నిఖిల్ మరో ప్రయోగం
ప్రయోగాత్మక చిత్రాలతో మంచి విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా వైవిధ్యమైన కథాంశాలను ఎంపిక చేసుకునే నిఖిల్ తన తదుపరి చిత్రంలోనూ అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నాడు. కేశవ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో ఓ వింత వ్యాధితో బాధపడే యువకుడిగా కనిపించనున్నాడు. కథ కథానాల విషయంలోనే కాదు, ఈ సినిమా మేకింగ్, టెక్నికల్ అంశాల విషయంలోనూ ప్రయోగాలు చేస్తున్నాడు నిఖిల్.
సాధారణంగా తెలుగు సినిమాలు రెండు గంటల పదిహేను నిమిషాల నుంచి రెండున్నర గంటల లెంగ్త్ ఉంటాయి. కానీ నిఖిల్ ఈ సాంప్రదాయానికి స్వస్తి చెపుతూ సినిమా రన్ టైం ను గంట 45 నిమిషాలుగా ఫిక్స్ చేశాడు. ఈ మధ్య కాలంలో వస్తున్న అతి తక్కువ రన్ టైం ఉన్న సినిమా ఇదే. అంతేకాదు ఈ సినిమాలో కేవలం ఒకే ఒక్క పాట ఉంటుందని తెలుస్తోంది. వేసవిలో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా నిఖిల్ న్యూ లుక్లో దర్శనమివ్వనున్నాడు.