కిడ్నాపర్గా రాజ్తరుణ్
టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. సోలో సినిమాలతో పాటు మల్టీ స్టారర్లతోనూ ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్, ఓ డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో మరోసారి తన మార్క్ కామెడీ అందించేందుకు రెడీ అవుతున్నాడు.
వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ కిడ్నాపర్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే మనుషులు కిడ్నాపర్గా కాదు. కుక్కల కిడ్నాపర్గా కనిపించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్లో తను మనుషులను కాకుండా కుక్కలనే ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడో క్లియర్గా వివరించాడు హీరో. రాజ్ తరుణ్ సరసన అను ఇమ్మన్యూల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్భాజ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.