కొరియా వెళ్లనున్న గ్యాంగ్‌స్టర్‌ | sharwanand next movie next schedule in korea | Sakshi
Sakshi News home page

కొరియా వెళ్లనున్న గ్యాంగ్‌స్టర్‌

Published Mon, Sep 10 2018 1:03 AM | Last Updated on Tue, Oct 30 2018 6:01 PM

sharwanand next movie next schedule in korea - Sakshi

శర్వానంద్‌

ఫోన్, బట్టలు, పాస్‌ పోర్ట్స్‌.. ఇలా సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అవసరమయ్యే అన్ని వస్తువులను జాగ్రత్తగా లిస్ట్‌ వేసి మరీ సర్దుకుంటున్నారు శర్వానంద్‌ అండ్‌ టీమ్‌. ‘స్వామి రారా, కేశవ’ చిత్రాల ఫేమ్‌ సుధీర్‌ వర్మ దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్, ‘హలో!’ ఫేమ్‌ కల్యాణి ప్రియదర్శిని కథానాయికలుగా నటిస్తున్నారు.

గ్యాంగ్‌స్టర్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో శర్వానంద్‌ డబుల్‌ రోల్‌ చేస్తున్నారట.ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ను కొరియాలో ప్లాన్‌ చేశారు చిత్రబృందం. సుమారు 25 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి అవుతుంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ చేయలేదు. ఈ సంగతి ఇలా ఉంచితే... హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘పడి పడి లేచె మనసు’ సినిమాలోనూ శర్వానంద్‌ నటిస్తున్నారు. సాయిపల్లవి కథానాయిక. ఈ రెండు  సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు శర్వానంద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement