Ashwin Babu Hidimba Movie Re-Censor Completed, Set To Release On July 20 - Sakshi
Sakshi News home page

Ashwin Babu Hidimba Release Date: 'హిడింబ' సినిమాకు రీ–సెన్సార్‌ చేశాం.. కారణం ఇదే'

Published Wed, Jul 12 2023 12:34 PM | Last Updated on Wed, Jul 12 2023 12:58 PM

Ashwin Babu Hidimba Film Censor Effect - Sakshi

అశ్విన్‌ బాబు, నందితా శ్వేత జంటగా అనిల్‌ కన్నెగంటి దర్శకత్వం వహించిన చిత్రం 'హిడింబ'. అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో ఎస్‌వీకే సినిమాస్‌పై గంగపట్నం శ్రీధర్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. 'ఇండియన్‌ సినిమాల్లో ఇంతకు ముందెన్నడూ చెప్పని కథ, ఇంతకు ముందు ఎవరూ టచ్‌ చేయని జానర్‌' అంటూ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌లో వేశారు మేకర్స్‌.

(ఇదీ చదవండి: రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ వంటి స్టార్స్‌తో నటించిన హీరోయిన్‌.. చివరకు ఎయిడ్స్‌తో!)

'యూనిక్‌ కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని, థ్రిల్‌ని ఇచ్చేలా ‘హిడింబ’ని మలిచారు అనిల్‌ కన్నెగంటి. ఈ చిత్రంలో కొన్ని ఇంటెన్స్‌ యాక్షన్‌ సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని సెన్సార్‌ వారు చెప్పారు. దీంతో రివ్యూ కమిటీ ద్వారా సినిమాని రీ–సెన్సార్‌ చేసి విడుదల చేస్తున్నాం' అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వికాస్‌ బాదిసా, కెమెరా: బి. రాజశేఖర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement