Urvasivo Rakshasivo Movie
-
OTT release : 'యశోద', 'ఊర్వశివో రాక్షసివో' మూవీస్ థియేటర్స్‌లో మిస్ అయ్యారా?
సినీ అభిమానులకు శుక్రవారం వచ్చిందంటే పండగే. ఎందుకంటే సినిమాలు చాలావరకు ఆరోజే రిలీజ్ అవుతుంటాయి. ఇక ఈ మధ్యకాలంలో ఓటీటీల ప్రభావం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. థియేటర్లో సినిమా మిస్ అయిన వాళ్లు ఆ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. మరి ఒకేరోజు ఓటీటీలో మూడు సినిమాలు విడుదలైతే? ఈ శుక్రవారం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేస్తున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. సమంత ప్రధాన పాత్రలో నటించి యశోద సినిమా రీసెంట్గా హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 11న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ. 30కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీని థియేటర్స్‌లో మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేందుకు ఎదురు చూస్తున్నారు. రేపు( శుక్రవారం) యశోద సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హీరో నితిన్, కృతిశెట్టి హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ఆగస్ట్ 12న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. ఎలాగైన ఈసారి హిట్ కొట్టాలని ఎదురు చూసిన నితిన్‌కు నిరాశే మిగిలింది. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ 'జీ 5'లో డిసెంబరు 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. హీరో అల్లు శిరీష్, అను ఇమ్మానుయేట్ జంటగా నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా శిరీష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అయింది.డిసెంబర్ 9 నుంచి ‘ఆహా’లో ప్రీమియర్ కానుంది. పెళ్లి మంచిదా.. లివ్ ఇన్ రిలేషన్ షిప్ మంచిదా అనే దానిపై ఎవరికీ స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పలేరు. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే ఊర్వశివో రాక్షసివో. థియేటర్లో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసేయండి మరి. -
‘ఓటీటీ’లోకి ‘ఊర్వశివో రాక్షసివో’..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
అల్లు హీరో శిరీష్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అను ఇమ్మానుయేల్ హీరోయిన్. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న థియేటర్స్‌లో విడుదలైంది. లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అయింది. డిసెంబర్ 9 నుంచి ‘ఆహా’లో ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ ‘ప్రస్తుత కాలానికి చెందిన అమ్మాయి, అబ్బాయికి చెందిన ప్రేమకథా చిత్రమిది. నేటి తరం యువ జంటలు ఎదుర్కొన్న సవాళ్లను ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఇలాంటి సినిమాను ఆహా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. ఓ భావోద్వేగాన్ని మన చుట్టూ ఉండే అనే పరిస్థితులు ముందుకు నడిపిస్తాయి. ప్రతి సంబంధం దేనికదే ప్రత్యేకం. పెళ్లి మంచిదా.. లివ్ ఇన్ రిలేషన్ షిప్ మంచిదా అనే దానిపై ఎవరికీ స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పలేరు. అలాంటి ఓ ఆలోచనను సమాజం ఆకట్టుకునేలా ఊర్వశివో రాక్షసివో చిత్రాన్ని తెరకెక్కించారు. , వెన్నెల కిషోర్, సునీల్, ఆమని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఏడ్చేసిన అల్లు అర్జున్, వీడియో వైరల్
అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ఈ నెల 4న విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఊర్వశివో రాక్షసివో బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చాడు. అల్లు శిరీష్ మాట్లాడుతున్న సమయంలో బన్నీ ఎమోషనలయ్యాడు. 'అరవింద్ గారి అబ్బాయిగా పుట్టడం నా అదృష్టం. బన్నీ అన్న.. నన్ను ఓ తమ్ముడిలా కాకుండా కొడుకులా చూస్తాడు. ఎప్పుడైనా విష్ చేయాలంటే మై బేబీ సిరి అని రాస్తాడు. నన్ను చిన్నపిల్లాడిలా బుగ్గలు గిల్లి ముద్దు చేస్తుంటాడు. మా అన్నయ్యకు నేనంటే అంత ప్రేమ. అలాంటి అన్నయ్యకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం' అని శిరీష్ మాట్లాడుతున్న సమయంలో బన్నీ కంటతడి పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Brother bond ❤️🥹🤝Bunny got emotional listing to brother @AlluSirish speech at #UrvasivoRakshasivo success celebration#AlluArjun@alluarjun@ArtistryBuzz #Pushpa2 pic.twitter.com/i8UO4MwB1p — ARTISTRYBUZZ (@ArtistryBuzz) November 6, 2022 About #PushpaTheRule 🔥 2023 next sensation #AlluArjun pic.twitter.com/oo9EkHgMls — Monika -YASHODAFromNOV11th (@Iam_MonikAArjun) November 6, 2022 చదవండి: దానివల్ల ఎలిమినేట్ అయ్యానంటే నేను ఒప్పుకోను: గీతూ డబ్బులు, కెరీర్, రిలేషన్.. అన్నింటా ఒత్తిడే: నటి మాజీ భర్త -
'ఊర్వశివో రాక్షసివో' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Urvasivo Rakshasivo: అందుకే అనుతో కెమిస్ట్రీ వర్కౌట్ అయింది
‘ఊర్వసివో రాక్షసివో సినిమా చూసినవాళ్లంతా అను ఇమ్మాన్యుయేల్‌తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. దానికి ప్రధాన కారణం సెట్స్‌కి వెళ్లడానికి ముందు మేం చేసిన ముందస్తు సన్నాహాలే. రొమాంటిక్ సన్నివేశాల్లో మాలో ఎలాంటి సందేహాలు లేవు. వీటికి కవితాత్మకంగా తెరపై చూపించామే తప్ప ఎక్కడా అసభ్యంగా చూపించలేదు’అని అల్లు శిరీష్ అన్నారు. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. తమిళ్ సూపర్ హిట్ ‘ప్యార్ ప్రేమ కాదల్’కి రీమేక్‌గా వచ్చిన చిత్రమిది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ శనివారం మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు.. ► కథ బాగా నచ్చితే తప్ప సినిమా చేయను. అందుకే సినిమా సినిమాకి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. రాకేశ్ శశి గతంలో నాకు రెండు మూడు కథలు చెప్పాడు. కానీ అవి వర్కౌట్ కాలేదు. చివరకు ఊర్వశివో రాక్షసివో చిత్రంలో మా కాంబినేషన్ సెట్ అయింది. ► ఈ సినిమా పట్టాలెక్కడానికి ప్రధాన కారణం మా నాన్న(అల్లు అరవింద్). ‘ప్యార్ ప్రేమ కాదల్’ ఆయనకి బాగా నచ్చింది. ఈ సినిమా బాగుంది..నీకు సెట్ అవుతుందని నాతో చెప్పాడు. దాంతో నేను కూడా ఆ సినిమా చూశా. నాకు కూడా బాగా నచ్చింది. మాతృకకు మరింత కామెడిని యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ► సినిమా చూసిన వాళ్లంతా మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీకుమార్ పాత్రలో ఒదిగిపోయావంటూ అభినందిస్తున్నారు. అయితే ఆ పాత్ర చేయడానికి టాలీవుడ్లో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ సింధూజ పాత్రలో అనుని తప్ప మరొకరిని ఊహించలేం. ఆ పాత్రలాగే మొండితనం ఉన్న అమ్మాయి అను. అందుకే సింధూజ పాత్రలో ఒదిగిపోయింది. ► నాకు వివాహ వ్యవస్థపై నమ్మకం ఉంది. సహజీవనంతో ప్రయాణం మొదలు పెట్టి పెళ్లి చేసుకోవాడన్ని ఇష్టపడతా. నా పెళ్లి విషయంలో ఇంట్లో ఒత్తిడేమి లేదు. పెళ్లనేది కూడా హిట్ సినిమా లాంటిదే. దానంతట అదే రావాలి తప్ప మనం అనుకుంటే రాదు(నవ్వుతూ..) ► రొమాంటిక్ కామెడీ సినిమాలకు ఇదివరకు ఓ మార్కెట్ ఉండేది. ఇప్పుడది ఓటీటీ జోనర్ అయింది. సింపుల్ డ్రామాలు, పాత్ర ప్రధానమైన కథలు ఓటీటీల్లోనే చూస్తున్నారు. ‘కాంతార’ తరహా చిత్రాలు, స్టార్ హీరోల సినిమాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తున్నాయి. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం. -
Urvasivo Rakshasivo: తమ్ముడికి సపోర్ట్‌గా అల్లు అర్జున్
ఎట్టకేలకు అల్లు శిరీష్ ఖాతాలో ఓ హిట్ పడింది. శుక్రవారం విడుదలైన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఓపెనింగ్స్ భారీ రేంజ్లో రాకపోయినా.. రెండో రోజు మాత్ర భారీ స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. సునీల్, వెన్నెక కిశోర్‌ల కామెడీ, శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్‌ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం ఫుల్ హ్యాపీగా ఉంది. శుక్రవారం సాయత్రమే సక్సెస్ మీట్ పెట్టి తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ఊర్వసివో రాక్షసివో మూవీ రివ్యూ) ఇక ఆదివారం ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించాలని చిత్రయూనిట్ నిర్ణయించుకుంది. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. తమ్ముడికి సపోర్ట్‌గా అన్న వస్తుండడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. శిరీష్‌కు జోడీగా అను ఇమ్మాన్యూయెల్ హీరోయిన్గా నటించింది. సునీల్, వెన్నెల కిశోర్, ఆమని ఇతర కీలక పాత్రలు పోషించారు. 𝑰𝑪𝑶𝑵 𝑺𝑻𝑨𝑹 @alluarjun garu to grace the 𝒀𝑶𝑼𝑻𝑯𝑭𝑼𝑳 𝑩𝑳𝑶𝑪𝑲𝑩𝑼𝑺𝑻𝑬𝑹 celebrations of #UrvasivoRakshasivo as chief guest on Nov 6th @ JRC Convention, Hyd. 🤩@AlluSirish @ItsAnuEmmanuel @rakeshsashii @tanvirmir #AchuRajamani @anuprubens @GA2Official pic.twitter.com/s8GAY8Otsi — Geetha Arts (@GeethaArts) November 5, 2022 -
నేను వాటిని పట్టించుకోను.. కానీ మా అమ్మే: అను ఇమ్మానియేల్
మజ్ను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయైన బ్యూటీ అను ఇమ్మానుయేల్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల ఈ భామ అల్లు శిరీష్‌తో డేటింగ్లో ఉందంటూ వార్తలొచ్చినా సంగతి తెలిసిందే. వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరగుతున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడిచింది. తాజాగా ఈ వార్తలపై అను ఇమ్మానియేల్ స్పందించారు. (చదవండి: అల్లు అరవింద్ అలా అడిగేసరికి షాక్ అయ్యాను : అను ఇమ్మానుయేల్) అను మాట్లాడుతూ.. 'అందులో ఎలాంటి నిజం లేదు. నటీనటులపై ఇలాంటి వార్తలు రావడం సహజం. ఇలాంటి అసత్య ప్రచారాలను నేను పట్టించుకోను. ఈ వార్తలు చదివి మా అమ్మ చాలా బాధపడింది' అని తెలిపింది. అను ఇమ్మానియేల్, అల్లు శిరీష్ జంటగా నటించిన ఊర్వశివో రాక్షసివో నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహించారు. యువతను ఆకర్షించేలా ప్రేమ, సహజీవనం అంశాలతో ఈ మూవీని రూపొందించారు. దీంతో ఈ సినిమా ప్రచార చిత్రాలు విడుదలైన నాటి నుంచి.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వరుస వార్తలు వైరలయ్యాయి. -
రెండు ఓటీటీల్లోకి రానున్న ఊర్వశివో రాక్షసివో, స్ట్రీమింగ్ అప్పుడే
చాలా గ్యాప్ తర్వాత అల్లు హీరో శిరీష్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అను ఇమ్మానుయేల్ హీరోయిన్. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి షో నుంచే ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. ఫలితంగా శిరీష్ ఖాతాలో ఓ కమర్షియల్ హిట్ పడింది. ఇక థియేటర్లో అలరిస్తున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. చదవండి: చివరి రోజుల్లో ‘మహానటి’ సావిత్రికి సెట్లో అవమానం, అన్నం కూడా పెట్టకుండా.. ఈ మూవీని రెండు ఓటీటీ ప్లాట్ఫాంస్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ తెలుగు ఓటీటీ ఆహా వీడియోస్, నెట్‌ఫ్లిక్స్‌లు ఫ్యాన్సీ డీల్‌కు ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఏ సినిమా అయినా థియేట్రికల్ రన్ అనంతరం 8 వారాల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫాం వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పడు ఈ మూవీ కూడా 2 నెలల రోజుల తర్వాత ఓటీటీకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మించారు. చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన సుడిగాలి సుధీర్.. ఫుల్ ఖుషిలో ఫ్యాన్స్ -
అల్లు శిరీష్ 'ఊర్వశివో రాక్షసివో' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
Urvasivo Rakshasivo Review: ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ రివ్యూ
టైటిల్: ఊర్వశివో రాక్షసివో నటీనటులు: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, వెన్నెల కిశోర్, ఆమని, అనీష్ కురువిల్లా తదితరులు నిర్మాణ సంస్థలు: జీఏ2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాతలు: తమ్మారెడ్డి భరద్వాజ, ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం సమర్పణ: అల్లు అరవింద్ దర్శకత్వం: రాకేశ్ శశి సంగీతం: అచ్చు రాజమణి (మాయారే పాట: అనూప్ రూబెన్స్) సినిమాటోగ్రఫీ: తన్వీర్ ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ విడుదల తేది: నవంబర్ 4, 2022 గౌరవం’సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు వచ్చాయి. ఆ తర్వాత కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం లాంటి విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. శీరీష్ నుంచి చివరగా వచ్చిన ‘ఎబిసిడి’ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన శీరీష్.. రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ఊర్వశివో రాక్షసివో'తో నేడు(నవంబర్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మూడేళ్ల విరామం తర్వాత అల్లు శిరీష్ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో' చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. శ్రీకుమార్ అలియాస్ శ్రీ(అల్లు శిరీష్) ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న శ్రీకి పక్క ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తున్న సింధూజ అలియాస్ సింధు(అనూ ఇమ్మాన్యుయేల్) అంటే చాలా ఇష్టం. సింధూ..కెరీర్లో మంచి స్థాయికి ఎదగాలనే తపన ఉన్న అమ్మాయి. అమెరికాలో చదువుకొని ఇండియా వచ్చి మోడ్రన్ లైఫ్‌ని గడుపుతుంది. ఆమెకి పెళ్లి అంటే నచ్చదు. కానీ శ్రీకుమార్‌ని ఇష్టపడుతుంది. ఇద్దరు కలిసి సహజీవనం చేసేందుకు సిద్ధపడతారు. దీని కోసం శ్రీ తన ఇంటికి దగ్గరలో ఓ ఇల్లుని అద్దెకు తీసుకుంటాడు. మరోవైపు శ్రీకుమార్కి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తుంటారు అతని తల్లిదండ్రులు (ఆమని, కేదార్ శంకర్). శ్రీ మాత్రం తల్లిదండ్రుల దగ్గర సహజీవనం చేస్తున్న విషయాన్ని దాచి, సింధూని పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆమె అందుకు ఒప్పకోదు. కొడుకు పెళ్లి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న శ్రీ తల్లి ఓ రోజు అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతుంది. ఈ విషయం తెలిసిన తర్వాత శ్రీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తల్లి కోసం పెళ్లి చేసుకున్నాడా? లేదా ప్రేయసిని దక్కించుకోవడం కోసం సహజీవనాన్ని కొనసాగించాడా? కొడుకు తప్పిపోయాడని శ్రీ పేరెంట్స్ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారు? సహజీవనం విషయాన్ని తల్లిదండ్రులకు తెలియకుండా ఉంచడానికి శ్రీ పడిన కష్టాలేంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఎలాంటి గోల్ లేకుండా సాధారణ జీవితాన్ని గడిపే ఓ అమాయకపు యువకుడికి, కెరీర్ ఓరియెంటెడ్ అమ్మాయికి మధ్య ప్రేమకథ ఎలా నడించింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే యూత్ టార్గెట్‌గా తీసిన మూవీ అని అర్థమవుతుంది. కథనం కూడా అలాగే సాగుతుంది. ప్రతి 10 నిమిషాలకు ఒక రొమాంటి సీన్‌తో ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ప్రస్తుతం చాలా మంది యువతీయువకులు లివింగ్ లైఫ్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదే పాయింట్‌తో దర్శకుడు రాకేశ్ శశి ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ కథలో కొత్తదనం ఏమి ఉండదు.. కానీ ఫుల్ కామెడీ, రొమాంటిక్ సీన్స్‌తో సాగడంతో ఎక్కడా బోర్కొట్టినట్లు అనిపించదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌ని ఓ వర్గం ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎలాంటి సాగదీత లేకుండా సినిమా స్ఠార్టింగ్ నుంచే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ సాగుతుంది. ప్రేమించిన అమ్మాయి.. తను పని చేసే ఆఫీస్‌లోకి రావడం.. తన ప్రేమ విషయాన్ని ఆమెతో చెప్పడానికి హీరో పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. ఇక సెకండాఫ్ మొత్తం సహజీవనం చుట్టే సాగుతుంది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, కామెడీ ఆకట్టుకుంటాయి. సహజీవనం ఎపిసోడ్‌ని క్రికెట్ కామెంట్రీతో ముడిపెట్టి చెప్పడంతో కామెడీ బాగా పండింది. అయితే ఈ చిత్రంలో ఎమోషన్స్‌ని కూడా యాడ్ చేశారు కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. హీరోయిన్ పెళ్లి ఎందుకు వద్దనుకుంటుందో అనేదానికి బలమైన కారణాన్ని చూపించలేదు. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు కానీ..యూత్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. చాలా కాలం తర్వాత అల్లు శిరీష్ తెరపై కనిపించాడు. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో ఆయన నటన చాలా మెరుగుపడింది. మిడిల్ క్లాస్ యువకుడు శ్రీకుమార్ పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన కామెడీతో అదరగొట్టేశాడు. మోడ్రన్ అమ్మాయి సింధూ పాత్రకి అనూ ఇమ్మాన్యుయేల్ న్యాయం చేసింది. తన గ్లామర్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. శిరీష్, అనూల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం సునీల్, వెన్నెల కిశోర్‌ల కామెడీ. వీరిద్దరు కలిసి పండించిన కామెడీకి ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు. పొసాని కృష్ణమురళి ఒకటి రెండు సీన్స్‌లో కనిపించినా.. తనదైన శైలీ కామెడీతో నవ్వించాడు. హీరో తల్లిగా ఆమని మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించారు.కేదార్ శంకర్, పృథ్వితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అచ్చు రాజమణి సంగీతం బాగుంది. పాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. తన్వీర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి, వెబ్‌డెస్క్ -
అదే నాకు అతి పెద్ద ప్రశంస: ‘ఊర్వశీవో రాక్షసివో’ డైరెక్టర్
‘‘ఊర్వశివో.. రాక్షసివో’ చిత్రం వినోదాత్మకంగా ఉంటుంది. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. ఈ సినిమా ప్రివ్యూ అయిన తర్వాత శిరీష్‌గారు, ‘తెరపై నేను కనపడలేదు.. నేను చేసిన శ్రీకుమార్ పాత్ర మాత్రమే కనిపించింది.. థ్యాంక్స్’ అన్నారు.. అదే నాకు అతి పెద్ద ప్రశంస. ఆ తర్వాత అల్లు అరవింద్‌గారు కూడా హీరో క్యారెక్టర్ అద్భుతంగా ఉందన్నారు’’ అని దర్శకుడు రాకేష్ శశి అన్నారు. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలిలేని, విజయ్ ఎం. నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు రాకేష్ శశి మాట్లాడుతూ.. ‘‘జతకలిసే, విజేత’ చిత్రాల తర్వాత ‘ఊర్వశివో.. రాక్షసివో’ చేశాను. చదవండి: ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ ‘విజేత’ చూసి, అల్లు అరవింద్‌గారు నన్ను పిలిపించి, శిరీష్ కోసం కథ సిద్ధం చేయమన్నారు. ఆ తర్వాత శిరీష్‌గారితో ప్రయాణం చేసి ‘ఊర్వశివో.. రాక్షసివో’ కథని రెడీ చేశాను. షూటింగ్ ప్రారంభిద్దాం అనుకున్న సమయంలో లాక్డౌన్ రావడంతో ఆలస్యం అయింది. ఇప్పటివరకూ శిరీష్‌గారు చేయని సరికొత్త పాత్రను ఈ చిత్రంలో చేశారు. ఆయన కెరీర్లో ది బెస్ట్‌గా నిలుస్తుంది. అనూ ఇమ్మాన్యుయేల్ పాత్ర నేటి తరం అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించిన నిర్మాతలకు కృతజ్ఞతలు. డైరెక్టర్ మణిరత్నంగారంటే నాకు ఇష్టం. ఆయనలా నాకు సినిమాలు తీయాలని ఉంది’’ అన్నారు. -
అందుకే ఈ సినిమా ఒప్పుకున్నా: అనూ ఇమ్మాన్యుయేల్
‘నిజజీవితంలో అనూ ఇమ్మాన్యుయేల్ చాలా స్ట్రయిట్ ఫార్వడ్ అమ్మాయి. కెరీర్లో వేసే ప్రతి అడుగు మంచి స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటుంది. సింధూ పాత్ర కూడా అలాగే ఉంటుంది. అది నాకు, సింధూకి ఉన్న పోలిక’ అని అనూ ఇమ్మాన్యుయేల్ అన్నారు. అల్లు శిరీష్ సరసన ఆమె నటించిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీఎ2 పిక్చర్స్ అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలిలేని, విజయ్ ఎం నిర్మించారు. ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకొస్తుందీ సినిమా. ఈ సందర్భంగా హీరోయిన్ అను ఇమ్మాన్యూయేల్ చెప్పుకొచ్చిన ముచ్చట్లు... ♦ ఇందులో సింధూ అనే సాఫ్ట్వేర్ అమ్మాయిగా నటించా. కెరీర్లో మంచి స్థాయికి ఎదగాలనే తపన ఉన్న అమ్మాయి. ఆమెకి ప్రేమ కావాలి, కానీ ప్రేమే జీవితం అనుకోదు. అలాంటి అమ్మాయికి శ్రీకుమార్ అనే సింపుల్ కుర్రాడు పరిచయం అవుతాడు. సింపుల్ కుర్రాడికి, కెరీర్ ఓరియెంటెడ్ అమ్మాయికి మధ్య ప్రేమకథ ఎలా నడించింది అన్నది కథ. ♦మొదట బన్నీవాస్ ఈ కథతో నా దగ్గరకు వచ్చారు. సబ్జెక్ట్ విన్నాక చేయాలా? వద్దా అనే సందిగ్థంలో ఉన్నా. చాలా మీటింగ్‌ల తర్వాత ఓ రోజు అల్లు అరవింద్‌గారిని కలిశాను. ఇలాంటి హీరోయిన్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేస్తే బావుంటుంది. డిఫరెంట్‌గా ట్రై చేయ్ అన్నారు. నేను ఇంటికి వెళ్లి ఆలోచనలో పడ్డా. వెళ్తునప్పుడే నా డైలాగులు మాత్రమే కాకుండా ఫుల్ స్క్రిప్ట్ నాకు ఇచ్చారు. నా పాత్రకు సంబంధించిన స్క్రిప్ట్ కాకుండా ఫుల్ స్క్రిప్ట్ చదవడం ఇదే మొదటిసారి. ఫైనల్‌గా సింధూ పాత్రను ఓకే చేశా. ♦ జనరల్‌గా ఓ సినిమా నా దగ్గరకు వచ్చిందీ అంటే హీరో ఎవరు, ఇతర ఆర్టిస్ట్‌లు ఎవరు? అని అడుగుతా. కానీ గత రెండు, మూడేళ్లలో సినిమా రంగంలో చాలా మార్పులు చూశాం. ప్రేక్షకులకి హీరో ఎవరనేది కూడా అక్కర్లేదు. కంటెంట్ ఎలా ఉందనేది చూస్తున్నారు. నా మొదటి చిత్రం ‘మజ్ను’, ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాల్లోనే నా పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. మిగిలిన సినిమాల్లో ఐదారు సీన్లలోనే కనిపిస్తా. ఇందులో అలా కాదు. ఫుల్ లెంగ్త్ సినిమాలో కనిపిస్తాను. ♦ ఈ సినిమాకు శిరీష్ హీరో అని నాకు ముందే తెలుసు. పూజ రోజున మొదటిసారి కలిశా. డైరెక్టర్ కథ మొత్తం నెరేట్ చేశాక నేను, శిరీష్ కాఫీ షాప్‌లో కూర్చుని పాత్రల గురించి మాట్లాడుకున్నాం. ఒకరి తత్వం గురించి ఒకరు తెలుసుకున్నాం. శిరీష్ గుడ్ కోస్టార్. దర్శకుడు రాకేశ్ శశి డెడికేటింగ్ పర్సన్. ఒక షాట్ ఇలా రావాలి అంటే అలా వచ్చే వరకూ వదిలిపెట్టడు. అతని డెడికేషన్, ఓర్పు, కథ చెప్పిన తీరుతోపాటు గీతా ఆర్ట్స్ బ్యానర్ వాల్యూ కూడా నేనీ సినిమా చేయడానికి కారణం. ♦ నిజజీవితంలో అనూ ఇమ్మాన్యుయేల్ చాలా స్ట్రయిట్ ఫార్వడ్ అమ్మాయి. కెరీర్లో వేసే ప్రతి అడుగు మంచి స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటుంది. సింధూ పాత్ర కూడా అలాగే ఉంటుంది. అది నాకు, సింధూకి ఉన్న పోలిక. ట్రైలర్లో చూపించిన ఫిజికల్ రిలేషన్షిప్ నిజజీవితంలో నాకు కనెక్ట్ కాదు. ♦కెరీర్ బిగినింగ్‌లోనే పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్, నాగచైతన్య వంటి స్టార్ల సరసన యాక్ట్ చేశా. ఎవరితో యాక్ట్ చేసిన కథ, బ్యానర్ గురించి ఆలోచిస్తా. నాకు అవకాశాలు రావడం లేదు అన్నది కరెక్ట్ కాదు. కాకపోతే వరుసగా సినిమాలు చేయడం లేదు. నేను చేసిన సినిమాలు ఆడలేదేమో కానీ నటిగా నేను ఫెయిల్ అనే మాట ఎక్కడా వినిపించలేదు. అనూ కళ్లతో అభినయించగలదు అనే మార్క్ సంపాదించుకున్నా. కొన్ని సినిమాల రిజల్ట్ చూశాక నన్ను నేను మార్చుకున్నా. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటున్నా. వచ్చిన అవకాశంలో ఆ పాత్రకు నేను సూట్ అవుతాను అనుకుంటేనే ఓకే చేస్తున్నా. లేదంటే ఇంట్లో కూర్చుంటా. సక్సెస్ నా చేతిలో లేదు. ♦రవితేజ గారితో ‘రావణాసుర’లో నటిస్తున్నా. చాలా క్రేజీ క్యారెక్టర్ అది. ఓటీటీ మీద కూడా దృష్టిపెట్టాను. ఓ ఆఫర్ వచ్చింది. ఆ వివరాలు తర్వాత చెబుతానంది అనూ ఇమ్మాన్యుయేల్. చదవండి: రాజీవ్ వల్ల నా కెరీర్ నాశనమైంది: నటి కోట శ్రీనివాసరావు ఇంటికి పిలిచి ఆ మాటన్నారు: యంగ్ హీరో -
ఆసక్తిగా ఊర్వశివో రాక్షసివో ట్రైలర్, వెన్నెల కిషోర్ కామెడీ మామూలుగా లేదుగా
అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన చిత్రం "ఊర్వశివో రాక్షసివో". రాకేశ్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రం బృందం. లవ్, రొమాన్స్, కామెడీ సన్నివేశాలతో ఈ ట్రైలర్ శాంతం ఆకట్టుకుంటుంది. ఇందులో ముఖ్యంగా అను ఇమ్మానుయేల్, శిరీష్‌ల లవ్ ట్రాక్, వెన్నెల కిషోర్ కామెడీ పంచ్‌లు ఆద్యాంతం ఆకట్టుకుంటున్నాయి. చదవండి: సిద్దార్థ్, అదితిల సీక్రెట్ డేటింగ్? వైరల్‌గా హీరో పోస్ట్ ‘‘తను కొరియన్ వెబ్‌సిరీస్‌లా ట్రెండీగా ఉంటే నువ్వెంట్రా ‘కార్తికదీపం’ సీరియల్లో డాక్టర్‌బాబు, వంటలక్కలా పేజీలు పేజీలు డైలాగ్స్ చెబుతున్నావ్’’, ‘ఇన్ని ఈ.ఎమ్.ఐలు ఉన్నావాడు ఏ అమ్మాయి గురించి ఆలోచించకూడదురా. అది బేసిక్’ అంటూ వెన్నెల కిషోర్ కామెడీ డైలాగ్స్ ఆసక్తిగా ఉన్నాయి. చూస్తుంటే ఈ సినిమా రొమాంటిక్, లవ్, కామెడీ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్ అందించేలా కనిపిస్తోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'ఊర్వశివో రాక్షసివో' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
సినిమా ఇండస్ట్రీ ఓ కుటుంబం
‘‘సినిమా ఇండస్ట్రీ అనేది ఓ కుటుంబం. మనుషుల జీవితాల్లో సినిమా కూడా నిత్యసాధనం అయిపోయింది. ఇలాంటి సమయాల్లో ప్రేక్షకులకు మంచి సినిమాలు అందేలా దర్శక–నిర్మాతలు కృషి చేయాలి’’ అన్నారు హీరో బాలకృష్ణ. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రం నవంబరు 4న విడుదల కానుది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బాలకృష్ణ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం బిగ్ టికెట్‌ను బాలకృష్ణకు అందించారు అల్లు అరవింద్. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ–‘‘అరవింద్‌గారి అసోసియేషన్‌తో నేను చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’కు మంచి స్పందన లభిస్తోంది. అల్లు రామలింగయ్యగారితో వర్క్ చేసే అవకాశం దక్కడం నా అదృష్టం. ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా టీజర్, ట్రైలర్ బాగున్నాయి. శిరీష్, అను, దర్శకుడిగా రాకేశ్ బాగా చేశారనిపిస్తోంది. ప్రతి మనిషిలో విభిన్నకోణాలు ఉంటాయి. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందంటారు. ఓ కుటుంబాన్ని నిలబెట్టాలన్నా, కూల్చాలన్నా ఆ తాలూకు బరువు, బాధ్యతలన్నీ మహిళల చేతుల్లోనే ఉంటాయి. కాలంతో ఇప్పుడు కొన్ని పరిస్థితులు, అభిరుచులు కూడా మారుతున్నాయి. సహజీవనం, ఎఫైర్స్ అనేవి కూడా నడుస్తున్నాయి. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో ‘ఊర్వశివో రాక్షసివో..’ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘శిరీష్ మిడిల్ క్లాస్ అబ్బాయిలా ఈ మూవీలో నటించాడు. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న సమస్యల నుంచి పుట్టిన సినిమా ఇది. మంచి ఎంటర్టైనర్ అండ్ ఓ ఇన్‌డెప్త్ డిస్కషన్ ఈ సినిమాలో ఉంది.. దాన్ని తెరపైనే చూడాలి’’ అన్నారు. ‘‘చిరంజీవిగారి 60వ బర్త్ డే వేడుకల్లో బాలకృష్ణగారు పాల్గొన్నారు. కొంత సమయం తర్వాత ఆ ఫంక్షన్లో మా జోష్ తగ్గింది కానీ బాలకృష్ణగారి జోష్ తగ్గలేదు. ‘కొత్తజంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాల తర్వాత నాన్నగారితో ముచ్చటగా మూడోసారి నేను చేసిన ఈ చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అల్లు శిరీష్. ‘‘శిరీష్‌గారు, అను వల్ల ఈ సినిమా మేకింగ్ చాలా సాఫీగా జరిగింది’’ అన్నారు రాకేష్ శశి. ఈ కార్యక్రమంలో నటుడు సునీల్, కొరియోగ్రాఫర్ విజయ్, దర్శకులు మారుతి, పరశురామ్, చందూ మొండేటి, వశిష్ఠ్, వెంకటేశ్ మహా, దర్శక–నిర్మాత, రచయిత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శక–నిర్మాత సాయిరాజేష్, నిర్మాత ఎస్కేఎన్, ‘గీతాఆర్ట్స్’ బాబు, సత్య, పూర్ణా చారి, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధులు మాధవ్, నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏలూరులో ఊర్వశివో రాక్షసివో ప్రమోషన్స్ (ఫొటోలు)
-
మొదట ఆందోళన పడ్డా.. ఆ తర్వాత హ్యాపీ: అల్లు అరవింద్
‘‘ఊర్వశివో రాక్షసివో’ చిత్ర కథని తమ్మారెడ్డి భరద్వాజగారు అందించారు. ఈ సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత ఆయన నుంచి నాకు వరుసగా కాల్స్ వచ్చాయి. తన కథను మేము సరిగ్గా తీయలేకపోయారని అంటారేమో అనుకుని మొదట టెన్షన్ పడ్డా.. కానీ, సినిమా చాలా బాగా తీశారని ఆయన చెప్పడంతో సంతోషపడ్డాం’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. చదవండి: స్టార్ హీరో సల్మాన్‌కు అనారోగ్యం.. షూటింగులు వాయిదా అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో మధ్య తరగతి అబ్బాయిగా శిరీష్ బాగా నటించాడు. మా సినిమా చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ‘కపట నాటక సూత్రధారి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ‘‘దాసరి నారాయణరావు, బాలచందర్‌గార్లు మధ్య తరగతి సమస్యలను అందంగా, సరదాగా చెప్పేవారు. మళ్లీ ఇన్నాళ్లకు ‘ఊర్వశివో రాక్షసివో’లో చూపిస్తుండటం హ్యాపీ’’ అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. ‘‘యువత ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? అనే నేపథ్యంలో ఈ సినిమా తీశాం’’ అన్నారు రాకేష్ శశి. ‘‘ఇంటికెళ్లిన తర్వాత కూడా ప్రేక్షకులు మా మూవీ గురించి ఆలోచిస్తారు’’అన్నారు అల్లు శిరీష్. -
అల్లు శిరీష్ 'ఊర్వశివో రాక్షసివో' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
నాకు రెండు, మూడు సీరియస్ రిలేషన్స్ ఉన్నాయి: అల్లు శిరీష్
అల్లు హీరో శిరీష్ నటించి లేటెస్ట్ మూవీ ఊర్వశీవో రాక్షసివో. అను ఇమ్మానుయేల్ హీరోయిన్. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా శిరీష్ ఓ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రేమ, బ్రేకప్‌పై స్పందించాడు. మూవీలో హీరోయిన్‌తో లవ్ ట్రాక్ గురించి చెబుతుండగా యాంకర్ నిజ జీవితంలో కూడా రిలేషన్స్‌లో ఉన్నారా? అని ప్రశ్నించారు. చదవండి: ‘ఆదిపురుష్’ డైరెక్టర్‌కు లగ్జరీ ఫెరారీ కారు బహుమతి, ఎవరిచ్చారంటే.. దీనికి శిరీష్ స్పందిస్తూ.. ఈ కాలంలో రిలేషన్స్ లేకుండా ఎవరుంటారని, తనకు రెండు మూడు సీరియస్ రిలేషన్స్ ఉండేవంటూ ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. దీంతో యాంకర్ మీరు ఓ పెద్దింటి అమ్మాయితో సీరియస్ రిలేషన్లో ఉన్నారని, చివరికి మీరే బ్రేకప్ చెప్పారని విన్నాను నిజమెంత అని అడగ్గా.. అవును అని సమాధానం ఇచ్చాడు. ‘నాకు గతంలో రెండు మూడు సీరియస్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అయితే వారందరితో నాకు బ్రేకప్ అయ్యింది. చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆ రోజు నుంచి స్ట్రీమింగ్.. ఆ బ్రేకప్స్ వల్ల నేను కూడా బాధపడ్డాను. బ్రేకప్ చెప్పడం వల్ల ఎదుటి వాళ్లకు మాత్రమే పెయిన్ ఉండదు. చెప్పిన వాళ్లకి కూడా ఉంటుంది. అది ఆ నిమిషం మనకు తెలియదు. కానీ, ఏడాది తర్వాత దాని రిజల్ట్ తెలుస్తుంది. బ్రేకప్ చెప్పినప్పుడు నేను కూడా బాధపడ్డాను. అనవసరంగా బ్రేకప్ చెప్పి టైం వేస్ట్ చేస్తున్నానేమోనని ఇప్పటికీ అనిపిస్తుంది. లేదంటే ఇపాటికి నాకు పెళ్లి జరిగి ఉండేది కదా’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
పోరీల ఎంటపోకు ఫ్రెండూ అని పాడుతున్న అల్లు శిరీష్
భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ బ్యానర్లో రాబోతున్న నెక్స్ట్ మూవీ "ఊర్వశివో రాక్షసివో". అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో శిరీష్ సరసన "అను ఇమ్మాన్యూల్" హీరోయిన్గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన "ఊర్వశివో రాక్షసివో" చిత్ర టీజర్ కు, సాంగ్ కు అనూహ్య స్పందన లభించింది. తాజాగా ఈ మూవీలో ‘మాయారే’ అంటూ సాగే సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. రాహుల్ సిప్లీగంజ్ ఆలపించిన ఈ పాటను కాసర్య శ్యామ్ రచించారు. అనూప్‌రూబెన్స్,అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది. చదవండి: ఒంటరిగా రమ్మన్నాడు, కొలతలు అడిగి నీచంగా -
యూత్‌ని ఆకట్టుకునేలా అల్లు శిరీష్ ‘ఊర్యశివో రాక్షసివో’ టీజర్
అల్లు శిరీష్ , అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఊర్యశివో రాక్షసివో’. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. యూత్‌ని టార్గెట్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. టీజర్ లోని కొన్ని డైలాగ్స్, అలానే కొన్ని సీన్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అంతర్లీనంగా ప్రేమకి,స్నేహానికి ఉన్న తేడాను దర్శకుడు ఆవిష్కరించినట్లు అర్ధమవుతుంది. గీతాఆర్ట్స్ 2 బ్యానర్‌పై పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.