sudheer Varma
-
నిఖిల్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' ట్రైలర్ రిలీజ్
'కార్తికేయ 2' మూవీతో నిఖిల్.. పాన్ ఇండియా క్రేజ్ సంపాదించాడు. అలాంటిది ఈ హీరో నుంచి సినిమా వస్తుందంటే ఎంత హడావుడి ఉండాలి. కానీ అలాంటిదేం లేకుండా ఉన్నట్లుండి ఓ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' పేరుతో తీసిన ఈ చిత్రం నవంబర్ 8న థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)ట్రైలర్ చూస్తుంటే యూకేలోనే మూవీ అంతా తీసినట్లు కనిపిస్తుంది. డివైజ్ కోసం ఓ గ్యాంగ్ అంతా వెతుకుంటారు. అసలు ఇందులో హీరో, అతడి ఫ్రెండ్ ఎలా ఇరుక్కున్నారు? చివరకు ఏమైందనేదే స్టోరీ అనిపిస్తుంది. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్, దివ్యాంశ హీరోయిన్లుగా నటించారు. నిఖిల్‌తోనే 'స్వామి రారా', 'కేశవ' సినిమాలు తీసిన సుధీర్ వర్మ ఈ మూవీకి దర్శకుడు. చాలా ఏళ్ల క్రితమే షూటింగ్ పూర్తవగా.. ఇప్పుడు మూవీని రిలీజ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న నటి సన్నీ లియోన్!) -
సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ‘హైడ్ అండ్ సీక్’
విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ హైడ్ అండ్ సీక్ ’. సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా బసి రెడ్డి రానా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ లోగోను దర్శకుడు సుధీర్ వర్మ విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు చిన్న రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. నరేంద్ర బుచ్చి రెడ్డిగారి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం నిర్మితమవుతుంది. -
మాస్ మహరాజ్ అరాచకం..
-
ఆ ట్విస్టులు ఏంటిరా బాబోయ్
-
‘రావణాసుర’లో రవితేజను చూసి షాకవుతారు: అభిషేక్ నామా
‘ధ్రిల్లర్ జోనర్స్ లో షాకింగ్, వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ముందే ఆడియన్స్‌కి తెలిస్తే.. ఆ కిక్కు రాదు. ‘రావణాసుర’ థ్రిల్లర్ మూవీ. అందుకే ఆ సినిమా కథ గురించి బయటకు చెప్పడం లేదు. థియేటర్స్‌లో రవితేజ నటనను చూసి షాకవుతారు’ అని నిర్మాత అభిషేక్ నామా అన్నారు. రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ నామా, రవితేజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా అభిషేక్ నామా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఇంతవరకూ రవితేజ ‘రావణాసుర’లాంటి సినిమా చేయలేదు. ఈ సినిమా చూసిన తర్వాత రవితేజ ఇలా కూడా చేయగలుగుతారా ? అని ప్రేక్షకులు షాక్ అవుతారు. కొత్త కాన్సెప్ట్ . ఇది వర్కౌట్ అయితే హీరోలు ఇలాంటి మరిన్ని కథలు ప్రయత్నిస్తారు. ►రావణాసుర కథ నచ్చి, దానిపై నమ్మకంతోనే డబ్బుపెట్టాం. నమ్మకం ఉన్నపుడు వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు ? మేము నమ్మిన సినిమా మేమే విడుదల చేస్తున్నాం. ►అనుకున్న బడ్జెట్ లోనే ఈ సినిమా పూర్తి చేశాం. సుధీర్ వర్మ టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్. అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్ కి పూర్తి చేశారు. ►ఈ చిత్రంలో రవితేజను చూసి ప్రేక్షకులు థ్రిల్ అయిపోయి షాక్ లో ఉంటారు. రవితేజ గారిని ఇంత కొత్త కోణంలో చూసే సరికి అదిరిపోయింది కదా అనే ఫ్యాక్టర్ వస్తుంది. ఇంటర్వెల్ అదిరిపోతుంది. ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడ విడుదలైన తర్వాత ఇదే సబ్జెక్ట్ తో పాన్ ఇండియా ప్లాన్ చేయాలనే ఆలోచన ఉంది. ►సుధీర్ వర్మతో ‘కేశవ’ సినిమా చేశాను. అది కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యింది. అయితే బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది. రావణాసురతో బ్లాక్ బస్టర్ వంద శాతం కొడతాం. ►మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ కుటుంబం అంతా సంగీతకారులు. తనకి చాలా ప్రతిభ ఉంది. మొదట ‘సాక్ష్యం’ సినిమా ఇచ్చాను. తర్వాత రవితేజ గారికి చెప్పాను. రావణాసురతో తన ప్రతిభని మరోసారి నిరూపించుకున్నాడు. ►ప్రస్తుతం నేను నిర్మిస్తున్న డెవిల్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. రెండు మూడు నెలల్లో ఏదైనా మంచి డేట్ చూసి విడుదల చేస్తాం. డెవిల్ 2 కూడా ఉంది. 2024లో దాదాపుగా ఏడు సినిమాలు లాంచ్ చేస్తాం. -
‘రావణాసుర’ లాంటి కథ తెలుగులో రాలేదు : సుధీర్ వర్మ
‘‘రవితేజగారితో ఫలానా జానర్ సినిమా చేయాలని ముందుగా అనుకోలేదు. రైటర్ శ్రీకాంత్ చెప్పిన కథ రవితేజగారికి నచ్చ డంతో దర్శకునిగా నేనైతే బావుంటుందని నా వద్దకు పంపించారు. థ్రిల్లర్ జానర్లో ‘రావణాసుర’ వంద శాతం కొత్త మూవీ. ఇలాంటి కథ ఇప్పటివరకూ తెలుగులో రాలేదు’’ అని డైరెక్టర్ సుధీర్ వర్మ అన్నారు. రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ నామా, రవితేజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సుధీర్ వర్మ మాట్లాడుతూ– ‘‘రావణాసుర’లో థ్రిల్స్, షాకింగ్, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. అందులో ఏది ముందు చెప్పినా సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు ఆ థ్రిల్ ఉండదు.. వారికి ఆ అనుభూతిని ఇవ్వడానికే కథ గురించి చెప్పడం లేదు. అయితే సినిమా చూసిన తర్వాత మన భావోద్వేగాలు మిస్సయిన ఫీలింగ్ ఆడియన్స్‌కి రాదని నా నమ్మకం. ‘రావణాసుర’ పూర్తిగా రవితేజగారి సినిమా. నటన పరంగా ఆయన సినిమాల్లో టాప్ త్రీలో ఈ మూవీ ఉంటుంది. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతోనే రవితేజగారు ఓ నిర్మాతగా వ్యవహరించారు. అభిషేక్గారితో నేను చేసిన రెండో సినిమా ‘రావణాసుర’. నాపై నమ్మకంతో ఆయన సెట్స్‌కే రారు. ‘సుధీర్ ఏం అడిగితే అది ఇచ్చేయండి’ అని యూనిట్‌కి చెబుతారు. ‘అంతం’ మూవీలో నాగార్జునగారి, ‘సత్య’లో జేడీ చక్రవర్తిగారి పాత్రల్లో గ్రే షేడ్స్ ఉంటాయి. అయితే హీరోలని గ్రే షేడ్స్‌లో చూపించడం ఈ మధ్య ఎక్కువ అయింది. మణిరత్నంగారి ‘రావణ్’ సినిమాకి, మా ‘రావణాసుర’కి ఎలాంటి సంబంధం లేదు. ‘రావణాసుర’ని హిందీ, తమిళ్లో విడుదల చేయాలనుకున్నాం కానీ కుదరలేదు. తెలుగులో విడుదలైన రెండో వారం నుంచి హిందీలో ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం నిఖిల్ హీరోగా నా దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారి కథతో పవన్ కల్యాణ్‌గారితో నేను ఓ సినిమా చేసే అవకాశం ఉంది’’ అన్నారు. -
రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రావణాసుర ట్రైలర్ ఆరోజే
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'రావణాసుర'. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ , ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ ట్రైలర్ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఈనెల 28న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. పోస్టర్ చూస్తే రవితేజ సీరియస్ లుక్‌లో కనిపించారు. ఈ చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో రవితేజ నెగిటివ్ షేడ్స్‌లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. The fireworks will begin in advance for you all 🤗#RavanasuraTrailer on 28th March at 4:05 PM 😎#Ravanasura#RavanasuraOnApril7 pic.twitter.com/lE0DFISvUD — Ravi Teja (@RaviTeja_offl) March 25, 2023 -
రవితేజ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. మరో క్రేజీ అప్డేట్
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ను రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకి విడదుల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి ఆ అప్డేట్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. కాగా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో అదరగొడుతున్న రవితేజ వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత వస్తున్న చిత్రమిది. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. #Ravanasura Update Tomorrow 10.08 a.m stay tuned ❤️❤️❤️ — ABHISHEK PICTURES (@AbhishekPicture) February 12, 2023 -
నటుడు సుధీర్ ఆత్మహత్యకు గల కారణాలు ఇవేనా?
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ వర్మ ఆత్మహత్యతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ‘సెకండ్ హ్యండ్’, ‘కుందనపు బొమ్మ వంటి’, ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ వంటి పలు సినిమాలతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ సూసైడ్‌కు కారణాలు ఏంటన్నది పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈనెల18న సుధీర్ వర్మ పాయిజన్ తీసుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడ్ని గుర్తించిన స్నేహితుడు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం సుధీర్‌ను విశాఖలోని ఎల్. జీ. ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స తీసుకుంటూనే పరిస్థితి విషమించి సుధీర్ మరణించాడు. పోస్టుమార్టం రిపోర్డులోనూ విషం తీసుకోవడం వల్ల మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. హీరోగా ఎంతో భవిష్యత్తు ఉన్న సుధీర్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటన్నది విచారించగా.. అతడి స్నేహితుడు మాట్లాడుతూ.. సుధీర్ చాలా మంచి వ్యక్తి అని, అయితే చాలా సున్నిత మనస్కుడని తెలిపాడు. తండ్రి మరణం తర్వాత తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడని పేర్కొన్నారు. అంతేకాకుండా కొన్నాళ్లుగా సుధీర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆ కారణంగానే సుధీర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు స్నేహితులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇంత చిన్న వయసులో సుధీర్ బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలచి వేస్తోంది. -
తీవ్ర విషాదం.. టాలీవుడ్ యువ నటుడు ఆత్మహత్య
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వైజాగ్‌లోని నివాసంలో ఆయన సూసైడ్ చేసుకున్నారు. దర్శకుడు రాఘవేందర్ రావు సమర్పణలో వచ్చిన కుందనపు బొమ్మ చిత్రంలో హీరోగా సుధీర్ వర్మ నటించారు. సెకండ్ హ్యాండ్, షూట్ఔట్ ఎట్ ఆలేరు చిత్రాల్లోనూ కనిపించారు. పలు వెబ్ సిరీస్‌ల్లోనూ సుధీర్ నటించారు. నటుడి మృతిపట్ల పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. సుధీర్ మృతి చెందిన విషయాన్ని ‘కుందనపు బొమ్మ’ సినిమాలో నటించిన సుధాకర్ కోమాకుల సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. సుధీర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సుధీర్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని సుధాకర్ పేర్కొన్నారు. Sudheer! @sudheervarmak Such a lovely and warm guy’ It was great knowing you and working with you brother! Can’t digest the fact that you are no more! Om Shanti!🙏🙏🙏 @iChandiniC @vara_mullapudi @anil_anilbhanu pic.twitter.com/Sw7KdTRkpG — Sudhakar Komakula (@UrsSudhakarK) January 23, 2023 -
దర్శకుడు సుధీర్ వర్మ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
రవితేజ రావణాసుర.. దీపావళి కానుకగా క్రేజీ అప్డేట్
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 'రావణాసుర'. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ మూవీ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రవితేజ, అక్కినేని సుశాంత్ ఫస్ట్ లుక్స్‌కి ఆడియన్స్‌లో మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో రవితేజ లాయర్‌గా కనిపించనున్నారు. ఈ మూవీలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలో సందడి చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మాస్ లుక్‌లో ఉన్న రవితేజ పోస్టర్‌ను షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో రవితేజ పోస్టర్ చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో మరో మాస్ ఎంటర్టైనర్ బ్లాస్ట్ అవ్వబోతోందని అని కామెంట్స్ చేయగా.. మరికొందరు ఇది కూడా ఫ్లాప్ లిస్ట్‌లో చేరినట్లేనా అంటూ నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా దీపావళి కానుకగా రవితేజ ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ‘‘ఈ షెడ్యూల్లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. హీరో రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమ వుతున్నారు. తాజాగా నటి స్తున్న ధమాకా చిత్రం తో త్వరలోనే ప్రేక్ష కుల ముందుకు రాబోతు న్నది. దీపావళి శుభాకాంక్షలు 😊 Welcoming you all to the exciting world of #RAVANASURA from April 7th 2023 ❤️@iamSushanthA @sudheerkvarma @AbhishekPicture @SrikanthVissa @RTTeamWorks pic.twitter.com/AKAzLuQZuR — Ravi Teja (@RaviTeja_offl) October 24, 2022 -
డైరెక్ట్ ఓటీటీకి రాబోతోన్న ఈ యంగ్ హీరో మూవీ?, ఎక్కడంటే!
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం 18 పేజెస్, కార్తీకేయ 2తో బిజీగా ఉన్నాడు. అలాగే వీటితో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ తెరకెక్కుతున్న ఈ హాట్రిక్ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. గతేడాది 2021లో ఈమూవీపై నిఖిల్ ప్రకటన ఇచ్చాడు. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. చదవండి: రామ్ గోపాల్ వర్మపై నిర్మాత చీటింగ్ కేసు, వివరణ ఇచ్చిన ఆర్జీవీ ఇప్పటికే మేకర్స్ పలు ఓటీటీ సంస్థలతో చర్చలు జరిపారని, చివరకు జీ5 మంచి డీల్‌ను ఒప్పందం కుదుర్చుకున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ విషయం తెలిసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు అన్ని ఓటీటీ బాట పట్టాయి. ఇక కరోనా అనంతరం థియేటర్ల తెరుచుకోవడంతో చిన్న సినిమాలు సైతం వెండితెరపైకి వస్తున్న నేపథ్యంలో నిఖిల్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయడంపై అతడి ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈవార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. -
రావణాసుర నుంచి కొత్త అప్డేట్.. రంగంలోకి
Ravi Teja Step Into Ravanasura Movie Sets: మాస్ మహారాజా రవితేజ కేరీర్ పరంగా ఫుల్ జోష్ మీదున్నాడు. 'క్రాక్'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రవితేజ ఏకంగా 5 సినిమాలు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అందులో రెండు చిత్రాల షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఇక రమేశ్ వర్మ దర్శకత్వంలో వస్తున్న 'ఖిలాడి' సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రవితేజ 70వ చిత్రంగా వస్తోంది 'రావణాసుర'. ఈ మూవీకి సుధీర్ వర్మ డైరెక్టర్. తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమా కోసం రంగంలోకి దిగాడు రవితేజ. 'రావణాసుర' రెండో షెడ్యూల్ బుధవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా రవితేజతోపాటు మిగిలిన ప్రధాన పాత్రలపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మాస్ మహారాజా సెట్లోకి అడుగు పెట్టిన వీడియో, ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది చిత్రబృందం. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ న్యాయవాదిగా అలరించనున్నాడు. అలాగే ముఖ్య పాత్రలో యంగ్ హీరో సుశాంత్ ఆకట్టుకోనున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 🥰🥰🥰🥰 #Ravanasura https://t.co/FAYHT5I5Wm — sudheer varma (@sudheerkvarma) February 2, 2022 #Ravana joins #Ravanasura🔥🔥🔥 https://t.co/QhM8cdxmF0 — sudheer varma (@sudheerkvarma) February 2, 2022 -
విక్రమ్ ఓకే.. వేదా ఎవరు?
రెండేళ్ల క్రితం తమిళంలో విడుదలైన ‘విక్రమ్ వేదా’ చిత్రానికి అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పుష్కర్ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్ ఎస్. శశికాంత్ నిర్మించారు. పోలీసాఫీసర్ విక్రమ్ పాత్రలో మాధవన్, గ్యాంగ్‌స్టర్ వేదా పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తారు. తమిళంలో ‘విక్రమ్‌వేదా’ చేసిన ఎస్. శశికాంతే తెలుగు రీమేక్‌ను నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఇందులో విక్రమ్ పాత్రను రవితేజ చేయనున్నారని సమాచారం. వేద పాత్ర కోసం కొంతమంది నటులను పరిశీలిస్తున్నారు. మరోవైపు స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ‘డిస్కో రాజా’ సినిమాతో బిజీగా ఉన్నారు రవితేజ. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి విక్రమ్ పాత్రలోకి వచ్చేస్తారని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘విక్రమ్‌వేదా’ చిత్రం హిందీలో కూడా రీమేక్ కానుంది. ఈ చిత్రానికి ఒరిజినల్ డైరెక్టర్స్ పుష్కర్ గాయత్రి ద్వయమే దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. -
నాకు నేను నచ్చాను
‘‘రణరంగం’ విడుదలైన తొలిరోజు మార్నింగ్ షోకి డివైడ్ టాక్ వినిపిస్తోందన్నారు. మ్యాట్నీ షోకి యావరేజ్ అన్నారు. సెకండ్ షో పడేసరికి ఎబౌ యావరేజ్ అనే టాక్ వచ్చింది. మున్ముందు మరింత పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు ఇంకా∙చేరువ అవుతుందని నమ్ముతున్నాను’’ అని శర్వానంద్ అన్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత గురువారం విడుదలైంది. చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్న చిత్రబృందం హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులకు ఒక స్క్రీన్‌ప్లే బేస్డ్ అండ్ ప్రాపర్ యాక్షన్ సినిమా ఇవ్వాలని ‘రణరంగం’ సినిమా చేశాను. ఈ విషయంలో 200 శాతం సక్సెస్ అయ్యాం. ఇటీవల తెలుగులో వచ్చిన మంచి క్వాలిటీ æఫిల్మ్‌గా ‘రణరంగం’ పేరును చెబుతుంటే హ్యాపీగా ఉంది. నా కెరీర్లో ఇలాంటి మాస్ పాత్ర చేయలేదు. నాకు నేను నచ్చాను. స్క్రీన్‌ప్లే బేస్డ్ పరంగా కొత్తగా ఉండే సినిమా ఇది. క్లైమాక్స్ అలా ఉండకపోతే రెగ్యులర్ సినిమాలా ఉండేది. సినిమాలో కల్యాణీకి, నాకు మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. మా ఇద్దరి లవ్‌ట్రాక్ నా కెరీర్లోనే బెస్ట్. చిన్న పాత్ర అయినా చేసినందుకు కాజల్‌కి థ్యాంక్స్. కలెక్షన్స్ గురించి మాట్లాడను. ప్రేక్షకులు నాపై ఉంచిన నమ్మకానికి థ్యాంక్స్. రణరంగం నిర్మాతలకు థ్యాంక్స్’’ అని అన్నారు. ‘‘విడుదలకు ముందే ఇది శర్వానంద్ సినిమా అని చెప్పా. మంచి ఓపెనింగ్స్ రావడానికి శర్వానే కారణం. ఖర్చు విషయంలో నిర్మాతలు వెనకాడలేదు. ఓపెనింగ్ ట్రెండ్ ఇలానే కొనసాగితే నా కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌గా ఈ చిత్రం నిలుస్తుంది’’ అన్నారు సుధీర్ వర్మ. ‘‘రాంగ్ ఫిగర్లు (వసూళ్లు) చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఈ సినిమాకు తెలుగురాష్ట్రాల్లో తొలి రోజు ఏడున్నర కోట్ల గ్రాస్ వచ్చింది. దాదాపు నాలుగున్నర కోట్ల షేర్ వచ్చింది. ఇలానే ప్రేక్షకాదరణ కొనసాగితే భవిష్యత్ కలెక్షన్స్ బాగుంటాయనుకుంటున్నాం. ఫ్యామిలీ సీన్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నారు’’ అని పీడీవీ ప్రసాద్ అన్నారు. ‘‘విజువల్స్ క్వాలిటీగా ఉన్నాయని మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు దివాకర్ మణి. ‘‘జెన్యూన్ ఎఫర్ట్ పెట్టి సినిమా చేశాం. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు రాజా. -
‘నా సినిమాల్లో రణరంగం బెస్ట్ లవ్ స్టోరీ’
స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా రిలీజ్ అయిన శర్వానంద్ సినిమా రణరంగం. శర్వా గ్యాంగ్‌స్టర్‌గా నటించిన ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్‌లు హీరోయిన్లుగా నటించారు. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చిత్ర సమర్పకుడు పి.డి.వి. ప్రసాద్ మాట్లాడుతూ... ‘కలెక్షన్లు చాలా బాగున్నాయి. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 7.50 కోట్ల గ్రాస్, రూ. 4.45 కోట్ల షేర్ వచ్చింది. 1985లో గిరిబాబుగారి డైరెక్షన్లో వచ్చిన రణరంగంను కూడా మేమే నిర్మించాం. అది మంచి సక్సెసయింది. ఆ సినిమా ఆడిన అనేక థియేటర్లలో ఇప్పుడు ఈ రణరంగం విడుదలవడం చక్కని అనుభవం. సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా శర్వానంద్ చాలా బాగా చేశాడని అంతా ప్రశంసిస్తున్నారు. అలాగే హ్యూమన్ రిలేషన్స్‌ను బాగా చూపించారనే పేరొచ్చింది’ అన్నారు. డైరెక్టర్ సుధీర్ వర్మ మాట్లాడుతూ ‘ఇది శర్వానంద్ సినిమా అని విడుదలకు ముందే చెప్పాను. ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి కారణం శర్వానే. ఇప్పటి దాకా నేను డైరెక్ట్ చేసిన సినిమాల్లో దేనికీ రానన్ని ఫోన్లు ఈ సినిమా విడుదలయ్యాక వస్తున్నాయి. నిన్న సెకండ్ షో టికెట్లు దొరకలేదని ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు. ప్రశాంతి పిళ్లై మ్యూజిక్, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ సూపర్బ్. నిర్మాతలు చాలా రిచ్‌గా సినిమాని నిర్మించారు. ఓపెనింగ్స్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే నా కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ఫిల్మ్ అవుతుంది’ అని తెలిపారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. ‘నిర్మాతలు నాపై పెట్టిన నమ్మకానికి రుణపడి ఉంటా. రణరంగంకు మంచి ఓపెనింగ్స్ వచ్చినందుకు హ్యాపీగా ఉంది. ప్రేక్షకులకు ఒక స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా ఇవ్వాలనుకొని, ఒక యాక్షన్ ఫిల్మ్ తియ్యాలనుకొని రణరంగం చేశాం. ఆ విషయంలో 200 శాతం సక్సెస్ అయ్యాం. ఇటీవల తెలుగులో వచ్చిన బెస్ట్ క్వాలిటీ ఫిల్మ్ అని ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ సూపర్బ్ అనే పేరొచ్చింది. ఫైట్ సీన్స్‌ని వెంకట్ మాస్టర్ చాలా సహజంగా కంపోజ్ చేశారు. నా ఫ్రెండ్స్‌గా నటించిన రాజా, ఆదర్శ్, సుదర్శన్లకు మంచి పేరొచ్చింది. తనది చిన్న రోల్ అయినా.. చేసినందుకు కాజల్‌కు థాంక్స్ చెప్పుకోవాలి. సినిమా రిలీజైనప్పుడు మార్నింగ్ షోకి డివైడ్ టాక్ వచ్చింది. మ్యాట్నీకి ఫర్వాలేదన్నారు. సెకండ్ షోకు వచ్చేసరికి ఎబోవ్ యావరేజ్ అనే టాక్ వచ్చింది. మున్ముందు మరింత పాజిటివ్ టాక్ వచ్చి బాగా ఆడుతుందని నమ్ముతున్నా. ఇప్పటివరకూ ఈ సినిమాలో చేసినటువంటి మాస్ క్యారెక్టర్ చేయలేదు. ఇందులో నాకు నేనే నచ్చాను. రెండు దశలున్న క్యారెక్టర్‌ను చేసేప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. స్క్రీన్‌ప్లే పరంగా కొత్తగా ఉండే సినిమా ఇది’ అన్నారు. -
‘రణరంగం’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
నాకు తెలిసిందే తీస్తా!
‘‘నేను ఏ కథ రాసినా క్రైమ్ వైపు మర్డర్ వైపు వెళ్లిపోతుంది. నాకు అలాంటి సినిమాల మీదే ఎక్కువ ఆసక్తి ఉండటం కూడా కారణం అనుకుంటా. నేను చేస్తున్న సినిమాలతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు రాని జానర్లు ట్రై చేసి హీరోల కెరీర్లు, నిర్మాతల డబ్బులు రిస్క్‌లో పెట్టదలుచుకోలేదు’’ అన్నారు సుధీర్ వర్మ. శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా రేపు విడుదల కానున్న సందర్భంగా సుధీర్ వర్మ చెప్పిన విశేషాలు. ఈ కథను రవితేజగారితో తీయాలని సిద్ధం చేసుకున్నాను. ఆయన వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యలో శర్వానంద్, నేను ఓ సినిమా చేయాలనుకున్నాం. కొన్ని కథలు అనుకున్నాం. మాటల్లో రవితేజగారి కోసం అనుకున్న కథ గురించి చెప్పాను. నచ్చి, చేస్తాను అన్నాడు శర్వా. రవితేజగారిని అడిగితే చేసుకోమన్నారు. శర్వా సినిమాల్లో నాకు ‘ప్రస్థానం’ బాగా ఇష్టం. అందులో తన పాత్ర చాలా డెప్త్‌గా ఉంటుంది. తనతో చేస్తే ఇంటెన్స్ సబ్జెక్టే చేయాలనుకున్నాను. ఈ సినిమాతో అది కుదిరింది. ఇందులో హీరో పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుంది. 40 ఏళ్ల వయసు పాత్రలో శర్వా సూట్ అవుతాడా? అని చిన్న సందేహం ఉంది. లుక్ టెస్ట్ జరిగాక పూర్తి నమ్మకం వచ్చేసింది. ఈ సినిమాకు ముందు ‘దళపతి’ టైటిల్ పెట్టాలనుకున్నాం. కానీ అది వేరేవాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. మా నిర్మాత నాగవంశీగారు ‘రణరంగం’ టైటిల్ సూచించారు. నా కెరీర్లో చాలెంజింగ్ సినిమా ఇది. ఈ సినిమా కథ 1990 నుంచి 2015 వరకూ జరుగుతుంది. 1990 కాలంలో జరిగిన సీన్లు చిత్రీకరించినప్పుడు కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అందుకే ఓ కాలనీ సెట్‌ను హైదరాబాద్‌లో వేశాం. ‘స్వామిరారా’ తర్వాత చినబాబుగారు అడ్వాన్స్ ఇచ్చారు. ఇప్పటికి వాళ్ల బ్యానర్లో చేయడానికి కుదిరింది. ఈ సినిమాకు బడ్జెట్ ఎంతైందో నాకు తెలియదు. నాగవంశీ అంత ఫ్రీడమ్ ఇచ్చారు. నెక్ట్స్ సినిమా మాకే చేయాలి.. ఏ హీరో కావాలని అడుగుతుంటారు. సినిమా ప్రోమోల్లో కాజల్‌ను ఎక్కువ చూపించకపోవడానికి కారణం తనది చిన్న పాత్ర కావడమే. ప్రేక్షకుడు సినిమాకి వచ్చి నిరాశ చెందకూడదు. కమర్షియల్ స్టైల్లో చేసిన ‘దోచేయ్’ అనుకున్నంత ఆడలేదు. ఈ సినిమాను నాకు నచ్చిన విధంగా తీశాను. ఏమనుకున్నానో అదే తీశాను. ఏ సినిమా అయినా నాకు కంఫర్ట్‌బుల్‌గా ఉండేలా, నాకు తెలిసిందే తీస్తాను. ఈ సినిమాకు సీక్వెల్ తీయొచ్చు అనే ఐడియాను శర్వానంద్ ఈ మధ్య చెప్పాడు. ఐడియా బావుంది. చూడాలి. నెక్ట్స్ రవితేజగారితో సినిమా ఉంటుంది. ఈ సినిమా రెండేళ్ల నుంచి మేకింగ్‌లో ఉంది. సుమారు 700 రోజుల్లో మేం షూట్ చేసింది 70 రోజులు మాత్రమే. శర్వా ‘పడిపడి లేచె మనసు’ పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ సినిమాలో లుక్ ఇందులో లుక్ డిఫరెంట్. అందుకే ఆలస్యం అయింది. ఈ సినిమా ఐడియాను ‘గాడ్ ఫాదర్ 2’ నుంచి తీసుకున్నాను. మనం ఎక్కడ నుంచి స్ఫూర్తి పొందామో ముందే చెప్పేస్తే ఇది అందులో ఉంది.. ఇందులో ఉంది అని చెప్పకుండా చూస్తారని నమ్ముతాను. -
ఎవరి సలహాలూ వినొద్దన్నారు
‘‘1980–90ల కాలంలో వచ్చిన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆ రోజుల్లో పుట్టి ఉంటే ఎంత బాగుండేది? అని ఎప్పుడూ అనుకునేదాన్ని. ఇప్పుడు ‘రణరంగం’లో అలాంటి పాత్ర చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది’’ అని కల్యాణీ ప్రియదర్శన్ అన్నారు. శర్వానంద్, కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్యపాత్రల్లో సుధీర్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘రణరంగం’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈనెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కల్యాణి చెప్పిన విశేషాలు... ► ‘రణరంగం’ కథను సుధీర్ వర్మ బాగా చెప్పారు. ఇందులో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా నిలుస్తుంది. ఫ్లాష్‌బ్యాక్, ప్రస్తుతం... రెండూ సమానంగా నడుస్తుంటాయి. ంలో కచ్చితంగా భాగమవ్వాలనుకున్నా ► శర్వానంద్ పాత్ర జీవితంలో ఓ ఇరవై ఏళ్ల కాలాన్ని ఈ సినిమాలో చూపించనున్నాం. సాధారణ వ్యక్తి డాన్‌గా ఎలా ఎదిగారు? అన్నది కథాంశం. సినిమా మొత్తం తను చాలా సీరియస్‌గా, ఇంటెన్స్‌గా ఉంటారు. తనలో లవ్ యాంగిల్ ఉన్నా, ఎప్పుడైనా నవ్వినా అది నా పాత్ర (గీత) వల్లే. కథ 1990ల కాలంలో నడుస్తుంది. ఆ లుక్‌లో కనిపించడానికి మా అమ్మ (నటి లిజీ) సినిమాలో లుక్‌ను ప్రేరణగా తీసుకున్నాను. అమ్మ, శోభనగారి సినిమాలు చూశాను. ► నాకు గన్ పట్టుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. ‘రణరంగం’ లో నేను గన్ పేల్చే సీన్ కూడా ఉంది. ► నేను తెలుగు సినిమాలు చేస్తున్నానని అమ్మ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ లంగా వోణి వేసుకున్నా. ఆ డ్రెస్ నాకు బావుంటుందని నాన్నగారు (మలయాళ దర్శకుడు ప్రియదర్శన్) చాలా సార్లు అనేవారు. ► ఐదు సినిమాల అనుభవం వచ్చే వరకు నాన్నగారి దర్శకత్వంలో నటించకూడదనుకున్నాను. కానీ మోహన్‌లాల్‌తో నాన్న చేస్తున్న ‘అరేంబికడలంటే సింహం’లో అతిథి పాత్ర చేశాను. తొలుత నటన సరిగ్గా లేదన్నారు.. ఎడిటింగ్‌లో చూసి బావుందన్నారు. నాన్న దర్శకత్వంలో మళ్లీ చేయకూడదనుకుంటున్నాను (నవ్వుతూ). ► సినిమాలు చేయాలనుకున్నప్పుడు అది చేయి.. ఇది చేయి అని అమ్మన్నాన్నలు సలహాలు ఇవ్వలేదు. ‘ఎవరు పడితే వాళ్లు సలహాలు ఇస్తుంటారు. దాన్ని మాత్రం తీసుకోకు’ అని చెప్పారు. ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్ సినిమాలో నటిస్తున్నాను. సినిమా దర్శకత్వం చేయాలనే ఆలోచనలున్నాయి. కొన్ని ఐడియాలు ఉన్నాయి. ► స్క్రిప్ట్ బాగుంటే పాత్ర నిడివి ఎంత? ఫిమేల్ ఓరియంటెడ్ సినిమానా? కమర్షియల్ సినిమానా? అనే పట్టింపు లేదు. రెండు నిమిషాల పాత్ర అయినా చేయడానికి సిద్ధమే. ‘మహానటి’కి కీర్తీ సురేశ్‌కు, కాçస్ట్యూమ్ డిజైనర్ ఇంద్రాక్షి పట్నాయక్‌కి నేషనల్ అవార్డ్ రావడం సంతోషంగా అనిపించింది.. వాళ్లిద్దరూ నాకు మంచి ఫ్రెండ్స్. ► నాకు, మా దర్శకుడు సుధీర్ వర్మకు హాలీవుడ్ దర్శకుడు క్వంటిన్ టరాంటినో అంటే బాగా ఇష్టం. ఆయన తీసిన ‘కిల్ బిల్’ నా ఫేవరెట్ సినిమా. సుధీర్, నేను సెట్లో కలసిపోవడానికి ఈ కామన్ ఇంట్రెస్ట్ ఉపయోగపడింది. ఈ నెల 15న క్వంటిన్ కొత్త సినిమా ‘వన్స్ అఫాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’, మా ‘రణరంగం’ ఒకేసారి రిలీజ్ అవుతుండటం విశేషం. ఆరోజు మేం రెండు సినిమాలు చూడాలి (నవ్వుతూ). -
అందుకే చిన్న పాత్ర అయినా చేశా!
‘‘ఏ సినిమాకైనా చాలా కష్టపడి పనిచేస్తా. నా పాత్రకి 100శాతం న్యాయం చేస్తా. కానీ, ఫలితం అనేది మన చేతుల్లో ఉండదు. అది ప్రేక్షకులు నిర్ణయించాలి. ఇటీవల వచ్చిన ‘సీత’ సినిమా సరిగ్గా ఆడలేదంటే ఎన్నో కారణాలుండొచ్చు. అయితే ఆ సినిమా చేసినందుకు చాలా గర్వపడుతున్నా.. ఎటువంటి అసంతృప్తి లేదు’’ అన్నారు కాజల్ అగర్వాల్. శర్వానంద్ హీరోగా, కాజల్ అగర్వాల్, కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ చెప్పిన విశేషాలు. ► ‘రణరంగం’ సినిమాలో డాక్టర్‌గా చేశా. ఈ చిత్రంలో నాది పెద్ద పాత్ర కాదు కానీ, చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కథ గ్రిప్పింగ్‌గా, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. కథని ముందుకు తీసుకెళ్లే పాత్ర నాది.. అందుకే చిన్నదైనా చేశా. ‘సీత’ సినిమాకి మెంటల్‌గా, ఫిజికల్‌గా బాగా కష్టపడ్డా. ‘రణరంగం’ చాలా ఉపశమనం ఇచ్చింది. శర్వానంద్ మంచి సహనటుడు. సుధీర్ వర్మ చక్కని ప్రతిభ ఉన్న దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ వంటి మంచి బ్యానర్లో ‘రణరంగం’ సినిమా చేసినందుకు హ్యాపీగా ఉంది. ► సాయంత్రం 6 గంటలకు షూటింగ్‌కి ప్యాకప్ చెప్పాక షూటింగ్స్, సినిమా విషయాల గురించి మాట్లాడను. పుస్తకాలు చదువుతాను.. యోగా, వ్యాయామాలు చేస్తా. ‘అ’ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నేను నటించనున్న సినిమాని నేను నిర్మించడం లేదు. నవంబర్‌లో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. ఈ చిత్రంలో నా పాత్ర చాలెంజింగ్‌గా ఉంటుంది. ► హిందీ ‘క్వీన్’ సినిమాని దక్షిణాదిలో రీమేక్ చేశారు. తెలుగు, కన్నడ, మలయాళంలో ఎటువంటి సెన్సార్ కట్స్ లేవు. కానీ, తమిళ్లో మాత్రం అభ్యంతరాలు చెప్పారు. దీనిపై యూనిట్ సెన్సార్ రివైజింగ్ కమిటీకి వెళ్లింది. ► నేను ఇండస్రీకి వచ్చి 12ఏళ్లయింది. ఇప్పటికి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో 50కి పైగా సినిమాలు చేశా. ఈ మైలురాయిని త్వరగా చేరుకున్నాననిపిస్తోంది. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బబ్లీగా ఉండే పాత్రలు చేశా. కానీ, ఇప్పుడు బాధ్యతగా భావిస్తున్నా. ఆ మధ్య మేకప్‌లేని ఫొటోలు పోస్ట్ చేశాను. అయితే గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మేకప్ అవసరమే. కానీ, వ్యక్తిగత జీవితంలో మేకప్ అవసరం లేదు.. మహిళలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని, తాము ఎలా ఉన్నా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ► చిరంజీవి సార్‌తో కొరటాల శివ దర్శకత్వం వహించనున్న చిత్రం కోసం నన్నెవరూ సంప్రదించలేదు. మళ్లీ చాన్స్ వస్తే హ్యాపీగా చేస్తా. తేజగారి దర్శకత్వంలో 3 సినిమాలు చేశా. మళ్లీ అవకాశమొచ్చినా నటిస్తా. ‘భారతీయుడు 2’లో నాది పవర్ఫుల్ పాత్ర. -
‘రణరంగం’ వాయిదా పడనుందా?
శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా రణరంగం. శర్వ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజులుగా జరుగుతోంది. ఇప్పటికే రిలీజ్ విషయంలోనూ చాలా వాయిదాలు పడుతూ వచ్చింది. ఇటీవల ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ సినిమాను ఆగస్టు 2న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు 2న రిలీజ్ కావటం కూడా అనుమానమే అన్న ప్రచారం జరుగుతోంది. ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పెండింగ్ ఉండటంతో సినిమా వాయిదా పడటం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల శర్వానంద్ గాయపడటంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. దీంతో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాలేదు. శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. -
‘మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి’
శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రణరంగం. శర్వానంద్ డాన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. మాఫియా నేపథ్యంలో సాగే రణరంగం సినిమాలో శర్వానంద్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ పిళ్లై సంగీతమందిస్తున్నాడు. -
‘రణరంగం’.. సిద్ధం!
యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా రణరంగం. సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ లోగో పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఒక గ్యాంగ్‌స్టర్ జీవితంలో 1990 మరియు 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సుధీర్ వర్మ గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంటుందన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 2న రిలీజ్ కానుంది. -
పొలిటికల్ థ్రిల్
వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నవీన్ చంద్ర హీరోగా ఓ కొత్త చిత్రం షురూ అయింది. వేణు మదుకంటి దర్శకత్వంలో యశాస్ సినిమాస్ పతాకంపై వి. మంజునాథ్ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కృష్ణచైతన్య కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో దర్శకుడు సుధీర్ వర్మ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు అనీల్ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. వేణు మదుకంటి మాట్లాడుతూ– ‘‘వెంకటాపురం’ చిత్రానికి దర్శకునిగా నాకు మంచి పేరు వచ్చింది. దాని తర్వాత మంచి స్క్రిప్ట్ కోసం టైమ్ తీసుకున్నా. మంజునాథ్‌గారితో కలసి ఏడాదిగా ఈ కథపై పని చేశా. ఇప్పటివరకూ రాజకీయ నేపథ్యంలో రాని కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుంది. వైజాగ్ నేపథ్యంలో జరిగే ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో చివరి వరకూ ప్రేక్షకుల ఊహకందని మలుపులుంటాయి. ఇప్పటివరకూ చేయని రోల్లో నవీన్‌చంద్ర ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాడు. జూన్ మొదటి వారంలో రెగ్యులర్ షూట్ ప్రారంభం అవుతుంది. మంజునాథ్‌గారు ఓ మంచి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి రాబోతున్నారనే నమ్మకం మాకుంది’’ అన్నారు. ‘‘యశాస్ సినిమాస్ బ్యానర్లో కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్‌ని ప్లాన్ చేస్తున్నాం. వేణు ఐడియా నచ్చి కథపై వర్క్ చేశాం’’ అన్నారు మంజునాథ్. ‘‘నా కెరీర్లో బాల్‌రెడ్డి (‘అరవింద సమేత వీర రాఘవ’లో చేసిన పాత) పాత్ర పెద్ద మలుపు. ఆ తర్వాత చాలా మంచి పాత్రలు చేస్తున్నా. ఇందుకు త్రివిక్రమ్‌గారికి, ఎన్టీఆర్ గారికి కృతజ్ఞతలు’’ అన్నారు నవీన్ చంద్ర. కోట శ్రీనివాసరావు, నాజర్, రావు రమేష్, సుబ్బరాజు, బ్రహ్మాజీ, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాష్, మ్యూజిక్: అచ్చు. -
గ్యాంగ్‌స్టర్ లవ్
గన్స్‌తో డీల్ చేసే గ్యాంగ్‌స్టర్ అయినా ప్రేమగాలి సోకితే గులాబీ పట్టాల్సిందే. అమ్మాయిని ఫాలో అవ్వాల్సిందే. అలా ప్రేమలో పడ్డ ఓ గ్యాంగ్‌స్టర్ తన లవ్‌ని ఎలా డీల్ చేశాడనే అంశాన్ని వెండితెరపై చూసే టైమ్ దగ్గర్లోనే ఉంది. శర్వానంద్ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ కథానాయికలు. పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ స్పెయిన్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ మార్చి 1 వరకు సాగుతుందని సమాచారం. ఇందులో యంగ్‌స్టర్‌గా, మిడిల్ ఏజ్డ్ గ్యాంగ్‌స్టర్‌గా శర్వా డ్యూయల్ రోల్ చేస్తున్నారని టాక్. ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్ నెట్టింట్లో లీక్ అయ్యాయి. దీంతో శర్వా లుక్ బయటకు వచ్చింది. గ్యాంగ్‌స్టర్ రోల్ కోసం గుబురు గడ్డంతో శర్వా అల్ట్రా స్టైలిష్‌గా కనిపించబోతున్నారని లీకైన ఫొటోలు చెబుతున్నాయి. -
శర్వానంద్ న్యూ లుక్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరోల్లోని అతికొద్ది మంది నటుల్లో శర్వానంద్ ఒకరు. చేసే ప్రతీ సినిమాలో తన ప్రత్యేకతను చాటుకుంటాడు. రీసెంట్గా హను రాఘవపూడి డైరెక్షన్లో వచ్చిన ‘పడి పడి లేచే మనసు’ ఆంతగా ఆకట్టుకోలేకపోయినా.. మరో చిత్రంతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి కొన్ని పోస్టర్స్ లీక్ అయ్యాయి. పూర్తి గడ్డంతో ఉన్న శర్వానంద్ లుక్ అదిరిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో శర్వానంద్ రెండు డిఫరెంట్ గెటప్‌లో నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్, కళ్యాణీ ప్రియదర్శిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. శర్వానంద్ ఈ చిత్రం తరువాత తమిళ హిట్ మూవీ ‘96’ రీమేక్‌లో నటించనున్నాడు. -
వయసైన వ్యక్తిగా శర్వా..!
కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ సినిమాలు చేస్తున్న శర్వానంద్ త్వరలో మరో డిఫరెంట్ రోల్లో కనిపించనున్నాడు. ఇటీవల పడి పడి లేచే మనసు సినిమాతో నిరాశపరిచిన శర్వా, తదుపరి చిత్రం సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాలో శర్వా రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. వీటిలో ఒకటి యువకుడి పాత్ర కాగా మరో పాత్రలో వయసైన వ్యక్తిగా కనిపించనున్నాడట. ఈ లుక్ కోసం ప్రోస్తటిక్ మేకప్‌తో లుక్ టెస్ట్ కూడా చేసిన చిత్రయూనిట్ త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. శర్వానంద్ సరసన హలో ఫేం కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌లను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
శర్వా.. ఆ సినిమా ఏమైంది..?
యంగ్ జనరేషన్లో డిఫరెంట్ మూవీస్‌తో ఆకట్టుకుంటున్న హీరో శర్వానంద్. కెరీర్ స్టార్టింగ్ నుంచే డిఫరెంట్ సినిమాలు చేస్తూ వస్తున్న శర్వానంద్ కమర్షియల్ హీరోగానూ ప్రూవ్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు శర్వానంద్. అయితే గత ఏడాది నవంబర్ లో శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఓ సినిమా ప్రారంభమైంది. అయితే ఓపెనింగ్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినా తరువాత సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏవీ బయటకు రాలేదు. ఇటీవల కొరియాలో భారీ షెడ్యూల్ ప్లాన్‌చేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. తరువాత మరే న్యూస్ రాలేదు. అవుట్‌పుట్ అనుకున్న స్థాయిలో రాకపోవటంతో స్క్రీప్ట్ రీరైట్ చేయాల్సిందిగా దర్శకుడు సుధీర్ వర్మకు సూచించాడట శర్వానంద్. అందుకే సినిమా ఆలస్యం అయిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయం చిత్రయూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు. శర్వా హీరోగా తెరకెక్కుతున్న పడి పడి లేచే మనసు డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కొరియా వెళ్లనున్న గ్యాంగ్‌స్టర్
ఫోన్, బట్టలు, పాస్ పోర్ట్స్.. ఇలా సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అవసరమయ్యే అన్ని వస్తువులను జాగ్రత్తగా లిస్ట్ వేసి మరీ సర్దుకుంటున్నారు శర్వానంద్ అండ్ టీమ్. ‘స్వామి రారా, కేశవ’ చిత్రాల ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్, ‘హలో!’ ఫేమ్ కల్యాణి ప్రియదర్శిని కథానాయికలుగా నటిస్తున్నారు. గ్యాంగ్స్టర్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో శర్వానంద్ డబుల్ రోల్ చేస్తున్నారట.ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను కొరియాలో ప్లాన్ చేశారు చిత్రబృందం. సుమారు 25 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి అవుతుంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఈ సంగతి ఇలా ఉంచితే... హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘పడి పడి లేచె మనసు’ సినిమాలోనూ శర్వానంద్ నటిస్తున్నారు. సాయిపల్లవి కథానాయిక. ఈ రెండు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు శర్వానంద్. -
ప్రేమంటే ఏంటి?
‘‘పరిచయం’ టీజర్ చాలా బాగుంది. ఫొటోగ్రఫీ చక్కగా ఉంది. మంచి తెలుగు టైటిల్ పెట్టారు. లక్ష్మీకాంత్ చెన్నా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలతో ముందుకెళుతున్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ జంటగా లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రియాజ్ నిర్మించిన చిత్రం ‘పరిచయం’. శేఖర్ చంద్ర స్వరాలందించారు. ఈ చిత్రంలోని ‘అటు ఇటు అని ఏమైందో మనసా’ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. లక్ష్మీకాంత్ చెన్నా మాట్లాడుతూ– ‘‘ప్రేమ అంటే ఏంటి? అనే ప్రశ్న వేసుకుని ఈ సినిమా కథని ప్రారంభించా. ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా ఎవరికైనా ఏదైనా చేయగలిగితే అదే ప్రేమ. తన ప్రాణం పోయినా పర్లేదని తల్లి అనుకుంటూ బిడ్డకు జన్మనిస్తుంది. అదే.. ప్రేమంటే’’ అన్నారు. ‘‘ఇప్పటికీ అందరూ నన్ను ‘పెళ్ళి’ పృథ్వీరాజ్ అనే పిలుస్తుంటారు. ఏడేళ్ల తర్వాత నేను నటిస్తున్న తెలుగు చిత్రమిది. హీరోయిన్ ఫాదర్‌గా చేశా’’ అన్నారు పృథ్వీ. ‘‘ఓ మంచి సినిమాతో నిర్మాణ రంగంలోకి వచ్చినందుకు హ్యాపీ’’ అన్నారు రియాజ్. డైరెక్టర్ సుధీర్ వర్మ, నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, బిక్ష్మమయ్య, విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్, కెమెరామేన్ నరేష్ రానా పాల్గొన్నారు. -
రెడ్ లైట్ ఏరియా నేపథ్యంలో శర్వా సినిమా
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న శర్వానంద్ ఓ ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు సినిమా చేస్తున్న శర్వానంద్.. తరువాత సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. స్వామి రారా, కేశవ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ.. శర్వానంద్‌తోనూ ప్రయోగాత్మక చిత్రం చేయనున్నాడు. వీరి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా రెడ్ లైట్ ఏరియా నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. యంగ్ జనరేషన్ హీరోల్లో ఇంత వరకు ఇలాంటి నేపథ్యంతో ఎవరూ సినిమా చేయకపోవటంతో సుధీర్,శర్వాల సినిమాలపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో హలో ఫేం కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తుండగా కాజల్ అగర్వాల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. -
వారికే అవకాశం అంటున్న యువహీరో
సిని పరిశ్రమలో విజయం సాధించిన వారికే విలువ. ఈ సూత్రం హీరోయిన్లకే కాదు దర్శకులకు వర్తిస్తుంది. ఒక్క సినిమా ఫ్లాప్ అయినా ఇక ఇండస్ట్రీలో వారిని పట్టించుకునే వారు ఉండరు. కానీ యువ హీరో శర్వానంద్ పద్దతి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. విలక్షణమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న శర్వానంద్ తాజాగా ఒప్పుకున్న రెండు సినిమాల దర్శకులను చూస్తే చాలా సాహసం చేస్తున్నాడనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ యువ హీరో ఒప్పుకున్న రెండు సినిమాల్లో ఒకటి హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు కాగా, మరో చిత్రం సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే ఈ ఇద్దరు దర్శకుల పాత చిత్రాలు రెండు ఫ్లాప్ చిత్రాలే. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలోవచ్చిన ‘లై’, నిఖిల్ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘కేశవ’ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల తర్వాత ఈ దర్శకుల చేతిలో మరో సినిమా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో శర్వానంద్ వీరికి మరో అవకాశం ఇవ్వడమంటే సాహసం చేశాడనే చెప్పవచ్చు. అయితే శర్వానంద్‌కు వీరిద్దరు చెప్పిన కథ నచ్చడం వల్లే అవకాశం ఇచ్చాడని సన్నిహతులు తెలుపుతున్నారు. దర్శకుల గత విజయాలతో సంబంధం లేకుండా కథ నచ్చితే ఎవరికైనా అవకాశం ఇస్తానని మరోసారి నిరూపించాడు శర్వానంద్. అలానే మరో ఫ్లాప్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. -
శర్వా సినిమా కోసం భారీ సెట్
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ డాన్‌గా కనిపించనున్నాడట. 1980ల కాలంలో జరిగే కథ కావటంతో అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా చూపించేందుకు చిత్రయూనిట్ శ్రమిస్తున్నారు. తాజాగా కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ఓ భారీ సెట్‌ను నిర్మించారు. అప్పటి వాతావరణం ప్రతిబింభించేలా ఓ పోర్ట్ సెట్‌ను నిర్మించారు. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ సెట్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందన్న టాక్ వినిపిస్తోంది. శర్వానంద్ సరసన హలో ఫేం కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వా హీరోగా తెరకెక్కిన పడి పడి లేచే మనసు త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
హైదరాబాద్‌లో సెటిల్మెంట్
వైజాగ్‌లో సెటిల్మెంట్ కంప్లీట్ చేశారు శర్వానంద్. నెక్ట్స్ సెటిల్మెంట్ హైదరాబాద్‌లో చేస్తారట. సెటిల్మెంట్ చేయడమేంటి? అనుకుంటున్నారా! మరి గ్యాంగ్‌స్టర్ చేసేది సెటిల్మెంట్సే కదా. అర్థం కాలేదా? విషయం ఏంటంటే సుధీర్ వర్మ డైరెక్షన్లో శర్వానంద్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని తెలిసిందే. అందుకే ఈ సెటిల్మెంట్స్. వైజాగ్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన చిత్రబృందం నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెల 27 నుంచి హైదరాబాద్‌లో స్టార్ట్ చేయనుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో డిజైన్ చేసిన భారీ సెట్లో ఈ షెడ్యూల్ జరగనుందని సమాచారం. శర్వానంద్ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నారు. నలభై ఏళ్లున్న పాత్రలో, యంగ్ లుక్‌లో కనిపిస్తారట. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్. నాగ వంశీ, పీడీవి ప్రసాద్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. -
శర్వా సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా..!
హాలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ కల్యాణి ప్రియదర్శన్. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించిన కల్యాణి ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. స్వామి రారా ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో శర్వానంద్ 80ల కాలం నాటి డాన్ పాత్రలో కనిపించనున్నాడట. కల్యాణి కూడా ఆ కాలం నాటి పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. తొలి సినిమాలో ట్రెండీగా కనిపించిన ఈ భామ ఇప్పుడు పల్లె పడుచులా కనిపించేందుకు చాలా హోం వర్క్ చేసినట్టుగా తెలుస్తోంది. స్టైలిస్ట్ అశ్విన్, దర్శకుడు సుధీర్ వర్మలు కళ్యాణీని పూర్తిగా పల్లెటూరి అమ్మాయిగా మార్చేశారు. ఇప్పటికే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి కాగా, మరో షెడ్యూల్‌ను త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. -
శర్వా సినిమాలో సీనియర్ హీరోయిన్..?
యంగ్ హీరో శర్వానంద్ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాతో బిజీ అవుతున్నాడు. ఇటీవల హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు సినిమాను పూర్తి చేసిన శర్వా, ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో శర్వా మాఫీయా డాన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా కళ్యాణీ ప్రియదర్శన్‌ను ఇప్పటికే ఫైనల్ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ను పాత్రకు సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను సంప్రదించారట. అయితే కాజల్ శర్వాకు జోడిగా నటిస్తుందా..? లేదా.? అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. -
ఏప్రిల్ 6 నుంచి శర్వా కొత్త సినిమా
యంగ్ హీరో శర్వానంద్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. విభిన్న కథలతో ఆకట్టుకుంటున్న శర్వా, అదే సమయంలో ఫ్యామిలీ డ్రామా, కమర్షియల్ ఎంటర్టైనర్లు కూడా చేస్తున్నాడు. ఇటీవల మహానుభావుడుగా ఘనవిజయం అందుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. దీంతో ఈ నెల 6 నుంచి కొత్త సినిమా ప్రారంభించనున్నాడు శర్వానంద్. యువ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయన్నాడు. స్వామి రారా, కేశల లాంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన సుధీర్.. శర్వాను మాఫియా డాన్ పాత్రలో చూపించనున్నాడు. -
దుమ్ములేపుతున్న కిరాక్‌పార్టీ వసూళ్లు
స్వామిరారా సినిమాతో మళ్లీ సక్సెస్ రుచి చూసిన నిఖిల్... విజయరహస్యమేంటో తెలుసుకున్నాడు. అప్పటినుంచీ వైవిధ్యభరితమైన కథలతోనే సినిమాలు చేస్తున్నాడు. అదే తరహాలో కన్నడ రీమేక్‌లో నటించాడు. కిరాక్పార్టీగా శుక్రవారం(మార్చి 16) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఆ సినిమా వసూళ్లలో దూసుకెళ్లిపోతోంది. ఈ వారం కిరాక్‌పార్టీ మినహా ఏ సినిమాకు పాజిటివ్టాక్ రాకపోవడం...నిఖిల్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా వీకెండ్లో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్ముదులిపింది. దీంతో మూడు రోజుల్లో దాదాపు పదికోట్ల వసూళ్లను సాధించింది. కిరాక్‌పార్టీ హవా ఇలాగే కొనసాగితే...వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సుధీర్ వర్మ స్క్రిప్ట్‌ను, చందూ మొండేటి మాటలను అందించగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. -
గ్యాంగ్‌స్టర్ లవర్!
హే.... అని ఎగిరి గంతేస్తున్నారు కల్యాణి ప్రియదర్శన్. ఎందుకంటే తను ఎప్పటి నుంచో అనుకుంటున్న ఓ కోరిక నెరవేరిందట. ఏంటా కోరిక అనుకుంటున్నారా? గ్యాంగ్‌స్టర్ సినిమాలో నటించాలన్నది తన డ్రీమ్. ‘హలో’తో మంచి హిట్ అందుకున్నా ఒక్క సినిమా కూడా సైన్ చేయని కల్యాణి, తన నెక్స్›్ట సినిమాను అనౌన్స్ చేశారు. శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ డైరెక్షన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో శర్వానంద్ డబుల్ యాక్షన్ చేయనున్నారు. ఒక పాత్రకు జోడీగా కల్యాణి ప్రియదర్శన్‌ని ఎంపిక చేశారు చిత్రబృందం. ఈ సినిమా గురించి మాట్లాడుతూ – ‘‘నేను ఎప్పటి నుంచో ఒక గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్‌లో న టించాలని అనుకునేదాన్ని. ఫైనల్‌గా సుధీర్‌వర్మ – శర్వానంద్ సినిమా ద్వారా ఆ కోరిక తీరిపోతోంది. ఇంత అమేజింగ్ టీమ్‌తో జాయిన్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు కల్యాణి. ‘‘ఈ సినిమాలో ఇద్దరి హీరోయిన్స్‌లో ఒక హీరోయిన్గా కల్యాణిని ఎంపిక చేశాం. మార్చి 3వ వారం నుంచి షూటింగ్ చేస్తాం’’ అని అన్నారు. ఇందులో శర్వానంద్ ఒక క్యారెక్టర్ కోసం 40 ఏళ్ల పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాకు కెమేరా:దివాకర్ మణి, సంగీతం: సన్నీ యం.ఆర్. -
శర్వాకు ‘హలో’ చెబుతోందా..!
హలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన అందాల భామ కళ్యాణి ప్రియదర్శన్. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన కళ్యాణి తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అఖిల్ లాంటి స్టార్ హీరో సరసన పరిచయం కావటం కూడా కళ్యాణికి కలిసొచ్చింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో క్రేజ్ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్లో వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న శర్వానంద్ తదుపరి చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించనుంది. స్వామి రారా ,కేశల లాంటి సినిమాలతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం కళ్యాణిని హీరోయిన్ గా సంప్రదించారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
‘కిరాక్ పార్టీ’ ప్రీ టీజర్
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కిరిక్ పార్టీ’ని తెలుగు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీంజా కథానాయికలుగా నటిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి యువ దర్శకులు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూరుస్తుండడం విశేషం. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ప్రీ టీజర్‌ను రిలీజ్ చేశారు. జనవరి 22న తొలి పాటను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాతో మరో హిట్ గ్యారెంటీ అన్న నమ్మకంతో ఉన్నాడు నిఖిల్. -
‘శర్వా సినిమా ఆగిపోలేదు’
మహానుభావుడు సినిమాతో మరో విజయాన్ని అందుకున్న శర్వానంద్ వరుస సినిమాలతో సదండి చేసేందుకు రెడీ అవుతున్నాడు. మహానుభావుడు సినిమా సెట్స్ మీద ఉండగానే సుధీర్ వర్మ, హను రాఘవపూడిలతో సినిమాలు చేయనున్నట్టుగా ప్రకటించాడు. మహానుభావుడు పూర్తయిన వెంటనే హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాను ప్రారంభించిన శర్వా.. సుధీర్ వర్మ సినిమాను ఆలస్యం చేశాడు. దీంతో సుధీర్ దర్శకత్వంలో శర్వా చేయాల్సిన సినిమా ఆగిపోయనట్టుగా ప్రచారం జరుగింది. అయితే ఈ విషయంపై స్పందించిన చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం హను సినిమాలో నటిస్తున్న శర్వానంద్, ఒకే సమయంలో రెండు సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయటం కుదరని కారణంగానే సుధీర్ వర్మ సినిమా ఆలస్యమైందని తెలిపారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమా పూర్తయిన వెంటనే సుధీర్ వర్మ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కానుంది. -
ఫిబ్రవరి 9న ‘కిర్రాక్ పార్టీ’ రిలీజ్
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కిరిక్ పార్టీ’ని తెలుగు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీంజా కథానాయికలుగా నటిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి యువ దర్శకులు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూరుస్తుండడం విశేషం. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘షూటింగ్ శరవేగంగా జరుగుతోంది, ప్రస్తుతం రాజమండ్రిలో కీలక సన్నివేశాల చిత్రీకరణతోపాటు హైద్రాబాద్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సమాంతరంగా జరుగుతోంది.ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. నిఖిల్ మాచో లుక్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ను పెంచాయి. ‘హ్యాపీడేస్’ తర్వాత తెలుగులో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న పూర్తి స్థాయి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ‘కిర్రాక్ పార్టీ’ నిలుస్తుంది. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా మా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. -
సుధీర్‌వర్మ దర్శకత్వంలో శర్వానంద్ కొత్త చిత్రం ఆరంభం
-
శర్వాకు జోడిగా నివేదా..!
మహానుభావుడు సినిమాతో మరో ఘనవిజయాన్ని అందుకున్న శర్వానంద్, తన తదుపరి చిత్ర పనుల్లో బిజీగా ఉన్నాడు. స్వామి రారా ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో శర్వానంద్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. శర్వా మార్క్ ఎంటర్ టైన్మెంట్ తో పాటు సుధీర్ వర్మ స్టైల్ సస్పెన్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా టాలెంటెడ్ మలయాళీ భామ నివేదా థామస్ నటించనుంది. ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేకపోయినా నివేదా నటించటం దాదాపు ఖరారైనట్టేనన్న ప్రచారం జరుగుతోంది. మరో హీరోయిన్ గా కూడా గతంలో శర్వాతో కలిసి నటించని భామ కోసం ప్రయత్నిస్తున్నారట. త్వరలోనే నటీనటుల ఎంపిక పూర్తి చేసి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. -
మరోసారి థ్రిల్లర్ మూవీలో శర్వానంద్..!
కొత్త కథలతో వరుస విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో శర్వానంద్ మరో డిఫరెంట్ సినిమాకు ఓకె చెప్పాడన్న టాక్ వినిపిస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా సీరియస్, థ్రిల్లర్ సినిమాలు మాత్రమే చేసిన శర్వానంద్, ప్రస్తుతం కామెడీ, ఫ్యామిలీ డ్రామాలతో అలరిస్తున్నాడు. అయితే మరోసారి థ్రిల్లర్ సినిమాకు ఓకె చెప్పాడట ఈ యంగ్ హీరో. స్వామి రారా, కేశల లాంటి సినిమాలతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. కమల్ హాసన్ నాయకుడు తరహా కథతో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ వయసైన పాత్రలో కూడా కనిపించనున్నాడట. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మహానుభావుడు పూర్తయిన తరువాత సుధీర్ వర్మ సినిమా సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది. -
హైదరాబాద్ థియేటర్లలో ‘కేశవ’ టీమ్ సందడి
హైదరాబాద్: రెగ్యులర్ కమర్సియల్ జానర్ కు భిన్నంగా వరుస ప్రయోగాలు చేస్తూ దూసుకెళ్తున్న యంగ్ హీరో నిఖిల్. మరో డిఫరెంట్ మూవీ ‘కేశవ’తో మన ముందుకు వచ్చాడు. ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నిఖిల్ నేడు హైదరాబాద్ లోని పలు థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయనతో పాటు హీరోయిన్ రీతూ వర్మ, దర్శకుడు సుధీర్ వర్మలు నేటి సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా 70 ఎంఎం థియేటర్ లో అభిమానుల మధ్య మూవీ వీక్షించనున్నారు. ఈ విషయాన్ని హీరో నిఖిల్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ‘రీతూ వర్మ, సుధీర్ వర్మ, నేను.. మా కేశవ గ్యాంగ్ నేటి సాయంత్రం షోకు ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా థియేటర్ కు వస్తున్నాం. మరికొన్ని థియేటర్లకు వెళ్లి అభిమానులను కలుస్తామని’ ట్వీట్లో రాసుకొచ్చారు నిఖిల్. ఇటీవల విశాఖపట్నంలోనూ కొన్ని థియేటర్లకు కేశవ గ్యాంగ్... హీరో నిఖిల్, హీరోయిన్ రీతూ వర్మ, డైరెక్టర్, మూవీ యూనిట్ సభ్యులు కొందరు వెళ్లి సందడి చేసిన విషయం తెలిసిందే. విశాఖలో ఈ టీమ్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా, ఇదే ఫార్ములాను హైదరాబాద్ లోనూ ఫాలో అవుతున్నారు. అరుదైన గుండె జబ్బుతో ఎక్కువగా ఆవేశపడలేని ఓ యువకుడు తన పగను ఎలా తీర్చుకున్నాడన్న కథతో తెరకెక్కిన కేశవ సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. Hello @riturv @sudheerkvarma The KESHAVA Gang nd me will b Visiting SANDHYA 70mm RtcX today evening show, nd other theatres too.. Com say Hi pic.twitter.com/2t2wA961Lg — Nikhil Siddhartha (@actor_Nikhil) 28 May 2017 -
'కేశవ' మూవీ రివ్యూ
టైటిల్ : కేశవ జానర్ : క్రైం థ్రిల్లర్ తారాగణం : నిఖిల్ సిద్ధార్థ్, రీతూ వర్మ, ఇషా కొప్పీకర్, ప్రియదర్శి సంగీతం : సన్నీ ఎమ్.ఆర్ దర్శకత్వం : సుధీర్ వర్మ నిర్మాత : అభిషేక్ నామా రెగ్యులర్ కమర్సియల్ జానర్ కు భిన్నంగా వరుస ప్రయోగాలతో సక్సెస్ లు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్, మరో డిఫరెంట్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అరుదైన గుండె జబ్బుతో ఎక్కువగా ఆవేశపడలేని ఓ యువకుడు తన పగను ఎలా తీర్చుకున్నాడన్న కథతో తెరకెక్కిన కేశవ, మరోసారి నిఖిల్ మార్క్ చూపించిందా..? ఈ ప్రయోగంతో నిఖిల్ తన సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేశాడా..? లవర్ బాయ్ ఇమేజ్ నుండి బయటపడి పూర్తి సీరియస్ క్యారెక్టర్ లో నిఖిల్ ఎంత వరకు ఆకట్టుకున్నాడు..? కథ : కాకినాడ లా కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్న పి. కేశవ శర్మ(నిఖిల్) అరుదైన గుండె జబ్బుతో ఇబ్బంది పడుతుంటాడు. అందరికీ ఎడమ పక్కన ఉండే గుండె, తనకు కుడి పక్కన ఉంటుంది. దీని కారణంగా ఏ మాత్రం ఆవేశపడినా, అలిసి పోయినా గుండె ఆగిపోయి చనిపోతాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కేశవ వరుసగా పోలీసు అధికారులను హత్య చేస్తుంటాడు. హత్య చేసిన తరువాత చిన్న క్లూ కూడా వదిలి పెట్టకుండా.. చనిపోయిన వారి శవాలను ఉరి వేసి వెళ్లిపోతాడు. అదే సమయంలో కాలేజ్ లో జాయిన్ అయిన కేశవ చిన్ననాటి స్నేహితురాలు సత్యభామ(రీతూ వర్మ), అతన్ని గుర్తు పట్టి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ఈ హత్యలు చేస్తుంది ఎవరు..? కారణం ఏంటి..? అన్న విషయం కనిపెట్టేందుకు పోలీస్ డిపార్టెమెంట్ కేసును స్పెషల్ ఆఫీసర్ షర్మిలా మిశ్రా(ఇషా కొప్పికర్) కు అప్పగిస్తుంది. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన షర్మిలకు కేశవ మీద అనుమానం వస్తుంది. మరో పోలీస్ అధికారి హత్య సమయంలో కేశవను అరెస్ట్ చేస్తుంది. తన పగ తీరకుండానే అరెస్ట్ అయిన కేశవ ఎలా తప్పించుకున్నాడు..? అసలు కేశవ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు..? స్పెషల్ ఆఫీసర్ షర్మిలా ఈ కేను ఎలా సాల్వ్ చేసింది..? ఇన్ని మర్డర్లు చేసిన కేశవ చివరకు ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ప్రయోగాత్మక చిత్రాలు చేసినా.. లుక్ విషయంలో ఎప్పుడ లవర్ బాయ్ లానే కనిపిస్తూ వచ్చిన నిఖిల్.. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సినిమా అంతా ఒకే ఎక్స్ప్రెషన్ తో బరువైన ఎమోషన్ ను మోస్తున్నట్టుగా మంచి నటన కనబరిచాడు. హీరోయిన్ రీతూవర్మ ఆకట్టుకుంది. అందంతో పాటు అభినయంతోనూ మెప్పించింది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ఇషా కొప్పీకర్, పోలీస్ అధికారి పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. కామెడీకి పెద్దగా స్కోప్ లేకపోయినా.. ఉన్నంతలో వెన్నెల కిశోర్, ప్రియదర్శి, సుదర్శన్, సత్యల కామెడీ అలరిస్తుంది. ఇతర పాత్రల్లో అజయ్, బ్రహ్మాజీ, రావూ రమేష్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక నిపుణులు : నిఖిల్ తో రెండో సినిమా చేసిన సుధీర్ వర్మ మరోసారి అద్భుతమైన టేకింగ్‌తో ఆకట్టుకున్నాడు. రోటీన్ రివేంజ్ కథను ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో ఆసక్తికరంగా మలిచాడు. సినిమాను రెండు గంటల లోపే ముగించిన సుధీర్, కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో అనవసరమైన కామెడీ, రొమాంటిక్ సీన్స్ ఇరికించకుండా సినిమాను ఒకే మూడ్ లో నడిపించాడు. చాప్టర్ లుగా కథను నడిపించడం, అందుకు తగ్గట్టుగా ఫ్లాష్ బ్యాక్ ను కూడా కొంచెం కొంచెంగా రివీల్ చేయటం సినిమా చివరి వరకు సస్పెన్స్ కొనసాగేలా చేసింది. తొలి భాగాన్ని ఎంతో గ్రిప్పింగ్ గా నడిపించిన సుధీర్, సెకండ్ హాఫ్ లో మాత్రం స్లో అయ్యాడు. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మరోసారి స్పీడందుకోవటం సినిమాకు ప్లస్ అయ్యింది. దివాకర్ మణి సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్. తన ఫ్రేమ్స్, లైటింగ్ తో సినిమా మూడ్ ను క్యారీ చేశాడు. ఎడిటింగ్, మ్యూజిక్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నిఖిల్ నటన స్క్రీన్ ప్లే సినిమా నిడివి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్ స్లో నారేషన్ రొటీన్ స్టోరి కేశవ... ఇంటెన్స్ క్రైం థ్రిల్లర్. - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
'మర్డర్ చేసినా ప్రశాంతంగానే చేయాలి'
-
నిఖిల్ డైరెక్టర్‌తో శర్వా
స్టార్ హీరోలతో ఢీ అంటే ఢీ అని సత్తా చాటిన యంగ్ హీరో శర్వానంద్. వరుసగా రెండు సంక్రాంతి సీజన్లలో టాప్ స్టార్లతో పోటి పడి సక్సెస్ సాధించిన శర్వానంద్, ఈ శుక్రవారం రాధగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాలీవుడ్ స్క్రీన్ మీద సక్సెస్ ఫార్ములాగా పేరు తెచ్చుకున్న పోలీస్ కథతో అలరించనున్నాడు శర్వా. ఈ సినిమా రిలీజ్‌కు ముందే మరో సినిమాను ఫైనల్ చేశాడు ఈ యంగ్ హీరో. స్వామి రారా సినిమాతో సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన సుధీర్ వర్మ ప్రస్తుతం మరోసారి నిఖిల్ హీరోగా కేశవ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మే మూడో వారంలో రిలీజ్‌కు రెడీ అవుతున్న కేశవ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కేశవ తరువాత సుధీర్ వర్మ, శర్వానంద్ హీరోగా సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే శర్వానంద్‌కు లైన్ వినిపించిన దర్శకుడు ప్రస్తుతం పూర్తి కథను రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించనున్నారు. -
నిఖిల్ మరో ప్రయోగం
ప్రయోగాత్మక చిత్రాలతో మంచి విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా వైవిధ్యమైన కథాంశాలను ఎంపిక చేసుకునే నిఖిల్ తన తదుపరి చిత్రంలోనూ అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నాడు. కేశవ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో ఓ వింత వ్యాధితో బాధపడే యువకుడిగా కనిపించనున్నాడు. కథ కథానాల విషయంలోనే కాదు, ఈ సినిమా మేకింగ్, టెక్నికల్ అంశాల విషయంలోనూ ప్రయోగాలు చేస్తున్నాడు నిఖిల్. సాధారణంగా తెలుగు సినిమాలు రెండు గంటల పదిహేను నిమిషాల నుంచి రెండున్నర గంటల లెంగ్త్ ఉంటాయి. కానీ నిఖిల్ ఈ సాంప్రదాయానికి స్వస్తి చెపుతూ సినిమా రన్ టైం ను గంట 45 నిమిషాలుగా ఫిక్స్ చేశాడు. ఈ మధ్య కాలంలో వస్తున్న అతి తక్కువ రన్ టైం ఉన్న సినిమా ఇదే. అంతేకాదు ఈ సినిమాలో కేవలం ఒకే ఒక్క పాట ఉంటుందని తెలుస్తోంది. వేసవిలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా నిఖిల్ న్యూ లుక్‌లో దర్శనమివ్వనున్నాడు. -
కోప్పడకుండానే హత్యలు చేస్తాడట..!
టాలీవుడ్ యంగ్ జనరేషన్లో డిఫరెంట్ సినిమాలతో సక్సెస్ సాధిస్తున్న హీరో నిఖిల్. కెరీర్ స్టార్టింగ్‌లో రొటీన్ సినిమాలతో బోర్ కొట్టించిన ఈ యంగ్ హీరో తరువాత రూట్ మార్చి కొత్త కథలతో ఆకట్టుకుంటున్నాడు. స్వామిరారా, కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్యతో పాటు లేటెస్ట్గా ఎక్కడికీపోతావు చిన్నవాడా సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ యంగ్ హీరో చేస్తున్న తాజా చిత్రం కేశవపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విశేషాలు అభిమానులతో పంచుకున్నాడు నిఖిల్. పగ అనే వంటకాన్ని చల్లగా ఉన్నప్పుడు వడ్డిస్తే ఆ కిక్కే వేరు అనే ట్యాగ్ లైన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరించాడు. కథ విషయానికి వస్తే నిఖిల్ రాజమండ్రిలో ఉండే ఓ కాలేజీ కుర్రాడు. అందరికి ఉన్నట్టుగా కాకుండా ఈ సినిమాలో హీరో గుండె కుడిపక్కన ఉంటుంది. దీంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటాడు. ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోకూడదు. టెన్షన్ పడకూడదు. ఏ మాత్రం టెన్షన్ పడినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న హీరో కొంతమంది మీద పగ తీర్చుకోవాలి. కోపం తెచ్చుకోకుండా హత్యలు చేయాలి. అది ఎలా సాధించాడన్నదే మిగతా కథ. మరోసారి డిఫరెంట్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నిఖిల్.. సక్సెస్ మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. -
క్రైం థ్రిల్లర్‌గా నిఖిల్ 'కేశవ'
పెద్ద నోట్ల రద్దు తరువాత రిలీజ్ అయి ఘన విజయం సాధించిన తొలి సినిమా ఎక్కడికీ పోతావు చిన్నవాడా. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించటంతో పాటు ఈ యంగ్ హీరో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచింది. 30 రోజుల్లో 38 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఎక్కడికీ పోతావు చిన్నవాడా 50 రోజుల దిశగా దూసుకుపోతోంది. ఎక్కడికీ పోతావు చిన్నవాడా సూపర్ హిట్ కావటంతో నిఖిల్ చేయబోయే నెక్ట్స్ సినిమా పై ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగా మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నిఖిల్. తన కెరీర్‌ను మలుపు తిప్పిన స్వామి రారా చిత్ర దర్శకుడు సుదీర్ వర్మ దర్వకత్వంలో కేశవ అనే క్రైం థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇటీవల ప్రీ లుక్ పోస్టర్‌తో ఇదో క్రైం థ్రిల్లర్ అన్న హింట్ ఇచ్చిన నిఖిల్, ఫస్ట్ లుక్‌తో సినిమా జానర్ ఏంటో కన్ఫామ్ చేసేశాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. -
మాస్ ఇమేజ్ ప్రయత్నాల్లో నిఖిల్
వరుస ఎక్స్ పరిమెంటల్ సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నిఖిల్. మరో ఇంట్రస్టింగ్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఎక్కడికి పోతావు చిన్నవాడా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న నిఖిల్. అదే సమయంలో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన స్వామిరారా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో కొత్త సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు కేశవ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తోంది. నిఖిల్ సరసన పెళ్లిచూపులు ఫేం రీతూ వర్మ హీరోయిన్ గానటిస్తుండగా బాలీవుడ్ బ్యూటి ఇషా కొప్పికర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. రీవేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కాకినాడ నుంచి విశాఖ వరకు ఉన్న సముద్ర తీర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారు. ఈ సినిమాతో మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు నిఖిల్. -
స్వామిరారా కాంబినేషన్లో మరో సినిమా
సక్సెస్ కోసం పోరాడుతున్న సమయంలో నిఖిల్ కెరీర్‌ను మలుపు తిప్పిన సక్సెస్ ఫుల్ సినిమా స్వామి రారా. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈసినిమా ఘనవిజయం సాధించటంతో నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా అయిపోయాడు. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సుధీర్ వర్మ తరువాత నాగచైతన్య హీరోగా దోచెయ్ సినిమాను తెరకెక్కించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అందుకే కొంత గ్యాప్ తీసుకున్న సుధీర్ వర్మ మరోసారి నిఖిల్ హీరోగా సక్సెస్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న నిఖిల్, ఈ సినిమా పూర్తవ్వగానే మరోసారి సుధీర్ వర్మ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించాడు. ఈ సినిమాను ప్రముఖ డిస్ట్రిబూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ నిర్మించనుంది. -
రవితేజ ఒప్పేసుకున్నాడు
షార్ట్ ఫిలిం మేకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ వర్మ తరువాత డైరెక్టర్‌గా కూడా మారి మంచి విజయాన్నే సాధించాడు. నిఖిల్, స్వాతి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'స్వామి రారా..' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వర్మ, తొలి సినిమాతోనే స్టార్ హీరోల దృష్టిని కూడా ఆకర్షించాడు. ఎంత సక్సెస్ ఫుల్‌గా లాంచ్ అయినా, ద్వితీయ విఘ్నాన్ని మాత్రం దాటలేకపోయాడు. తొలి సినిమా ఘనవిజయం సాధించటంతో యంగ్ హీరో నాగచైతన్య పిలిచి మరీ సుధీర్‌తో సినిమా చేశాడు. మరోసారి క్రైమ్ థ్రిల్లర్‌నే నమ్ముకున్న సుధీర్ వర్మ నాగచైతన్య హీరోగా 'దోచెయ్' సినిమాను రూపొందించాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు. దీంతో అప్పటి వరకు బిజీ డైరెక్టర్ అయిపోతాడనుకున్న సుధీర్ ఒక్కసారిగా డీలా పడిపోయాడు. అప్పటినుంచి మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవటం కోసం ఒక్క ఛాన్స్ అంటూ ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం 'బెంగాల్ టైగర్' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజ, సుధీర్ వర్మతో సినిమాకు అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కథ కూడా విన్న మాస్ మహరాజ్ చిన్న చిన్న మార్పులు సూచించాడట. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న రవితేజ సుధీర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ డ్రామాను కూడా వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాడు. -
'దోచేయ్' అంటున్న నాగ చైతన్య..!
-
దోచేస్తా...
నాగచైతన్య తాజా చిత్రానికి ‘దోచేస్తా’ అనే టైటిల్ అనుకుంటున్నారట. టైటిల్ ఖరారు కాకముందే.. ఈ చిత్రం టీజర్ బయటకొచ్చేసింది. ఆ టీజర్లో టైటిల్ ఖరారు కాలేదంటూ... బ్రహ్మానందం సెటైర్లు కూడా విసిరారు. ఇటీవలే ఈ టైటిల్‌ని ఫిలింఛాంబర్లో రిజిస్టర్ చేసినట్లు వినికిడి. ‘స్వామి రారా’ ఫేం సుధీర్‌వర్మ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. థ్రిల్లర్ కామెడీ, లవ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మోసగాళ్లను మోసం చేసే ఘరానా మోసగాడిగా నాగచైతన్య కనిపించనున్నట్లు తెలిసింది. షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిన ఈ చిత్రాన్ని జనవరి చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉందని యూనిట్ వర్గాల భోగట్టా. ‘1’ ఫేం కృతీ సనన్ నాయిక. -
టీజర్‌తోనే.. ఆకట్టుకున్నాడు..!
-
హిట్ కాంబినేషన్లో సినిమా షురూ
‘మనం’ విజయంతో ఉత్సాహంతో ఉన్న నాగచైతన్య... మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు. ‘స్వామి రారా’ దర్శకుడు సుధీర్‌వర్మ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృతీసనన్ కథానాయిక. ఈ చిత్రం ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నాగచైతన్య క్లాప్ ఇచ్చారు. ‘‘సుధీర్‌వర్మ ‘స్వామిరారా’ సినిమా అంటే నాకెంతో ఇష్టం. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా చాలా బాగా వచ్చింది. నా కెరీర్లో మరో భారీ విజయంగా నిలుస్తుంది’’ అని నాగచైతన్య నమ్మకం వెలిబుచ్చారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘‘అత్తారింటికి దారేది’ తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. సుధీర్ వర్మ అద్భుతమైన కథ తయారు చేశారు. చైతూకి వందశాతం సరిపోయే కథ ఇది. జూలై 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రం ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘నాగచైతన్య కోసమే అన్నట్లుగా ఈ కథ కుదిరింది. అన్ని వర్గాలనూ ఆకట్టుకునే ఈ కథ నా కెరీర్‌కి మంచి మలుపు అవుతుంది. ‘అత్తారింటికి దారేది’ లాంటి ఇండస్ట్రీ హిట్‌ని నిర్మించిన సంస్థలో నా రెండో సినిమా రూపొందడం ఆనందంగా ఉంది’’ అని సుధీర్‌వర్మ అన్నారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావురమేశ్, ప్రవీణ్, పూజ, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సన్ని ఎం.ఆర్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుధీర్ ఈదర, సమర్పణ: భోగవల్లి బాపినీడు. -
చైతూ తో సుధీర్ వర్మ మూవీ
-
సుధీర్‌వర్మ దర్శకత్వంలో నాగచైతన్య
‘తడాఖా’ విజయంతో మంచి జోష్ మీదున్న నాగచైతన్య... సినిమాలు చేసే విషయంలో కాస్త జోరు పెంచారు. ప్రస్తుతం తన ఫ్యామిలీ సినిమా ‘మనం’ షూటింగ్లో బిజీగా ఉన్నారు చైతు. దేవా కట్టా దర్శకత్వంలో ఆయన నటించిన ‘ఆటోనగర్ సూర్య’ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 23న చైతు పుట్టిన రోజు సందర్భంగా ‘ఆటోనగర్ సూర్య’ ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేయనున్నట్లు వినికిడి. ఇదిలావుంటే... మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి నాగచైతన్య పచ్చజెండా ఊపారు. ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్‌ని ప్రేక్షకులకు అందించిన బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘స్వామి రారా’ ఫేం సుధీర్ వర్మ దర్శకుడు. ఈ ఏడాది విడుదలైన చిన్న చిత్రాల్లో పెద్ద విజయంగా నిలిచిన సినిమా ‘స్వామి రారా’. తొలి సినిమాతోనే దర్శకునిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న సుధీర్‌వర్మ... నాగచైతన్యతో చేయబోతున్న సినిమా క్కూడా ఓ భిన్నమైన కథాంశాన్నే ఎంచుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి చివరివారంలో కానీ, మార్చి తొలివారంలో కానీ ఈ సినిమా మొదలవుతుందని తెలిసింది. -
ఫస్ట్‌క్లాస్‌గా... సెకండ్ హ్యాండ్
‘‘ఈ టైటిల్ ‘సెకండ్ హ్యాండ్’ అయినా పాటలు, ట్రైలర్స్ మాత్రం ఫస్ట్‌క్లాస్‌గా ఉన్నాయి. బీవీయస్ రవి నాకు రెండేళ్లుగా తెలుసు. మంచి రచయిత, క్రియేటివ్‌గా ఆలోచిస్తాడు. తనకున్న ప్రతిభను 10 శాతం వినియోగించినా ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుంది’’ అన్నారు రామ్‌గోపాల్‌వర్మ. సుధీర్‌వర్మ, ధన్య బాలకృష్ణన్, కిరీటి, అనూజ్రామ్ ముఖ్య తారలుగా మల్టీడైమన్షన్ ప్రై. లిమిటెడ్ సమర్పణలో పూర్ణనాయుడు నిర్మించిన చిత్రం ‘సెకండ్ హ్యాండ్. బీవీయస్ రవి సహనిర్మాత. కిషోర్ తిరుమల దర్శకుడు. రవిచంద్ర స్వరపరచిన ఈ చిత్రం పాటలను, ప్రచార చిత్రాలను రామ్‌గోపాల్‌వర్మ ఆవిష్కరించారు. ‘‘నేను నటించిన ‘నేను మీకు తెలుసా’కి రచయితగా చేసిన కిషోర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. మంచి టాలెంట్ ఉన్నవాడు’’ అని మనోజ్ చెప్పారు. ‘‘ఈ సినిమా కోసం సింగిల్ టేక్‌లో తీసిన పాట చాలా క్వాలిటీగా ఉంది’’ అని హరీష్‌శంకర్ తెలిపారు. బీవీయస్ రవి మాట్లాడుతూ -‘‘ఈ చిత్రాన్ని కిషోర్ అద్భుతంగా తీశాడు. అతని సోదరుల్లో ఒకరు సంగీతదర్శకుడిగా, మరొకరు ఛాయాగ్రాహకుడిగా చేశారు’’ అని చెప్పారు. ఈ చిత్రంలో నటించడంపట్ల సుధీర్‌వర్మ, ధన్య బాలకృష్ణ, కిరీటి, అనూజ్రామ్ ఆనందం వ్యక్తం చేశారు.