Nandita swetha
-
నా పక్కన రెండు దెయ్యాలు కూర్చున్నాయి.
-
‘ఓ మంచి ఘోస్ట్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘ఓ మంచి ఘోస్ట్’ వచ్చేస్తోంది
వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్న ఈ కామెడీ హారర్ చిత్రాన్ని మార్క్‌సెట్ నెట్వర్క్స్ బ్యానర్‌పై డా.అబినికా ఇనాబతుని నిర్మిస్తున్నారు. షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, హాస్యనటుడు రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. జూన్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన అనూప్ రూబెన్స్ ‘ఓ మంచి ఘోస్ట్’కు మంచి ఆర్ఆర్, పాటలు ఇచ్చారు. ఈ చిత్రానికి అనూప్ మ్యూజిక్ ప్లస్ కానుంది. ప్రేక్షకులు నవ్వుతూనే భయపడతారు? అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఓఎమ్‌జీ టీజర్: 'అరుంధతికి అక్కవైనా.. చంద్రముఖికి చెల్లివైనా..'
‘పూర్వ జన్మ జ్ఞానంతో మళ్లీ జన్మ ఎత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు.. దెయ్యాలకు మాత్రమే ఉంటుంది’ అనే డైలాగ్‌తో ‘ఓఎమ్‌జీ’ (ఓ మంచి ఘోస్ట్) చిత్రం టీజర్ ఆరంభమవుతుంది. ‘ఒసేయ్ నువ్వు అరుంధతికి అక్కవైనా.. చంద్రముఖి చెల్లివైనా.. కాశ్మోరా లవర్‌వైనా, కాంచన కజిన్‌వైనా..’ అంటూ వెన్నెల కిశోర్ చేసే కామెడీ, ‘నేను మోహిని పిశాచి మోహం తీర్చా.. కామిని పిశాచి కామం తీర్చా’ అంటూ షకలక శంకర్ చేసే కామెడీతో ఈ టీజర్ సాగుతుంది. ఘోస్ట్ క్యారెక్టర్లో నందితా శ్వేతా అందరినీ భయపెట్టేలా కనిపించారు. హారర్, కామెడీ ప్రధానాంశాలుగా రూపొందిన చిత్రం ‘ఓఎమ్‌జీ’. వెన్నెల కిశోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమీ గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు కీలక పాత్రల్లో శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. డా. అబినికా ఇనాబతుని నిర్మించారు. శనివారం ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు. ‘‘త్వరలో ‘ఓఎమ్‌జీ’ విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
మంచు లక్ష్మిని ఇలా చూసుండరు.. బిగ్‌బాస్ బ్యూటీ ఏకంగా అలా!
హోయలు పోతూ మృణాల్ ఠాకుర్ వయ్యారాలు చాలారోజుల తర్వాత క్యూట్‌గా 'కాంతార' భామ విచిత్రమైన గెటప్‌తో షాకిచ్చిన మంచు లక్ష్మి అందాలన్నీ చూపించేస్తున్న హాట్ బ్యూటీ రీతూ చౌదరి మత్తెక్కించేలా శ్రీలీల పోజులు.. చూస్తే ఆహా అనాల్సిందే బిగ్‌బాస్ స్రవంతి బ్లాస్టింగ్ పోజులు.. మైమరిచిపోతారంతే ఒంపుసొంపులతో రెచ్చిపోతున్న హీరోయిన్ శ్రద్ధా దాస్ వెకేషన్లో చిల్ అవుతున్న యంగ్ హీరోయిన్ ఇవానా View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) -
Raghava Reddy Review: ‘రాఘవరెడ్డి’ మూవీ రివ్యూ
టైటిల్: రాఘవరెడ్డి నటీనటులు: శివ కంఠంనేని, రాశి, నందిత శ్వేత, అన్నపూర్ణ, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి , అజయ్ , పోసాని కృష్ణమురళి, ప్రవీణ్ , అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి తదితరులు నిర్మాణ సంస్థ: లైట్ హౌస్ సినీ మ్యాజిక్ నిర్మాతలు: కేఎస్ శంకర్ రావ్, జీ.రాంబాబు యాదవ్, ఆర్.వెంకటేశ్వర్ రావు స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సంజీవ్ మేగోటి సంగీతం: సంజీవ్ మేగోటి - సుధాకర్ మారియో విడుదల తేది: జనవరి 5, 2024 కథేంటంటే.. రాఘవ రెడ్డి(శివ కంటంనేని) ఓ క్రిమినాలాజీ ప్రొఫెసర్. డిగ్రీ విద్యార్థులకు పాఠాలు చెప్పడం తో పాటు క్రిమినల్ కేసులు సాల్వ్ చేయడంలో పోలీసులకు సహాయం చేస్తుంటాడు. రాఘవ రెడ్డి పాఠాలు చెప్పే కాలేజీ లోకి మహాలక్ష్మి అలియాస్ లక్కీ ( నందిని శ్వేత) స్టూడెంట్ గా వస్తుంది. లక్కీ చాలా అల్లరి అమ్మాయి. తన యాటిట్యూడ్ తో రాఘవరెడ్డి తో గొడవ పడుతుంది. కాలేజీ లో అంతా రాఘవ రెడ్డికి భయపడతారు కానీ లక్కీ మాత్రం రౌడీ బేబీ లా ప్రవర్తిస్తూ ప్రొఫెసర్ ని లెక్కచేయదు. ఒక సందర్భంలో రాఘవ రెడ్డికి లక్కీకి పెద్ద గొడవ జరుగుతుంది. ఇదిలా ఉంటే...లక్కీ తల్లి దేవకీ(రాశి) ఒకసారి కాలేజీ కి వచ్చి వెళ్తుంటే...ఆమె వెనుక పరుగెత్తుతాడు రాఘవ. అసలు దేవకిని చూసి రాఘవ ఎందుకు పరుగెత్తాడు? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? లక్కీ నీ కిడ్నాప్ చేసిందెవరు? ఎందుకు చేశారు? క్రిమినల్ కేసులను సాల్వ్ చేసే రాఘవ్.. కిడ్నాపర్ల ను ఎలా కనిపెట్టాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. హీరో తన డ్యూటీ కోసం ఫ్యామిలీని దూరం చేసుకోవడం..ఆపద వచ్చినప్పుడు మళ్లీ ఫ్యామిలీ కోసం పోరాటం చేసి రక్షించుకోవడం చాలా సినిమాల్లో చూశాం. రాఘవరెడ్డి కథ కూడా ఇదే పంథాలో సాగుతుంది. డాటర్ సెంటిమెంట్‌తో ప్యామిలీ ఎమోషనల్‌గా ఈ కథను తీర్చిదిద్దాడు దర్శకుడు. యూత్‌ను ఆకట్టుకోవడం కోసం కాలేజీ నేపథ్యాన్ని జోడించాడు. కథ పాతదే అయినా కాస్త కమర్శియల్ అంశాలను జోడించి కాస్త డిఫరెంట్‌గా సినిమాను తెరకెక్కించాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్..దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నప్పటికీ..తెరపై ఆకట్టుకునేలా తీయడంలో కాస్త తడబడ్డాడు. స్క్రీన్‌ప్లేని మరింత బలంగా రాసుకుంటే మెరుగైన ఫలితం ఉండేది. ఫస్టాఫ్‌లో హీరోకి కావాల్సినంత ఎలివేషన్ ఇచ్చాడు. ప్రారంభంలోనే హీరో పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో చూపించాడు. కాలేజీ ప్రొఫెసర్‌గా ఉంటూనే.. క్రిమినల్ కేసులను పరిష్కరించడం. దోషులను గుర్తించే విధానాన్ని విశ్లేషించడం అన్ని ఆకట్టుకుంటాయి. ఇక నందిని శ్వేత పాత్ర ఎంట్రీ తర్వాత కథనం ఫన్ వేలో సాగుతుంది. కాలేజీలో ఆమె చేసే అల్లరి, శ్రీనివాస్ రెడ్డి చేసే కామెడీ నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథను ఫ్యామిలీ ఎమోషన్స్ వైపు మలిచాడు. తన కూతురు ఎవరో తెలుసుకునేందుకు హీరో చేసే ప్రయత్నం.. ఈ క్రమంలో వచ్చే ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. కొన్ని చోట్ల నాటకీయత ఎక్కువైనట్లు అనిపిస్తుంది. కిడ్నాపర్లను కనిపెట్టేందుకు హీరో చేసే ప్రయత్నం కూడా అంతగా ఆకట్టుకోదు. స్లో నెరేషన్.. సాగదీత సన్నివేశాలు ఎక్కువగా ఉండడం సినిమాకు మైనస్. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. టైటిల్ పాత్ర పోషించిన శివ కంఠంనేని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించాడు. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. లక్కీ పాత్రలో నందిని శ్వేత అదరగొట్టేసింది. ఇక చాలా రోజుల తర్వాత వెండితెరపై కనిపించిన రాశి.. దేవకి పాత్రకి పూర్తి న్యాయం చేసింది. బిత్తిరి సత్తి, శ్రినివాస్ రెడ్డిల కామెడీ సినిమాకు ప్లస్ అయింది. అజయ్ ఘోష్ విలనిజం పర్వాలేదు. అజయ్, ప్రవీణ్‌లతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. బీజీఎం, పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. -
ఎమోషనల్ రాఘవ రెడ్డి
శివ కంఠమనేని హీరోగా, రాశీ, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో సంజీవ్ మేగోటి దర్శకత్వంలో కేఎస్ శంకర్ రావ్, జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వర్ రావు నిర్మించిన ఈ చిత్రం జనవరి 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాల వల్లే ఇండస్ట్రీ బతుకుతుంది. ఇండస్ట్రీని బతికించుకునేందుకు ‘రాఘవరెడ్డి’లాంటి సినిమాలను ప్రేక్షకులు విజయవంతం చేయాలి. ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి’’ అన్నారు. ‘‘ఇంట్రవెల్ అందరికీ నచ్చుతుంది. క్లైమాక్స్ సీన్స్ ఎమోషనల్‌గా టచ్ అవుతాయి. ఆడియన్స్ కంటతడి పెడతారు’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత దర్శకుడిగా ‘రాఘవ రెడ్డి’ అనే ఓ మంచి సినిమా తీశాను’’ అన్నారు సంజీవ్. ‘‘ఈ సినిమాలో కూతురే ప్రపంచంగా బతికే దేవకి పాత్ర చేశాను’’ అన్నారు రాశీ. ‘‘ఈ సినిమాలో క్రిమినాలజీ ఫ్రొఫెసర్ రాఘవ రెడ్డిగా శివగారు నటించారు. యూత్‌కి కావల్సిన ఎలిమెంట్స్‌తో పాటు యాక్షన్, సోషల్ మెసేజ్ కూడా ఉన్నాయి’’ అన్నారు నిర్మాతలు. -
నవరసాల రాఘవ రెడ్డి
శివ కంఠమనేని హీరోగా, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై కేఎస్ శంకర్ రావ్, జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా జనవరి 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు, నిర్మాత మురళీ మోహన్ విడుదల చేశారు. సంజీవ్ మేగోటి మాట్లాడుతూ– ‘‘యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘మధురపూడి గ్రామం అనే నేను’ చిత్రంలో నా పాత్ర రగ్డ్గా ఉంటుంది. ‘రాఘవ రెడ్డి’లో సిన్సియర్, స్ట్రిక్ట్ ప్రోఫెసర్‌గా నటించాను. చక్కటి విందు భోజనంలా నవరసాలున్న సినిమా ఇది’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘మా బ్యానర్ నుంచి వస్తోన్న మూడో సినిమా ఇది. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు వెంకటేశ్వరరావు. ఈ ట్రైలర్ విడుదల వేడుకలో నటి అన్నపూర్ణ, దర్శకుడు నీలకంఠ, సంగీతదర్శకుడు సుధాకర్ మారియో, ఎడిటర్ ఆవుల వెంకటేశ్, వరా ముళ్లపూడి, నటుడు అజయ్ ఘోష్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సంజీవ్ మేగోటి– సుధాకర్ మారియో, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు. -
స్టేజిపైనే బోరున ఏడ్చేసిన హీరోయిన్.. కారణమిదే!
అశ్విన్ బాబు, నందితా శ్వేత పోలీస్ పాత్రల్లో నటించిన లేటేస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'హిడింబ'. ఈ చిత్రానికి అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఎస్వీకే సినిమాస్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. అమ్మాయిల సీరియల్ కిడ్నాప్‌లకు సంబంధించిన కేసును ఛేదించే కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ నందితా శ్వేత ఫుల్ ఎమోషనలయ్యారు. స్టేజ్‌పై మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. (ఇది చదవండి: వేకేషన్‌కు మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఎయిర్‌పోర్ట్‌లో సందడి!) నందితా శ్వేత మాట్లాడుతూ.. ' హిడింబ టైటిల్ చూడగానే అందరికీ కేవలం థ్రిల్లర్ మూవీ అనుకుని ఉంటారు. కానీ ఫ్యామిలీ కూడా వచ్చి చూస్తున్నారు. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు సీరియస్ రోల్ నేను చేస్తానని అనుకోలేదు. దర్శకుడు అనిల్ నాపై ఎంతో నమ్మకం ఉంచి నాకు క్యారెక్టర్ ఇచ్చారు. అశ్విన్ - అనిల్ వల్లే నా పాత్రకు పూర్తిగా న్యాయం చేశా. వాళ్లు నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు.' అని అన్నారు. నందితా మాట్లాడుతూ..' ఈ మూవీ నాకు సెంటిమెంటల్‌గా ఎంతో కనెక్ట్ అయి ఉంది. ఎందుకంటే ఈ మూవీ చేసేటప్పుడు మా ఫాదర్ చనిపోయారు. ఈ మూవీ వల్లే నాకు పేరు వచ్చింది. ఆయన ఆశీస్సుల వల్ల నేను ఇక్కడ ఉన్నాఅంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఎక్కడికిపోతావు చిన్నవాడా తర్వాత ‘హిడింబ’తోనే నాకు ఇంత గుర్తింపు వచ్చిందని' నందితా శ్వేత అన్నారు. (ఇది చదవండి:'హిడింబ' సినిమాకు రీ–సెన్సార్ చేశాం.. కారణం ఇదే' ) -
అశ్విన్ బాబు, అనిల్ సుంకర కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్
-
నాలుగేళ్లుగా ఆ వ్యాధితో బాధపడుతున్నా: హీరోయిన్
‘‘స్టార్డమ్ అనేది నా చేతుల్లో లేదు. నాకు వచ్చిన పాత్రలకు న్యాయం చేయడంపైనే దృష్టి పెట్టాను. వైవిధ్యమైన పాత్రలు చేశాను. ‘హిడింబ’తో నాకు స్టార్డమ్ ఖాయం అనే నమ్మకం ఉంది’’ అన్నారు నందితా శ్వేత. అశ్విన్‌బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అనిల్ సుంకర సమర్పణలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘హిడింబ’. ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. (ఇది చదవండి: రెండో భర్త మరణం.. 23 ఏళ్లకే జీవితం ముగిసిపోయింది: నటి) ఈ సందర్భంగా హీరోయిన్ నందితా శ్వేత మాట్లాడుతూ ‘‘హిడింబ’లో ఆద్యా అనే పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తాను. నా పాత్ర హీరో పాత్రకు సమానంగా ఉంటుంది. ఇక దాదాపు నాలుగేళ్లుగా కండరాలకు సంబంధించిన ఫైబ్రోమాల్జియాతో ఇబ్బంది పడుతున్నాను. దీనివల్ల భారీగా కసరత్తులు, డైట్ చేయకూడదు. నిద్రలేమి ఉండకూడదు. కానీ ‘హిడింబ’ కోసం ఇవన్నీ జరిగాయి. ఆ విధంగా కొంత స్ట్రగుల్ అయ్యాను. నేను చేసిన ‘మంగళవారం’ , ఓ మంచి ఘోస్ట్’ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. తెలుగులో ఒకటి, తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నాను’’ అని అన్నారు. (ఇది చదవండి: అందుకే సినిమాలకు దూరమయ్యా..: తమ్ముడు హీరోయిన్) -
'హిడింబ' సినిమాకు రీ–సెన్సార్ చేశాం.. కారణం ఇదే'
అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన చిత్రం 'హిడింబ'. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఎస్వీకే సినిమాస్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 'ఇండియన్ సినిమాల్లో ఇంతకు ముందెన్నడూ చెప్పని కథ, ఇంతకు ముందు ఎవరూ టచ్ చేయని జానర్' అంటూ రిలీజ్ డేట్ పోస్టర్లో వేశారు మేకర్స్. (ఇదీ చదవండి: రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్‌తో నటించిన హీరోయిన్.. చివరకు ఎయిడ్స్‌తో!) 'యూనిక్ కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని, థ్రిల్‌ని ఇచ్చేలా ‘హిడింబ’ని మలిచారు అనిల్ కన్నెగంటి. ఈ చిత్రంలో కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని సెన్సార్ వారు చెప్పారు. దీంతో రివ్యూ కమిటీ ద్వారా సినిమాని రీ–సెన్సార్ చేసి విడుదల చేస్తున్నాం' అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బాదిసా, కెమెరా: బి. రాజశేఖర్. -
Nandita Swetha : అదిరిపోయే ఫోజులతో నందిత శ్వేత (ఫొటోలు)
-
‘హిడింబ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఎక్కడికి వెళ్లిన అలానే పిలుస్తున్నారు అందుకే చాలా సినిమాలు రిజెక్ట్ చేశాను
-
నందిత శ్వేత అందాల హొయలు.. ఆరెంజ్ డ్రెస్‌లో అదరహో! (ఫోటోలు)
-
సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా.. రారా పెనిమిటి అంటున్న నందిత శ్వేత
భర్త రాక కోసం..భార్య పడే విరహ వేదన నేపథ్యంలో సింగిల్ క్యారక్టర్‌తో రూపొందిన చిత్రం `రారా పెనిమిటి`. శ్రీ విజయానంద్ పిక్చర్స్ బ్యానర్లో రూపొందిన ఈ చిత్రంలో ఉన్న ఏకైక పాత్రలో నందిత శ్వేత నటించగా సత్య వెంకట గెద్దాడ దర్శకత్వం వహించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని సమకూర్చగా ప్రమీల గెద్దాడ నిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీ రిలీజ్ వేడుక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు మణిశర్మ మాట్లాడుతూ...``దర్శకుడు ఒక మంచి కథతో వచ్చి కలిశారు. నేను ఇంత వరకు చేసిన కంపోజిషన్ లో నాకు ఇష్టమైన పాటలు ఇందులో ఉన్నాయి`` అన్నారు. హీరోయిన్ నందిత శ్వేత మాట్లాడుతూ...``డైరెక్టర్ కథ చెప్పి...సింగిల్ క్యారక్టర్ అనగానే ... ఈ పాత్ర చేయగలనా అని మొదట భయపడ్డాను. సాహసమే అయినా ఓకే చెప్పాను. ఇలాంటి పాత్ర చేసే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా ఈ సినిమా చేయడం నా అదృష్టం. శివశంకర్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ అద్భుతంగా చేశారు. వారు ఇప్పుడు లేకపోవడం బాధాకరం`` అన్నారు. దర్శకుడు సత్య వెంకట గెద్దాడ మాట్లాడుతూ...``కొత్తగా పెళ్లైన అమ్మాయి..తన భర్త రాక కోసం ఎదరు చూస్తూ పడే విరహ వేదనే ఈ చిత్రం. తన భర్త వచ్చాడా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ కాబట్టి.. ఆ గడుసుతనం ఉన్న అమ్మాయి కావాలని... చాలా మందిని సెర్చ్ చేశాక నందిత గారైతే పర్ఫెక్ట్ అని తీసుకున్నాం. తను నేను అనుకున్న దానికన్నా అద్భుతంగా చేసింది. అష్ట లక్షణాలున్న పాత్రను చాలా అవలీలగా చేసింది. మణిశర్మ గారు ఈ సినిమాకు పని చేయడమే పెద్ద ఎస్సెట్ గా భావిస్తున్నాం. సింగిల్ క్యారక్టర్ అయినప్పటికీ హీరోయిన్ తో పలు పాత్రలు ఫోన్ లో సంభాషిస్తుంటాయి. ఆ పాత్రలకు బ్రహ్మానందం, తణికెళ్ల భరణి, సునీల్, సప్తగిరి, హేమ, అన్నపూర్ణమ్మ ఇలా పలువురు నటీనటులు డబ్బింగ్ చెప్పారు. వారందరికీ నా ధన్యవాదాలు. సినిమా అంతా పూర్తయింది. త్వరలో విడుదల చేస్తాం`` అన్నారు. -
‘జెట్టీ’తో నా కల నెరవేరింది
‘‘గ్రామీణ నేపథ్యంలోని సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా నటించాలనేది నా కల. అది ‘జెట్టీ’తో నెరవేరింది. ఈ చిత్రం మంచి హిట్టవుతుంది’’ అన్నారు హీరోయిన్ నందితా శ్వేత. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వంలో నందితా శ్వేత, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జెట్టి’. వేణు మాధవ్ కె. నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘‘మత్స్యకారుల జీవితాల్లోని సమస్యలను చెప్పే చిత్రమిది. పోర్టుల పేరుతో మత్య్సకారుల జీవితాలను ఎలా ఇబ్బందులు పెడుతున్నారు? అనేది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు. ‘జెట్టి అంటే పోర్టు అని అర్థం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజవుతుంది’’ అన్నారు వేణు మాధవ్ .కె. మన్యం కృష్ణ, సంగీతదర్శకుడు కె. కార్తీక్ మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: వీరమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పండ్రాజు శంకర్రావు. -
యాక్షన్‌తో అదరగొట్టిన అశ్విన్.. ఆసక్తిగా 'హిడింబ'
Ashwin Babu Nandita Swetha Hidimba First Glimpse Released: విభిన్నమైన సినిమాలతో అలరిస్తున్నాడు అశ్విన్ బాబు. జీనియస్, రాజుగారి గది 2, రాజుగారి గది 3 చిత్రాలలో నటించి మెప్పించాడు. ఇప్పుడు వాటన్నింటికి డిఫరెంట్‌గా అశ్విన్ బాబు నటించిన తాజా చిత్రం 'హిడింబ'. ఈ చిత్రానికి అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్లో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో హీరోయిన్గా నందితా శ్వేత నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం. ఈ గ్లింప్స్ రిలీజైన కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యాయి. 'పోలీసు ఆపరేషనా' అంటూ సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ వీడియో ఆసక్తిగా ఉంది. ఓ బాలుడి చుట్టూ తిరిగే కథతో తెరకెక్కినట్లు సమాచారం. హీరో, విలన్ల మధ్య పోరాట సన్నివేశాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయని, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్్ అద్భుతంగా ఉన్నాయని చిత్రబృందం తెలిపింది. ఈ మూవీతో అశ్విన్‌కు మరింత గుర్తింపు లభిస్తుందని పేర్కొంది. చదవండి: అదరగొట్టిన కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్.. టాలీవుడ్లో ఎన్టీఆర్, సమంత టాప్.. -
ఆ అవకాశాం వస్తే ఎందుకు చేయను?: నందితా శ్వేత
సాక్షి, మలికిపురం: గోదావరి తీరం చాలా ఆహ్లాదకరంగా ఉందని సినీ నటి నందితా శ్వేత అన్నారు. విజయానంద్ పిక్చర్స్ బ్యానర్‌పై జి.వెంకట సత్యప్రసాద్ దర్శకత్వంలో నటిస్తున్న ‘రారా.. నా పెనిమిటి’ చిత్రం షూటింగ్ నిమిత్తం ఆమె ప్రస్తుతం రాజోలు దీవిలో ఉన్నారు. గోదావరి లంకల్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఆమె మలికిపురంలో ‘సాక్షి’తో ముచ్చటించారు. ► ‘రారా.. నా పెనిమిటి’ సినిమా మీకు ఎన్నో చిత్రం? నందితా శ్వేత: గతంలో నితిన్‌తో శ్రీనివాస కళ్యాణం, ‘అక్షర’తో పాటు నిఖిల్‌తో ఒక సినిమా చేశారు. ఇది నాలుగో సినిమా. ► తెలుగు సినీ పరిశ్రమలో మీకు లభిస్తున్న ఆదరణ ఏవిధంగా ఉంది? నందితా శ్వేత: నా చిత్రాలతో పాటు గత సినిమాలను కూడా పరిశీలిస్తే తెలుగు ప్రేక్షకుల అభిరుచి చాలా బాగుంటుంది. కథ, కథనంతో పాటు చక్కని సందేశాత్మక, వినోదాత్మక చిత్రాలను ఆదరిస్తారు. ► పెద్ద హీరోలతో అవకాశాలు రావట్లేదా? నందితా శ్వేత: ఇప్పడిపుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నా. అవకాశాలు వస్తే ఎందుకు చేయను? ► ఇంతకు ముందు ఎప్పుడైనా కోస్తా తీరానికి వచ్చారా? నందితా శ్వేత: లేదు. ఈ చిత్రం కోసమే వచ్చాను. ► ఇక్కడి వాతావరణం ఎలా ఉంది? నందితా శ్వేత: చాలా బాగుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో షూటింగ్ చేశాం. చక్కటి వాతావరణం. గోదావరి నదీ పాయలు, కొబ్బరి తోటలు, పంట పొలాలూ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి ప్రజల మర్యాద, వద్దన్నా వినకుండా మరీమరీ అడిగి వడ్డించి, తినిపించే ఆత్మీయత, వారి పలకరింపులు చాలా బాగున్నాయి. కోనసీమ వంటకాలు కూడా చాలా బాగున్నాయ్. ఉల్లిపాయలు, కోడిగుడ్డుతో చేసే ఆమ్లెట్ మరీ రుచిగా ఉంది. -
Jetty Movie: ఒక ఊరిలో జరిగిన కథ
నందితా శ్వేత, కృష్ణ , కన్నడ కిషోర్, మైమ్ గోపి, ఎమ్యస్ చౌదరి, శివాజీరాజా, జీవా, సుమన్ శెట్టి నటించిన చిత్రం ‘జెట్టి’. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వంలో వేణుమాధవ్ నిర్మించిన ఈ చిత్రం టైటిల్ లోగోని లాంచ్ చేశారు. సుబ్రహ్మణ్యం పిచ్చుక మాట్లాడుతూ –‘‘కొన్ని వందల గ్రామాల్లోని వేల మత్స్యకార కుటుంబాల తరాల పోరాటం ఒక గోడ.. ఆ గోడ పేరే జెట్టి. అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న మత్య్సకారులున్న ఒక ఊరిలో జరిగిన కథ ఇది. మత్స్యకారుల జీవన శైలి, వారి కట్టుబాట్లతో తెరకెక్కించాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాని విడుదల చేస్తాం. మా చిత్రంలో సిద్ శ్రీరాం పాడిన పాట హైలెట్‌గా ఉంటుంది.. త్వరలోనే ఆ పాటను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తిక్ కొండకండ్ల. -
'అక్షర' మూవీ రివ్యూ
టైటిల్ : అక్షర జానర్ : క్రైమ్ థ్రిల్లర్ నటీనటులు : నందిత శ్వేత, శకలక శంకర్, అజయ్ ఘోష్, మధునందన్, సత్య, హర్షవర్థన్ తదితరులు నిర్మాణ సంస్థ : సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్ నిర్మాత : అల్లూరి సురేశ్ వర్మ, అహితేజ బెల్లంకొండ దర్శకత్వం : బి. చిన్నికృష్ణ సంగీతం : సురేశ్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ : నరేశ్ బానెల్లి విడుదల తేది : ఫిబ్రవరి 26, 2021 హీరోయిన్ నందిత శ్వేత ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'అక్షర'. విద్యావ్యవస్థలోని లోపాల్ని చర్చిస్తూ సందేశాత్మక ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఎన్నో అంచనాల మధ్య ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అక్షర’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథ విద్యా విధాన్ అనే ప్రైవేట్ విద్యా సంస్థలో అక్షర (నందిత శ్వేత) ఫిజిక్స్ లెక్చరర్. అదే కాలేజీకి బోర్డ్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీతేజ్ (శ్రీతేజ్) తొలి చూపులోనే అక్షరతో ప్రేమలో పడిపోతాడు. ఇదిలా ఉంటే అక్షర నివాసం ఉండే కాలనీకి చెందిన వాల్తేర్ బాయ్స్ మధు నందన్, సత్య, శంకర్లు ఒకరి తెలియకుండా ఒకరు ఆమెను ప్రేమిస్తుంటారు. ఆమె ఇష్టాయిష్టాలను తెలుసుకొని వాటిని ఫాలో అవుతూ అక్షరను ఇంప్రెస్ చేసే పనిలో ఉంటారు. అక్షరకు మాత్రం ఈ విషయం తెలియదు. కాలేజీకి వెళ్లడం.. టీచింగ్ అయిపోగానే లైబ్రరీలో గడపడం ఆమె దినచర్య. అలాగే విద్యావ్యవస్థపై పోరాటం చేస్తుంది. ఈ క్రమంలో శ్రీతేజ్‌కు ఆమె దగ్గరవుతుంది. ఒక రోజు శ్రీతేజ్ తన మనసులో మాటను చెప్పేందుకు అక్షరను ఒక చోటుకు తీసుకెళ్లాడు. తన ప్రేమ విషయాన్ని తెలియజేసేలోపు అక్షర సడెన్‌గా బ్యాగులో నుంచి తుపాకి తీసి శ్రీతేజ్‌ను కాల్చేస్తుంది. అంతే కాకుండా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు ఆఫీసర్‌ను కూడా అక్షర చంపేస్తుంది. అసలు శ్రీతేజ్‌ని అక్షర ఎందుకు చంపేసింది? అసలు అక్షర ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? విద్యా విధాన్ ప్రైవేట్ సంస్థల యజమాని సంజయ్ స్వరూప్ అంటే అక్షరకు ఎందుకు కోపం? షకలక శంకర్, మధునందన్, సత్య, అజయ్ ఘోష్ పాత్రలు ఏమిటి అన్నదే మిగతా కథ. నటీనటులు ఈ సినిమాకు ప్రధాన బలం నందిత శ్వేత పాత్రే. అక్షర అనే లెక్చరర్ పాత్రలో ఆమె ఒదిగిపోయారు. కొన్ని ఎమోషనల్ సీన్లను కూడా బాగా పండించారు. ఇక విద్యా విధాన్ విద్యా సంస్థల అధినేతగా సంజయ్ స్వరూప్ తన పరిధి మేరకు నటించారు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే హర్షవర్థన్ పాత్ర సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ప్రభుత్వ పాఠశాల టీచర్‌గా ఆయన చక్కగా నటించాడు. అలాగే శకలక శంకర్, సత్య, మధునందన్ తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : ప్రైవేట్ విద్యా సంస్థల ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు? ర్యాంకులు, మార్కుల కోసం కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో చూపించిన చిత్రమే అక్షర. అయితే దర్శకుడు చిన్నికృష్ణ ఎంచుకున్న కాస్సెప్ట్ బాగున్నప్పటికీ తెరపై చూపించడంలో విఫలమయ్యాడు. మంచి కథకు అనవసర కామెడీని జోడించి సినిమా తేలిపోయేలా చేశాడు. ఫస్టాఫ్ మొత్తం కామెడీతో నడిపించిన దర్శకుడు ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై ఆసక్తి కలిగించేలా చేశాడు. అయితే అసలు కథను సెకండాఫ్‌లో చెప్పినప్పటికీ.. అక్కడ కూడా అనవసర కామెడీని చొప్పించాడు. కేసు విచారణను కూడా నాసిరకం కామెడీతో నీరుకార్చాడు. ఇక చివరి అరగంటలో వచ్చే సన్నివేశాలను సినిమాకు చాలా ప్లస్. హర్షవర్థన్ చెప్పే సంభాషణలు ప్రతి ఒక్కరిని ఆలోచించే విధంగా చేస్తాయి. విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను చక్కగా చూపించారు. గిదుటూరి సత్య ఎడిటింగ్ అంతంత మాత్రమే ఉంది. తను చాలా సన్నివేశాల్లో తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నరేశ్ బానెల్లి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ నందిత శ్వేత నటన ఇంటర్వెల్ బ్యాంగ్ మైనస్ పాయింట్స్ కథ, కథనం అనవసరపు కామెడీ రొటీన్ క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నందిత శ్వేత బ్యూటిఫుల్ ఫోటోలు
-
కపటధారి మూవీ టీం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
-
'అక్షర' ట్రైలర్ వచ్చేసింది..
"విద్యను నమ్మినవాడు విజ్ఞాని అవుతాడు, విద్యను అమ్మినవాడు జ్ఞానాగ్నిలో దహించుకుపోతాడు, అఖిల విశ్వాన్ని శాసించేది అక్షరమే.." అని ఎలుగెత్తి చాటుతున్న వాక్యాలతో అక్షర ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్ నందిత శ్వేత ఫిజిక్ టీచర్ అక్షర, అన్యాయాన్ని ఎదిరించే వనితగా కనిపిస్తోంది. ప్రస్తుత సమాజంలో విద్యను వ్యాపారం చేసిన కాలేజీల నిర్వాకాన్ని, సీట్లు, ర్యాంకుల అమ్మకాలను విమర్శిస్తూ విద్యార్థుల మానసిక ఒత్తిడిని తెర మీద చూపించేందుకు అక్షర చిత్రయూనిట్ ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అక్షర ట్రైలర్‌ను మంగళవారం రిలీజ్ చేశాడు. ఇక బడా కాలేజీలో చదివే ఓ విద్యార్థి మరణం చుట్టూ కథ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. భూమిని నమ్ముకున్నోడు రైతు, చదువును నమ్ముకున్నోడు రాజు అని చెప్పిన డైలాగు బాగుంది. ఇందులో షకలక శంకర్, సత్య, అజయ్ ఘోష్, మధునందన్, కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ రాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. చిన్నికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సురేశ్ వర్మ, అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. చదవండి: రఘుబాబు కూతురి ఎంగేజ్మెంట్లో స్టార్ల సందడి హైదరాబాద్ నా సిటీనే.. నా బ్యూటీ