Urvasivo Rakshasivo Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Urvasivo Rakshasivo In OTT: ‘ఓటీటీ’లోకి ‘ఊర్వశివో రాక్షసివో’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

Published Fri, Dec 2 2022 2:56 PM | Last Updated on Sat, Dec 3 2022 7:52 AM

Urvasivo Rakshasivo Movie OTT Release Date Out - Sakshi

అల్లు హీరో శిరీష్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అను ఇమ్మానుయేల్‌ హీరోయిన్‌. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 4న థియేటర్స్‌లో విడుదలైంది. లవ్‌, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవ్వడానికి రెడీ అయింది.

డిసెంబర్ 9 నుంచి ‘ఆహా’లో ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ ‘ప్రస్తుత కాలానికి చెందిన అమ్మాయి, అబ్బాయికి చెందిన ప్రేమకథా చిత్రమిది. నేటి తరం యువ జంటలు ఎదుర్కొన్న సవాళ్లను ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఇలాంటి సినిమాను ఆహా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. 

ఓ భావోద్వేగాన్ని మన చుట్టూ ఉండే అనే పరిస్థితులు ముందుకు నడిపిస్తాయి. ప్రతి సంబంధం దేనికదే ప్రత్యేకం. పెళ్లి మంచిదా.. లివ్ ఇన్ రిలేషన్ షిప్ మంచిదా అనే దానిపై ఎవరికీ స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పలేరు. అలాంటి ఓ ఆలోచనను సమాజం ఆకట్టుకునేలా ఊర్వశివో రాక్షసివో చిత్రాన్ని తెరకెక్కించారు. , వెన్నెల కిషోర్, సునీల్, ఆమని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement