హ్యాండ్సమ్ స్టార్తో నిఖిల్ హీరోయిన్ | Nandita swetha teams up with arvind swamy | Sakshi
Sakshi News home page

హ్యాండ్సమ్ స్టార్తో నిఖిల్ హీరోయిన్

Published Tue, Apr 4 2017 2:46 PM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM

హ్యాండ్సమ్ స్టార్తో నిఖిల్ హీరోయిన్

హ్యాండ్సమ్ స్టార్తో నిఖిల్ హీరోయిన్

ఎక్కడికీ పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ నందిత శ్వేత. తొలి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటి.. ఇప్పుడు సౌత్లో వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ఇప్పటికే అడవి శేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నందిత హీరోయిన్గా నటిస్తోంది. తమిళ్లో ఘనవిజయం సాధించిన శతురంగ వెట్టై సినిమాకు రీమేక్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పింది ఈ బ్యూటి. కోలీవుడ్ హ్యాండ్సమ్ స్టార్ అరవింద్ స్వామిగా హీరో తెరకెక్కుతున్న వనన్గమూడి సినిమాలో నందిత హీరోయిన్గా నటించనుంది. సెల్వ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నందిత పోలీస్ గెటప్లో దర్శనమివ్వనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో నందితతో పాటు రితికా సింగ్, చాందినీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement