
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 'రావణాసుర'. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ మూవీ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరిస్తున‍్నారు. ఇప్పటికే విడుదలైన రవితేజ, అక్కినేని సుశాంత్ ఫస్ట్ లుక్స్‌కి ఆడియన్స్‌లో మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో రవితేజ లాయర్‌గా కనిపించనున్నారు. ఈ మూవీలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
దీపావళి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలో సందడి చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మాస్ లుక్‌లో ఉన్న రవితేజ పోస్టర్‌ను షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో రవితేజ పోస్టర్ చూసిన అభిమానులు క‍్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో మరో మాస్ ఎంటర్‌టైనర్ బ్లాస్ట్ అవ్వబోతోందని అని కామెంట్స్ చేయగా.. మరికొందరు ఇది కూడా ఫ్లాప్ లిస్ట్‌లో చేరినట్లేనా అంటూ నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా దీపావళి కానుకగా రవితేజ ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ‘‘ఈ షెడ్యూల్‌లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. హీరో రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమ వుతున్నారు. తాజాగా నటి స్తున్న ధమాకా చిత్రం తో త్వరలోనే ప్రేక్ష కుల ముందుకు రాబోతు న్నది.
దీపావళి శుభాకాంక్షలు 😊
— Ravi Teja (@RaviTeja_offl) October 24, 2022
Welcoming you all to the exciting world of #RAVANASURA from April 7th 2023 ❤️@iamSushanthA @sudheerkvarma @AbhishekPicture @SrikanthVissa @RTTeamWorks pic.twitter.com/AKAzLuQZuR