Urvasivo Rakshasivo Movie OTT Release Date, Two OTT Streaming Partners
Sakshi News home page

Allu Sirish Urvasivo Rakshasivo OTT Partners: రెండు ఓటీటీల్లోకి రానున్న ఊర్వశివో రాక్షసివో, స్ట్రీమింగ్‌ అప్పుడే

Published Sat, Nov 5 2022 1:52 PM | Last Updated on Sat, Nov 5 2022 3:58 PM

Allu Sirish Urvasivo Rakshasivo Locks Two OTT Partners - Sakshi

చాలా గ్యాప్‌ తర్వాత అల్లు హీరో శిరీష్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అను ఇమ్మానుయేల్‌ హీరోయిన్‌. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి షో నుంచే ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.  లవ్‌, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. ఫలితంగా శిరీష్‌ ఖాతాలో ఓ కమర్షియల్‌ హిట్‌ పడింది. ఇక థియేటర్లో అలరిస్తున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తికర అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

చదవండి: చివరి రోజుల్లో ‘మహానటి’ సావిత్రికి సెట్‌లో అవమానం, అన్నం కూడా పెట్టకుండా..

ఈ మూవీని రెండు ఓటీటీ ప్లాట్‌ఫాంస్‌ లాక్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్‌ తెలుగు ఓటీటీ ఆహా వీడియోస్‌, నెట్‌ఫ్లిక్స్‌లు ఫ్యాన్సీ డీల్‌కు ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఏ సినిమా అయినా థియేట్రికల్‌ రన్‌ అనంతరం 8 వారాల తర్వాత డిజిటల్‌ ప్లాట్‌ఫాం వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పడు ఈ మూవీ కూడా 2 నెలల రోజుల తర్వాత ఓటీటీకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై ధీరజ్‌ మొగిలినేని ఈ సినిమాను నిర్మించారు.

చదవండి: గుడ్‌న్యూస్‌ చెప్పిన సుడిగాలి సుధీర్‌.. ఫుల్‌ ఖుషిలో ఫ్యాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement