
డిజిటల్ వ్యూస్‌లో అల్లు అర్జున్ మరోసారి తన సత్తా చాటారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫస్ట్ ఇంపాక్ట్ 29గంటల్లోనే కోటి డిజిటల్ వ్యూస్‌ని రాబట్టుకోవడం విశేషం. జనవరి 1 సాయంత్రం 5 గంటలకి డిజిటల్ మీడియాలో విడుదల చేసిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫస్ట్ ఇంపాక్ట్ కోటి వ్యూస్‌తో నాన్ ‘బాహుబలి’ రికార్డులో తొలి స్థానంలో నిలిచినట్లు చిత్రబృందం ప్రకటించింది. రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ కె.నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఏప్రిల్ 27న సినిమా విడుదల చేస్తున్నారు. ‘‘మా సినిమా ఫస్ట్ ఇంపాక్ట్‌కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందుకు ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులందరికి నా ధన్యవాదాలు’’ అన్నారు అల్లు అర్జున్. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజీవ్ రవి, సంగీతం: విశాల్–శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు, సహ నిర్మాత: బన్నీ వాసు.
Comments
Please login to add a commentAdd a comment