ఓటీటీకి టాలీవుడ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌.. ఎక్కడ చూడాలంటే? | Tollywood Movie Shivam Bhaje Released In OTT Today, Check Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

Shivam Bhaje Movie OTT Release: హడావుడి లేకుండానే ఓటీటీకి శివం 'భజే'.. ఎక్కడో తెలుసా?

Published Fri, Aug 30 2024 1:48 PM | Last Updated on Fri, Aug 30 2024 3:29 PM

Tollywood Movie shivam Bhaje streaming On This Ott Goes Viral

టాలీవుడ్ హీరో ఫేమ్‌ అశ్విన్‌ బాబు, దిగంగనా సూర్యవన్షీ జంటగా నటించిన శివం భజే. ఆగస్టు 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ మూవీని అప్సర్‌ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్మెంట్స్‌పై మహేశ్వర్‌ రెడ్డి మూలి నిర్మించారు. వైవిధ్యమైన కథ, ఉన్నత సాంకేతిక విలువలతో నిర్మించినా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ హిట్ కొట్టలేకపోయింది.

తాజాగా ఈ సినిమా ఎలాంటి చడీచప్పుడు లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు నుంచే అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో ఎన్ఐఏ గూఢచారి సంస్థకి చెందిన ఏజెంట్‌ పాత్రలో హీరో నటించారు. ఓ మిషన్‌లో భాగమైన హీరో తాను అనుకున్నది సాధించాడా లేదా అనేది అసలు కథ. కాకపోతే ఈ స్టోరీకి శివుడు బ్యాక్ డ్రాప్‌ని కూడా జోడించారు. థియేటర్లలో పెద్దగా మెప్పించలేని ఈ మూవీకి.. ఓటీటీలోనైనా ఆదరణ దక్కుతుందేమో చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో అర్బాజ్‌ ఖాన్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, తులసి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వికాస్‌ బడిస సంగీతమందించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement