Ashwin Babu Nandita Swetha Hidimba First Glimpse Released Went Viral, See Video Inside - Sakshi
Sakshi News home page

Ashwin Babu Movie: ఆసక్తిగా అశ్విన్‌ బాబు 'హిడింబ' ఫస్ట్‌ గ్లింప్స్‌..

Published Mon, May 16 2022 8:27 AM | Last Updated on Mon, May 16 2022 9:06 AM

Ashwin Babu Nandita Swetha Hidimba First Glimpse Released - Sakshi

Ashwin Babu Nandita Swetha Hidimba First Glimpse Released: విభిన్నమైన సినిమాలతో అలరిస్తున్నాడు అశ్విన్‌ బాబు. జీనియస్‌, రాజుగారి గది 2, రాజుగారి గది 3 చిత్రాలలో నటించి మెప్పించాడు. ఇప్పుడు వాటన్నింటికి డిఫరెంట్‌గా అశ్విన్‌ బాబు నటించిన తాజా చిత్రం 'హిడింబ'. ఈ చిత్రానికి అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. శ్రీ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమాస్‌ బ్యానర్‌లో గంగపట్నం శ్రీధర్‌ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో హీరోయిన్‌గా నందితా శ్వేత నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ను ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం. ఈ గ్లింప్స్‌ రిలీజైన కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యాయి. 

'పోలీసు ఆపరేషనా' అంటూ సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్‌ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ వీడియో ఆసక్తిగా ఉంది. ఓ బాలుడి చుట్టూ తిరిగే కథతో తెరకెక్కినట్లు సమాచారం. హీరో, విలన్ల మధ్య పోరాట సన్నివేశాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయని, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్్ అద్భుతంగా ఉన్నాయని చిత్రబృందం తెలిపింది. ఈ మూవీతో అశ్విన్‌కు మరింత గుర్తింపు లభిస్తుందని పేర్కొంది. 

చదవండి: అదరగొట్టిన కమల్‌ హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్ ఫాజిల్‌..
టాలీవుడ్‌లో ఎన్టీఆర్, సమంత టాప్‌..


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement