాడటం వంటి క్యారెక్టర్స్ చేయాలని నాకూ లేదు. నా వయసుకి తగ్గ పాత్రలు చేయాలనుకుంటున్నాను. అల్లు రామలింగయ్యగారు కామెడీ చేశారు. మీరు నిర్మాత. అందుకని మీ ఫ్యామిలీ నుంచి హీరోలను ఎక్స్పెక్ట్ చేయలేదు... అరవింద్: నేను బాగా నటిస్తాను. కానీ, నా ఫిజిక్ సూట్ అవ్వదని నాకు తెలుసు. అందుకే రెండు మూడు సినిమాలు చేసినా కంటిన్యూ అవ్వలేదు. నిర్మాతగా చేయాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ. పిల్లలు హీరో అవ్వాలనుకోవడానికి కారణం చిరంజీవిగారు. ఒక ఫ్యామిలీ నుంచి ఇంతమంది హీరోలు వస్తున్నారు.. ఎందుకు? అనే ఆలోచనే చాలామందికి ఉంది. ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చిరంజీవిగారిని చూస్తూ పెరిగారు. ఆయన సక్సెస్‌ను ఎంజాయ్ చేశారు. తెలియకుండానే ఆ ఇంపాక్ట్ వారిపై పడింది. దాంతో హీరోలవ్వాలనుకున్నారు. బన్నీ హీరోగా సక్సెస్ అయ్యాడు. శిరీష్ ప్రొడక్షన్ బాగా చూసుకునేవాడు. అయితే అన్నను చూసి ఇన్స్పైర్ అయి, తనూ హీరో అయ్యాడు. మీరెప్పుడు కూల్‌గా, పీస్‌ఫుల్‌గా కనిపిస్తారు. టెన్షన్స్‌ని ఎలా ఓవర్‌కమ్ చేస్తారు? అరవింద్: బేసిక్‌గా నాది కూల్ నేచర్. ఎక్కువ టెన్షన్ పడను. ఎప్పుడైనా వీళ్ల (కొడుకులు వెంకటేశ్, బన్నీ, శిరీష్) మీద కోపం వస్తే తప్ప. హిట్లూ, ఫ్లాపులూ కామన్. ఫ్లాప్ అయితే ఏమవుతాం? అదేం జీవన్మరణ సమస్య కాదు కదా. మళ్లీ ఇంకో హిట్ తెచ్చుకోవచ్చు. ప్రాణం మీదకొచ్చినప్పుడు మాత్రమే టెన్షన్ పడాలన్నది నా సిద్ధాంతం. మీరు మాత్రం మీ నాన్నగారంత కూల్ కాదేమో? శిరీష్: అవునండి. నాన్నగారంత కూల్ కాదు. ఇప్పుడు ఫర్వాలేదు కానీ, ఇదివరకైతే ఎలక్ట్రిక్ వైర్లానే అన్నమాట. ఇప్పుడు చాలా నెమ్మదిగా డీల్ చేస్తున్నాను. డాడీ అన్నట్లు.. ప్రాణం మీదకు వచ్చేవి తప్పితే వేరే ఏదైనా మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? ఆస్తి పోతే పోతుంది. సినిమా ఫ్లాపయితే అవుతుంది. ఏదైనా ఎండ్ ఆఫ్ ది లైఫ్ అయితే కాదు కదా. ముగ్గురూ కొడుకులే కాబట్టి ఆడపిల్లలు లేరనే ఫీలింగ్? అరవింద్: చిరంజీవిగారికి ఇద్దరు ఆడ పిల్లలు, నా సిస్టర్‌కు ఇద్దరు అమ్మాయిలు. వాళ్లందరూ నాకు చాలా క్లోజ్. ఇంకో సిస్టర్ డాటర్స్ అయితే మా ఇంట్లోనే పెరిగారు కాబట్టి ఆ ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. మా సిస్టర్స్, నేను చాలా క్లోజ్. రెండు రోజులు సురేఖ (చిరంజీవి సతీమణి)ను చూడకపోతే అదోలా ఉంటుంది. ఫోన్ చేసి మాట్లాడుకుంటాం. శిరీష్: మా అత్తయ్యలకు, డాడీ వాళ్లకు నేనో పేరు కూడా పెట్టాను... ‘అధిష్ఠానం’ అని (నవ్వుతూ). ఫ్యామిలీలో ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ముగ్గురూ మాట్లాడుకుంటారు. పార్టీ ఏ ఇంట్లో ఏర్పాటు చేద్దాం, బెంగళూర్ వెళ్దామా ఇక్కడేనా? అని డిసైడ్ చేస్తారు. అరవింద్: మేం ముగ్గురం ఏదనుకుంటే అదే జరుగుద్ది (నవ్వుతూ). ముగ్గురి కొడు కుల్లో ఎవరంటే ఇష్టం? అరవింద్: పెద్దబ్బాయి బాబీ (వెంకటే‹శ్) అంటే ఇష్టం. తను పుట్టినప్పుడు నేనంత బిజీ కాదు. బాగా ఎత్తుకునేవాణ్ణి. బన్నీ పుట్టే టైమ్‌కి బిజీ అయిపోయా. శిరీష్ అప్పుడు ఇంకా బిజీ. అందుకని బాబీ అంటే ఎక్కువ ఇష్టం. గ్రాండ్ చిల్డ్రన్ని ఎత్తుకున్నప్పుడు మీ ఫేస్‌లో ఆ మురిపెం స్పష్టంగా కనిపిస్తుంటుంది.. వాళ్లతో మీ టైమ్ గురించి? అరవింద్: ప్రతి రోజు వాళ్లతో కొంచెం సేపు స్పెండ్ చేస్తాను. వాళ్లు స్కూల్‌కి వెళ్లే ముందు కాసేపు ముచ్చట్లు చెబుతాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంటి పక్కన ఉన్న గ్రౌండ్లో ఆడుకుంటారు. అది చూస్తుంటాను. నిజానికి బన్నీని వేరే ఇంటికి వెళ్లమంటున్నాం కానీ, వాళ్లు వెళ్లిపోతే ఇబ్బంది పడేది మేమే. ఫ్యామిలీ అంతా కలసికట్టుగా ఉండేలా చేయడం ఇంటి పెద్ద బాధ్యత. ఆ విషయంలో మీ ఫ్యామిలీకి రోల్ మోడల్‌గా ఉన్న మీరు మీ పిల్లలకు ఆ వేల్యూస్ నేర్పిస్తుంటారా? అరవింద్: మా బిహేవియర్ నుంచి కొంచెం తీసుకుంటారు. ముగ్గురు బ్రదర్స్ క్లోజ్‌గా ఉంటారు. కజిన్స్ అంతా కలిపితే మొత్తం పదకొండు మంది. వీళ్లంతా టూర్స్ కూడా వెళ్తుంటారు. శిరీష్: మొన్నా మధ్య మనాలీ వెళ్లాం. ఆంతకు ముందు హాంకాంగ్ వెళ్లాం. పిల్లలను వదిలిపెట్టం. మొత్తం కలిసి ఒక ఇరవై మంది దాకా వెళతాం. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాం. అరవింద్: చిరంజీవిగారు, మేము ఎలా ఉంటామో ఈ జనరేషన్ వాళ్లు మా దగ్గరి నుంచి అది నేర్చుకున్నారు. శిరీష్: చరణ్ (రామ్‌చరణ్) షూటింగ్ జరుగుతుంటే నేను, బన్నీ వెళ్తాం. ఇంటికెళ్లి, మేడ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటాం. చరణ్ మాకు ఫస్ట్ కజిన్. ఆ తర్వాత వరుణ్ తేజ్, సాయిదరమ్ తేజ్. అయినా కూడా వాళ్లతోనూ క్లోజ్‌గా ఉంటాం. చరణ్ ఉన్నప్పుడే అని కాకుండా తను లేనప్పుడు కూడా వరుణ్, ధరమ్‌ని మేం కలుస్తాం. గత పదిహేనేళ్లుగా మేమంతా ప్రతి సంక్రాంతికి బెంగళూర్ వెళుతున్నాం. ఎంత క్లోజ్‌గా ఉన్నా ప్రొఫెషనల్‌గా కొంచెం జెలసీ ఉండే చాన్స్ ఉందేమో... అరవింద్: చరణ్, బన్నీ, వరుణ్... వీళ్లందరికి ఒక చాలెంజ్ ఏంటంటే ఫ్యామిలీలో చిరంజీవిగారు హార్డ్ వర్కింగ్‌లో హయ్యస్ట్ మార్క్ సెట్ చేశారు. ఆ లెవల్‌కి వీళ్లెవ్వరూ చేరలేకపోయారు. ఇంతవరకూ ఎవ్వరూ కొట్టలేదు. ఆ మార్క్‌ను చేరుకోవడం వీళ్లందరికీ కష్టమవుతోంది. చెప్పాలంటే ఆయన వీళ్లందరికీ కష్టాలు తెచ్చిపెట్టాడు (నవ్వుతూ). అదే ఆయన యావరేజ్‌గా వర్క్ చేసి ఉంటే వీళ్లకు ఇన్ని కష్టాలుండేవి కావు. వీళ్ల మధ్య జెలసీకన్నా ఛాలెంజ్ ఎక్కువ ఉంటుంది. శిరీష్: అవును. ఆయన (చిరంజీవి) వల్లే ఈ కష్టాలు.. ఆయన వల్లే ఈ సుఖాలు కూడా. మా మధ్య జెలసీ ఉండదు కానీ, డాడీ అన్నట్లు బెంచ్ మార్క్ ఉంటుంది. అందరూ సిమిలర్ కెపాసిటీ ఉన్నవాళ్లం. ఇతని సినిమా ఇంత చేసింది అంటే మనం కూడా వచ్చే రెండు మూడు సినిమాల్లో దాన్ని రీచ్ అవ్వాలి అనుకుంటాం. పాజిటివ్‌గా తీసుకుంటాం. కలిసినప్పుడు ఆ కథ విన్నా, ఈ సినిమా చేస్తున్నా అని మాట్లాడుకుంటాం. ఈ కథ నాకంటే నీకు సూటవుతుందని ఐడియాస్ ఎక్సేంజ్ చేసుకుంటాం. కుటుంబ సభ్యులందరిని ఎంత కలిసికట్టుగా ఉంచుదామనుకున్నా.. కోడళ్లు, అల్లుళ్ల రూపంలో వచ్చే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సరిగ్గా లేకపోతే తేడా వచ్చేస్తుంది. మీ పెద్ద కోడలు, చిన్న కోడలు ఎలా ఉంటారు? అరవింద్: నాకు డాటర్స్ లేని లోటు మేనకోడల్లు తీర్చారు. కోడళ్లు కూడా బాగుంటారు. జనరల్‌గా పెద్ద కుటుంబాల్లో ఒకరి రూమ్‌లోకి మరొకరు వెళ్లాలంటే... ఫోన్ చేసి ‘రావచ్చా’ అని అడిగి, వెళతారు. మా ఇంట్లో అలాంటిదేం ఉండదు. మాది జాయింట్ ఫ్యామిలీ. ఒకళ్ల రూమ్‌లోకి వెళ్లడానికి మరొకరం పర్మిషన్ తీసుకునే కల్చర్‌కి మేమింకా అలవాటు పడలేదు. వీలున్నంత వరకూ అందరం కలిసే ఉందామనుకుంటున్నాం. అయితే బన్నీకి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇల్లు ఇరుకవుతుందని వేరే ఇల్లు కట్టుకోమంటున్నాను. అయినా పిల్లలతో ఇక్కడే అడ్జస్ట్ అవుతున్నాడు. నేను మాత్రం ఇల్లు కట్టుకుని వేరేగా ఉండమంటున్నాను. మాకూ అప్పుడప్పుడూ వేరే ఇంటికి వెళ్లినట్లు ఉంటుంది కదా. చిరంజీవిగారి ఇంటికి వెళ్లినట్టుగా ఎవ్రీడేనో లేదా రెండు రోజులకోసారో మేం బన్నీ ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుంది (నవ్వుతూ). చిరంజీవిగారు ముందు కనిపిస్తారు. వెనుక ఉండి మీరు నడిపిస్తారని చాలామంది ఫీలింగ్. సవ్యంగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ, జరగకూడనిది జరిగినప్పుడు ‘అల్లు అరవింద్ సూత్రధారి’ అని మీ మీద రాళ్లు విసురుతారు. దాన్ని మీరెలా తీసుకుంటారు? అరవింద్: మిగతా వాళ్ళందరి గురించి ఫ్యామిలీలో ఒకళ్లు ఇలాంటివి తీసుకోవాలి. అది నా బాధ్యతగా అనుకొని తీసుకుంటాను. మా కుటుంబంలో నా రోల్ అది. అందరి బాగోగులు చూడటం నా రెస్పాన్సిబిలిటీ. అలా చూసినప్పుడు బయట నుంచి రాళ్లు పడతాయి. అది సహజం. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఈ బాధ్యత మీ సిస్టర్ కోసం తీసుకున్నారా? అరవింద్: లేదండి. నేను, చిరంజీవిగారు మంచి ఫ్రెండ్స్. బావా బావమరిది అనేది నా సిస్టర్‌తో ఆయనకు పెళ్లైన ఫస్ట్ త్రీ ఇయర్స్‌లోనే పోయింది. ఇప్పుడు మా మధ్యలో బంధుత్వం కంటే స్నేహమే ఎక్కువ ఉంది. ఇన్నేళ్ళ అనుబంధంలో చిరంజీవిగారితో మీ బెస్ట్ మూమెంట్? అరవింద్: పద్మభూషణ్ అవార్డు అందుకోవడానికి చిరంజీవిగారు రాష్ట్రపతి భవన్ వెళ్లారు. ఆయనతో పాటు నేనూ వెళ్లాను. మా ఇద్దరికీ అది పీక్ మూమెంట్ అని నమ్ముతాను. ఒక వ్యక్తి కష్టం అది. అలాంటి ఆయనతో ఇన్ని రోజులు అసోసియేట్ అవ్వటం నాకు ఆనందంగా అనిపించింది. భర్త, సోదరుడు కలసికట్టుగా ఉంటే ఏ మహిళకైనా ఆనందంగా ఉంటుంది.. ఈ సందర్భంగా సురేఖగారి గురించి రెండు మాటలు... అరవింద్: సురేఖ చాలా మంచి పర్సన్. మా ఫ్యామిలీలోనే బెస్ట్ ఉమన్. మా మాదర్ నాకు చాలా గొప్పగా అనిపిస్తారు. ఆవిడ కంటే సురేఖ ఇంకా మంచిది. మేమిద్దరం క్లోజ్‌గా ఉండటం తనకు ఆనందంగా ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్‌లో బావమరిదికి బావ దగ్గరైనప్పుడు బ్రదర్స్ దూరం అవుతుంటారు. చిరంజీవిగారి బ్రదర్స్ విషయంలో అలా ఏమైనా జరిగిందా? అరవింద్: సురేఖ వాళ్లింటి కోడలైనప్పుడు వాళ్లిద్దరూ చిన్న పిల్లలు. చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం కాబట్టి అలాంటిదేం లేదు. ఫైనల్లీ... శిరీష్‌ని ఎప్పుడు పెళ్లి కొడుకుగా చూడొచ్చు ? అరవింద్: రెండు మూడేళ్ల లోపు. శిరీష్: (నవ్వుతూ) లోపా ? విజన్ 2020నా డాడీ. లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? అరవింద్: అరేంజ్ అయినా సరే.. నువ్వే చేసుకో అని చెప్పాం. శిరీష్: సెలక్షన్ నాకే వదిలేశారు. మా డాడీ నమ్మేది ఏంటంటే.. పేరెంట్స్ అడిగారనో, సొసైటీలో ఏమనుకుంటారనో, పెళ్లి వయసు వచ్చిందనో కాకుండా నాకు ఈ అమ్మాయి నచ్చి, తనతో రెస్ట్ అఫ్ ది లైఫ్ బాగుంటుందనిపిస్తే పెళ్లి చేసుకో అంటారు. ప్రస్తుతానికైతే నా ఫోకస్ అంతా కెరీర్ మీదే ఉంది. పెళ్లి అనేది ఎంత పెద్ద బాధ్యతో నాకు తెలుసు. అయినా నాకిప్పుడేం తక్కువ. నేను ఒంటరిగా లేను. ఇంటి నిండా మనుషులే. డాడీ, మమ్మీ, అన్నయ్య ఫ్యామిలీస్ ఉన్నారు. నాకే లోటూ లేదు. అరవింద్: ఆ లోటు తెలియాలంటే శిరీని విడిగా పంపించాలనుకుంటున్నా. విడిగా ఓ ఫ్లాట్‌లో ఉంచితే అప్పుడు అనిపిస్తుంది.. పెళ్లి చేసుకోవాలని. శిరీష్: ఇది అన్యాయం డాడీ. నాకు పెళ్లి చేయడం కోసం విడిగా ఫ్లాట్‌లో ఉంచాలనుకుంటున్నారా (నవ్వులు). – డి.జి. భవాని -
అల్లు హీరో సినిమాకు లైన్ క్లియర్
శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న అల్లు వారబ్బాయి శిరీష్, త్వరలో ఒక్క క్షణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేం విఐ ఆనంద్ దర్శకత్వంలో చక్రి నిర్మిస్తున్న ఈసినిమాపై కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొరియన్ సినిమా ప్యారలల్ లైఫ్ ఇన్సిపిరేషన్ తో ఈ సినిమా రూపొందిందన్న ప్రచారం జరిగింది. అయితే అదే సమయంలో ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ప్యారలల్ లైఫ్ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా ‘2 మేమిద్దరం’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు తేడాతో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. దీంతో ఈ రెండు చిత్రయూనిట్ ల మధ్య వివాదం నడుస్తోందన్న ప్రచారం జరుగింది. అయితే ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ తమ మధ్య ఎలాంటి ఇష్యూ లేదని క్లారిటీ ఇచ్చారు నిర్మాత అనిల్ సుంకర. తాజాగా ఈ వివాదంపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘ఒక్క క్షణం టీం విఐ ఆనంద్, చక్రి లతో మాట్లాడాను. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఒక్క క్షణం కథా కథనాలు విన్న తరువాత ఆ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనిపిస్తోంది. హీరో అల్లు శిరీష్, దర్శకుడు విఐ ఆనంద్, నిర్మాత చక్రిలకు నా శుభాకాంక్షలు’. అంటూ ట్వీట్ చేశారు. Had a pleasant chat with Vi Anand &Chakri of Okka Kshanam. All the concerns are sorted out &cleared. After knowing the entire content of d film, i am sure that its gonna be a big hit.Advanced congrats to @AlluSirish @directorvianand nd Chakri. Looking farward 2 working with dem. — Anil Sunkara (@AnilSunkara1) 19 December 2017 -
'ఒక్క క్షణం' మూవీ స్టిల్స్
-
ఒక్క క్షణం టీజర్.. చాలా కొత్తగా ఉందే!
-
ఒక్క క్షణం టీజర్.. చాలా కొత్తగా ఉందే!
సాక్షి, సినిమా : టాలీవుడ్లో మరో ఆసక్తికర సబ్జెక్టుతో ఓ చిత్రం రాబోతుంది. శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన హీరో అల్లు శిరీష్.. ఎక్కడికి పోతావు చిన్నివాడా మరి గుర్తింపు పొందిన దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఒక్క క్షణం. ఈ చిత్ర టీజర్ కాసేపటి క్రితం విడుదలయ్యింది. ఫేట్ వర్సెస్ డెస్టినీ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా టీజర్‌ను చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. రెండు సమకాలీన జీవితాలు, ఒకరి ఫాస్ట్.. మరోకరి ఫ్యూఛర్ మీద ఆధారపడి ఉండటం అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు అర్థమౌతోంది. సస్పెన్స్‌తో కూడిన ఎలిమెంట్లు చూపించగా.. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టడానికి వెనకాడని యువకుడి పాత్రలో శిరీష్ నటించాడు. సురభి, సీరత్ కపూర్లు హీరోయిన్లుగా, అవసరాల శ్రీనివాస్, జయప్రకాశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఒక్క క్షణం డిసెంబర్ చివర్లో విడుదల కానుంది. Presenting the teaser of Okka Kshanam. Wondering if you also might be having a "parallel life" with someone? #OkkaKshanam https://t.co/SlpFoZtPnj — Allu Sirish (@AlluSirish) December 3, 2017 -
ఒక్క క్షణమే!
‘ఒక్క క్షణం’లో ఏం జరుగుతుంది? ఏదైనా జరగొచ్చు! ఎవరు చెప్పగలరు? ఏం జరుగుతుందో!! ఓడలు బళ్లు కావొచ్చు... బళ్లు ఓడలు కావొచ్చు. మరి, అల్లు శిరీష్ రీల్ లైఫ్‌లో ‘ఒక్క క్షణం’ లో ఏం జరిగిందో! ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా నటించిన సినిమాకి ‘ఒక్క క్షణం’ టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లు. లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బుధవారం విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘ఇటీవల విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు శిరీష్, సురభి ఉన్న లుక్‌ను విడుదల చేశాం. దీనికీ మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో, కాశీ విశ్వనాథ్, రోహిణి, జయప్రకాశ్, ప్రవీణ్, సత్య, సుదర్శన్ తదితరులు ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సహ–నిర్మాతలు: సతీష్ వేగేశ్న, రాజేష్ దండ, సంగీతం: మణిశర్మ, మాటలు: అబ్బూరి రవి. -
'ఒక్క క్షణం' ఫస్ట్ లుక్
గౌరవం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అల్లూ వారబ్బాయి శిరీష్, కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ఓ మలయాళ సినిమాలో అతిథి పాత్రలో మాలీవుడ్ కు కూడా పరిచయం అయిన ఈ యంగ్ హీరో త్వరలో ఒక్క క్షణం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సురభి హీరోయిన్ గా నటిస్తోంది. లవ్ వర్సెస్ డెస్టినీ అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సీరత్ కపూర్ మరో కథానాయిక నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను డిసెంబర్ నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Presenting the first look of #OkkaKshanam. December 2017. pic.twitter.com/mQ6DhLbkjJ — Allu Sirish (@AlluSirish) 29 November 2017 -
అక్కినేని వారసుడితో ఢీ అంటున్న అల్లు వారబ్బాయి
తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని వారసుడు అఖిల్, తన రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇన్నాళ్లు పెద్దగా అంచనాలు లేని ఈ సినిమాపై టీజర్ రిలీజ్ తరువాత మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అఖిల్ చేసిన పోరాట సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. మరో వారసుడు అల్లు వారబ్బాయి శిరీష్ కూడా ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ ఆసక్తికరమైన సినిమా చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమైరా దస్తర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఒక్క క్షణం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇటీవల శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న శిరీష్, ఒక్క క్షణంతో బిగ్ హిట్ మీద కన్నేశాడు. డిఫరెంట్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా క్రిస్టమస్ బరిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇద్దరు స్టార్ వారసులు ఒకేసారి బరిలో దిగిటంపై టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. -
‘ఒక్క క్షణం’ సెట్లో పునీత్ రాజ్ కుమార్ సందడి
-
ఒక్క క్షణం!
ఏదైనా అర్జంటు పని మీద ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా అడిగితే.. ‘వన్ సెకండ్ ప్లీజ్’ అంటుంటాం. ఇప్పుడు అల్లు శిరీష్ అలానే అంటారని టాక్. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో శిరీష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో సురభి, శీరత్ కపూర్ కథానాయికలు. సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోంది. ఈ సినిమాకి ‘ఒక్క క్షణం’ టైటిల్ పెట్టనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. అసలు సంగతి అదండీ. కథకి ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని చిత్రబృందం ఆలోచన అట. ఈ చిత్రానికి ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఆ మధ్య ఓ వార్త వచ్చింది. ఇప్పుడు ‘ఒక్క క్షణం’ సీన్లోకి వచ్చింది. వన్ సెకండ్నే ఖరారు చేయాలనే ఆలోచనలో ఉన్నారట. -
విలన్‌గా మరో హీరో..?
సీనియర్ హీరోలతో పాటు పెద్దగా ఫాంలోని లేని హీరోలందరూ ఇప్పుడు నెగెటివ్ రోల్స్ పై దృష్టి పెడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో స్టార్ వారసుడు చేరబోతున్నాడట. చాలా కాలం కిందటే గ్రీకువీరుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు దాసరి అరుణ్ కుమార్. దర్శకరత్న దాసరి నారాయణరావు వారసుడిగా వెండితెరకు పరిచయం అయినా.. ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు అరుణ్. దీంతో సినిమాలకు దూరమయ్యారు. అయితే ఇటీవల దాసరి మరణించిన సమయంలో తన నాన్న కోరి నన్ను నటుడిగా చూడటమే అని చెప్పిన అరుణ్ ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు. అల్లు శిరీష్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో దాసరి అరుణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ సినిమాలో అరుణ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అరుణ్ కు నటుడిగా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. -
సూర్య బర్త్ డేకి అల్లువారబ్బాయి ప్లాన్స్
మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో అల్లు శిరీష్. గౌరవం, కొత్త జంట సినిమాలతో నిరాశపరిచిన శిరీష్ తరువాత శ్రీరస్తు శుభమస్తు సినిమాతో సక్సెస్ సాధించాడు. ఈ సినిమా తరువాత మలయాళ ఎంట్రీ ఇచ్చిన శిరీష్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాతో మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు వారబ్బాయికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఎక్కడికీ పోతావు చిన్నవాడా ఫేం విఐ ఆనంద్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్న శిరీష్ కోలీవుడ్ మీద దృష్టి పెట్టాడు. కోలీవుడ్ అభిమానులకు చేరువయ్యేందుకు సూర్య పుట్టిన రోజును ఉపయోగించుకుంటున్నాడు. ఈ నెల 23న సూర్య పుట్టిన రోజు సందర్భంగా సూర్య అభిమానులు అందరూ ఒకే ప్రొఫైల్ పిక్చర్ పెట్టాలంటూ కోరాడు. ఓ ఫోటోతో పాటు సూర్యను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మలయాళ ఎంట్రీ పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటంతో ఇప్పుడు తమిళ ప్రేక్షకులకు చేరువయ్యేందుకే శిరీష్ ఇలా చేశాడన్న టాక్ వినిపిస్తుంది. మరి శిరీష్ ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. Launching the the common DP for all @Suriya_offl's fans on the occasion of his birthday on July 23rd. Here we go! #HBDSuriyaCDP @TeamSFK pic.twitter.com/eFxCq6GdxE — Allu Sirish (@AlluSirish) 19 July 2017 -
చంచల్‌గూడ జైలులో అల్లు శిరీష్!
నిజమే... అక్షరం పొల్లు పోకుండా మీరు చదివిందంతా నిజమే! యువ హీరో అల్లు శిరీష్ ఓ రోజంతా చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ఆయన జైలుకు వెళ్లొచ్చి వారమైంది. కానీ, ఈ మేటర్ బయటకు రాలేదు. గుట్టు చప్పుడు కాకుండా అల్లు శిరీష్ జైలుకు వెళ్లొచ్చారు. టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్... డ్రగ్స్ రాకెట్ కేసుతో అల్లు వారబ్బాయికి ఏం సంబంధం లేదు. ఆయనపై ఇతరత్రా కేసులు ఏవీ లేవు. మరి, జైలుకు ఎందుకు వెళ్లారు? అంటే... సిన్మా షూటింగ్ కోసం! ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నా మధ్య రెండు మూడు రోజులు చంచల్‌గూడ జైలులో షూటింగ్ చేశారు. షూటింగ్ పూర్తయిన తర్వాత పోలీసుల రిక్వెస్ట్ మేరకు అల్లు శిరీష్ ఖైదీలకు మంచి మాటలు చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. సురభి, సీరత్‌కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ కీలక పాత్ర చేస్తున్నారు. -
చంచల్‌గూడ జైల్లో టాలీవుడ్ హీరో
హైదరాబాద్: టాలీవుడ్ నూతన దర్శకుడు వీఐ ఆనంద్ డైరెక్షన్లో మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్, సురభి జంటగా ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ కొత్త సినిమా షూటింగ్ శనివారం చంచల్‌గూడ పురుషుల జైల్లో జరిగింది. దీంతో జైలు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. శిరీష్, అవసరాల శ్రీనివాస్, ప్రవీణ్‌లపై జైలు బయట, లోపల కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్ అనంతరం మహాపరివర్తన్లో భాగంగా అల్లు శిరీష్ ఖైదీలను ఉద్దేశించి మాట్లాడారు. తెలిసి, తెలియక చేసిన తప్పులకు జైలు శిక్ష అను భవిస్తున్న ఖైదీలు తప్పులను సరిదిద్దుకొవాలని ఆయన సూచించారు. చంచల్‌గూడ జైల్లో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ సమ్మయ్య, జైలర్లు విజయ్‌కుమార్, వెంకటేశం ఉన్నారు. మరోవైపు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా జరుగుతోంది. సీరత్ కపూర్ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరకర్తగా ఉన్నారు. -
అల్లు వారబ్బాయి వేదాంతం
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి బిగ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో అల్లు శిరీష్. భారీ స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూశాడు శిరీష్. ఇటీవల విడుదలైన శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి హిట్ అందుకున్నాడు. అయితే సక్సెస్ ట్రాక్ ను అలానే కంటిన్యూ చేయాలనే పట్టుదలతో నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు శిరీష్. సురభి, సీరత్ కపూర్లు హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకు 'ఏ నిమిషానికి ఏమి జరుగునో' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. -
ప్లీజ్ మేడమ్...త్వరగా టచప్ చేసుకోండి!
...మరీ ఈ రేంజ్లో రిక్వెస్ట్ చేస్తున్నది హీరోయిన్‌గారి అసిస్టెంట్ లేదా మేకప్‌మేన్ కాదు, హీరో అల్లు శిరీష్. సెట్టింగు, లైటింగు, సినిమా వింగ్ వింగు మొత్తం రెడీ. కానీ, హీరోయిన్ సురభి రెడీగా లేరు. మేకప్‌కి మెరుగులు అద్దుతూ టచప్ చేసుకుంటుండడంతో అందరూ వెయిటింగు అన్నమాట! కరెక్టుగా అప్పుడు సెట్లో ఓ కెమెరా క్లిక్మంది. ఆ ఫొటోనే మీరు చూస్తున్నారు. అల్లు శిరీష్, సురభి జంటగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు కదా. ఈ సీన్ ఆ సెట్లోది అన్నమాట. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. సీరత్ కపూర్ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరకర్త. -
యువ నటుడితో శ్రియా భూపాల్ వీకెండ్ పార్టీ
శ్రియా భూపాల్ ఈ పేరు గుర్తుండే ఉంటుంది కదా. జీవీకే కుటుంబానికి చెందిన ఆమె...అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టబోయి... జస్ట్ మిస్ అయిన విషయం తెలిసిందే. అఖిల్, శ్రియా భూపాల్‌లకు నిశ్చితార్థం కూడా జరిగి చివరి నిమిషంలో వారిద్దరి పెళ్లి రద్దు అయిన వార్త గతంలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. తాజాగా శ్రియా భూపాల్ పేరు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. టాలీవుడ్ హీరో అల్లు శిరీష్‌తో కలిసి శ్రియా భూపాల్ రెడ్డి వీకెండ్ పార్టీలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు కెమెరా కంటికి చిక్కాయి. వీరిద్దరూ పార్టీని ఎంజాయ్ చేస్తూ, డ్యాన్స్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ‘తన బెస్ట్ ఫ్రెండ్ శరత్ రెడ్డి, బేబీ సిస్టర్ శ్రియాతో పార్టీ’ లో ఉన్నానని, ఈ సందర్భంగా తీసిన ఓ ఫొటోను అల్లు శిరీష్ పోస్ట్ చేశాడు. చిరంజీవితో పాటు,అల్లు అరవింద్ కుటుంబానికి జీవీకే ఫ్యామిలీకి మంచి సాన్నిహిత్యమే ఉంది. వీరి ఇళ్లలో జరిగే అన్ని శుభకార్యాల్లో అందరూ హాజరు అవుతూ ఉంటారు. అంతేకాకుండా రామ్‌చరణ్ భార్య ఉపాసన కూడా శ్రియా భూపాల్ ఎంగేజ్మెంట్ సమయంలో చాలా క్లోజ్‌గా మూవ్ అయిన విషయం విదితమే. కాగా అఖిల్‌తో పెళ్లి రద్దు అనంతరం శ్రియా కుటుంబం ...విదేశాలకు వెళ్లింది. అక్కడే ఓ ఎన్నారైతో ఆమె వివాహం నిశ్చయం అయినట్లు వార్తలు వచ్చాయి. త్వరలో ఎన్నారైతో శ్రియా భూపాల్ మూడుముళ్లు వేయించుకోనుందట. -
అల్లు శిరీష్ కొత్త చిత్రం ప్రారంభం
-
సైన్స్... రొమాన్స్!
ఆత్మలు ఉన్నాయా... లేవా! మనిషి బరువు ఎంతున్నా మరణానంతరం 21 గ్రాముల తగ్గుతుందని సైన్స్ చెబుతోంది. ఈ అంశాలతో దర్శకుడు వీఐ ఆనంద్ తీసిన సైంటిఫిక్, రొమాంటిక్ థ్రిల్లర్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మంచి హిట్టయ్యింది. మళ్లీ అలాంటి ఓ వినూత్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు వీఐ ఆనంద్. అల్లు శిరీష్ హీరోగా లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వీఐ ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించనున్న సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్రనిర్మాత చక్రి తండ్రి శంకర్ చిగురుపాటి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ‘‘సైంటిఫిక్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ నెలాఖరున చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు అల్లు శిరీష్. చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని వీఐ ఆనంద్ తెలిపారు. సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: సతీశ్ వేగేశ్న, రాజేశ్ దండ. -
మలయాళం మనసిలాగునుండో!...కేరాఫ్ మాలీవుడ్!
నేంద్రమ్‌పళమ్ చిప్స్.. సూపర్ ఉళున్ను వడ.. అబ్బో దడదడ అవియల్... అదరహో కేరళ కుట్టి... కేక అర్థం కావడంలేదు కదూ.. నేంద్రమ్‌పళమ్ అంటే అరటికాయ చిప్స్.. ఉళ్లున్ను వడ అంటే మినప గారెలు.. అవియల్ అంటే కొన్ని రకాల కూరగాయలతో చేసే కూర.. కేరళ కుట్టి అంటే అర్థమయ్యే ఉంటుంది.. కేరళ అమ్మాయి అని. ఇప్పటివరకూ చాలామంది కేరళ కుట్టీలు తెలుగు తెరకు వచ్చారు. ఇప్పుడు సీన్ రివర్శ్. తెలుగులో ఇరగదీస్తున్న కుట్టీలు కేరళ వెళుతున్నారు. అది మాత్రమే కాదండోయ్... మన నటులు కూడా వెళుతున్నారు. మరి.. వీళ్లందరికీ ‘మలయాళం మనసిలాగునుండో’? అదేనండి.. మలయాళం అర్థమవుతుందా అని. మనసిలవకపోతే ఏంటి? అయితే ఏంటి? కళాకారులకు భాషతో పనేంటి? ఇక్కడివాళ్లు అక్కడ.. అక్కడివాళ్లు ఇక్కడ... మనం ఆర్టికల్ చదువుతూ ఇక్కడ... యువరానర్... షి ఈజ్ ద లాయర్! పుట్టింది కలకత్తాలో... పేరొచ్చింది తెలుగు సినిమాల్లో. అమల తల్లిది ఐర్లాండ్.. తండ్రిది బెంగాల్. అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టిన మరుక్షణమే... చక్కటి చీరకట్టు, బొట్టు, చెరగని చిరునవ్వుతో తెలుగింటి కోడలు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ అనేట్టు నిలిచారు. నాగార్జునతో పెళ్లి తర్వాత అమల నటనకు ఫుల్స్టాప్ పెట్టేశారు. మళ్లీ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అయితే... ఈ ఇన్నింగ్స్‌లో భాషతో సంబంధం లేకుండా భావోద్వేగభరిత కథలకు ఓటేస్తున్నారు. ఇప్పుడామె ‘కేరాఫ్ సైరాభాను’ అనే మలయాళ సినిమా చేస్తున్నారు. సుమారు ఇరవైయేళ్ల తర్వాత అమల నటిస్తున్న మలయాళ చిత్రమిది. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అమల అక్కినేని లాయర్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళ సీనియర్ హీరోయిన్ మంజూ వారియర్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో అమల పాత్ర ఆమెతో సమానంగా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. గతంలో అమల రెండు మలయాళ సినిమాలు చేశారు. రెండూ హిట్టే. ‘కేరాఫ్ సైరాభాను’తో ముచ్చటగా మూడో హిట్ అందుకోవాలని ఆశిద్దాం. కమాండర్... బియాండ్ ద లాంగ్వేజ్! అల్లు అర్జున్ స్ట్రయిట్ మలయాళ సినిమా ఒక్కటీ చేయలేదు. కానీ, అక్కడి స్టార్ హీరోలతో సమానంగా బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నాయి. ఈ సై్టలిష్ స్టార్ ప్రతి సినిమా మలయాళంలో డబ్బింగ్ కావడం కామన్. ఎప్పట్నుంచో బన్నీ ఓ మలయాళ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అన్నయ్య కంటే ముందు తమ్ముడు అల్లు శిరీష్ మలయాళ సినిమా చేస్తున్నారు. మోహన్‌లాల్ హీరోగా చేస్తున్న ‘1971: బియాండ్ బోర్డర్స్’లో ఇండియన్ ఆర్మీ ట్యాంక్ కమాండర్‌గా అల్లు శిరీష్ నటిస్తున్నారు. ఇందులో శిరీష్‌పై ఓ పాట కూడా చిత్రీకరించారు. సినిమా విడుదలకు ముందే కేరళలో ఎక్కడికి వెళ్లినా.. అల్లు అర్జున్ తమ్ముడిగా శిరీష్‌ను గుర్తుపడుతున్నారట! దాంతో అన్నయ్య అర్జున్‌లా నాకూ మలయాళంలో మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నారు శిరీష్. ‘‘అన్నయ్య (అల్లు అర్జున్)పై కేరళ ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత చూసి, మలయాళ సినిమాలు, ఆ కల్చర్‌తో నేను ప్రేమలో పడ్డాను. అందుకే, మలయాళ సినిమా ఛాన్స్ రాగానే అంగీకరించా. ‘1971: బియాండ్ బోర్డర్స్’ వంటి దేశభక్తి సినిమా చేసే ఛాన్స్ మళ్లీ వస్తుందనుకోవడం లేదు. మా యూనిట్లో తెలుగు ఆర్టిస్ట్‌ని నేనొక్కడినే. అందరూ ఫ్రెండ్లీగా చూసుకుంటున్నారు. మనతో పోలిస్తే వాళ్ల యాక్టింగ్ సై్టల్ డిఫరెంట్‌గా ఉంటుంది. మోహన్‌లాల్‌గారు మొదలుకుని మలయాళ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మన తెలుగులోకి వస్తున్నారు. నేను మలయాళ సినిమాలో నటించడం హ్యాపీ’’ అన్నారు అల్లు శిరీష్. స్నేహ.. ద గ్రేట్ మామ్! తెలుగమ్మాయి స్నేహ కూడా ఇప్పుడో మలయాళ సినిమా చేస్తున్నారు. మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ఆ సినిమా పేరు ‘ద గ్రేట్ ఫాదర్’. ఇందులో హీరో వైఫ్‌గా, ఓ అమ్మాయికి తల్లి పాత్రలో స్నేహ నటిస్తున్నారట! ఆల్రెడీ స్నేహ పలు మలయాళ సినిమాలు చేశారు. గతంలో మమ్ముట్టితో రెండుసార్లు కలసి నటించారు. మరి, ఈ ‘గ్రేట్ ఫాదర్’ ప్రత్యేకత ఏంటంటే... తల్లైన తర్వాత స్నేహ చేస్తున్న తొలి చిత్రమిది. సినిమాలోనూ ఆమె తల్లిగానే నటిస్తున్నారు. చిన్న బ్రేక్ తర్వాత స్నేహ నటిస్తున్న సినిమా కావడంతో క్రేజ్ ఏర్పడింది. ఇందులో స్నేహ క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట! ‘ద గ్రేట్ ఫాదర్’ విడుదల తర్వాత స్నేహ కెరీర్ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో ఎదురు చూడాలి. తమిళ హీరో ప్రసన్నతో వివాహానంతరం స్నేహ చెన్నైలో సెటిల్ అయ్యారు. ‘‘విహాన్ (స్నేహ కుమారుడు) జన్మించిన తర్వాత యాక్టింగ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాను. మధ్యలో కొన్ని మంచి అవకాశాలు వచ్చినా అంగీకరించలేదు. దర్శకుడు హనీఫ్ ‘ద గ్రేట్ ఫాదర్’ స్క్రిప్ట్ వినిపించిన తర్వాత నో చెప్పలేకపోయాను. చాలా పవర్ఫుల్ మదర్ క్యారెక్టర్. ఓ తల్లిగా, ఈ సినిమాలో ప్రస్తావిస్తున్న సమస్య గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం నా బాధ్యతగా భావించా. ఈ మలయాళ సినిమాతో పాటు ఓ తమిళ సినిమా కూడా చేస్తున్నా. మంచి ఛాన్సులొస్తే తెలుగులోనూ నటిస్తా’’ అన్నారు స్నేహ. 125 నాటౌట్... న్యూ ఇన్నింగ్స్! సెంచరీ ఎప్పుడో కొట్టేశారు శ్రీకాంత్. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 125కు పైగా సినిమాల్లో నటించారాయన. తెలుగు ఇండస్ట్రీతో పాతికేళ్ల అనుభవం ఆయనది. ఇప్పుడు నటుడిగా మళ్లీ కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా నటించనున్న సినిమాతో శ్రీకాంత్ మలయాళ తెరకు పరిచయం అవుతున్నారు. శ్రీకాంత్‌తో పాటు తమిళంలో మంచి హీరోగా పేరు తెచ్చుకున్న తెలుగబ్బాయి విశాల్‌ను కూడా కీలక పాత్రకు ఎంపిక చేశారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమా శ్రీకాంత్, విశాల్... ఇద్దరికీ మలయాళంలో మొదటిది. ఈ సినిమాతో మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న మరో స్టార్ రాశీఖన్నా. తెలుగులో హీరోయిన్గా మంచి స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈ ఢిల్లీ డాల్, మోహన్‌లాల్ సినిమా కావడంతో ఓకే చెప్పారట. ఇందులోనే విశాల్‌కి జోడీగా హన్సిక నటించనున్నారని సమాచారం. ఒక్క సినిమాతో ఇంతమంది పరభాషా నటీనటులను మలయాళ తెరకు పరిచయం చేస్తున్న మోహన్‌లాల్‌పై అక్కడ సరదాగా జోకులు వేస్తున్నారు. ‘‘సినిమాలో ఆయా పాత్రలకు ప్రాముఖ్యత ఉంది కాబట్టే... తెలుగు, తమిళ స్టార్స్ శ్రీకాంత్, విశాల్ మా సినిమాలో నటించడానికి అంగీకరించారు. వాళ్ల స్క్రీన్ టైమ్ కూడా ఎక్కువే ఉంటుంది. అంతే కానీ, రెండు మూడు భాషల్లో సినిమా తీసే ఆలోచన మాకు లేదు. ఇది మల్టీ–లింగ్వల్ సినిమా కాదు. ప్రస్తుతం మలయాళంలో మాత్రమే తీస్తున్నాం. ఇతర భాషల్లో డబ్బింగ్ చెయ్యొచ్చా? లేదా? అనే నిర్ణయం తర్వాత తీసుకుంటాం’’ అని చెప్పారు చిత్ర దర్శకుడు బి. ఉన్నికృష్ణన్. గత ఏడాదే ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు ఫ్యామిలీ జానర్ కథానాయకునిగా పేరు తెచ్చుకుని, ఇప్పుడు విలన్‌గా జగపతిబాబు వీర విహారం చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాదే ఆయన కేరళ తెరకు పరిచయమయ్యారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ‘పులి మురుగన్’లో జగపతిబాబు విలన్‌గా నటించారు. ఆయన పాత్ర పేరు ‘డాడీ గిరిజ’. తెలుగులో ‘మన్యంపులి’గా విడుదలై ఇక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా, ‘పులి మురుగన్’ విడుదల తర్వాత జగపతిబాబు కేరళ వెళ్లినప్పుడు ఆయన పేరుతో కాకుండా ‘డాడీ గిరిజ’ అని పిలిచారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. ‘‘పొరుగు రాష్ట్రంలో అభిమానులను సంపాదించుకోవడం చాలా హ్యాపీగా ఉంది’’ అని జేబీ అన్నారు. మాలీవుడ్ నుంచి ఆయనకు మంచి అవకాశాలు వస్తున్నాయట. – సత్య పులగం -
ఒక యుద్ధం.. రెండు సినిమాలు.. ఇద్దరు హీరోలు
బాలీవుడ్ తరహాలో టాలీవుడ్లో కూడా యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి ఘనవిజయం సాధించటంతో ఇప్పుడు పీరియాడిక్ సినిమాల మీద దృష్టిపెడుతున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలు ఈ తరహా సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అందుకే ఇద్దరు యంగ్ హీరోలు ఒకేసారి ఒకే సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న రెండు సినిమాల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ హంక్ రానా, అల్లు వారబ్బాయి శిరీష్‌లు 1971లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తున్నారు. ఘాజీ పేరుతో తెరకెక్కుతున్న మల్టీ లాంగ్వేజ్ సినిమాలో రానా హీరోగా నటిస్తుండగా.. 1971 బెయాండ్ బార్డర్స్ పేరుతో తెరకెక్కుతున్న మలయాళ సినిమాలో అల్లు శిరీష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటిస్తున్నాడు. ఘాజీ విశాఖ తీరంలో సముద్ర గర్భంలో జరిగిన యుద్ధం కాగా.. 1971 మాత్రం సరిహద్దుల్లో జరిగిన యుద్ధాన్ని తెరమీద ఆవిష్కరిస్తున్నాయి. ఘాజీ ఫిబ్రవరి 17న రిలీజ్ అవుతుండగా.. 1971 బెయాండ్ బార్డర్స్ రిలీజ్‌కు మాత్రం మరింత సమయం పట్టే అవకాశం ఉంది. -
భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మెగాహీరో!
కెరీర్ తొలినాళ్లలోనే కోటి రూపాయల రెమ్యూనరేషన్ క్లబ్లో చేరడమంటే నటులకు మాటలు కాదు. కానీ కేవలం మూడో సినిమాలు మాత్రమే చేసిన మెగా హీరో అల్లు శిరీష్ తన తాజా సినిమా కోసం కోటి రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నట్టు సమాచారం. దర్శకుడు వీఐ ఆనంద్ రూపొందించబోతున్న తన తాజా సినిమా కోసం అల్లు శిరీష్ రూ. కోటి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. శిరీష్ తాజా సినిమా 'శ్రీరస్తు శుభమస్తు' మంచి విజయాన్ని సాధించింది. శాటిలైట్ హక్కుల సహా ఈ సినిమా రూ. 15 కోట్ల బిజినెస్ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అతను తన రెమ్యూనరేషన్‌ను కోటికి పెంచినట్టు తెలుస్తోంది. నిజానికి అల్లు శిరీష్ మొదటి రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో అతని తండ్రి అల్లు అరవింద్ రంగంలోకి దిగి 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాను తెరకెక్కించారు. 'శిరీష్‌కు పెద్ద కుటుంబ నేపథ్యం ఉంది. ఇది ఆయనకు మంచి పబ్లిసిటీ ఇచ్చే అవకాశముంది. అయితే, బాక్సాఫీస్ వద్ద అతని సినిమా విజయం మీద మిగతా విషయాలు ఆధారపడి ఉంటాయి' అని సినీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
వాళ్లే రియల్ హీరోస్ : అల్లు శిరీష్
శ్రీరస్తు శుభమస్తు సినిమాతో కెరీర్లో తొలి హిట్ అందుకున్న మెగా హీరో అల్లు శిరీష్.., ప్రస్తుతం తన మాలీవుడ్‌కి రెడీ అవుతున్నాడు. మలయాళ ఇండస్ట్రీలో ఇప్పటికే అల్లు అర్జున్‌కు మంచి ఫాలోయింగ్ ఉండటంతో అది కూడా శిరీష్ ఎంట్రీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అయితే మాలీవుడ్‌లో తొలి సినిమా సోలో హీరోగా కాకుండా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలో కీలక పాత్రలో చేస్తున్నాడు. 1971 నాటి యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శిరీష్ సైనికుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్ సమయంలో సైన్యం గురించి, యుద్ధం గురించి ఎంతో తెలుసుకున్నానన్న శిరీష్. 'మనదేశం, సైనికులకు ఎంతో రుణపడి ఉంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో, పెద్దగా సౌకర్యాలు లేని దగ్గర, వ్యక్తిగత జీవితాన్ని కూడా కాదనుకొని.. దేశం కోసం పనిచేసే వారు నిజమైన హీరోలు' అంటూ తన ట్విట్టర్ పేజ్ లో కామెంట్ చేశాడు. అంతేకాదు.. అన్న అల్లు అర్జున్‌కు కూతురు పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికి తన కృతజ్ఞతలు తెలియజేశాడు శిరీష్. -
మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మరో మెగా వారసుడు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే మాలీవుడ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా జనతా గ్యారేజ్ సినిమాతో సత్తా చాటాడు. తాజాగా మరోయంగ్ హీరో కూడా మాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. అల్లు వారబ్బాయిగా వెండితెరకు పరిచయం అయిన హీరో శిరీష్. తొలి రెండు సినిమాలతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన శిరీష్, మూడో సినిమాగా తెరకెక్కిన శ్రీరస్తు శుభమస్తుతో మంచి విజయం సాధించాడు. అదే ఊపులో ఇప్పుడు మాలీవుడ్ ఎంట్రీకి కూడా రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్‌కు కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో అది కూడా శిరీష్ ఎంట్రీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అంతేకాదు మాలీవుడ్‌లో శిరీష్ తన తొలి సినిమానే సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి నటిస్తుండటం విశేషం. మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ మూవీ '1971 బెయాండ్ బార్డర్స్' మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. 1971లో జరిగిన భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మేజర్ రవి దర్శకుడు. So, I'm making my Malayalam debut in @Mohanlal sir's "1971 : Beyond Borders" directed by Major Ravi, based on 71 Ind-Pak war.— Allu Sirish (@AlluSirish) 22 October 2016 -
శిరీష్.. సైన్స్ ఫిక్షన్
అల్లు శిరీష్ హీరోగా ‘టైగర్’ సినిమా ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తెరకెక్కనుంది. ‘శ్రీరస్తు శుభమస్తు’ తర్వాత మల్లిడి వేణు దర్శకత్వంలో చారిత్రక నేపథ్యమున్న సినిమా చేస్తున్నట్లు అల్లు శిరీష్ ప్రకటించారు. ఘనంగా ప్రారంభోత్సవం కూడా జరిగింది. అయితే ఈ సినిమాకి కాస్త టైమ్ పట్టేట్లు ఉందట. ఆ విషయం గురించి శిరీష్ మాట్లాడుతూ - ‘‘వేణుతో చేయాలనుకున్న సినిమా కథలో గ్రాఫిక్స్, యాక్షన్, సెట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ప్లానింగ్, ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్‌కి ఆరు నెలలు పడుతుంది. అందుకే, మధ్యలో మరో సినిమా చేయాలనుకున్నా’’ అన్నారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ దాదాపు పూర్తి కావచ్చింది. అందుకని శిరీష్‌తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టారు వీఐ ఆనంద్. ‘‘నవంబర్‌లో షూటింగ్ మొదలుపెడతాం’’ అని ఆయన తెలిపారు. -
కాలేజీలో సందడి చేసిన అల్లు శిరీష్
-
మా అమ్మ పేరు గీత కాదు నిర్మల
ఇటీవల శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి హిట్ అందుకున్న అల్లు శిరీష్ అభిమానులకు చేరువయ్యేందుకు ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శిరీష్, ప్రతీ చిన్న విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. గురువారం కృష్ణాష్టమి సందర్భంగా ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. అభిమానులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన శిరీష్, ప్రపంచానికి భగవద్గీతను అందించిన కృష్ణ భగవానుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు ఈ సందర్భంగా తన సొంత నిర్మాణ సంస్థ పేరు వెనక ఉన్న రహస్యాన్ని బయట పెట్టాడు. మా నాన్న భగవద్గీత ద్వారా ఎంతో ఇన్స్పైర్ అయ్యారు, అందుకే మా బ్యానర్‌కు గీతా ఆర్ట్స్ అని పేరు పెట్టారు. కానీ చాలా మంది మా అమ్మ పేరు గీత అనుకుంటారు.. కానీ ఆమె పేరు నిర్మల అని ట్వీట్ చేశాడు. Happy Krishnashtami everyone, happy birthday Lord Krishna. Thank you for sharing the world your wisdom thru the Bhagavad Gita. — Allu Sirish (@AlluSirish) 25 August 2016 My Dad was so inspired by the holy book that he named our co Geetha Arts. Many ppl think its my mum's name, her name is Nirmala. — Allu Sirish (@AlluSirish) 25 August 2016 -
చిరు కోసం అల్లు హీరో ప్రత్యేక పూజలు
► మద్దిలో అల్లు శిరీష్ సందడి ► చిరు సినిమా విజయం సాధించాలని పూజలు జంగారెడ్డిగూడెం : సినీ నటుడు అల్లు శిరీష్ జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయాన్ని శనివారం సందర్శించారు. మెగాస్టార్ చిరంజీవి నవ జన్మదిన మహోత్సవాలను జంగారెడ్డిగూడెం చిరంజీవి యువత నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా అల్లు శిరీష్ విచ్చేసి ఆంజనేయస్వామికి లక్ష తమలపాకులపూజ, పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. అనంతరం శిరీ ష్ మాట్లాడుతూ చిరంజీవి 150వ సినిమా ఘన విజయం సాధించాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండి మరిన్ని సినిమాల్లో నటించాలని ఆకాంక్షిస్తూ మద్ది అంజన్నకు పూజలు చేసినట్టు చెప్పారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు, గౌరవ అధ్యక్షుడు మద్దాల ప్రసాద్, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి తదితరులు పాల్గొన్నారు. -
గాయకుడిగా మారిన అల్లు శిరీష్
సౌత్ హీరోలు గాయకులుగా కూడా సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా తమన్ సంగీత సారధ్యంలో చాల మంది హీరోలు తమ గొంతును సవరించుకుంటున్నారు. సింగర్ వాయిస్‌తో సంబందం లేకుండా టెక్నాలజీని ఉపయోగించి ప్రతీ ఒక్కరినీ గాయకులుగా మార్చేస్తున్నాడు తమన్. ఇప్పటికే ఎన్టీఆర్, రవితేజలతో పాటు ధనుష్, శింబు లాంటి తమిళ స్టార్లతో కూడా తెలుగు పాటలు పాడించాడు తమన్. అదే బాటలో మరో యంగ్ హీరోను సింగర్‌గా మార్చేశాడు. ఇటీవల శ్రీరస్తు శుభమస్తు సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన అల్లు వారబ్బాయి శిరీష్‌తో ఓ పాట పాడించాడు తమన్. అయితే ఈ పాటను సినిమాలో యాడ్ చేయకపోయినా యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన తమన్, ఈ గాయకుడు ఎవరో గుర్తుపట్టమంటూ పజిల్ విసిరాడు. అయితే పాట పాడుతున్నప్పుడు అర్థం కాకపోయినా మధ్యలో వచ్చిన డైలాగ్స్‌లో మాత్రం అది శిరీష్ వాయిసే అని అర్ధమైపోతోంది. ఇదే జోష్‌లో తన నెక్ట్స్ సినిమాలో కూడా శిరీష్ పాటపాడేస్తాడేమో చూడాలి. So! It was me who sang the cover version of 'Anu Anu' song. Here's the full version. Lemme know what you felt. https://t.co/vwfc76MUOo — Allu Sirish (@AlluSirish) 17 August 2016 -
శ్రీరస్తు శుభమస్తు కలెక్షన్లు ఎంతో తెలుసా?
అల్లు కుటుంబం ట్యాగ్ పెట్టుకుని టాలీవుడ్లోకి వచ్చినా.. ఇప్పటివరకు సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న అల్లు శిరీష్‌కు మంచి హిట్ దొరికింది. తాజాగా శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మొదటి 9 రోజుల్లో మొత్తం రూ. 11 కోట్లు వసూలు చేసింది. ఇంతకుముందు శిరీష్, రెజీనా జంటగా నటించిన కొత్త జంట సినిమా వసూలుచేసిన మొత్తం కంటే ఈ మొదటి 9 రోజుల కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని.. శిరీష్ కెరీర్లోనే ఇది అత్యంత పెద్ద హిట్‌గా చెప్పుకోవచ్చని ట్రేడ్ అనలిస్ట్ త్రినాథ్ అన్నారు. ఇటు ప్రేక్షకుల ఆదరణతో పాటు ఇండస్ట్రీ పెద్దల నుంచి కూడా ఈ సినిమాకు గాను అల్లు శిరీష్ ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన సినిమా సక్సెస్ మీట్లో ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు అల్లు వారి చిన్నోడిపై ప్రశంసలు కురిపించారు. తాను శిరీష్‌ను, అల్లు అర్జున్ను, మహేశ్ బాబును బాలనటులుగా చాలాకాలం క్రితం పరిచయం చేశానని, ఇప్పుడు శిరీష్ మంచి నటుడిగా ఎదగడం గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు. భారీ హీరోయిజం చూపించే సినిమాలు కాకుండా.. తనకు సూటయ్యే పాత్రలను ఎంచుకోవడం బాగుందని చెప్పారు. 2013లో గౌరవం సినిమాతో హీరోగా పరిచయమైన శిరీష్.. ఆ తర్వాత కొత్తజంట, తాజాగా శ్రీరస్తు శుభమస్తు చేశాడు. -
రెండు చోట్ల కళ్లు చెమర్చాయి! - దాసరి నారాయణరావు
‘‘నేను దర్శకత్వం వహించిన ‘బంట్రోతు భార్య’ చిత్రంతో గీతా ఆర్ట్స్ బేనర్ ప్రారంభమైంది. ‘మాయాబజార్’ చిత్రంలో అల్లు అర్జున్ (బాల నటుడు)ని నేను నటుడిగా పరిచయం చేసిన విషయం చాలామందికి తెలియదు. అర్జున్ కంటే శిరీశ్నే నటుడిగా చూడాలని అల్లు రామలింగయ్య అనుకునేవారు. అరవింద్ పెంపకం వల్లో, చిరంజీవి అడుగుజాడల్లో నడవడం వల్లో ఏమో శిరీష్‌కు మంచి క్రమశిక్షణ ఉంది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. అల్లు శిరీష్, లావణ్యా త్రిపాఠి జంటగా పరశురామ్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ చిత్రం అభినందన సభలో దాసరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘శ్రీరస్తు శుభమస్తు’ని దర్శకుడు బాగా తీర్చిదిద్దాడు. సినిమా చూస్తున్నప్పుడు నేను రెండు చోట్ల కన్నీళ్లు పెట్టుకున్నా. కమర్షియల్‌గా కాకుండా ఓ మంచి చిత్రం తీయాలని అరవింద్ ఈ చిత్రం చేయడం అభినందనీయం’’ అన్నారు. ‘‘దాసరిగారిలాంటి ప్రతిభ గల దర్శకుణ్ణి శిరీష్ తన నటనతో ఇంప్రెస్ చేశాడంటే అదో పెద్ద అచీవ్మెంట్’’ అని వీవీ వినాయక్ అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులు మా చిత్రాన్ని ఇంత ఘన విజయం చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని పరశురామ్ చెప్పారు. ‘‘నాకు ఇంత మంచి హిట్ ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు’’ అని అల్లు శిరీష్ పేర్కొన్నారు. దర్శకులు సుకుమార్, నందినీరెడ్డి పాల్గొన్నారు. -
కమర్షియల్ హీరోగా...శుభమస్తు అని దీవించారు!
‘‘గంగోత్రి’కీ, ‘ఆర్య’కీ మధ్య బన్నీ (అల్లు అర్జున్) ఎంత వేరియేషన్ చూపించాడో... తన తొలి రెండు చిత్రాలకీ, ‘శ్రీరస్తు శుభమస్తు’కీ మధ్య అంతటి వేరియేషన్ శిరీష్ చూపించాడు. అన్న బన్నీలాగే శిరీష్ కూడా మంచి కథానాయకుడిగా ఎదుగుతాడు’’ అని నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ అన్నారు. అల్లు శిరీష్ హీరోగా గీతా ఆర్ట్స్ పతాకంపై పరశురామ్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం కర్ణాటకలోనూ మంచి వసూళ్లు రాబడుతోందని చిత్రబృందం పేర్కొంది. అందుకే బెంగళూరులో సక్సెస్‌మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో పలువురు కన్నడ చిత్రరంగ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. నటుడు-దర్శకుడు రమేశ్ అరవింద్ చిత్రబృందానికి శుభాకాంక్షలు అందజేశారు. శిరీష్ మాట్లాడుతూ - ‘‘అన్నయ్యని కర్ణాటక ప్రేక్షకులు లోకల్ హీరోగానే చూస్తుంటారు. నేనూ అలాగే దగ్గరవ్వాలనుకుంటున్నా’’ అన్నారు. ఇంకా చిత్రబృందం మాటల్లో పలు విశేషాలు... ♦ గీతా ఆర్ట్స్‌లాంటి సొంత నిర్మాణ సంస్థ అందుబాటులో ఉన్నప్పటికీ సినీ పరిశ్రమలో తాను చేయాలనుకొన్న ప్రయాణమే వేరని చాటుతూ ‘గౌరవం’గా కెరీర్‌ని ఆరంభించాడు శిరీష్. కొత్త రకమైన కథలపై శిరీష్ ఆసక్తి చూపుతున్నాడనే విషయం ఆ చిత్రంతోనే రుజువైంది. ఆ తర్వాత ‘కొత్తజంట’తో ప్రేక్షకులకు చేరువయ్యాడు. ప్రస్తుతం కథా బలమున్న చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’తో సందడి చేస్తున్నాడు. తనలో ఎంత మంచి నటుడున్నాడో ఈ చిత్రంతో నిరూపించాడు అల్లు శిరీష్. లుక్ వైజ్‌గానే కాకుండా, అన్ని రకాల భావోద్వేగాల్ని చక్కగా పలి కించి విమర్శకుల్ని సైతం ఆశ్చర్యపరిచాడు. శిరీష్ ప్రయత్నించకపోయినా ప్రేక్షకులు మాత్రం కమర్షియల్ హీరోగా శుభమస్తు అని దీవిస్తున్నారు. సినిమాకి లభిస్తున్న వసూళ్లే అందుకు సాక్ష్యం. ‘కొత్త జంట’ చిత్రానికి ఫుల్ రన్లో వచ్చిన షేర్‌ను ‘శ్రీరస్తు శుభమస్తు’ మొదటి వారంలోనే దాటేసింది. అటు క్లాస్‌నీ.. ఇటు మాస్‌నీ.. : ఇప్పుడిప్పుడే తొలి అడుగులేస్తున్న కథానాయకుడు శిరీష్. కానీ ఆయన ‘శ్రీరస్తు శుభమస్తు’తో సాధించిన వసూళ్లు మాత్రం సీనియర్ హీరోల స్టామినాకి తగ్గట్టుగా ఉన్నాయి. దీన్నిబట్టి ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ ఎలాంటిదో అర్థమవుతోంది. ఈ ఆదరణకి సినిమాలోని కంటెంటే ప్రధాన కారణమని చెప్పొచ్చు. పరశురామ్ తీర్చిదిద్దిన ఈ సినిమాలో కంటెంట్ గురించి తెలుసుకొని క్లాసూ, మాసూ అనే తేడా లేకుండా ప్రేక్షకులు థియేటర్లవైపు కదులుతున్నారు. శిరీష్ మరో స్థాయికి: తొలి రెండు సినిమాల్లో శిరీష్‌ని చూసినవాళ్లు ‘కుర్రాడు ఇంకా రాటుదేలాలి’ అన్నా రు. ‘శ్రీరస్తు శుభమస్తు’తో ఓ కథానాయకుడు నటనలో రాటుదేలడమంటే ఏంటో నిరూపించా డు శిరీష్. ఒకపక్క కామెడీ చేశాడు, మరోపక్క భావోద్వేగాల్ని పండించాడు. ఇంకో పక్క రొమాంటిక్ హీరో అనిపించుకొనే ప్రయత్నం కూడా చేశాడు. సినిమాని చూసినవాళ్లంతా శిరీష్‌లో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు. నిస్సందేహంగా ‘శ్రీరస్తు శుభమస్తు’ శిరీష్‌ని ఓ మెట్టు పైకి ఎక్కించి మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రమవుతుంది. అన్న అడుగు జాడల్లో: అల్లు అర్జున్ ఓ మాస్ కథానాయకుడు. ఆయన సినిమా విడుదలవుతోందంటే ఆంధ్ర, తెలంగాణే కాదు... కర్ణాటక, కేరళతోపాటు ఓవర్సీస్లోనూ పెద్ద ఎత్తున హంగామా కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లోనే నడవాలనుకొంటున్నా డు శిరీష్. అంటే బన్నీలా శిరీష్ కూడా మాస్ కథలు చేయబో తున్నాడని కాదు. అన్నయ్యలాగే అన్ని ప్రాంతాల్లోని ప్రేక్షకుల్ని అలరించాలని అనుకుంటున్నాడు. -
బాహుబలి వంటి సినిమాలు చేసేముందు..
బెంగళూరు: బాహుబలి వంటి భారీ బడ్జెట్ చిత్రాలను చేయాలంటే నటుడిగా తాను పరిణతి సాధించాల్సి ఉందని మెగా హీరో అల్లు శిరీష్ అన్నాడు. ఎస్ఎస్ రాజమౌళి వంటి దర్శకులు తనకు మాస్ చిత్రాల్లో నటించే అవకాశం ఇస్తే చాలా సంతోషిస్తానని చెప్పాడు. అల్లు శిరీష్ నటించిన తాజా సినిమా శ్రీరస్తు శుభమస్తుకు పాజిటీవ్ టాక్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ కోసం బెంగళూరు వెళ్లిన అల్లు శిరీష్ పీటీఐతో మాట్లాడుతూ.. తన ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పాడు. 'రాజమౌళి వంటి దర్శకులు నాకు మాస్ హీరోగా నటించే అవకాశమిస్తే సంతోషిస్తా. అయితే మొదటి నటుడిగా నేను పరిణతి చెందాలి. బాహుబలి వంటి భారీ బడ్జెట్ చిత్రాలు చేసేముందు నేను నాలుగైదు సినిమాల్లో నటించాలి. యాక్షన్ సినిమాల కంటే కాలేజీ రోమాన్స్ తరహా చిత్రాలకే ప్రస్తుతం నేను ప్రాధాన్యం ఇస్తా. అలాగని నేను యాక్షన్ సినిమాల్లో నటించడానికి వ్యతిరేకం కాదు. యావరేజ్ సినిమాలు కూడా భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. యువ నటుడిగా కాలేజీ లవ్ స్టోరీ తరహా సినిమాలు చేయాలనుకుంటున్నా' అని అల్లు శిరీష్ చెప్పాడు. సోదరుడు అల్లు అర్జున్‌తో కలసి నటిస్తారా అన్న ప్రశ్నకు.. తామిద్దరూ అన్నాదమ్ములుగా నటించే అవకాశం వస్తే అంగీకరిస్తానని చెప్పాడు. -
వెంకన్న సేవలో అల్లు శిరీష్
తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని యువ హీరో అల్లు శిరీష్ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఆయనతో పాట ఇటీవల ఆయన నటించిన చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’ దర్శకుడు పరశురామ్ కూడా ఉన్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో వారు స్వామి సేవల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
విజయం.. గౌరవం... రెండూ దక్కాయి
అల్లు శిరీష్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన సినిమా ‘శ్రీరస్తు శుభమస్తు’. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు. యువతరం అభిరుచులకు తగ్గట్టు కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన పరశురామ్ (బుజ్జి) ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చిత్రబృందం తెలిపారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పరశురామ్ ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘శ్రీరస్తు శుభమస్తు’కి లభిస్తున్న స్పందనపై మీ అనుభూతి? ఓ మంచి కథ చెప్పారంటూ ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. అన్ని ఏరియాల నుంచి చక్కటి ప్రేక్షకాదరణ లభిస్తోంది. విజయంతో పాటు దర్శకుడిగా నాకు గౌరవం తీసుకొచ్చిన చిత్రమిది. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడంతో ఆనందంగా ఉంది. ఇలాంటి కథలు ప్రేక్షకులకు చేరువైనప్పుడు ఎనర్జీ వస్తుంది. లేదంటే ఇంత కష్టపడ్డా ఫలితం రాలేదని మూస కథలు వైపు వెళ్లాలనిపిస్తుంది. కానీ, ప్రేక్షకులు తమకు మంచి అభిరుచి ఉందని నిరూపించారు. ఓ దర్శకుడిగా ఇంతకంటే ఆనందం ఏముంటుంది? చెప్పండి. అల్లు శిరీష్ కోసమే ఈ కథ రాశారా? అవునండి. సిరి (అల్లు శిరీష్)తో ముందు మరో సినిమా తీయాలనుకున్నాను. ‘హిట్ సినిమా కాదు, నా కెరీర్లో గుర్తుండే ఓ మంచి సినిమా కావాలి’ అని సిరి అడిగాడు. తిరుపతిలో దేవుణ్ణి దగ్గర్నుంచి చూసే సన్నివేశం స్ఫూర్తితో అప్పుడీ కథ రాశా. నా కథను నమ్మి అల్లు అరవింద్, సిరిలు ఎంతో ప్రోత్సహించారు. ఓ టీచర్లా పరశురామ్ నాకు చాలా విషయాలు నేర్పారని అల్లు శిరీష్ అన్నారు.. శిరీష్ సంస్కారం అది. కథ రాసి, సినిమా తీయడానికి నేను పడిన కష్టం కంటే నటుడిగా అతను పడ్డ కష్టమే ఎక్కువ. పాత్రకు అనుగుణంగా తనను తాను మలచుకున్నాడు. ‘మీకెలా కావాలో చెప్పండి, నటిస్తా’ అన్నాడు. నేనెంత చెప్పినా తెరపై చేసింది అతనే కదా. క్లైమాక్స్ సీన్స్ తీసే టైమ్‌కి మా ఇద్దరికీ బాగా సింక్ అయ్యింది. చాలా సహజంగా నటించాడు. లావణ్యా త్రిపాఠి, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్.. ప్రతి ఒక్కరూ బాగా చేశారు. దర్శకుడిగా కంటే మాటల రచయితగానే ఈ చిత్రం మీకు ఎక్కువ పేరు తెచ్చినట్లుంది? కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, డెరైక్షన్ అంటూ విడదీసి చూడడం నాకు తెలియదు. కథతో పాటు సహజంగా ఉండేలా మాటలు రాస్తాను. ప్రత్యేక శ్రద్ధ ఏమీ తీసుకోను. గతంలో రైటర్ కమ్ డెరైక్టర్స్ పూరి జగన్నాథ్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ వద్ద పనిచేయడంతో ఆ పద్దతి అలవాటయింది. ‘బొమ్మరిల్లు’తో మీ సినిమాను పోల్చడం గురించి? నేపథ్యం ఒక్కటే కావొచ్చు కానీ, భావోద్వేగాల్ని వ్యక్తం చేసిన విధానం వేరు. ఈ చిత్రాన్ని ‘బొమ్మరిల్లు’తో చిరంజీవిగారు పోల్చినప్పుడు చాలా సంతోషమేసింది. నాపై పూరి, భాస్కర్ల ప్రభావం ఉంది. గురువుగారి హిట్ సినిమాతో పోలిస్తే గర్వంగానే ఉంటుంది కదా. తదుపరి సినిమా? లవ్ ఎంటర్టైనర్ చేస్తా. గీతా ఆర్ట్స్ సంస్థలోనే ఉంటుంది. నేను రాసుకున్న కథలన్నీ అల్లు అరవింద్‌గారు, బన్నీ వాసులకు తెలుసు. హీరో ఎవరనేది అల్లు అరవింద్‌గారే చెప్పాలి. -
'శ్రీరస్తు శుభమస్తు' మూవీ రివ్యూ
కొత్త సినిమా గురూ! చిత్రం: శ్రీరస్తు శుభమస్తు నిర్మాత: అల్లు అరవింద్ దర్శకత్వం: పరశురామ్ సంగీతం: ఎస్.ఎస్.తమన్, నటీనటులు: అల్లు శిరీష్, లావణ్యా త్రిపాఠి, అలీ, రావు రమేశ్, ప్రకాశ్ రాజ్, తనికెళ్ల భరణి, ప్రభాస్ శీను తదితరులు ఉరుకుల పరుగుల ఈ జీవితంలో మెదడుకి పని చెప్పకుండా రెండున్నర గంటలు హాయిగా సాగిపోయే చిత్రాలకు ప్రేక్షకాదరణ చెప్పుకోదగ్గ రీతిలో ఉంటుంది. కథలో కొత్తదనం, లాజిక్కులకు ఆస్కారం లేదిక్కడ. కాసేపు నవ్వించి, మనసును కదిలిస్తే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అటువంటి ఫార్ములాతో వచ్చిన చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. ఇండియాలోని అత్యంత సంపన్నులైన వందమంది వ్యాపారవేత్తల్లో కృష్ణమోహన్ (ప్రకాశ్‌రాజ్) ఒకరు. పెద్ద కుమారుడు ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మిడిల్ క్లాస్ వాళ్లంటే అతని తండ్రికి చిన్న చూపు. ఓవర్‌నైట్‌లో కోటీశ్వరులు అయిపోవాలనే కాంక్షతో పెద్దింటి అబ్బాయిలను ప్రేమలో పడేసి, పెళ్లి చేసుకుంటారన్నది ఆయన అభిప్రాయం. పెళ్లయిన ఐదేళ్లకు కూడా కోడలి పేరు ఆయనకు తెలియదు. ఆమెకు విలువ ఇవ్వడు. ఈ నేపథ్యంలో రెండో కుమారుడు సిరి అలియాస్ శిరీష్ (అల్లు శిరీష్) కూడా ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి అను అలియాస్ అనన్య (లావణ్యా త్రిపాఠి)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ‘నువ్వు ఆస్తిపరుడివి కాదు.. జస్ట్ మిడిల్ క్లాస్ అబ్బాయి అని తెలిస్తే ఆ అమ్మాయి నిన్ను ప్రేమించదు’ అని కొడుకుతో తండ్రి అంటాడు. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిగానే ఆ అమ్మాయి ప్రేమను గెల్చుకుంటానని కొడుకు చాలెంజ్ చేస్తాడు. ఈ చాలెంజ్‌లో సిరి గెలిచాడా? లేదా? సిరి ఆస్తిని చూసి అను ప్రేమించిందా? లేదా మనసునా? ఈ ప్రేమకథ ఏ కంచికి చేరిందనేది మిగతా సినిమా. హీరోయిన్‌కి దగ్గరవడం కోసం హీరో వేసే నాటకాలు, ఆమెను ఓ ఆట ఆడుకోవడం, ఆ తర్వాత హీరోయిన్ ప్రేమలో పడడం వంటి అంశాలతో ఫస్టాఫ్కి ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకండాఫ్‌లో ఇటు తండ్రి గౌరవానికి విలువ ఇస్తూనే ప్రేమను వ్యక్తం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న అమ్మాయి మానసిక సంఘర్షణ.. అటు తాను ప్రేమించిన అమ్మాయి చేతే తమ ప్రేమను అందరికీ వ్యక్తం చేయించాలని అబ్బాయి చేసే ప్రయత్నాలతో కథ ముగింపుకి చేరుతుంది. కథగా చెప్పుకుంటే ‘శ్రీరస్తు శుభమస్తు’లో కొత్తదనం తక్కువ కానీ.. కామెడీ, ఎమోషన్స్ కరెక్ట్‌గా కుదిరాయి. అల్లు శిరీష్ నటనలో గత చిత్రాల కంటే పరిణితి కనిపించింది. స్టైలిష్‌గా కూడా ఉన్నాడు. అందంగా కనిపించడంతో పాటు నటిగానూ లావణ్యా త్రిపాఠి ఆకట్టుకుంది. ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్, తనికెళ్ల భరణి, సుమలత వంటి నటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు. ఫస్టాఫ్‌లో ప్రభాస్ శీను, సెకండాఫ్‌లో అలీ, సుబ్బరాజ్‌లు నవ్వించారు. తమన్ పాటలు, నేపథ్య సంగీతం కథకు తగ్గట్టున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ‘ప్రేమను వ్యక్తం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను కానీ గమనించలేని గుడ్డిదాన్ని కాదు’, ‘ఈ లోకంలో అదృష్టవంతుడు ఎవరో తెలుసా? ఆడపిల్లకు పెళ్లి చేసి పంపిన తర్వాత అర్ధరాత్రి కూతురు దగ్గర నుండి ఫోన్ వస్తుందేమో అని భయపడకుండా నిద్రపోయేవాడు’, ‘అమ్మ కదా, త్వరగా అర్థం చేసుకుంది’ వంటి డైలా గ్స్‌తో రచయితగా తనలోని దర్శకుడికి పరశురామ్ పెద్ద సహాయమే చేశారు. కథలో అంత కొత్తదనం లేకపోయినా మాటలతో సందర్భానికి అనుగుణంగా వినోదాన్ని, భావోద్వేగాలను ప్రేక్షకులను చేరువయ్యేలా చేయడంలో చాలా వరకూ సక్సెస్ అయ్యారు.