Anu Immanuel
-
మెహందీ కలర్ చీర కట్టులో అను ఇమ్మాన్యుయేల్..ధర ఎంతంటే..
అను ఇమ్మాన్యుయేల్.. సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ స్టార్ ఫ్యాషన్‌కి ఓ స్టయిల్ని క్రియేట్ చేసిన బ్రాండ్స్‌లో కొన్నింటిని చూద్దాం.. నలుపు రంగు దుస్తులు, డెనిమ్స్ అంటే చాలా ఇష్టం. అలాగే ప్రతి అమ్మాయికి బయటకెళ్లినపుడు సేఫ్టీ పిన్స్ అవసరం. నా పర్సులో ఎప్పుడూ ఉంటాయి. బ్రాండ్ వాల్యూ: ఐకేయా ఐకేయా అంటే సంస్కృతంలో ‘నా గుర్తింపు’ అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే క్లాసిక్, టైమ్‌లెస్ ఫ్యాషన్ డిజన్స్కి ప్రత్యేకం ఈ బ్రాండ్. ఢిల్లీకి చెందిన డిజైనర్ ఇషా ధింగ్రా.. 2013లో దీనిని ప్రారంభించారు. మూస డిజైన్స్‌కి చెక్ పెట్టేలా ఉండే ఈ డిజైన్స్‌కి సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. ధరలు కాస్త ఎక్కువే. విదేశాల్లోనూ వీటికి మంచి గిరాకి ఉంది. ఢిల్లీలో మెయిన్ బ్రాంచ్ ఉంది. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. అను ఇమ్మాన్యుయేల్ ధరించి చీర బ్రాండ్ ఐకేయా రూ. 74,500/- హౌస్ ఆఫ్ శిఖా చాలామంది అమ్మాయిల్లాగే .. శిఖా మంగల్‌కి కూడా ఆభరణాలంటే ఇష్టం. ఆ ఇష్టం పెద్దయ్యాక ఆసక్తిగా మారింది. అందుకే బిజినెస్ మేనేజ్‌మెంజ్ కోర్సు పూర్తయిన వెంటనే 2014లో ‘హౌస్ ఆఫ్ శిఖా’ను ప్రారంభించారు. ఇదొక ఆన్లైన్ జ్యూలరీ స్టోర్. ప్రముఖ డిజైనర్స్ అందించే అందమైన ఆభరణాలన్నీ ఇక్కడ లభిస్తాయి. కొత్తతరం డిజైనర్స్‌కి పాముఖ్యతనివ్వడంతో.. డిజైన్స్ అన్నింటిలోనూ న్యూస్టైల్ ప్రతిబింబిస్తుంది. అదే దీని బ్రాండ్ వాల్యూ. పేరుకు దేశీ లేబుల్ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేయొచ్చు. అను ధరించిన జ్యూలరీ బ్రాండ్ ధర రూ. 6,000 – అను ఇమ్మాన్యుయేల్ --దీపిక కొండి (చదవండి: హాయ్..‘అమిగోస్’ అంటూ వచ్చిన ఆశికా రంగనాథ్ ధరించిన చీర ధర ఎంతంటే..!) -
లలితా జ్యువెలరీలో దోపిడి, చివరకు ఎయిడ్స్‌తో.. ఆ దొంగ కథే జపాన్?
కార్తి, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘జపాన్’. రాజా మురుగన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కార్తి ఇంట్రో వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో కార్తి క్రేజీ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా నిజ జీవిత దొంగ ఆధారంగా రూపొందించబడింది అని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఎంత టార్చర్ పెట్టారంటే.. చచ్చిపోదామనుకున్నా) తమిళనాడులోని చెన్నైలో లలితా జ్యువెలరీ దుకాణంలో తిరువారూర్ ముర్గన్ అనే వ్యక్తి 13 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలను దోచుకున్నాడు. 2019లో జరిగిన ఈ దోపిడీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాకుండా దక్షిణాదికి చెందిన పలు రాష్ట్రాల్లో అతను దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే, మురుగన్ 2020లో జైలులో ఎయిడ్స్‌తో మరణించాడు. ఈ రియల్ దొంగోడి కథ ఆధారంగానే జపాన్ సినిమా తీస్తున్నారని ప్రచారం జరుగుతోంది. (ఇదీ చదవండి: ఐటం పాప బాగా రిచ్.. నైట్ డ్రెస్సుకు ఎన్ని వేలు పెట్టిందంటే?) కానీ కథలో కొన్ని మార్పులను కార్తి సూచించాడట. మురుగన్ ఎందుకు దొంగగా మారాడు? అనేక ప్రతిష్టాత్మకమైన బంగారు ఔట్లెట్లలో నగలను ఎలా దోచుకున్నాడు? అనే కమర్షియల్ ఎలిమెంట్స్‌ని మేకర్స్ జోడిస్తున్నారని తెలుస్తోంది. క్లైమాక్స్ విషయంలో చిత్ర సభ్యులు పలు జాగ్రత్తలు తీసుకున్నారట. నిజజీవితంలో జరిగిన సంఘటనలను చూపించాలని కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు సుఖాంతంతో కథను ముగించాలని అభిప్రాయపడ్డారట! మరి జపాన్‌కు ఫినిషింగ్ టచ్ ఏమిచ్చారో తెలియాలంటే? ఈ దీపావళి వరకు ఆగాల్సిందే! -
భారీ అంచనాలు పెంచేస్తున్న కార్తీ 'జపాన్' చిత్రం
తమిళసినిమా: వరుస విజయాలతో రైజింగ్‌లో ఉన్న నటుడు కార్తీ. కథల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నఆయన సర్ధార్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం జపాన్. కుక్కూ, జోకర్ వంటి వైవిధ్యంతో కూడిన విజయవంతమైన చిత్రాల దర్శకుడు రాజుమురుగన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం జపాన్. నటి అను ఇమ్మాన్యుయేల్ నాయకిగా నటిస్తోంది. ఈ బ్యూటీ ఇంతకుముందు తమిళంలో విశాల్ కథానాయకుడిగా నటించిన తుప్పరివాలన్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత శివకార్తికేయన్‌కు జంటగా నమ్మ వీటి పిళ్లై చిత్రంలో నటింంది. జపాన్ చిత్రం ఈమెకు ఇక్కడ మూడోది అవుతుంది. కాగా ఇందులో తెలుగు నటుడు సునీల్, చాయాగ్రాహకుడు, దర్శకుడు విజయ్ మిల్టన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి రవివర్మన్ చాయాగ్రహణం, జీవీ ప్రకాష్ కువర్ సంగీతాన్ని అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. నటుడు కార్తీ నటిస్తున్న 25వ చిత్రం ఇది. చిత్ర తొలి షెడ్యూల్ తూత్తుక్కుడి జిల్లా పరిసర ప్రాంతాల్లో నిర్వహింగ్రాహకుడు, దర్శకుడు విజయ్ మిల్టన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి రవివర్మన్ చాయాగ్రహణం, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. నటుడు కార్తీ నటిస్తున్న 25వ చిత్రం ఇది. చిత్ర తొలి షెడ్యూల్ తూత్తుక్కుడి జిల్లా పరిసర ప్రాంతాల్లో నిర్వహించి పూర్తిచేసినట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. కాగా రెండవ షెడ్యూల్ చిత్రీకరణ కోసం బుధవారం చిత్ర యూనిట్ కేరళకు వెళ్లినట్లు సమాచారం. కాగా ఇటీవల జపాన్ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చిందని నిర్మాతలు పేర్కొన్నారు. కాగా కార్తీ, దర్శకుడు రాజుమురుగన్‌ల కాంబినేషన్లో రూపొందుతున్న జపాన్ చిత్రంపై కోలీవుడ్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. -
విజయనగరంలో సినీ తారల సందడి.. పోటోలు వైరల్
సాక్షి, విజయనగరం: విద్యలనగరమైన విజయనగరంలో సినీ తారలు శుక్రవారం సందడి చేశారు. అభిమానులను చూసి పులకరించిపోయారు. ముగ్గురు నటీమణులు పట్టణానికి వస్తున్నారని తెలుసుకున్న యువతీయువకులు అంబటిసత్రం జంక్షన్, రైల్వేస్టేషన్ రోడ్డుకు చేరుకున్నారు. అభిమాన హీరోయిన్లను చూసేందుకు పోటీపడ్డారు. అంబటిసత్రం కూడలి వద్ద సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 28వ షోరూంను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌తో కలిసి రాష్ట్ర విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. షాపింగ్‌మాల్ దినదినాభివృద్ధి చెందాలని, విజయనగరవాసుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యత కలిగిన వ్రస్తాలను, నగలను అందించాలని ఆకాంక్షించారు. అనంతరం సర్దార్ ఫేమ్ రాశి ఖన్నా, ఆర్ఎక్స్ 100, జిన్నా ఫేమ్ పాయల్ రాజ్‌పుత్‌లు షోరూమ్‌ను సందర్శించారు. అన్నిరకాల వ్రస్తాలు, బంగారు ఆభరణాలను చూసి మురిసిపోయారు. ప్రతి ఒక్కరూ షాపింగ్ మాల్‌ను సందర్శించి, నచ్చినవి కొనుగోలు చేయాలని కోరారు. తమ సినీ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. అలాగే, రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న సీఎమ్ఆర్ షాపింగ్ మాల్ పునఃప్రారంభంలో పాల్గొన్న ఊర్వశివో.. రాక్షసివో సినీ ఫేమ్ అనూ ఇమాన్యూయేల్ అభిమానులతో కేరింతలు కొట్టించారు. సినీ డైలాగ్‌లతో అలరించారు. -
‘ఓటీటీ’లోకి ‘ఊర్వశివో రాక్షసివో’..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
అల్లు హీరో శిరీష్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అను ఇమ్మానుయేల్ హీరోయిన్. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న థియేటర్స్‌లో విడుదలైంది. లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అయింది. డిసెంబర్ 9 నుంచి ‘ఆహా’లో ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ ‘ప్రస్తుత కాలానికి చెందిన అమ్మాయి, అబ్బాయికి చెందిన ప్రేమకథా చిత్రమిది. నేటి తరం యువ జంటలు ఎదుర్కొన్న సవాళ్లను ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఇలాంటి సినిమాను ఆహా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. ఓ భావోద్వేగాన్ని మన చుట్టూ ఉండే అనే పరిస్థితులు ముందుకు నడిపిస్తాయి. ప్రతి సంబంధం దేనికదే ప్రత్యేకం. పెళ్లి మంచిదా.. లివ్ ఇన్ రిలేషన్ షిప్ మంచిదా అనే దానిపై ఎవరికీ స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పలేరు. అలాంటి ఓ ఆలోచనను సమాజం ఆకట్టుకునేలా ఊర్వశివో రాక్షసివో చిత్రాన్ని తెరకెక్కించారు. , వెన్నెల కిషోర్, సునీల్, ఆమని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
Urvasivo Rakshasivo: అందుకే అనుతో కెమిస్ట్రీ వర్కౌట్ అయింది
‘ఊర్వసివో రాక్షసివో సినిమా చూసినవాళ్లంతా అను ఇమ్మాన్యుయేల్‌తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. దానికి ప్రధాన కారణం సెట్స్‌కి వెళ్లడానికి ముందు మేం చేసిన ముందస్తు సన్నాహాలే. రొమాంటిక్ సన్నివేశాల్లో మాలో ఎలాంటి సందేహాలు లేవు. వీటికి కవితాత్మకంగా తెరపై చూపించామే తప్ప ఎక్కడా అసభ్యంగా చూపించలేదు’అని అల్లు శిరీష్ అన్నారు. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. తమిళ్ సూపర్ హిట్ ‘ప్యార్ ప్రేమ కాదల్’కి రీమేక్‌గా వచ్చిన చిత్రమిది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ శనివారం మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు.. ► కథ బాగా నచ్చితే తప్ప సినిమా చేయను. అందుకే సినిమా సినిమాకి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. రాకేశ్ శశి గతంలో నాకు రెండు మూడు కథలు చెప్పాడు. కానీ అవి వర్కౌట్ కాలేదు. చివరకు ఊర్వశివో రాక్షసివో చిత్రంలో మా కాంబినేషన్ సెట్ అయింది. ► ఈ సినిమా పట్టాలెక్కడానికి ప్రధాన కారణం మా నాన్న(అల్లు అరవింద్). ‘ప్యార్ ప్రేమ కాదల్’ ఆయనకి బాగా నచ్చింది. ఈ సినిమా బాగుంది..నీకు సెట్ అవుతుందని నాతో చెప్పాడు. దాంతో నేను కూడా ఆ సినిమా చూశా. నాకు కూడా బాగా నచ్చింది. మాతృకకు మరింత కామెడిని యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ► సినిమా చూసిన వాళ్లంతా మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీకుమార్ పాత్రలో ఒదిగిపోయావంటూ అభినందిస్తున్నారు. అయితే ఆ పాత్ర చేయడానికి టాలీవుడ్లో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ సింధూజ పాత్రలో అనుని తప్ప మరొకరిని ఊహించలేం. ఆ పాత్రలాగే మొండితనం ఉన్న అమ్మాయి అను. అందుకే సింధూజ పాత్రలో ఒదిగిపోయింది. ► నాకు వివాహ వ్యవస్థపై నమ్మకం ఉంది. సహజీవనంతో ప్రయాణం మొదలు పెట్టి పెళ్లి చేసుకోవాడన్ని ఇష్టపడతా. నా పెళ్లి విషయంలో ఇంట్లో ఒత్తిడేమి లేదు. పెళ్లనేది కూడా హిట్ సినిమా లాంటిదే. దానంతట అదే రావాలి తప్ప మనం అనుకుంటే రాదు(నవ్వుతూ..) ► రొమాంటిక్ కామెడీ సినిమాలకు ఇదివరకు ఓ మార్కెట్ ఉండేది. ఇప్పుడది ఓటీటీ జోనర్ అయింది. సింపుల్ డ్రామాలు, పాత్ర ప్రధానమైన కథలు ఓటీటీల్లోనే చూస్తున్నారు. ‘కాంతార’ తరహా చిత్రాలు, స్టార్ హీరోల సినిమాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తున్నాయి. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం. -
నేను వాటిని పట్టించుకోను.. కానీ మా అమ్మే: అను ఇమ్మానియేల్
మజ్ను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయైన బ్యూటీ అను ఇమ్మానుయేల్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల ఈ భామ అల్లు శిరీష్‌తో డేటింగ్లో ఉందంటూ వార్తలొచ్చినా సంగతి తెలిసిందే. వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరగుతున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడిచింది. తాజాగా ఈ వార్తలపై అను ఇమ్మానియేల్ స్పందించారు. (చదవండి: అల్లు అరవింద్ అలా అడిగేసరికి షాక్ అయ్యాను : అను ఇమ్మానుయేల్) అను మాట్లాడుతూ.. 'అందులో ఎలాంటి నిజం లేదు. నటీనటులపై ఇలాంటి వార్తలు రావడం సహజం. ఇలాంటి అసత్య ప్రచారాలను నేను పట్టించుకోను. ఈ వార్తలు చదివి మా అమ్మ చాలా బాధపడింది' అని తెలిపింది. అను ఇమ్మానియేల్, అల్లు శిరీష్ జంటగా నటించిన ఊర్వశివో రాక్షసివో నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహించారు. యువతను ఆకర్షించేలా ప్రేమ, సహజీవనం అంశాలతో ఈ మూవీని రూపొందించారు. దీంతో ఈ సినిమా ప్రచార చిత్రాలు విడుదలైన నాటి నుంచి.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వరుస వార్తలు వైరలయ్యాయి. -
అందుకే ఈ సినిమా ఒప్పుకున్నా: అనూ ఇమ్మాన్యుయేల్
‘నిజజీవితంలో అనూ ఇమ్మాన్యుయేల్ చాలా స్ట్రయిట్ ఫార్వడ్ అమ్మాయి. కెరీర్లో వేసే ప్రతి అడుగు మంచి స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటుంది. సింధూ పాత్ర కూడా అలాగే ఉంటుంది. అది నాకు, సింధూకి ఉన్న పోలిక’ అని అనూ ఇమ్మాన్యుయేల్ అన్నారు. అల్లు శిరీష్ సరసన ఆమె నటించిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీఎ2 పిక్చర్స్ అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలిలేని, విజయ్ ఎం నిర్మించారు. ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకొస్తుందీ సినిమా. ఈ సందర్భంగా హీరోయిన్ అను ఇమ్మాన్యూయేల్ చెప్పుకొచ్చిన ముచ్చట్లు... ♦ ఇందులో సింధూ అనే సాఫ్ట్వేర్ అమ్మాయిగా నటించా. కెరీర్లో మంచి స్థాయికి ఎదగాలనే తపన ఉన్న అమ్మాయి. ఆమెకి ప్రేమ కావాలి, కానీ ప్రేమే జీవితం అనుకోదు. అలాంటి అమ్మాయికి శ్రీకుమార్ అనే సింపుల్ కుర్రాడు పరిచయం అవుతాడు. సింపుల్ కుర్రాడికి, కెరీర్ ఓరియెంటెడ్ అమ్మాయికి మధ్య ప్రేమకథ ఎలా నడించింది అన్నది కథ. ♦మొదట బన్నీవాస్ ఈ కథతో నా దగ్గరకు వచ్చారు. సబ్జెక్ట్ విన్నాక చేయాలా? వద్దా అనే సందిగ్థంలో ఉన్నా. చాలా మీటింగ్‌ల తర్వాత ఓ రోజు అల్లు అరవింద్‌గారిని కలిశాను. ఇలాంటి హీరోయిన్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేస్తే బావుంటుంది. డిఫరెంట్‌గా ట్రై చేయ్ అన్నారు. నేను ఇంటికి వెళ్లి ఆలోచనలో పడ్డా. వెళ్తునప్పుడే నా డైలాగులు మాత్రమే కాకుండా ఫుల్ స్క్రిప్ట్ నాకు ఇచ్చారు. నా పాత్రకు సంబంధించిన స్క్రిప్ట్ కాకుండా ఫుల్ స్క్రిప్ట్ చదవడం ఇదే మొదటిసారి. ఫైనల్‌గా సింధూ పాత్రను ఓకే చేశా. ♦ జనరల్‌గా ఓ సినిమా నా దగ్గరకు వచ్చిందీ అంటే హీరో ఎవరు, ఇతర ఆర్టిస్ట్‌లు ఎవరు? అని అడుగుతా. కానీ గత రెండు, మూడేళ్లలో సినిమా రంగంలో చాలా మార్పులు చూశాం. ప్రేక్షకులకి హీరో ఎవరనేది కూడా అక్కర్లేదు. కంటెంట్ ఎలా ఉందనేది చూస్తున్నారు. నా మొదటి చిత్రం ‘మజ్ను’, ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాల్లోనే నా పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. మిగిలిన సినిమాల్లో ఐదారు సీన్లలోనే కనిపిస్తా. ఇందులో అలా కాదు. ఫుల్ లెంగ్త్ సినిమాలో కనిపిస్తాను. ♦ ఈ సినిమాకు శిరీష్ హీరో అని నాకు ముందే తెలుసు. పూజ రోజున మొదటిసారి కలిశా. డైరెక్టర్ కథ మొత్తం నెరేట్ చేశాక నేను, శిరీష్ కాఫీ షాప్‌లో కూర్చుని పాత్రల గురించి మాట్లాడుకున్నాం. ఒకరి తత్వం గురించి ఒకరు తెలుసుకున్నాం. శిరీష్ గుడ్ కోస్టార్. దర్శకుడు రాకేశ్ శశి డెడికేటింగ్ పర్సన్. ఒక షాట్ ఇలా రావాలి అంటే అలా వచ్చే వరకూ వదిలిపెట్టడు. అతని డెడికేషన్, ఓర్పు, కథ చెప్పిన తీరుతోపాటు గీతా ఆర్ట్స్ బ్యానర్ వాల్యూ కూడా నేనీ సినిమా చేయడానికి కారణం. ♦ నిజజీవితంలో అనూ ఇమ్మాన్యుయేల్ చాలా స్ట్రయిట్ ఫార్వడ్ అమ్మాయి. కెరీర్లో వేసే ప్రతి అడుగు మంచి స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటుంది. సింధూ పాత్ర కూడా అలాగే ఉంటుంది. అది నాకు, సింధూకి ఉన్న పోలిక. ట్రైలర్లో చూపించిన ఫిజికల్ రిలేషన్షిప్ నిజజీవితంలో నాకు కనెక్ట్ కాదు. ♦కెరీర్ బిగినింగ్‌లోనే పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్, నాగచైతన్య వంటి స్టార్ల సరసన యాక్ట్ చేశా. ఎవరితో యాక్ట్ చేసిన కథ, బ్యానర్ గురించి ఆలోచిస్తా. నాకు అవకాశాలు రావడం లేదు అన్నది కరెక్ట్ కాదు. కాకపోతే వరుసగా సినిమాలు చేయడం లేదు. నేను చేసిన సినిమాలు ఆడలేదేమో కానీ నటిగా నేను ఫెయిల్ అనే మాట ఎక్కడా వినిపించలేదు. అనూ కళ్లతో అభినయించగలదు అనే మార్క్ సంపాదించుకున్నా. కొన్ని సినిమాల రిజల్ట్ చూశాక నన్ను నేను మార్చుకున్నా. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటున్నా. వచ్చిన అవకాశంలో ఆ పాత్రకు నేను సూట్ అవుతాను అనుకుంటేనే ఓకే చేస్తున్నా. లేదంటే ఇంట్లో కూర్చుంటా. సక్సెస్ నా చేతిలో లేదు. ♦రవితేజ గారితో ‘రావణాసుర’లో నటిస్తున్నా. చాలా క్రేజీ క్యారెక్టర్ అది. ఓటీటీ మీద కూడా దృష్టిపెట్టాను. ఓ ఆఫర్ వచ్చింది. ఆ వివరాలు తర్వాత చెబుతానంది అనూ ఇమ్మాన్యుయేల్. చదవండి: రాజీవ్ వల్ల నా కెరీర్ నాశనమైంది: నటి కోట శ్రీనివాసరావు ఇంటికి పిలిచి ఆ మాటన్నారు: యంగ్ హీరో -
అల్లు శిరీష్ క్రేజీ అప్డేట్.. కొత్త సినిమా టీజర్ ఆరోజే..!
అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది చిత్రబృందం. ఈ మూవీకి 'ఊర్వశివో రాక్షసివో' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా టీజర్‌ను ఈనెల 29న విడుదల చేయనున్నట్లు ప్రకటించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. (చదవండి: అల్లు శిరీష్ కొత్త చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్) టైటిల్ పోస్టర్లో అల్లు శిరీష్ – అను ఇమ్మానియేల్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్రం రొమాంటిక్ కథ అని తెలుస్తోంది. నవంబర్ 4న ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాకేష్ శశి దర్శకత్వం వహిస్తుండగా.. ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతా ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. శీరీష్ నుంచి చివరగా వచ్చిన ‘ఎబిసిడి’ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన శీరీష్.. తాజాగా ఈ మూవీతో రీఎంట్రీ ఇస్తున్నారు. The teaser of our film #UrvasivoRakshasivo will be out on the 29th September (Thursday). Cant wait to share it with you :) pic.twitter.com/lR938fFE4i — Allu Sirish (@AlluSirish) September 26, 2022 -
'మహా సముద్రం' నుంచి రొమాంటిక్ మెలోడి సాంగ్
ప్రేమలో పడ్డప్పుడు కుదురుగా ఉండనివ్వని ఆలోచనలతో తికమకపడిపోతుంటారు ప్రేమికులు. అది ఆనందం తాలూకు తికమక. ‘మహాసముద్రం’ సినిమాలో రెండు జంటలు అలాంటి ఫీలింగ్‌తోనే ఓ పాట పాడుకున్నాయి. ఓ జంట శర్వానంద్, అనూ ఇమ్మాన్యుయేల్, మరో జంట సిద్ధార్థ్, అదితీ రావు హైదరీ. ఈ రెండు జంటలూ ‘తికమక..’ అంటూ పాడుకునే లిరికల్ వీడియోను గురువారం రిలీజ్ చేశారు. చేతన్ భరద్వాజ్ స్వరపరచిన ఈ పాటకు కిట్టు వరప్రసాద్ సాహిత్యం అందించగా హరిచరణ్, నూతన్ మోహన్ పాడారు. అజయ్ భూపతి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది. -
అల్లు శిరీష్- అను ఇమ్మాన్యుయేల్: Prema కాదంట!
సరైన హిట్టు దొరక్కపోతే హీరోలు కొత్త ట్రాక్ ఎక్కుతారు. లేదంటే ప్రేక్షకుల నాడి తెలుసుకుని వారికి నచ్చేరీతిలో సినిమాలు చేసి మళ్లీ సక్సెస్‌ను రుచి చూస్తుంటారు. తాజాగా తెలుగు హీరో అల్లు శిరీష్ ఒకేసారి ఈ రెండు ఫార్ములాలను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పెద్దగా రొమాన్స్ జోలికి పోని శిరీష్ ఈ సినిమాలో మాత్రం ఓ రేంజ్లో రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది. ఇక ఈ మధ్య ప్రేమ కథాచిత్రాలు బాగా క్లిక్ అవుతుండటంతో పూర్తిగా లవ్ కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ సినిమాలో తన లుక్‌ను కూడా ఇదివరకే రిలీజ్ చేశారు. ఈ మధ్యే సిక్స్‌ప్యాక్‌తో అభిమానులను సర్ప్రైజ్ చేసిన ఈ హీరో తన సినిమాకు సంబంధించి వరుస ప్రీ లుక్‌లు రిలీజ్ చేస్తూ జనాలను ఆకర్షించాడు. నేడు(మే 30) అతడి బర్త్‌డేను పురస్కరించుకుని చిత్రయూనిట్ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు "Prema కాదంట" అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అద్దం ముందు ఫొటోలు దిగుతున్న అను ఇమ్మాన్యుయేల్ మీద హీరో ముద్దుల వర్షం కురిపిస్తున్న ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి 'విజేత', 'జతకలిసే' ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక అను, శిరీష్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరి టైటిల్‌తోనే వీరిది ప్రేమ కాదని చెప్పేసారా? ఏంటి? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ALLU SIRISH: TITLE + FIRST LOOK POSTERS... On #AlluSirish's birthday today, here's the title of #Sirish6 film: #PremaKadanta... The #Telugu film stars #AlluSirish and #AnuEmmanuel... Directed by Rakesh Sashii... #AlluAravind presentation. #Sirish6FirstLook pic.twitter.com/V3isLWWaxW — taran adarsh (@taran_adarsh) May 30, 2021 చదవండి: ప్రీ లుక్‌తోనే షాకిస్తున్న అల్లు శిరీష్.. అస్సలు తగ్గట్లేదుగా -
సోషల్ హల్చల్: వీళ్లు సూపర్ క్యూట్, వాళ్లు పిచ్చ హాట్
► లాంగ్ డ్రెస్‌లో క్యూట్‌గా కనిపిస్తోన్న 'సాఫ్ట్వేర్ డెవలపర్' నటి వైష్ణవ చైతన్య ► క్యాప్షన్ ఎర్రర్ అంటూ ఫొటోతో బుర్ర బద్దలు చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ ► చూపులతో చంపేస్తోన్న కీర్తి సురేశ్ ► నీలి రంగు డ్రెస్సులోన చందమామ నీవే జాన.. అనిపిస్తోన్న తమన్నా భాటియా ► క్షణక్షణం సినిమా షూటింగ్ ఫొటో పంచుకున్న జియా శర్మ ► నల్ల కోటు వేసుకున్న తెల్ల పాప హన్సిక ► లెహంగాలో అందాలను దాచేస్తున్న శ్రద్దా కపూర్ ► బ్లూ డ్రెస్‌లో సూపర్ హిట్‌గా కనిపిస్తోన్న రితికా సింగ్ ► సోఫాలోనే కాదు కుర్రకారు గుండెల్లోనూ వాలిపోయిన అను ఇమ్మాన్యుయేల్ ► కళ్లజోడు పెట్టుకున్న సన్నీలియోన్ ► సఫారీ టైమ్‌లో సేద తీరుతున్న మాళవిక మోహనన్ ► లాలీపాప్ తింటున్న పాపతో నివేతా థామస్ View this post on Instagram A post shared by 𝑽𝒂𝒊𝒔𝒉𝒏𝒂𝒗𝒊 𝑪𝒉𝒂𝒊𝒕𝒂𝒏𝒚𝒂 ❤️ (@vaishnavii_chaitanya) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by 🎀Jia Sharma🎀 (@jia_sharma) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
అలల కంటే మొండివాడిని.. మరి మీరూ?!
‘ఆర్ఎక్స్ 100’తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇటీవల శర్వానంద్, హీరో సిద్దార్థ్‌లతో మల్లీస్టార్ చిత్రం ‘మహాసముద్రం’ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ థీమ్ పోస్టర్‌ను హీరో శర్వానంద్ దీపావళి సందర్భంగా విడుదల చేశాడు. ఎకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యూయేల్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా ఈ సినిమా థీమ్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ థీమ్ పోస్టర్‌ను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ... ‘సముద్రం అంతా లోతు, అలల కంటే మొండివాడిని.. అంటూ తన సహా నటులైన సిద్దార్థ్‌తో పాటు హీరోయిన్స్ అదితి రావ్, అను ఇమ్మాన్యూమేల్‌లను ట్యాగ్ చేసి మరీ మీరు ఎవరూ అని ప్రశ్నించాడు. అంతేగాక దర్శకుడు అజయ్ భూపతి, నిర్మాతలను ట్యాగ్ చేసి ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. (చదవండి: షేక్ చేస్తున్న శర్వానంద్ ‘భలేగుంది బాలా’ సాంగ్) I'm stubborn than the waves, deep as the seas! @aditiraohydari @Actor_Siddharth @ItsAnuEmmanuel Who are you? #MahaSamudram #ThemePoster 🌊 #HappyDiwali 🪔@DirAjayBhupathi @AnilSunkara1 @AKentsOfficial pic.twitter.com/MGHfjfaFb8 — Sharwanand (@ImSharwanand) November 14, 2020 కాగా అజయ్ భూపతి మొదటిసారిగా దర్శకత్వం వహించిన రొమాంటిక్ చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ బ్లాక్‌బ్లస్టర్ హిట్ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎర్రటి ఆకాశం, సముద్రం బ్యాక్‌గ్రౌండ్‌లో బ్రిడ్జికి అవతలవైపు ఓ వ్యక్తి పరుగులు తీస్తూ, ఇవతల బ్రిడ్జిపై ఇద్దరూ మనుషులు గన్‌పై నిలుచున్నట్లుగా ఉండి పరుగెడుతున్న వ్యక్తి వైపు గురిపెడుతున్న ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక పొస్టర్‌కు కింద ‘అమితమైన ప్రేమ’ అనే ట్యాగ్ లైన్ ఉండటం చూసి ‘సముద్రం’ రోమాంటిక్, థ్రీల్లర్ నేపథ్యంలో సాగనుందని, దర్శకుడు ఈ సినిమాను ఓరెంజ్‌లో చూపించబోతున్నాడంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక దాదాపు ఏడేళ్ల తర్వాత ‘బొమ్మరిల్లు’ హీరో సిద్దార్థ్ తెలుగు రీఎంట్రీ ఇవ్వడంలో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం ప్రస్తుతం విశాఖపట్నంలో షూటింగ్ జరుపుకుంటోంది. (చదవండి: టాలీవుడ్లో కొత్త జోడి.. సాయి కాదు అదితి) -
మమ్మీ నా బుక్సేవీ!
చక్కగా చదువుకునే అమ్మాయిల్లో సెలబ్రిటీ కళ కనిపిస్తుంది. ఆల్రెడీ వాళ్లు చిరుప్రాయపు సెలబ్రిటీలు అయి ఉన్నా.. ‘ప్లస్ టూ’లో నైంటీ పర్సెంట్‌తో పాసయ్యారనో, మాస్టర్స్ డిగ్రీలో జాయిన్ అయ్యారనో తెలిస్తే ముచ్చటగా ఉంటుంది. చదువులో ఉన్న మహిమ అది. మాధవ్ శింగరాజు కాబోయే భర్తతో కన్నా, చేయబోయే డిగ్రీతోనే ఎక్కువ కనెక్ట్ అవుతారు ఆడపిల్లలు. భర్తొస్తే భార్య హోదా వస్తుందని, భార్య హోదా గుర్తింపు తెస్తుందని వాళ్లకేం ఉండదు. చదువు పూర్తి చేస్తే మంచి ఉద్యోగం తెచ్చుకోవచ్చని, కెరీర్‌ని చక్కగా తమకు ఇష్టమైనట్లు మలుచుకోవచ్చని ఉంటుంది. ఒకవేళ డిగ్రీ కంటే భర్తగారే ముందొచ్చినా, ఆ భర్తగారిని కూడా కెరీర్లో ఒక భాగంగానే చూస్తారు.. కెరీర్‌కి అడ్డంకి గానో, కెరీర్‌కి సపోర్ట్గానో. మంచి భర్త దొరకాలని ఈ జనరేషన్లో ఆడపిల్లలెవరూ ఆలయాలకు వెళ్లి రావడం లేదు. వచ్చేవాడు ఎలాంటి వాడో దేవుడికే తెలియనప్పుడు గుడికెళ్లి ప్రదక్షిణలు చేసే బదులు కెమిస్ట్రీలో, మేథ్స్‌లో ఏం ప్రశ్నలు వస్తాయో ఇంట్లో కూర్చుని గెస్ పేపర్ తయారు చేసుకుంటే కొంత ఫలితం ఉంటుంది. ఊహించిన ప్రశ్నలే రాకున్నా, పూర్తిగా ఊహకు అందనివైతే రావు. భర్తగా ఎలాంటి వాడు వస్తాడో దేవుడే గెస్ చెయ్యలేనప్పుడు టెన్తో, ఇంటరో అయిన పిల్లేం గెస్ చేస్తుంది. చదువులో ఎంత ‘టెన్ బై టెన్’ గ్రేడ్ తెచ్చుకుంటే మాత్రం?! అక్క భర్తను అంతా దేవుడు అంటున్నా, ఆ భర్తలో ఎంత శాతం దేవుడున్నాడో అక్క చెప్పకపోయినా, తనకు తెలియందా! పెళ్లయి ఏళ్లవుతున్నా అక్క చెప్పులు గుమ్మం లోపలే అరగని ఆభరణాల్లా ఉండిపోయాయంటే అక్క ఆశలన్నిటినీ ఎటూ కదలనివ్వకుండా దేవుడులాంటి ఆ భర్తగారే భుజాలపై మోసుకు తిరుగుతున్నాడనే కదా. మోయడమే కనిపిస్తుంది లోకానికి. ‘‘నన్ను కిందికి దింపు ప్లీజ్.. నేనూ నడవగలను కదా’’ అని అక్క చేసే మూగ ఆక్రందనలు వినిపించవు. నడవడమే కాదు, తను పరుగెత్తగలదు, ఎగరగలదు. కాళ్లల్లో సత్తువ ఉంటుంది. రెక్కల్లో బలం ఉంటుంది. అయినా సరే.. దేవుడి లాంటి భర్త కదా.. అక్కను మోసుకునే తిరుగుతాడు! అంత మంచి భర్త పొరపాటున ఎక్కడొచ్చి పడతాడోనని భయము, బెంగ ఉండే ఆడపిల్లలు కనిపిస్తారేమో బహుశా గుళ్లలో.. ‘దేవుడి లాంటి భర్తను మాత్రం ఇవ్వకు దేవుడా’ అని వేడుకోడానికి. అమ్మ, నాన్న వినకపోతే దేవుడే కదా చెప్పుకోడానికి మిగిలేది. దేవుడి దగ్గర కూడా వాళ్ల ఫస్ట్ ప్రయారిటీ చదువు. ‘సీటొచ్చేటట్టు చెయ్ ప్లీజ్’ అని. లీస్ట్ ప్రయారిటీ భర్త. ‘ఇప్పట్లో పెళ్లి ముహూర్తాన్ని దగ్గరకు రానీయకు ప్లీజ్’ అని. చదువుకి, జీవితానికి అంత లింకు పెట్టేసుకుంటారు అమ్మాయిలు. చదువు.. వాళ్ల లవ్ ఇంట్రెస్ట్. బాలికల్ని చదివించని కాలంలో ‘మళ్లీ బాలురదే పైచేయి’ అని ఏటా రిజల్ట్స్ వచ్చేవి. బాలురు ఇప్పుడు ఏ ఫలితాల్లోనైనా మునుపటంత ధారాళంగా కనిపిస్తున్నారా? లేదు. బాలికల్ని కూడా చదివిస్తున్నాం కదా. చదువంటే తమకెంత ప్రాణమో చూపిస్తున్నారు. ప్రాణాలు గుండెల్లో ఉంటాయనుకుంటాం. ఆడపిల్లలకు పుస్తకాల్లోని పాఠాల్లో ఉంటాయి.చక్కగా చదువుకునే అమ్మాయిల్లో సెలబ్రిటీ కళ కనిపిస్తుంది. ఆల్రెడీ వాళ్లు చిరుప్రాయపు సెలబ్రిటీలు అయి ఉన్నా.. ‘ప్లస్ టూ’లో నైంటీ పర్సెంట్‌తో పాసయ్యారనో, మాస్టర్స్ డిగ్రీలో జాయిన్ అయ్యారనో తెలిస్తే ముచ్చటగా ఉంటుంది. చదువులో ఉన్న మహిమ అది. ఆ మహిమ అలా ప్రవహించి చదివే వాళ్ల ముఖాల్లోకీ వచ్చేస్తుంది. రకుల్‌ప్రీత్ సింగ్ ఇన్ని కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారని తెలిస్తే ఏం అనిపించదు. రకుల్‌ప్రీత్ సింగ్ ‘జీసస్ అండ్ మేరీ కాలేజ్’లో మేథమేటిక్స్ చదివారట అని తెలిస్తే అందులోకి గ్లామర్ వచ్చేస్తుంది! రష్మికా మండన్నా మళ్లొకసారి విజయ్ దేవరకొండతో నటిస్తున్నారని తెలిస్తే ఏం అనిపించదు. ఆమె కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదివారని, సైకాలజీ–జర్నలిజం–ఇంగ్లిష్ లిటరేచర్‌లో డిగ్రీ చేశారంటే ‘ఇంట్రెస్టింగ్!’ అనిపిస్తుంది. చదువు కోసం కెరీర్లో, చేస్తున్న పెద్ద జాబ్‌లో బ్రేక్ తీసుకునే అమ్మాయిలు కొందరు ఉంటారు! ‘రియల్లీ గ్రేట్’ అనిపిస్తుంది. జాబ్‌నీ, చదువునీ బ్యాలెన్స్ చేసుకునే వాళ్లు ఇంకా గ్రేట్‌గా కనిపిస్తారు. ఇక ఇంటిని, ఆఫీస్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ చదువుకునే వాళ్లైతే గ్రేట్ అనే మాట సరిపోదు. సెల్యూట్ కొట్టాలి. ఎంత పేరు, ఎంత డబ్బు, ఎన్ని ఆభరణాలు, ఎంత మంచి భర్త ఉన్నా.. వాళ్లింకా ఏదో చదువుతున్నారంటే గౌరవం వచ్చేస్తుంది వాటన్నిటికీ. దివ్యమైన వెలుగేదో ఫోకస్ అవుతుంది వాటన్నిటిపైన. హిమాదాస్ స్ప్రింటర్. అస్సాం అమ్మాయి. 2000 సంవత్సరంలో పుట్టింది. 2018లో ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ కొట్టింది. ‘ధింగ్ ఎక్స్‌ప్రెస్’ అని పేరు. ధింగ్ ఆమె పుట్టిన ఊరు. వరల్డ్ యు20 ఛాంపియన్షిప్స్ ట్రాక్ ఈవెంట్లో బంగారు పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణి హిమాదాస్. దోహాలో ఈ సెప్టెంబరులోనో, అక్టోబరులోనో జరగబోతున్న వరల్డ్ ఛాంపియన్షిప్స్ పోటీల కోసం ప్రస్తుతం టర్కీలో ట్రైనింగ్ తీసుకుంటోంది. ఆమె అక్కడ ఉండగానే ఇక్కడ ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ క్లాస్‌లో పాసైంది. 500కి 349 మార్కులు వచ్చాయి. అస్సామీ లాంగ్వేజ్ పేపర్లో 80 శాతానికి పైగా స్కోర్ చేసింది హిమ. పరీక్షలు గత ఫిబ్రవరిలో జరిగాయి. అప్పటికే తను టర్కీలో ఉంది. పరీక్షలకు ప్రిపేర్ అవడం కోసం ట్రైనింగ్‌కి బ్రేక్ తీసుకుని వచ్చింది! ఇంట్లో ఉండి ప్రిపేర్ అయితే టైమ్ అంతా ప్రిపరేషన్‌కే అవుతుందని గౌహతి వెళ్లి అక్కడి ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ హాస్టల్లో ఉండి చదువుకుంది. ఎగ్జామ్‌కీ, ఎగ్జామ్‌కీ మధ్య విరామాలలో వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌కి ప్రాక్టీస్ చేసింది. తిరిగి టర్కీ వెళ్లిపోయింది. గతేడాది కూతురు బంగారు పతకం సాధించుకొచ్చినప్పుడు కూడా ఇంత ఆనందంగా లేరు ఆమె తల్లిదండ్రులు. ఆమె ఫస్ట్‌క్లాస్‌లో పాసైందని తెలిసినప్పట్నుంచీ ఇంటిపైన మేఘాలలోనే వాళ్ల నివాసం!ఆడపిల్లలు చదువుతో ఇంత గౌరవాన్ని, గర్వాన్ని తెచ్చిపెడతారు కదా.. ఎందుకని మనం హఠాత్తుగా ‘ఇక దిగమ్మా’ అని మధ్యలోనే చదువు నిచ్చెనని పక్కకు తీసేస్తాం?! నిచ్చెన పైనుంచి దించి, భుజాలపైకి ఎక్కించడానికి మంచి కుర్రాడుంటే చూడమని ఎందుకు వాళ్లకూ వీళ్లకూ చెప్పడం మొదలుపెడతాం? బాధ్యతను నెరవేర్చడం! బాధ్యతగా నిచ్చెన వేశాం కదా, అలాగే బాధ్యతగా భుజాల్ని వెతుకుతాం. నిచ్చెన చివరివరకు ఆడపిల్లని ఎక్కనిస్తే భుజాలను వెతికే అవసరం ఉండదన్న ఆలోచనను మన బాధ్యత మనకు రానివ్వదేమో మరి. పిల్లలు తమ చదువుని బాధ్యతగా కాక, ప్రాణంగా ఫీల్ అవుతున్నప్పుడు మన ప్రాణసమానం అయిన పిల్లల చదువుల్ని, ఆశల్ని ఎందుకు అర్ధంతరంగా ఎవరి భుజాలపైనో ఎక్కించాలని చూడడం! భుజాలపైకి ఎక్కితేనే కానీ కిచెన్‌లోని ఉప్పు డబ్బానో, షెల్ఫ్‌లోని పాల డబ్బానో అందదని ఆడపిల్లల్ని చదువు మాన్పించేస్తామా?! ∙ -
ఇస్మార్ట్ గాళ్ ఇన్?
సూపర్ స్మార్ట్ శంకర్‌కి జోడీగా స్మార్ట్ అండ్ బ్యూటిఫుల్ గాళ్ దొరికిందట. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్, చార్మీ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుందట. ఇందులో శంకర్ పాత్రలో రామ్ నటిస్తారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ క్యారెక్టర్‌ను పూరి చాలా కొత్తగా డిజైన్ చేశారట. ఇందులో హీరోయిన్గా అనూ ఇమ్మాన్యుయేల్‌ను ఎంపిక చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటారని తెలిసింది. ఈ చిత్రం షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, మేలో సినిమాని ప్రేక్షకులకు చూపించాలని పూరి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రామ్ లుక్‌ని విడుదల చేసిన ఈ చిత్రబృందం షూటింగ్ ప్రారంభించిన వెంటనే మరో లుక్‌ని రిలీజ్ చేయాలనుకుంటున్నా రట. ఫస్ట్ లుక్ ఫుల్ మాస్. మరి.. రెండోది ఎలా ఉంటుందో? -
నా పేరు సూర్య ప్రీ రిలీజ్ హైలైట్స్
-
మీరు బ్రతకండి.. మమ్మల్ని బ్రతకనివ్వండి
‘‘చిరుత’ ఇంకా రిలీజ్ అవ్వలేదు. డాడీ బన్నీని పిలిచి అన్నారు. ‘రేయ్ మన ఫ్యామిలీకి డ్యాన్స్ వచ్చు అని ఒక పేరు ఉంది. చిన్నప్పటినుంచి నుంచి వీడు ఎక్కడా డ్యాన్స్ చేయలేదు. వీడికి డ్యాన్స్ చేయడం వచ్చా? లేక మన పరువు తీస్తాడా?’ అని అడిగారు. ‘నువ్వు మర్చిపో మామా. ధైర్యంగా ఉండు. నాకు ప్రైవేట్‌గా తెలుసు’ అని మా నాన్నకు నమ్మకం ఇచ్చాడు బన్నీ. అప్పటి నుంచి డాడీ నన్ను తిట్టడం మానేశారు’’ అన్నారు రామ్ చరణ్. అల్లు అర్జున్, అన్యూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించారు. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. విశాల్‌శేఖర్ పాటలు స్వరపరిచారు. సినిమా మే 4న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ్ చరణ్ మాట్లాడుతూ ‘‘సినిమాల్లోకి రాకముందు బర్త్‌డే పార్టీల్లో నేనెక్కువ డ్యాన్స్ చేసేవాణ్ణి కాదు. మా డాడీ తిట్టేవారు. బన్నీ డ్యాన్స్ చూసి నేర్చుకోరా అని. బన్నీలో ఒక కసి ఉంటుంది. తను చేసిన గోన గన్నారెడ్డి చిన్న క్యారెక్టర్. తక్కువ సమయం అయినా ఎన్ని అవార్డ్స్ కొట్టాడో మీరే చూశారు. అదే గోన గన్నారెడ్డి రెండున్నర గంటలు ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారు. దానికి ఇంకా ఎన్ని అవార్డ్స్, ఎంత మెప్పు పొందుతాడా అని ఎదురు చూస్తున్నాను. లాస్ట్ రెండేళ్లుగా క్రిటికల్ అప్రిషియేషన్ వచ్చిన సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. నా ‘రంగస్థలం’ కూడా. మన ఇండస్ట్రీ ప్రౌడ్ మూమెంట్లో ఉంది. దానికి మరో ఎగ్జాంపుల్ ‘నా పేరు సూర్య’ అవ్వాలి. నా ‘ఎవడు’ సినిమాకు రాసిన వంశీ ఈ సినిమా డైరెక్టర్. తన రైటింగ్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఈ సినిమా చూస్తుంటే ఇన్స్పైరింగ్ కాన్సెప్ట్‌లా ఉంది. నా బ్రదర్ బన్నీ చేసిన ఈ ఆర్మీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మనకున్న హానెస్ట్ దర్శకుల్లో వంశీ ఉండాలని కోరుకుంటున్నాను. మామ (అల్లు అరవింద్) ఏదో ఒక కాంట్రవర్శీ లేకుండా మాట్లాడడు. కానీ ఆయన పెయిన్‌ని నేను అర్థం చేసుకోగలను. అవినీతి లేని ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది ఫిల్మ్ ఇండస్ట్రీయే. ఇక్కడ అందరం కష్టపడతాం. యాక్టర్స్ ఉదయాన్నే లేస్తాం. జిమ్‌కి వెళ్తాం. మేకప్ వేసుకొని ఎండల్లో వానల్లో షూటింగ్ చేస్తాం. బన్నీకి ఎన్నో దెబ్బలున్నాయి. డ్యాన్స్, ఫైట్స్‌లో దెబ్బలు తగులుతుంటాయి. మహేశ్, తారక్, ప్రభాస్... మా అందరికీ దెబ్బలు తగులుతుంటాయి. ప్రభాస్‌కి రెండు సార్లు భుజానికి సర్జరీ అయింది. మా నాన్నగారికి, బాలకృష్ణగారికి కూడా భుజానికి సర్జరీ జరిగింది. ఒళ్లు హూనం చేసుకుంటాం. ఇందులో అవినీతి ఎక్కడైనా కనిపిస్తుందా? మీడియా కొన్నిసార్లు ఇష్టం వచ్చినట్టుగా రాస్తోంది. లాస్ట్ రెండు నెలలుగా జరిగిన వాటిని చూసినవాళ్లు ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటారే తప్ప ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు, నమ్మరు. మీరు (మీడియా) మాకు బిగ్గెస్ట్ సపోర్ట్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు బ్రతకండి హ్యాపీగా, మమ్మల్ని బ్రతకనివ్వండి హ్యాపీగా’’ అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘ఇండియన్ ఆర్మీకి థ్యాంక్స్. మీరు లేకపోతే ఈ స్థాయిలో మేము సినిమా తీసేవాళ్లం కాదు. ఈ కథను నా దగ్గరకు తీసుకొచ్చిన నల్లమలుపు బుజ్జిగారికి థ్యాంక్స్. ఒక స్టార్ డైరెక్టర్‌కు ఎంత ఖర్చుపెడతారో ఒక దర్శకుడు పరిచయం అవుతున్న ఈ సినిమాకు అంతే ఖర్చుపెట్టారు శ్రీధర్‌గారు. నాకు నచ్చిన వ్యక్తి నాగబాబుగారికి సినిమా చేసే స్థాయిని ప్రేక్షకులు నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ సినిమా సహనిర్మాత ‘బన్నీ’ వాసుకు థ్యాంక్స్. రేపు సినిమా సక్సెస్ అయితే.. వంద కారణాలు ఉంటే అవన్నీ డైరెక్టర్‌గారే. నేను చేసిందల్లా ఆయన్ను నమ్మడమే. ‘రంగస్థలం’ సినిమాతో ఈ స్థలం నాది అని ప్రూవ్ చేశావ్ చరణ్. అలాగే ‘భరత్ అనే నేను’ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అలాగే ‘నా పేరు సూర్య...’తో ఈ సమ్మర్ ఒక హ్యాట్రిక్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.‘‘కథ విన్నప్పటి నుంచి వంశీ మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు బన్నీ. ఈ మధ్య ఇండస్ట్రీలో మనసు కలిచి వేసే సంఘటనలు జరిగాయి. దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవల్సి వచ్చింది. ఆ నిర్ణయాల వల్ల కొంతమంది ఈ సినిమాను తప్పుదోవ పట్టించడానికో, క్రిటిసైజ్ చేయడానికో ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాన్ని దాటగలిగినవారు మీరే (ప్రేక్షకులు) ఈ స్క్రీన్ వెనకాలే కొన్ని సంఘటనలు జరిగాయి. ఒక స్టాండ్ తీసుకోవల్సి వచ్చింది. ఆ స్టాండ్ తీసుకోవడానికి నమ్మకం మీరందరు (ప్రేక్షకులు). సినిమా రషెస్ చుశాక అర్థం అయ్యింది. ఈ సినిమాలోని పాత్ర అర్జున్నే చేయాలని. నా మేనల్లుడు, నా కొడుకు ఫంక్షన్‌కు రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘‘శ్రీధర్‌గారితో కలిసి ఈ సినిమా చేయి అని చేయించిన అరవింద్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు నాగబాబు. ‘‘సినిమాల్లోకి వెళ్తా అంటే ఎవ్వరూ ప్రొత్సహించరు. కానీ మా ఇంట్లో ప్రోత్సహించారు. ఈరోజు నేనిలా నిలబడటానికి మా అమ్మగారు, నా భార్యే కారణం. పర్సనల్‌గా ఆర్మీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటా. బన్నీ ద్వారా వాళ్ల మీద సినిమా తీసే చాన్స్ వచ్చింది. ఇంత మంచి సినిమా ఇచ్చిన హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ వక్కంతం వంశీలకు రుణపడి ఉంటాను. సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ బన్నీ. కొత్త డైరెక్టర్‌తో 100కోట్లు రిస్క్ చేయడం మామూలు విషయం కాదు’’ అన్నారు నిర్మాత శ్రీధర్. ‘‘ప్రతి సినిమాకు డబ్బు, పేరు వస్తుంది కానీ ఈ సినిమా ద్వారా గౌరవం కూడా వస్తుంది అనుకుంటున్నాను’’అన్నారు సహనిర్మాత ‘బన్నీ’ వాసు. ‘‘సినిమా డైరెక్టర్ ఎప్పుడవుతావురా? అన్న మా అమ్మానాన్నలు ఇక్కడ ఉన్నారు. అయ్యానమ్మా. సినిమా ఇండస్ట్రీకి నన్ను పరిచయం చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావుగారికి కృతజ్ఙతలు. ఆయన లేరు. ఈ బాధలో కూడా ఆనందం ఏంటంటే.. ఆయన పుట్టినరోజు నాడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మంచి సినిమా తీశాను అన్న తృప్తితోనే ఈ ఫంక్షన్లో నిల్చున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో చిత్రబృందం పాల్గొన్నారు. -
ఫారిన్లో డ్యూయెట్
ఇప్పటివరకూ బార్డర్లో దేశం కోసం పోరాడిన సూర్య ఇప్పుడు విదేశాల్లో కొంచెం విశ్రాంతి తీసుకోనున్నారు. విశ్రాంతి ఏంటి అనుకుంటున్నారా? ఇన్ని రోజులు యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొన్న సూర్య ఇప్పుడు తన ప్రేయసితో డ్యూయెట్ పాడుకోవటం కోసం ఫారిన్ వెళ్లారట. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. సోల్జర్ సూర్య పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్‌పై ఒక రొమాంటిక్ సాంగ్‌ను ఫారిన్లో బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో షూట్ చేయనున్నారట చిత్రబృందం. మార్చి 21 నుంచి ఈ సాంగ్‌ను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉందట. ఆ పాటకు బాలీవుడ్ భామ ఎలీ అవరమ్ డ్యాన్స్ చేయనున్నారు. ఈ సాంగ్ గురించి ఎలీ మాట్లాడుతూ – ‘‘ఇది ఐటమ్ సాంగ్ కాదు. అద్భుతమైన లిరిక్స్, మెసేజ్ ఉండే స్పెషల్ సాంగ్. అల్లు అర్జున్ డ్యాన్స్‌కు నేను పెద్ద ఫ్యాన్. అయితే ఈ పాటలో అల్లు అర్జున్ ఎక్కువ డ్యాన్స్ చేయరు’’ అని పేర్కొన్నారామె. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. మే 4న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. -
అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ టీజర్
-
చచ్చిపోతాను.. కానీ ఇక్కడ కాదు!
సాక్షి, సినిమా : అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్‌ని కొత్త సంవత్సరం కానుకగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘నీకు సూర్యా అంటే సోల్జర్ కానీ ప్రపంచానికి సూర్య అంటే యాంగర్, ఇలాగే కొన్ని రోజులైతే చచ్చిపోతావు రా.. చచ్చిపోతా కానీ ఇక్కడ కాదు బార్డర్‌కి వెళ్లి చచ్చిపోతా’ లాంటి డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. సైనికుడాగా అల్లు అర్జున్ నటన అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్ శేఖర్ స్వరాలందిస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సైనికుడిగా నటిస్తున్నాడు. సీనియర్ నటుడు అర్జున్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది. ‘నా పేరు సూర్య’ టీజర్ -
ఇంట్లో పండగ
అవును.. సూర్య ఇంట్లో పండగ చేసుకున్నారు. పండ గలంటే మనం పిండి వంటలు చేసుకుంటాం. సరదాగా కబుర్లు చెప్పుకుంటాం. మహా అయితే ఏదైనా ఆటలు ఆడతాం. అదే సినిమాల్లో అయితే వీటన్నింటితో పాటు పాటలు కూడా పాడుకుంటారు. సూర్య కూడా తన ఫ్యామిలీతో కలసి పాట పాడారు. అందరూ డ్యాన్స్ చేశారు. మనోడు స్టెప్పేశాడంటే సూపర్ అనాల్సిందే. మరి.. అల్లు అర్జునా? మజాకా? సూర్య గురించి చెబుతూ అల్లు అర్జున్ అంటున్నారేంటి? అని అనుకోరు. ఎందుకంటే.. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ పేరుతో బన్నీ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవీ మర్చంట్ ఈ చిత్రం కోసం రెండు పాటలు కంపోజ్ చేస్తున్నారు. ఒకటి పైన చెప్పిన ఫ్యామిలీ సాంగ్. ఇంకోటి లవ్ సాంగ్. సూర్య ఇంటి సెట్లో ఈ ఫ్యామిలీ సాంగ్‌ని నైట్ ఎఫెక్ట్‌లో తీశారు. ఈ పాటలో కీలక తారాగణంతో పాటు వంద మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. ప్రస్తుతం రొమాంటిక్ సాంగ్ తీస్తున్నారు. ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
సూర్య కిక్కే వేరప్పా!
యస్.. విలన్స్‌ను రఫ్ఫాడిస్తున్నారు సూర్య. మెయిన్ విలన్‌తో ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు. కానీ ఆ యాక్షన్ సీక్వెన్స్‌ను స్క్రీన్ పై చూస్తే ఆ కిక్కే వేరప్పా అని చిత్రబృందం అంటున్నారు. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’. ప్రజెంట్ హైదరాబాద్‌లో ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య అనే పవర్ఫుల్ రోల్లో అల్లు అర్జున్ నటిస్తున్నారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ‘సింగం 3’, ‘విన్నర్’, ‘రోగ్’ సినిమాల్లో విలన్‌గా నటించిన అనూప్ సింగ్ ఠాగూర్ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. ‘‘ఫస్ట్ డే షూటింగ్ కంప్లీట్ అయ్యింది. వంశీ తన స్టైల్లో ముగించాడు. అల్లు అర్జున్‌తో గ్రేట్ కిక్ సీన్ షూట్ చేశాం. మా ఇద్దరి ఎనర్జీస్ స్క్రీన్‌పై ప్రేక్షకులకు సూపర్‌గా ఉంటాయని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు అనూప్. బాలీవుడ్ ద్వయం విశాల్–శేఖర్ సగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు. బన్నీ వాసు సహ నిర్మాత. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఓ ఇంటిదాన్నయ్యా!
‘మలయాళంలో ‘యాక్షన్ హీరో బిజు’ సినిమా చేశా. ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయా. ఆ చిత్రం చూసిన జ్యోతికృష్ణగారు నన్ను కాంటాక్ట్ చేసి, ‘ఆక్సిజన్’లో అవకాశం ఇచ్చారు. తెలుగులో నా తొలి సినిమా అదే. ‘ఆక్సిజన్’లో నటిస్తున్నప్పుడే ‘మజ్ను’ సినిమాలో అవకాశం వచ్చింది’’ అని కథానాయిక అనూ ఇమ్మాన్యుయేల్ అన్నారు. గోపీచంద్, అనూ ఇమ్మాన్యుయేల్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా ఏ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మించిన ‘ఆక్సిజన్’ నవంబర్‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా అను చెప్పిన చిత్ర విశేషాలు... ► ఇదొక హెవీ యాక్షన్ మూవీ. మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంది. ఇందులో నా పాత్ర పేరు గీత. డాక్టర్‌గా కనిపిస్తాను. తెలుగు రాదు కాబట్టి భయపడ్డాను. అయితే జ్యోతికృష్ణగారి హెల్ప్ చేశారు. చాలా ఈజీ అయింది. ఇప్పుడు తెలుగు ఓకే. గోపీచంద్‌గారితో నటించడం చాలా ఆనందంగా ఉంది. ‘ఆక్సిజన్’ మంచి సినిమా. అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది. తెలుగులో ఎక్కువ సినిమాలు, మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. ఇక్కడ వాతావరణం కూడా బావుంది. కాబట్టి, నా ప్రాధాన్యత తెలుగు సినిమాలకే. తమిళంలో ఓ సినిమా చేశా. మలయాళంలోనూ చేయాలనుకుంటున్నా. ► ఒక నటిగా అన్ని రకాల పాత్రలూ చేయాలనుంది. గ్లామర్ రోల్స్ చేయడానికీ సిద్ధమే. నా దృష్టిలో గ్లామర్ రోల్స్, వల్గర్ రోల్స్‌కి చాలా తేడా ఉంది. గ్లామర్ ఓకే కానీ, వల్గర్‌గా ఉండకూడదని అనుకుంటాను. ► నేను హైదరాబాద్‌లో సెటిల్ అయ్యా. ఇక్కడ ఫ్లాట్ కూడా కొనుక్కున్నా. తెలుగు ఇండస్ట్రీలో అందరితో స్నేహంగానే ఉంటా. కానీ, నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరిక్కడ. ► ప్రస్తుతం నా కెరీర్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నా. పవన్ కల్యాణ్‌గారితో నటించడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ఓ సినిమా, మారుతిగారి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న చిత్రంలోనూ నటిస్తున్నా. తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నా. -
డిటెక్టివ్ యాక్షన్
మాస్ హీరో విశాల్ ‘డిటెక్టివ్’గా తెలుగు ప్రేక్షకులముందుకొస్తున్నారు. ఆయన హీరోగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్, యాక్షన్ ఎంటర్టైనర్ ‘తుప్పరివాలన్’. తమిళ్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టి, విశాల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ‘డిటెక్టివ్’ పేరుతో ఈ నెలలోనే తెలుగులో విడుదల కానుంది. నిర్మాత జి. హరి మాట్లాడుతూ– ‘‘మొదటి వారంలోనే ‘తుప్పరివాలన్’ 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. విశాల్ కెరీర్లోనే మొదటివారం హయ్యస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ‘డిటెక్టివ్’ తెలుగు ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. విశాల్ నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటాయి. తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. అనూ ఇమ్మాన్యుయేల్, ఆండ్రియా, ప్రసన్న, కె.భాగ్యరాజ్, సిమ్రాన్, జాన్ విజయ్, అభిషేక్ శంకర్, జయప్రకాశ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: అరోల్ కొరెల్లి, కెమెరా: కార్తీక్ వెంకట్రామన్, మాటలు: రాజేష్ ఎ.మూర్తి. -
ఎందుకీ ఆలోచన... ఎక్కడికీ అడుగులు?
-
ఎందుకీ ఆలోచన... ఎక్కడికీ అడుగులు?
సినిమా పేరేంటి? చెప్పలేదు. పవన్‌కల్యాణ్ ఫుల్ లుక్కేది? ఇంకా విడుదల చేయలేదు. అసలు కథేంటి? చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. కానీ, మా సినిమా కాన్సెప్ట్ ఈ పోస్టర్లో దాగుందంటూ కొత్త ప్రశ్నలు రేకెత్తేలా చేశారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్ హీరోగా ఆయన దర్శకత్వంలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నేడు పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో రెండు ఫొటోలున్నాయి. ఒకటి.. అంతులేని ఆలోచనల ఎడారిలో మునిగిన పవన్ ముఖం! రెండోది.. బహుదూరపు బాటసారిలా అడుగులు వేస్తున్న అతణ్ణి వెనక నుంచి తీసిన ఫొటో! ఈ స్టిల్ చూడగానే ప్రేక్షకుల్లో ‘ఎందుకీ ఆలోచన... ఎక్కడికీ అడుగులు?’ అని కొత్త ప్రశ్నలు రేకెత్తాయి. కథ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెరిగింది. దర్శక, నిర్మాతలు శుక్రవారం ఈ స్టిల్‌తో సర్ప్రైజ్ చేస్తే, ఈ సినిమాతో తెలుగు తెరకు సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్న అనిరు«ద్ రవిచంద్రన్ శనివారం తెల్లవారుజాము 3 గంటలకు సోషల్ మీడియా ద్వారా మ్యూజికల్ సర్ప్రైజ్ ఇచ్చారు. కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సమర్పణ: శ్రీమతి మమత. -
యాక్షన్ ఆక్సిజన్
గోపీచంద్, రాశీఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆక్సిజన్’. ఏ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఎస్. ఐశ్వర్య మాట్లాడుతూ– ‘‘పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. గోపీచంద్ కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. ఇందులో ఆయన చాలా హ్యాండసమ్గా కనిపిస్తారు. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై లాంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం. జ్యోతికృష్ట టేకింగ్ విలువలు సినిమా రిలీజయ్యాక ప్రేక్షకులకు అర్థమవుతాయి. యువన్ శంకర్ రాజా చక్కని పాటలిచ్చారు. ఈ పాటలు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. త్వరలో పాటలు విడుదల చేసి, అక్టోబర్ 12న సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. జగపతిబాబు, ‘కిక్’ శ్యామ్, అలీ, చంద్రమోహన్, నాగినీడు, బ్రహ్మాజీ, అభిమన్యు సింగ్, అమిత్, సితార తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వెట్రి–ఛోటా కె. నాయుడు, పాటలు: శ్రీమణి–రామజోగయ్య శాస్త్రి. -
ఇండిపెండెన్స్ డేకి బన్నీ సర్ప్రైజ్..!
-
వేసవిలో సూర్యుడొస్తాడు!
... ఆ మాటకొస్తే ప్రతి ఉదయం సూర్యుడొస్తాడు. కానీ, వేసవిలో ఎక్కువసేపు మన తోడుగా, నీడగా వస్తుంటాడు. వచ్చే ఏడాది అదే టైమ్‌లో ప్రతిరోజూ ఉదయించే సూర్యుడితో పాటు మరో సూర్యుడు ‘నేనొస్తున్నా’ అంటున్నారు. ఆ సూర్యుడే అల్లు అర్జున్. ఎప్పుడూ మనదేశ ప్రజలకు తోడు–నీడగా ఉండే ఆర్మీ అధికారి సూర్యగా ఆయన నటిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. వక్కంతం వంశీ దర్శకత్వంలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ నిన్న హైదరాబాద్‌లో మొదలైంది. నిన్ననే సినిమా విడుదల తేదీనీ ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు నిర్మాత లగడపాటి శ్రీధర్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘బన్నీ ఎనర్జీకి తగ్గట్టుగా రెడీ చేసిన ఈ కథలో కమర్షియల్ అంశాలన్నీ ఉన్నాయి. నాగబాబు–‘బన్నీ’ వాసుగార్ల ఆధ్వర్యంలో సినిమా ముందుకెళ్తున్నందుకు వెరీ హ్యాపీ’’ అన్నారు. కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్, ముఖ్య తారలుగా అర్జున్, శరత్‌కుమార్‌లు నటిస్తున్న ఈ సినిమాకు కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి), ఫైట్స్: రామ్–లక్ష్మణ్, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, కెమెరా: రాజీవ్ రవి, సంగీతం: విశాల్–శేఖర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబు, సమర్పణ: కె. నాగబాబు, సహనిర్మాత: ‘బన్నీ’ వాసు. -
అల్లు సూర్య@ముంబయ్!
అల్లు అర్జున్ కొత్త సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మ్యూజిక్ సిట్టింగ్స్ ముంబయ్‌లో మొదలయ్యాయి. బాలీవుడ్ ద్వయం విశాల్–శేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సోమవారం సాయంత్రం ముంబయ్‌లోని విశాల్ అండ్ శేఖర్ స్టూడియోకి వెళ్లిన అల్లు అర్జున్ ట్యూన్స్ గురించి డిస్కస్ చేశారు. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ, లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించనున్న ఈ సిన్మాలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్, శరత్‌కుమార్ విలన్, అర్జున్ కీలక పాత్రధారి. -
అ.. అ... జోడీ కుదిరింది
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ – అల్లు అర్జున్ హీరోగా నటించే కొత్త సినిమా పేరు ఇది. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ, శ్రీరామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించనున్న ఈ సినిమా గత నెల్లో ప్రారంభమైంది. అప్పట్నుంచి ఇందులో అల్లు అర్జున్‌కు జోడీగా ఎవరు నటిస్తారనే ప్రచారం మరింత జోరందుకుంది. ఓ ముగ్గురు, నలుగురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. చివరకు, మలయాళీ ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌ను ఎంపిక చేశారనే వార్తలొచ్చాయి. తాజాగా దర్శక–నిర్మాతలు అదే వార్తను కన్ఫర్మ్ చేశారు. అ ఫర్ అల్లు అర్జున్‌కు జోడీగా అ ఫర్ అనూ నటించనున్నారని తెలిపారు. ఆగస్టు మొదటివారంలో ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. తమిళ హీరోలు అర్జున్, శరత్‌కుమార్ ముఖ్య తారాగణంగా నటించనున్న ఈ సినిమాకు సంగీతం: విశాల్–శేఖర్, సహ నిర్మాత: ‘బన్నీ’ వాసు, సమర్పణ: కె. నాగబాబు. -
లక్ష్యసాధన కోసం...
లక్ష్యం సాధించాలంటే పట్టుదల ఉండాలి. లక్ష్యసాధన కోసం పోరాడాలి. పోరాటంలో అలసిపోకుండా ఉండాలంటే లక్ష్యానికి ఊపిరి ఊదాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అతను అదే చేశాడు? ఇంతకీ అతని లక్ష్యం ఏంటి? దాన్నెలా సాధించాడు? అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘ఆక్సిజన్’. గోపీచంద్ హీరోగా, రాశీఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా జగపతిబాబు ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాత ఏయం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 18న విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ – ‘‘భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ని రూపొందించాం. గ్రాఫిక్స్‌కి ఎక్కువ టైమ్ పట్టింది. జ్యోతికృష్ణ టేకింగ్ స్టాండర్డ్స్ ఎంత గొప్పగా ఉంటాయో సినిమా విడుదల తర్వాత తెలుస్తుంది. గోపీచంద్ నటన హైలైట్. యువన్‌శంకర్ రాజా స్వరపరిచిన పాటలను త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు. -
అల్లు సూర్యతో...!
ఎవరీ అల్లు సూర్య? అల్లు అర్జున్ తెలుసు. అతని తమ్ముడు, హీరో అల్లు శిరీష్ తెలుసు. వీళ్లిద్దరి తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ తెలుసు. మరి, ఈ అల్లు సూర్య ఎవరు? కొత్త హీరోనా? అంటే... కాదు, స్టార్ హీరోనే! అల్లు అర్జునే. ఆయన ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ అంటున్నారు కదా! అందుకే, అల్లు సూర్య అంటున్నాం! ఈయన పక్కన పవన్‌కల్యాణ్ హీరోయిన్ నటిస్తున్నారని టాక్. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్ ఒక హీరోయిన్గా నటిస్తున్నారు. ఈమెను ‘నా పేరు సూర్య...’లో అల్లు అర్జున్‌కు జోడీగా ఎంపిక చేశారని ఫిల్మ్‌నగర్ టాక్. కన్నడ ‘కిరిక్ పార్టీ’ ఫేమ్ రష్మిక మండనతో పాటు పలువురు ఈ సినిమా కోసం ఫొటోషూట్స్ చేశారు. చివరకు, అనూను ఫైనలైజ్ చేశారట. ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకు అనూ ఇమ్మాన్యుయేల్ పరిచయమే. ‘మజ్ను, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాల్లో నటించారీమె. రచయిత వక్కంతం వంశీను దర్శకుడిగా పరిచయం చేస్తూ లగడపాటి శ్రీధర్, కె. నాగబాబు, బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. -
తమ్ముడూ... ఇరానీ కేఫ్‌లో కుమ్ముడూ!
తమ్ముళ్లందరికీ గరమ్ గరమ్ ఛాయ్ తాగిద్దామని ఓ పహిల్వాన్ హైదరాబాద్ నడిబొడ్డున అమీర్ పేట్‌లోని ఇరానీ కేఫ్‌కి తీసుకొచ్చాడు. కాసేపటికి అక్కడికి ఓ సాఫ్ట్వేర్ కుర్రాడు వచ్చాడు. చూపులకు కుర్రాడు చాలా సాఫ్ట్‌గా కనిపిస్తున్నాడు. కానీ, ఛాయ్ కన్నా గరమ్‌గున్న అతడి కళ్లు ఎవర్నో వెతుకుతున్నాయి. కట్ చేస్తే... పహిల్వాన్‌తో పాటు తమ్ముళ్లను కుమ్మడం స్టార్ట్ చేశాడు. ఆ కుమ్ముతోంది పవన్‌కల్యాణ్. అతడి కుమ్ముడికి బలైంది విలన్లు.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాలో సై్టలిష్ ఫైట్ ఇలానే ఉంటుందట! హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో ఈ సినిమా కోసం ఇరానీ కేఫ్ సెట్ వేశారు. ప్రస్తుతం ఆ సెట్లో పవన్‌పై తీస్తున్న ఫైట్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందట. రెండు మూడ్రోజుల పాటు ఇరానీ కేఫ్‌లో షూటింగ్ చేస్తారట! హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ‘అత్తారింటికి దారేది’లో సమంతను కొందరు కిడ్నాప్ చేసి, ఇరానీ కేఫ్‌కు తీసుకెళితే, అక్కడామె కిడ్నాపర్లకు పవన్ ఫ్లాష్‌బ్యాక్ చెప్తుంది. ఇప్పుడీ సిన్మాలో ఇరానీ కేఫ్‌లో సీన్లు బదులు త్రివిక్రమ్ ఫైట్స్ పెట్టారన్న మాట! -
ఈసారి ఏం ప్రాజెక్ట్ బాబు?
బాబు సాఫ్ట్వేర్ ఇంజినీర్. పేరున్న కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. ఆఫీసులో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్‌తో పాటు ఓ ఫ్యామిలీ ప్రాజెక్ట్‌నూ టేకప్ చేస్తాడు. బాబు మెయిన్ టార్గెట్ కూడా ఫ్యామిలీ ప్రాజెక్టే. అదేంటో ప్రేక్షకులకు తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న సినిమా మెయిన్ పాయింట్ ఇదేనట! ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్లో పవన్‌కల్యాణ్, ఖుష్బూ, ఇతర ముఖ్య తారాగణంపై సాఫ్ట్వేర్ ఆఫీసు నేపథ్యంలో సీన్స్ తెరకెక్కిసున్నారు. ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్, త్రివిక్రమ్ కలసి చేస్తున్న చిత్రమిది. అత్తారిల్లులో నదియా పవన్‌కు అత్తగా నటిస్తే... ఈ సినిమాలో ఖుష్బూ అత్త పాత్ర చేస్తున్నారు. అత్తారిల్లులో మేనత్తను తాతయ్యకు దగ్గర చేసే ప్రాజెక్ట్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేసిన హీరో పాత్రలో పవన్ కనిపించారు. ఈ సినిమాలో ఏం ప్రాజెక్ట్ టేకప్ చేశారో? ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ‘దేవుడే దిగి వస్తే’, ‘ఇంజినీర్ బాబు’ టైటిల్స్ ఈ చిత్రానికి పరిశీలనలో ఉన్నాయట! -
లాజిక్కులు కనపడవు.. మేజిక్ ఉంటుంది
‘‘ఏడాది కిందట విన్న కథ ఇది. ఈ కథను ఎవరు చక్కగా తెరకెక్కించగలరు? అనే చర్చ వచ్చినప్పుడు అనీల్ సుంకరగారు వంశీకృష్ణను తీసుకొచ్చారు. అనూప్ రూబెన్స్ కు నేను పెద్ద ఫ్యాన్ ని. తనతో ఎప్పటి నుంచో పని చేయాలనుకుంటున్నా, ఇప్పటికి కుదిరింది. రాజశేఖర్‌గారు ప్రతి సీన్ ను చాలా రిచ్‌గా చూపించారు’’ అని హీరో రాజ్‌తరుణ్ అన్నారు. రాజ్‌తరుణ్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా ‘దొంగాట’ ఫేం వంశీకృష్ణ దర్శకత్వంలో ఏ టీవీ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ మార్చి 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గుమ్మడికాయ వేడుక నిర్వహించారు. వంశీకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఇది నా రెండో చిత్రం. ‘సినిమా చూపిస్త మావ’ చిత్రం చూసి రాజ్‌తరుణ్ లాంటి ఎనర్జిటిక్ స్టార్‌తో చేయాలనుకున్నా. నా కోరిక చాలా త్వరగా తీరింది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో లాజిక్‌లు కనపడవు, కానీ మేజిక్ ఉంటుంది. ప్రతి సీన్ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేస్తారు’’ అని నిర్మాత అనీల్ సుంకర చెప్పారు. అను ఇమ్మాన్యుయేల్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ , కొరియోగ్రాఫర్ రాజు సుందరం, మాటల ర చయిత సాయిమాధవ్ బుర్రా తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బి.రాజశేఖర్, సహ నిర్మాత: అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి. -
సెండాఫ్.. టేకాఫ్!
ఓ సినిమాకు సెండాఫ్ చెబుతూ... మరో సినిమాకు వెల్కమ్ చెప్పనున్నారు పవన్‌కల్యాణ్. కిశోర్ పార్ధసాని (డాలి) దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రీకరణ చివరి దశకు వచ్చేసిందట. వచ్చే నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ఓ వారం ముందే.. మార్చి 24న రిలీజ్ చేసే ఛాన్సుంది. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ నటించనున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్లోనే త్రివిక్రమ్ సినిమా చిత్రీకరణ ప్రారంభించాలనుకున్నా... వాయిదాలు పడుతూ వచ్చింది. చివరకు, మార్చి 14న ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమా చిత్రీకరణకు ముహూర్తంగా నిర్ణయించారట. ఈసారి వాయిదా పడే ఛాన్స్ లేదని చిత్ర బృందం చెబుతోంది. ఆల్రెడీ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ రెండు మూడు ట్యూన్స్ రెడీ చేసిచ్చారట. కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్లు. బహుశా.. ఓ చేత్తో ఓ సినిమా యూనిట్‌కి వీడ్కోలు చెబుతూ, ఇంకో చేత్తో రెండో సినిమా యూనిట్‌కి వెల్కమ్ చెప్పడం పవన్ కెరీర్లో ఇదే మొదటిసారి అవుతుందేమో! -
ప్రెట్టీ కుట్టి
‘హలో...’ ‘కేరళ ఎక్కడ ఉంది?’ ‘కనపడటంలేదు.. కొంచెం బైనాక్యులర్స్ తీసుకు రండి!’ ‘అదిగో అక్కడ చిన్నగా ఉందే... అదే కేరళ.’ ‘కేరళ అక్కడెక్కడో కింద ఉంది కానీ... అక్కడి హీరోయిన్లు చూశారా... ఇక్కడ ఎంత ఎత్తుకి ఎదిగారో! పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, నాగచైతన్య... ఇలా స్టార్ల పక్కన నటిస్తున్నారు. ఈ ప్రెట్టీ కుట్టీలు చూడ్డానికి బ్యూటీగానే కాదు.. యాక్టింగ్‌తో కూడా మేజిక్ చేస్తున్నారు.’ ఆలస్యమే అమృతం! ‘ఆలస్యం అమృతం విషం’ అన్నారు పెద్దలు. అలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుందని ఈ సామెతకు అర్థం. కానీ, నివేదా థామస్ ప్రయాణం చూస్తే అలస్యమే అమృతమైందని చెప్పాలేమో! ‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర, నివేదా థామస్ జంటగా అప్పట్లో ఓ చిత్రం ప్రారంభమైంది. ఆ సినిమా చిత్రీకరణ ఆలస్యం కావడంతో నాని ‘జెంటిల్మన్’తో తెలుగు తెరకు పరిచయమయ్యారామె. అప్పటికే, తమిళంలో విజయ్ ‘జిల్లా’, కమల్‌హాసన్ ‘పాపనాశం’ చిత్రాల్లో చేసిన కీలక పాత్రలతో నటిగా నివేదకు మంచి పేరొచ్చింది. తెలుగులో తొలి సినిమా ‘జెంటిల్మన్’తో ఇక్కడి ప్రేక్షకులు, చలనచిత్ర ప్రముఖులను ఆకట్టుకున్నారు. అందం, అభినయం.. రెండిటిలోనూ నివేదకు మంచి మార్కులు పడ్డాయి. ‘జెంటిల్మన్’ తర్వాత నానీకి జంటగా మరోసారి నటిస్తున్నారీ భామ. శివ నిర్వాణని దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రంలో నాని, నివేద, ఆది పినిశెట్టి నటిస్తున్నారు. స్టార్స్ లిస్ట్‌లో... సమంత వంటి స్టార్ హీరోయిన్ సినిమాలో ఉన్నప్పుడు... అందులోనూ ఆమె పాత్ర చుట్టూ నడిచే ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అయినప్పుడు... అందులో సెకండ్ హీరోయిన్గా నటించిన అమ్మాయికి అరుదుగా గుర్తింపు లభిస్తుంది. కానీ, ‘అ.. ఆ’ ప్రచార చిత్రాల్లో అనుపమా పరమేశ్వరన్ చెప్పిన ‘రావణాసురుడి వాళ్లావిడ కూడా వాళ్ల ఆయన్ను పవన్‌కల్యాణ్ అనే అనుకుంటుంది’ అనే డైలాగ్ ఆమెకు పాపులారిటీ తీసుకొచ్చింది. ‘అ.. ఆ’లో కనిపించినంత సేపూ అందమైన నటనతో ఆకట్టుకున్న అనుపమ, తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు. అసలు మలయాళంలో అనుపమ హీరోయిన్గా పరిచయమైన ‘ప్రేమమ్’ పెద్ద హిట్. ఆ చిత్రం తెలుగు రీమేక్‌లో మాతృకలో చేసిన పాత్ర చేశారు. అయితే.. అనుపమ చేసిన ‘అ.. ఆ’, ‘ప్రేమమ్’ రెండూ మల్టీ హీరోయిన్ చిత్రాలే. త్వరలో సోలో హీరోయిన్గా సందడి చేయనున్నారు. శర్వానంద్ సరసన ఆమె నటించిన ‘శతమానం భవతి’ ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఇది కాకుండా అనుపమ తాజాగా ఓ బంపర్ ఆఫర్ దక్కించుకున్నారు. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మించనున్న చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌ను నాయికగా తీసుకున్నారని సమాచారం. మెల్లిగా అనుపమ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోతున్నారు. తక్కువ టైమ్‌లో కీర్తి తెలుగు తెరపై కీర్తీ సురేశ్ అడుగుపెట్టి సరిగ్గా సంవత్సరం అవుతుంది. గత ఏడాది జనవరి 1న విడుదలైన రామ్ ‘నేను – శైలజ’తో ఈ మలయాళ ముద్దుగుమ్మ మన తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ చిత్రం చూసిన వాళ్లంతా... మన పక్కింటి అమ్మాయిలా భలే నటించిందీ హీరోయిన్ అన్నారు. ఆవేదన, ఆనందం, అలజడి.. ఏదైనా మనసులోనే దాచుకునే శైలజ పాత్రలో కీర్తీ సురేశ్ భావోద్వేగాలు పండించిన తీరు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘నేను –శైలజ’ తర్వాత తమిళ అనువాద చిత్రాలు ‘రైల్’, ‘రెమో’లతో తెలుగు తెరపై కనిపించారు తప్ప... కీర్తీ సురేశ్ స్ట్రయిట్ తెలుగు చిత్రంతో మన ముందుకు రాలేదు. కానీ, ఆమెకు మంచి ఛాన్సులు వచ్చాయి. హీరో నానీకి జోడీగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఆమె నటించిన ‘నేను లోకల్’ ఈ ఏడాదిలో విడుదల కానుంది. ఇది కాకుండా త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించనున్న సినిమాలో ఆయనకు జోడీగా నటించే బంపర్ ఆఫర్ కొట్టేశారు. మరోవైపు తమిళంలోనూ విజయ్, సూర్య వంటి స్టార్ల సరసన నటిస్తున్నారు. కళ్లు మూసి తెరిచే లోపే ‘కళ్లు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే...’ – ‘మజ్ను’ చిత్రంలో హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్‌ను చూసి ప్రేమలో పడిన హీరో నాని పాడిన పాట ఇది. ఈ అమ్మాయి నవ్వు, నటనకు ఫిదా అయిన యువత కూడా థియేటర్ బయటకొచ్చిన తర్వాత ఈ పాటే పాడారు. ‘మజ్ను’ హిట్‌తో అనూకి సూపర్ ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు అనూ ఇమ్మాన్యుయేల్ చేతిలో మూడు సినిమాలున్నాయి. గోపీచంద్ ‘ఆక్సిజన్’, రాజ్‌తరుణ్ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాలను ‘మజ్ను’లో నటిస్తున్నప్పుడే అంగీకరించారామె. ఈ రెండూ వినూత్న కథలతో రూపొందుతోన్న చిత్రాలే. ఇక, ‘మజ్ను’ విడుదల తర్వాత ఆమెకు వచ్చిన ఛాన్స్ స్టార్ హీరోయిన్స్ రేసులోకి తీసుకువెళ్లింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించనున్న ప్రేమకథా చిత్రంలో ఓ నాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ ఎంపికయ్యారు. ఈ ఛాన్స్ ఆమెను కూడా సర్ప్రైజ్ చేసింది. ‘‘ఓ ఐదేళ్ల తర్వాత ఎప్పుడో పవన్‌కల్యాణ్ పక్కన నటించే ఛాన్స్ వస్తుందనుకున్నా! తెలుగు తెరకు పరిచయమైన ఏడాదిలోపే వస్తుందనుకోలేదు’’ అన్నారు అను. ఈ మూడు చిత్రాలూ ఈ ఏడాదే విడుదల కానున్నాయి. ఈలోపు అనూ ఇమ్మాన్యుయేల్ ఇంకెన్ని ఛాన్సులు అందుకుంటారో! మలయాళీ హీరోయిన్లు తెలుగు తెరపై రాణించడం ఇదేమీ కొత్త కాదు. ఆల్రెడీ అసిన్, మమతా మోహన్‌దాస్, మీరా జాస్మిన్, నయనతార, నిత్యామీనన్ తదితర కేరళ కుట్టీలు మనవాళ్లను తెగ మెప్పించిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అనూ ఇమ్మాన్యుయేల్, నివేదా థామస్, కీర్తీ సురేశ్, అనుపమా పరమేశ్వరన్‌లు ఒక్క ఏడాదిలో తెలుగు తెరపై తారాజువ్వలా దూసుకెళుతుండడం చెప్పుకోదగ్గ విశేషం. -
బంపర్ ఆఫర్
పవన్ కల్యాణ్ సరసన మరో మలయాళ కుట్టి ఈ టైమ్ ఉందే.. అది ఎవరి వైపు ఉంటే వాళ్లకు జాక్‌పాట్ తగిలినట్టే. ఊహించని బంపర్ ఆఫర్లు ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయ్. అందుకు తాజా ఉదాహరణ అనూ ఇమ్మాన్యుయేల్. ఈ అమ్మాయి కథానాయిక అయి జస్ట్ ఏడాది అయ్యింది. మలయాళంలో ‘యాక్షన్ హీరో బిజ్జు’, తెలుగులో ‘మజ్ను’ ద్వారా సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమయ్యారు. ప్రస్తుతం గోపీచంద్ సరసన ‘ఆక్సిజన్’లో నటిస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం కొట్టేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందనున్న చిత్రంలో ఇప్పటికే కీర్తీ సురేశ్ హీరోయిన్గా ఎంపికైన విషయం తెలిసిందే. మరో నాయికగా అనూని తీసుకున్నారు. కీర్తి కథానాయిక అయి రెండు మూడేళ్లవుతోంది. ఏమైనా తక్కువ సమయంలో ఈ మలయాళ కుట్టీలిద్దరూ బంపర్ ఆఫర్ దక్కించుకున్నారు. పవన్ కల్యాణ్ సరసన అంటే కెరీర్‌పరంగా ఓ మెట్టు పైకి ఎక్కినట్లే. ఇక.. త్రివిక్రమ్ సినిమాల్లో కథానాయిక పాత్ర ఎలాగూ బాగుంటుంది కాబట్టి.. నటనపరంగా ఇంకా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ వంటి హిట్స్ తర్వాత పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందనున్న మూడో సినిమా ఇది. ఈ చిత్రానికి ‘వై దిస్ కొలవెరి..’ ఫేమ్ అనిరుధ్ రవిచందర్ పాటలు స్వరపరుస్తున్నారు.