క్రైం థ్రిల్లర్గా నిఖిల్ 'కేశవ' | Nikhil keshava First Look | Sakshi
Sakshi News home page

క్రైం థ్రిల్లర్గా నిఖిల్ 'కేశవ'

Published Sat, Dec 24 2016 2:59 PM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM

క్రైం థ్రిల్లర్గా నిఖిల్ 'కేశవ'

క్రైం థ్రిల్లర్గా నిఖిల్ 'కేశవ'

పెద్ద నోట్ల రద్దు తరువాత రిలీజ్ అయి ఘన విజయం సాధించిన తొలి సినిమా ఎక్కడికీ పోతావు చిన్నవాడా. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించటంతో పాటు ఈ యంగ్ హీరో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్గా నిలిచింది. 30 రోజుల్లో 38 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఎక్కడికీ పోతావు చిన్నవాడా 50 రోజుల దిశగా దూసుకుపోతోంది.

ఎక్కడికీ పోతావు చిన్నవాడా సూపర్ హిట్ కావటంతో నిఖిల్ చేయబోయే నెక్ట్స్ సినిమా పై ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగా మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నిఖిల్. తన కెరీర్ను మలుపు తిప్పిన స్వామి రారా చిత్ర దర్శకుడు సుదీర్ వర్మ దర్వకత్వంలో కేశవ అనే క్రైం థ్రిల్లర్లో నటిస్తున్నాడు.

ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇటీవల ప్రీ లుక్ పోస్టర్తో ఇదో క్రైం థ్రిల్లర్ అన్న హింట్ ఇచ్చిన నిఖిల్, ఫస్ట్ లుక్తో సినిమా జానర్ ఏంటో కన్ఫామ్ చేసేశాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement