అల్లు సూర్య@ముంబయ్!
అల్లు అర్జున్ కొత్త సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మ్యూజిక్ సిట్టింగ్స్ ముంబయ్‌లో మొదలయ్యాయి. బాలీవుడ్ ద్వయం విశాల్–శేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సోమవారం సాయంత్రం ముంబయ్‌లోని విశాల్ అండ్ శేఖర్ స్టూడియోకి వెళ్లిన అల్లు అర్జున్ ట్యూన్స్ గురించి డిస్కస్ చేశారు. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ, లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించనున్న ఈ సిన్మాలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్, శరత్‌కుమార్ విలన్, అర్జున్ కీలక పాత్రధారి.