Ekkadiki Pothavu Chinnavada
-
నా ఆశలపై నీళ్లు చల్లారు!: నటి
కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో నటి అవికా గోర్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఈ వదంతులు ఆనోటా ఈనోటా పాకి చివరికి అవిక చెవినపడ్డట్లున్నాయి. ఈ విషయంపై ఆమె చాలా తీవ్రంగానే స్పందించారు. తాను సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్నట్లు ఎక్కడా, ఎప్పుడూ ప్రకటించలేదన్నారు. ఇంకా చెప్పాలంటే.. రెండు సినిమాలు సక్సెస్ కావడంతో కొందరు సీనియర్ సినీ సెలబ్రిటీలు తన చేతిలో సినిమాలు లేకుండా చేశారని ఆమె ప్రధాన ఆరోపణ. అవికాకు చాన్స్‌లు ఇవ్వొద్దని తమకు తెలిసిన డైరెక్టర్లకు సీనియర్లు సూచించడం ఓ కారణంగా కనిపిస్తోంది. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావా, ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీలతో తనకంటూ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవడం కొందరికి నచ్చకపోవడం వల్లే అవకాశాలు ఆమె అవకాశాలు కోల్పోయారట. ఎక్కడికీ పోతావు చిన్నవాడా సినిమాతో మరో హిట్ అందుకున్న ఈ భామ ఆ తరువాత ఒక్క తెలుగు సినిమాకు కూడా సైన్ చేయలేదు. ఓ దశలో ఆమె సినీ కెరీర్‌ను ముగిస్తారని వదంతులు రావడంపై ఆమె ఆందోళన చెందారు. చివరికి టాలీవుడ్‌ను వదిలిపెట్టినా.. బాలీవుడ్‌లోనైనా అవకాశాలు ఇవ్వకపోతారా అని అక్కడికే వెళ్లనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది. -
హ్యాండ్సమ్ స్టార్‌తో నిఖిల్ హీరోయిన్
ఎక్కడికీ పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ నందిత శ్వేత. తొలి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటి.. ఇప్పుడు సౌత్‌లో వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ఇప్పటికే అడవి శేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నందిత హీరోయిన్గా నటిస్తోంది. తమిళ్లో ఘనవిజయం సాధించిన శతురంగ వెట్టై సినిమాకు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పింది ఈ బ్యూటి. కోలీవుడ్ హ్యాండ్సమ్ స్టార్ అరవింద్ స్వామిగా హీరో తెరకెక్కుతున్న వనన్గమూడి సినిమాలో నందిత హీరోయిన్గా నటించనుంది. సెల్వ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నందిత పోలీస్ గెటప్‌లో దర్శనమివ్వనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో నందితతో పాటు రితికా సింగ్, చాందినీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
సమంత, ఆ యంగ్ హీరోకు ఓకె చెప్తుందా..?
నాగాచైతన్యతో ప్రేమలో ఉన్న విషయం బయటికి వచ్చిన తరువాత సమంత సినిమాలు ఒప్పుకోవటం మానేసింది. జనతా గ్యారేజ్ సినిమా తరువాత చాలా రోజుల వరకు ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు సామ్. తరువాత తమిళ సినిమాలకు సైన్ చేసిన సమంత, ఈ మధ్యే ఓ తెలుగు సినిమా షూటింగ్లో పాల్గొందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా మామ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా రాజుగారి గది 2లో. తమిళ్లో రెండు మూడు ప్రాజెక్ట్ లకు ఓకె చెప్పిన సమంతపై ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. వరుసగా అడల్ట్ కామెడీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ యంగ్ హీరో జీవీ ప్రకాష్ సినిమాలో సమంత హీరోయిన్గా నటించనుందట. అయితే ఇది ఓ తెలుగు సినిమాకు రీమేక్ అన్న టాక్ వినిపిస్తోంది. నిఖిల్ హీరోగా ఘనవిజయం సాధించిన ఎక్కడికీపోతావు చిన్నవాడా సినిమాను జీవీ ప్రకాష్ తమిళ్లో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోయిన్గా హన్సికను ఫైనల్ చేయగా ఇప్పుడు మరో హీరోయిన్ పాత్రకు సమంతను సంప్రదిస్తున్నారు. చేతి నిండా సినిమాలతో పాటు పెళ్లి పనులతోనూ బిజీగా ఉన్న సమంత జీవీ ప్రకాష్‌కు ఓకె చెపుతుందో లేదో చూడాలి. -
క్రైం థ్రిల్లర్‌గా నిఖిల్ 'కేశవ'
పెద్ద నోట్ల రద్దు తరువాత రిలీజ్ అయి ఘన విజయం సాధించిన తొలి సినిమా ఎక్కడికీ పోతావు చిన్నవాడా. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించటంతో పాటు ఈ యంగ్ హీరో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచింది. 30 రోజుల్లో 38 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఎక్కడికీ పోతావు చిన్నవాడా 50 రోజుల దిశగా దూసుకుపోతోంది. ఎక్కడికీ పోతావు చిన్నవాడా సూపర్ హిట్ కావటంతో నిఖిల్ చేయబోయే నెక్ట్స్ సినిమా పై ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగా మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నిఖిల్. తన కెరీర్‌ను మలుపు తిప్పిన స్వామి రారా చిత్ర దర్శకుడు సుదీర్ వర్మ దర్వకత్వంలో కేశవ అనే క్రైం థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇటీవల ప్రీ లుక్ పోస్టర్‌తో ఇదో క్రైం థ్రిల్లర్ అన్న హింట్ ఇచ్చిన నిఖిల్, ఫస్ట్ లుక్‌తో సినిమా జానర్ ఏంటో కన్ఫామ్ చేసేశాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. -
సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..?
ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా సక్సెస్‌లు లేక అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే.. ఓ యంగ్ హీరోయిన్ మాత్రం కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుందట. ఇటీవల ఎక్కడికీ పోతావు చిన్నవాడా సినిమాతో మరో హిట్ అందుకున్న ఈ భామ తరువాత ఒక్క తెలుగు సినిమా కూడా అంగీకరించలేదు. అయితే ఈ ముద్దుగుమ్మ త్వరలోనే నటనకు గుడ్ బై చెప్పనుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇటీవల ఓ యంగ్ హీరోతో వివాదంతో అవికా పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపించింది. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. అయితే కేవలం తెలుగు సినిమాలకు గుడ్ బై చెపుతుందా..? లేక నటనకే గుడ్ బై చెపుతుందా..? అన్న విషయంపై మాత్రం తెలియరాలేదు. -
కోలీవుడ్ చిన్నవాడు జీవి
లో బడ్జెట్ సినిమాలతో కోలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తున్న యంగ్ హీరో జీవి ప్రకాష్. ముఖ్యంగా రీమేక్ సినిమాల మీద దృష్టి పెట్టిన ఈ యువ నటుడు మంచి విజయాలు సాధిస్తున్నాడు. టాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ప్రేమ కథాచిత్రం సినిమాను తమిళ్లో డార్లింగ్ పేరుతో రీమేక్ చేసిన మంచి విజయం సాధించాడు. ఆ తరువాత కూడా యూత్‌ను ఆకట్టుకునే కథాంశాలతో దూసుకుపోతున్న ఈ యంగ్, హీరో ఇప్పుడు మరో రీమేక్ మీద కన్నేశాడు. ఇటీవల నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికీ పోతావు చిన్నవాడా సినిమాను కోలీవుడ్‌లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు జీవి. పెద్ద నోట్ల రద్దు సమయంలో రిలీజ్ అయి కూడా మంచి కలెక్షన్లు సాధించిన ఎక్కడికీ పోతావు చిన్నవాడా, రీమేక్ రైట్స్ కోసం చాలా మంది హీరోలు ప్రయత్నించారు. ఫైనల్‌గా ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న జీవి, త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. -
నిఖిల్ కోసం నిర్మాతల క్యూ
జనాల చేతుల్లో డబ్బుల్లేని సమయంలో కూడా సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నిఖిల్‌కు ఇప్పుడు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. శంకరాభరణం సినిమాతో కష్టాల్లో పడ్డ నిఖిల్.., ఎక్కడి పోతావు చిన్నవాడా సక్సెస్‌తో తిరిగి సూపర్ ఫాంలోకి వచ్చాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్స్ కూడా నిఖిల్ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే దిల్ రాజు బ్యానర్లో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు నిఖిల్. అఖిల్ సినిమాతో నిర్మాతగా మారిన హీరో నితిన్ కూడ నిఖిల్ హీరోగా సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి నితిన్, నిఖిల్‌తో మాట్లాడాడని, త్వరలోనే ప్రకటన కూడా వెలువడనుందన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ఇటీవలే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన అభిషేక్ ఫిలింస్ కూడా నిఖిల్ హీరోగా సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే నిఖిల్ మాత్రం వచ్చిన ప్రతీ సినిమా అంగీకరించకుండా చాలా జాగ్రత్తగా కథలు సెలెక్ట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. -
ఓవర్సీస్లో చిన్నవాడి హవా
అసలు థియేటర్ల వరకు జనాలు వస్తారా అనుకుంటున్న సమయంలో రిలీజ్ అయి కూడా మంచి కలెక్షన్లు సాధిస్తోంది నిఖిల్ సినిమా. శంకరాభరణం లాంటి డిజాస్టర్ తరువాత నిఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా. టైగర్ ఫేం విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. పోటి కూడా లేకపోవటంతో ఈ చిన్న సినిమాకు కలెక్షన్ల పంట పండుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా ఓవర్‌సీన్‌లో మాత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రీమియర్ షోలతో 25 వేల డాలర్లు సాధించటంతో ఎక్కడికిపోతావు చిన్నవాడా కలెక్షన్లు జస్ట్ ఓకె అనుకున్నారు. అయితే రిలీజ్ రోజు మాత్రం ఓవర్సీస్లో కూడా దుమ్ముదులిపేసింది ఈ మూవీ. శుక్రవారం 95 వేల డాలర్లు సాధించి నిఖిల్ కెరీర్లోనే ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పటికే 2.8 లక్షల డాలర్లు సాధించిన ఈ సినిమా ఈ వారాంతానికి హాఫ్ మిలియన్ మార్క్ రీచ్ అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. -
హీరోయిన్‌కు ఫోన్ చేసి సర్ప్రైజ్ చేసిన బన్నీ
-
'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీ రివ్యూ
టైటిల్ : ఎక్కడికి పోతావు చిన్నవాడా జానర్ : రొమాంటిక్ థ్రిల్లర్ తారాగణం : నిఖిల్ సిద్ధార్థ్, నందితా శ్వేతా, హేబా పటేల్, వెన్నెల కిశోర్ సంగీతం : శేఖర్ చంద్ర దర్శకత్వం : విఐ ఆనంద్ నిర్మాత : పి.వి. రావు స్వామిరారా, కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య లాంటి సినిమాలతో ట్రాక్ లోకి వచ్చినట్టుగానే కనిపించిన నిఖిల్, తరువాత శంకరాభరణం సినిమాతో నిరాశపరిచాడు. ఆ సినిమా ఫెయిల్యూర్ తో ఆలోచనలో పడ్డ ఈ యంగ్ హీరో రొటీన్ కమర్షియల్ జానర్ ను పక్కన పెట్టి మరోసారి తనకు బాగా కలిసొచ్చిన ప్రయోగానికే ఓటు వేశాడు. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా, నిఖిల్ కెరీర్ ను తిరిగి ట్రాక్ లోకి తీసుకువచ్చిందా..? కథ : అర్జున్(నిఖిల్ సిద్ధార్థ్) ఇంజనీరింగ్ స్టూడెంట్.. ఎగ్జామ్ రాసిన వెంటనే తనను ప్రేమించిన అమ్మాయి అయేషాను పెళ్లి చేసుకోవడానికి రిజిస్టర్ ఆఫీస్‌కు వెళతాడు. కానీ ఎంత సేపు ఎదురుచూసినా అయేషా అక్కడికి రాదు. దీంతో అయేషా తనను మోసం చేసిందని, ఇంక జీవితంలో ఎవరికోసం ఇంతలా వెయిట్ చేయకూడదని నిర్ణయించుకుంటాడు. అయేషాను మరిచిపోయి కెరీర్ మీద దృష్టి పెట్టిన అర్జున్, గ్రాఫిక్ డిజైనర్‌గా సెటిల్ అవుతాడు. అదే సమయంలో తన ఫ్రెండ్ అన్న, కిశోర్( వెన్నెల కిశోర్) వింతగా ప్రవర్తిస్తుండటంతో అతడికి వైద్యం చేయించడానికి కేరళలోని మహిషాసుర మర్థిని ఆలయానికి తీసుకెళతాడు. అక్కడ ఉన్న సమయంలో విజయవాడ నుంచి తన అక్క వైద్యం కోసం వచ్చిన అమల అనే అమ్మాయి అర్జున్‌కు పరిచయం అవుతుంది. మూడు రోజుల్లోనే ఇద్దరు దగ్గరవుతారు. తెల్లవారితే తన ప్రేమ విషయం చెప్తుంది అనుకున్న సమయంలో అమల అక్కడి నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లిపోతుంది. ఆమెను వెతుక్కుంటూ విజయవాడ వెళ్లిన అర్జున్.. ఆమె చాలా ఏళ్ల కిందటే చనిపోయిందని తెలుసుకొని షాక్ అవుతాడు. తరువాత తనకు కేరళలో కలిసి అమ్మాయి హైదరాబాద్‌లో అర్జున్‌కు కనిపిస్తుంది. అప్పుడే అసలు విషయం తెలుస్తుంది. తన అసలు పేరు నిత్య అని తనలోకి అమల అనే అమ్మాయి ఆత్మ ప్రవేశించటంతో కేరళలో వైద్యానికి తీసుకువెళ్లారని, అక్కడే తనకు పరిచయం అయ్యిందని అర్థం అవుతుంది. అదే సమయంలో మరోసారి అమల నుంచి అర్జున్‌కు ఫోన్ వస్తుంది. నిన్ను కలవడానికి వస్తున్నా అని ఫోన్ చేసి చెపుతుంది అమల. అసలు అమల, అర్జున్ వెంటే ఎందుకు పడుతుంది..? నిఖిల్ ప్రేమించిన అయేషాకు ఏం అయ్యింది..? ఈ కథకు పార్వతికి సంబంధం ఏంటి..? చివరకు అమల ఆత్మ ఏమైంది..? అన్నదే మిగతా కథ. నటీనటులు : విభిన్న కథలను ఎంచుకొని సక్సెస్ సాధిస్తున్న హీరో నిఖిల్ సిద్ధార్ధ్ మరోసారి సక్సెస్ సాధించాడు. కాలేజ్ స్టూడెంట్, కెరీర్లో సెటిల్ అయిన వ్యక్తిగా రెండు లుక్స్‌లో మంచి వేరియేషన్ చూపించాడు. తన ప్రతీ సినిమాకు నటుడిగా మరో మెట్టు ఎదుగుతూ వస్తున్నాడు. తొలిసారిగా తెలుగు తెరకు పరిచయమైన నందితా శ్వేత మంచి నటన కనబరిచింది. ముఖ్యంగా హర్రర్ సన్నివేశాల్లో ఆమె నటన సూపర్బ్. హేబా పటేల్ మరోసారి అల్లరి పిల్లగా అలరించింది. నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినా గ్లామర్ షోతో ఆకట్టుకుంది. అవికాఘోర్ పాత్ర సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. తెర మీద కనిపించేది కొద్దిసేపే అయినా.. తనదైన నటనతో మెప్పించింది అవికా. ఇతర పాత్రల్లో వెన్నెల కిశోర్, ప్రవీణ్, తనికెళ్ల భరణి తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : టైగర్ సినిమాతో దర్శకుడిగా మారిన విఐ ఆనంద్ రెండో ప్రయత్నంలో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సక్సెస్ ఫార్ములాగా మారిన కామెడీ హర్రర్ జానర్నే నమ్ముకున్నా.. ఎక్కడా రొటీన్ సినిమా అన్న ఫీలింగ్ కలగకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమాను నడిపించాడు. కథా కథనాల విషయంలో ఆనంద్ తీసుకున్న కేర్ ప్రతీ సీన్ లోనూ కనిపిస్తుంది. సినిమాకు మరో మేజర్ హైలెట్ సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి. మహిషాసుర మర్థనీ ఆలయం, ఫస్ట్ హాఫ్‌లో వచ్చే సాంగ్స్ విజువల్‌గా చాలా బాగున్నాయి. శేఖర్ చంద్ర సంగీతం కూడా సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నందిత శ్వేత, నిఖిల్ నటన స్క్రీన్‌ప్లే కామెడీ మైనస్ పాయింట్స్ : అన్కన్విన్సింగ్ క్లైమాక్స్ అక్కడక్కడా స్లో నేరేషన్ ఓవరాల్‌గా ఎక్కడికి పోతావు చిన్నవాడా.. మరోసారి నిఖిల్ కెరీర్‌ను ట్రాక్ లోకి తీసుకొచ్చే రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
ఒకే రోజు రెండు దెయ్యాల విడుదల
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో హర్రర్ కామెడీల ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ జానర్లో తెరకెక్కిన సినిమాలు మినిమమ్ కలెక్షన్లు సాధిస్తుండటంతో యంగ్ హీరోలు ఈ తరహా సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా కొత్త దర్శకులు, కొత్త నటీనటులకు హర్రర్ కామెడీలు వరంగా మారాయి. ఇదే బాటలో తెరకెక్కిన రెండు ఇంట్రస్టింగ్ సినిమాలు ఒకేరోజు బాక్సాఫీస్ బరిలో తలపడేందుకు రెడీ అవుతున్నాయి. చాలా రోజులుగా ఓ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ కూడా ఈ సారి హర్రర్ కామెడీనే నమ్ముకున్నాడు. జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అదే సమయంలో విఐ ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడ హర్రర్ మూవీ కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ రెండు సినిమాల జానర్ దాదాపుగా ఒకటే కావటంతో పాటు రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇద్దరు హీరోలు ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉండటంతో ఈ సినిమాల సక్సెస్ వారి కెరీర్‌కు కీలకంగా మారింది. మరి ఒకేరోజు రిలీజ్ అవుతున్న ఈ రెండు దెయ్యాలలో ఏ దెయ్యాన్ని సక్సెస్ వరిస్తుందో చూడాలి. -
'ఎక్కడికీ పోతావు చిన్నవాడా' ఫస్ట్ లుక్
స్వామి రారా, కార్తీకేయ లాంటి సినిమాల సక్సెస్‌లతో ఫాంలోకి వచ్చినట్టు కనిపించిన యంగ్ హీరో నిఖిల్, తరువాత శంకరాభరణం సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా ప్రూవ్ చేసుకునే సమయంలో భారీ డిజాస్టర్ ఎదురుకావటంతో తన నెక్ట్స్ సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. తనకు బాగా కలిసొచ్చిన ఎక్స్పరిమెంటల్ జానర్లోనే తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. సందీప్ కిషన్ హీరోగా టైగర్ చిత్రాన్ని తెరకెక్కించిన విఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నాడు నిఖిల్. హేబా పటేల్, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు 'ఎక్కడికీ పోతావు చిన్నవాడా' అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. తాజాగా టైటిల్‌తో పాటు నిఖిల్ లుక్‌ను రివీల్ చేస్తున్న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.