Anu Emanual
-
రవితేజ రావణాసుర.. దీపావళి కానుకగా క్రేజీ అప్డేట్
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 'రావణాసుర'. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ మూవీ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రవితేజ, అక్కినేని సుశాంత్ ఫస్ట్ లుక్స్‌కి ఆడియన్స్‌లో మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో రవితేజ లాయర్‌గా కనిపించనున్నారు. ఈ మూవీలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలో సందడి చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మాస్ లుక్‌లో ఉన్న రవితేజ పోస్టర్‌ను షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో రవితేజ పోస్టర్ చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో మరో మాస్ ఎంటర్టైనర్ బ్లాస్ట్ అవ్వబోతోందని అని కామెంట్స్ చేయగా.. మరికొందరు ఇది కూడా ఫ్లాప్ లిస్ట్‌లో చేరినట్లేనా అంటూ నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా దీపావళి కానుకగా రవితేజ ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ‘‘ఈ షెడ్యూల్లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. హీరో రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమ వుతున్నారు. తాజాగా నటి స్తున్న ధమాకా చిత్రం తో త్వరలోనే ప్రేక్ష కుల ముందుకు రాబోతు న్నది. దీపావళి శుభాకాంక్షలు 😊 Welcoming you all to the exciting world of #RAVANASURA from April 7th 2023 ❤️@iamSushanthA @sudheerkvarma @AbhishekPicture @SrikanthVissa @RTTeamWorks pic.twitter.com/AKAzLuQZuR — Ravi Teja (@RaviTeja_offl) October 24, 2022 -
శర్వానంద్ సినిమాలో పాయల్ ‘స్పెషల్’..?
‘సీత’ సినిమాలో ‘బుల్లెట్టు మీదొచ్చె బుల్రెడ్డి.. రాజ్‌దూత్ మీదొచ్చె....’ అంటూ ఓ స్పెషల్ సాంగ్‌లో స్టెప్స్ వేశారు పాయల్ రాజ్‌పుత్. ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘మహా సముద్రం’ అనే సినిమా తెరకెక్కుతోంది. అదితీ రావ్ హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఈ మల్టీస్టారర్ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ సాంగ్‌లో పాయల్ స్టెప్స్ వేస్తారని సమాచారం. పాయల్‌కి పెద్ద బ్రేక్ వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’కి అజయ్ భూపతే దర్శకుడు అనే సంగతి గుర్తుండే ఉంటుంది. త్వరలోనే ఈ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేయనున్నారట. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. -
అన్నీ సొంత నిర్ణయాలే!
‘‘కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్నాను. తప్పులు చేస్తే దిద్దుకునే అవకాశం ఉంటుంది. పోటీ ఫీలవ్వను. హిట్, ఫ్లాప్స్ నా కంట్రోల్లో ఉండవు. సినిమాలు ఆడకపోతే చాన్సులు తగ్గుతాయనే నెర్వస్నెస్ ఉంటుంది. సినిమా సినిమాకు నన్ను నేను బెటర్ చేసుకోవాలనుకుంటాను. సొంత నిర్ణయాలు తీసుకోవడానికే ఇష్టపడతాను’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యు యేల్ జంటగా మారుతి దర్శకత్వంలో నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా అనూ ఇమ్మాన్యుయేల్ చెప్పిన సంగతులు... ► ఈ మూవీలో ఈగోయిస్ట్ అండ్ యాంగ్రీ గాళ్ అను పాత్ర చేశాను. ఎప్పుడూ తనే నంబర్ 1 అవ్వాలనుకుంటుంది. గర్వంగా ఫీల్ అవుతుంది. కానీ ఒకసారి ప్రేమిస్తే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఇంతకు ముందు నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. రియల్ లైఫ్‌లో నేను కొంచెం ఈగోయిస్ట్. అయితే ఎంతవరకూ ఉండాలో అంతవరకే. ► నాగచైతన్య కంఫర్టబుల్ అండ్ చాలెంజింగ్ కో స్టార్. రమ్యకృష్ణగారి ఎనర్జీ సూపర్. పెద్ద పెద్ద డైలాగ్స్‌ను కూడా ఆమె జ్ఞాపకం పెట్టుకుని సులభంగా చెప్పేవారు. సినిమాలో రమ్యకృష్ణగారి కూతురు పాత్రలో కనిపిస్తాను. మారుతిగారు అమేజింగ్ డైరెక్టర్. సెట్లో నేను ఎక్కువగా సైలెంట్‌గానే ఉంటాను. కానీ ఒకసారి నాకు కనెక్ట్ అయితే నాన్‌స్టాప్‌గా మాట్లాడతాను. ► ‘అజ్ఞాతవాసి’ స్క్రిప్ట్‌ని వినే సైన్ చేశాను. ఆ సినిమా మంచి వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో నటించడం హ్యాపీ. ‘గీత గోవిందం’ సినిమాలో నాకు ఆఫర్ వచ్చింది. కానీ డేట్స్ లేకపోవడంతో కుదరలేదు. అందుకే గెస్ట్ రోల్ చేశాను. ‘అజ్ఞాతవాసి, గీతగోవిందం’ సినిమాలకు నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పాను. హైదరాబాద్‌లో ఇల్లు ఇంకా కొనలేదు. కానీ హోమ్లీ ఫీలింగ్ ఉంది. ► నేను నటించిన కొన్ని సినిమాలు ఆశించినంతగా ఆడలేదు. అయితే ఏం? కెరీర్ స్టారింగ్‌లో శ్రుతీహాసన్‌కి కూడా ఇలానే జరిగింది. ఫ్లాప్స్ అనేవి జర్నీలో ఓ భాగం. ప్రస్తుతం నా మాతృభాష మలయాళంతో పాటు ఇతర భాషల నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ముందు తెలుగులో ప్రూవ్ చేసుకోవాలను కుంటున్నాను. మంచి స్క్రిప్ట్, స్ట్రాంగ్ రోల్స్ కోసం చూస్తున్నాను. ప్రయోగాత్మక చిత్రాలు చేయాలని ఉన్నా యంగ్ యాక్ట్రస్ని కాబట్టి ఇప్పుడే కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. కరెక్ట్ టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. -
స్క్రీన్ టెస్ట్
► ‘‘జీవితంలో ఏదీ ఈజీ కాదు.. ప్రయత్నిస్తే ఏదీ కష్టం కాదు’’ అని రజనీకాంత్ చెప్పిన ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? ఎ) నరసింహా బి) అరుణాచలం సి) శివాజీ డి) లింగ ► మహేశ్‌బాబును తెలుగు తెరకు హీరోగా పరిచయం చేసిన దర్శకుడెవరు? ఎ) వైవీయస్ చౌదరి బి) కె. రాఘవేంద్రరావు సి) బి. గోపాల్ డి) గుణశేఖర్ ► ఎన్టీఆర్–ఏయన్నార్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలెన్ని? ఎ) 18 బి) 16 సి) 14 డి) 10 ► ఈ మధ్యనే 50 చిత్రాల క్లబ్లో చేరిన సంగీత దర్శకుడెవరో చెప్పుకోండి ? ఎ) యస్.యస్. తమన్ బి) అనూప్ రూబెన్స్ సి) అనిరుథ్ డి) యం.యం. కీరవాణి ► ఈ ప్రముఖ హీరో కాలిపాదం సైజు 13వ నంబర్. ఇండియాలో ఈ నంబరు చెప్పులు దొరకడం చాలా కష్టం. అందుకే ఈయన దుబాయ్ వెళ్లినప్పుడల్లా సూట్‌కేస్ నిండా చెప్పులతో తిరిగొస్తారు. ఆ లాంగ్ ఫుట్ హీరో ఎవరబ్బా? ఎ) ప్రభాస్ బి) మహేశ్‌బాబు సి) రానా డి) వరుణ్‌తేజ్ ► ఈ మధ్యే చనిపోయిన పాత తరం నటి ‘కృష్ణకుమారి’ ఒక ప్రముఖ హీరోయిన్ చెల్లెలు. ఎవరా హీరోయిన్? ఎ) శారద బి) షావుకారు జానకి సి) సావిత్రి డి) జమున ► దీపికా పదుకోన్ మాజీ ప్రియుడు పేరు ‘ఆర్’ అక్షరంతో మొదలవుతుంది. తాజా ప్రియుడి పేరూ అదే అక్షరంతో మొదలవుతుందని హింటిచ్చారు. ఆ ‘ఆర్’ ఎవరో కనుక్కోండి చూద్దాం? ఎ) రణ్‌బీర్ కపూర్ బి) రణ్వీర్ సింగ్ సి) రాజ్‌కుమార్ రావు డి) రణ్‌దీప్ హుడా ► దుబాయ్‌లో పుట్టింది ఈ మలయాళీ భామ మొదటి తెలుగు చిత్రం ‘చమ్మక్ చల్లో’. ఇప్పుడు చాలా సినిమాల్లో బిజీ హీరోయిన్. ఎవరామె? ఎ) కేథరిన్ థెరిస్సా బి) ప్రగ్యా జైస్వాల్ సి) హెబ్బా పటేల్ డి) అనూ ఇమ్మాన్యుయేల్ ► ‘అపుడో, ఇపుడో, ఎపుడో కలగన్నానే చెలి..’ అనే పాట ‘బొమ్మరిల్లు’ సినిమాలోనిది. ఆ పాట రచయితెవరు? ఎ) సాహితి బి) జొన్నవిత్తుల సి) శ్రీమణి డి) అనంత శ్రీరామ్ ► ‘కాస్టింగ్ కౌచ్’ గురించి నిర్భయంగా మాట్లాడుతున్న హీరోయిన్ ఈమె. ఆమె పాటలు కూడా పాడతారు. ఎవరా హీరోయిన్? ఎ) భావన బి) ఆండ్రియా సి) అంజలి డి) అమీ జాక్సన్ ► ‘స్వాతిముత్యం’ చిత్రంలో బాల నటుడిగా నటించిన ఈ నటుడు ఇప్పుడు టాలీవుడ్లో టాప్ స్టార్? ఎవరా హీరో కనుక్కోండి? ఎ) అల్లు అర్జున్ బి) రామ్‌చరణ్ సి) యన్టీఆర్ డి) కల్యాణ్‌రామ్ ► వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ సినిమా నిర్మాత ఎవరు? ఎ) కృష్ణవంశీ బి) జె.డి. చక్రవర్తి సి) రామ్‌గోపాల్‌వర్మ డి) గుణశేఖర్ ► ప్రస్తుతం విక్రమ్ సరసన ఓ సినిమా కమిట్ అయిన ప్రముఖ కథానాయకుని కుమార్తె ఎవరు? ఎ) శివానీ రాజశేఖర్ బి) శ్రుతీహాసన్ సి) వరలక్షీ శరత్‌కుమార్ డి) అక్షరాహాసన్ ► కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘సాహసవీరుడు–సాగరకన్య’ చిత్రంలో నటించిన భాలీవుడ్ భామ ఎవరు? (ఈమెని పొడుగు కాళ్ల సుందరి అని కూడా అంటారు) ఎ) టబు బి) ట్వింకిల్ ఖన్నా సి) శిల్పాశెట్టి డి) మనీషా కొయిరాలా ► నటుడు ఆర్.నారాయణమూర్తి ఏ చిత్రం ద్వారా హీరోగా మారారో తెలుసా? ఎ) అర్ధరాత్రి స్వాతంత్య్రం బి) అడవి దివిటీలు సి) దండోరా డి) లాల్‌సలామ్ ► రిషిబాలా నావల్ అని ఈ నటి అసలు పేరు. ఈమె సౌత్‌లో పదేళ్ల క్రితం టాప్ హీరోయిన్? ఎవరా కథానాయిక? ఎ) త్రిష బి) స్నేహ సి) సిమ్రాన్ డి) శ్రియ ► ‘అర్జున్‌రెడ్డి’ చిత్ర సంగీతదర్శకుని పేరేంటి? ఎ) గోపీసుందర్ బి) సాయి కార్తీక్ సి) రామ్ నారాయణ్ డి) రథన్ ► మొన్న సంక్రాంతి పండగను నాగార్జున కొత్త కోడలు సమంత అన్నపూర్ణ స్డూడియో స్టాఫ్‌తో జరుపుకున్నారు. అన్నపూర్ణ స్టూడియో ప్రారంభించి ఎన్ని సంవత్సరాలైందో తెలుసా? ఎ) 34 బి) 28 సి) 42 డి) 38 ► ‘గాయత్రి’ అనే పేరుతో వస్తున్న చిత్రంలో లీడ్ రోల్లో నటిస్తున్న సీనియర్ మోస్ట్ హీరో ఎవరో కనుక్కోండి? ఎ) మోహన్‌బాబు బి) రాజేంద్రప్రసాద్ సి) జగపతిబాబు డి) సుమన్ ► జియస్టీ (గాడ్, సెక్స్ అండ్ ట్రూత్) అనే షార్ట్ ఫిల్మ్‌కు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఎ) జేబి బి) యం.యం. కీరవాణి సి) జిబ్రాన్ డి) కమ్రాన్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) బి 3) సి 4) బి 5) సి 6) బి 7) బి 8) ఎ 9) డి 10) బి 11) ఎ 12) సి 13) డి 14) సి 15) ఎ 16) సి 17) డి 18) సి 19) ఎ 20) బి -
ఇల్లే ఇండియా.. దిల్లే ఇండియా.. నీ తల్లే ఇండియా
‘‘ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా ‘సైనిక’ సాంగ్ ఉంటుంది. రచయిత రామజోగయ్యశాస్త్రిగారు రాసిన సాంగ్ లిరిక్స్ విన్నప్పుడు ఒళ్లు పులకరించింది. రిపబ్లిక్ డే రోజున సైనికులకు నివాళిలా ఈ పాటను రిలీజ్ చేయనున్నాం. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా’ సినిమా ఉంటుంది’’ అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. అల్లు అర్జున్ హీరోగా రచయిత వక్కంతం వంశీ తొలిసారి దర్శకునిగా మారి రూపొందిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా’. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై కె. నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. ఈ సినిమాలోని ‘సైనిక’ సాంగ్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ‘‘ఇల్లే ఇండియా.. దిల్లే ఇండియా.. నీ తల్లే ఇండియా’’ అనే లిరిక్స్‌తో ఈ పాట ఉంటుందని హీరో అల్లు అర్జున్ పేర్కొన్నారు. నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్–శేఖర్ మంచి సంగీతం ఇస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ బాడీ లాంగ్వేజ్ సూపర్‌గా ఉంటుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం పీటర్ హెయి¯Œ సారథ్యంలో ఫైట్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నాం. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను చూస్తుంటే సాంగ్ టీజర్లా.. ఫైట్ టీజర్లను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా? అని ఆలోచిస్తున్నాను. సినిమాలో ఫైట్స్ హైలైట్‌గా ఉంటాయి. ప్రస్తుతం తీస్తున్న ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ తర్వాత మరో నెలరోజుల పాటు షూటింగ్ జరిపితే సినిమా కంప్లీట్ అవుతుంది. ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ– ‘‘భరతమాతకు సైనికులు వందనం చేస్తారు. కానీ సైనికులకు వందనం చేసేలా ఈ సినిమాలోని ‘సైనిక’ సాంగ్ ఉంటుంది. వారి త్యాగాలు, కష్టనష్టాలను తెలియజేసేలా ఉంటుంది. టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉంది. వక్కంతం వంశీ కథలు అందించిన సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. వంశీకి దర్శకునిగా ఇది ఫస్ట్ సినిమా అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్నవారిలా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి నాలుగు పాటలు రాశాను. సాంగ్స్ సందర్భానుసారంగానే ఉంటాయి’’ అన్నారు. -
ఆవేశమే ఆయుధం
కారణం లేని కోపం ప్రమాదం అంటారు. అది శత్రువుకు అవకాశం అని చెబుతారు. కానీ సూర్యాకి ఆవేశమే ఆయుధం. అదెలా అనేది స్క్రీన్‌పై చూడాల్సిందే. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య...నా ఇల్లు ఇండియా’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ఈ సినిమాలో సూర్య అనే సైనికుడి పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నారు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ భారీ ఫైట్ చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ కోసం కోటి రూపాయలతో సెట్ వేయడం విశేషం. విశేషం ఏంటంటే.. డైరెక్టర్ కావాలనుకుంటున్న ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ ఈ మధ్య ఫైట్ మాస్టర్‌గా సినిమాలు ఒప్పుకోవడం లేదట. కానీ ఈ చిత్రకథ విని, ఒప్పుకున్నారట. ఆయన ఆధ్వర్యంలో ప్రస్తుతం తీస్తున్న ఇంటర్వెల్ ఫైట్ ‘అదరహో’ అనే విధంగా ఉంటుందట. ఈ సినిమాలో నాలుగు మేజర్ ఫైట్స్ ఉన్నాయని టాక్. మిగిలిన ఫైట్‌ను రామ్–లక్ష్మణ్, రవి వర్మ, బ్యాంకాక్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కిచా డిజైన్ చేశారు. బన్నీ కెరీర్లో ఇది హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా నిలుస్తుందని టాక్. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రంలోని ‘సైనికా..’ అనే పాటను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బన్నీ’వాసు సహ నిర్మాత. ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
29 గంటల్లో కోటి
డిజిటల్ వ్యూస్‌లో అల్లు అర్జున్ మరోసారి తన సత్తా చాటారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫస్ట్ ఇంపాక్ట్ 29గంటల్లోనే కోటి డిజిటల్ వ్యూస్‌ని రాబట్టుకోవడం విశేషం. జనవరి 1 సాయంత్రం 5 గంటలకి డిజిటల్ మీడియాలో విడుదల చేసిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫస్ట్ ఇంపాక్ట్ కోటి వ్యూస్‌తో నాన్ ‘బాహుబలి’ రికార్డులో తొలి స్థానంలో నిలిచినట్లు చిత్రబృందం ప్రకటించింది. రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ కె.నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఏప్రిల్ 27న సినిమా విడుదల చేస్తున్నారు. ‘‘మా సినిమా ఫస్ట్ ఇంపాక్ట్‌కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందుకు ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులందరికి నా ధన్యవాదాలు’’ అన్నారు అల్లు అర్జున్. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజీవ్ రవి, సంగీతం: విశాల్–శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు, సహ నిర్మాత: బన్నీ వాసు. -
అప్పుడు నాకు అండగా ఉన్నది మీరు.. త్రివిక్రమ్
‘‘నా లోపల హృదయ వైశాల్యం ఎంత ఉంటుందంటే అభిమానించే అందర్నీ గుండెల్లో పెట్టుకోవాలనుంటుంది. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు ఇంత అభిమానాన్ని సంపాదిస్తానని అనుకోలేదు’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్, కీర్తీ సురేశ్, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మమత సమర్పణలో ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన సినిమా ‘అజ్ఞాతవాసి’. అనిరు«ద్ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. చిత్రాన్ని జనవరి 10న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘నేను సినిమాల్లోకి వస్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్లు ఎన్ని సినిమాలు చేస్తావంటే 10 లేక 12 అనుకున్నా. ‘ఖుషి’ తర్వాత వెళ్లిపోదామనుకున్నా. మీ (అభిమానులు) ప్రేమ నన్ను పాతిక సినిమాల వరకూ తీసుకొచ్చింది. జీవితంలో ఓటమికి భయపడలేదు.. గెలుపుకి పొంగిపోలేదు. ‘జానీ’ ఫెయిలయ్యాక నా శ్రేయోభిలాషులు, సన్నిహితులు నాకు అండగా నిలవకున్నా నన్నింకా సినిమాల్లో ఉండనిచ్చింది మీరే . భారతీయ జెండా చూసినప్పుడల్లా నా గుండె ఉప్పొంగుతూ ఉంటుంది. ఆ జెండా, దేశం కోసం నేను రాజకీయాల్లోకి వెళ్లానే కానీ వేరే ఏదీ కాదు. నేను నిరాశ, నిస్పృహల్లో ఉన్నప్పుడు స్నేహితులు, హితులు నాకు చేయూతగా నిలబడలేదు. ‘గోకులంలో సీత’ చిత్రంలో ఓ రచయితగా పని చేసిన త్రివిక్రమ్, మీరు నాకు తోడుగా ఉన్నారు. దర్శకుడిగా ‘జల్సా’ సినిమాతో నాకు హిట్ ఇచ్చారు. అందరూ అంటుంటారు. త్రివిక్రమ్ మీకు బ్యాక్ సపోర్ట్ అట కదా? అని. నేను, త్రివిక్రమ్ దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాళ్లం. మా ఇద్దరి ఆలోచనా విధానం ఒకటే. నా రక్తం పంచుకుని పుట్టినవారిపై నేనెప్పుడూ కోప్పడలేదు. కానీ, త్రివిక్రమ్‌ని కోప్పడగలను. అంత చనువు ఉంది. ‘జల్సా’ టైమ్‌లో నేను దుఃఖంలోనే ఉన్నా. ‘నా దేశం నా ప్రజలు’ పుస్తకం తెచ్చి ఇచ్చారు త్రివిక్రమ్. అది నాలో స్ఫూర్తి నింపింది. నా మీద తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటారు నిర్మాతలు. కానీ, రాధాకృష్ణగారు సినిమాకి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు. మైఖేల్ జాక్సన్ తర్వాత నాకిష్టమైన సంగీత దర్శకుడు అనిరు«ద్’’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘నేను రూపాయి సరిపోతుందంటే రూపాయిన్నర ఖర్చు పెడదామంటారు రాధాకృష్ణగారు. పీడీ ప్రసాద్‌గారు, నాగవంశీ ఈ సినిమాకి రథ చక్రాల్లా పనిచేశారు. పవన్‌గారు ఇటలీలో ఉన్నప్పుడు ఈ కథని ఫోనులో రెండు నిమిషాలు చెప్పా. ‘చాలా బాగుంది.. చేస్తున్నాం’ అన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకూ కథ అడగలేదు. నేను చెప్పినట్టు చేసుకుంటూ పోయారు. కల్యాణ్‌గారి నట విశ్వరూపం చూస్తారు. ఆయనతో పనిచేసే అవకాశం మళ్లీ మళ్లీ రావాలి. మీరందరూ కోరుకుంటున్న ఆ స్థాయికి ఆయన ఎదగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా’’ అన్నారు. పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి, నిర్మాతలు ఏయం రత్నం, భగవాన్, పుల్లారావు, ‘దిల్’ రాజు తదితరులు పాల్గొన్నారు. -
రెడ్డిగారి అల్లుడికి క్లాప్!
నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ చిత్రం నిర్మించనుందనీ, ఆ చిత్రానికి ‘శైలజారెడ్డి అల్లుడు’ పేరు పరిశీలిస్తున్నారనే వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. సిన్మా పేరు అదో? కాదో? తెలీదు గానీ... నిన్న కొబ్బరికాయ కొట్టారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో ప్రొడక్షన్ నంబర్ 3గా తెరకెక్కనున్న చైతూ–మారుతిల సినిమా శనివారం ఉదయం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభమైంది. ఇందులో చైతూ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ నాయికగా నటించనున్నారు. పూజా కార్యక్రమాల తర్వాత హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. ‘‘జనవరి 5న చిత్రీకరణ ప్రారంభిస్తాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు మారుతి. సితార మాతృ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ, నిర్మాత నాగవంశీ పాల్గొన్నారు. -
న్యూ లుక్
ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ మొదలు కావడానికి ఇంకో రెండు నెలలు ఉంది. కొత్త సంవత్సరంలో మొదటి నెల షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారట. ఈలోపు ఈ చిత్రంలో నటించబోయే నాయికలు, సహాయ నటీనటుల గురించి చర్చలు మొదలయ్యాయి. అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తీ సురేశ్‌లను తీసుకున్నారని ఓ టాక్. పూజా హెగ్డే పేరు కూడా పరిశీలనలో ఉందని మరో టాక్. తాజాగా, టబు పేరు సీన్లోకొచ్చింది. ఓ కీలక పాత్రకు ఆమెను తీసుకున్నారని సమాచారం. ‘అత్తారింటికి దారేది’తో టాలీవుడ్లో నదియా సెకండ్ ఇన్నింగ్స్ వైభవంగా మొదలయ్యాయి. టబు పాత్రను కూడా త్రివిక్రమ్ ఆ రేంజ్లో డిజైన్ చేశారట. ఇప్పటికే అఖిల్ ‘హలో’ లో, నాగార్జున–రామ్‌గోపాల్ వర్మ సినిమాలోనూ టబు కమిట్ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఫైనల్లీ ఈ పొడుగుకాళ్ల సుందరి ఎన్ని సినిమాల్లో కనిపిస్తారో చూడాలి. ఆ సంగతలా ఉంచితే, త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపిస్తారట. ఈ మధ్య దాదాపు అన్ని సినిమాల్లోనూ గడ్డంతో కనిపించిన చిన్న ఎన్టీఆర్ ఈ సినిమాలో క్లీన్ షేవ్‌లో చాక్లెట్ బాయ్‌లా కనిపిస్తారని టాక్. -
కిడ్నాపర్‌గా రాజ్‌తరుణ్
-
కిడ్నాపర్‌గా రాజ్‌తరుణ్
టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. సోలో సినిమాలతో పాటు మల్టీ స్టారర్లతోనూ ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్, ఓ డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో మరోసారి తన మార్క్ కామెడీ అందించేందుకు రెడీ అవుతున్నాడు. వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ కిడ్నాపర్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే మనుషులు కిడ్నాపర్‌గా కాదు. కుక్కల కిడ్నాపర్‌గా కనిపించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్లో తను మనుషులను కాకుండా కుక్కలనే ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడో క్లియర్‌గా వివరించాడు హీరో. రాజ్ తరుణ్ సరసన అను ఇమ్మన్యూల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్భాజ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.