Ashwin Babu
-
ఓటీటీకి టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
టాలీవుడ్ హీరో ఫేమ్ అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవన్షీ జంటగా నటించిన శివం భజే. ఆగస్టు 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ మూవీని అప్సర్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించారు. వైవిధ్యమైన కథ, ఉన్నత సాంకేతిక విలువలతో నిర్మించినా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ హిట్ కొట్టలేకపోయింది.తాజాగా ఈ సినిమా ఎలాంటి చడీచప్పుడు లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో ఎన్ఐఏ గూఢచారి సంస్థకి చెందిన ఏజెంట్ పాత్రలో హీరో నటించారు. ఓ మిషన్‌లో భాగమైన హీరో తాను అనుకున్నది సాధించాడా లేదా అనేది అసలు కథ. కాకపోతే ఈ స్టోరీకి శివుడు బ్యాక్ డ్రాప్‌ని కూడా జోడించారు. థియేటర్లలో పెద్దగా మెప్పించలేని ఈ మూవీకి.. ఓటీటీలోనైనా ఆదరణ దక్కుతుందేమో చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, తులసి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వికాస్ బడిస సంగీతమందించారు. -
Shivam Bhaje Review: ‘శివం భజే’ మూవీ రివ్యూ
టైటిల్: శివం భజేనటీనటులు: అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ, అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ తదితరులునిర్మాణ సంస్థ: గంగా ఎంటర్టైన్మంట్స్ నిర్మాత: మహేశ్వర్ రెడ్డి మూలిదర్శకత్వం: అప్సర్సంగీతం: వికాస్ బడిససినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్రవిడుదల తేది: ఆగస్ట్ 1, 2024ప్రస్తుతం టాలీవుడ్లో డివోషనల్ ట్రెండ్ నడుస్తోంది. ఈ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తున్నాయి. దీంతో మన దర్శక నిర్మాతలు డివోషనల్ టచ్ ఉన్న కథలలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా తెరకెక్కిన తాజా చిత్రమే ‘శివం భజే’. ‘హిడింబ’ తర్వాత అశ్విన్ బాబు నటించిన చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంలో ‘శివం భజే’పై బజ్ క్రియేట్ అయింది. మరి డివోషనల్ కాన్సెప్ట్ వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే: చందు(అశ్విన్ బాబు) రికవరీ ఏజెంట్‌గా పని చేస్తుంటాడు. ఓ కారు ఈఎమ్ఐ వసూలు చేస్తున్న క్రమంలో శైలజ(దిగంగన సూర్యవంశీ)తో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారుతుంది. శైలజ ఓ కెమికల్ ల్యాబ్‌లో పని చేస్తుంది. ఓ రోజు శైలజను కలిసేందుకు వెళ్లిన చందు ఆమె ఆఫీస్‌కు వెళ్తాడు. అక్కడ జరిగిన ఓ గొడవ కారణంగా అతను కంటి చూపు కోల్పోతాడు. దాంతో వైద్యులు అతనికి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు. కొత్త కళ్లు వచ్చిన తర్వాత చందు ప్రవర్తనలో మార్పు వస్తుంది. డే మొత్తం నిద్రబోతూ.. నైట్ టైమ్‌లో మెలకువగా ఉంటాడు. అంతేకాకుండా అతని మైండ్‌లో రెండు హత్యలకు సంబంధించిన జ్ఞాపకాలు మెదులుతుంటాయి. వైద్యులను సంప్రదిస్తే..అతని కళ్లకు సంబంధించి ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. అదేంటి? అసలు ఆ కళ్లు ఎవరివి? అతని కలలోకి వస్తున్న హత్యల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? చైనా-పాకిస్తాన్ కలిసి ‘ఆపరేషన్ లామా’పేరుతో భారత్‌పై చేస్తున్న కుట్ర ఏంటి? ‘ఆపరేషన్ లామా’కు సాధారణ వ్యక్తి చందుకి ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..కొన్ని కథలు వినడానికి ఆసక్తికరంగా ఉంటాయి. కానీ తెరపై చూస్తున్నప్పడు ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నా.. వాటిని తెరపై ఆసక్తికరంగా చూపించినప్పుడే ఫలితం ఉంటుంది. అయితే ‘శివం భజే’ విషయంలో అది కొంతవరకు మాత్రమే ఫలించింది. వాస్తవానికి దర్శకుడు అప్సర్ ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తది. ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగు తెరపై ఇంతవరకు ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ డైరెక్టర్ అనుకున్న పాయింట్‌ని తెరపై ఉన్నది ఉన్నట్లుగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. ఉగ్రవాదం, మెడికల్ క్రైమ్, సైన్స్, ఫ్యామిలీ, డివోషినల్..ఇలా ఐదారు జానార్లతో కలిపి ఈ కథ రాసుకున్నాడు. జీనోట్రాన్స్ప్లాంటేషన్ అనే కొత్త పాయింట్‌ని టచ్ చేశాడు. అయితే కథనాన్ని ఇంకాస్త ఆసక్తికరంగా నడిపిస్తే బాగుండేది.ఇండియా పై పాకిస్తాన్..చైనా చేసే కుట్ర సీన్ తో సినిమా ప్రారంభం అవ్తుంది. ఆ తరువాత వరుస హత్యలు..పోలీసుల ఇన్వెస్టిగేషన్ ట్రాక్ ఒక వైపు.. హీరో..హీరోయిన్ల లవ్ ట్రాక్ మరో వైపు నడుస్తుంది. ఈ రెండిటికీ మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది చెప్పకుండా కథ పై ఆసక్తి కలిగేలా చేశాడు డైరక్టర్. ఇంటర్వెల్ సీన్ అదిరిపోతుంది. సెకండాఫ్ లో కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. జీనోట్రాన్స్ప్లాంటేషన్ రివీల్ అవ్వడం..ఆ తర్వాత వెంటనే ‘డోగ్రా’ గురించి తెలియడం..దాని నేపథ్యం అంతా ఆసక్తికరంగా సాగుతుంది. కానీ వరుస హత్యలపై పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ చప్పగా సాగుతుంది. బలమైన విలన్ లేకపోవడం సినిమాకు మైనస్. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్.. కాంతార లెవల్లో సాగే యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది. కథ మాదిరే స్క్రీన్‌ప్లేని కూడా మరింత బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే..నటన పరంగా అశ్విన్ బాబుకి వంక పెట్టలేం. ఎలాంటి పాత్రలోనైనా ఆయన అవలీలగా నటించగలడు. తొలిసారి ఆయన ఈ చిత్రంలో పక్కింటి కుర్రాడిగా నటించాడు. రికవరీ ఏజెంట్ చందుగా ఆయన చక్కగా నటించాడు. యాక్షన్స్ సీన్స్ అదరగొట్టేశాడు. క్లైమాక్స్‌లో అశ్విన్ నటవిశ్వరూపం చూపించాడు. హీరోయిన్ దిగంగన సూర్యవంశీ పాత్రకి ఇందులో పెద్దగా స్కోప్ లేదు కానీ ఉన్నంతలో చక్కగా నటించింది. ఏసీపీ మురళీగా అర్బాజ్ ఖాన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హైపర్ ఆది, బ్రహ్మాజీ కామెడీ వర్కౌట్ అయింది. మురళీ శర్మ, తులసి, ఇనయ సుల్తానాతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. వికాస్ బడిస నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- రేటింగ్: 2.75/5 -
హీరో అశ్విన్ కొత్త సినిమా.. బర్త్ డే స్పెషల్ పోస్టర్
'శివం భజే' సినిమాతో థియేటర్లలోకి వచ్చిన అశ్విన్ పుట్టినరోజు ఈరోజే (ఆగస్టు 01). ఈ క్రమంలోనే ఇతడికి బర్త్ డే విషెస్ చెబుతూ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మెడికో థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3గా టి.గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు.(ఇదీ చదవండి: సినిమా కోసం నిర్మాతలతో గొడవ పెట్టుకున్న మృణాల్!)ఈ సినిమాలో అశ్విన్ బాబుకి జోడిగా రియా సుమన్ నటిస్తోంది. అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడ్కర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, కొడైకెనాల్లో 75% షూటింగ్ పూర్తయింది. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు. 'హనుమన్' ఫేమ్ హరి గౌర.. ఈ సినిమాకు సంగీతమందిస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం) -
కొత్తగా ప్రయత్నించాలని ఈ సినిమా చేశాను: అశ్విన్‌బాబు
అశ్విన్‌బాబు హీరోగా నటించిన చిత్రం ‘శివం భజే’. ఇందులో దిగంగనా సూర్యవన్షీ హీరోయిన్. మూలి మహేశ్వర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు (గురువారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో అశ్విన్‌బాబు మాట్లాడుతూ– ‘‘హిడింబ’ తర్వాత చాలా కథలు విన్నాను. మళ్లీ ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నించాలనుకుంటున్న సమయంలో ‘శివం భజే’ కథ విన్నాను. చాలా నచ్చింది.నా గత చిత్రాలు ‘రాజుగారి గది, హిడింబ’లా ‘శివం భజే’ పాయింట్ బాగుంటుంది. ఈ చిత్రంలో పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాను. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అంతా విధి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా!.. ఆ టైపులో ఇందులోని నా క్యారెక్టర్ ఉంటుంది. అప్సర్ ‘శివం భజే’ కథను రాసుకున్న తీరు, ఐడియాలజీ నాకు నచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు కథను డివైన్ పాయింట్‌కు కనెక్ట్ చేసిన విధానం బాగుంటుంది.నిర్మాత రాజీ పడకుండా ఎక్కువే ఖర్చుపెట్టారు. ఏమన్నా అంటే అంతా శివయ్య చూసుకుంటారు అనేవారు. ఆగస్టు 1న నా బర్త్ డే కాబట్టి ఈ సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేయలేదు. మేం ఓ రిలీజ్ డేట్ అనుకున్నాం. సరిగ్గా అది నా బర్త్ డేకి కుదిరింది... అంతే. ఇక ‘రాజుగారి గది 4’ సినిమా ప్లానింగ్ జరుగుతోంది. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు. -
కొత్తగా ట్రై చేశాను : హీరో అశ్విన్ బాబు
‘హిడింబ తరువాత చాలా కథలు విన్నాను. ఏదో కొత్తగా ట్రై చేయాలని, యూనిక్ పాయింట్‌తో రావాలని అనుకున్నాను. ఆ టైంలోనే ఈ శివం భజే కథను విన్నాను. నాకు చాలా నచ్చింది. రాజు గారి గది, హిడింబలా ఇందులోనూ కొత్త పాయింట్ ఉంటుంది. అది ఆడియన్స్‌కి బాగా నచ్చుతుందని నమ్ముతున్నాను’ అన్నారు హీరో అశ్విన్ బాబు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘శివం భజే’. అప్సర్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్గా నటించింది. ఆగస్ట్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా అశ్విన్ బాబు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ⇒ శివంభజే చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు డివైన్ పాయింట్ ఉంటుంది. హిడింబలో కారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ ఈ చిత్రంలో పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాను. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు.. అంతా విధి.. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే టైపులో ఉండే పాత్ర. అలాంటి పాత్ర చుట్టూ రాసుకున్న కథ నాకు చాలా నచ్చింది. ముస్లిం వ్యక్తి అయినా కూడా అప్సర్ ఈ కథను రాసిన విధానం నాకు చాలా నచ్చింది.⇒ శివం భజేలో చాలా మెచ్యూర్డ్‌గా, స్టైలీష్ యాక్షన్ చేశావ్ అన్నా అని మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిస అన్నారు. అది నాకు వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్. టీం అంతా కూడా యాక్షన్ సీక్వెన్స్ పట్ల సంతృప్తి చెందారు. డైరెక్టర్ ఈ కథలో డివైన్ పాయింట్‌ను ఎలా కనెక్ట్ చేశారన్నదే ఇంట్రెస్టింగ్గా ఉంది.⇒ హిడింబకు సెన్సార్ సమస్యలు వచ్చాయి. కానీ ఈ చిత్రాన్ని చూసి వారంతా సంతోషించారు. సినిమా చాలా బాగా వచ్చిందని అన్నారు. అప్సర్ తీసిన పాయింట్, ఐడియాలజీ చాలా నచ్చింది.⇒ వికాస్ బడిస మ్యూజిక్, అప్సర్ రాసిన కథ, శివేంద్ర విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. మా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. శివయ్య మన వెనకాల ఉన్నాడు అనే ధైర్యంగా ముందడుగు వేశారు.⇒ నా బర్త్ డే, నిర్మాత పుట్టిన రోజు ఆగస్ట్ 1న కాబట్టి సినిమాను ఆ డేట్‌ను రిలీజ్ చేయాలని అనుకోలేదు. ఒక డేట్ అనుకున్నాం. ఆ డేట్ మా బర్త్ డే అయింది. అంతే కానీ.. కావాలని ప్లాన్ చేసింది అయితే కాదు.⇒ దిగంగనా అద్భుతంగా నటించారు. అర్బాజ్ ఖాన్ గారితో మంచి సీన్స్ ఉంటాయి. ఆయన పాత్రతోనే సినిమా అంతా నడుస్తుంది. అన్ని పాత్రలకు తగిన ప్రాధాన్యం ఉంటుంది.⇒ నేను ఒక మంచి డ్యాన్సర్. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఇంత వరకు తెరపై అంతగా డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు. సినిమా కథకు సరిపోతేనే డ్యాన్స్ పెట్టమని అంటాను. కథలో భాగంగానే అన్నీ రావాలని ఫీల్ అవుతాను. థియేటర్లో ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయాలని అనుకుంటాను.⇒ మా నిర్మాత చాలా మంచి వ్యక్తి. ప్రతీ సారి నేను ఆయన్ను బడ్జెట్ విషయంలో కంట్రోల్ చేస్తుండేవాడ్ని. కానీ ఆయన సినిమాకు ఏం కావాలో అంత కంటే ఎక్కువే పెట్టారు. ఏమైనా అంటే శివయ్య ఉన్నారని అంటుండేవారు. ఆయన ఎలా అనుకున్నారో సినిమా అలా వచ్చింది.⇒ అందరూ రాజు గారి గది ఫ్రాంచైజీల గురించి అడుగుతున్నారు. కానీ నాకు ఎక్కువగా థ్రిల్లింగ్ సబ్జెక్టులే వస్తున్నాయి. రాజు గారి గది 4 ప్లానింగ్స్ జరుగుతున్నాయి. అన్నయ్య కథను రాస్తున్నారు. మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల్లో ఉన్నాయి. -
అప్పుడే ప్రేక్షకుడు థియేటర్‌కి వస్తాడు: ‘శివం భజే’ నిర్మాత
‘టికెట్ల రేట్లు తగ్గించినంత మాత్రనా సినిమా చూస్తారనుకోవడం పొరపాటు. కంటెంట్‌లో దమ్ముండాలి. మౌత్ టాక్ బాగుంటే టికెట్ రేట్లు తగ్గించినా..పెంచినా ప్రేక్షకుడు థియేటర్స్‌కి వస్తారు’అని అన్నారు నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ఆయన నిర్మాణ సంస్థలో అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా నటించిన చిత్రం‘శివం భజే’. అప్సర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత మహేశ్వర్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ శివం భజే కథను ముందుగా నేను విన్నాను. నాకు చాలా నచ్చింది. విన్న వెంటనే అడ్వాన్స్ ఇచ్చాను. ఆ తరువాత ఈ కథను అశ్విన్ దగ్గరకు తీసుకెళ్లాం. ఆయనకు కూడా వెంటనే నచ్చింది. ఐదు నిమిషాల్లోనే ఓకే చెప్పేశారు. అలా ప్రాజెక్ట్ ముందుకు కదిలింది.→ హీరో అశ్విన్ బాబు బర్త్ డే సందర్భంగా అని ఏమీ ఈ సినిమాను ఆగస్ట్ 1న రిలీజ్ చేయడం లేదు. మేం ఒక డేట్ అనుకున్నాం.. అది ఆయన బర్త్ డే అయింది. అంతే కానీ మేమేదో కావాలని పుట్టిన రోజు స్పెషల్‌గా రిలీజ్ చేయాలని అయితే ప్లాన్ చేయలేదు.→ నేను శివుడి భక్తుడ్ని కాబట్టి.. ఈ సినిమాను తీయలేదు. కథలో ట్విస్టులు బాగా నచ్చాయి. ఇందులో చాలా లేయర్స్ ఉంటాయి. ఇది ఒక జానర్‌కు మాత్రమే పరిమితం అవుతుందని కూడా చెప్పలేను. ఐదారు జానర్లు కలిసి తీసిన సినిమాలా ఉంటుంది. అన్ని రకాల అంశాలుంటాయి. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ట్విస్టులను అయితే ఇప్పుడు రివీల్ చేయలేను→ శివం భజే చిత్ర విడుదలకు ఇదే సరైన సమయం(ఆగస్ట్ 1) అని భావించాను. డిస్ట్రిబ్యూటర్‌గానూ ఆలోచించాను. అందుకే ఈ డేట్‌ను ఫిక్స్ చేశాం. ఇక మున్ముందు పెద్ద సినిమాలు రాబోతోన్నాయి. క్వాలిటీ, కంటెంట్ కోసం అనుకున్న దాని కంటే కాస్త ఎక్కువే బడ్జెట్ పెట్టాను.→ మ్యూజిక్ డైరెక్టరే ఈ చిత్రానికి హీరో. అద్భుతమైన పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. ఈ మూవీని హైద్రాబాద్ చుట్టూనే తీశాం. కథ కూడా పూర్తిగా ఇక్కడే తిరుగుతుంది.→ ఐఐటీ కృష్ణమూర్తి టీంతో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నా. కార్తికేయతో ఓ సినిమా ఉంది. శివం భజే హిట్ అయితే ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తాం. ఆల్రెడీ హిందీ డబ్బింగ్ రైట్స్ అయితే అమ్ముడుపోయాయి. ఈ చిత్రం హిట్ అయితే.. రెండో పార్ట్‌ని కూడా ప్లాన్ చేస్తాం. -
షమ్ము హీరోగా క్రేజీ మూవీ.. టైటిల్ రివీల్ చేసిన అశ్విన్ బాబు
షమ్ము హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'క్రేజీ రాంబో'. ఈ సినిమాకు హరీష్ మధురెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సప్తాశ్వ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ఈ వేడుకలో హీరో అశ్విన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మూవీ ఫుల్ యాక్షన్ సినిమాగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. 'క్రేజీ రాంబో టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సినిమా తప్పకుండా క్రేజీగా ఉంటుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ ఆల్ ది బెస్ట్, సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. హీరో షమ్ము మాట్లాడుతూ.. 'ఇది నా మూడో సినిమా. మా అన్నయ్య ప్రొడక్షన్లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. క్రేజీ రాంబో కథ చాలా బాగుంటుంది. తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది' అని అన్నారు. సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ.. 'డైరెక్టర్ మధు కథ చెప్పినపుడు నాకు చాలా నచ్చింది. మా తమ్ముడు హీరోగా నేనే నిర్మించాలని అనుకున్నా. చాలా మంచి కంటెంట్. అందరినీ ఎంటర్ టైన్ చేసేలా సినిమా ఉంటుంది' అన్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. -
అశ్విన్ ‘శివం భజే’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
అశ్విన్ బాబు ని ఒక ఆట ఆడుకున్న తమన్
-
అశ్విన్ కెరీర్లో శివం భజే నిలిచిపోతుంది: విశ్వక్ సేన్
‘‘శివం భజే’ ట్రైలర్ బాగుంది. నేపథ్య సంగీతం అదిరిపో యింది. ఆగస్ట్ 1న అశ్విన్‌కు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాను. తన కెరీర్లో ‘శివం భజే’ నిలిచిపోతుంది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవన్షీ జోడీగా అప్సర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘శివం భజే’. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 1న విడుదలవుతోంది.మంగళవారం జరిగిన ‘శివం భజే’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి విశ్వక్ సేన్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు తమన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘‘శివం భజే’ ట్రైలర్ బాగుంది. యూనిట్‌కి ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలి’’ అన్నారు అనిల్ రావిపూడి.‘‘అశ్విన్ క్రికెట్లో బాల్‌ను ఎలా బాదుతాడో బాక్సాఫీస్‌ను కూడా అలానే బాదాలి’’ అన్నారు తమన్. ‘‘పరమేశ్వరుడి కథతో రూపొందిన ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అన్నారు అప్సర్. ‘‘ముస్లిం అయిన అప్సర్గారు ‘శివం భజే’ లాంటి కథను ఎలా రాశారో అనుకున్నాను. ఇదంతా శివ లీల అనిపించింది’’ అని అన్నారు అశ్విన్‌బాబు. -
నా దృష్టిలో పాన్ ఇండియా అంటే అదే: టాలీవుడ్ హీరో ఆసక్తికర కామెంట్స్
మరో డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం శివం భజే. ఈ మూవీని అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇందులో దిగాంగన సూర్యవన్షి హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా సినిమాలపై అశ్విన్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.అశ్విన్ బాబు మాట్లాడుతూ..'తెలుగులో చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. చాలా వరకు హిట్ అయ్యాయి. నేను మాత్రం ఎక్కువగా స్క్రిప్ట్‌ను నమ్ముతాను. కంటెంట్ మాత్రమే పాన్ ఇండియా అనుకుంటా. ఎందుకంటే హిడింబ చిత్రాన్ని మనకంటే హిందీలో ఎక్కువగా చూశారు. ఇది నేను ఊహించలేదు. శివం భజే పాన్ ఇండియా రిలీజ్ కాకపోయినా సరే.. సినిమా రీచ్ అయితే చాలు' అని అన్నారు.ట్రైలర్ చూస్తే ఎన్ఐఏ గూఢచారి సంస్థకి చెందిన ఏజెంట్‌గా అశ్విన్ బాబు కనిపించనున్నారు. ఆగస్టు 1న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో హైపరి ఆది, మురళి శర్మ, సాయిధీనా, బ్రహ్మజీ, తులసి, దేవి ప్రసాద్, షకలక శంకర్, ఇనయా సుల్తానా కీలక పాత్రలు పోషించారు. నాకు ప్యాన్ ఇండియా వద్దు.. సినిమా రీచ్ అయితే చాలు!Hero @imashwinbabu says, "I believe in only content!"💥💥#AshwinBabu #ShivamBhaje #TeluguFilmNagar pic.twitter.com/mFdt7s8Mfs— Telugu FilmNagar (@telugufilmnagar) July 23, 2024 -
ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లే 'శివం భజే' ట్రైలర్
టాలీవుడ్లో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ వస్తుంటుంది. అలా ప్రస్తుతం డివోషనల్ తరహా స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. రెగ్యులర్ కాన్సెప్ట్‌కి చిన్న డివోషనల్ టచ్ ఇచ్చి సినిమాలు తీస్తున్నారు. రీసెంట్ బాక్సాఫీస్ సెన్సేషన్ 'కల్కి' కూడా ఇలాంటిదే. ఇప్పుడు డివోషనల్ ప్లస్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో తీసిన మూవీ 'శివం భజే'. తాజాగా దీని ట్రైలర్ రిలీజైంది.(ఇదీ చదవండి: రోలెక్స్‌ని గుర్తుచేసిన సూర్య కొత్త సినిమా టీజర్)ట్రైలర్ చూస్తే బాగానే ఉంది. ఎన్ఐఏ గూఢచారి సంస్థకి చెందిన ఏజెంట్ మన హీరో. ఓ మిషన్ కోసం పనిచేస్తుంటాడు. చివరకు ఏమైంది? అనుకున్న సాధించాడా లేదా అనేది పాయింట్. కాకపోతే ఈ స్టోరీకి శివుడు బ్యాక్ డ్రాప్‌ని జోడించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దగ్గర నుంచి రిఫరెన్స్‌ల వరకు చాలాచోట్ల శివుడు కనిపించాడు. ఆగస్టు 1న ఈ చిత్రం థియేటర్లలోకి వస్తోంది.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. నిజమేనా?) -
హం పరమేశ్వరం...
‘రం రం ఈశ్వరం... హం పరమేశ్వరం... యం యం కింకరం... వం గంగాధరం...’ అంటూ మొదలవుతుంది ‘రం రం ఈశ్వరం’ పాట. అశ్విన్‌బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా నటించిన ‘శివం భజే’ సినిమాలోనిది ఈ పాట. ఆధ్యాత్మిక అంశాల మేళవింపుతో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని అప్సర్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించారు.ఈ చిత్రం ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘రం రం ఈశ్వరం’ పాట లిరికల్ వీడియోను సంగీత దర్శకుడు తమన్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. సంగీత దర్శకుడు వికాస్ బడిస సారథ్యంలో పూర్ణాచారి సాహిత్యం అందించిన ఈ పాటను సాయిచరణ్ పాడారు. ‘‘మా సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి’’ అన్నారు మహేశ్వర్ రెడ్డి. -
అశ్విన్ బాబు ‘శివం భజే’ రిలీజ్ డేట్ ఫిక్స్
‘రాజుగారి గది’ ఫేమ్ అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవన్షీ జోడీగా నటించిన ‘శివం భజే’ చిత్రం విడుదల తేదీ ఖరారు అయింది. ఆగస్టు 1న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అప్సర్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించారు. మహేశ్వర్ రెడ్డి మూలి మాట్లాడుతూ– ‘‘న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘శివం భజే’. వైవిధ్యమైన కథతో, ఉన్నత సాంకేతిక విలువలతో మా సంస్థలో నిర్మించిన తొలి చిత్రం ఇది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి’’ అన్నారు. ‘‘టైటిల్, టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన మా ‘శివం భజే’ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి’’ అన్నారు అప్సర్. ‘‘ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇవ్వడంతో ఈ చిత్రం మేము ఊహించినదానికంటే అద్భుతంగా వచ్చింది. ఆ శివుని అనుగ్రహంతో ΄ాటు ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉంటాయని నమ్ముతున్నాం’’ అన్నారు అశ్విన్ బాబు. అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, తులసి ఇతర ΄ాత్రలు ΄ోషించిన ఈ చిత్రానికి మ్యూజిక్: వికాస్ బడిస, కెమెరా: దాశరథి శివేంద్ర. -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తోన్న శివం భజే.. టీజర్ వచ్చేసింది!
అశ్విన్ బాబు, దిగంగనా జంటగా నటించిన చిత్రం 'శివం భజే'. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి నిర్మాతగా.. అప్సర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ''వైవిధ్యమైన కథతో మా సంస్థ నిర్మాణంలో వస్తోన్న చిత్రం 'శివం భజే'. టైటిల్, ఫస్ట్ లుక్కు మించి టీజర్‌కు స్పందన రావడం ఆనందంగా ఉంది. జూలైలో ప్రపంచవ్యప్తంగా విడుదల చేయడానికి సిద్దమవుతున్నాం. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అని అన్నారు.దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ.. " శివం భజే టైటిల్ తోనే అందరి దృష్టి ఆకర్షించాం. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత మహేశ్వర రెడ్డి పూర్తి సహకారంతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందిస్తాం. విడుదల తేదీ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం" అని అన్నారు.హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. "టీజర్‌కు అనూహ్య స్పందన వస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అన్ని వర్గాలు ప్రేక్షకులని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది. దర్శకుడు అప్సర్, నిర్మాత మహేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని ఊహించిన దానికంటే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదంతో త్వరలోనే మా చిత్రాన్ని మీ ముందుకి తెస్తాం" అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఆకట్టుకుంటున్న 'శివం భజే' ఫస్ట్ లుక్
అశ్విన్‌బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మాలి నిర్మించిన చిత్రం ‘శివం భజే’. దిగంగనా సూర్యవన్షీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, కాశీ విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించారు.తాజాగా ఈ సినిమా నుంచి అశ్విన్‌బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. సరికొత్త కథతో ఈ సినిమాను రూపొందించాం. త్వరలోనే ఈ సినిమా టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్ వివరాలను వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు వికాస్ బాడిస స్వరకర్త. -
తిరుమలలో ఓంకార్ సోదరుడు అశ్విన్, తమన్ సందడి (ఫోటోలు)
-
సరికొత్త కథతో టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తున్న అర్బాజ్ ఖాన్!
'జై చిరంజీవ' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అర్బాజ్ ఖాన్. ఆ తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్ చిత్రంలో నటించబోతున్నాడు ఈ పాపులర్ బాలీవుడ్ నటుడు. యువ నటుడు అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్బాజ్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒక డిఫరెంట్ కథలో మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందని అర్బాజ్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ''అశ్విన్ బాబు హీరోగా ఒక వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ మొదటి నిర్మాణంలోనే అర్బాజ్ ఖాన్ గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. అర్బాజ్ గారి పాత్ర అద్భుతంగా అంటుంది. ఈ రోజు నుంచి జరగనున్న కొత్త షెడ్యూల్ తో ఆయన సెట్స్ లోకి అడుగు పెడతారు. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమా చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం'అని అన్నారు. -
వైవిధ్యమైన కథ
‘రాజుగారి గది, హిడింబ’ చిత్రాల ఫేమ్ అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవన్షీ హీరోయిన్గా సోమవారం కొత్త సినిమాప్రారంభమైంది. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సన్నివేశానికి దర్శకుడు సుబ్బు మంగాదేవి కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ విజయ్ కనకమేడల క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వశిష్ఠ గౌరవ దర్శకత్వం వహించగా, దర్శక–నిర్మాత ఓంకార్ యూనిట్‌కి స్క్రిప్ట్ అందించారు. నిర్మాతలు సుధాకర్ రెడ్డి, ‘ఠాగూర్’ మధు, శిరీష్ రెడ్డి, ఎర్రబెల్లి విజయ్ కుమార్ రావు జ్యోతి ప్రజ్వలన చేశారు. ‘‘వైవిధ్యమైన కథ, సరికొత్త కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బడిస, కెమెరా: దాశరధి శివేంద్ర. -
మెడికో థ్రిల్లర్.. యంగ్ హీరో ప్రయోగం
అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘వచ్చినవాడు గౌతం’ అనే టైటిల్ ఖరారు చేశారు. మామిడాల ఎంఆర్ కృష్ణ దర్శకత్వంలో ఆలూరి సురేష్ నిర్మిస్తున్నారు. మంగళవారం (ఆగస్టు 1) అశ్విన్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించి, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘‘మెడికో థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా కోసం అశ్విన్ ఫిజికల్‌గా మేకోవర్ అయ్యారు’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: గౌర హరి. -
అనుకున్నవన్నీ జరిగాయి
అశ్విన్‌బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘హిడింబ’. ఈ సినిమా ఈ నెల 20న విడుదలైంది. శనివారం థ్యాంక్స్ మీట్లో అశ్విన్ మాట్లాడుతూ– ‘‘హిడింబ’ విషయంలో మేం అనుకున్నవన్నీ జరిగాయి. డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారు’’ అన్నారు. ‘‘రెండు రోజులకే రూ. 3 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిందీ చిత్రం’’ అన్నారు అనిల్ కన్నెగంటి. ‘‘వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆదరిస్తున్న ప్రేక్షకులకు «థ్యాంక్స్’’ అన్నారు శ్రీధర్. -
స్టేజిపైనే బోరున ఏడ్చేసిన హీరోయిన్.. కారణమిదే!
అశ్విన్ బాబు, నందితా శ్వేత పోలీస్ పాత్రల్లో నటించిన లేటేస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'హిడింబ'. ఈ చిత్రానికి అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఎస్వీకే సినిమాస్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. అమ్మాయిల సీరియల్ కిడ్నాప్‌లకు సంబంధించిన కేసును ఛేదించే కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ నందితా శ్వేత ఫుల్ ఎమోషనలయ్యారు. స్టేజ్‌పై మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. (ఇది చదవండి: వేకేషన్‌కు మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఎయిర్‌పోర్ట్‌లో సందడి!) నందితా శ్వేత మాట్లాడుతూ.. ' హిడింబ టైటిల్ చూడగానే అందరికీ కేవలం థ్రిల్లర్ మూవీ అనుకుని ఉంటారు. కానీ ఫ్యామిలీ కూడా వచ్చి చూస్తున్నారు. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు సీరియస్ రోల్ నేను చేస్తానని అనుకోలేదు. దర్శకుడు అనిల్ నాపై ఎంతో నమ్మకం ఉంచి నాకు క్యారెక్టర్ ఇచ్చారు. అశ్విన్ - అనిల్ వల్లే నా పాత్రకు పూర్తిగా న్యాయం చేశా. వాళ్లు నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు.' అని అన్నారు. నందితా మాట్లాడుతూ..' ఈ మూవీ నాకు సెంటిమెంటల్‌గా ఎంతో కనెక్ట్ అయి ఉంది. ఎందుకంటే ఈ మూవీ చేసేటప్పుడు మా ఫాదర్ చనిపోయారు. ఈ మూవీ వల్లే నాకు పేరు వచ్చింది. ఆయన ఆశీస్సుల వల్ల నేను ఇక్కడ ఉన్నాఅంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఎక్కడికిపోతావు చిన్నవాడా తర్వాత ‘హిడింబ’తోనే నాకు ఇంత గుర్తింపు వచ్చిందని' నందితా శ్వేత అన్నారు. (ఇది చదవండి:'హిడింబ' సినిమాకు రీ–సెన్సార్ చేశాం.. కారణం ఇదే' ) -
Hidimba Review: ‘హిడింబ’ మూవీ రివ్యూ
టైటిల్: హిడింబ నటీనటులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, రాజీవ్ పిళ్ళై, శుభలేఖ సుధాకర్, రఘు కుంచె తదితరులు నిర్మాత: గంగపట్నం శ్రీధర్ సమర్పణ: అనిల్ సుంకర దర్శకత్వం: అనిల్ కన్నెగంటి విడుదల తేది: జులై 20, 2023 కథేంటంటే.. హైదరాబాద్‌లో వరుగా అమ్మాయిలు కిడ్నాప్‌కు గురవుతుంటారు. దాదాపు 16 మంది అదృశ్యం అవ్వడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కేరళ నుంచి ఐపీఎస్ ఆద్య(నందితా శ్వేతా)ను నగరానికి రప్పిస్తారు. అప్పటి వరకు ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి అభయ్(అశ్విన్ బాబు)తో కలిసి ఆద్య విచారణ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో కాలాబండలోని బోయ(రాజీవ్ పిళ్ళై) అనే కరుడుగట్టిన రౌడీ గురించి తెలుస్తుంది. ఆభయ్ రిస్క్ చేసి మరీ కాలాబండలో బందీగా ఉన్న అమ్మాయిలను విడిపిస్తాడు. అయినప్పటికీ నగరంలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్‌కి గురవుతుంటారు. మరి అమ్మాయిలను కిడ్నాప్ చేసేదెవరు? ఎందుకు చేస్తున్నారు? రెడ్ డ్రెస్ వేసుకున్న యువతులను మాత్రమే ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? ఈ కేసుకు అండమాన్ దీవుల్లో ఉన్న గిరిజన తెగ హిడింబాలకు సంబంధం ఏంటి? చివరకు ఆద్యకు తెలిసిన నిజమేంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఎలాంటి కథ అయినా ప్రేక్షకులకు అర్థమయ్యేలా, వారు ఆ కథలో ప్రయాణించేలా చేస్తేనే ఆ చిత్రాన్ని ఆదరిస్తారు. లేదంటే ఎంత గొప్ప కథ అయినా, ఎంత క్రియేటివ్‌గా చూపించినా వారికి అర్థం కాకపోతే అంతే సంగతి. ‘హిడింబ’లో ఆ పొరపాటే జరిగింది. వాస్తవానికి ఈ మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తది. తెలుగు తెరపై ఇంతవరకు రానటువంటి కథను చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దర్శకుడి తప్పిదమే లేదా ఎడిటింగ్ లోపమో తెలియదు కానీ ఈ చిత్రం ప్రేక్షకులను గందరగోళానికి గురి చేస్తుంది. నాన్ లినియర్ స్క్రీన్‌ప్లేతో(ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే..మరొక సీన్ గతంలో సాగుతుంటుంది) కాస్త డిఫరెంట్‌గా ఈ కథను చెప్పే ప్రయత్నం చేశారు. ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి దర్శకుడు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడేమో కానీ అది వర్కౌట్ కాకపోవడమే కాకుండా ప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేస్తుంది. నగరంలో వరుస కిడ్నాపులు జరగడం, ఆ కేసును ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగడం.. ఈ క్రమంలో వాళ్లకు కొన్ని సవాళ్లు ఎదురు కావడం, చివరకు ఆ కేసును చేధించడం ఇలా రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ తరహాలో ఫస్టాఫ్ సాగుతుంది. కాలబండాలో బోయ ముఠాలో హీరో చేసే ఫైట్ సీన్ ఆకట్టకుంటుంది. అలాగే హీరోహీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ చూడడానికి బాగుంటుంది కానీ సాఫీగా సాగుతున్న కథకి అడ్డంకిగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లో ఉంటుంది. హిడింబ తెగకు సంబంధించిన నేపథ్యం ఆసక్తికరంగా ఉంటుంది. నగరంలో జరుగుతున్న కిడ్నాపులకు, హిడింబ తెగకు సంబంధం ఉండడం.. చివర్లో వచ్చే ట్విస్టులు, సర్ప్రైజ్లు ప్రేక్షకులను ధ్రిల్కు గురిచేస్తుంది. అయితే దర్శకుడు చాలా చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. పోలీసులు పెద్దగా కష్టపడకుండానే కిడ్నాప్‌కు సంబంధించిన క్లూలు లభించడం, నగరం దాటి వెళ్లొద్దని ఆద్యకు డీజీపీ చెప్పినా.. ఆమె కేరళ వెళ్లడం, ఇలా చెప్పుకుంటూ చాలా సన్నివేశాలు వాస్తవానికి దూరంగా ఉంటాయి. స్క్రీన్‌ప్లే మరింత పకడ్బందీగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. పోలీసు అధికారి అభయ్ పాత్రకు అశ్విన్ బాబు న్యాయం చేశాడు. గత సినిమాలతో పోలిస్తే నటన విషయంలో అశ్విన్ చాలా మెరుగుపరుచుకున్నాడు. యాక్షన్ సీన్స్ స్టార్ హీరోలకు తగ్గకుండా చేశాడు. క్లైమాక్స్‌లో అతని నటన అద్భుతంగా ఉంటుంది. ఐపీఎస్ అధికారి ఆద్యగా నందితా శ్వేతా తనదైన నటనతో మెప్పించింది. హీరోతో సమానమైన పాత్ర తనది. మకరంద్ దేశ్ పాండే పాత్ర ఈ సినిమాకు చాలా ప్లస్. ఆ పాత్రలో ఆయనను తప్పా మరొకరిని ఊహించుకోలేం. రఘు కుంచె, సంజయ్ స్వరూప్, రాజీవ్ పిళ్ళై తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం వికాస్ బాడిస సంగీతం. తనదైన బీజీఎంతో ప్రేక్షకులను భయపెట్టాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
కొత్త ప్రపంచంలోకి వెళ్తారు
అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. ఈ సినిమా నేడు (గురువారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో అశ్విన్‌బాబు మాట్లాడుతూ– ‘‘హిడింబ’ మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఫిల్మ్. ఈ సినిమా కాన్సెప్ట్ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి, సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇందులో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. నెక్ట్స్ మెడికల్ మాఫియా నేపథ్యంలో ఓ సినిమా, ఓ స్పోర్ట్స్ ఫిల్మ్ చేయబోతున్నాను’’ అని అన్నారు. -
అశ్విన్ బాబు, అనిల్ సుంకర కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్