‘రం రం ఈశ్వరం... హం పరమేశ్వరం... యం యం కింకరం... వం గంగాధరం...’ అంటూ మొదలవుతుంది ‘రం రం ఈశ్వరం’ పాట. అశ్విన్‌బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా నటించిన ‘శివం భజే’ సినిమాలోనిది ఈ పాట. ఆధ్యాత్మిక అంశాల మేళవింపుతో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని అప్సర్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించారు.
ఈ చిత్రం ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘రం రం ఈశ్వరం’ పాట లిరికల్ వీడియోను సంగీత దర్శకుడు తమన్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. సంగీత దర్శకుడు వికాస్ బడిస సారథ్యంలో పూర్ణాచారి సాహిత్యం అందించిన ఈ పాటను సాయిచరణ్ పాడారు. ‘‘మా సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి’’ అన్నారు మహేశ్వర్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment