Allu Arjun Gets Very Emotional For Allu Sirish Words, Video Viral | Urvasivo Rakshasivo Blockbuster Celebrations - Sakshi
Sakshi News home page

Allu Arjun: తమ్ముడి మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న బన్నీ, వీడియో వైరల్‌

Published Mon, Nov 7 2022 10:05 PM | Last Updated on Tue, Nov 8 2022 9:16 AM

Allu Arjun Gets Emotional Over Allu Sirish Comments - Sakshi

అల్లు శిరీష్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో. రాకేశ్‌ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని నిర్మించారు. ఈ నెల 4న విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఊర్వశివో రాక్షసివో బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా వచ్చాడు. 

అల్లు శిరీష్‌ మాట్లాడుతున్న సమయంలో బన్నీ ఎమోషనలయ్యాడు. 'అరవింద్‌ గారి అబ్బాయిగా పుట్టడం నా అదృష్టం. బన్నీ అన్న.. నన్ను ఓ తమ్ముడిలా కాకుండా కొడుకులా చూస్తాడు. ఎప్పుడైనా విష్‌ చేయాలంటే మై బేబీ సిరి అని రాస్తాడు. నన్ను చిన్నపిల్లాడిలా బుగ్గలు గిల్లి ముద్దు చేస్తుంటాడు. మా అన్నయ్యకు నేనంటే అంత ప్రేమ. అలాంటి అన్నయ్యకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం' అని శిరీష్‌ మాట్లాడుతున్న సమయంలో బన్నీ కంటతడి పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: దానివల్ల ఎలిమినేట్‌ అయ్యానంటే నేను ఒప్పుకోను: గీతూ
డబ్బులు, కెరీర్‌, రిలేషన్‌.. అన్నింటా ఒత్తిడే: నటి మాజీ భర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement